ముఖ్యనేత కమీషన్ల యావ పోలవరం ప్రాజెక్టు పనుల నాణ్యతపై ప్రభావం చూపుతోందా? సిమెంట్, స్టీల్‌ను సరఫరా చేసే సంస్థల నుంచి ముక్కుపిండి మరీ ముడుపులు వసూలు చేస్తున్నారా? అందువల్లే ఆయా సంస్థలు నాసిరకం సిమెంట్, స్టీల్‌ను అంటగడుతున్నాయా? పనుల పర్యవేక్షణకు, వాటి నాణ్యతను పరీక్షిం చడానికి కాంట్రాక్టర్ సూచించిన అధికారినే నియ మించారా? అందువల్లే కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నారా? అనే ప్రశ్నలకు అవుననే సమా ధానం చెబుతున్నాయి జలవనరుల శాఖ అధికార వర్గాలు. పోలవరం హెడ్‌వర్క్స్ (జలాశయం)లో నాణ్యతా లోపాలను బయటపెట్టిన ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావును ఆ పనుల బాధ్యతల నుంచి తప్పించడాన్ని అధికార వర్గాలు గుర్తుచేస్తున్నాయి.