CPI (Marxist–Leninist) New Democracy
-
న్యూడెమోక్రసీలో చీలిక.. ప్రజాపంథా పార్టీ ఆవిర్భావం
సాక్షి, హైదరాబాద్/ఇల్లెందు: సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీలో చీలిక ఏర్పడింది. సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథాగా కొత్త పార్టీ ఆవిర్భవించిం ది. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన పార్టీ ఆవిర్భావ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా డి.వి.కృష్ణ, సహాయ కార్యదర్శిగా పోటు రంగారావును ఎన్నుకున్నారు. కొత్త పార్టీలోకి మాజీ ఎమ్మె ల్యే గుమ్మడి నర్సయ్య కూడా వచ్చారు. ఈ సందర్భంగా డి.వి. కృష్ణ, పోటు రంగారావు ఓ ప్రకటన విడుదల చేశారు. సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ అనుసరిస్తున్న కరుడుగట్టిన విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర కమిటీ పోరాడుతూ వచ్చిందని చెప్పారు. ప్రజల నుంచి పార్టీని దూరం చేసే కాలం తీరిన అతివాద విధానాలను మార్చుకోవడాన్ని కేంద్ర కమిటీ మొండిగా తిరస్కరించిందన్నారు. పైగా రాష్ట్ర కమిటీకి పోటీ కమిటీలను ఏర్పాటు చేసి, రాష్ట్ర కమిటీని దాని నాయకత్వంలోని ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుటిల ప్రయత్నాలు సాగించిందన్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీని, ఉద్యమాన్ని కాపాడుకోవడానికి కేంద్ర కమిటీతో తెగతెంపులు చేసుకోవటం అనివార్యమైందన్నారు. పార్లమెంటరీ, పార్లమెంటేతర పోరాటాలను జోడించాలని భావిస్తున్నామన్నారు. పార్లమెంటు ద్వారానే అధికారాన్ని సాధించగలమనే పార్లమెంటరీ విధానాన్ని, పాలకవర్గాలతో ఫ్రంట్లు కట్టే విధానాన్ని తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. అంతిమంగా సాయుధ పోరాటం ద్వారా విముక్తి సాధించగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. పోరాటాలకు కలిసి వచ్చే శక్తులన్నింటితో పనిచేయడం తమ నిలకడైన విధానంగా ఉంటుందన్నారు. రాష్ట్ర కమిటీ సభ్యులు వీరే..: గుమ్మడి నర్సయ్య, కెచ్చెల రంగయ్య, కె.రమ, రాయల చంద్రశేఖర్, పాయం చిన్న చంద్రన్న, గోకినపల్లి వెంకటేశ్వరరావు, కె.సూర్యం, కె.జి.రాంచందర్, కర్నాటి యాదగిరి, చండ్ర అరుణ, వి.కృష్ణ, ఎస్ఎల్ పద్మ. 1967 నుంచి ఇప్పటివరకు చీలికలు ఇలా.. భారత విప్లవ పరిస్థితులకు రివిజనిజం పెను ప్రమాదమంటూ 1967లో సీపీఎం నుంచి బయటకు వచ్చి చండ్ర పుల్లారెడ్డి నాయకత్వంలో సీపీఐ (ఎంఎల్)ను స్థాపించారు. 1984లో సీపీఐ (ఎంఎల్)లో సిద్ధాంతపరమైన విభేదాలతో చీలిక వచ్చి చండ్ర పుల్లారెడ్డి, పైలా వాసుదేవరావు వర్గాలు ఏర్పడ్డాయి. కొంతకాలానికి పైలా వర్గం ప్రజాపంథాగా, చండ్ర పుల్లారెడ్డి వర్గం విమోచన గ్రూపుగా మారింది. ప్రజాపంథా పలు రాష్ట్రాల్లో కార్యకలాపాలను విస్తరించి దేశవ్యాప్తంగా రూపం తెచ్చేందుకు 1994లో న్యూడెమోక్రసీ (ఎన్డీ)గా అవతరించింది. ఎన్డీలోనూ 2013లో మరో చీలిక వచ్చి ఎన్డీ చంద్రన్న వర్గం, ఎన్డీ రాయల వర్గంగా ఆవిర్భవించాయి. అయితే 2013 నాటి చీలిక సమయం నుంచే ఎన్డీ రాయల వర్గంలో నేతలు రెండు వర్గాలుగా పనిచేస్తూ ప్రస్తుతం క్షీణ దశకు చేరాయి. ఈ క్రమంలోనే రాయల వర్గం నుంచి డి.వి.కృష్ణ, పోటు రంగారావు బయటకు వచ్చి ప్రజాపంథాగా అవతరించినట్లు ప్రకటించారు. వీరిద్దరూ రాయల వర్గంలో రాష్ట్ర కార్యదర్శి, సహాయ కార్యదర్శులుగా పని చేశారు. వీరు బయటకు రావడంతో ఆ వర్గానికి రాష్ట్ర కార్యదర్శిని ఎంపిక చేసేందుకు త్వరలోనే మహబూబాబాద్‌లో సమావేశం నిర్వహించనున్నారు. -
భూవివాదం: గిరిజన రైతు మృతి
సాక్షి, పశ్చిమగోదావరి: జిల్లాలోని బుట్టాయిగూడెం మండలం సూరప్పవారంగూడెలో ఓ భూవివాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారం సాయంత్రం తన పొలంలో దుక్కి దున్నుకుంటున్న గిరిజన రైతు దాది గోవింద్‌పై గిరిజనేతర రైతులు దాడి చేశారు. దీంతో వారి దాడిలో గిరిజనరైతు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో గాయపడ్డ రైతును గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చగా ఆతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. దాది గోవింద్ హత్యకు నిరసనగా సీపీఐ ఎం.ఎల్ న్యూ డెమోక్రసి ఆధ్వర్యంలో బుట్టాయిగూడెంలో రాస్తారోకో నిర్వహించారు. హత్యకు బాధ్యులైన గిరిజనేతర రైతులను వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. -
ప్రాణహిత ఆపేందుకు ప్రభుత్వ కుట్ర
నెన్నెల(బెల్లంపల్లి): ప్రాణహితపై ప్రాజెక్టు కట్టకుండా కాళేశ్వరంకు నీటిని పంపించి ఇతర జిల్లాలకు తాగునీరు ఇచ్చే విధంగా ప్రభుత్వం కుట్ర చేస్తోందని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ మంచిర్యాల జిల్లా కమిటీ నాయకులు ఆరోపించారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కొమురంభీం, మంచిర్యాల జిల్లాలను ఎండబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా ప్రాణహితపై ప్రాజెక్టు కట్టి మంచిర్యాల జిల్లాకు నీరు అందిస్తానని ప్రకటించిన ప్రభుత్వం 50 వేల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును యుద్దప్రాతిపదికపై కట్టి ఇప్పుడు పద్ధతి మార్చారని విమర్శించారు. ప్రాణహితపై ప్రాజెక్టు కట్టకపోవడం ఈ రెండు జిల్లాల రైతులకు తీవ్రంగా నష్టపర్చడమేనన్నారు. తక్షణమే ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు ఎండి చాంద్‌పాషా, శ్రీనివాస్, లాల్‌కుమార్, బ్రాహ్మనందం, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు రత్నం తిరుపతి పాల్గొన్నారు. -
ఎన్డీ దళ కమాండర్ రామన్న అరెస్ట్
సాక్షి, మహబూబాబాద్ రూరల్ : న్యూడెమోక్రసీ పెద్దచంద్రన్న వర్గానికి చెందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కమిటీ సభ్యుడు, దళకమాండర్ సింగనబోయిన వీరభద్రం అలియాస్ రామన్నను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. అతని వద్ద నుంచి ఒక ఎస్ఎల్ఆర్తో పాటు 20 తూటాల మ్యాగ్జిన్, ఒక ల్యాప్‌ట్యాప్, పార్టీ సాహిత్యం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ సమావేశ మందిరంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ కోటిరెడ్డి అరెస్ట్ వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం మండలం బాలాజీపేట రామన్న స్వస్థలం. 22 ఏళ్లుగా వివిధ హోదాల్లో, ప్రాంతాల్లో యూజీగా (అజ్ఞాతంలో) పని చేసి నాలుగు హత్య కేసులు, పోలీసులతో ఎదురుకాల్పులకు సంబంధించి రెండు కేసులు, అనేక బలవంతపు వసూళ్లకు పాల్పడ్డాడు. అదే విధంగా కాంట్రాక్టర్లను బెదిరించిన కేసుల్లో రామన్న నిందితుడిగా ఉన్నాడు. రామన్నపై ఉన్న కేసుల వివరాలు.. 1986లో బోడు పోలీస్ స్టేషన్ ఏరియా, భద్రాద్రి కొత్తగూడెంలో పని చేస్తూ లచ్చగూడెం గ్రామంలో పూణెం వీరయ్యను హత్యచేసిన కేసులో నిందితుడు. అదే విధంగా బయ్యారం గ్రామంలో జరిగిన పోతురాజు గోపి హత్య కేసులో కూడా పాల్గొన్నాడు. ఈ కేసుల్లో అరెస్టై జైలుకు వెళ్లాడు. 2008లో గంధంపల్లి గ్రామంలో రూపిరెడ్డి రవీందర్‌రెడ్డి హత్య కేసులో దళంతోపాటు పాల్గొన్నాడు. ఈ కేసులో కూడా అరెస్టయ్యాడు. 2017లో పాల్వంచకు చెందిన రాయల భాస్కర్‌రావు హత్య కేసులో నిందితుడు. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ కాలేదు. 2016లో కొత్త జిల్లాలు ఏర్పడిన అనంతరం రామన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శిగాను, రాష్ట్ర కమిటీ సభ్యుడిగాను నియమించబడి పార్టీ చందాల కోసం కాంట్రాక్టర్లను, బీడీ ఆకుల, సింగరేణి కాంట్రాక్టర్లను బెదిరిస్తూ అనేక బలవంతపు వసూళ్లకు పాల్పడ్డాడు. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎస్ఎల్ఆర్, ల్యాప్‌ట్యాప్, బుల్లెట్లు, విప్లవ సాహిత్యం 2017 ఏడాది సెప్టెంబర్ 21న బోడు పోలీస్ స్టేషన్ పరిధిలో రామన్న దళంతో కలిసి పోలీసులపై కాల్పులు జరిపాడు. 2018 మార్చి 17న రామన్నదళం పాల్వంచ రూరల్ ఏరియాలో తిరిగి పోలీస్ పార్టీలపై కాల్పులు జరిపాడు. ఆ కేసులో ఒక దళ సభ్యుడు తుపాకీతో పాటు పోలీసులకు దొరికాడు. రామన్న తప్పించుకుని పారిపోయాడు. ఆయన మొత్తం పది కేసుల్లో నిందితుడు. ఆ తరువాత అశోక్దళంతో కలిసి ఎక్కువకాలం మహబూబాబాద్ జిల్లాలోనే ఉంటూ ఇక్కడ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఉదయం డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలోని చెరువు కట్టవద్ద అశోక్, బెజ్జం ప్రతాప్, ఇతర దళ సభ్యులతో కలిసి తుపాకులు దాచిపెట్టి సాధారణ దుస్తులతో వచ్చి రామన్న గ్రామ పంచాయతీ ఎన్నికల గురించి సమావేశమయ్యాడు. కొంతమంది ఎన్డీ పార్టీకి చెందిన గ్రామస్తులను పిలిపించుకుని సమావేశం అవుతుండగా ఆ సమాచారం అందుకున్న డోర్నకల్ సీఐ జె. శ్యాంసుందర్, ఎస్సై అంబాటి రవీందర్, వారి సిబ్బంది స్పెషల్ పార్టీ పోలీసులతో సంఘటన స్థలానికి చేరుకున్నాడు. వెంటనే రామన్నను ఒక బ్యాగ్‌తో సహా అరెస్ట్ చేశారు. మిగతవారు పరారయ్యారు. రామన్న ఇచ్చిన సమాచారం మేరకు బయ్యారం మండలం పందిపంపులకు వెళ్లి మురళీకృష్ణ దాచిపెట్టిన ఎస్ఎల్ఆర్ ఆయుధం, దానికి సంబంధించిన ఒక మ్యాగ్జిన్ అందులోని 20 రౌండ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న మిగతావారందరినీ కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. అనేక ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న రామన్నను పట్టుకున్న సిబ్బందిని ఎస్పీ కోటిరెడ్డి అభినందించారు. త్వరలోనే వారికి రివార్డులు అందజేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ రావుల గిరిధర్, డీఎస్పీ ఆంగోత్ నరేష్కుమార్, సీఐలు శ్యాంసుందర్, లింగయ్య, రవికుమార్ పాల్గొన్నారు. -
నేను మీలో ఒకడిని..
ఖమ్మం,ఇల్లెందు అర్బన్: గతంలో ఎమ్మెల్యేననో లేక పార్టీ నాయకుడిననో తానెప్పుడూ జనానికి దూరం కాలేదని, మరింత చొరవతో ప్రజలతో మమేకమయ్యానని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే, సీపీఐ (ఎంఎల్)న్యూడెమోక్రసీ సీనియర్ నేత గుమ్మడి నర్సయ్య తెలిపారు. మన్యం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి..బొగ్గుట్ట (ఇల్లెందు) అభివృద్ధికి పాటుపడ్డానని తెలిపారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ‘సాక్షి’ ఆయన్ను పలుకరించగా పలు విషయాలను వివరించారు. సాక్షి: ఎమ్మెల్యేగా ప్రస్థానం చెబుతారా ? గుమ్మడి: నేను 1983 నుంచి 2014 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఐదుసార్లు గెలిచాను. 1985, 1989, 1994, 1999, 2004 ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచా. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడిన. ఎన్డీ నిర్వహించిన ప్రజా ఉద్యమాలే..నాకు విజయాన్ని అందించాయి. ఎన్డీని నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ నేతలు పునర్విభజన చేసి, గుండాల, కారేపల్లి మండలాలు వేరుచేశారు. సాక్షి: ఈసారి మీ ప్రచారం ఎలా ఉంది ? గుమ్మడి: గ్రామస్థాయిలో ప్రచారం ప్రారంభించలేదు. ఇప్పటి వరకు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కార్యకర్తలు, నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేశాం. త్వరలో ప్రతి గ్రామంలో పర్యటించి ఇంటింటి ప్రచారం చేస్తాం. చేసిన ప్రజా ఉద్యమాలు, సాధించిన విజయాలతోనే ప్రజల్లోకి వెళ్తాం. అందుకే పార్టీకి మంచి ఆదరణ ఉంది. ఈ దఫా ఎన్నికల్లో ఎన్డీ గెలుపు ఖాయం. ప్రజలు ఆసక్తిగా ఉన్నారు. సాక్షి: మీరు గెలిచినప్పుడు చేసిన అభివృద్ధి గురించి.. గుమ్మడి: ఐదుసార్లు గెలిచిన హయాంలో ప్రధానంగా ఇల్లెందు పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశాం. 132 కేవీ సబ్‌స్టేషన్‌ను నిర్మించాం. సింగరేణి షేప్ నిధులు రూ.8 కోట్ల వ్యయంతో పట్టణంలో రోడ్ల వెడల్పు చేశాం. చాలాచోట్ల సీసీ రోడ్లు నిర్మించినం. వాటర్‌ట్యాంకులు పూర్తి చేశాం. ప్రభుత్వ వైద్యశాల భవనం కట్టించేందుకు కృషి చేశాం. తాగునీటి వసతి, రోడ్లు, విద్యుత్ సౌకర్యాలు కల్పించాం. పార్టీలు మారే వ్యక్తులను నమ్మొద్దు.. ఒక పార్టీలో పోటీ చేసి గెలిచిన తర్వాత ధనార్జానే లక్ష్యంగా పెట్టుకొని వేరే పార్టీల్లోకి మారే వ్యక్తులను నమ్మొద్దు. ప్రజల కోసం నిస్వార్థంగా పోరాడే వారికి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. నోట్ల ప్రలోభాలకు గురై నియోజకవర్గ అభివృద్ధి వెనుకబాటుకు కారకులుగా మారకూడదు. కొన్ని పార్టీలు ప్రచారంలో ఇష్టమొచ్చినట్లు డబ్బు పంచుతుండడం బాధాకరం. -గుమ్మడి నర్సయ్య -
ఇద్దరు ఆజాద్ దళ సభ్యుల అరెస్ట్
సాక్షి, పాల్వంచరూరల్: సీపీఐ (ఎంఎల్ న్యూడెమోక్రసీ) ఆజాద్ దళానికి చెందిన ఇద్దరు అజ్ఞాత దళ సభ్యులను, ఒక తుపాకీతో పాటు అరెస్ట్‌చేశారు. వారి వద్ద నుంచి రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి శుక్రవారం సీఐ కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఓఎస్డీ ఉదయ్‌కుమార్‌రెడ్డి వివరాలను వెల్లడించారు. మండల పరిధిలోని ఉల్వనూరు బంజర, ఉల్వనూరు గ్రామాలకు చెందిన పూనెం నర్సింహారావు, అలియాష్ రమేష్, నెట్టి అమృతరావు కొంతకాలంగా ఎన్డీ ఆజాద్ దళంలో అజ్ఞాత దళ సభ్యులుగా పనిచేస్తున్నారు. గురువారం రాత్రి ఎస్ఐ అనిల్ పెట్రోల్ నిర్వహిస్తుండగా బం జర ఏరియాలో ద్విచక్రవాహనంపై వెళ్తుండగా అనుమానాస్పద స్థితిలో కన్పించిన ఇరువురుని అదుపులోకి తీసుకుని విచారించడం జరిగింది. నర్సింహారావు 1998–2005 వరకు జనశక్తి గ్రూపు రాజన్న దళంలో పనిచేశాడు. 2005లో పోలీసులకు లొంగిపోయిన తర్వాత మళ్లీ ఎన్డీ రాయల వర్గంలో ఆర్గనైజర్‌గా పనిచేస్తూ ఆజాద్ దళంలో పని చేస్తున్నాడు. అతని వద్ద 303 తూపాకీ, రైఫిల్ బుల్లెట్లు 30, ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి శుక్రవారం అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ.రాఘవేంద్రరావు, ఎస్ఐ.అనిల్‌కుమార్ పాల్గొన్నారు. -
ఎవరీ సాగర్..?
యదళ్లపల్లి విశ్వనాథం (ఆజాద్), కొమురం వెంకటేశ్వర్లు(గణేష్), ఆవునూరి నారాయణ స్వామి(మధు), దనసిరి సమ్మయ్య(గోపి), లింగన్న, ఏనుగుల చంద్రారెడ్డి్డ(సాగర్), ‘..........?’ వీరంతా ఎవరనేదేగా మీ ప్రశ్న..! ఇల్లెందు: భూమి కోసం.. భుక్తి కోసం.. భూస్వామ్య వ్యవస్థ నుంచి విముక్తి కోసం.. సమ సమాజ స్థాపన కోసం... ఇంటిని విడిచి, కుటుంబీకులను వదిలి, విప్లవ బాట పట్టిన ఒకప్పటి ఉడుకు రక్తపు యువకులే వీరంతా. ఆ తరువాతి రోజుల్లో న్యూడెమోక్రసీ నాయకులు. తుపాకులు చేబూని, జన రక్షణ పేరుతో అడవికి పయనమైన అజ్ఞాత దళాల అగ్ర నేతలు. వనంలో ఉన్నంత కాలం వీరు సురక్షితంగా ఉన్నారు..! జనంలోకి వచ్చిన తర్వాత పోలీసులకు దొరికిపోతున్నారు..!! వనం వదిలి.. జనంలోకి వచ్చి.. జైలుకెళుతున్నారు...!!! ‘‘అసలేం జరుగుతోంది..? న్యూడెమోక్రసీ (రాయల–చంద్రన్న) అజ్ఞాత అగ్ర నేతలంతా ఇలా ఒకరొక్కరుగా పోలీసులకు ఎలా పట్టుబడుతున్నారు..? ఇటీవలి కాలంలో మధు, గోపి, లింగన్న, సాగర్ వరుసగా పట్టుబడ్డారు. ‘..........’ ఈ ఖాళీలో చేరే తరువాతి నేత పేరేమిటి..?’’ న్యూడెమోక్రసీ శ్రేణులు, ద్వితీయ శ్రేణి నాయకులు, ఆ పార్టీలోని రెండు వర్గాలను అభిమానించే–ఆరాధించే సానుభూతిపరులు, అడవి బిడ్డలు.. అందరూ ఆవేదనాపూరిత స్వరంతో అడుగుతున్న ప్రశ్నలివి. వారిని కలవరపెడుతున్న సమాధానం లేని సందేహాలివి. మొన్న లింగన్న.. నిన్న సాగర్.. రేపు..? పోలీసులు మహా ఉత్సాహంతో ఉన్నారు. న్యూడెమోక్రసీ అజ్ఞాత దళ అగ్ర నేతల్లో ఒకరైన లింగన్నను మొన్న పట్టుకున్నారు. మరుసటి రోజున చంద్రన్న వర్గం రాష్ట్ర నాయకుడు ఏనుగుల చంద్రారెడ్డి అలియాస్ చంద్రం అలియాస్ సాగర్‌ను అరెస్ట్ చేశారు. ‘ఆ తరువాత ఎవరు..?’ పోలీసుల్లో ఉత్సుకతను, ఎన్డీ శ్రేణుల్లో కలవరపాటును కలిగిస్తున్న ప్రశ్న ఇది. ఎవరీ సాగర్..? ఏనుగుల చంద్రారెడ్డి అలియాస్ చంద్రం అలియాస్ సాగర్‌ది కూసుమంచి మండలం రాజుపేట గ్రామం. ఉన్నత విద్యావంతుడు. ఖమ్మంలో డిగ్రీ చదివారు. ఆ రోజుల్లోనే అలీగఢ్ యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) చేశారు. అంతేకాదు.. పీజీలో గోల్డ్ మెడల్ కూడా సాధించారు. ఖమ్మంలో పీడీఎస్‌యూ నాయకుడిగా, కొత్తగూడెం–మణుగూరులో ఐఎఫ్టీయూ నాయకుడిగా పనిచేశారు. 17 ఏళ్ల క్రితం అడవి బాట (అజ్ఞాత వాసం) పట్టారు. లింగన్న–సాగర్ సమకాలికులే కాదు, ప్రాణ మిత్రులు కూడా. గుండాల దళానికి లింగన్న, ఆళ్లపల్లి దళానికి సాగర్ నేతలుగా పనిచేశారు. ఐదేళ్ల తర్వాత బయ్యారం ఏరియాకు సాగర్ వెళ్లారు. అక్కడ అశోక్ దళంతో కలిసి పనిచేశారు. కొన్నేళ్ల క్రితం చర్చల పేరుతో వీరిని మావోయిస్టులు పిలిచారు. అక్కడ వీరి నుంచి ఆయుధాలను లాక్కుని ఉత్త చేతులతో పంపించేశారు. విచిత్రంగా వీరిద్దరినీ ఒకే రోజున (ఈ నెల 7న) పోలీసులు పట్టుకున్నారు. మధ్యాహ్నం లింగన్నను, అర్థరాత్రి వేళ సాగర్‌ను అదుపులోకి తీసుకున్నారు. చిక్కిందెవరు..? మిగిలిందెవరు..? ఉమ్మడి ఖమ్మం–వరంగల్ జిల్లా ఏరియా(ఈ రెండు జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతం)లో న్యూడెమోక్రసీ(చందన్న–రాయల)కి దాదాపుగా 12 అజ్ఞాత దళాలు ఉన్నాయి. కీలక అజ్ఞాత–అగ్ర నేతలుగా ఆజాద్, గణేష్, సురేష్, ప్రతాప్, మధు, గోపి, లింగన్న, సాగర్, అశోక్ ఎదిగారు. వీరంతా ఇప్పుడు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో చూద్దాం. ఆజాద్: రాయల వర్గం జిల్లా నాయకుడైన ఈయన, మూడు నెలల కిందట బెయిల్‌పై విడుదలయ్యారు. మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లారు. గణేష్: రాయల వర్గం జిల్లా నాయకుడైన ఈయన బెయిల్‌పై బయటికొచ్చారు. పార్టీతో ఏమాత్రం సంబంధం లేకుండా ఇంటి వద్దనే ఉంటున్నారు. సురేష్: చంద్రన్న వర్గం జిల్లా నాయకుడైన ఈయన బెయిల్‌పై బయటికొచ్చారు. బూర్గంపాడు ఏరియాలో లీగల్‌గా పనిచేస్తున్నారు. ప్రతాప్: చంద్రన్న వర్గానికి చెందిన ఈయనను పోలీసులు నెల కిందట అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జైలులో ఉన్నారు. మధు: న్యూడెమోక్రసీ రాయల వర్గం రాష్ట్ర నాయకుడైన ఈయన నెల కిందట బెయిల్‌పై బయటికొచ్చారు. ఇల్లెందు కేంద్రంగా లీగల్‌గా పనిచేస్తున్నారు. గోపి: రాయల వర్గం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, మహబూబాబాద్ జిల్లా కార్యదర్శిగా ఉన్నారు. గత నెల 30న పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జైలులో ఉన్నారు. లింగన్న: రాయల వర్గం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి. ఈ నెల 7న మధ్యాహ్నం రఘునాథపాలెం వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. జైలులో ఉన్నారు. సాగర్: చంద్రన్న వర్గం రాష్ట్ర కమిటీ సభ్యుడు. 7వ తేదీ అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జైలులో ఉన్నారు. అశోక్: చంద్రన్న వర్గం దళ నేత. ఖమ్మం–వరంగల్ ఏరియా కార్యదర్శిగా ఉన్నారు. పైన తెలిపిన అందరిలోకి ఈయనే సీనియర్. పోలీ సుల ‘వాంటెడ్ లిస్ట్’లో అశోక్‌తోపాటు, ఇతని దళ సభ్యుడైన మోరే రవి కూడా ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అసలేం జరుగుతోంది..? న్యూడెమోక్రసీలో అసలేం జరుగుతోంది..? సుదీర్ఘ కాలంగా అజ్ఞాత జీవితం గడుపుతున్న ఆ పార్టీ నేతలు ఒకరొక్కరుగా ఎందుకు పోలీసులకు ‘చిక్కుతున్నారు’? ఏజెన్సీలో, జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం ఇది ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు అరెస్టయిన వారంతా ‘అనారోగ్యం’తో బాధపడుతున్నవారే(నట). వైద్యం కోసం వనం నుంచి జనంలోకి (ఆస్పత్రికి) వస్తున్నారు. అరెస్టవుతున్నారు. దశాబ్దాల కాలంగా అజ్ఞాత వాసం గడుపుతున్న అనేకమంది అజ్ఞాత నాయకుల్లో కొందరైనా వైద్యం కోసం గతంలో పట్టణాల్లోకి వచ్చి ఉంటారు. వైద్యం పూర్తయిన తరువాత తిరిగి అజ్ఞాతంలోకి వెళ్లి ఉంటారు. అప్పడెప్పుడూ అరెస్టులు జరగలేదు. ఇప్పుడు మాత్రమే జరుగుతున్నాయి. ఎందుకు? కీలక స్థాయిలోని అజ్ఞాత నాయకులు జనంలోకి రావడం అనివార్యమైనప్పుడు విప్లవ పార్టీ్టలు అనేక జాగ్రత్తలు తీసుకుంటాయి. నాడు తెలంగాణ సాయుధ పోరాటంలో జరిగింది, ఇప్పుడు మావోయిస్టు పార్టీలో జరుగుతున్నది ఇదే. మావోయిస్టు పార్టీ కీలక నేతలెవరూ (శ్రీరాముల శ్రీనివాస్ మినహా) గత కొన్నేళ్లుగా బయటికొచ్చి అరెస్టయింది లేదు. న్యూడెమోక్రసీ నాయకులు మాత్రమే ఇలా వరుసపెట్టి పోలీసులకు చిక్కుతున్నారు. దీనిని ఎలా భావించాలి..? పోలీసుల విజయంగానా..?! న్యూడెమోక్రసీ వైఫల్యంగానా..??!! ‘ఏకే’పై ‘గురి’..! తుపాకుల్లో శక్తివంతమైనది ఏకే–47. అశోక్ కూడా అంతే. న్యూడెమోక్రసీలోని అజ్ఞాత దళ నేతల్లో ఈయనే సీనియర్. బయ్యారం మండలం రామచంద్రాపురం గ్రామస్తుడు. ప్రస్తుతం చంద్రన్న వర్గంలో ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లా ఏరియా కార్యదర్శిగా ఉన్న ఇతని అసలు పేరు వజ్జా పొట్టయ్య అలియాస్ అశోక్. పార్టీలోని సహచరులు పిలిచే పేరు మాత్రం.. ‘ఏకే’! బాల్యంలోనే విప్లవోద్యమ బాట పట్టిన ఇతని వయసు కూడా దాదాపుగా ‘47’ సంవత్సరాలు ఉంటాయి!! అత్యంత ‘శక్తివంత’ నాయకుడైన ఈ ‘ఏకే–47’పై మహబూబాబాద్ పోలీసులు గురి పెట్టారు. పాల్వంచ వద్ద ఓ రాజకీయ నాయకుడిని పట్టపగలు కొట్టి చంపిన కేసులో ప్రధాన నిందితుడైన మోరే రవి, ఈ ‘ఏకే’ దళంలోనే ఉన్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల ‘వాంటెడ్’ జాబితాలో మోరే రవి పేరు ఉంది. -
మొన్న మధు.. నిన్న గోపి.. నేడు లింగన్న...
న్యూడెమోక్రసీ పార్టీ అజ్ఞాత దళ అగ్ర నేతలను పోలీసులు వరుసగా అరెస్ట్ చేస్తున్నారు. మావోయిస్టుల మాదిరిగా తుపాకులు చేబూని, అడవుల్లో దాక్కుని, అజ్ఞాతంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ దళాలపై పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. ప్రధానంగా దళాల నేతలను అరెస్టు చేస్తున్నారు. మొన్న మధును, నిన్న గోపిని, నేడు లింగన్నను అరెస్ట్ చేశారు. ఈ జాబితాలో తరువాతి స్థానం ఎవరిదో..! గతంలో ఎన్నడూ లేనట్టుగా ఇటీవలి కాలంలో ఇలా వరుస అరెస్టులు ఎందుకో..?! న్యూడెమోక్రసీ శ్రేణుల్లో, సానుభూతిపరుల్లో, ప్రజల్లో వ్యక్తమవుతున్న సందేహాలివి. ఇల్లెందు: న్యూడెమోక్రసీ అజ్ఞాత దళాలకు చెందిన అగ్ర నేతల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ముఖ్య నాయకుల్లో ఇప్పటివరకు ఆవునూరి నారాయణ స్వామి (మధు), దనసరి సమ్మయ్య (గోపి), పూనెం లింగయ్య (లింగన్న)ను అరెస్ట్ చేశారు. ఏడాది క్రితం... న్యూడెమోక్రసీ రాయలవర్గానికి చెందిన అజ్ఞాత దళ నేతలు యదళ్లపల్లి విశ్వనాధం(ఆజాద్), కొమురం వెంకటేశ్వర్లు (గణేష్) అరెస్టయ్యారు. గుండాల మండలం బాటన్న నగర్ గ్రామం వద్ద గణేష్‌ను, ఇల్లెందు మండలం మాణిక్యారం గ్రామం వద్ద ఆజాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్డీ చంద్రన్న వర్గానికి చెందిన సురేష్, ప్రతాప్‌ను కూడా మాణిక్యారం వద్దనే అరెస్ట్ చేశారు. జులై 25న... మధును గార్లలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఉల్ఫా కేసులో జైలుకు పంపారు. నెల రోజుల క్రితమే బెయిల్‌పై బయటకు వచ్చారు. అప్పటి నుంచి ఇల్లెందు కేంద్రంగా లీగల్ కార్యకలాపాలు సాగిస్తున్నారు. నవంబర్ 30న... మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి దనసరి సమ్మయ్య (గోపి)ని నవంబర్ 30న మహబూబాబాద్‌లోని ఓ ఇంటిలో ఉన్నారన్న సమాచారంతో పోలీసులు వల పన్నారు. పట్టుకునేందుకు ప్రయత్నించారు. తప్పించుకుని ఆటోలో వెళుతుండగా అరెస్ట్ చేశారు. డిసెంబర్ 7న... రఘునాధపాలెం వద్ద గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో లింగన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూడెమోక్రసీ కీలక నాయకుల్లో ఇతను ఒకరు. 20 ఏళ్లుగా అజ్ఞాతంలోనే... గురువారం అరెస్టయిన లింగన్న, గత 20 ఏళ్లుగా అజ్ఞాత వాసంలో ఉన్నారు. 1997లో న్యూడెమోక్రసీకి, పీపీజీ శంకరన్నకు మధ్య తారాస్థాయిలో యుద్ధం జరిగింది. గుండాల మండలంలోని లింగగూడెం, దేవాళ్లగూడెం, రోళ్లగడ్డ వద్ద పలుమార్లు ఈ రెండు పార్టీలకు చెందిన దళాల మధ్య కాల్పులు (క్రాస్ ఫైరింగ్) జరిగాయి. ఇరువైపులా దళ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే గుండాల మండలంలోని రోళ్లగడ్డ, దేవాళ్లగూడెం, లింగగూడెం, చీమలగూడెం, నర్సాపురం తండాలకు చెందిన కొందరు ఎన్డీ నాయకులు అడవి బాట (అజ్ఞాత వాసం) పట్టారు. వారిలో లింగన్న కూడా ఉన్నారు. అప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన ఇప్పటివరకు బయటకు రాలేదు. ఎవరీ లింగన్న...? ఈయన స్వస్థలం.. గుండాల మండలం రోళ్లగడ్డ గ్రామం. పీవైఎల్‌లో లీగల్‌గా పనిచేశారు. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయికి, ఇల్లీగల్‌గా దళ సభ్యుడి నుంచి జిల్లా కార్యదర్శి స్థాయికి ఎదిగారు. ఇటీవల ఎన్డీ చంద్రన్న వర్గంలోకి వెళ్లారు. రెండు రోజుల తర్వా (పార్టీ, కుటుంబీకుల ఒత్తిడికి తలొగ్గి) తిరిగి ఎన్డీ రాయల వర్గంలోకి వచ్చారు. సుదీర్ఘ అజ్ఞాత వాసం నుంచి బయటికొస్తారని అప్పుడు ప్రచారం జరిగింది. పోలీసులు కూడా లింగన్నను పట్టుకునేందుకు అదును కోసం ఎదురుచూశారు. రఘునాధపాలెం వద్ద గురువారం అరెస్ట్ చేశారు. 2012 నుంచి కష్టకాలం... న్యూడెమోక్రసీ పార్టీకి 2012లో కష్ట–నష్ట కాలం మొదలైంది. ఈ సంవత్సరంలోనే ఆ పార్టీ రెండుగా (రాయల వర్గం–చంద్రన్న వర్గం) చీలింది. నాటి నుంచి ఆ పార్టీ కోలుకోలేనంతగా నష్టపోతోంది. సుదీర్ఘకాలంగా అజ్ఞాత జీవితంలో ఉన్న అగ్ర నేతలు ఒకరొక్కరుగా అరెస్టవుతుండడంతో ఆ పార్టీ దిగువ శ్రేణి నాయకుల్లో, కేడర్‌లో అయోమయం నెలకొంది. ఖమ్మం–వరంగల్ ఏరియా పరిధిలోని అజ్ఞాత ఉద్యమం ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. అజ్ఞాతంలో మిగిలింది చోటా–మోటా నాయకులే... ఎన్డీ రాయల వర్గానికి చెందిన అజ్ఞాత నాయకుల్లో దాదాపుగా అందరూ అరెస్టయినట్టే. ఇక మిగిలింది చోటా–మోటా నాయకులే. బయ్యారం ఏరియాలో బండారి ఐలయ్య, ఇల్లెందు ఏరియాలో రమేషన్న, గుండాల ఏరియాలో శంకరన్న, చెట్టుపల్లి ఏరియాలో యాకన్న, ఆళ్లపల్లి–బంగారుచెల్క ఏరియాలో ఆజాద్ ఉన్నారు. అరెస్టయి, ఏడాది క్రితం విడుదలైన ఆజాద్.. తిరిగి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఎన్డీ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన ప్రశ్న ఒక్కటే.. ‘‘మొన్న మధు, నిన్న గోపి, నేడు లింగన్న. ఈ జాబితాలో తరువాతి స్థానం ఎవరిది..? మున్ముందు ఇలా ఇంకెంతమంది..? అజ్ఞాత దళాలు మనుగడ సాగిస్తాయా..?’’. లింగన్నను కోర్టుకు అప్పగించాలి ఖమ్మంమయూరిసెంటర్: న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి, రీజనల్ కమిటీ సభ్యుడు, అజ్ఞాత దళ నేత లింగన్నను రఘునాథపాలెం మండలంలోని ఎస్ఎన్.మూర్తి పాలిటెక్నిక్ కళాశాల వద్ద జిల్లా పోలీసులు అరెస్ట్ చేసినట్టు ఆ పార్టీ రాష్ట సహాయ కార్యదర్శి పోటు రంగారావు చెప్పారు. లింగన్నను వెంటనే మీడియా ముందు ప్రవేశపెట్టి, కోర్టుకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పూనెం లింగయ్య (లింగన్న వైద్యం కోసం ఖమ్మం వచ్చి వెళ్తుండగా, పక్కా సమాచారంతో నిఘా వేసి అరెస్ట్ చేశారని చెప్పారు. ఆదివాసీ గిరిజనుడైన లింగన్నది గుండాల మండలం రోళ్ళగడ్డ గ్రామమని, 1997లో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ప్రతిఘటన దళంలో సభ్యుడిగా చేరాడని చెప్పారు. గుండాల, ఇల్లెందు, టేకులపల్లి మండలాల్లో ఆదివాసీ భూమి, రైతాంగ సమస్యలపై అనేక పోరాటాలు సాగించాడని చెప్పారు. లింగన్నను మట్టుపెట్టేందుకు పోలీసులు అనేకసార్లు ప్రయత్నించారని చెప్పారు. వీటి నుంచి లింగన్న తప్పించుకుని ప్రజాపోరాటాలు సాగించాడని అన్నారు. ఆయన గత ఇరవయ్యేళ్లుగా అజ్ఞాత జీవితం గడుపుతున్నట్టు చెప్పారు. ‘‘ప్రభుత్వం, పోలీసుల తీరు చూస్తుంటే.. లింగన్నకు ప్రాణ హాని తలపెడతారేమోనని అనుమానంగా ఉంది’’ అని ఆయన భయాందోళన వ్యక్తం చేశారు. ‘‘లింగన్నకు ఎలాంటి హాని తలపెట్టవద్దు. కోర్టులో హాజరుపరచాలి’’ అని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు, నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, సీవై పుల్లయ్య, జి.రామయ్య, ఆవుల అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
పోలీసుల అదుపులో ఎన్డీ దళనేత గోపన్న?
సాక్షి, మహబూబాబాద్: న్యూడెమోక్రసీ పార్టీ రాయల వర్గానికి చెందిన అజ్ఞాతదళం మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి దనసరి సమ్మయ్య అలియాస్ గోపన్నను మహబూబాబాద్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మహబూబాబాద్‌లోని ఓ ఇంట్లో ఎన్డీ భార్య, పిల్లలతో అజ్ఞాత దళనేత గోపన్న ఉంటున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఆర్టీసీ కాలనీలోని ఓ ఇంట్లో ఆశ్రయం పొందినట్లు సమాచారం అందుకున్న డీఎస్పీ నరేశ్‌కుమార్, టౌన్ సీఐ జబ్బార్, ఎస్ఐలు తిరుపతి, రవీందర్ పోలీసు సిబ్బందితో సదరు ఇంటిపై దాడి చేశారు. గమనించిన గోపన్న గోడ దూకి పారిపోయాడు. దీంతో ఎస్పీ కోటిరెడ్డి, అడిషనల్ ఎస్పీ గిరిధర్ రంగంలోకి దిగారు. ఆయా రోడ్లపై వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో ఓ ఆటోలో గోపన్న వెళ్తుండగా జమాండ్లపల్లి వద్ద అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. -
తిట్టేందుకు వచ్చిన ఆమె తిక్కకుదిర్చాడు
ఒంటారియో: అమెరికాలోని బ్రాంప్టన్‌లో ఓ సిక్కు పౌరుడు, చట్టసభ ప్రతినిధికి జాత్యహంకార వ్యాఖ్యల దాడి తప్పలేదు. ఆయన ఆ మాటలకు తగిన బదులు ఇచ్చి పలువురి మనసులు దోచుకున్నాడు. ఆగ్రహంతో తనపైకి వచ్చిన ఓ అమెరికా మహిళ జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ అతను ఏ మాత్రం సహనం కోల్పోకుండా సంయమనంగా వ్యవహరించడమే కాకుండా ఆమె కళ్లు చెదిరే సమాధానం ఇచ్చే సభికులతో షబాష్ అనిపించుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. జగ్మీత్ సింగ్ అనే వ్యక్తి కెనడాలోని న్యూ డెమొక్రటిక్ పార్టీ(ఎన్డీపీ)ని స్థాపించి నడుపుతున్నాడు. ఆయన ఒక చట్టసభ ప్రతినిధి కూడా. ఓ ప్రచార కార్యక్రమంలో భాగంగా బ్రాంప్టన్ అనే పట్టణానికి వచ్చిన ఆయన సభ ముందు కొలువై ఉన్న వారిని సంబోధిస్తూ మాట్లాడే సమయంలోనే ఒక మహిళ అడ్డు తగిలింది. ఆమెను జెన్నిఫర్ అనే మహిళగా గుర్తించారు. నేరుగా వేదికపైకి వచ్చి 'మాకు తెలుసు నువ్వు ముస్లిం సోదరభావంతో ఉన్నావు' అంటూ ఆమె మొదలుపెట్టి ఇష్టమొచ్చినట్లు మాట్లాడింది. అయితే, అక్కడ ఉన్నవారంతా ఆమెను సముదాయించే ప్రయత్నం చేయగా వారిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే, ఆమె మాటలు విన్నతర్వాత ఆమెను నేరుగా అనకుండా ' మేం ప్రేమను, ధైర్యాన్ని నమ్ముతాం.. జాత్యహంకారాన్ని ప్రదర్శించం.. ఒక మంచిపనికి మేం జాత్యహంకారాన్ని పూయబోము.. ప్రేమను ఎలా పంచుతారో చెప్పేందుకు ముందుకు రండి.. అప్పుడైతే మేం మీకు స్వాగతం పలుకుతాం. మిమ్మల్ని ప్రేమిస్తాం. మీకు మద్దతిస్తాం' అంటూ ఆయన అన్నారు. ఈ మాటలు విన్న అక్కడి వారంతా కూడా ముగ్దులైపోయారు. -
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం
పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం వెలుగుచూసింది. పోలీసులకు సమాచారం అందిస్తున్నాడనే నెపంతో ఓ రైతును న్యూ డెమోక్రసీ సభ్యులు కొట్టి చంపారు. జిల్లాలోని పాల్వంచ మండలం పాండురంగాపురం పంచయాతి పరిధిలోని నర్సంపేటకు చెందిన రాయల భాస్కర్ అనే రైతును న్యూడెమోక్రసీ రవి దళ సభ్యులు దారుణంగా కొట్టి హతమార్చారు. బుధవారం ఉదయం భాస్కర్ ఇంటికి వచ్చిన 20 మంది న్యూ డెమోక్రసీ సభ్యులు అతన్ని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనలో 15 మంది మగ, ఐదుగురు మహిళ దళ సభ్యులు పాల్గొన్నట్లు సమాచారం. గతంలో ఇదే మండలంలోని రెడ్డిగూడెం గ్రామానికి చెందిన రైతు వెంకటరెడ్డిని ఇదే రవి దళం హతమార్చింది. -
త్రుటిలో తప్పిన ఎన్కౌంటర్
న్యూడెమోక్రసీ దళంపై దాడికి పోలీసుల యత్నం జంగాలపల్లిలో పంచాయితీ నిర్వహిస్తుండగా ఘటన గంగారం(ములుగు): మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం జంగాలపల్లిలో గురువారం త్రుటిలో భారీ ఎన్కౌంటర్ తప్పింది. గ్రామంలోని ఓ రహస్య ప్రాంతంలో న్యూడెమోక్రసీ నక్సల్స్ పంచాయితీ నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు దాడికి వెళ్లారు. క్షణాల వ్యవధిలో సమాచారం అందుకున్న దళ సభ్యులు చాకచ క్యంగా అక్కడి నుంచి పారిపోవడంతో ప్రాణనష్టం తప్పిం ది. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ శ్యాం దళం సభ్యులు గురువారం ఉదయం మండలంలోని జంగాలపల్లిలో ఓ పంచాయితీ చేయడానికి వచ్చారు. ఏడుగురు దళ సభ్యులు ఇరుపక్షాల వారితో పంచాయితీ నిర్వహిస్తుండగా, పోలీ సులకు సమాచారం అందింది. దీంతో ఎస్సైలు సతీశ్, బాలకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు వెళ్లారు. గ్రామానికి చెం దిన వ్యక్తి ద్వారా సమాచారం అందుకున్న దళ సభ్యులు అక్కడి నుంచి జారుకున్నారు. పోలీసులు, దళ సభ్యులు ఎదురుపడితే కాల్పులు, ప్రాణ నష్టం జరిగి ఉండేదని గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. పంచాయితీ జరిగిన ఇంట్లో సోదాలు చేయగా 8 కిట్ బ్యాగులు, టార్పాలిన్ కవర్, ఓ సెల్‌ఫోన్, పాదరక్షలు లభించినట్లు సీఐ రమేశ్‌నాయక్ వెల్లడించారు. దళ సభ్యులకు సహకరిస్తే కఠిన చర్యలు దళ సభ్యులకు ఎవరైనా సహకరించినట్లు తెలిస్తే చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరిం చారు. పంచాయితీల పేరుతో దళ సభ్యులను సంప్రదిం చడం మానుకోవాలని హితవు పలికారు. పలువురు సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్నారు. -
టఫ్ కార్యాలయాన్ని బాధ్యులకు అప్పగించాలి
న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి డీవీ కృష్ణ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు పౌర, ప్రజాస్వామిక హక్కులను గ్యారంటీ చేస్తామని రాష్ట్ర సాధన ఉద్యమంలో వాగ్దానం చేసి.. అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం, ఎమర్జెన్సీని తలపించేలా నిర్బంధ చర్యలకు పూనుకోవడం దురదృష్టకరమని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ పేర్కొంది. తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ (టఫ్) కార్యాలయంపై పోలీ సులు దాడి చేసి, మహిళా కార్యకర్తలను బయటకు పంపి బలవంతంగా మూసి వేయడాన్ని ఆ పార్టీ ఖండించింది. టఫ్ కార్యాలయాన్ని వెంటనే దాని బాధ్యులకు అప్పగించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డి.వి.కృష్ణ డిమాండ్ చేశారు. టఫ్ నాయకులు, ఇతర ప్రజాసంఘాల నాయకులు హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మలను కలిసినపుడు, వెంటనే దాన్ని తెరిపించి అప్పగిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కానీ, ఎన్నోరోజులు గడిచినా అమలు చేయకపోవడం పట్ల ఆ పార్టీ నిరసనను ప్రకటించింది. కాగా, ప్రముఖ పాత్రికేయులు వి.హనుమంతరావు మృతి పట్ల న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి డి.వి.కృష్ణ సంతాపం ప్రకటించారు. -
న్యూడెమోక్రసీ దళ కమాండర్ అరెస్టు
టేకులపల్లి: న్యూడెమోక్రసీ(రాయల) అజ్ఞాత దళ కమాండర్ ఆజాద్ అలియాస్ మధు(45)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు డీఎస్పీ శనివారం టేకులపల్లి సీఐ కార్యాలయంలో ఈ వివరాలు వెల్లడించారు. ఇల్లందు మండలం రొంపేడు గ్రామానికి చెందిన మధు ఇరవయ్యేళ్ల నుంచి అజ్ఞాతంలో ఉన్నాడని తెలిపారు. శనివారం ఉదయం ఆళ్లపల్లి మండలం బాటన్ననగర్లోని ఓ ఇంట్లో ఉండగా అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఆయనపై పలు కేసులు నమోదై ఉన్నాయని, ఈ మేరకు కోర్టులో హాజరుపర్చనున్నట్లు చెప్పారు. -
విద్యార్థులు సంఘటితంగా పోరాడాలి
విజయవాడ (గాంధీనగర్ ) : విద్యారంగ సమస్యలపై విద్యార్థులు సంఘటితంగా ఉద్యమించాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నగర కార్యదర్శి కె పోలారి పిలుపునిచ్చారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) నగర సమితి 8వ మహాసభ సోమవారం జరిగింది. తొలుత పీడీఎస్‌యూ జెండాను ఆవిష్కరించారు. మహాసభలో పాల్గొన్న పోలారి మాట్లాడుతూ విద్యను వ్యాపారంగా మార్చి పాలక వర్గాలకు పేదలకు విద్యను దూరం చేస్తున్నాయన్నారు. డబ్బున్న వారికి నాణ్యమైన విద్య అనే పరిస్థితి ఏర్పడిందన్నారు. అందరికీ సమానమైన, నాణ్యమైన విద్యకోసం పోరాడాలని పిలుపునిచ్చారు. పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.రవిచంద్ర మాట్లాడుతూ ప్రై వేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటును ఉపసంహరించుకోవాలన్నారు. స్కాలర్షిప్, బోధనా ఫీజులను విడుదల చేయాలని కోరారు. నిరుద్యోగుల వయోపరిమితిని 42 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. హాస్టళ్లలో బయోమెట్రిక్ విధానం రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వ కళాశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, నిరుద్యోగ భృతి రూ. 2వేలు చెల్లించాలని, దళితులు, మైనార్టీలపై దాడులు అరికట్టాలని మహాసభ తీర్మానించింది. మహాసభలో ఇఫ్టూ నగర కార్యదర్శి పి.ప్రసాదరావు, ఆటో కార్మిక సంఘం నగర కార్యదర్శి శ్రీనివాసరావు, పీడీఎస్‌యూ ప్రధాన కార్యదర్శి ఎస్.రామ్మోహనరావు, తదితరులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం ఎన్నిక పీడీఎస్‌యూ నగర నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నగర అ«ధ్యక్షుడిగా ఐ.రాజేష్, ప్రధాన కార్యదర్శిగా బి.శ్యాంసన్, ఉపాధ్యక్షులుగా రాజు, సహాయ కార్యదర్శిగా సీహెచ్.ప్రగతి, కోశాధికారిగా భానుని ఎన్నుకున్నారు. వీరితోపాటు మరో 12మందిని సభ్యులుగా ఎన్నుకున్నారు, -
కొత్త విద్యాశాఖాధికారి ఎవరో?
– 31న డీఈఓ అంజయ్య ఉద్యోగ విరమణ – తెరపైకి పలువురు అధికారుల పేర్లు – ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ అనంతపురం ఎడ్యుకేషన్ : జిల్లా విద్యాశాఖ అధికారి కె. అంజయ్య ఈ నెల 31న ఉద్యోగ విరమణ చేయనున్నారు. నూతన డీఈఓ ఎవరనేదానిపై ఉపాధ్యాయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కీలకమైన విద్యాశాఖ అధికారి స్థానం కోసం పలువురి పేర్లు తెరమీదకు వస్తున్నాయి. రీజనల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) పదోన్నతి జాబితాలో అంజయ్య ఉన్నారు. ఇప్పటికే డిపార్టుమెంట్ పదోన్నతుల కమిటీ (డీపీసీ) సమావేశం జరిగి ఉంటే పదోన్నతులు వచ్చేవని తెలిసింది. ఇటీవల కాలంలో హైదరాబాద్‌లో ఉన్న రాష్ట్ర కార్యాలయం విజయవాడకు బదిలీ కావడంతో అంతా హడావుడిగా ఉన్నారు. ఈ కారణంగానే డీపీసీ సమావేశం వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఏక్షణానైనా డీపీసీ సమావేశం జరగవచ్చని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అదే జరిగితే డీఈఓ అంజయ్యకు రిటైర్డ్ అయ్యే రెండు రోజుల ముందైనా పదోన్నతి రావచ్చు. అలాగే పలువురు డెప్యూటీ డీఈఓలు, అసిస్టెంట్ డైరెక్టర్లకు డీఈఓలుగా పదోన్నతులు వస్తాయి. ఈ క్రమంలో కష్ణా జిల్లాలో ఏడీగా పని చేస్తున్న ఓ అధికారి పదోన్నతిపై ఇక్కడికి వచ్చేందుకు పావులు కదుపుతున్నారు. గతంలో ఇన్చార్జ్ డీఈఓగా పని చేసిన అనుభవంతో శామ్యూల్ కూడా తనవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈయన ప్రస్తుతం మదనపల్లి డెప్యూటీ డీఈఓగా పని చేస్తున్నారు. పదోన్నతులు కల్పించేందుకు ఏసీఆర్ (యానివల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్)ను ప్రభుత్వం కోరింది. డీఈఓల ఏసీఆర్ కలెక్టర్లు, డెప్యూటీ డీఈఓలు, ఏడీల ఏసీఆర్లు డీఈఓలు ఇవ్వాల్సి ఉంది. అయితే రెండేళ్ల రిపోర్టు అడిగినా కనీసం ఏడాది రిపోర్ట్లైనా పంపాలని సూచించినట్లు తెలిసింది. పదోన్నతులు రాకపోతే ఏడీకి ఇన్చార్జ్? నెలాఖరులోగా విద్యాశాఖలో పదోన్నతులు జరగకపోతే డీఈఓ అంజయ్య రిటైర్డ్ అయిన అనంతరం ఏడీగా పని చేస్తున్న పగడాల లక్ష్మీనారాయణను కొద్దిరోజులు ఇన్చార్జ్గా నియమించే అవకాశం ఉంది. వచ్చే నెలలో కచ్చితంగా డీపీసీ జరిగే అవకాశాలు ఉన్నాయి. డీపీసీ జరిగి రెగ్యులర్ డీఈఓను నియమించే దాకా లక్ష్మీనారాయణను కొనసాగించే అవకాశమూ ఉంది. మరోవైపు చిత్తూరు డీఈఓగా పని చేస్తున్న నాగేశ్వరరావు ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిసింది. డైరెక్టరేట్ కార్యాలయంలో డీఈఓ హోదాలో పని చేస్తున్న ఓ అధికారి కూడా ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఈ ఉత్కంఠకు తెర పడాలంటే మరో 15 రోజులు వేచి చూడాల్సిందే. -
ఎన్డీ దళాల మధ్య కాల్పులు
నర్సంపేట : కొత్తగూడ మండలం దుర్గారం లక్ష్మిపురం శివారులో న్యూడెమోక్రసీ(రాయల వర్గం) పుల్లన్న దళంపై పెద్దచంద్రన్న వర్గం సూర్యం, శ్యాం దళాలు దాడి చేశాయి. ఈ దాడిలో పుల్లదళ భ్యులు వీరారెడ్డి(వీరన్న)తోపాటు మరో దళసభ్యుడికి గాయాలైనట్లు సమాచారం. గత కొంతకాలంగా న్యూడెమోక్రసీ రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు సాగుతున్న విషయం తెలిసిందే. తమ ప్రాబల్యాన్ని విస్తరించడానికి ముస్మి ఏజేన్సీ ప్రాంతంలో రాయలవర్గం చేపట్టిన కార్యక్రమాలను అడ్డుకునేందుకు శుక్రవారం రాత్రి సూర్యం దళం మాటుకాసి పుల్లన్న దళంపై దాడి చేసినట్లు తెలిసింది. ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న కొత్తగూడ మండలంలో ఈ ఘర్షణతో అలజడి వాతావరణం నెలకొంది. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు గాలింపు ప్రారంభించినట్లు తెలిసింది. -
ఎన్డీ దళ కమాండర్ గణేష్ అరెస్టు
గుండాల: ఖమ్మం జిల్లా గుండాల మండలం కాచనపల్లి గ్రామానికి చెందిన న్యూడెమోక్రసీ పార్టీ నేత గణేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆళ్లపల్లి ఏరియా దళ కమాండర్‌గా గణేష్ పనిచేస్తున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న గణేష్ బాటన్ననగర్లో ఆశ్రయం పొందుతుండగా శనివారం పోలీసులు పట్టుకున్నారు. అయితే, గణేష్‌ను వెంటనే కోర్టులో హాజరుపర్చాలని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య డిమాండ్ చేశారు. -
అతనికి సహకరించిన వారి సంగతేమిటి?
హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌కు సహకరించిన ఘరానా నాయకులు, అధికారులను విచారించకుండా శిక్షించకుండా నేరసామ్రాజ్యాన్ని కూల్చేశామని ప్రభుత్వం ప్రకటించటం హాస్యాస్పదంగా ఉందని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. నయీం హత్యలు, దందాలు, కబ్జాల్లో పాలుపంచుకున్న నేరస్తుల పేర్లను బయటపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నయీమ్ వంటి నరహంతకుణ్ని చేరదీసి చివరి వరకు ఆశ్రయం కల్పించి అవసరం తీరాక హత్య చేశారని ఆరోపించారు. దీనిని ఎన్‌కౌంటర్‌గా పోలీసులు పేర్కొనటం అనేక అనుమానాలకు తావిస్తోందని ఆయన పేర్కొన్నారు. నయీమ్‌ను సజీవంగా పట్టుకుని ఉంటే అతని పాపాల్లో పాలకులు, పోలీసులు, జర్నలిస్టులకు ఎంత భాగముందనేది వెల్లడి అయ్యేదని చెప్పారు. నయీమ్‌ను అడ్డుపెట్టుకుని నాయకులు, పాలకులు, పోలీసులు ఎన్ని దురాగతాలకు పాల్పడ్డారనేది ప్రజలకు తెలిసి ఉండేదని సాదినేని వెల్లడించారు. -
దళితులపై దాడులు నిరసిస్తూ ధర్నా
గాంధీనగర్ : ఆర్ఎస్ఎస్ వంటి మతోన్మాద సంస్థలు దళితులపై దేశవ్యాప్తంగా జరుపుతున్న దాడులను నిరసిస్తూ సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నగర కమిటీ ఆధ్వర్యంలో శనివారం లెనిన్‌సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. నగర కార్యదర్శి కె. పోలారి మాట్లాడుతూ చుండూరు మారణకాండ జరిగి నేటికి 25 సంవత్సరాలు పూర్తయిందన్నారు. కానీ దోషులెవ్వరికి శిక్షలు పడలేదని చెప్పారు. వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడాన్ని ఆయన ఖండించారు. చుండూరు విషయంలోనే కాక కారంచేడు, పదిరికుప్పం, నీరుకొండ, లక్ష్మీంపేట తదితర ఘటనలలో దళితులకు న్యాయం జరగలేదన్నారు. ప్రస్తుతం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుల, మతోన్మాదాన్ని మరింత పెంచి పోషిస్తున్నారన్నారని చెప్పారు. గో రక్షణ పేరుతో దళితులపై, మైనార్టీలపై దాడులు చేస్తున్నారన్నారు. జంతువులకు ఉన్న విలువ దళితుల ప్రాణాలకు లేకుండా పోయిందన్నారు. దళితులపై దాడులు, మతోన్మాదం నశించాలన్నారు. ధర్నాలో సీపీఐ (ఎంఎల్) న్యూ డెమాక్రసీ నాయకులు కె. దుర్గ, వై. అప్పారావు, గౌతమ్, ఇఫ్టూ నాయకులు శ్రీధర్, యాదగిరి పాల్గొన్నారు. -
న్యూడెమోక్రసీ దళ కమాండర్ వెంకన్న అరెస్ట్
గూడూరు మండలం జగన్నాయకులగూడెంకు చెందిన న్యూడెమోక్రసీ దళ కమాండర్ వెంకన్న అలియాస్ విక్రమ్‌ను అరెస్ట్ చేసి మీడియా ఎదుట పోలీసులు హాజరు పరిచారు. అతని వద్ద నుంచి ఒక రివాల్వర్, ఐదు బుల్లెట్లు, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు నర్సంపేట పోలీసులు వెల్లడించారు. -
న్యూడెమోక్రసీ నేత కన్నుమూత
గుండెపోటుతో న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి రాయల సుభాష్ చంద్రబోస్ మృతి ♦ పార్టీ కార్యవర్గ భేటీలో గుండెపోటుతో కుప్పకూలిన నేత ♦ హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూత ♦ 47 సంవత్సరాల అజ్ఞాత జీవితం గడిపిన రాయల ♦ నేడు స్వగ్రామం పిండిప్రోలులో అంత్యక్రియలు సాక్షి, హైదరాబాద్/ఖమ్మం మయూరి సెంటర్: నాలుగు దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉన్న సీపీఐ (ఎంఎల్-న్యూ డెమోక్రసీ) అగ్రనేత రాయల సుభాష్ చంద్రబోస్(70) అలియాస్ రవన్న బుధవారం గుండెపోటుతో మరణిం చారు. ఖమ్మం జిల్లాలో ఓ రహస్య ప్రాంతంలో పార్టీ కార్యవర్గ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన కుప్పకూలిపోయారు. హుటాహుటిన హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో నకిరేకల్ వద్ద తుదిశ్వాస విడిచినట్టు న్యూడెమోక్రసీ వర్గాలు తెలిపాయి. ఆయనకు భార్య కె.రమ, కుమార్తె వందన ఉన్నారు. రమ పీఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు. బోస్ భౌతికకాయాన్ని విద్యానగర్‌లోని న్యూడెమోక్రసీ కార్యాలయానికి తరలించారు. గురువారం ఉదయం ఖమ్మం తరలించి స్థానిక రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో మధ్యాహ్నం 12 గంటల దాకా అభిమానుల సందర్శనార్థం ఉంచి అనంతరం అంత్యక్రియలు నిర్వహిస్తారని పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి పోటు రంగారావు తెలిపారు. విద్యార్థి దశ నుంచే... ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు బోస్ స్వగ్రామం. ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కాలేజీలో బీఎస్సీ చదివారు. కాలేజీలో బత్తుల వెంకటేశ్వరరావుతో కలసి స్టూడెంట్స్ ఫెడరేషన్‌ను స్థాపిం చారు. విద్యార్థి దశ నుంచే వామపక్ష ఉద్యమం పట్ల ఆకర్షితుడయ్యారు. 1967 నక్సల్బరీ, శ్రీకాకుళం ఉద్యమాల ప్రభావంతో చదువుకు స్వస్తి చెప్పి విప్లవబాట పట్టారు. ఆంధ్రప్రదేశ్ విప్లవ కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేశారు. 1968లో అజ్ఞాతంలోకి వెళ్లారు. అప్పట్నుంచీ అజ్ఞాత జీవితాన్ని వీడలేదు. 1972 దాకా చారు మజుం దార్ అనుచరునిగా సీఓసీలో పనిచేశారు. ప్రముఖ విప్లవకారుడు చండ్ర పుల్లారెడ్డి ఏర్పాటు చేసిన సీపీఐఎంఎల్ (సీపీ)లో చేరారు. 1984లో చండ్ర వర్గం చీలిపోయినప్పుడు పైలా వాసుదేవరావు నాయకత్వాన ఏర్పాటైన సీపీఐ ఎంఎల్ (ప్రజాపంథా)లో చేరారు. తర్వాత పార్టీకి కార్యదర్శిగా పని చేశారు. కూర రాజన్న నాయకత్వంలోని జనశక్తి, ప్రజాపంథా గ్రూపులు విలీనమై సీపీఐ (ఎంఎల్-న్యూడెమోక్రసీ)గా ఏర్పాటయ్యాక ఆ పార్టీకి కార్యదర్శిగా పని చేశారు. గత ఏడాది న్యూడెమోక్రసీ కూడా చీలిపోయింది. ఒక వర్గానికి బోస్ కార్యదర్శిగా ఉన్నారు. 2009లో బోస్‌కు పక్షవాతం రావడంతో చికిత్స తీసుకుం టున్నారు. బోస్ మరణం పట్ల సీపీఐ (ఎంఎల్-న్యూ డెమోక్రసీ) నేతలు గాదె దివాకర్, జి.ఝాన్సీ, కె.గోవర్ధన్, వేములపల్లి వెంకట్రామయ్య, డి.వి.కృష్ణ, పి.రంగారావు, పీఓడబ్ల్యూ సంధ్య తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. ఆ కుటుంబం విప్లవోద్యమానికే అంకితం రాయల తండ్రి వెంకట నారాయణ తెలంగాణ సాయుధ పోరాట నాయకుడు. ఈయనకు నలుగురు కుమారులు. పెద్దవాడైన అప్పయ్య ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా పనిచేశారు. రెండో సంతానం రాయల. మూడో కుమారుడు నాగేశ్వరరావు పిండిపోలు గ్రామానికి 30 సంవత్సరాల పాటు సర్పంచ్‌గా ఉన్నారు. నాలుగో సంతానమైన చంద్రశేఖర్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులుగా, రైతు కూలీ సంఘం నాయకులుగా కొనసాగుతున్నారు. -
ఇద్దరు న్యూడెమొక్రసీ ఎంపీటీసీల బహిష్కరణ
ఖమ్మం: ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసినందుకు ఇద్దరు ఎంపీటీసీలను న్యూడెమొక్రసీ పార్టీ బహిష్కరించింది. పార్టీ సిద్ధాంతాన్ని విస్మరించినందుకు ఈ చర్య తీసుకున్నట్లు నాయకులు తెలిపారు. టేకులపల్లి మండలం బద్దుతండా ఎంపీటీసీ బేబీ, గుండాల మండలం ఆళ్లపల్లి ఎంపీటీసీ మెస్సు సమ్మక్కలను న్యూడెమొక్రసీ పార్టీ నుంచి బహిష్కరించినట్లు ఖమ్మం, వరంగల్ జిల్లాల ఏరియానేత లింగన్న, టేకులపల్లి మండల కార్యదర్శి గణేశ్ వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనకూడదని చెప్పిన పార్టీ సిద్ధాంతాలను పాటించకుండా.. ప్రలోభాలకు గురై వెళ్లడం దుర్మార్గమైన చర్య అని వారు విమర్శించారు. పదవికి కూడా రాజీనామా చేయాలని, లేకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని నాయకులు హెచ్చరించారు. -
బెజవాడలో సీఎం దిష్టిబొమ్మ దహనం
గాంధీనగర్: బాక్సైట్ తవ్వకాలకు అనుమతించే జీవోను రద్దు చేయాలంటూ విజయవాడలో న్యూడెమోక్రసీ కార్యకర్తలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు. బుధవారం ఉదయం స్థానిక లెనిన్ సెంటర్లో సీపీఐ ఎల్ న్యూమోక్రసీ నేత చిట్టిపాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కార్యకర్తలు నిరసన తెలిపారు. గిరిజనుల జీవితాలను ఛిద్రం చేసే బాక్సైట్ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. -
బయ్యారం అడవుల్లో తుపాకుల మోత
పోలీసులు, న్యూడెమోక్రసీ (చంద్రన్న వర్గం) మధ్య కాల్పులు బయ్యారం: ఖమ్మం జిల్లా బయ్యారం మండలం కంబాలపల్లి పంచాయతీలోని పందిపంపుల సమీప అడవుల్లో శనివారం సాయంత్రం తుపాకుల మోత మోగింది. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాం దోళనలకు గురయ్యూరు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. న్యూడెమోక్రసీ చంద్రన్న వర్గానికి చెందిన వరంగల్-ఖమ్మం ఏరియా కార్యదర్శి అశోక్, కొత్తగూడెం డివిజన్ కార్యదర్శి సాగర్ దళాలు సమీప గ్రామాల ప్రజలతో అటవీప్రాంతంలో సమావేశం అయ్యూయి. అనంతరం దళాలు విశ్రాంతి తీసుకుంటుండగా పోలీసులు వచ్చారు. ఈ క్రమంలో ఇరువర్గాలు పరస్పరం కాల్పులు జరుపుకొన్నాయి. నక్సల్స్ దళాలు కాల్పులు జరుపుతూ తప్పించుకున్నాయి. దీంతో పోలీసులు సంఘటనా స్థలి సమీప గ్రామాలకు చెందిన పదిమందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కాగా నక్సల్స్ ఎజెండాను అమలు పరుస్తున్నామంటున్న ప్రభుత్వం నక్సల్స్‌పై పోలీసులతో కాల్పులు జరపించడం తగదని చంద్రన్న వర్గం రాష్ట్ర కార్యదర్శి ఎస్. వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం ఆయన ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. -
ఆయుధాన్ని వారికే ఇచ్చి పార్టీ మారా
బయ్యారం (ఖమ్మం): ప్రజల తరఫున ప్రతిఘటన ఉద్యమాలు చేసేందుకు అజ్ఞాతంలో చేరిన తాను ఉద్యమాన్ని వీడుతున్నట్లు వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని న్యూడెమోక్రసీ ఖమ్మం జిల్లా బయ్యారం ఏరియా దళకమాండర్ జగన్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన సాక్షితో మాట్లాడారు. కొందరు వ్యక్తులు కుట్రపూరితంగా తాను లొంగిపోతున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. చంద్రన్నవర్గం నాయకత్వ విధానాలు నచ్చక ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. చంద్రన్నవర్గానికి చెందిన అశోక్, సాగర్, తాను ఇంతకాలం చేసిన ఉద్యమానికి బహుమానంగా ఉపయోగంలో లేని ఆయుధాన్ని ఇచ్చారన్నారు. ఆ ఆయుధాన్ని కూడా వారికే అప్పగించి సీసీలైన్లో కొనసాగుతున్న న్యూడెమోక్రసీ(రాయలవర్గం)లో చేరానన్నారు. -
జగన్‌కు న్యూడెమోక్రసీ నేతల మద్దతు
గుంటూరు వెస్ట్ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షకు సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీగుంటూరు జిల్లా కమిటీ సోమవారం పూర్తి మద్దతు ప్రకటించింది. ప్రత్యేక హోదా కోరుతూ నగరంలో భారీ ప్రదర్శన జరిపింది. అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద జరిగిన సభలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మయ్య మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావాలంటే ప్రత్యేక హోదా కావాల్సిందేనని తెలిపారు. హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న మొండి వైఖరిని ఆయన తప్పుపట్టారు. ప్రత్యేక హోదా సాధనకు ఆరు రోజుల నుంచి వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ చేస్తున్న నిరవధిక నిరాహారదీక్ష న్యాయమైనదని తెలిపారు. ఆ దీక్షను ప్రజలు, ప్రజాస్వామిక వాదులు బలపరచాలని కోరారు. అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మేకలప్రసాద్, ప్రగతిశీల మహిళా సంఘం రాష్ర్ట అధ్యక్షురాలు ఎన్.విష్ణు, పార్టీ నాయకులు ఇందుర్తి సుబ్బయ్య, నక్కా పోతురాజు, పీవో డబ్ల్యు నాయకురాలు పి.శివపార్వతి, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. -
లొంగిపోనున్న న్యూడెమొక్రసీ దళ కమాండర్..!
ఖమ్మం జిల్లా ఇల్లెందు ప్రాంత న్యూడెమొక్రసీ దళ కమాండర్ జగన్ పోలీసుల ముందు లొంగిపోనున్నట్టు విశ్వసనీయ సమాచారం. బయ్యారం ప్రాంతానికి చెందిన జగన్ మూడేళ్ల క్రితం పోరు బాట పట్టాడు. ఇతనిపై పలు కేసులు కూడా ఉన్నాయి. బయ్యారం లేదా ఇల్లెందు పోలీసుల ముందు జగన్ లొంగిపోనున్నట్టు తెలుస్తోంది. -
న్యూడెమోక్రసీపై పోలీసుల ఉక్కుపాదం
చంద్రన్న వర్గానికి చెందిన 40 మంది అరెస్ట్ ఇల్లెందు: ఖమ్మం జిల్లా ఇల్లెందు సబ్‌డివిజన్‌లో న్యూడెమోక్రసీ రాయల, చంద్రన్న వర్గాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రెండు రోజుల క్రితం గుండాల మండలం మర్కొడు అటవీ ప్రాంతంలో న్యూడెమోక్రసీ చంద్రన్న వర్గం సాగర్ దళం.. వన్యప్రాణి సంరక్షణ విభాగం సిబ్బంది, మొక్కలు నాటేందుకు వెళ్లిన ఒడిశా కూలీలను నిర్బంధించడంతో పాటు దాడి చేసిన ఘటనలో చంద్రన్న వర్గం లీగల్ నేతలను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. జిల్లాలో న్యూడెమోక్రసీకి పట్టున్న మండలాల్లో సుమారు 40 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే, న్యూడెమోక్రసీ రాయల వర్గానికి చెందిన అజయ్, కామేపల్లి లక్ష్మీనారాయణను అదుపులోకి తీసుకున్నారు. వారిలో బయ్యూరం సింగిల్‌విండో చైర్మన్ రామగిరి భిక్షం, ఇఫ్టూ రాష్ట కార్యదర్శి జె సీతారామయ్య, రైతుకూలీ సంఘం నేత అమృ ఉన్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. -
పోడు భూముల రక్షణకై 25న చలో హైదరాబాద్
టేకులపల్లి (ఖమ్మం) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. పోడు భూముల రక్షణ కోసం ఈనెల 25వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు న్యూడెమోక్రసీ నాయకులు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఖమ్మం జిల్లా టేకులపల్లిలోని పార్టీ కార్యాలయంలో చలో హైదరాబాద్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నేతలు ఊక్లా, హర్జ్య, తోటకూరి వెంకటేశ్వర్లు, కల్తి వెంకటేశ్వర్లు, నోముల భానుచందర్ తదితరులు పాల్గొన్నారు. -
వరంగల్ జిల్లాలో కాంట్రాక్టర్లు కిడ్నాప్
వరంగల్: వరంగల్ జిల్లాలో ఇద్దరు కాంట్రాక్టర్లు కిడ్నాప్ అయ్యారు. జిల్లాలోని ఖానాపూర్ మండలం మనుబోతులగడ్డ వద్ద రహదారి పనులు పర్యవేక్షిస్తుండగా కాంట్రాక్టర్లు వెంకటేశ్వరరెడ్డి, శిరీష్రెడ్డిలను ఆగంతకులు తమ కారులో ఎక్కించుకుని వెళ్లారు. దాంతో అక్కడే ఉన్న కార్మికులు కాంట్రాక్టర్ల కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి... రహదారి వద్ద పనులు నిర్వహిస్తున్న కార్మికులను విచారిస్తున్నారు. న్యూడెమోక్రసీ కార్యకర్తలే ఈ కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
13 మంది దళ సభ్యుల అరెస్ట్
పట్టుబడిన వారంతా సీపీఐఎంఎల్ (న్యూడెమోక్రసీ)ని వీడిన చంద్రన్న వర్గం సభ్యులే 9 తుపాకులు, 344 తూటాలు, కారు, మోటార్ సైకిల్ స్వాధీనం జంగారెడ్డిగూడెం/బుట్టాయగూడెం: తుపాకీ గొట్టంతోనే రాజ్యాధికారం అనే నినాదంతో ప్రత్యేక దళంగా ఏర్పాటైన 13 మంది సభ్యులు గల సాయుధ బృందాన్ని పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు మంగళవారం వేకువజామున చాకచక్యంగా పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సీపీఐఎంఎల్ (న్యూ డెమోక్రసీ) నుంచి బయటకొచ్చి చంద్రన్న వర్గంగా ఏర్పాటైన అశోక్ దళానికి చెందిన 13 మంది సభ్యులను జంగారెడ్డిగూడెం సమీపంలోని జీలుగులమ్మ గుడి వద్ద స్పెషల్ పార్టీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారినుంచి 9 తుపాకులు, 344 తూటాలు, విప్లవ సాహిత్యంతోపాటు ఒక టాటా ఏస్ వాహనం, ఒక మోటార్‌సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. వీరందరినీ జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ జరిపారు. అరెస్టైన వారిలో పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం యర్రాయిగూడెంకు చెందిన దళ కమాండర్ కుంజా రవి, ఖమ్మం జిల్లా గుండాల మండలం కేశన్నపల్లికి చెందిన డెప్యూటీ దళ కమాండర్ పడిగ సురేష్ అలియాస్ వెంకటేష్, బుట్టాయగూడెం మండలం మంగయ్యపాలెంకు చెందిన కెచ్చెల పండు అలియాస్ ప్రభాకరరావు, వీరమద్దిగూడెంకు చెందిన కరకాల రాము అలియాస్ రామన్న, తూర్పురేగులకుంటకు చెందిన మోకల మురళీకృష్ణ అలియాస్ వెంకటేశ్వరరావు, కైకాల సూర్యనారాయణ, అలివేరుకు చెందిన కొక్కెర వెంకటేష్ అలియాస్ శింగన్న, కామవరపుకోట మండలం జోగడిగూడెంకు చెందిన తలారి ప్రకాష్‌తోపాటు రాములు, ఖమ్మం జిల్లా బయ్యారానికి చెందిన మహ్మద్ అబ్దుల్లా రషీద్, పాల్వంచకు చెందిన అమరాజు గట్టయ్య, పెనుమాక మండలం రేగళ్ల గ్రామానికి చెందిన పాయం వెంకటేష్ అలియాస్ మురళి, కొత్తగూడెంకు చెందిన బడపటి వీరన్న ఉన్నారు. వీరంతా పశ్చిమగోదావరి జిల్లాలో నూతనంగా దళాన్ని ఏర్పాటు చేసి ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కచ్చితమైన సమాచారం ఉందని ఎస్పీ రఘురామ్‌రెడ్డి చెప్పారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ ఏవీ సుబ్బరాజు ఆధ్వర్యంలో సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసులు ఈ దాడులు నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు. కాగా, చంద్రన్న వర్గంలోని అశోక్ దళానికి చెందిన 13 మంది సభ్యులను జంగారెడ్డిగూడెం సమీపంలోని జీలుగులమ్మ గుడి వద్ద అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెబుతుండగా, వీరందరినీ బుట్టాయగూడెం మండలం ఇప్పలపాడు గ్రామ సమీపంలోని విప్పలమ్మ కొయ్య వద్ద పోలీసులు కాపుకాసి పట్టుకున్నట్టు తెలిసింది. దళ సభ్యుల వద్ద తుపాకులు ఉన్నప్పటికీ, వారు వాటిని ధరించకుండా వాహనంలోనే ఉంచుకున్నట్టు సమాచారం. దళ సభ్యులు అప్రమత్తమయ్యే అవకాశం ఇవ్వకుండా చుట్టుముట్టిన పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకున్నారని భోగట్టా. పోలీసులు తమను ముట్టడించిన సమయంలో దళ సభ్యులు పొగాకు బ్యారన్ల వద్ద గల కర్రలతో వారిపై దాడిగి తెగబడగా, పోలీసులు ప్రతిఘటించి వారందరినీ అరెస్ట్ చేసినట్టు చెబుతున్నారు. తొలుత దళ సభ్యుల్లో కొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతరం వారిచ్చిన సమాచారం మేరకు రేగులకుంట సమీపంలోని వంతెన కింద తలదాచుకుంటున్న మరికొందరిని చాకచక్యంగా పట్టుకున్నట్లు తెలిసింది. కాగా, వారినుంచి ఆయుధాలు,బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. -
ఏజెన్సీలో ‘దళ’జడి
జంగారెడ్డిగూడెం :పశ్చిమ ఏజెన్సీలో అన్నల అలజడి రేగింది. సీపీఐ ఎంఎల్ (న్యూ డెమోక్రసీ) చంద్రన్న వర్గంలోని అశోక్ దళానికి చెందిన సభ్యులు ఆయుధాలతో ప్రయాణం చేస్తున్నారనే కచ్చితమైన సమాచారంతో పోలీసు బలగాలు చుట్టుముట్టి మంగళవారం వేకువజామున 11 మందిని వలపన్ని పట్టుకున్నాయి. అనంతరం మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మొత్తం 13 మందిని జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులకు పట్టుబడిన వారంతా గతంలో రాయల సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో సీపీఐ ఎంఎల్ (న్యూ డెమోక్రసీ)లో పనిచేశారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడే ఆ పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తడంతో సీపీఐ ఎంఎల్ (న్యూ డెమోక్రసీ) పార్టీ రెండుగా చీలిపోయింది. అలా విడిపోయిన ఒక వర్గం గాదె దివాకర్ నాయకత్వంలో పనిచేస్తుండగా, మరో వర్గం సీపీఐ ఎంఎల్ (న్యూ డెమోక్రసీ) చంద్రన్న వర్గంగా ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో జిల్లాలో టి.సుధాకర్ నాయకత్వంలో గాదె దివాకర్‌కు సంబంధించిన వర్గం పనిచేస్తోంది. విడిపోయిన చంద్రన్న వర్గంలో మోకల మురళీకృష్ణ జిల్లా కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. చంద్రన్న వర్గం సాయుధ దళం ఏర్పాటుకు పూనుకుంది. కొంతమంది గిరిజన యువకులను ఎంపిక చేసుకుని ఖమ్మం జిల్లా బయ్యారం అడవుల్లో ఆయుధాలను ఉపయోగించడంలో ఏడాదిన్నర కాలంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే మంగళవారం వేకువజామున 11 మంది వ్యక్తులు ఆయుధాలు తీసుకుని టాటా ఏస్ వాహనంలో ఈ ప్రాంతానికి వస్తున్నారనే సమాచారం పోలీసులకు అందింది. అప్రమత్తమైన అధికారులు ప్రత్యేక సాయుధ బలగాలతోపాటు జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం, లక్కవరం స్టేషన్లకు చెందిన పోలీసులు జంగారెడ్డిగూడెం సమీపంలోని జీలుగులమ్మ గుడి వద్ద మాటువేసి అత్యంత చాకచక్యంగా 11 మంది దళ సభ్యులను అరెస్ట్ చేశారు. వారిలో దళ కమాండర్ కుంజా రవి, డెప్యూటీ దళ కమాండర్ పడిగ సురేష్, సీపీఐ ఎంఎల్ (న్యూ డెమోక్రసీ) జిల్లా కార్యదర్శి మోకల మురళీకృష్ణతోపాటు ఖమ్మం, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన కెచ్చెల పండు అలియాస్ ప్రభాకరరావు, కరకాల రాము అలియాస్ రామన్న, మహమ్మద్ అబ్దుల్ రషీద్, అమరాజు గట్టయ్య, పాయం వెంకటేష్ అలియాస్ మురళి, బడపటి వీరన్న, తుంగా జాన్ అలియాస్ నాగన్న, కొక్కెర వెంకటేష్ అలియాస్ శింగన్న ఉన్నారు. వీరందరినీ జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు వారిని విచారించారు. అనంతరం బుట్టాయగూడెం మండలం తూర్పురేగులకుంటలో నివాసం ఉంటున్న కైకాల సూర్యనారాయణను, తలారి ప్రకాష్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరితో కలిపి మొత్తం 13 మందిని అరెస్ట్ చేశారు. దళ సభ్యుల నుంచి 9 తుపాకులు, 344 తూటాలు, విప్లవ సాహిత్యంతోపాటు ఒక టాటా ఏస్ వాహనం, బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సీ కె.రఘురామ్‌రెడ్డి తెలిపారు. రక్తపాతం జరక్కుండా పోలీస్ ఆపరేషన్ ఆయుధాలతో దళాలు ప్రయాణం చేస్తున్న సమాచారం అందుకున్న పోలీసులు అత్యంత చాకచక్యాన్ని ప్రదర్శించారు. సాయుధులైన వారిని అరెస్ట్ చేసే సమయంలో సాధారణంగా ప్రతిఘటన ఎదురవుతుంది. పోలీసులు పక్కా వ్యూహంతో ఒక్క బుల్లెట్ కూడా ఉపయోగించకుండా మొత్తం 13 మంది దళ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. గతంలో సాయుధ దళసభ్యులను పట్టుకునే విషయంలో ఏజెన్సీ ప్రాంతంలో తీవ్ర ప్రతిఘటనలు ఎదురయ్యేవి. ఈ దశలో ఎదురు కాల్పులు జరిగి ప్రాణ నష్టం సంభవించేది. తాజా ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా పోలీసులు దళ సభ్యులను అరెస్ట్ చేశారు. పోలీసులకు చిక్కన వారిలో న్యూ డెమోక్రసీ చంద్రన్న వర్గం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్న మోకల మురళీకృష్ణ ప్రస్తుతం ఖమ్మం జిల్లా ఇల్లెందు నియోజకవర్గ పరిధిలోని పందిపంపు గ్రామ సర్పంచ్‌గా ఇటీవల ఎన్నికయ్యారు. ఈయన గతంలో రాజస్థాన్‌లో అక్రమ ఆయుధాల కేసులో అరెస్టయ్యారు. ఇతనిపై పలు కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కోవర్టు పనేనా? చంద్రన్న వర్గంలోని అశోక్ దళానికి చెందిన 13 మంది సభ్యులు పట్టుబడటం వెనుక కోవర్టుల హస్తముందని పలువురు భావిస్తున్నారు. ఖమ్మం జిల్లా బయ్యారం అడవుల్లో ఆయుధాలను వినియోగించడంపై శిక్షణ పొంది టాటా ఏస్ వాహనంలో దళ సభ్యులు జీలుగుమిల్లి మీదుగా వస్తున్నారనే కచ్చితమైన సమాచారాన్ని పోలీసులకు చేరవేయడం కోవర్టులకే సాధ్యమవుతుందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. పోలీసులు మాత్రం ఈ దళం సాగిస్తున్న కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా వేశామని, పక్కా సమాచారంతో దాడి చేసి దళ సభ్యులను వలపన్ని పట్టుకున్నామని చెబుతున్నారు. ‘దళ సభ్యుల అరెస్ట్ అక్రమం’ ఏలూరు(బిర్లాభవన్ సెంటర్) : సీపీఐ ఎంఎల్ (న్యూ డెమోక్రసీ) చంద్రన్న వర్గం కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడం అక్రమమని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి టి.సుధాకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వస్తుంటే అరెస్ట్ చేశారన్నారు. వారితోపాటు ఆ సమావేశంలో పాల్గొన్న వారిని కూడా అరెస్ట్ చేయడం దారుణమన్నారు. దీనిని అప్రజాస్వామిక చర్యగా అభివర్ణించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిని తక్షణమే విడుదల చేయాలని సుధాకర్ డిమాండ్ చేశారు. ప్రత్యేక నిఘా : ఎస్పీ జంగారెడ్డిగూడెం : రాష్ట్ర విభజన నేపథ్యంలో పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో దళ సభ్యుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ జి.రఘురామ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం జంగారెడ్డిగూడెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడాదిన్నర కాలంగా సీపీఐ ఎంఎల్ (న్యూ డెమోక్రసీ) చంద్రన్న వర్గానికి చెందిన కొంతమంది వ్యక్తులు దళాలను ఏర్పాటు చేసి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా పనిచేయడానికి నిర్ణయించుకున్నట్టు తమకు సమాచారం అందిందన్నారు. వారంతా కాంట్రాక్టర్లు, రైతులు, వ్యాపార వర్గాల నుంచి చందాలు వసూలు చేస్తున్నారనే సమాచారం ఉందన్నారు. ఈ నేపథ్యంలో వీరిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. దళ సభ్యులు టాటా ఏస్ వాహనంలో వస్తున్నట్టు సమాచారం అందటంతో పోలీసులు వారిని అత్యంత చాకచక్యం, ధైర్య సాహసాలు ప్రదర్శించి ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లకుండా పట్టుకున్నారన్నారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న సిబ్బందికి అవార్డులు, రివార్డులకు సిఫార్సు చేస్తున్నట్టు తెలిపారు. ఖమ్మం జిల్లా నుంచి మన జిల్లాలో కొత్తగా కుకునూరు, వేలేరుపాడు మండలాలు కలిసిన దృష్ట్యా మావోయిస్టుల కదలికలపైనా గట్టి నిఘా పెట్టామని చెప్పారు. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు, బలవంతపు వసూళ్లకు పాల్పడితే అటువంటి వారి వివరాలను పోలీసులకు తెలియజేయాలని ఎస్పీ సూచించారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఏవీ సుబ్బరాజు, చింతలపూడి సీఐ రమేష్ పాల్గొన్నారు. -
మతోన్మాదంపై పోరాడుదాం
శ్రీకాకుళం అర్బన్: మతోన్మాదానికి వ్యతిరేకంగా అందరం కలసి పోరాడుదాం అని.. దీనిపై ప్రజలంతా పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉందని సీపీఐ(ఎంఎల్) న్యూడె మోక్రసీ పేర్కొంది. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ శ్రీకాకుళంలోని వైఎస్సార్ కూడలి వద్ద శనివారం మతోన్మాదానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేపట్టింది. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ మాట్లాడుతూ డిసెంబర్ 6ని బ్లాక్ డే గా ప్రకటించాలన్నారు. అభివృద్ధి, గుజరాత్ నమూనా అని బీజేపీ పెద్ద ఎత్తున సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం చేసి మైనారిటీల ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చిందన్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క యూపీలోనే 605 మతోన్మాద సంఘటనలు జరిగాయని జాతీయ మీడియా ప్రకటించిందని పేర్కొన్నారు. మహారాష్ట్రలో కూడా చాలా చోట్ల మత ఉద్రిక్తతలు జరిగాయన్నారు. దీని వెనుక బీజేపీ సంఘ్ పరివార్ శక్తులు హస్తం ఉందన్నారు. జామియా మసీదు అధ్యక్షుడు మీర్ సభికుల్లా మాట్లాడుతూ మా ఆస్థులకు, మాకు రక్షణ కల్పిస్తామని రాజ్యాంగంలో రాసినా అవి ఆచరణకు నోచుకోవడం లేదన్నారు. చంపాగల్లీ మసీదు అధ్యక్షుడు షేక్ అల్లీజాన్ మాట్లాడుతూ ప్రజలంతా ఒక్కటే అని అన్ని మతాలు చెబుతున్నాయని, వాటిని పక్కన పెట్టి దాడులు చేయడమంటే దీని వెనుక రాజకీయ కోణం ఉందని స్పష్టమవుతోందన్నారు. జనా నా మసీదు అధ్యక్షుడు ఎం.డి.హర్షద్ మాట్లాడుతూ బాబ్రీ మసీదును కూల్చడం అంటే మానవహక్కులను కాలరాయడమేనన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కూడలి వద్ద నుంచి ర్యాలీగా బయలుదేరి కళింగ రోడ్ మీదుగా పాతబస్టాండ్‌కు అక్కడ నుంచి చిన బరాటంవీధి నుంచి జీటీరోడ్కు అక్కడ నుంచి మరలా వైఎస్సార్ కూడలికి ర్యాలీ తీశారు. కార్యక్రమంలో అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.వెంకట్రావు, అరుణోదయ ప్రతినిధులు ఎం.మల్లేశ్వరరావు, ఎస్.దుర్గ, కె.కృష్ణవే ణి, షాను, రవూఫ్, జిలానీ, రహ్మన్, సయ్యద్ జిలానీ పాల్గొన్నారు. -
జనాగ్రహం
న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో వినూత్న ప్రదర్శన టేకులపల్లి : జనం కన్నెర్రజేశారు. రైతులు, ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందంటూ ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు. టేకులపల్లిలో వినూత్న ప్రదర్శన నిర్వహించి సర్కారు వైఖరిని ఎండగట్టారు. సీపీఐ(ఎంఎల్)-న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఈ నిరసన శుక్రవారం జరిగింది. మాంటిస్సోరీ స్కూల్ సమీపంలోని గ్రౌండ్ నుంచి బయల్దేరిన ఈ ప్రదర్శన తహశీల్దార్ కార్యాలయం వరకు కొనసాగింది. అనంతరం తహశీల్దార్ కార్యాలయాన్ని ఆందోళనకారులు ముట్టడించారు. అనంతరం న్యూడెమోక్రసీ నాయకులు తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. పింఛను రాలేదనే మనస్తాపంతో గుండెపోటు వచ్చి మరణించిన వృద్ధులుగా అరుణోదయ కళాకారులు ర్యాలీ సందర్భంగా చేసిన అభినయం సమకాలిన పరిస్థితులకు అద్దం పట్టింది. ఈ సందర్భంగా సీపీఐ(ఎంఎల్)-న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ ప్రజల కష్టాలు తీర్చే తీరక లేదన్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవర్తిస్తున్నారనివిమర్శించారు. బంగారు తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పిన ఆయన అందుకు విరుద్ధంగా వ్యవరిస్తున్నారన్నారు. తమ బతులు బాగుపడతాయనే నమ్మకంతో అధికారంలోకి తెచ్చిన ప్రజలను టీఆర్ఎస్ సర్కారు విస్మరించిందని ధ్వజమెత్తారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని, అర్హులైన వారికి రేషన్‌కార్డులు ఇవ్వాలని, పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని, గిరిజనుల భూముల్లో ఫారెస్టు అధికారుల దారులు, పంట ధ్వంసం చర్యలను నిలిపివేయాలని అన్నారు. కార్యక్రమంలో గుర్రం అచ్చయ్య, ఎట్టి ప్రసాద్, డి.ప్రసాద్, ధర్మపురి వీరబ్రహ్మాచారి, జర్పుల సుందర్, గణితి కోటేశ్వరరావు, రాంచంద్, రాములు, పోతయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఆంధ్ర అధికారి మాకొద్దు..
తిరుమలాయపాలెం : బదిలీపై వచ్చిన ఎంపీడీఓకు చుక్కెదురైంది. ఆంధ్రకు చెందిన అధికారి ఇక్కడ పనిచేయడానికి వీల్లేదంటూ ఎంపీపీ సహా సీపీఐ, న్యూడెమోక్రసీ నాయకులు అడ్డుకున్నారు. ఈ ఘటన తిరుమలాయపాలెంలో మంగళవారం చోటుచేసుకుంది. విజయనగరానికి చెందిన సన్యాసయ్య ఖమ్మం జిల్లా గుండాలలో గతంలో ఎంపీడీఓగా పనిచేశారు. ఎన్నికల నేపథ్యంలో వరంగల్ జిల్లా కేసముద్రానికి బదిలీ అయ్యారు. ఎన్నికల అనంతరం ఎక్కడి వారిని అక్కడికి తిరిగి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనారోగ్యం కారణంగా సన్యాసయ్య కేసుముద్రం నుంచి రిలీవ్ కాలేదు. ఈ క్రమంలో సన్యాసయ్యను తిరుమలాయపాలెం ఎంపీడీఓగా నియమిస్తూ జిల్లా పరిషత్ సీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో బాధ్యతలు స్వీకరించడానికి వచ్చిన సన్యాసయ్యను ఎంపీపీ అశోక్ అడ్డుకున్నారు. ఆంధ్రకు చెందిన వ్యక్తి ఇక్కడ ఎలా పనిచేస్తారని నిలదీశారు. స్థానిక ఎమ్మెల్యే, జడ్పీ చైర్పర్సన్ అనుమతి లేకుండా ఎలా బాధ్యతలు స్వీకరిస్తారని ప్రశ్నించారు. ఇన్చార్జ్ ఎంపీడీఓ జాఫర్ ఖాన్ కూడా బాధ్యతలు ఇచ్చేందుకు నిరాకరించారు. ఉదయ 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ తతంగం జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారుల ఆదేశాలతో బదిలీపై వచ్చిన ఎంపీడిఓకి భాద్యతలు అప్పగించ ని వైనమిది. బాద్యతలు స్వీకరించేందుకు వచ్చిన ఎంపీడిఓ గంటల తరబడి కార్యలయంలో వేచి చూసి బాధ్యతలు అప్పగించేందుకు ఇన్చార్జీ ఎంపీడిఓ ముందుకు రాకపోవడంతో జిల్లా అధికారులతో సంప్రదించి ఎంపీడిఓగా సన్యాసయ్య అజ్యూమ్డ్ చార్జీ తీసుకుని బాద్యతలు తీసుకుని ఎంపీడిఓ సీటులో ఆశీనులయ్యారు. ఈ పరిణామం ప్రాంతీయ వివాదాలు కారణం అయ్యింది. తన అనుమతి లేకుండా ఎంపీడిఓ ఎలా జాయిన్ అవుతారని ఎంపిపి అసహనం వ్యక్తం చేసారు. ఈ వ్యవహారంతో పాటు కొందరు రాజకీయ పార్టీల నాయకులు కూడా ఆంద్రా ప్రాంతానికి చెందిన అధికారి తమకు వద్దంటు ఎంపీడిఓ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ సంఘటనకు సంబందించిన వివరాలిలా ఉన్నాయి. అజ్యూమ్డ్ చార్జ్‌తో సన్యాసయ్య ఎంపీడీఓగా స్వతహాగా బాధ్యతలు తీసుకుని విధుల్లో చేరి పోయారు. ఈ పరిణామాలను ఎంపీపీ జిల్లా ఉన్నతాధికారులకు వివరించారు. ప్రజాప్రతినిధుల మాటను లెక్క చేయకుండా బాధ్యతలు తీసుకోవడమేమిటని అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సన్యాసయ్య విధుల్లో చే రొద్దంటూ సీపీఐ, న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా జరిగిం ది. సన్యాసయ్యకు బాధ్యతలు అప్పగించొద్దం టూ ఇన్చార్జ్ ఎంపీడీఓ జాఫర్ ఖాన్‌కు ఆ పా ర్టీల నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే సన్యాసయ్య ఎంపీడీఓ హోదాలో తహశీల్దార్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. -
నేడు ఎంపీపీ ఎన్నికలు
49 మండలాల్లో ఏర్పాట్లు పూర్తి మంగపేటలో ఎన్నిక వాయిదా టీఆర్ఎస్కే ఆధిక్యత వచ్చే వకాశం కాంగ్రెస్‌కు 18 చోట్ల మెజారిటీ.. అయినా ఆ పార్టీకి ఎంపీపీ పీఠం దక్కడంపై అనుమానాలు హంగ్ నెలకొన్న 14 స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించిన పార్టీలు సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఎన్నికల ఫలితాలు వచ్చిన 40 రోజుల తర్వాత మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికలు శుక్రవారం జరగనున్నాయి. జిల్లాలో మొత్తం 50 ఎంపీపీ స్థానాలుండగా... మంగపేట మినహా మిగిలిన అన్నింటికీ ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ ఎంపీటీసీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. లోకల్ పోరు కావడంతో స్థానిక అభ్యర్థుల బలంపైనే పార్టీలకు అధిక స్థానాలు వచ్చాయి. జిల్లావ్యాప్తంగా 705 ఎంపీటీసీ స్థానాలు ఉండగా... కాంగ్రెస్‌కు 294, టీఆర్ఎస్కు 225, టీడీపీకి 128, బీజెపీ 12 స్థానాలు దక్కాయి. స్వతంత్రులు 46 స్థానాల్లో గెలుపొందారు. ఈ ఫలితాల రోజు సరళిని బట్టి కాంగ్రెస్‌కు 18, టీఆర్ఎస్ 14, న్యూడెమొక్రసీ ఒక ఎంపీపీ పదవిని కైవసం చేసుకునే పరిస్థితి నెలకొంది. అరుుతే... మారిన రాజకీయ సమీకరణలు.. పొత్తులు ఈ ఎన్నికలపై ప్రభావం చూపనున్నారుు. కాంగ్రెస్‌కు మెజారిటీ ఎంపీటీసీ స్థానాలున్న మంగపేట మండల పరిషత్ ఎన్నిక కోర్టు ఆదేశాలతో వాయిదా పడింది. టీఆర్ఎస్ ముమ్మర యత్నాలు సాధారణ ఎన్నికల ఫలితాల అనంతరం పరిస్థితి మారింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో క్యాంపుల నిర్వహణ జోరందుకుంది. అధికారంలో ఉన్న పార్టీగా జిల్లాలోని మెజారిటీ ఎంపీపీ పదవులను కైవసం చేసుకునేందుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. విజయం సాధించిన స్వతంత్ర ఎంపీటీసీ అభ్యర్థులను తమ వైపునకు తిప్పకునేందుకు టీఆర్ఎస్ అన్ని రకాలుగా యత్నించింది. జిల్లాలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఉండడంతో ఎంపీపీ ఎన్నికలు వారికి ప్రతిష్టాత్మకంగా మారాయి. మెజారిటీ ఎంపీపీ పదవులు టీఆర్ఎస్కు దక్కాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. టీఆర్ఎస్కు మెజారిటీ తక్కువగా ఉన్న మండలాల్లో ప్రత్యర్థి పార్టీల ఎంపీటీసీలకు వల వేస్తున్నారు. అధికార పార్టీగా అభివృద్ధి పనులు, వ్యక్తిగతంగా సహకరిస్తామని హామీలు ఇస్తున్నారు. ఏ మాత్రం మెజారిటీ లేని కొన్ని మండలాల్లోనూ ప్రత్యర్థి శిబిరాన్ని మొత్తంగా టీఆర్ఎస్లో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 14 మండలాలపైనే అందరి దృష్టి జిల్లాలోని 14 మండలాల్లో ఎంపీపీని కైవసం చేసుకునే విషయంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. స్వతంత్రులు, టీడీపీ, సీపీఐ పార్టీల నుంచి గెలిచిన ఎంపీటీసీ సభ్యులకు డిమాండ్ పెరిగింది. కొంతమందిని బలవంతంగానైనా క్యాంపులకు తరలించారు. మరికొంత మంది క్యాంపులకు వెళ్లకుండానే... మంతనాలు జరుపుతున్నారు. ఎంపీపీ పీఠం కోసం కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎంపీటీసీ సభ్యులకు ఇరుపార్టీల నేతలు తాయిలాలు సైతం ప్రకటిస్తున్నారు. టీడీపీ, బీజేపీ నుంచి గెలిచిన వారిని తమతో కలుపుకునేందుకు పోటీ పడుతున్నారు. అవసరమైతే వైస్ చైర్మన్ పదవిని అప్పగించేందుకు ఆశ చూపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 14 మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. టీపీసీసీ చీఫ్ ప్రాతినిధ్యం వహిస్తున్న జనగామ మండలంలో హంగ్ ఏర్పడింది. ఇక్కడ 11 ఎంపీటీసీ స్థానాలుంటే కాంగ్రెస్-5, టీఆర్ఎస్-3, స్వతంత్రులు-2, టీడీపీ ఒక్క స్థానంలో గెలిచింది. ఇందులో ఇద్దరు స్వతంత్రులు టీఆర్ఎస్లో చేరగా ఆ పార్టీ బలం ఐదుకు చేరుకుంది. దీంతో నువ్వా.. నేనా.. అన్నట్లు టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోరు సాగుతోంది. ఇక్కడ టీడీపీ సభ్యుడి మద్దతు కీలకం కానుంది. ఇక.. పాలకుర్తి, కేసముద్రం, గోవిందరావుపేట, ములుగు, వెంకటాపురం, నల్లబెల్లి, మొగుళ్లపల్లి, గీసుగొండ, పరకాల, రేగొండ, ఆత్మకూరు, జఫర్‌గఢ్, లింగాలఘణపురం మండలాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. హన్మకొండ, రాయపర్తి మండలాల్లో విలక్షణ పరిస్థితి నెలకొంది. హన్మకొండ మండల పరిధిలో రెండు ఎంపీటీసీ స్థానాలే ఉన్నాయి. వీరిలో ఒకరు అధ్యక్షుడిగా, మరొకరు ఉపాధ్యక్షుడిగా ఎన్నికకానున్నారు. కొత్తగూడ ఎంపీపీ పీఠం న్యూడెమోక్రసీ కైవసం కానుంది. -
లొంగిపోండి..!
ఇల్లెందు: సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ అజ్ఞా త దళాలపై పోలీసుల వైఖరి మారుతోందా..? లొంగిపోవాల్సిందిగా ఈ దళాల నేతలను, సభ్యులను పోలీసులు ఒత్తిడి చేస్తున్నారా? ఏజెన్సీలోని పరిణామాలను పరిశీలిస్తే.. ‘ఔను’ అనే సమాధానమే వస్తోంది. ఇల్లెందు సబ్ డివిజన్లో న్యూడెమోక్రసీ పార్టీ రాయల, చంద్రన్న వర్గాలుగా చీలిపోయిన నేపథ్యంలోనే పోలీసుల నుంచి ఇలా ఒత్తిడి పెరిగినట్టు తెలిసింది. అజ్ఞాత దళ నేతలు మధు, లింగన్న, అశోక్, రాము, ఐలయ్య, యాకన్న ఇళ్లకు పోలీసులు వెళ్లారని, ‘లొంగిపోవాల్సిందిగా మీ వాళ్లతో చెప్పండి’ అని, వారి కుటుంబీకులను హెచ్చరించారని సమాచారం. ఇదే విషయాన్ని న్యూడెమోక్రసీ నేత గుమ్మడి నర్సయ్య ఇటీవల విలే కరుల సమావేశంలోనూ చెప్పారు. ఏజెన్సీ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోగల అజ్ఞాత దళ నేతలు, సభ్యుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారని సమాచారం. అసలు కారణాలు ఇవేనా... లొంగిపోవాలంటూ అజ్ఞాత దళాలపై పోలీసు లు ఒత్తిడి పెంచడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు చెబుతున్నారు.ఒక కారణం- న్యూడెమోక్రసీ పార్టీ రెండు గ్రూపులు(రాయల, చంద్రన్న)గా విడిపోయిన నేపథ్యంలోనే పోలీసుల ఒత్తిడి పెరిగింది. ఈ రెండు గ్రూపుల మధ్య విభేదాలు మరింత ము దిరిందని, పరస్పరం శతృత్వ భావం ఏర్పడుతోందని, ఇది మున్ముందు శాంతి భద్రతల సమస్యకు దారితీయవచ్చని పోలీసులు అంచ నా వేశారు. ఈ నేపథ్యంలోనే.. అజ్ఞాత దళాల సభ్యులను, నేతలను లొంగదీసేందుకు ఏక కాలంలో ఒత్తిడి పెంచారు. రెండో కారణం- ఇల్లెందు మండలంలోని నెహ్రూనగర్‌లో అడవిని కొందరు నరికివేసి పోడు చేస్తున్నారు. వీరికి న్యూడెమోక్రసీలోని అజ్ఞాత దళాలు అండగా నిలుస్తున్నాయి. అటవీ అధికారులకు ఇది తలనొప్పి వ్యవహారంగా మారింది. అడవిని నరుకుతున్న వారికి అజ్ఞాత దళాలు అండగా నిలుస్తున్నాయని, తమ విధి నిర్వహణకు ఇవి ఆటంకంగా ఉన్నాయని, అంతిమంగా.. శాంతిభద్రతల సమస్య ఏర్పడే ప్రమాదముందని పోలీసులకు అటవీ అధికారులు ఫిర్యాదు చేశారు. ప్రధానం గా ఈ రెండు కారణాల నేపథ్యంలోనే అజ్ఞాత దళాల లొంగుబాటుకు పోలీసులు ఒత్తిడి పెం చినట్టు పరిశీలకులు భావిస్తున్నారు. -
తక్షణమే రుణమాఫీ అమలుచేయాలి
పలాస : టీడీపీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొనట్లు రుణమాఫీ తక్షణమే అమలు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేసింది. పలాసలోని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో బుధవారం అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షురాలు పైల చంద్రమ్మ అధ్యక్షతన జిల్లా కార్యవర్గం సమావేశం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వి.మాధవరావు మాట్లాడుతూ ప్రభుత్వం షరతులు లేని రుణమాఫీని అమలు చేసి కొత్త రుణాలను అందజేయాలన్నారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతోందని, వ్యవసాయ పెట్టుబడులకు, పరికరాలకు రుణాలు అవసరమన్నారు. జిల్లా రైతాంగానికి 70 వేల క్వింటాళ్ల వరివిత్తనాలు అవసరమని, 49 వేల క్వింటాళ్లే అవసరమని అధికారులు ప్రకటించారన్నారు. రైతులకు అవసరమైన అన్ని విత్తనాలను అందజేయాలని, బ్లాక్ మార్కెట్‌కు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గొరకల బాలకృష్ణ, వంకల పాపయ్య, రాపాక మాధవరావు, ఎస్.సోమేశ్వరరావు, ఎం.తాతారావు, కె.సోమేశ్వరరావు పాల్గొన్నారు. -
ఆర్డినెన్స్‌ను అడ్డుకునేందుకు... కొమరం భీంలా పోరాడదాం
వేలేరుపాడు, న్యూస్‌లైన్: పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసేందుకు జారీ చేసిన ఆర్డినెన్స్‌ను అడ్డుకునేందుకు ఆదివాసీలంతా కొమరం భీం మాదిరిగా పోరాడాలని న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు పిలుపునిచ్చారు. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా వేలేరుపాడు మండలంలోని మారుమూలనున్న కొయిదాలో అఖిలపక్షం ఆధ్వర్యంలో శనివారం జరిగిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఇక్కడ ఏర్పాటైన సభలో పోటు రంగారావు మాట్లాడుతూ.. ఆంధ్రాలోని బడా పారిశ్రామికవేత్తల స్వప్రయోజనాల కోసం ఇక్కడి ఆదివాసీలను ప్రధాని మోడీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నీట ముంచుతున్నారని ధ్వజమెత్తారు. విలీనంపై పార్లమెంటులో, అసెంబ్లీలో ఎలాంటి చర్చ జరపకపోవడం వెనుక ఏపీ పెద్దల కుట్ర ఉందన్నారు. ఆర్డినెన్స్ రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా దశల వారీగా ఆందోళన చేపట్టనున్నట్టు చెప్పారు. జూన్ 2వ తేదీన ముంపు మండలాల్లో బ్లాక్ డే జరపనున్నట్టు చెప్పారు. 20 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర కొయిదాలో శనివారం ప్రారంభమైన పాదయాత్ర రాత్రికి 20 కిలోమీటర్ల దూరంలోగల కన్నాయిగుట్టకు చేరింది. ఈ పాదయాత్రకు గిరిజన గ్రామాల్లో విశేష స్పందన లభించింది. మేడేపల్లి నుంచి మరో బృందం ప్రారంభించిన పాదయాత్ర మల్లారం వరకు సాగింది. ఈ పాదయాత్రలో న్యూడెమోక్రసీ నాయకులు ఎస్కె.గౌస్, గోకినేపల్లి వెంకటేశ్వరావు, సీపీఐ అశ్వారావుపేట నియోజకవర్గ కన్వీనర్ ఎండి.మునీర్, వైఎస్ఆర్ సీపీ మండల కన్వీనర్ కేసగాని శ్రీనివాస గౌడ్, వివిధ పార్టీల నాయకులు కారం దారయ్య, అమరవరపు అశోక్, ఎస్కె.నజీర్, వలపర్ల రాములు, గిల్లా వెంకటేశ్వర్లు, పూరెం లక్ష్మయ్య, గడ్డాల ముత్యాల్రావు తదితరులు పాల్గొన్నారు. -
ఉక్కు పరిశ్రమ బయ్యారంలోనే స్థాపించాలి
ఖమ్మంసిటీ, న్యూస్‌లైన్ : బయ్యారంలోనే ఉక్కు పరిశ్రమను స్థాపించాలని సీపీఐ(ఎంఎల్)-న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా ఆందోళన నేపథ్యంలో బయ్యారంలోనే ఉక్కు పరిశ్రమను స్థాపిస్తామని గత ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. ఆ మేరకే ఫ్యాక్టరీ నిర్మించాలన్నారు. బయ్యారంలో లక్ష ఎకరాలకు పైగా ఐరన్ ఓర్ నిల్వలు, దీనికి కావాల్సిన మరో ముడి ఇంధనం డోలమైట్ 20 కిలోమీటర్ల దూరంలో మాదారంలో ఉందని తెలిపారు. బయ్యారం చెరువు, మున్నేరు ద్వారా కావాల్సిన నీరు పుష్కలంగా ఉందని పేర్కొన్నారు. బయ్యారానికి ప్రధాన రైల్వేమార్గం 14 కిలోమీటర్ల దూరంలోనే ఉందని, ఈ ప్రాజెక్టుకు కావాల్సిన బొగ్గు 20, 30 కిలోమీటర్ల దూరంలోనే లభిస్తుందని చెప్పారు. ఉక్కు పరిశ్రమను బయ్యారంలో వెంటనే ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. సెయిల్ అధికారులు క్షేత్రస్థాయి పర్యటన పేరుతో రాజకీయ వత్తిడిల మాటున బయ్యారం ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చే ఆలోచన సమంజసం కాదన్నారు. పాల్వంచలో గతంలో నిర్మించిన స్టీల్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలి తప్ప బయ్యారంలో ప్రతిపాదించిన ఫ్యాక్టరీని అక్కడకు తరలించడం సరి కాదన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, కెచ్చెల రంగయ్య, అరుణోదయ నాగన్న, గోకినేపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. తరలిస్తే సహించం : టీఆర్ఎస్ ఇల్లెందు : బయ్యారంలో నిర్మించాల్సిన ఉక్కు పరిశ్రమను జిల్లాలోని ఇతర ప్రాంతానికి తరలిస్తే సహించేది లేదని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్, నియోజకవర్గ కన్వీనర్ ఊకె అబ్బయ్య అన్నారు. ఇల్లెందులో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మూడేళ్లుగా నిర్వహించిన పోరాటం ఫలితంగాా పరిశ్రమ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చిందని, పలు కారణాలు సాకుగా చూపి ఈ పరిశ్రమను కొత్తగూడెం మండలానికి తరలించే యత్నం చేయడం సరికాదని అన్నారు. ఇదే జరిగితే ఇక్కడి ప్రజలు ముఖ్యంగా గిరిజనులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. కొత్తగూడెం మండలం రేగళ్ల ప్రాంతంలో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, పాల్వంచలో రేణుకా చౌద రి భూములు ఉన్నాయని తెలిపారు. పీవీ కుటుంబంతోపాటు రేణుకా చౌదరికి ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో ఉక్కు పరిశ్రమను అక్కడ స్థాపించేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో అధికారం చేపట్టే నరేంద్ర మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ఈ అంశాన్ని పరిశీలించి ఇల్లెందు, బయ్యారం, కారేపల్లి మండలాల సరిహద్దులో స్టీల్ పరిశ్రమను నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు పులిగండ్ల మాదవరావు, లాకావత్ దేవీలాల్ నాయక్, కౌన్సిలర్ జానీపాషా, కంభంపాటి కోటేశ్వరరావు, సిలివేరు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. బయ్యారంలోనే ఏర్పాటు చేయాలి : ఎమ్మెల్యే కోరం బయ్యారం : ఉక్కు పరిశ్రమను బయ్యారంలోనే స్థాపించాలని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య డిమాండ్ చేశారు. బయ్యారం పెద్ద చెరువు వద్ద గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇనుపరాయి గనులున్న బయ్యారం మండలంలో అన్ని వనరులున్నప్పటికీ కొందరు ఇతర ప్రాంతంలో పరిశ్రమను నిర్మించే ప్రయత్నాలు చేయటం తగదన్నారు. విలేకరుల సమావేశంలో మూల మదుకర్‌రెడ్డి, ఎనుగుల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘ఉద్యమం’పై దాడి చేసిన వారికి టికెట్లా?
టీఆర్ఎస్కు న్యూడెమోక్రసీ ప్రశ్న నారాయణ ప్రజాస్వామిక వాది కాదు మంద కృష్ణమాదిగ పార్టీకి మద్దతిస్తాం రెండు ప్రాంతాల్లో 20 అసెంబ్లీ, 6లోక్‌సభ సీట్లకు పోటీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఉద్యమకారులపై దాడులు జరిపి, పాలకవర్గాలకు వత్తాసు పలికిన వారికి టీఆర్ఎస్ టికెట్లు ఇవ్వడమేమిటని జేఏసీ భాగస్వామ్య పక్షమైన సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ (చంద్రన్న వర్గం) ప్రశ్నించింది. ‘కొండా సురేఖ, మహేందర్‌రెడ్డి వంటి వాళ్లకు గులాబీ కండువాలు కప్పి టికెట్లు ఇస్తారా? ఉద్యమ స్ఫూర్తి అంటే ఇదేనా?’ అని నిలదీసింది. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సాధినేని వెంకటేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు కె.గోవర్దన్ మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. రెండు కళ్ల సిద్ధాంతం పేరిట తెలంగాణను ఎన్నడూ సమర్థించని టీడీపీ వాళ్లకు, 12వందల మంది ఆత్మహత్యలకు కారణమైన కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్లకు టికెట్లు ఇవ్వడమంటే అమరవీరుల త్యాగాలను అవమానించడమేనన్నారు. తాము సమర్థించే ప్రజాస్వామిక వాదుల్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ లేరని, ఖమ్మంలో సీపీఐ, సీపీఎంలను ఓడించడానికే పని చేస్తామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ నేత కేకే కూడా ఎన్నికల్లో పోటీ విషయమై తమతో మాట్లాడినప్పటికీ మద్దతు ఇచ్చేందుకు, తీసుకునేందుకు సిద్ధంగా లేమని చెప్పినట్టు గోవర్దన్ తెలిపారు. మంద కృష్ణమాదిగ నాయకత్వంలోని మహాజన సోషలిస్టు పార్టీకి, మరికొన్ని విప్లవ, ప్రజాస్వామిక శక్తులకు మద్దతిస్తామన్నారు. తాము రాష్ట్రవ్యాప్తంగా 20 అసెంబ్లీ, 6లోక్‌సభ సీట్లకు పోటీ చేస్తున్నట్టు తెలిపారు. తమ పార్టీకి గట్టిపట్టున్న ఇల్లెందు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి యదళ్లపల్లి సత్యంను బరిలోకి దింపామన్నారు. అసెంబ్లీకి పోటీ చేసే ఇతర అభ్యర్థుల వివరాలు... కొమరం సత్యనారాయణ (పినపాక), కుంజా దూలయ్య (భద్రాచలం), తిమ్మిడి సైదమ్మ (పాలేరు), లావడ్యా రాజు (మహబూబాబాద్), బూర్క వెంకటయ్య (ములుగు), తోటకూరి రాజు (నర్సంపేట్), హెచ్.లింగ్యా (డోర్నకల్), రాచకొండ గీత (ఆలేరు), దాముక లక్ష్మణ్ (రామగుండం), ఎండీ చాంద్ పాష (మంచిర్యాల), కె.సంపత్‌కుమార్ (బెల్లంపల్లి), బి.భాస్కర్ ఎలియాస్ పంచాక్షరి (నిజమాబాద్ రూరల్), పల్లాల మాధవరెడ్డి (రంపచోడవరం), ఎం.ఏసు (జగ్గంపేట), జె.సత్తిబాబు (రాజానగరం), గుర్రాల దయామణి (రామచంద్రాపురం), సీహెచ్ వసంతరావు (పోలవరం), బెజ్జం శ్రీనివాసరావు (బాపట్ల), ఎల్బీ కుటుంబరావు (విజయవాడ సెంట్రల్), కాకినాడ రూరల్‌లో స్వతంత్ర అభ్యర్థి గణేశుల శ్రీనివాస్‌కు మద్దతు. పార్లమెంటు స్థానాలు: భుక్యా లక్ష్మణ్ (మహబూబాబాద్), జిన్నా రమ (పెద్దపల్లి), చీకట్ల వెంకటేశ్వరరావు (రాజమండ్రి), వి.చిట్టిబాబు (కాకినాడ), ఉండ్రు గనిరాజు (అమలాపురం), సున్నం బాల్ దొర (అరకు). -
టీఆర్ఎస్తో పొత్తు యోచన
సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి వెల్లడి లోక్‌సభ ఎన్నికలకు 42 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్, న్యూడెమోక్రసీలతో పొత్తు పెట్టుకోవాలని యోచిస్తున్నట్లు సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి తెలిపారు. అయితే దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, టీఆర్ఎస్ ఏ పార్టీతో పొత్తుపెట్టుకుంటుందో తెలిసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని అజయ్భవన్లో సీపీఐ జాతీయ నాయకులు డి.రాజా, అతుల్ కుమార్‌సింగ్ అంజన్‌లతో కలిసి సురవరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర విభజనకు తమ పార్టీ అనుకూలమైనందున తెలంగాణలో సీపీఎంతో కలిసి వెళ్లే పరిస్థితి లేదన్నారు. సీమాంధ్రలో ఏ పార్టీతో కలిసి వెళ్లాలో ఇంకా తేలనందున ఏపీలో అభ్యర్థులను ప్రకటించలేదని తెలిపారు. దేశవ్యాప్తంగా సీపీఐ 60 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్టు సురవరం తెలిపారు. 17 రాష్ట్రాలలోని వివిధ లోక్‌సభ స్థానాలకు సీపీఐ తరఫున బరిలోకి దిగనున్న 42 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఆయన ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలపై సురవరం విమర్శలు గుప్పించారు. అధికారంలోని కాంగ్రెస్ తప్పుడు విధానాల వల్ల ద్రవ్యోల్బణం, అవినీతి మితిమీరాయని, అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీదీ అదే ధోరణి అని ధ్వజమెత్తారు. ఆర్థిక, విదేశాంగ విధానాల్లో ఆ రెండు పార్టీలకూ తేడా లేదన్నారు. దేశంలో ప్రత్యామ్నాయాన్ని నిర్మించాలని 11 పార్టీలతో ఫిబ్రవరి 25న ఢిల్లీలో చేసిన తీర్మానాన్ని సీపీఐ బలపరుస్తుందన్నారు. సురవరం ఇంకా ఏమన్నారంటే... తొలి జాబితాలో 10 మంది ఎస్టీలు, నలుగురు చొప్పున ఎస్సీలు, మైనార్టీలు, మహిళా అభ్యర్థులకు చోటు దక్కింది. రెండో జాబితాలో మరికొంతమంది మైనార్టీలు, మహిళలకు అవకాశం కల్పిస్తాం. అవకాశం ఉన్న చోట్ల సెక్యులర్ పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీచేస్తాం. సీపీఐ, సీపీఎంలు పరస్పరం పోటీచేసుకోకుండా వీలైనంతవరకూ ఒకరినొకరు బలపరుచుకునేందుకు ప్రయత్నిస్తాం. తెలంగాణలో సీపీఐ, సీపీఎంలు భిన్న వైఖరులు తీసుకున్నందున కలిసి ఉండేందుకు ఇబ్బందులున్నా.. సీమాంధ్రలో కలిసి పోటీచేసేందుకు మాత్రం ఎలాంటి అభ్యంతరం లేదు. {పస్తుత ఎన్నికలు ప్రాంతాల వారీగానే జరుగుతాయి. రాష్ట్రం ఏర్పడ్డాకే రెండు కమిటీలను ఏర్పాటు చేస్తాం. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీపెట్టేదే సమైక్యవాదంతో కాబట్టి ఆ పార్టీతో ఎట్టిపరిస్థితుల్లోనూ పొత్తు ఉండదు. సినీనటుడు పవన్‌కల్యాణ్ పార్టీ పెడతారో లేదో ఇంకా తెలియదు. ఆ పార్టీ విధానాలేంటో తెలియకుండానే దానిపై ఇప్పుడే చర్చించబోము. సీపీఐ తొలి జాబితాలోని ప్రముఖులు వీరే.. ప్రబోధ్ పండా, సిట్టింగ్ ఎంపీ (మిడ్నాపూర్, పశ్చిమబెంగాల్), అతుల్ కుమార్ అంజన్ (ఘోషి, యూపీ), సంతోష్ రాణా, ఎమ్మెల్యే (ఘాతల్, పశ్చిమబెంగాల్), నురుల్ హుడా (బషిర్హత్, పశ్చిమబెంగాల్), కాగా సీనియర్ నేత గురుదాస్ దాస్‌గుప్తా ఈ ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. -
బంద్ విజయవంతం
ఖమ్మం, న్యూస్‌లైన్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో జిల్లాలోని వందలాది గ్రామాలను నీట ముంచడాన్ని వ్యతిరేకిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో గురువారం తలపెట్టిన జిల్లా బంద్ విజయవంతమైంది. సీపీఎం, సీపీఐ, సీసీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. ప్రధాన రహదారులపై రాస్తారోకో చేశారు. విద్యార్థి సంఘాలు, ఆయా పార్టీలకు చెందిన మహిళా, యువజన విభాగాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు, మోటార్‌సైకిల్ ర్యాలీలు చేపట్టారు. భద్రాచలం, పాల్వంచ డివిజన్ల పరిధిలోని ముంపు ప్రాంతాల ప్రజలు, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో జలదీక్షలు చేశారు. బస్సులు బయటకు రాకుండా బస్టాండ్, డిపోల ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆందోళనకారులకు పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. తెలంగాణ జేఏసీ అనుబంధ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలోనూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. పలువురు ఉద్యోగులు భోజన విరామ సమయంలో కార్యాలయాల ఎదుట నిరసన తెలిపారు. పలు చోట్ల ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలను మూసివేశారు. జిల్లా వ్యాప్తంగా వ్యాపార సముదాయాలు తెరుచుకోకపోవడంతో ని త్యం కలకళలాడే వ్యాపార కూడళ్లు వెలవెలబోయాయి. పెట్రోల్ బంక్‌లు తెరుచుకోలేదు. బ్యాంకులు మూసివేయడంతో కోట్ల రూపాయల లావాదేవీలు స్తంభించిపోయాయి. ఖమ్మంలో సీపీఎం, సీపీఐ, టీఆర్ఎస్, న్యూడెమోక్రసీ కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించి దుకాణాలను బంద్ చేయించారు. పోలవరం డిజైన్ మార్చాలని, భద్రాచలం, పాల్వంచ డివిజన్లలోని మండలాలను ఖమ్మం జిల్లాలో ఉంచాలని డిమాండ్ చేస్తూ సీపీఎం, మహిళా సంఘం కార్యకర్తలు బస్టాండ్ ఎదుట ధర్నా చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరగడంతో ఐద్వా నాయకురాలు గట్టు రమాదేవికి స్వల్ప గాయాలయ్యాయి. సీపీఎం నాయకులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సీపీఐ ఆధ్వర్యంలోనూ మోటార్‌సైకిల్ ప్రదర్శన చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ పోలవరం ముంపు ప్రాంతాలను తెలంగాణలోనే కొనసాగించాలని నినాదాలు చేశారు. న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఖమ్మం బస్ డిపో వద్ద ధర్నా, అనంతరం నగరంలో ప్రదర్శన నిర్వహించారు. వీరికి మద్దతుగా టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు కూరపాటి రంగరాజు ప్రదర్శనలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు ఖమ్మంలో ప్రదర్శన నిర్వహించి పలు దుకాణాలను బంద్ చేయించారు. అనంతరం అఖిలపక్ష పార్టీలతో కలిసి మోటార్సైకిల్ర్యాలీ నిర్వహించారు. భద్రాచలం డివిజన్లో బంద్ సంపూర్ణంగా జరిగింది. టీజేఏసీ డివిజన్ అధ్యక్షుడు చల్లగుళ్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. దీంతో డివిజన్ వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు పడ్డాయి. బంద్ విజయవంతం కోసం సీపీఎం, సీపీఐ, టీడీపీ, న్యూడెమోక్రసీ, టీఆర్ఎస్ కార్యకర్తలు వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించారు. తుడుందెబ్బ ఆధ్వర్యంలో గోదావరి నదిలో జలదీక్ష చేపట్టారు. రాష్ట్రపతి పాలన ఉన్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సులను అడ్డుకోవటం, రాస్తారోకో, ధర్నాలు చేయడం తగదని పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేశారు. సీపీఎం నాయకులు అంబేద్కర్ సెంటర్లో ఆర్టీసీ బస్సుకు గాలి తీసేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డగించారు. కొత్తగూడెం నియోజకవర్గంలో బంద్ విజయవంతమైంది. బ్యాంకులు, వ్యాపార సముదాయాలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఉదయమే రోడ్లపైకి వచ్చిన సీపీఎం శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. బంద్ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. పాల్వంచలో కొన్ని చోట్ల వ్యాపార సముదాయాలు తెరిచే ఉంచారు. పినపాక నియోజకవర్గంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక, గుండాల మండల కేంద్రాల్లో అన్ని విద్యాసంస్థలు, వ్యాపార వర్గాలు బంద్‌లో పాల్గొని బంద్‌ను విజయంతం చేశాయి. సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి, పెనుబల్లి, తల్లాడ, కల్లూరు మండలాలలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు బ్యాంకులను అఖిలపక్ష నాయకులు బంద్ చేయించారు. సీపీఐ, సీపీఎం, టీఆర్ఎస్, న్యూడెమోక్రసీ నాయకులు పట్టణంలో ప్రదర్శనలు చేశారు. వైరా, కారేపల్లి, జూలూరుపాడు, ఏన్కూరు, కొణిజర్ల మండలాల్లో బంద్ సంపూర్ణంగా జరిగింది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలతో పాటు వ్యాపార సంస్థలు, అన్ని విద్యాసంస్థలు మూతబడ్డాయి. సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ, టీఆర్ఎస్ నాయకులు బంద్‌లో పాల్గొన్నారు. ఇల్లెందు నియోజకవర్గంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. పట్టణంలో ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. సబ్‌డివిజన్ వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు పడ్డాయి. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేట, ముల్కలపల్లి మండలాల్లో బంద్ జరగలేదు. ముల్కలపల్లి మండలంలో సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించగా, మిగిలిన అన్ని రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. పాలేరు నియోజకవర్గంలో బంద్ విజయవంతమైంది. ఖమ్మం రూరల్ మండలంలో సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేశారు. నేలకొండపల్లి మండలంలో టీఆర్ఎస్, సీపీఎం, న్యూ డెమోక్ర సీ, టీడీపీ కార్యకర్తలు ప్రభుత్వ కార్యాలయాలను, వాణిజ్య సముదాయాలను మూసివేయించారు. కూసుమంచి మండలంలో సీపీఎం, ఏఐఎస్ఎఫ్ నాయకులు దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలను మూసి వేయించారు. తిరుమలాయపాలెం మండలంలో న్యూడెమోక్రసి, సీపీఎం, సీపీఐ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. -
ఎర్రదండు గర్జన
ఖమ్మం/ ఖమ్మం సిటీ, న్యూస్‌లైన్: తెలంగాణ పునర్నిర్మాణం..జిల్లా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కదంతొక్కింది. పోరుగర్జన పేరిట ఖమ్మంలో బుధవారం భారీ ప్రదర్శన, బహిరంగసభ నిర్వహించింది. జిల్లావ్యాప్తంగా ఆ పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున ఈ సభకు తరలివచ్చారు. తమ సమస్యలపై గర్జించారు. సభా ప్రారంభానికి ముందు తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి ఆత్మశాంతి కోసం మౌనం పాటించారు. పలు రకాల డిమాండ్లను సభ ముందు ఉంచారు. ఆంక్షలు లేని ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పాటు, ముంపు ప్రాంతాలను తెలంగాణ నుంచి విడదీయరాదు, పోడు భూములకు పట్టాలివ్వాలి, మౌలిక వసతులు కల్పించాలి, గ్రీన్‌హంట్ ఆపరేషన్లు నిలిపివేయాలి, తెలంగాణ ఉద్యమ వీరుల విగ్రహాలను హైదరాబాద్, జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి, ఉద్యమంలో పాల్గొన్న వారిపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలి...మొత్తం 28 డిమాండ్లను పార్టీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు సభ ముందుంచారు. వీటికి సభ ఆమోదం తెలిపింది. జిల్లాలోని గిరిజనులు, ఇతర అట్టడుగు వర్గాలకు ప్రత్యేక తెలంగాణ ఫలాలు అందినప్పుడే ఆరు దశాబ్దాల కల సాకారమైనట్టని సభకు ముఖ్య అతిథిగా హాజరైన జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. తెలంగాణ ఉద్యమంలో జిల్లా ప్రజలు, ఉద్యమకారులు చూపిన పోరాట పటిమ చిరస్మరనీయమన్నారు. వేలాదిమంది తెలంగాణ అమరుల త్యాగాల ఫలమే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అని ఎన్డీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. రాష్ట్రం వస్తుందనే సంతోషం ఉన్నా.. జిల్లాలోని గిరిజనులు, కొండరెడ్లు, కోయ, ఇతర ఆదివాసీలు, వారి సంస్కృతి జలసమాధి అవుతుందనే బాధ వెంటాడుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినంత మాత్రాన యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీని దేవత అని సంబోధించడం సరికాదన్నారు. 60 ఏళ్లుగా ఇక్కడి ప్రజలు చేస్తున్న ఉద్యమాలకు జంకి జంకి రాష్ట్రం ఇచ్చారన్నారు. భౌగోళికంగా రాష్ట్రం ఏర్పడినంత మాత్రాన జిల్లాలో సమస్యలు తీరవని, వాటి పరిష్కారానికి పోరాటాలు చేయాల్సిందే అన్నారు. పోలవరం ముంపు, సింగరేణి ఓపెన్‌కాస్టుల విధ్వంసం, టేల్పాండ్ భూముల నష్టం...తదితర అంశాలు మనముందు శాపాలుగా ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, గిరిజన, మైనింగ్ విశ్వవిద్యాలయాల ఏర్పాటు, ఉపాధి మార్గాలు చూపడం వంటి లక్ష్యాలు మనముందున్నాయన్నారు. రాష్ట్రంలో మహిళలు ఇబ్బందులు పడుతున్నారని పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు రమ అన్నారు. అంగన్వాడీలు, బీడీ, పారిశుధ్య మహిళా కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. మహిళలకు న్యాయం జరిగే వరకు ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. మహిళలు పోరుపథంలో నడిచి తెలంగాణ ఉద్యమానికి శక్తిని ఇచ్చారని ఆమె అన్నారు. ఈ సభలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పంజాబ్ నాయకులు ఎస్ఎస్ మాల్, రాష్ట్ర నాయకులు గాదె దివాకర్, బలచంద్ర సంగిడి, కెచ్చెల రంగయ్య, గుమ్మడి నర్సయ్య, రాయల చంద్రశేఖర్, జేఏసీ నాయకులు ఏలూరి శ్రీనివాసరావు, వెంకటపతిరాజు, కూరపాటి రంగరాజు, బిచ్చాల తిరుమలరావు, ఖాజామియా, అరుణోదయ కళాకారులు నాగన్న, రామారావు, సురేష్, ఎన్డీ నాయకులు చంద్ర అరుణ, జగ్గన్న, పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి అశోక్, పీవైఎల్ నాయకులు పుల్లయ్య, మాదా భిక్షం, చిల్లగుండ నాగేశ్వరరావు, ఆవులు వెంకటేశ్వర్లు, చలపతి పాల్గొన్నారు. -
ఇందూరు గర్జించింది
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం చరిత్రలో మరచిపోలేని ఘట్టం. ఇందులో ఇందూరు జిల్లా పాత్ర మరువలేనిది. ప్రత్యేక రాష్ట్రం కోసం జిల్లాలోనూ ఉవ్వెత్తున ఉద్యమం సాగింది. ఉద్యోగులు, వ్యాపారస్తులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు.. అందరూ పోరుబాటలో నడిచారు. అలుపెరుగకుండా నిరంతరాయంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కళాకారులు ధూం ధాం చేశారు. జిల్లా ప్రజల గొంతుకయ్యారు. కవులు, రచయితలు తమ కలంతో ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. అందరూ కీలకమే.. ఉద్యమంలో ప్రధాన పార్టీలు భాగమయ్యాయి. టీఆర్ఎస్తోపాటు బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, న్యూడెమోక్రసీ, టీడీపీలు కీలక పాత్ర పోషించాయి. తెలంగాణ కోసం కలిసికట్టుగా.. ఎవరికి వారే ఆందోళనలు చేశారు. సభలు నిర్వహించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కుల, విద్యార్థి, న్యాయవాద, డాక్ట ర్స్ తదితర జేఏసీలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. ఆందోళనకు నిజామాబాద్ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా ప్రధాన కేంద్రం కాగా... జిల్లా వ్యాప్తం గా చాలా పట్టణాల్లో ధర్నా కేంద్రాలు తెలంగాణ చౌక్‌లుగా మారాయి. ఉద్యోగుల పాత్ర 2009లో టీఎన్జీఓలు 42 రోజులపాలు సమ్మెలో పాల్గొని తెలంగాణ ఆకాంక్షను చాటారు. గ్రామాల్లో పర్యటించి తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. 15రోజుల పాటు సహాయ నిరాకరణ ఉ ద్యమాన్ని నడిపారు. కేసీఆర్ నిరాహార దీక్షలో ఉన్నప్పుడు పది రోజుల పాటు పెన్‌డౌన్ చేశారు. ప్రతిరో జూ జిల్లా పరిపాలన ప్రధాన కార్యాలయమైన కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాలు సాగాయి. ప్రభుత్వ హెచ్చరికలనూ బేఖాతరు చేశారు. ఉద్యోగాలను సైతం పణంగా పెట్టి ఆందోళనలు కొనసాగించారు. కానిస్టేబుల్ కిష్టయ్యనుంచి.. ప్రత్యేక రాష్ర్టం కోసం జిల్లాకు చెందిన 72 మంది ఆత్మబలిదానం చేశారు. 2009 నవంబర్‌లో కేసీఆర్ నిరవధిక నిరాహార దీక్షకు పూనుకోవడం, దానిని ప్రభుత్వం అడ్డుకోవడంతో ప్రజలు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. ఆందోళనలతో జిల్లాను అట్టుడికించారు. తెలంగాణ రాదేమోనని భావించిన పలువురు బలిదానాలకు పాల్పడ్డారు. కామారెడ్డిలో కానిస్టేబుల్ కిష్టయ్య టవర్ ఎక్కి రివాల్వర్‌తో కాల్చుకుని చనిపోయారు. ఉద్యమానికి ఊపిరులూదాడు. 2009 డిసెంబర్ 7న లింగయ్య, 12న కాశయ్య, 29న బత్తుల రాజు.. ఇలా అనేక మంది తెలంగాణ కోసం ఆత్మార్పణం చేశారు. ఆలస్యంగానైనా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం పచ్చజెండా ఊపడం, పార్లమెంట్ దానిని ఆమోదించడంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం కోసం అమరత్వం పొందిన వీరుల ఆత్మబలిదానాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. పోరుబాటలో ఉద్యమ పార్టీ మలిదశ తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పాత్ర కీలకమైనది. తెలంగాణ ఆకాంక్షతో 2001లో ఆవిర్భవించిన ఈ పార్టీని ఇందూరు జిల్లా వాసులు ఆదరించారు. ప్రజలు కేసీఆర్‌కు బాసటగా నిలిచారు. ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, కర్షక, విద్యార్థి శక్తులు ఉద్యమంలో పాల్గొనడంతో టీఆర్ఎస్ మరింత బలపడింది. 2002లో జరిగిన మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో సత్తా చాటింది. కాంగ్రెస్ సహకారంతో జిల్లా పరిషత్‌ను కైవసం చేసుకుంది. 2004లో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసి మూడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. 2009 ఎన్నికల్లో ఒకే స్థానానికి పరిమితమైంది. తర్వాత ఉద్యమం ఉవ్వెత్తున సాగిన సమయంలో ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించింది. -
టీఆర్ఎస్, ఎన్డీ, కాంగ్రెస్‌తో పొత్తులకు అవకాశం
భద్రాచలం, న్యూస్‌లైన్: వచ్చే సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, న్యూడెమోక్రసీ(ఎన్డీ)తో తమ పార్టీకి పొత్తులు ఉండే అవకాశముందని సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వరరావు తెలిపారు. ఆయన బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ... మతోన్మాదానికి వ్యతిరేకంగా తమ పార్టీ పనిచేస్తుందన్నారు. బీజేపీతో పొత్తుకు ఉవ్విళ్లూరుతున్న టీడీపీతో కలిసి పనిచేసేది లేదని స్పష్టం చేశారు. జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ, ఖమ్మం పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలని తమ పార్టీ భావిస్తోందన్నారు. సిట్టింగ్ స్థానాలైన కొత్తగూడెం, వైరాతోపాటు పినపాక, భద్రాచలం స్థానాల్లో కచ్చితంగా పోటీ చేస్తామన్నారు. ఇప్పటివరకూ మిత్రులుగా ఉన్న సోదర కామ్రేడ్లతో పోటీ రసవత్తరంగా ఉండబోతుందని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ సీపీతో పొత్తుకు సీపీఎం సిద్ధమవుతున్నట్టుగా తమకు సంకేతాలు ఉన్నాయన్నారు. పొత్తులపై పార్టీ రాష్ట్ర కమిటీ చర్చలు ప్రారంభించిందని, మరో పది రోజుల్లో నిర్ణయం తీసుకోవచ్చని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ముంపు గ్రామాల నిర్వాసితులకు భద్రాచలం కేంద్రంగా పునరావాసం కల్పించాల్సిన అవసరముందని అన్నారు. ఇందుకు ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలన్నారు. ముంపు భూనిర్వాసితులకు మార్కెట్ రేటు కంటే నాలుగు రెట్లు అదనంగా పునరావాస ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముంపు ప్రాంత వాసుల సమస్యల పరిష్కారానికి భవిష్యత్తులో సీపీఐ పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సిద్ది వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు రావులపల్లి రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం పై ఫైర్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తన మంత్రులనీ చూడకుండా, మహిళలన్న కనీస ఇంగితజ్ఞానం లేకుండా వ్యవహరించిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై జిల్లా భగ్గుమంది. అడుగడుగునా తెలంగాణకు అడ్డుపడుతున్న ముఖ్యమంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలంటూ నినదించింది. ఢిల్లీలో బుధవారం సీఎం వ్యవహరించిన తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. మంత్రి గీతారెడ్డిపై జరిగిన దాడికి సీఎం బాధ్యత వహించాలని, ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని వివిధ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల పిలుపు మేరకు జిల్లాలో గురువారం ఆ పార్టీ నాయకులు నిరసన వ్యక్తంచేశారు. టీఆర్ఎస్, న్యూడెమోక్రసీలతో పాటు ఎన్ఎస్యుఐల ఆధ్వర్యంలో సీఎం కిరణ్ దిష్టిబొమ్మలను దహనం చేశాయి. నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూరు, ఎల్లారెడ్డి, బోధన్ తదితర ప్రాంతాల్లో సీఎం దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి, దహనం చేశారు. ప్రధాన కూడళ్లలో రాస్తారోకో, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్, పూలాంగ్ చౌరస్తాలలో కాంగ్రెస్ మహిళ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల లలిత, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హుందాన్ల ఆధ్వర్యంలో వేర్వేరుగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్టీఆర్ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టి, సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. పూలాంగ్ చౌరస్తాలో ధర్నా, నిరసన ప్రదర్శన నిర్వహించి అంబేద్కర్‌కు పాలాభిషేకం చేశారు. ఆర్మూర్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి కిరణ్ కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. పీసీసీ కార్యదర్శి ఖాందేశ్ శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ త్రివేణి గంగాధర్, డీసీసీ కార్యదర్శి దర్బాస్తు రాజశేఖర్, అర్గుల్ సురేష్, పీసీ భోజన్న, సునీల్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ ఆర్మూర్ నియోజకవర్గం అభ్యర్థి జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. టీఆర్ఎస్, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో, ర్యాలీలు నిర్వహించి, సీఎంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నందిపేటలో ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో, మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించారు. అనంతరం రాస్తారోకో చేపట్టి, సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. బోధన్‌లో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఢిల్లీలో ఆయన వ్యవహరించిన తీరుకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. స్థానిక ఏఎంసీ చైర్మన్ గంగాశంకర్, పట్టణ, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎడపల్లిలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సీఎం వైఖరిపై నాయకులు మండిపడ్డారు. నవీపేటలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో చేసి, దిష్టిబొమ్మను దహనం చేశారు. మాజీ ఎంపీపీ సూరిబాబు, కార్యకర్తలు పాల్గొన్నారు. కామారెడ్డిలో సీఎం వైఖరికి నిరసనగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఏం దిష్టి బొమ్మను దహనం చేశారు. భిక్కనూరు మండలంలోను సీఎం దిష్టిబొమ్మ దహనం చేసి, రాస్తారోకో చేశారు. దోమకొండ, బీబీపేట్లలో కాంగ్రెస్ నాయకుల బైక్ ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. ఎల్లారెడ్డిలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో, లింగంపేటలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. డిచ్‌పల్లిలో సీఎం కిరణ్ తీరును నిరసిస్తూ రాస్తారోకో నిర్వహించారు. సీఎం కిరణ్ తీరును నిరసిస్తూ ధర్పల్లి మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించి దిష్టిబొమ్మ దహనం చేశారు. న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో సీఎం కిరణ్ తీ రును నిరసిస్తూ ధర్పల్లిలో రాస్తారోకో నిర్వహించారు. తెలంగాణ వర్సిటీలక్ష ఏబీ వీపీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం చేశారు. జక్రాన్‌పల్లిలో కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో నిర్వహించి సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. వర్నిలో సీఎంకు వ్యతిరేకంగా రాస్తారోకో, గీతారెడ్డిపై దాడికి నిరసనగా దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. సీఎంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. -
నేరమే అధికారమైంది..
బోధన్,న్యూస్‌లైన్ : నేరమయమైన అధికార పక్షం ప్రజలను నేరస్తులుగా చేస్తోందని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు పోటు రంగారావు ఆరోపించారు. పార్లమెంట్లో 545 మంది సభ్యుల్లో 350 మంది కోటీశ్వర్లు ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయన్నారు. పీడీఎస్‌యూ 19వ జిల్లా మహాసభలను గురువారం బోధన్‌లోని ఉర్ధూహాల్‌లో నిర్వహించారు. సభకు పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షరాలు సరిత అధ్యక్షత వహించారు. ముఖ్య వక్తగా హాజరైన రంగారావు మాట్లాడుతూ పీడీఎస్‌యూ వ్యవస్థాపకుడు జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, మరో మహిళా నేత రంగవల్లీ ఈ ప్రాంతానికి చెందిన వారు కావడం విశేషమన్నారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొర్రెపాటి మాధవరావు మాట్లాడుతు బడా కంపెనీలు దేశ వనరులను దోచుకునేందుకు ప్రభుత్వాలు ప్రోత్సాహమిస్తున్నాయని ఆరోపించారు. పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ బాలికల విద్య పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరుచేయక తప్పదన్నారు. పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతం ప్రసాద్ మాట్లాడుతు ఉన్నతవిద్య పేద వర్గాలకు భారంగా మారిందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలకు ఆధార్‌కార్డు లింకేజీని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సభ ప్రారంభానికి ముందు మౌనం పాటించి అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సభలో పిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె యాదగిరి, నాయకులు ఆకుల పాపయ్య. పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సరిత, వరదయ్య, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కట్లె భూమయ్య, నాయకులు ఎల్‌బీరవి, శ్రీనివాస్, మల్లేష్, మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షుడు న్యాయవాది వి సంగం మాట్లాడారు. నాయకులు స్వప్న, జైత్రాం, గంగాధర్,యాదగిరి, ఆకుల పాపయ్య, వి ప్రబాకర్, ఎన్ దాసు, వేల్పూర్ భూమయ్య, వనమాల కృష్ణ, నరేందర్, గంగాధర్, మల్లేశ్ పాల్గొన్నారు. విద్యార్థులతో భారీ ర్యాలీ.. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) జిల్లా 19 వ మహాసభలు అట్టహాసంగా చేపట్టారు. స్థానిక శక్కర్‌నగర్ క్రీడా మైదానానికి చేరుకున్న వందలాది మంది కార్యకర్తలు, విద్యార్థులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అరుణోదయ కళాకళాకారులు ఆటపాటలతో ఆకట్టుకున్నారు. సభ ప్రారంభ సూచకంగా పిడికిలి గుర్తు ఉన్న ఎర్ర జెండాను జిల్లా అధ్యక్షురాలు సరిత ఆవిష్కరించారు. రెండువర్గాల ఘర్షణ.. మహాసభలో కాసేపు పీడీఎస్‌యూ నాయకులు రెండు వర్గాలు విడిపోయి ఘర్షణ పడటం ఉద్రిక్తతకు దారితీసింది. భోజన విరామ సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. రెండు గ్రూపులుగా విడిపోయి కార్యకర్తలు దాడులకు యత్నించారు. బోధన్ సీఐ శంకరయ్య పోలీసు సిబ్బంది అక్కడి చేరుకున్నారు. యూనియన్, పార్టీ నాయకులు రెండువర్గాలను సముదాయించేందుకు ప్రయత్నించారు. -
ఓపెన్‌కాస్టులకు వ్యతిరేకంగా ఉద్యమించాలి
సత్తుపల్లి, న్యూస్‌లైన్: సింగరేణి ఓపెన్‌కాస్టులకు వ్యతి రేకంగా ప్రజలు ఉద్యమించాలని న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు కోరారు. సత్తుపల్లిలో సింగరేణి ఓపెన్‌కాస్ట్ భూనిర్వాసితుల రిలేనిరాహార దీక్షలు శనివారం ఐదోరోజుకు చేరాయి. దీక్ష శిబిరాన్ని ఆయన శనివా రం సందర్శించి సంఘీభావం ప్రకటించారు. శిబిరాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. భూసేకరణ కొత్త చట్టం అమలులోకి రావడానికి కొన్ని గంటల ముందుగానే భూములను ఎందుకు స్వాధీనపర్చుకుందీ ప్రభుత్వాధికారులు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘మీరు (అధికారులు) ప్రజలపక్షమా.. పెట్టుబడిదారులపక్షమా..?’ అని ప్రశ్నించా రు. ఓపెన్‌కాస్టులతో ప్రజారోగ్యం దెబ్బతింటుం్దని, పంట భూములు బొందల గడ్డలుగా మారతాయని ఆందోళన వ్యక్తం చేశారు. భూనిర్వాసితులకు తగిన నష్ట పరిహారం ఇప్పించటంలో ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని విమర్శిం చారు. ‘పోడు కొడితే పర్యావరణం దెబ్బతింటుందని ప్రచారం చేసే పాలకులు... వేల ఎకరాల పంట భూములను ఓపెన్‌కాస్టులతో విషతుల్యం చేస్తుంటే ఎందుకు స్పందించడం లేదు?’ అని ప్రశ్నిం చారు. సత్తుపల్లిలో థర్మల్ పవర్ స్టేషన్‌కు అనుమతి ఇవ్వకుండా, బొగ్గు మొత్తాన్ని ఇతర ప్రాంతాలకు తరలించటం సరికాదని అన్నారు. భూసేకరణకు సంబంధించి కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులు రద్దయ్యేంత వరకు నిర్వాసితులతో కలిసి ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొం టామన్నారు. దీక్షలకు సంఘీభావం తెలిపిన వారిలో న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు, పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు కూకలకుంట రవి, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎ.వెంకన్న తదితరులు ఉన్నారు. మంత్రి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సంఘీభావం సింగరేణి భూనిర్వాసితుల దీక్షలకు మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. దీక్ష చేస్తున్న నిర్వాసితులతో వారు ఫోన్లో మాట్లాడుతూ.. సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని, జనరల్ అవార్డుతో జరిగిన నష్టాన్ని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. నిర్వాసితులకు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నూకల నరేష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు దిండిగాల రాజేందర్ సంఘీభావం తెలిపారు. వారు మాట్లాడుతూ.. రైతుల పక్షాన టీఆర్ఎస్ ఉద్యమిస్తుందన్నారు. బీజేపీ నాయకులు దుగ్గి అప్పిరెడ్డి, వందనపు భాస్కర్‌రావు కూడా సంఘీభావం ప్రకటించారు. -
లాటరైట్ పరిశ్రమ నెలకొల్పాలి
ఇల్లెందు అర్బన్, న్యూస్‌లైన్: మండలంలోని మామిడిగుండాల గ్రామంలో లాటరైట్ పరిశ్రమ నెలకొల్పి స్థానికులకు ఉపాధి కల్పించాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మామిడిగుండాలలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఇక్కడి భూస్వామి రాఘవేంద్రరావు ఆక్రమించుకున్న భూముల పట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కార్యకర్త మూతి కృష్ణ పేదల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం సరికాదన్నారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ పేదలపక్షాన పోరాడేది న్యూడెమోక్రసీ మాత్రమేనని అన్నారు. ఎన్డీపై తప్పుడు ఆరోపణలు చేయడం కృష్ణకు తగదన్నారు. తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు నర్సింహరావు మాట్లాడుతూ ఉద్యమకారులు ప్రజలకు న్యాయం చేయాలే తప్ప కీడు తలపెట్టవద్దని కోరారు. పేదల భూములను కబ్జా చేస్తే సహించేంది లేదని హెచ్చరించారు. లాటరైట్ ఖనిజ పరిశ్రమ వల్ల ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. సభలో నాయకులు నాయిని రాజు, తుపాకుల నాగేశ్వరరావు, బండారి ఐలయ్య, సక్రు, సారంగపాణి, సూర్ణపాక పార్వతి, కల్తీసుభద్ర పాల్గొన్నారు. -
పోలీసుల అదుపులో నలుగురు నక్సల్స్?
వరంగల్‌క్రైం, న్యూస్‌లైన్ : ఏటూరునాగారం మండలంలోని చెల్పాక, ఎలిశెట్టిపల్లి గ్రామాల్లో సంచరిస్తున్న నలుగురు నక్సల్స్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. సీపీఐ(ఎంఎల్) పేరిట వీరు చందాలు వసూలు చేయడానికి వచ్చినట్లు సమాచారం. పోలీసులకు సమాచారం అందడంతో పక్కాప్లాన్‌తో వీరిని పట్టుకున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... ఈ నెల 5న చెల్పాక గ్రామంలో పోలీసులు పాగా వేసి ఉండగా ఓ ఇంట్లో భోజనం చేయడానికి వచ్చిన ఇద్దరు నక్సల్స్ వచ్చారు. వారిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారించగా మరో ఇద్దరు నక్సల్స్ తమతో ఉన్నారని, మీ రాకను పసిగట్టి పారిపోయారని వెల్లడించినట్లు తెలిసింది. దీంతో ఆ ఇద్దరి కోసం మూడు రోజులు గా వెతకగా గురువారం ఉదయం వారు చిక్కినట్లు తెలుస్తోంది. అంతేగాక ఈ నలుగురు నక్సల్స్ ఎలిశెట్టిపల్లి చెరువుకుంటలో నాలుగు తుపాకులను దాచి ఉంచినట్లు విచారణలో వెల్లడైంది. వాటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచా రం. పోలీసుల అదుపులో ఏటూర్‌నాగారం మండలం సింగారం గ్రామానికి చెందిన నర్సింగరావు, ఖమ్మం జిల్లా గుండాల మండలం చీమలగూడెం కు చెందిన పాయం సమ్మయ్యతోపాటు మరొకరు, హసన్‌పర్తి మండలానికి చెందిన విముక్తి ఉన్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా నక్సల్స్ అరెస్ట్ విషయమై పోలీసులను వివరణ కోరగా తాము ఎవరిని తీసుకురాలేదని చెప్పడం గమనార్హం. ఎన్డీ దళం నుంచి పరారై వచ్చి.. పట్టుబడి.. పోలీసులకు పట్టుబడిన ఆ నలుగురు గతంలో సీపీఐ(ఎంఎల్) ప్రతిఘటనలో పనిచేసినట్లు తెలిసింది. కొన్నాళ్ల క్రితం ప్రతిఘటన దళాలు కొన్ని పోలీసులకు లొంగిపోవ డం, మరికొందరు ఎన్కౌంటర్లలో చనిపోవడంతో ఆ గ్రూప్ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే సదరు వ్యక్తులు ఐదు నెలల క్రితం ఖమ్మం జిల్లాలోని న్యూడెమోక్రసీ మధు దళాన్ని సంప్రదించినట్లు తెలిసింది. తాము దళంలో పనిచేస్తామని చెప్పడంతో సభ్యులుగా చేర్చుకుని కొన్నాళ్లు ఆయుధాలు చేతికి ఇవ్వకుండా వెంట తిప్పుకున్నట్లు సమాచారం. వారిపై ఎలాంటి అనుమానం లేకపోవడంతో దళంలో పూర్తిస్థాయి సభ్యులుగా తీసుకున్నట్లు తెలిసింది. నమ్మకమై న వ్యక్తులుగా మెదిలిన వారు అక్టోబర్ చివరి వారంలో నాలుగు ఆయుధాలతో సహా పరారయ్యారు. వారి ఆచూకీ కోసం న్యూడెమోక్రసీ నేతలు ఆరా తీస్తుండగానే ఏటూరునాగారం ఏజెన్సీలోకి వచ్చిన సదరు నక్సల్స్ పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. -
శ్వేత పత్రం విడుదల చేయాలి
ఆర్మూర్, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఆరు విడతల్లో చేపట్టిన భూపంపిణీపై శ్వేతపత్రం విడుదల చేయాలని జేఏసీ జిల్లా చైర్మన్ గోపాల్ శ ర్మ డిమాండ్ చేశారు. భూపంపిణీ చేసిన వివరా లు, కబ్జాలు, వ్యవసాయం చేస్తున్న వారి వివరాలు ఆ శ్వేత పత్రంలో పొందుపర్చాలన్నారు. బుధవారం పట్టణంలోని సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ కార్యాలయంలో గల కుమార్ నారాయణ సమావేశపు గదిలో భూ పంపిణీపై ఆ ర్మూర్ డివిజన్ కార్యదర్శి వి.ప్రభాకర్ అధ్యక్షత న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. గతంలో ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన భూముల కు కబ్జా చూపించాలని, కబ్జాలో ఉన్న అర్హులకు పట్టాలు ఇవ్వాలని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే డిమాండ్లపై నిర్వహించిన ఈ సమావేశంలో రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాల నా యకులు మాట్లాడారు. భూ పోరాటాల్లో అమరులైన వారికి జోహార్లు అర్పిస్తూ రెండు నిముషాలు మౌనం పాటించి సమావేశాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా గోపాల్ శర్మ మా ట్లాడుతూ.. తెలంగాణ పల్లె ప్రజలు విద్య లేని కారణంగా కష్టనష్టాలను ఎదుర్కొంటున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం చేయవద్దని కోరారు. విలీనమే జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం మరో 40 ఏళ్లపాటు తెలంగాణ ప్రజలను దోచుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి అసెంబ్లీలో తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోండి అనే సమయంలో స్పందించని తెలంగాణ ప్రాంత మంత్రులను ఆయన విమర్శించారు. తెలంగాణ మంత్రుల అలసత్వం, బానిసత్వం కారణంగా సీమాంధ్ర నాయకుల తొత్తులుగా మా రుతూ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. అన్ని పార్టీలతో త్వరలో సమావేశం నిర్వహించి జిల్లాలోని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. శాస్త్రీయ వైఖరి లేని కారణంగానే.. దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించే పార్టీలకు శాస్త్రీయ వైఖరి లేని కారణంగానే భూ సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రజాస్వామిక దేశంలో సాగు, ఇళ్ల స్థలాల కేటాయింపు సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ప్రజలు క్షమించరు. అధికారుల నిర్లక్ష్యం, అశ్రద్ధ కారణంగా భూ సమస్యలు రావణకాష్టంలా మారుతున్నాయి. సెజ్‌ల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు భూములు కట్టబెట్టడం మంచిదికాదు. అర్హులైన వారికి భూములు కేటాయించి సమష్టి వ్యవసాయం చేసేటట్లు ఏర్పాటు చేయాలి. - ఏఎస్ పోశెట్టి, టీఆర్ఎస్ పోలిట్‌బ్యూరో సభ్యుడు చట్టాలు కాగితాలకే పరిమితమవుతున్నాయి.. ప్రభుత్వాలు భూ సంస్కరణలు చేస్తున్నామంటూ గొప్పలకు పోయినా అనేక చట్టాలు కాగితాలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. అర్హులైన పేదలకు సాగుభూమిని ఇవ్వాలన్న కోనేరు రంగారావు సిఫార్సులను అమలు చేయాలి. ఆర్మూర్ మండలం పెర్కిట్-కొటార్మూర్‌లో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆగడాలను అరికట్టాలి. -కర్నాటి యాదగిరి, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి -
ఎన్డీ అజ్ఞాత దళం నుంచి ముగ్గురు పరార్
ఇల్లెందు, న్యూస్‌లైన్: న్యూడెమోక్రసీ(ఎన్డీ)కి గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీ అజ్ఞాత నేత మధు ఆధ్వర్యంలో గుండాల ఏరియాలో పనిచేస్తున్న దళంలోని ప్రసాద్ (కమాండర్), మరో ఇద్దరు సభ్యులు ఆయుధాలతో శుక్రవారం రాత్రి పరారయ్యారు. వీరు మూడు నెలల కిందటే దళంలో చేరారు. వీరు పరారైనట్టుగా గుర్తించిన మిగతా సభ్యులు శనివారం ఉదయం పరిసర ప్రాంతాల్లో గాలిస్తుండగా... ఒకచోట (ఆ ముగ్గురికి చెందిన) ఆయుధాలు, యూనిఫాం కనిపించాయి. గుండాల మండలంలో శనివారం కేంద్ర మంత్రి బలరాం నాయక్ పర్యటన ఉండడంతో పోలీసులు అడవుల్లో గాలింపు చేపట్టారు. ఈ పరిస్థితుల్లో, అడవి నుంచి తేలిగ్గా తప్పించుకునేందుకే ఆ ముగ్గురు దళ సభ్యులు తమ ఆయుధాలను, యూనిఫామ్‌ను వదిలేసి ఉంటారని ఎన్డీ వర్గాలు భావిస్తున్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు.. ఎందుకు పరారయ్యారు...?! వరంగల్ జిల్లాకు చెందిన ఎనిమిదిమంది కలిసి మూడు నెలల క్రితం ఎన్డీ దళాలలో చేరారు. కొద్ది రోజులకే వీరిలో ముగ్గురు ఇంటిబాట పట్టారు. ఆ తరువాత కొన్ని రోజులకు మరో సభ్యుడు కూడా మళ్లీ వస్తానంటూ ఇంటికి వెళ్లిపోయాడు. వరంగల్ నుంచి వచ్చిన ఎనిమిది మందిలో నలుగురు మాత్రమే మిగిలారు. వీరిలో ప్రసాద్ దళంలో ఆయనతోపాటు మరో ఇద్దరు, ఆజాద్ దళంలో ఒక్కరు ఉన్నారు. వరంగల్ నుంచి వచ్చిన ఎనిమిదిమందిలో మిగిలిన ఒకే ఒక వ్యక్తి ప్రస్తుతం ఆజాద్ దళంలో ఉన్నాడు. ప్రసాద్ సహా ఇద్దరు సభ్యుల పరారీపై అతడిని పార్టీ నాయకత్వం ప్రశ్నించినట్టు తెలిసింది. ‘మేమంతా కలిసి కొత్త పార్టీ ఏర్పాటు చేయాలనుకున్నాం. అందుకే ఆయుధాల కోసం దళంలో చేరాం. కొద్ది రోజుల తరువాత అందరం కలిసి ఆయుధాలతో పారిపోవాలని నిర్ణయించుకున్నాం’ అని ఆ సభ్యుడు వెల్లడించినట్టు తెలిసింది. వీరంతా గతంలో వరంగల్ జిల్లాలో జనశక్తి, సీపీయూఎస్ఐ దళాల్లో పనిచేసినట్టు సమాచారం. గతంలో సీపీయూఎస్ఐలో పనిచేసి ఎన్డీలోకి వచ్చిన దళ నేత గణేష్ ద్వారానే వీరంతా ఎన్డీ దళాల్లోకి వచ్చినట్టు తెలిసింది. -
'ఐకేపీ మహిళా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి'
ఇల్లెందుఅర్బన్,న్యూస్‌లైన్: మహిళాలోకం కదం తొక్కింది.... ఐకేపీ మహిళా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇఫ్టూ, ఐకెపీ మెంబర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ (న్యూడెమోక్రసీ) ఆధ్వర్యంలో ఇల్లెందులో బుధవారం భారీ ప్రదర్శన నిర్వహించారు. సబ్‌డివిజన్ పరిధిలోని మహిళలు వేలాదిగా పాల్గొన్న ఈ ప్రదర్శన మార్కెట్‌యార్డు నుంచి బయలుదేరి జగదాంబసెంటర్, పాతబస్టాండ్ ఏరియా, బుగ్గవాగుబ్రిడ్జి, కొత్తబస్టాండ్ ఏరియాల మీదుగా వెలుగు కార్యాలయం వరకు కొనసాగింది. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఆందోళనకారులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. అనంతరం వెలుగు కార్యాలయం ముట్టడించారు. ఈ సందర్భంగా డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఐకేపీ ఏరియా కోఆర్డినేటర్ చంద్రకళకు అందజేశారు. మహిళలను ఆదుకోవడంలో విఫలం: పీఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రమ ప్రదర్శనకు ముందు కార్యక్రమాన్ని ఉద్దేశించి పీఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రమ మాట్లాడుతూ....నిరుపేద మహిళలకు రుణాలు మంజూరు చేసి ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని మండిపడ్డారు. మహిళల హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. ఐకేపీ గ్రూపులోని ప్రతి సభ్యురాలికి వడ్డీలేని రుణం లక్షరూపాయలు మంజూరు చేయాలని, బకాయి పడ్డ రుణాలను వడ్డీలు లేకుండా కట్టించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి గ్రామంలో సమావేశ సౌకర్యార్థం కమ్యూనిటీ హాలు నిర్మాణం చేయాలన్నారు. మండల సమాఖ్య ఆఫీసు బేరర్స్‌కు 5 వేలరూపాయల గౌరవ వేతనం చెల్లించాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక బిల్డింగ్, కంప్యూటర్ ఆపరేటర్ ఇవ్వాలని కోరారు. గ్రామ దీపికలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, హెచ్ఆర్సీ పాలసీ చేయాలన్నారు. నిధులు మంజూరు చేయాలి: ఎన్డీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు స్వయం సహాయక సంఘాల్లోని మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను ప్రభుత్వం ఇతర పనులకు వినియోగిస్తు దుర్వినియోగం చేస్తోందని న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు విమర్శించారు. ఆందోళన చేస్తున్న మహిళలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ... ఐకేపీ మహిళల అభివృద్ధికి కావాల్సిన నిధులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడినర్సయ్య, ఎన్డీ రాష్ట్ర నేత రాయలచంద్రశేఖర్, పీఓడబ్ల్యు జిల్లా నాయకురాలు చండ్ర అరుణ,నాయకులు ప్రసాద్, అయిలయ్య, కిన్నెరనర్సయ్య, రమణ, పూనెం కమల, ఉపేంద్ర, మాచర్ల సత్యం, సుభద్ర,సక్రు తదితరులు పాల్గొన్నారు. -
నేడు తెలంగాణ బంద్
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి వైఖరికి నిరసనగా, పార్లమెంట్లో వెంటనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు శనివారం చేపట్టనున్న బంద్‌కు పలు సంఘాలతోపాటు టీఆర్ఎస్, బీజేపీ, న్యూడెమోక్రసీ తదితర రాజకీయ పక్షాలు సంపూర్ణ మదతు ప్రకటించాయి. ఈ మేరకు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా తెలంగాణ జేఏసీ, విద్యార్థి, న్యాయవాద, డాక్టర్ల సంఘాలు బంద్ విజయవంతానికి ప్రచారం నిర్వహించాయి. బంద్‌ను విజయవంతం చేయూలని శాంతి ర్యాలీలతో కదం తొక్కారుు. తెలంగాణ సభకు అనుమతినివ్వకుండా హైదరాబాద్‌లో సీమాంధ్ర సభలకు అనుమతినిస్తున్న సీఎం కిరణ్, డీజీపీ దినేష్‌రెడ్డి తీరును ఎండగట్టారుు. వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థల యజమానులు, ఆటోయూనియన్లు పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారుు. ఈ సందర్భంగా టీజేఏసీ జిల్లా చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాలు స్వచ్ఛందంగా బంద్‌లో భాగస్వాములు కావాలని కోరారు. టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జ్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు, అర్బన్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్, మొలుగూరి బిక్షపతి బంద్‌కు పూర్తి మద్దతు ప్రకటించారు. అదేవిధంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, అర్బన్ అధ్యక్షుడు చింతాకుల సునీల్, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి చంద్రన్న, ఆర్టీసీ ఎన్ఎంయూ రిజినల్ కార్యదర్శి సీహెచ్.యాకస్వామి, టీఎంయూ రాష్ట్ర చైర్మన్ తిరుపతయ్య, టీపీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, నల్లెల రాజయ్య, జనగామ కుమారస్వామి బంద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. బంద్‌కు ప్రైవేట్ పాఠశాలల యజమానులు మద్దతు ప్రకటించారు. బంద్‌లో పాల్గొనాలని నిర్ణయించినట్లు ఫర్టిలైజర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నాగుర్ల వెంకటేశ్వర్లు తెలిపారు. కాగా, బంద్ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా బస్స్టేషన్లు, రైల్లేస్టేషన్లు, ప్రధాన సెంటర్లలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. సెంట్రల్ జైలులో నక్సలైట్ ఖైదీలు కూడా తెలంగాణకు మద్దతుగా దీక్షలు చేపట్టారు. -
సీఎం తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడం సరికాదు
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను అడ్డుకుంటూ, వారిని రెచ్చగెట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నాడని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు ఆరోపించారు. సీమాంధ్ర ఉద్యమానికి ముఖ్యమంత్రే నాయకత్వం వహిస్తున్నట్లు ఉందని, ఆయనకు సీమాంధ్ర ఉద్యమంపై నైతిక బాధ్యత ఉంటే రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. శుక్రవారం రామనర్సయ్య విజ్ఞానకేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అఖల పక్షం సమావేశంలో అన్ని పార్టీలు తెలంగాణకు మద్దతు తెలిపి, విభజన సమయంలో వ్యతిరేకంగా మట్లాడడం సరికాదన్నారు. సీమాంధ్ర ప్రజలు పార్టీల వైఖరిని అర్ధం చేసుకుని తెలంగాణకు సహకరించాలని కోరారు. ఆదివాసులకు పట్టాలు ఇవ్వాలి.. ఎన్నో ఏళ్లుగా పోడుభూములు సేద్యం చేసుకుంటున్న ఆదివాసులకు పట్టాలు ఇవ్వాలని పోటు రంగారావు డిమాండ్ చేశారు. 2005 అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలు ఇవ్వకుండా, సర్వేల పేరుతో కాలయాపన చేసి, అరకొర భూములు ఇచ్చి ఇప్పుడు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీచేయడం దుర్మార్గమన్నారు. అటవీ అధికారులు గొత్తికోయల నివాసాలను ధ్వంసం చేస్తూ గుడిసెలు తగులబెడుతూ జంతువులకు తరిమినట్లు తరుముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సేద్యం చేసుకుంటున్న ప్రతి ఒక్కరికీ 10 ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ వచ్చేనెల 2న వేలాది మందితో కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళణ, ఖమ్మం, పాల్వంచ డివిజన్లలో ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భద్రాచలం డివిజన్‌ను జిల్లాలో భాగంగా ఉంచాలని, ప్రజల అభిప్రాయం స్వీకరణకు రెఫరెండం జరపాలని డిమాండ్ చేస్తూ 4న భద్రాచలంలో రెడ్‌క్రాస్ బిల్డింగ్‌లో మధ్యాహ్నం 12 గంటలకు సదస్సు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. వచ్చే నెల 3న ‘రూపాయి పతనం- ఆర్ధిక సంక్షోభం- ప్రజల జీవనంపై ప్రభావం’ అంశంపై ఎన్డీకార్యాలయంలోసదస్సు జరుగుతుందని చెప్పారు. కార్యాక్రమాలను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. సమావేశంలో ఎన్డీ నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, జి.రామయ్య, సురేష్‌లు ఉన్నారు.