రాకేశ్ రెడ్డి.. ధైర్యంగా ఉండండి: కేటీఆర్‌ | KTR Tweet On Rakesh Reddy Over Graduate Bypoll Defeat | Sakshi
Sakshi News home page

రాకేశ్ రెడ్డి.. ధైర్యంగా ఉండండి: కేటీఆర్‌

Published Sat, Jun 8 2024 6:07 PM | Last Updated on Sat, Jun 8 2024 6:37 PM

KTR Tweet On Rakesh Reddy Over Graduate Bypoll Defeat

సాక్షి, హైదరాబాద్‌:  వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి రాకేశ్ రెడ్డి రెండోస్థానంలో నిలిచారు. తాజాగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ స్పందిస్తూ.. రాకేశ్‌రెడ్డికి ధైర్యం చెప్పారు. ‘‘ రాకేశ్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలో మీరు సాధ్యమైనంతగా కష్టపడ్డారు. ఫ‌లితాలు ఎప్పుడు కూడా ఆశించినట్లుగా ఉండవు. మీరు దృఢంగా, పాజిటివ్‌గా ఉండండి. ఇదే క‌ష్టాన్ని కొన‌సాగిద్దాం’’అని కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

అంతకుముందు రాకేశ్ రెడ్డి తనకు అవకాశమిచ్చిన కేసీఆర్‌కు, తనకు మద్దతుగా ఓటేసిన పట్టభద్రులకు ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు. అందరి అంచనాలకు తగినట్లు భవిష్యత్తులో రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తానని తెలిపారు. ఇప్పుడు మాత్రం అంచనాలు అందుకోలేకపోయినందుకు క్షమించాలన్నారు. పార్టీలోకి వచ్చిన అతితక్కువ సమయంలో తనను గుండెలకు అద్దుకున్న బీఆర్ఎస్ శ్రేణులకు, పార్టీలకు అతీతంగా తనకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాని తెలిపారు.

 

ఇక..వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉ‍న్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో జనగాం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆయన రాజీనామాతో జరిగిన ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన చింతపండు నవీన్‌కుమార్‌ (తీన్మార్‌ మల్లన్న) విజయం సాధించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement