ఇద్దరు న్యూడెమొక్రసీ ఎంపీటీసీల బహిష్కరణ | two mptc's suspended from new democracy party in khammam district | Sakshi
Sakshi News home page

ఇద్దరు న్యూడెమొక్రసీ ఎంపీటీసీల బహిష్కరణ

Published Sun, Dec 27 2015 6:54 PM | Last Updated on Wed, Oct 17 2018 3:43 PM

two mptc's suspended from new democracy party in khammam district

ఖమ్మం: ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసినందుకు ఇద్దరు ఎంపీటీసీలను న్యూడెమొక్రసీ పార్టీ బహిష్కరించింది. పార్టీ సిద్ధాంతాన్ని విస్మరించినందుకు ఈ చర్య తీసుకున్నట్లు నాయకులు తెలిపారు.

టేకులపల్లి మండలం బద్దుతండా ఎంపీటీసీ బేబీ, గుండాల మండలం ఆళ్లపల్లి ఎంపీటీసీ మెస్సు సమ్మక్కలను న్యూడెమొక్రసీ పార్టీ నుంచి బహిష్కరించినట్లు ఖమ్మం, వరంగల్ జిల్లాల ఏరియానేత లింగన్న, టేకులపల్లి మండల కార్యదర్శి గణేశ్ వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనకూడదని చెప్పిన పార్టీ సిద్ధాంతాలను పాటించకుండా.. ప్రలోభాలకు గురై వెళ్లడం దుర్మార్గమైన చర్య అని వారు విమర్శించారు. పదవికి కూడా రాజీనామా చేయాలని, లేకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని నాయకులు హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement