వరంగల్: వరంగల్ జిల్లాలో ఇద్దరు కాంట్రాక్టర్లు కిడ్నాప్ అయ్యారు. జిల్లాలోని ఖానాపూర్ మండలం మనుబోతులగడ్డ వద్ద రహదారి పనులు పర్యవేక్షిస్తుండగా కాంట్రాక్టర్లు వెంకటేశ్వరరెడ్డి, శిరీష్రెడ్డిలను ఆగంతకులు తమ కారులో ఎక్కించుకుని వెళ్లారు. దాంతో అక్కడే ఉన్న కార్మికులు కాంట్రాక్టర్ల కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి... రహదారి వద్ద పనులు నిర్వహిస్తున్న కార్మికులను విచారిస్తున్నారు. న్యూడెమోక్రసీ కార్యకర్తలే ఈ కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.