‘నిమ్మకాయల బాబా’ బాగోతం బట్టబయలు.. మహిళలకు మత్తుమందు ఇచ్చి.. | Fake Baba Arrested In Medak | Sakshi
Sakshi News home page

‘నిమ్మకాయల బాబా’ బాగోతం బట్టబయలు.. మహిళలకు మత్తుమందు ఇచ్చి..

Published Thu, Mar 20 2025 5:53 PM | Last Updated on Thu, Mar 20 2025 6:19 PM

Fake Baba Arrested In Medak

రాష్ట్రవ్యాప్తంగా బాబా ముసుగులో లైంగిక దాడులకు పాల్పడుతున్న ఓ దొంగ బాబా బాగోతాన్ని సిరిసిల్ల జిల్లా పోలీసులు బట్టబయలు చేశారు.

సాక్షి, సిరిసిల్ల జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా బాబా ముసుగులో లైంగిక దాడులకు పాల్పడుతున్న ఓ దొంగ బాబా బాగోతాన్ని సిరిసిల్ల జిల్లా పోలీసులు బట్టబయలు చేశారు. మహిళలకు మత్తు మందు ఇచ్చి లైంగిక దాడులకు పాల్పడుతున్న ఓ ఫేక్‌ బాబా ఆటకట్టించారు. వేములవాడకి చెందిన బాపు స్వామి అనే వ్యక్తి.. సమస్యలను పరిష్కరిస్తానంటూ.. ఆరోగ్యం బాగలేకపోతే నయం చేస్తానని నమ్మించి ఆడవాళ్లను మోసం చేస్తున్నాడు. 

కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే తాను పూజలు చేసి నయం చేస్తానని నమ్మించి.. ప్రత్యేక పూజల పేరుతో మహిళలకు మత్తు మందు ఇచ్చి, స్పృహ కోల్పోయిన తర్వాత లైంగిక దాడులకు పాల్పడేవాడు. ఈ ఫేక్‌ బాబా తన పూజల సమయంలో నిమ్మకాయలలో నిద్రమాత్రలు కలిపి మహిళలకు వాసన చూపించి, వాటిని తాగించేవాడు.. స్పృహ కోల్పోయిన తర్వాత వారిపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడు.

ఆ దృశ్యాలను తన మొబైల్ ఫోన్‌లో రికార్డు చేసి, బాధితులను బ్లాక్‌  మెయిల్‌ చేసేవాడు. నిందితుడి నుంచి పోలీసులు రెండు సెల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో వందలాది మహిళల వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement