graduate
-
‘ఎల్లే గ్రాడ్యుయేట్స్ అవార్డ్స్–2024’ లో మెరిసిన బాలీవుడ్ తారలు, సెలబ్రిటీలు
-
యూపీఎస్సీ కోసం.. అధిక జీతం వదులుకుని.. ‘కనిష్క్’ సక్సెస్ స్టోరీ
న్యూఢిల్లీ: విజేతల కథనాలు ఎవరికైనా సరే శక్తివంతమైన ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. అడ్డంకులను అధిగమించడానికి, లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించడానికి ప్రేరణ కల్పిస్తాయి. కష్టపడి పనిచేయడమే విజయం వెనుకనున్న రహస్యం అని అవగతమయ్యేలా చేస్తాయి. యూపీఎస్సీలో ఉత్తీర్ణత సాధించడమే జీవిత లక్ష్యంగా పెట్టుకున్న ఒక యువకుడు కోటి రూపాయల జీతం వచ్చే ఉద్యోగాన్ని కాదనుకున్నాడు. పట్టుదలగా చదివి తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీలో ఆల్ ఇండియా ర్యాంక్ (ఏఐఆర్)ను సాధించాడు.కనిష్క్ కటారియాది రాజస్థాన్‌లోని జైపూర్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బొంబాయి నుండి కంప్యూటర్ సైన్స్‌లో పట్టభద్రుడయ్యారు. అనంతరం అతనికి దక్షిణ కొరియాలోని శామ్సంగ్ కంపెనీలో కోటి రూపాయల జీతంతో ఉద్యోగానికి ఆఫర్ వచ్చింది. వెంటనే ఆయన ఆ సంస్థలో డేటా సైంటిస్ట్‌గా చేరారు. కొన్నేళ్ల తర్వాత కనిష్క్ భారత్‌కు తిరిగి వచ్చి బెంగళూరులో ఉన్న ఒక అమెరికన్ స్టార్టప్‌లో చేరారు. ఆ ఉద్యోగంలో అధిక జీతం వస్తున్నప్పటికీ, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఎఎస్)లో చేరాలనే తన ఆశయాన్ని నెరవేర్చుకునేందుకు ఉద్యోగాన్ని వదిలి జైపూర్‌కు తిరిగి వచ్చాడు.తరువాత రాజధాని ఢిల్లీకి చేరుకుని యూపీఎస్సీ పరీక్షకు కోచింగ్ తీసుకున్నాడు. తన మొదటి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా ర్యాంక్ సాధించాడు. గణితాన్ని తన ఐచ్ఛిక సబ్జెక్ట్‌గా ఎంచుకుని పరీక్షలో విజయం సాధించారు. కనిష్క్ రాత పరీక్షలో 942 మార్కులు, పర్సనాలిటీ టెస్ట్‌లో 179 మార్కులు సాధించారు. మొత్తం మీద 2025 మార్కులకు గాను 1,121 మార్కులు దక్కించుకున్నారు.రాజస్థాన్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన అతని తండ్రి సన్వర్ మల్ వర్మ నుండి కనిష్క్ ప్రేరణ పొందారు. తండి అడుగుజాడల్లో నడుస్తూ తన కలను సాకారం చేసుకున్నారు. కనిష్క్ కటారియా రాజస్థాన్ ప్రభుత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ (డీఓపీ)లో జాయింట్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఇది కూడా చదవండి; లండన్‌లో రేడియో జాకీగా రాణిస్తున్న హైదరాబాదీ -
రాకేశ్ రెడ్డి.. ధైర్యంగా ఉండండి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేశ్ రెడ్డి రెండోస్థానంలో నిలిచారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ.. రాకేశ్‌రెడ్డికి ధైర్యం చెప్పారు. ‘‘ రాకేశ్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలో మీరు సాధ్యమైనంతగా కష్టపడ్డారు. ఫలితాలు ఎప్పుడు కూడా ఆశించినట్లుగా ఉండవు. మీరు దృఢంగా, పాజిటివ్‌గా ఉండండి. ఇదే కష్టాన్ని కొనసాగిద్దాం’’అని కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.You did your best Rakesh. Results are not always in expected linesStay strong, positive and let’s continue to work hard https://t.co/M6Dkx5Sdnm— KTR (@KTRBRS) June 8, 2024అంతకుముందు రాకేశ్ రెడ్డి తనకు అవకాశమిచ్చిన కేసీఆర్‌కు, తనకు మద్దతుగా ఓటేసిన పట్టభద్రులకు ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు. అందరి అంచనాలకు తగినట్లు భవిష్యత్తులో రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తానని తెలిపారు. ఇప్పుడు మాత్రం అంచనాలు అందుకోలేకపోయినందుకు క్షమించాలన్నారు. పార్టీలోకి వచ్చిన అతితక్కువ సమయంలో తనను గుండెలకు అద్దుకున్న బీఆర్ఎస్ శ్రేణులకు, పార్టీలకు అతీతంగా తనకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాని తెలిపారు.ధన్యవాదాలు 💐🙏వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి నాకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చిన భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు @KCRBRSPresident గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.🙏ఈ ఎమ్మెల్సీ…— Rakesh Reddy Anugula (@RakeshReddyBRS) June 8, 2024 ఇక..వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో జనగాం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆయన రాజీనామాతో జరిగిన ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి చెందిన చింతపండు నవీన్‌కుమార్ (తీన్మార్ మల్లన్న) విజయం సాధించారు. -
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రిజల్ట్.. కొనసాగుతోన్న మొదటి రౌండ్ కౌంటింగ్
వరంగల్, ఖమ్మం, నల్లగొంఎ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అప్ డేట్నల్లగొండపట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ అప్ డేట్ఇంకా కొనసాగుతోన్న మొదటి రౌండ్ కౌంటింగ్సాయంత్రం మూడున్నరకు ప్రారంభమైన మొదటి రౌండ్ కౌంటింగ్నాలుగు రౌండ్ల పాటు సాగనున్న మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుఒక్కో రౌండ్ లో 96 వేల చొప్పున లెక్కింపునల్లగొండప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియమధ్యాహ్నం 3.30 గంటలకు ముగిసిన బండిల్స్ కట్టె ప్రక్రియమొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభంఇంకా కొనసాగుతున్న బెండల్స్ కట్టే ప్రక్రియసాయంత్రం 5 తర్వాతనే ఓట్ల లెక్కింపు ప్రారంభంపట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు 4 రౌండ్లలో బ్యాలెట్ ఓట్ల బండిల్స్ కట్టే ప్రక్రియ పూర్తి అయింది ఇంకా మూడు రౌండ్లలో ఈ ప్రక్రియ పూర్తికానుంది. ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మూడు గంటల ప్రాంతంలో కౌంటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ‘పట్టభద్రుల’ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైందిఒక్కో హాల్లో 24 లెక్కింపు టేబుళ్ల చొప్పున మొత్తం 96 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఇందుకోసం 2,100 మంది సిబ్బందిని కేటాయించారు.ఈ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థిగా రాకేశ్‌రెడ్డి, బీజేపీ నేత ప్రేమేందర్ ఎన్నికల బరిలో నిలవగా, వీరితోపాటు మరో 49 మంది పోటీలో ఉన్నారు. నల్లగొండ జిల్లానేడు నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపుతిప్పర్తి మండలం దుప్పలపల్లి వద్ద ఉన్న ప్రభుత్వ గౌడన్స్ లో లెక్కింపుఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం4 హాల్స్ లలో ఒక్కో హాల్ కు 24 టేబుల్స్ చొప్పున మొత్తం 96 టేబుల్స్ ఏర్పాటుపోస్టల్ బ్యాలెట్ ఓట్లని కలిపి లెక్కింపుఉప ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్ధులుమొత్తం ఓటర్లు: 4,63,839పోలైన ఓట్లు: 3,36,013పోలింగ్ శాతం: 72.44రోజుకు మూడు షిఫ్టుల్లో కొనసాగనున్న లెక్కింపుఒక్కో షిఫ్టులో 900 సిబ్బందిమొదటగా బండిల్స్ కట్టే ప్రక్రియఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బండిల్స్ కట్టే ప్రక్రియ కొనసాగే అవకాశంఆతర్వాత చెల్లుబాటు, చెల్లుబాటు కాని ఓట్లను వేరు చేయనున్న సిబ్బందిచెల్లుబాటైన ఓట్లలో మొదటి ప్రాధాన్యత ఓట్లలో సగం కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన వారు గెలిచినట్లు ప్రకటనమొదటి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలకుంటే చివరి నుంచి ఎలిమినేషన్ ప్రక్రియఎలిమినేట్ అయిన అభ్యర్థి రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి వేశారో చూసి వారికి యాడింగ్అలా కలిపిన తర్వాత యాభై శాతానికి మించి వస్తే గెలిచినట్లు ప్రకటననేడు ‘పట్టభద్రుల’ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ బుధవారం ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమై రెండు రోజులపాటు కొనసాగే అవకాశం ఉంది. వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాల పరిధిలోని 605 పోలింగ్ స్టేషన్ల పరిధిలో మొత్తం 52 మంది అభ్యర్థులకు వచ్చిన ఓట్లను మూడు విడతల్లో లెక్కించనున్నారు. బ్యాలెట్ పద్ధతిలో ఈ ఎన్నికలు నిర్వహించినందున ఓట్ల లెక్కింపు ప్రక్రియ సుదీర్ఘంగా సాగనుంది. బుధవారం ఉదయం 8 గంటలకు ఈ ప్ర క్రియ ప్రారంభం అవుతుంది. నా లుగు హాళ్లలో 96 టేబుళ్లపై పోలైన 3,36,013 ఓట్ల లెక్కింపు చేపడతారు. -
పట్టభద్రుల పట్టమెవరికి ?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక బరిలో 52 మంది ఉన్నా, ప్రధానపోటీ మాత్రం ముగ్గురి మధ్యే నెలకొంది. ఈ ఎన్నికలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పారీ్టలతోపాటు కొందరు స్వతంత్రులు పెద్దఎత్తున ప్రచారం చేశారు.సోమవారం పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్‌రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి పోటీలో ఉన్నారు. వారి తరఫున ఆయా పార్టీలు సభలు, సమావేశాలు నిర్వహించాయి. తమకు మద్దతు ఇవ్వాలని వాయిస్ కాల్స్ ద్వారా ఆయా పారీ్టల అధినేతలతోపాటు అభ్యర్థులు పట్టభద్రులను కోరారు. మిగతా గుర్తింపు పొందిన పారీ్టలతోపాటు స్వతంత్రులు పోటీలో ఉన్నా, ప్రధాన పారీ్టలకు పోటీగా ప్రచారం చేయలేకపోయారు. నిరుద్యోగులకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందంటూ కాంగ్రెస్ నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో బీఆర్ఎస్ అధికారంలోకి వచి్చనా, నియామకాల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేదని, నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగిందని, ఉద్యోగులది అదే పరిస్థితి అంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచి్చన తర్వాత ఆరు గ్యారంటీలు అమలు చేయడంతోపాటు ఎన్నికల తర్వాత పాలనలో పారదర్శకత, ఉద్యోగ కల్పన, జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెబుతోంది. ఇప్పటికే 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, తమ పార్టీ అభ్యరి్థని గెలిపించడం ద్వారా ప్రభుత్వానికి మద్దతు ఇస్తే ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని చెబుతూ ప్రజల్లోకి వెళ్లింది. కాంగ్రెస్ మోసం చేసిందంటున్న బీఆర్ఎస్ ఆరు గ్యారంటీలతోపాటు ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులతోపాటు ఉద్యోగులను కూడా మోసం చేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. జాబ్ క్యాలెండర్ లేదని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి చేయలేదని, తమ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ల ఉద్యోగాలను తాము భర్తీ చేశామని కాంగ్రెస్ చెబుతూ మోసం చేస్తోందని ఆరోపిస్తోంది.ఉద్యోగాలకు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిందో ఎప్పుడు పరీక్షలు పెట్టిందో కాంగ్రెస్ పార్టీ చెప్పాలన్న ప్రధాన డిమాండ్‌తో ఈ ఎన్నికలో పట్టుభద్రులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. బీఆర్ఎస్ అభ్యరి్థని గెలిపిస్తే పెద్దలసభలో ప్రభుత్వంపై పోరాడి ఉద్యోగాల కల్పనకు జాబ్‌క్యాలెండర్ ప్రకటించేలా ఒత్తిడి తెస్తామని, పోరాడే పారీ్టకి పట్టం కట్టాలంటూ పట్టభద్రులకు బీఆర్ఎస్ విజ్ఞప్తి చేస్తోంది.రెండూ మోసకారి పార్టీలే అంటున్న బీజేపీకాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ మోసకారి పారీ్టలేనని, వాటి వల్ల నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగిందని బీజేపీ ఆరోపిస్తోంది. నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ వాటిని విస్మరించి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుందని, ఆరు గ్యారంటీలతోపాటు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కంటే అధికంగా అబద్ధాలు చెబుతూ మోసం చేస్తోందని బీజేపీ అంటోంది.నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాల నియామకంలో బీఆర్ఎస్ విఫలం కాగా, కాంగ్రెస్ పార్టీ నోటిఫికేషన్ ఇవ్వకుండా, పరీక్షలు నిర్వహించకుండా 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధపు మాటలతో ప్రజలు, పట్టభద్రులను మోసం చేస్తోందని ప్రచారంలో ఆరోపణలు గుప్పిచింది. ఇలాంటి పారీ్టలకు బుద్ధిచెప్పి బీజేపీకి మద్దతు ఇస్తే నిరుద్యోగుల తరఫున పోరాడుతామని పట్టభద్రులకు బీజేపీ విజ్ఞప్తి చేసింది. మొత్తానికి త్రిముఖ పోటీలో పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారో మరికొద్ది రోజుల్లో తేలనుంది. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ ఫుల్ ఫోకస్.. మరో కొత్త ప్లాన్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోపు ఉప ఎన్నికకు రంగం సిద్థమైంది. పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలను ప్రధాన పార్టీలు సీరియస్‌గా తీసుకుంటున్నాయి. ఇక, బీజేపీ కూడా ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ఇన్‌చార్జ్‌లను నియమించనున్నట్టు తెలుస్తోంది. కాగా, తెలంగాణలో వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ఇన్‌చార్జ్‌ల నియామకం చేపట్టనున్నారు. ఇక, ఇన్‌చార్జ్‌లను నియమించే బాధ్యతను రాష్ట్ర నేతలకు అప్పగించింది బీజేపీ హైకమాండ్. దీంతో, ఇన్‌చార్జ్‌లు ఎవరు అనే అంశంపై చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా ప్రేమందర్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక, కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి పోటీలో నిలిచారు. ఇక, ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. రాష్ట్రంలో ఎంపీ ఎన్నికలు ముగియడంతో ప్రధాన పార్టీలు ఎమ్మెల్సీ ఉపఎన్నికపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవీ కాలం 2027 మార్చి వరకు ఉంది. మరోవైపు.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 52 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు 63 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయగా, 11 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం ముగియడంతో 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. -
బీజేపీలో ‘గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ’ జోష్
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలికి జరగనున్న ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. గతేడాది హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఏవీఎన్‌రెడ్డి బీజేపీ బీ–ఫామ్‌పై గెలిచి మండలిలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. త్వరలో ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటుకు జరిగే ఎన్నికల్లోనూ ఈ ఫలితమే పునరావృతం చేయాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. పట్టభద్రుల స్థానం నుంచి గెలుపునకు ఓటర్ల నమోదు కీలకం కావడంతో దానిపై దృష్టి పెట్టింది. ఇందుకోసం పాతవారితోపాటు పెద్దఎత్తున కొత్తగా డిగ్రీలు, పీజీలు పూర్తిచేసిన వారిని ఓటర్లుగా నమోదు చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహానికి పదును పెడుతోంది. ఓటర్ల నమోదుకు సంబంధించి పెద్దమొత్తంలో ఫామ్–18 దరఖాస్తులను ము ద్రించి పోలింగ్ బూత్ స్థాయి వరకు పంపాలని, ఇందుకోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయా లని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ స్థానానికి గత ఎన్నికల్లో పార్టీ పరంగా జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో తగిన ఓట్లు దక్కని ఈ మూడు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ సీటును గెలుచుకోవడం ద్వారా సత్తా చాటాలని నాయకత్వం యో చిస్తోంది. లోక్‌సభ ఎన్నికలు ముగియగానే... ఈ ఎమ్మెల్సీ ఎన్నిక జరిగే అవకాశం ఉండటంతో పార్టీ కి సానుకూలత పెరుగుతుందని అంచనావేస్తోంది. పార్టీ లో తీవ్ర పోటీ ఈ సీటు కోసం బీజేపీ నేతల మధ్య పోటీ కూడా తీవ్రంగానే ఉంది. ఈ టికెట్‌ను తనకు కేటాయించాలని డా.ఎస్.ప్రకా‹Ùరెడ్డి ఇప్పటికే నాయకత్వాన్ని కోరగా, రాష్ట్ర పార్టీ ప్రధానకార్యదర్శి డా.కాసం వెంకటేశ్వర్లు యాదవ్ కూడా ఈ సీటును కోరుకుంటున్నారు. గతంలో పోటీచేసి ఓడిన ప్రధానకార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి కూడా రేసులో ఉన్నారు. వీరితోపాటు వివిధ విద్యాసంస్థల అధినేతలు, విద్యావేత్తలు కూడా బీజేపీ టికెట్‌ను కోరుకుంటున్న వారిలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ స్థానం నుంచి గెలుపొందిన బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటు ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఈ స్థానానికి జూన్ 8 లోగా ఎన్నిక నిర్వహించాల్సి ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం సైతం ఓటర్ల నమోదుకు షెడ్యూల్ విడుదల చేసింది. ఇందుకు ఫిబ్రవరి 6 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది. పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఫ్రెష్‌గా ఓటరుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్థానం నుంచి పోటీకి ఉత్సాహం చూపుతున్న ఇతర పార్టీ ల నాయకులు సైతం ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసేవారు సైతం ఈ విషయంలో తమ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఈ పట్టభద్రుల సీటుకు ఓటర్ల నమోదుకు మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావును ఇన్చార్జిగా నియమించారు. -
కొన్నే ఉద్యోగాలు.. వందల్లో ఉద్యోగార్థులు.. వీడియో వైరల్
ఒక దేశ ప్రగతికి అవరోధంగా నిలిచే ప్రధాన సమస్యల్లో నిరుద్యోగం ఒకటి. చేయడానికి పని లేక.. ఉపాధి లేక.. అర్హతలుండి కొందరు, అర్హతల్లేక మరికొందరు నిరుద్యోగితను ఎదుర్కొంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని ఓ కంపెనీ వాక్ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తుందనే సమాచారంతో పెద్దఎత్తున యువత ఒక్కసారి రావడంతో గేట్లు మూసివేశారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కొవిడ్ కారణంగా సాఫ్ట్వేర్ కంపెనీల వృద్ధిరేటు తగ్గిపోయింది. దానికితోడు అంతర్జాతీయ అనిశ్చితుల వల్ల బ్యాంకింగ్, ఆటోమొబైల్ వంటి కీలక రంగాలో సాఫ్ట్వేర్ అప్డేట్లు, కొనుగోళ్లు నిలిచిపోయాయి. దాంతో ఉద్యోగుల అవసరం తగ్గిపోయింది. గ్లోబల్‌గా నెలకొన్ని యుద్ధభయాల వల్ల కొన్ని దిగ్గజ కంపెనీలు సైతం ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాయి. సిబ్బందికి లేఆఫ్స్ ఇచ్చి ఇంటికి పంపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎక్కడైనా ఓపెనింగ్స్ ఉన్నాయంటే చాలు వందల్లో ఉద్యోగార్థులు వస్తున్నారు. ఇదీ చదవండి: వర్క్ ఫ్రం హోంపై ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం Situation of walk-in interviews in India. This is in Hyderabad. pic.twitter.com/DRyz4R4YgM — Indian Tech & Infra (@IndianTechGuide) November 1, 2023 -
సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో విద్యార్థుల సందడి (ఫోటోలు)
-
ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ పరీక్షలో 87 శాతం మంది ఫెయిల్
సాక్షి, హైదరాబాద్: ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ పరీక్ష (ఎఫ్ఎంజీఈ) పాసవడం కష్టతరంగా మారింది. ఇటీవల జరిగిన ఎఫ్ఎంజీఈ పరీక్షలో 13 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులైనట్లు జాతీయ పరీక్షల బోర్డు (ఎన్బీఈ) ప్రకటించింది. దీంతో విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుపై విమర్శలు వస్తున్నాయి. నాణ్యమైన వైద్య విద్య ఆయా దేశాల్లో ఉండటం లేదన్న ఆరోపణలకు ఈ ఫలితాలు నిదర్శనంగా చెబుతున్నారు. విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేశాక మన దేశంలో ప్రాక్టీస్ చేసేందుకు, లైసెన్స్ పొందడానికి, మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్‌కు, పీజీ మెడికల్ చదవడానికి ఎఫ్ఎంజీఈ పాస్ కావాలి. 2015–18 మధ్య జరిగిన ఎఫ్ఎంజీఈ పరీక్షకు ఆ నాలుగేళ్లలో 61,418 మంది విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసినవారు హాజరుకాగా, 8,731 మంది మాత్రమే పాసయ్యారని కేంద్రం వెల్లడించింది. అంటే ఆ నాలుగేళ్లలో కేవలం 14.22 శాతమే పాస్ అయ్యారు. ఈ ఏడాది అది మరింత తక్కువగా ఉండటం విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఏడాది జూలైలో 24,269 మంది ఎఫ్ఎంజీఈ పరీక్ష రాయగా, కేవలం 3,089 మందే పాసయ్యారు. మిగిలిన 21,180 మంది ఫెయిల్ అయ్యారు. అంటే ఏకంగా 87 శాతం మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. చైనా, రష్యాలకు ఎక్కువగా వెళుతుండగా, ఆయా దేశాల్లో చదివినవారిలో తక్కువ శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రతీ విద్యార్థి ఈ ఎఫ్ఎంజీఈ పరీక్ష రాయడానికి మూడుసార్లు మాత్రమే అవకాశముంటుంది. కొన్ని దేశాలు, కొన్ని కాలేజీల్లో నాసిరకమైన వైద్య విద్య ఉండటం, మన దేశంలోని వైద్య విద్యకు సమాన స్థాయిలో ప్రమాణాలు లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంటుందని చెబుతున్నారు. పైగా చైనా, రష్యాల్లో ఆయా దేశ భాషలోనే వైద్య విద్య నేర్చుకుంటారు. ఇక్కడకు వచ్చాక ఎఫ్ఎంజీఈ పరీక్ష ఇంగ్లిష్‌లో ఉంటుంది. దీనివల్ల చాలామంది ఫెయిల్ అవుతున్నారు. పైగా ఎఫ్ఎంజీఈ పూర్తిగా థియరీగా ఉండటం వల్ల కూడా ఫెయిల్ అవుతున్నట్లు చెబుతున్నారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, యూకేల్లో ఎంబీబీఎస్ లేదా తత్సమాన వైద్య విద్య పూర్తి చేసినవారికి మన దేశంలో ఎఫ్ఎంజీఈ పరీక్ష రాయాల్సిన అవసరంలేదు. . ఎక్కువ ఫీజుతో విదేశాలకు దేశంలో ఎంబీబీఎస్ సీట్లు ఎన్ని పెరుగుతున్నా, డిమాండ్‌కు తగినంతగా సీట్లు లేకపోవడంతో అనేకమంది విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 20.38 లక్షల మందికి విద్యార్థులు నీట్ పరీక్ష రాయగా, అందులో 11.45 లక్షల మంది అర్హత సాధించారు. కానీ మన దేశంలో కేవలం 1.08 లక్షల ఎంబీబీఎస్ సీట్లే ఉన్నాయి.దీంతో మన దేశంలో సీటు రానివారు, విదేశాల్లో ఎంబీబీఎస్ కోసం వెళ్తుంటారు. మరికొందరు మన దేశంలోనే ఎండీఎస్ లేదా ఆయుష్ కోర్సులు చేస్తుంటారు. ఇక మన రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మొత్తం 8,490 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. కాగా, తెలంగాణ నుంచి ఈ ఏడాది 72,842 మంది నీట్ పరీక్షకు హాజరయ్యారు. అందులో 42,654 మంది ఉత్తీర్ణత సాధించారు. అంటే ఇంకా చాలామంది సీటు కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీటు పొందాలంటే డొనేషన్లు ఎక్కువగా ఉంటాయి. కోర్సు పూర్తి చేయాలంటే బీ కేటగిరీ ఫీజు ఏడాదికి రూ. 11.55 లక్షలు, ఎన్ఆర్ఐ సీటు ఫీజు రూ. 23.10 లక్షల వరకు ఉంటుంది. ఆయా దేశాల్లో ఫీజు తక్కువే కానీ.. అదే విదేశాల్లో చదివితే దేశాన్ని బట్టి ఎంబీబీఎస్ కోర్సు మొత్తం పూర్తి చేసేందుకు రూ. 30 లక్షల నుంచి రూ. 40 లక్షల ఫీజు మాత్రమే ఉంటుంది. దీంతో చాలామంది విద్యార్థులు చైనా, రష్యా, ఉక్రెయిన్, నేపాల్, కజకిస్తాన్, జార్జియా, పిలిఫ్పైన్స్, కిర్గిస్తాన్, బంగ్లాదేశ్, అర్మేనియా తదితర దేశాల్లో ఎంబీబీఎస్ చదువుతున్నారు. -
వీడెవండి బాబు.. వారానికి 4 రోజుల పని.. రూ.50 వేల జీతం.. ఇవి సరిపోతాయా సార్!
ప్రస్తుత రోజుల్లో ఉద్యోగం సాధించడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. కాలేజ్‌లో ఎంత బాగా చదివిన ఎన్ని మార్కులు వచ్చినా .. జాబ్‌కు దగ్గరకు వచ్చే సరికి అవన్నీ ఇంటర్వ్యూ గదిలోకి వెళ్లడం వరకు మాత్రమే పని చేస్తాయి. అక్కడి నుంచి ఉద్యోగం తెచ్చుకోవడం మన స్కిల్స్‌పై ఆధారపడి ఉంటుంది. ఇక అంత కష్టపడి జాబ్ వచ్చాక మనకు నచ్చినట్లు ఉండాలంటే కదరదు. రోజూ 8 గంటల పని.. ఇక ఆఫీసులో క్షణం తీరిక లేకుండా సంస్థను మెప్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగి దినచర్య అంటే ఇలానే ఉంటుంది. అయితే ఇటీవల ఓ ఫ్రెషర్‌ను ఇంటర్వ్యూ చేయగా.. అతని డిమాండ్లు చూసి ఇంటర్వ్యూర్ షాక్ అయ్యాడు. ఈ విషయాన్నే సోషల్‌మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. కోల్‌కతాలోని ఒక న్యాయవాది ఇటీవల లిటిగేషన్ అసోసియేట్ పోస్ట్ కోసం ఒక ఫ్రెషర్‌ను ఇంటర్వ్యూ చేశాడు. అయితే ఇంటర్య్వూకి వచ్చిన ఆ అభ్యర్థి తనుకు ఉన్న డిమాండ్లతో పాటు రూ. 50,000 జీతం కావాలని చెప్పడట. దీంతో ఆయన ఆశ్చర్యపోయారు. ఈ విషయాన్ని ట్వీట్ చేస్తూ.. 'లిటిగేషన్ అసోసియేట్ పోస్ట్ కోసం ఓ ఫ్రెషర్‌ను ఇంటర్వ్యూ చేశాను. అతను పని చేయాలంటే.. తనకి వారంలో 4 రోజులు, రోజుకు 4 గంటలు మాత్రమే పని చేస్తానని చెప్పాడు. అలాగే కోర్టుకు వెళ్లడం కూడా తనకి ఇష్టం లేదని, అందుకే ఆఫీసులో ఉండి చేసే ఉద్యోగం కావాలని చెప్పాడు. కోల్‌కతలో ఉద్యోగం కాబట్టి జీతం రూ.50 వేలు ఇవ్వాలన్నాడు. ఈ తరానికి నా ఆశిస్సులు.' అని అన్నారు. కోల్‌కతాలో జీవన వ్యయం చాలా తక్కువగా ఉంటుంది. ఫైనాన్షియల్ కంపెనీ మెర్సెర్ ప్రపంచ వ్యాప్తంగా 227 నగరాలపై కాస్ట్ ఆఫ్ లివింగ్ 2023 సర్వే నిర్వహించగా అందులో కోల్‌కతా 211వ స్థానంలో నిలించింది. అంటే చాలా తక్కువ ఉంటుందని దాని అర్థం. ముంబై, ఢిల్లీ వంటి నగరాలు భారతీయ నగరాల్లో అగ్ర స్థానాల్లో ఉన్నాయి. కోల్‌కతా వంటి నగరాలలో ఉండి కూడా.. ఒక ఫ్రెషర్ అయ్యిండి అంత ఎక్కువ శాలరీతో పాటు ఇన్ని డిమాండ్ చేయడంపై నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇలా అయితే ఎక్కడ ఉద్యోగం రాదని కామెంట్ చేయగా.. మరికొందరు ఈ డిమాండ్లు సరిపోతాయా అంటూ కామెంట్లు పెడుతున్నారు. Interviewed a fresher for a litigation associate post who wants 4 days work week, 4 hrs/day work (because he doesn't like going to court and will only be in chamber he said), and 50K salary in Kolkata. Bless this generation. ❤️ — Jhuma (@courtinglaw) July 23, 2023 చదవండి రోడ్డుకు అడ్డంగా పడుకుని పోలీసు వినూత్న నిరసన.. ఏం జరిగిందంటే? -
అసలేం జరుగుతోంది.. డిగ్రీ పట్టా అందుకొని ‘శవాలు’గా విద్యార్ధులు!
బీజింగ్: ఇప్పుడు చైనాలో కొత్త ట్రెండ్ నడుస్తోంది. గ్రాడ్యుయేషన్ పట్టాలు అందుకున్న విద్యార్థులు శవాల్లా పోజులిస్తూ ఫొటోలు తీయించుకుంటున్నారు. అనంతరం వాటిని అక్కడి సోషల్‌మీడియాలో చనిపోయే ఉన్నాం అని ట్యాగ్‌లైన్‌తో పోస్ట్ చేస్తున్నారు. అసలు విద్యార్థులు ఇలా ఎందుకు చేస్తున్నారు.. ఇదేమైనా ప్రాంక్ అనుకుంటే మీ పొరపాటే. అక్కడి విద్యార్థులు తమ నిరసనను ఈ రకంగా తెలుపుతున్నారు. దీని వెనుక ఉన్న స్టోరీ ఏంటంటే.. ప్రస్తుతం డ్రాగన్ కంట్రీలో నిరుద్యోగం తాండవిస్తోంది. ఎంతో కష్టపడి డిగ్రీలు చేసినా.. తమకు ఉపాధి లభించడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తాము బతికినా చచ్చినా ఒకటేననే భావంతో ఈ రకంగా నిరసన తెలుపుతున్నారు. తాజాగా ఈ ఫొటోలు చైనీస్ సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. శవాలుగా చైనీస్ విద్యార్థులు ఒక దశాబ్దం క్రితం వరకు ఉపాధి, అభివృద్ధి వైపు దృష్టి సారించిన చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం. ఇటీవల మాత్రం అంతర్జాతీయ వ్యవహారాలు, భద్రతపై దృష్టి పెడుతుండటంతో దేశ వృద్ధి రేటు మందగించింది. దేశవ్యాప్తంగా మొత్తం ఉద్యోగాలలో 80 శాతం ప్రైవేట్ రంగం వాటాను కలిగి ఉంది. అంతటి ప్రాముఖ్యం ఉన్న ప్రైవేట్ రంగంపై చైనా తీసుకున్న కఠిన నిర్ణయాలు ప్రస్తుతం విద్యా రంగానికి భారీ నష్టాన్ని కలిగించడంతో పాటు కొన్ని సంస్థలు మూసివేయడమో లేదా తమ వాటాను తగ్గించుకునే పనిలో పడ్డాయి. చైనాలో, రికార్డు స్థాయిలో 11.6 మిలియన్ల తాజాగా వారి గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేసుకుని ఉద్యోగాల వేట ప్రారంభించనున్నారు. ఇదిలా ఉండగా గత మేలో, పట్టణ చైనాలో నిరుద్యోగం రేటు 20.8 శాతానికి చేరుకుంది. ఓ వైపు పరిస్థితులు ఇలా ఉండగా.. కొత్తగా ఉద్యోగార్ధుల ప్రవాహం మరింత పెరుగుతుండడం..ఆ దేశంలో నిరుద్యోగ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. పనికి రాని డిగ్రీ పట్టాలు.. ప్రతి సంవత్సరం లక్షల్లో విద్యార్థులు డిగ్రీ పట్టా పట్టుకుని జాబ్ మార్కెట్లోకి ప్రవేశించడంతో.. ఆ డిగ్రీలకు విలువ లేకుండా పోయిందని చైనా విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల చైనాలో ఇప్పుడు ఎక్కువ మంది విద్యార్థులు మాస్టర్స్, పీహెచ్డీ అభ్యసించేందుకు మొగ్గు చూపుతున్నారు. అయినప్పటికీ తమ చదువుకి తగ్గ ఉద్యోగం వస్తుందని గ్యారెంటీ లేదని అక్కడి విద్యార్థులు వాపోతున్నారు. చదవండి: ఆ ఏడు 'పిల్లుల పేర రూ. 2.4 కోట్ల ఆస్తి! తీసుకునేందుకు ఎగబడుతున్న జనం.. -
కన్నీళ్లు తెప్పిస్తున్న డెలివరీ బాయ్ కష్టాలు.. కస్టమర్ సాయంతో జాబ్ కొట్టాడిలా!
Swiggy Delivery Boy: ప్రస్తుతం చాలామంది ఉద్యోగులు ఏసీ గదుల్లో పనిచేస్తూ లక్షల్లో జీతాలు తీసుకుంటూ కూడా ఏదో కారణాలు చెబుతూ అసంతృప్తి చెందుతూ ఉంటారు. అయితే మరి కొంతమంది వారు చేసే ఉద్యోగం చిన్నదైనా.. ఆ పనిని ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళుతుంటారు. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ చేసే పనిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా పట్టు వదలని విక్రమార్కుల్లా సాహసాలు చేస్తూ ఉంటారు. అలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు 'సాహిల్ సింగ్'. ఇంతకీ ఈ సాహిల్ సింగ్ ఎవరు? అతనికొచ్చిన కష్టమేంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. జమ్మూ & కాశ్మీర్ ప్రాంతానికి చెందిన 30 సంవత్సరాల సాహిల్ సింగ్ మేవార్ యూనివర్సిటీ నుంచి 2018లో బిటెక్ పూర్తి చేశారు. చదువు పూర్తయిన తరువాత నింజాకార్ట్‌లో పని చేశాడు. ఆ తరవాత బైజూస్‌లో కూడా పనిచేశాడు. అయితే దేశంలో అధికంగా కరోనా మహమ్మారి సమయంలో తన సొంతూరుకు వెళ్ళిపోయాడు. కాగా కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టిన తరువాత మళ్ళీ స్విగ్గిలో డెలివరీ బాయ్ ఉద్యోగంలో చేరాడు. ఇటీవల ఓ టెక్ కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్‌గా పని చేస్తున్న 'ప్రియాన్సీ చాందెల్' అనే మహిళ స్విగ్గిలో ఫుడ్ ఆర్డర్ చేసింది. అయితే ఆమెకు డెలివరీ బాయ్ సాహిల్ సింగ్ ఫుడ్ డెలివరీ ఇచ్చాడు. డెలివరీ ఇచ్చిన తరువాత మెట్లపైన ఆయాసపడుతూ కూర్చున్నప్పుడు ఆమె ఏమైందని పలకరించింది. అప్పుడతడు.. మేడమ్, ట్రావెల్ చేయడానికి నా దగ్గర స్కూటర్ లేదు. ట్రాన్స్‌పోర్టేషన్ ఫెసిలిటీ కూడా ఇవ్వలేదు. అందుకే 3 కిలోమీటర్లు నడుచుకుంటూ ఆర్డర్ డెలివరీ చేసాను. నా దగ్గర డబ్బు లేదు. ఉన్న డబ్బు మా ఫ్లాట్మేట్కి అవసరం ఉన్నాయంటే ఇచ్చాను. (ఇదీ చదవండి: ఐఫోన్ లవర్స్‌కి ఇది కదా శుభవార్త - ఈ ఆఫర్స్‌తో పండగ చేసుకోండి!) నేను అబద్ధం చెబుతున్నానని మీకు అనిపించొచ్చు. కానీ నేను గ్రాడ్యుయేట్ చేసాను. ఇప్పటికే నింజాకార్ట్, బైజూస్‌లో కొద పనిచేసాను. ఇప్పుడు ఒక ఆర్డర్ డెలివరీ చేస్తే నాకు రూ. 20 నుంచి రూ. 25 మాత్రమే వస్తాయని, అందులోనూ కస్టమర్ ఇచ్చిన టైమ్ లోపల డెలివరీ చేయాల్సి ఉంటుందని చెప్పాడు. అంతే కాకుండా సరిగ్గా తిండి తిని వారం రోజులైందని, కేవలం టీ.. వాటర్‌తో గడిపేస్తున్నాని, అమ్మానాన్న వయసు కూడా పెరుగుతోందని ఇప్పుడు కూడా వారిపై ఆధారపడటం ఇష్టం లేదని, కనీసం నెలకు 25 వేలు సంపాదించాలనుందని, ఏదైనా జాబ్ ఉంటే చూడమని చెప్పాడు. (ఇదీ చదవండి: నెటిజన్లను భయపెడుతున్న ఆనంద్ మహీంద్రా ట్విటర్ వీడియో) ఇదంతా విన్న ప్రియాన్సీ చాందెల్ అతడు చెప్పినవన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, మార్క్ షీట్స్, అడ్రెస్ వంటి వాటిని కూడా యాడ్ చేసింది. ఆఫీస్ బాయ్, అడ్మిన్ వర్క్, కస్టమర్ సపోర్ట్ లాంటి ఏదైనా జాబ్ దయచేసి చెప్పండని రిక్వెస్ట్ చేసింది. ఇది చూసిన చాలామంది అతనికి డబ్బు సహాయం కూడా చేసారు, మరి కొంతమంది ఫుడ్ ఆర్డర్ కూడా చేశారు. చివరికి అతనికి ఉద్యోగం వచ్చేసింది. సాహిల్‌కి ఉద్యోగం లభించిందని ప్రియాన్సీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. -
అద్దె భూమిలో వ్యవసాయం - కోట్లు సంపాదించేలా..
MBA Graduate Rajeev Bhaskar: నిజానికి సక్సెస్ మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. అయితే ఆలాంటి సక్సెస్ రావడానికి నిరంతరం కష్టపడాలి. ఆ కష్టమే మనిషిని విజయపథంలో ముందుకు తీసుకెళుతుంది. వ్యవసాయం చేస్తూ కోట్లు గడిస్తున్న గ్రాడ్యుయేట్స్‌లో ఒకరు రాజీవ్ భాస్కర్. ఇంతకీ ఇతని సక్సెస్ స్టోరీ ఏంటి? దీని కోసం ఎంతలా కష్టపడ్డానే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. విఎన్ఆర్ సీడ్స్‌లో సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్ మెంబర్‌గా పనిచేసిన రాజీవ్ ఇప్పుడు వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. సీడ్స్ కంపెనీలో అతనికి ఏర్పడిన అనుభవమే భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులతో మాట్లాడే అవకాశాన్ని కల్పించింది, అంతే కాకుండా వ్యవసాయం మీద అతనికి ఆసక్తిని ఏర్పరచింది. వ్యవసాయంలో కొత్త పోకడలను తెలుసుకుని కొత్తగా వ్యవసాయం చేయడం మొదలెట్టిన రాజీవ్ థాయ్ జామ రకం పంటలు పండిస్తూ బాగా సంపాదిస్తున్నాడు. 2017లో తన ఉద్యోగాన్ని వదిలి హర్యానాలోని పంచకులలో ఐదు ఎకరాల భూమిని అద్దెకు తీసుకుని జామ పండించడం ప్రారంభించాడు. రాజీవ్ భాస్కర్ పంటల పెరుగుదలను ప్రోత్సహించడానికి సేంద్రీయ పదార్థాలతో తయారు చేసిన బయోసైడ్లు, బయోఫెర్టిలైజర్లను ఉపయోగించాడు. పంటను పురుగులు, కీటకాల బారి నుంచి రక్షించడానికి మూడు పొరల బ్యాగింగ్ టెక్నిక్ ఉపయోగించాడు. ఇది వ్యవసాయాభివృద్ధికి బాగా దోహదపడింది. (ఇదీ చదవండి: ఆధార్ అప్డేట్ చేస్తున్నారా? కొత్త రూల్స్ వచ్చేశాయ్.. చూసారా..!) తన మొదటి పంట 2017 అక్టోబరు & నవంబర్ మధ్య కాలంలో చేతికొచ్చింది. అప్పుడు అతడు రూ. 20 లక్షల వరకు సంపాదించాడు. ఆ తరువాత కూరగాయల పంటలను కూడా అదే పద్దతిలో పండించడం మొదలుపెట్టాడు. అయితే కూరగాయలను విక్రయించడంలో కొంత వెనుకపడ్డాడు, కానీ జామ పంటను అలాగే ముందుకు కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం అతడు 2019లో ముగ్గురు పెట్టుబడిదారులతో పంజాబ్‌లోని రూప్‌నగర్‌లో సుమారు 55 ఎకరాల భూమిని లీజుకు తీసుకున్నాడు. (ఇదీ చదవండి: Toyota FJ Cruiser: ఈ టయోటా కారు కావాలన్నా కొనలేరు - ఎందుకంటే?) 2019 తరువాత రాజీవ్, అతని బృందం పంజాబ్‌లో 25 ఎకరాల భూమిలో జామ చెట్లను నాటారు. అదే సమయంలో పంచకుల తోటలోని ఐదు ఎకరాలలో కూడా థాయ్ జామపండ్లను పండించడం కొనసాగించారు. రెండు విధాలుగా వర్షాకాలం, చలికాలంలో పంటలు పండిస్తూ భారీగా ఆర్జించడం మొదలుపెట్టారు. రాజీవ్ తన జామ మొక్కల సగటు గరిష్ట దిగుబడిని మొక్కకు 25 కిలోల నుంచి 40 కిలోలకు పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం రసాయనాలు ఉపయోగించే కాలంలో సేంద్రియ వ్యవసాయం కొంత కఠినంగా ఉండనియూచెబుతున్నారు . అయినప్పటికీ అదే పద్దతిని కొనసాగిస్తామని చెప్పుకొచ్చారు. మొత్తం మీద ఉన్న ఉద్యోగం వదిలి వ్యవసాయంలోనే కోట్లు గడిస్తున్న రాజీవ్ ఎంతోమందికి ఆదర్శం అనే చెప్పాలి. -
ఇలా చేశారంటే ఇక మీ కెరీర్ రాకెట్ స్పీడే.. దూసుకుపోతుందంతే..!
ప్రతీ గ్రాడ్యుయేట్‌కు ఒక లెక్క ఉంటుంది.. 4 సంవత్సరాల ప్రిపరేషన్, పరీక్షల తర్వాత, వారు ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి కెరీర్‌ను తయారు చేసుకోవడానికి సిద్ధమవుతారు. జాబ్ మార్కెట్‌ను ఛేదించే సామర్థ్యం తమకు ఉందని నమ్ముతారు. కానీ ప్రస్తుత వాతావరణంలో ’ఫ్రెషర్’ లేబుల్ చాలా మంది గ్రాడ్యుయేట్లకు అడ్డంకి మారుతోంది. ఫ్రెషర్స్ వర్సెస్ ఎక్స్పీరియన్స్ సాధారణంగా సంస్థల యాజమాన్యాలు అప్పటికే నిరూపితమైన ట్రాక్ రికార్డ్‌లు కలిగిన సిబ్బందిని కోరుకుంటాయి. ఎందుకంటే నైపుణ్యం కలిగిన ఉద్యోగుల వల్ల కలిగే దీర్ఘకాలిక ప్రయోజనాలు ఫ్రెషర్ల వల్ల అయ్యే తక్కువ నియామక ఖర్చుల కన్నా ఎక్కువ ఉంటాయి. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని బయటకు వస్తున్న గ్రాడ్యుయేట్లు తరగతి గదిలో సంస్థాగత గత విధులు నేర్చుకోలేరు. అది అనుభవం నుంచి మాత్రమే వస్తుంది. అందుకే గ్రాడ్యుయేట్లు కళాశాల నుంచి బయటకు వచ్చిన తర్వాత వారి మొదటి ఉద్యోగాలను పొందడం కష్టంగా భావించడంలో ఆశ్చర్యం లేదు. గ్లోబల్ అస్థిరత అనిశ్చితి ఎక్కువగా ఉండటంతో పోస్ట్–పాండమిక్ జాబ్ మార్కెట్ లో కష్టతరమైన పరిస్థితులను ఫ్రెషర్లు ఎదుర్కొంటున్నారు. కంపెనీలు తమ ఆఫర్ లెటర్లను రద్దు చేస్తున్నాయి లేదా కొత్త, మరింత కఠినమైన నియామక పద్ధతుల నేపథ్యంలో తమ రిక్రూట్‌మెంట్‌ను ఆలస్యం చేస్తున్నాయి, దీనివల్ల వీరు అడ్డంకులు ఎదుర్కొంటున్నారు. నైపుణ్యమే.. విజయం.. ఫ్రెషర్లు కెరీర్ వేటలో ఉన్నప్పుడే మరింత ఎక్కువ నైపుణ్యత సాధించి, పోటీని దూరం చేయవచ్చు, ఆకర్షణీయమైన సామర్ధ్యాల పోర్ట్‌ఫోలియోను రూపొందించడం ద్వారా అడ్డంకులను దాటవేయవచ్చు. గ్రేట్ లెర్నింగ్ అనే సంస్థ ఇటీవలి నివేదిక ప్రకారం.. కెరీర్ ప్రారంభంలో నైపుణ్యం పెంచుకోవడంలో వ్యయ ప్రయాసలను పెట్టుబడి పెట్టే వారు తోటివారి కంటే రెండింతలు ఎక్కువ సంపాదిస్తారు. ఎక్కువ ఇంక్రిమెంట్లను పొందుతారు. మిగతా వారి కంటే చాలా ముందుగానే ఆర్థిక స్వాతంత్య్రం పొందుతారు. ఆధునిక జాబ్ మార్కెట్ నైపుణ్యం రీస్కిల్లింగ్‌ను చాలా ముఖ్యంగా పరిగణిస్తుంది. ఎంపిక జాగ్రత్త.. వ్యక్తిగత సామర్ధ్యాల గురించి ఒక అంచనాకు వచ్చిన తర్వాత దేనిని ఎంచుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుతం ఫైనాన్స్ టెక్నాలజీ పరిశ్రమలు అధిక జీతాలను అందించేవిగా పరిగణించబడుతున్నాయి. పెరుగుతున్న డిజిటలైజేషన్‌తో, ముఖ్యంగా డేటా సైన్స్, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ హాటెస్ట్ సెక్టార్లలో ఒకటిగా ఉద్భవించింది. గత 2022లో, డేటా సైన్స్‌లో నైపుణ్యాలను పెంపొందించడం వల్ల 2040 నాటికి వారి జీతం 57.9 ఎల్పిఎకి.. నైపుణ్యం లేని వారి తోటివారి కంటే 3 రెట్లకు చేరుకునే అవకాశం ఉందని గ్రేట్ లెర్నింగ్ అధ్యయనం వెల్లడించింది. అదేవిధంగా, 2022లో నైపుణ్యం పెంచుకునే మార్కెటింగ్ ప్రొఫెషనల్ 10 సంవత్సరాల వ్యవధిలో వారి తోటివారి కంటే 100 శాతం ఎక్కువ సంపాదిస్తారు. అలాగే ఆధునిక–యుగపు నైపుణ్యాలు కలిగిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ నిపుణుడు తోటివారి కంటే 4రెట్ల వరకు సంపాదించగలరు. నైపుణ్యం లేని ఒక ప్రొఫెషనల్ వారి పదవీ విరమణ కార్పస్ ఫండ్ ఏర్పాటు కోసం 60 సంవత్సరాల ఆగాల్సి వస్తే... నైపుణ్యం కలిగిన నిపుణులు 50 సంవత్సరాల వయస్సులోపే వారి పదవీ విరమణ నిధిని కూడబెట్టుకుంటారు. పేపర్ పులి కావద్దు... కేవలం కాగితంపై స్కిల్స్ థృవీకరణ పొందడం కంటే వాస్తవిక సామర్థ్యాన్ని పెంపొందించడంపై దృష్టి పెట్టాలి. పెట్టుబడి పెట్టిన సమయం, డబ్బుపై సాధ్యమైనంత ఎక్కువ రాబడిని సాధించడానికి, పరిశ్రమకు సంబంధించిన పాఠ్యాంశాలను అందించే ప్లాట్‌ఫామ్‌ను ఎంచుకోవడం చాలా అవసరం. ఈ ప్రయాణంలో ఎదుర్కొనే సవాళ్లను పరిష్కరించడంలో ఇది సహాయపడుతుంది. నియామక కంపెనీలతో అనేక అప్‌స్కిల్లింగ్ ప్లాట్‌ఫామ్‌లు కనెక్షన్లను కలిగి ఉన్నాయి. నెట్వర్క్ పెంచుకోండి.. సామాజిక వృత్తిపరమైన పరిచయాలను పెంచుకోవడం అవసరం. ఇది అప్‌స్కిల్లింగ్‌లో తరచుగా చాలా మంది పట్టించుకోని అంశం. పరిశ్రమ డొమైన్లో అభ్యర్థి తమ నైపుణ్యం సెట్లను అప్డేట్ చేసిన తర్వాత, తదుపరి దశలో తోటి అభ్యాసకుల ద్వారా పరిశ్రమతో కనెక్ట్ అవ్వడం అలాగే ఉపాధి–కేంద్రీకృత ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లను తరచుగా పరిశీలించాలి. అలాగే సృజనాత్మకతను, వృత్తిపరమైన సంబంధాలను పెంపొందించుకోవడానికి సహాయపడే సోషల్ నెట్‌వర్క్‌ను రూపొందించుకోవాలి. ఒకే రకపు ఆలోచన కలిగిన నిపుణులతో పరస్పర చర్చలు చేయాలి. నైపుణ్యాలను కలిగి ఉండటం మాత్రమే సరిపోకపోవచ్చు; వాటిని ప్రదర్శించాలి ఎందుకు మీరు అర్హత పొందారో చూపించాలి: అందుబాటులో ఉన్న టూల్స్ ను నేర్చుకోవడం ద్వారా వాటి ప్రయోజనాన్ని పొందాలి. గ్రూపులు ఫోరమ్‌లలో చేరాలి. అలాగే వివిధ ఈవెంట్లలో పాల్గొనాలి. సుస్థిరమైన సభ్యుల గ్లోబల్ నెట్‌వర్క్‌తో కనెక్ట్ కావాలి. పరిశ్రమకు సంబంధించిన ప్రోగ్రామ్‌లు, హ్యాకథాన్లు సమ్మిట్ల వంటి లైవ్ ప్రాజెక్ట్‌లలో పాల్గొనడం ద్వారా నెట్‌వర్కింగ్‌ను బలోపేతం చేసుకోవాలి. పోర్ట్‌ఫోలియో... ఓ గుర్తింపు. పోర్ట్‌ఫోలియో అనేది మీ గుర్తింపు, మీరు వ్యక్తిగతంగా కాబోయే యజమానిని కలిసే ముందు అది మీ గురించి చెబుతుంది. అలాగే, ఆధునిక, సమకాలీనమైన మీ ప్రతిభ సామర్థ్యాలపై అంతర్గత వీక్షణను అందించగల నిర్దిష్ట డాక్యుమెంటు గురించి చాలా జాగ్రత్తలు తీసుకోండి. మీ అనుభవాలను వివరించాలి. మీ విజయాలను ప్రదర్శించడానికి వెనుకాడకండి. ప్రాజెక్ట్‌లలో మీరు చూపించిన డైరెక్ట్ రిజల్టులను హైలైట్ చేయండి, పురోగతి భావాన్ని, విజయం సాధించాలనే ఆరాటాన్ని ప్రదర్శించండి. మీరు ఎంచుకున్న నైపుణ్యాలతో సివిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. –హరికృష్ణన్ నాయర్, కో ఫౌండర్, గ్రేట్ లెర్నింగ్ -
‘కూతురు పుట్టిందని కోట్ల జీతం కాదన్నాడు’..మనసును హత్తుకునే ఓ తండ్రి కూతురు కథ
ఆడ పిల్లకి అమ్మ..అన్న.. అక్క.. ఇలా ఎంతమంది ఉన్నా..తన కోసం తపించేది..బాధ్యతగా కడవరకు నిలిచేది తన మనుసు అర్ధం చేసుకునే నేస్తం.. నాన్న ఒక్కరే. అలాంటి ఓ నాన్న పుట్టిన కుమార్తె కోసం ఎవరూ తీసుకోని నిర్ణయం తీసుకున్నారు. మనసును హత్తుకునే ఓ తండ్రి కూతురు కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఖరగ్‌పూర్ ఐఐటీ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన అంకిత్ జోషి తన కుమార్తె పుట్టడానికి కొన్ని రోజుల ముందు అత్యధిక జీతం పొందే ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇలాంటి నిర్ణయం కెరియర్ను ప్రశ్నార్ధకంగా మార్చేస్తుంది. కానీ తనకి మాత్రం తండ్రిగా ప్రమోషన్ వచ్చిందని పొంగిపోతున్నాడు. అంకిత్ జోషి ఓ సంస్థలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.విధుల నిమిత్తం దేశ, విదేశాల్లో ప్రయాణాలు చేయాల్సి వచ్చేది. కానీ తన కుమార్తె స్పితి పుట్టిన తర్వాత ఆ జాబ్ చేసేందుకు ఇష్టపడడం లేదు. ‘నా కూతురు ప్రపంచంలోకి రాకముందే, నా వారం రోజుల పెటర్నిటీ లీవ్ (పితృత్వ సెలవు)ల కంటే ఎక్కువ సమయం ఆమెతో గడపాలని నాకు తెలుసు’. కానీ అది కష్టం. ఎందుకంటే? నేను కొన్ని నెలల క్రితం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హోదాలో కొత్త ఉద్యోగంలో చేరా. విధుల నిమిత్తం ఎన్నో ప్రాంతాల్లో తిరిగాను. ఆ సమయాన్ని ఎంతగానో ఆస్వాధించా. స్పితి పుట్టిన తర్వాత ఆమెతో గడిపేందుకు నాకు ఎక్కువ సమయం కావాలి. కంపెనీ వారం రోజుల పితృత్వ సెలవుల్ని పొడిగించడం సాధ్యం కాదని తెలుసుకున్నా. అందుకే నాజాబ్కు రిజైన్ చేయాలని నిర్ణయించుకున్నానంటూ తన ఆనంద క్షణాల్ని నెటిజన్లతో పంచుకున్నాడు. స్పితి పుట్టినప్పటి నుండి ఒక నెల గడిచింది. ఈ సమయంలో నా భార్య భార్య (ఆకాంక్ష) ప్రసూతి సెలవులో ఉన్నప్పుడు కూడా ఆమె సంస్థలో మేనేజర్‌గా పదోన్నతి పొందింది. ఆమె కెరీర్ & మాతృత్వం సంతృప్తికరంగా ఉంది’ అని చెప్పారు. ‘చాలా కంపెనీలు ఉద్యోగులకు ఇచ్చే పితృత్వ సెలవులపై అసంతృప్తిగా ఉన్నా. పిల్లలతో తండ్రి ఎంత తక్కువ సమయం గడుపుతున్నాడనే కాదు. పెంపకం పాత్రలో తండ్రి బాధ్యత తగ్గుతుందని అన్నారు. ‘నేను వేసిన అడుగు అంత సులభం కాదు. చాలా మంది తండ్రులు ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేరు. కానీ రాబోయే సంవత్సరాల్లో పితృత్వ సెలవుల వంటి పరిస్థితులు మారతాయని నేను ఆశిస్తున్నాను. స్పతి పుట్టక ముందు గడిపిన సంవత్సరాల కంటే..ఆమెతో గడిపిన ఈ ఒక్కనెలే ఎంతో సంతృప్తినిచ్చింది. కొన్ని నెలల తర్వాత కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తా. ఈలోగా నా కూతురితో మరింత సమాయాన్ని గడింపేందుకు ప్లాన్ చేసుకుంటున్నానంటూ అంకిత్ జోషి షేర్ చేసిన పోస్ట్‌లో పేర్కొన్నాడు. పెటర్నిటీ లీవ్‌లు ఎన్నిరోజులు శిశువు జన్మించిన సమయంలో లేదా జన్మించిన ఆరు నెలలలోపు తండ్రి రెండు వారాల సెలవులు (పెటర్నిటీ లీవ్) తీసుకునేందుకు మనదేశంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. కానీ వాస్తవానికి అలా జరడగం లేదు. ప్రభుత్వ లేదా ప్రైవేటు కంపెనీల్లో పనిచేసే భారతీయ మహిళలు, వేతనంతో కూడిన 26 వారాల సెలవులకు అర్హులు. కానీ పురుషులకు మాత్రం పితృత్వ సెలవుల విషయంలో ఓ స్పష్టత లేదనే ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
ఆ అమ్మకు ఎంత కష్టం.. బీఏ చదివి బజ్జీలు అమ్ముతూ..
సాక్షి, అమరావతి: ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు షేక్ నాజిమ్మ. ఈమె బీఏ వరకు చదువుకుంది. తొలుత ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేసింది. ఆ తర్వాత కొన్నాళ్లు ఇంటి వద్ద పిల్లలకు ట్యూషన్ చెప్పింది. ఆదాయం సరిపోక జీవనం కష్టంగా ఉండటంతో కుటుంబ పోషణ కోసం చిరు వ్యాపారం ప్రారంభించింది. ఇంటి వద్ద పూర్ణాలు, బజ్జీలు, పునుగులు, వడలు తయారు చేయడం నేర్చుకుంది. ఆ తర్వాత వాటన్నింటిని ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుని వీధి వీధి తిరుగుతూ అమ్ముతుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఇంట్లో నుంచి బయలు దేరి వన్‌టౌన్ రాజీవ్ గాంధీ పూలమార్కెట్ తదితర ప్రాంతాల్లో రాత్రి ఎనిమిది గంటల వరకు నడుస్తూనే సరుకు విక్రయిస్తుంది. ఈ విధంగా ఆమె 17 సంవత్సరాలుగా చేస్తుంది. సరుకు తయారీ రూ.2 వేలు ఖర్చు అవుతుందని లాభాం మాత్రం రూ.500 నుంచి 700 వరకు ఉంటుందని చెప్పింది. తనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, ఒకరికి పెళ్లి చేయగా మరొకరిని ప్రభుత్వ కాళాశాలలో డిగ్రీ చదివిస్తున్నానని తెలిపింది. వయసు పెరిగి ఆరోగ్యం సహకరించడం లేదని, అయినా కుటుంబ పోషణ కోసం వీధి వీధి తిరగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఎవరైనా దాతలు ఒక తోపుడు బండి అందిస్తే దాన్ని ఒకే ప్రదేశంలో పెట్టుకుని తాను తయారు చేసిన పదార్థాలు అమ్ముకుంటానని తెలిపింది. చదవండి: ఆడు ఎదురొస్తే ‘తుపాను’ నడిచొచ్చినట్టు ఉంటది -
చాయ్వాలీ ప్రియాంక: రెండేళ్ల ప్రయత్నాల తర్వాత..
ఎంతసేపు.. ప్రభుత్వాలు ఉద్యోగాలు, నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని విమర్శించే బదులు.. స్వతహాగా ఏదో ఒక పనిలో దిగిపోవడం ఉత్తమమని సలహా ఇస్తోంది ప్రియాంక. రెండేళ్లపాటు ఉద్యోగం కోసం ప్రయత్నించిన ఆమె అది ఫలించకపోవడంతో టీ దుకాణం తెరిచింది. బీహార్ పాట్నాలో ఉమెన్స్ కాలేజీ దగ్గర ఓ టీ స్టాల్ నడిపిస్తోంది ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ ప్రియాంక గుప్తా. 2019లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నాలు చేసింది. కానీ, ఈ రెండేళ్లలో ఎలాంటి ఫలితం కనిపించలేదు. ఈ క్రమంలో.. ఎంబీఏ చాయ్‌వాలా ప్రఫుల్ బిలోర్(మధ్యప్రదేశ్) కథనం ఆమెకు స్ఫూర్తి ఇచ్చిందట. ఎప్పుడూ చాయ్‌వాలా కథనాలేనా? అందుకే చాయివాలీ కూడా ఉండాలన్న ఉద్దేశంతో ఈమధ్యే ఈ 24 ఏళ్ల అమ్మాయి టీ స్టాల్ ఓపెన్ చేసింది. ఇందుకు తల్లిదండ్రుల సహాకారం కూడా లభించింది. రెగ్యులర్ టీతో పాటు పాన్, మసాలా, చాక్లెట్ టీ, బిస్కెట్లు అమ్ముతోందామె. అంతేకాదు అక్కడ బ్యానర్ల మీద స్ఫూర్తినిచ్చే ఎన్నో కొటేషన్లు సైతం ఉంచింది. -
కార్ల చోరికి అలవాటు పడ్డ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్! అద్దెకు తీసుకుని అమ్మేస్తాడు
లింగోజిగూడ: నకిలీ పత్రాలతో కార్లను అద్దెకు తీసుకుని నంబర్ ప్లేట్లు మార్చి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఎల్బీనగర్ సీపీ క్యాంప్ కార్యాలయంలో రాచకొండ సీపీ మహేష్ భగవత్ వివరాలు వెల్లడించారు. భీమవరానికి చెందిన గుడాటి మహేష్ నూతన్ కుమార్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. భీమవరంలోనే మొబైల్ మెకానిక్‌గా పని చేసేవాడు. జల్సాలకు అలవాటు పడిన అతను సెల్ ఫోన్లను చోరీ చేసి జైలుకు వెళ్లి వచ్చాడు. ఆ తర్వాత హైదరాబాద్ మకాం మార్చిన అతను స్నేహితుల గదుల్లో ఉంటున్నాడు. వారి గుర్తింపు కార్డులను తీసుకోవడంతో పాటు డ్రైవర్లు కావాలంటూ ప్రకటనలు ఇచ్చేవాడు. తనను సంప్రదించిన వారి గుర్తింపు కార్డుల జిరాక్స్ తీసుకునే వాడు. వాటితో వివిధ కారు రెంటల్ అన్లైన్ యాప్‌లలో కార్లను బుక్ చేసుకునే వాడు. ఆ తర్వాత వాటికి జీపీఎస్ ట్రాక్ సిస్టం తొలగించి రాష్ట్రం దాటిన తర్వాత నంబర్ ప్లేట్లను మార్చేవాడు. సదరు కారును కొద్ది రోజులు వాడుకుని తక్కువ ధరకు విక్రయించేవాడు. గత సంవత్సరం చైతన్యపురి పోలీస్టేషన్ పరిధిలో క్రెటా కారును చోరీ చేశాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా మహేష్‌ను నిందితుడిగా గుర్తించి అతడిని అరెస్ట్ చేశారు. అతడికి సహకరిస్తున్న షేక్ మున్వార్ అలియాజ్ మున్న, కొండ సాయి మదన్‌లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా చెన్నై, బెంగుళూరు, కేరళ, పుణేలలో కార్ల చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.పోలీసులు నుంచి 5కార్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్, ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, చైతన్నపురి సీఐ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పట్టభద్రుడి ప్రకృతి సేద్యం..
పంటల్లో క్రిమి సంహారక మందుల ప్రభావం రోజురోజుకీ అధికమవుతోంది. ఆహార పదార్థాల్లో విష పదార్థాలూ పెరిగిపోతున్నాయి. దీంతో ఆధునిక రైతులు.. రసాయన సేద్యానికి స్వస్తి పలికి.. ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. ప్రకృతి విపత్తుల్లోనూ అందరికన్నా మిన్నగా వ్యవసాయంలో రాణిస్తున్నారు. ఆశావహమైన, ఆరోగ్యదాయకమైన దిగుబడులు సాధిస్తూ లాభాల బాట పడుతున్నారు. అందుకు సాక్ష్యమే ఈ యువ రైతు. ఇతనిది గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామం. 37 ఏళ్ల ఈ రైతు పేరు కంగోను బాల శశికాంత్. బీఏ చదివారు. పుడమి ఆరోగ్యంగా ఉండాలి.. మనం పండించే పంట ఆరోగ్యవంతంగా ఉండాలన్న ఆలోచనతో ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేశారు. ఐదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తూ లాభాల బాట పడుతున్నాడు. తామర పురుగును తట్టుకొని.. ఈ ఏడాది మిర్చి రైతులను నల్ల తామర పురుగు ఆగమాగం చేసింది. పురుగు తాకిడికి మిర్చి సాగు చేసిన వారిలో అత్యధిక శాతం మంది రైతులు పంటను పీకేసి ఇతర పంటలు వేసుకున్నారు. మిర్చి పంటను కొనసాగించి అనేక రకాల రసాయన క్రిమిసంహారక మందులు పిచికారీ చేసిన రైతులు మాత్రం ఎకరాకు క్వింటా నుండి మూడు క్వింటాళ్ల వరకు దిగుబడులతో సరిపెట్టుకోవలసి వచ్చింది. శాస్త్రవేత్తలకు కూడా పూర్తిస్థాయిలో అంతుచిక్కని ఈ పురుగుతో యావత్ మిర్చి రైతాంగం తీవ్ర నష్టాలను చవిచూసింది. ఈ రైతు మాత్రం ప్రకృతి వ్యవసాయంతో పురుగు తీవ్రతను నియంత్రించగలిగారు. సీవీఆర్ పద్ధతిలో పురుగు కట్టడి.. ఈ ఏడాది ఎకరా పొలాన్ని కౌలుకు తీసుకుని 80 సెంట్లు భూమిలో బ్యాడిగీ 355 రకం, 20 సెంట్లులో నవ్య రకం మిర్చిని శశికాంత్ సాగు చేశారు. ఇతని పంటనూ తామర పురుగు ఆశించింది. సీవీఆర్ పద్ధతిని అనుసరించి మట్టి ద్రావణం పిచికారీతో పురుగు తీవ్రతను కట్టడి చేయగలిగారు. పంటపై పురుగు ప్రభావం తగ్గింది. సాధారణంగా ప్రకృతి వ్యవసాయం ద్వారా మిర్చి దిగుబడులు ఎకరాకు 20–25 క్వింటాళ్ల వరకూ వస్తుంది. అయితే నల్ల తామరపురుగు తాకిడికి ఈ రైతు పొలంలోనూ దిగుబడి సగానికి తగ్గింది. ఎకరాకు 11 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఎకరాకు కౌలు రూ. 60 వేలు, ఇతరత్రా మరో రూ. 60 వేల చొప్పున రూ. 1.20 లక్షల వరకు పెట్టుబడి అయ్యింది. దోమ, పురుగు నుంచి పంటకు రక్షణ చేకూర్చేందుకు పసుపు జిగురు అట్టలు, అక్కడక్కడా బంతిపూల మొక్కలు, టొమాటో మొక్కలు, నువ్వులు, ఆవాల మొక్కలతో పాటు గట్ల వెంబడి ఎత్తుగా పెరిగే మొక్కలను సాగు చేశారు. ధర ఆశాజనకం.. కేవలం ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేసిన మిరపకాయలకు బహిరంగ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. మార్కెట్లో రసాయనాలతో పండించిన మిర్చి క్వింటా సుమారు రూ. 19 వేలు ఉంటే, ప్రకృతి సేద్యం ద్వారా సాగు చేసిన ఈ రకం ధర రూ. 30 వేల నుంచి 40 వేల వరకు పలుకుతోంది. శశికాంత్ పండించిన మిరపకాయలు చూడటానికి వంకర్లుగా. ముడతలుగా కనిపించినప్పటికీ, ఈ రకం గురించి తెలిసిన వాళ్లు మాత్రం వదిలిపెట్టరు. ఈ మిరప కాయను ఎక్కువగా పచ్చళ్లకు, రంగుల తయారీకి వినియోగిస్తారు. – జి. వికర్తన్ రెడ్డి, సాక్షి, ప్రత్తిపాడు, గుంటూరు జిల్లా సోషల్ మీడియా ద్వారా ఆర్డర్లు మన నేలలో మనం పోషక విలువలతో పండించిన పంటను విదేశీయుల కన్నా.. మనవారికే ఎక్కువగా ఉపయోగపడాలన్న ఉద్దేశంతో స్వంతంగా మార్కెటింగ్ చేసుకుంటున్నాను. వెబ్సైట్లు, వాట్సప్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా నేరుగా వినియోగదారులకు అమ్ముకుంటున్నాను. హైదరాబాద్, బెంగుళూరు, విజయవాడ వంటి నగరాలలోని వారు కేజీ రూ. 500 చొప్పున నేరుగా కొంటున్నారు. పంట పండించటంలో కన్నా అమ్ముకోవడానికే ఎక్కువ కష్టపడాల్సి వస్తున్నది. – కె. బాల శశికాంత్ (97030 74787), ముట్లూరు, వట్టిచెరుకూరు మం., గుంటూరు జిల్లా వేసవిలో కూరగాయల సాగుపై శిక్షణ సేంద్రియ విధానంలో వేసవిలో కూరగాయల సాగుపై రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తారామతి పేట దగ్గర గల నాగరత్నం నాయుడు వ్యవసాయ క్షేత్రంలో రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్షక సేవా కేంద్రం నిర్వహణలో ఫిబ్రవరి 6 (ఆదివారం)న రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు డా. యాదగిరి, చౌటుప్పల్ మహిళా రైతు రజితారెడ్డి, కీసర రైతు రమేష్ శిక్షణ ఇస్తారు. వంగ, బెండ, టొమాటో, గోరుచిక్కుడు, బీర, కాకర, సొర, తోటకూర, పాలకూర, మెంతికూర, గోంగూర, కొత్తిమీర సాగు పద్ధతులు, కషాయాలు, ద్రావణాల తయారీ తదితర విషయాలపై శిక్షణ ఇస్తారు. ఆసక్తిగల రైతులు ముందుగా పేర్లు నమోదు చేయించుకోవాలి.. 98493 12629, 70939 73999. -
ఎందరికో ఆదర్శం ఈ పట్టభద్రుడు
ప్రత్తిపాడు (తూర్పు గోదావరి): కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు పెద్దలు. కష్టకాలం వచ్చినప్పుడు కుంగిపోకుండా ఆలోచనతో పరిష్కార మార్గాలు అన్వేషిస్తే ఎటువంటి సమస్యనైనా సునాయాసంగా అధిగమించవచ్చని నిరూపించాడు ఓ రైతు. కోటనందూరు మండలం ఇండుగపల్లికి చెందిన కంఠంరెడ్డి సోమశేఖర్ ఎంఈడీ, ఎంఏలో తెలుగు, చరిత్ర, సైకాలజీ, ప్రభుత్వ పాలన శాస్త్రాల్లో పట్టభద్రుడు. ఈ అర్హతలతో ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకుడిగా కొన్నేళ్లుగా పనిచేస్తున్నాడు. కరోనా కల్లోలంలో ప్రైవేట్ అధ్యాపకుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. చేసేదిలేక అత్తయ్య గ్రామమైన ధర్మవరంలో ఐదు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని పొలంబాట పట్టాడు. విద్యావంతుడు కావడంతో అధునిక పద్ధతుల్లో వరి పంటను సాగు చేసి అధిక దిగుబడులు సాధించి పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. ప్రస్తుతం వరి సాగులో ఆశించిన ఫలితాలు దక్కని పరిస్థితి ఉన్నప్పటికీ దాన్ని అధిగమించి ప్రకృతి వ్యవసాయం ద్వారా ఎకరాకు 35 బస్తాలు దిగుబడిని సాధించాడు. సోమశేఖర్ ప్రయోగాలను గుర్తించిన స్థానిక రైతులు ఆయన మార్గంలో ప్రకృతి సాగుకు మక్కువ చూపుతున్నారు. -
‘తల్లిదండ్రులు అవమానంగా భావించారు’
ముంబై: పట్టణానికి చెందిన శ్రీదేవి మూడేళ్ల క్రితం సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. ముంబై యూనివర్సిటీలో చేరిన శ్రీదేవి తనను తాను ట్రాన్స్‌జెండర్‌గా ప్రకటించుకున్న తొలి విద్యార్థిగా నిలిచారు. 2017లో యూనివర్సిటీలో బీఏ కోర్సులో చేరినప్పుడు శ్రీదేవి తనను ట్రాన్స్‌జెండర్‌గా ప్రకటించుకున్నారు. కష్టపడి చదివి యూనివర్సిటీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిస్టెన్స్ అండ్ ఒపెన్ లర్నింగ్(ఐడీఓఎల్) నుంచి సోషియాలజీ, సైకాలజీలో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ.. గ్రాడ్యూయేషన్ పూర్తి చేయడమే ఓ యుద్ధం అనుకుంటే.. దాని తర్వాత ఉద్యోగం సంపాదించడం మరి కష్టమైంది అన్నారు. ‘చదువు పూర్తవ్వడంతో ఓ యుద్ధాన్ని జయించినట్లు భావించాను. ఇలాంటి యుద్ధాలు ముందు ముందు మరెన్నో చేయాల్సి ఉంటుంది. వాటిలో ముఖ్యమైంది ఉద్యోగం. చదవు పూర్తయ్యాక ఉద్యోగం సంపాదించడం మరింత కష్టమయ్యింది. ట్రాన్స్‌ఉమెన్‌కు జాబ్ ఇవ్వడానికి ఎవ్వరు ఆసక్తి చూపలేదు. ఎన్నో తిరస్కారాలు ఎదుర్కొన్న తర్వాత ఓ ఉద్యోగం లభించింది. ప్రసుత్తం నేను ఓ ఎలాక్ట్రానిక్ కంపెనీలో సీఏడీ డిజైనర్‌గా పని చేస్తున్నాను. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా నేను ఎదర్కొన్న అనుభవాల మేరకు భవిష్యత్తులో ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తే బాగుంటుందనిపించింది. అయితే వ్యాపారం గురించి నాకు ఏం తెలియదు. కాకపోతే ఉద్యోగం కోసం ఇతరుల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు కదా. అందుకే వ్యాపారం చేయాలని భావిస్తున్నాను. ప్రస్తుతం ఉద్యోగంతో పాటు ఓ ఎన్జీవో అధ్వర్యంలో పిల్లలకు పాఠాలు చెబుతున్నాను. ఇంటిరీయర్ డిజైనింగ్‌కు సంబంధించి షార్ట్‌టర్మ్ కోర్సు కూడా చేస్తున్నాను’ అని తెలిపారు శ్రీదేవి. ఇక తన తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ.. ‘నన్ను తమతో పాటు ఉంచుకోవడం అవమానంగా భావించేవారు నా తల్లిదండ్రులు. ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే.. వారికి కనిపించకుండా నన్ను గదిలో బంధించేవారు. తల్లిదండ్రుల ప్రవర్తన నన్ను ఎంతో బాధపెట్టిది. నేను మనిషిని.. నాకు ఓ మనసుంది.. నాకు జీవించే హక్కుంది. నేనేం తప్పు చేయలేదు. అలాంటప్పుడు నేనేందుకు దాక్కొవాలి అని నా మనసు తిరగబడేది. ఈ విషయం గురించి కుటుంబ సభ్యులతో ఎన్నో సార్లు గొడవ పడ్డాను. కానీ వారిలో మార్పు లేదు. దాంతో రెండేళ్ల క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చాను. ఆనాటి నుంచి మరిక వెనుతిరిగి చూడలేదు’ అంటున్నారు శ్రీదేవి. ఐటీఓఎల్ ప్రతినిధి వినోద్ మలాలే మాట్లాడుతూ.. మా యూనివర్సిటీలో ఎంతోమంది ట్రాన్స్‌జెండర్స్ ఉన్నారు. కానీ వారు ఎవరు తమను తాము ట్రాన్స్‌జెండర్స్‌గా ప్రకటించుకోలేదు. అలా చేసిన మొదటి విద్యార్థి శ్రీదేవి అని తెలిపారు. -
స్వీపర్ కొలువుకు ఎంబీఏ, బీటెక్ గ్రాడ్యూయేట్లు
చెన్నై : దేశంలో నిరుద్యోగం రాజ్యమేలుతుంది. లక్షల్లో యువత డిగ్రీలు, ఎంబీఏలు, బీటెక్‌లు చదివి.. కొలువుల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ జారీ అయిన లక్షల్లో అప్లై చేస్తారు. చదివిన చదువుకు, కొలువుకు సంబంధం ఉండటం లేదు. ఆఖరికి స్వీపర్ పోస్టు కోసం వందల్లో పట్టభద్రులు అప్లై చేశారంటే.. నిరుద్యోగం ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సంఘటన తమిళనాడులో జరిగింది. వివరాలు.. తమిళనాడు అసెంబ్లీ సెక్రటేరియట్లో స్వీపర్, సానిటరీ కార్మికుల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ పోస్టులకు ఎంటెక్, బీటెక్, ఎంబీఏ, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్ల నుంచి వందల దరఖాస్తులు వచ్చి పడ్డాయి. వీరితో పాటు డిప్లామో పట్టా పొందిన వారు కూడా స్వీపర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 10 స్వీపర్ పోస్టులు, 4 శానిటరీ కార్మికుల పోస్టులకు గాను గత ఏడాది సెప్టెంబర్ 26న తమిళనాడు అసెంబ్లీ సెక్రటేరియట్ దరఖాస్తులను ఆహ్వానించింది. సంబంధిత విభాగంలో అనుభవం ఉంటే సరిపోతుందని పేర్కొంది. దీంతో ఎంప్లాయిమెంట్ ఎక్సైంజ్‌తో సహా మొత్తం 4,607 దరఖాస్తులు అందాయి. వీరిలో డిగ్రీలు, ఎంబీఏలు, బీటెక్‌లు చదివిన వారు కూడా ఉన్నారు. ఇలా వచ్చిన దరఖాస్తుల్లో సరైన వివరాలు నమోదు చేయనందున దాదాపు 677 మంది దరఖాస్తులను సంబంధిత అధికారులు తిరస్కరించారు. స్వీపర్ ఉద్యోగాలకు కూడా డిగ్రీలు, పీజీలు చదివిన వారు అప్లై చేసుకోవడంతో... అధికారులు సైతం అవాక్కయ్యారు. -
విద్యావంతులకే ఓటు
సాక్షి, మోర్తాడ్(బాల్కొండ): బాల్కొండ శాసనసభకు నిర్వహించిన ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎంపికైన వారిలో ఒక్కరు మినహా అందరూ ఈ నియోజకవర్గం ప్రజలు విద్యావంతులకే పెద్దపీట వేశారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. బాల్కొండ నియోజకవర్గానికి 1952లో తొలిసారి ఎన్నిక జరుగగా ఈ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన అనంత్‌రెడ్డి అప్పట్లో హెచ్ఎల్సీ చదివారు. హెచ్ఎల్సీ ఉత్తీర్ణత చెందడం అప్పట్లో చాలా గొప్ప విషయమని మన పూర్వీకులు చెబుతున్నారు. హెచ్ఎల్సీ అంటే 12వ తరగతి అని అర్థం. అలాగే 1957 విజయం సాధించిన తుమ్మల రంగారెడ్డి కూడా హెచ్ఎల్సీ వరకు చదివి రాజకీయాల్లో ప్రవేశించారు. 1962, 1967, 1972, 1978 వరుసగా ఎమ్మెల్యేగా ఎంపికైన అర్గుల్ రాజారాం నిజాం కళాశాలలో బీఏ చదివారు. అప్పట్లో బీఏ చదవడం అంటే ఇప్పడు పీహెచ్‌డీతో సమానం అని పాత తరం వారు చెబుతున్నారు. ప్రసిద్ధ నిజాం కళాశాలలో బీఏ చదవడం సాధారణ విషయం కాదని కూడా ఎంతో మంది చెబుతున్నారు. అర్గుల్ రాజారాం మరణం తరువాత 1981లో నిర్వహించిన ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా ఎన్నికైన సుశీలా బాయి మాత్రం సామాన్య గృహిణి ఆమె ప్రాథమిక విద్యను మాత్రమే పూర్తి చేశారు. 1983, 1985 ఎన్నికలలో గెలిచిన మధుసూదన్‌రెడ్డి కూడా హెచ్ఎస్సీ పూర్తి చేశారు. ఆయన ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ, హిందీ భాషలలో ప్రావీణ్యం సంపాదించి తన వాక్చాతుర్యంతో అందరిని ఆకట్టుకున్నారని పలువురు తెలిపారు. 1989, 1994, 1999, 2004 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించిన సురేశ్‌రెడ్డి నిజాం కళాశాలలో ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేశారు. అమెరికాలో పర్యావరణ శాస్త్రంలో ఎంఎస్ చదవడానికి సిద్ధం అవుతున్న సమయంలో ఎమ్మెల్యేగా ఎంపిక కావడంతో ఇక్కడే స్థిరపడిపోయారు. ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడడంతో పాటు సందర్భోచితంగా ప్రసంగాలు ఇస్తూ అందరి మన్నలను అందుకున్నారు. సురేశ్‌రెడ్డి వాక్చాతుర్యం వల్లనే ఆయనకు స్పీకర్ పదవి దక్కిందని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. 2004 ఎన్నికల్లో పీఆర్పీ తరపున విజయం సాధించిన ఈరవత్రి అనిల్ ప్రసిద్ధ సీబీఐటీ కళాశాలలో బీఈ పూర్తి చేశారు. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం సంపాదించి అక్కడ కొంత కాలం స్థిరపడి రాజకీయాల్లో చేరడానికి స్వదేశానికి వచ్చారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వహిస్తున్నారు. అలాగే 2009 ఎన్నికల్లో విజయం సాధించిన ప్రశాంత్‌రెడ్డి బీఈ సివిల్ ఇంజినీరింగ్‌లో పట్టభద్రుడు. ఎన్నికల్లో విజయం సాధించిన వారిలో ఉన్నత విద్యావంతులు ఉన్నట్లే ఓటమి పాలైన వారిలోనూ ఉన్నత విద్యను అభ్యసించిన వారు ఉండడం గమనార్హం. 1994లో ఓటమి పాలైన బద్దం నర్సారెడ్డి 1966లో బీఏ పూర్తి చేశారు. 2004లో సురేశ్‌రెడ్డి చేతిలో ఓటమి చవి చూసిన వసంత్‌రెడ్డి హోమియో వైద్య డిగ్రీని పూర్తి చేశారు. 2009 ఎన్నికల్లో ఓటమిపాలైన శనిగరం శ్రీనివాస్‌రెడ్డి ఎంబీఏ పూర్తి చేశారు. ఆయన అప్పట్లో అమెరికాలో ఉన్నత ఉద్యోగాన్ని వదులుకుని ఎన్నికల్లో పోటీ చేయడానికి స్వదేశానికి వచ్చారు. ఓటమి పాలు కావడంతో మళ్లీ అమెరికా వెళ్లిపోయారు. అయితే 2009 ఎన్నికల్లో టీడీపీ, టీఆర్ఎస్ల ఉమ్మడి అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమిపాలైన వేముల సురేందర్‌రెడ్డి కూడా ఎంఏ చదువును పూర్తి చేశారు. పలు సబ్జెక్టులలో ఎంఏ పట్టాలను అందుకున్న సురేందర్‌రెడ్డి ఉన్నత విద్యావంతుడు కావడం విశేషం. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన మల్లికార్జున్‌రెడ్డి వైద్య విద్యను పూర్తి చేశారు. ఆయన అపోలో ఆస్పత్రిలో కార్డియాలజీ డిపార్ట్మెంట్లో వైద్య సేవలు అందిస్తున్నారు. ఇలా ఎంతో మంది బాల్కొండ బరిలో పోటీ చేసి గెలిచిన, ఓటమిపాలైన వారిలో ఉన్నత విద్యావంతులు ఉండటం విశేషంగా చెప్పవచ్చు. -
పుత్రికోత్సాహం
అరవింద్ స్వామి ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఇంట్లో ఇప్పుడు ఇద్దరు గ్రాడ్యువేట్లు ఉన్నారు కాబట్టి. రీసెంట్గా అరవింద్ స్వామి తనయుడు గ్రాడ్యువేట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కుమార్తె అధీరా కూడా గ్రాడ్యువేట్ అయ్యారు. గ్రాడ్యువేషన్ కూడా గోల్డ్ మెడల్ అందుకుని మరీ కంప్లీట్ చేశారు. ఈ ఆనందాన్ని అరవింద్ స్వామి పంచుకుంటూ – ‘‘ఇంట్లో మరో గ్రాడ్యువేట్ యాడ్ అయ్యారు. అధీరా.. నీ అచీవ్మెంట్స్, నీ జర్నీని చూసి ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. ఇక ప్రపంచమే నీ వంటిల్లు. వెళ్లు.. నీ ఇష్టమొచ్చింది వండేసేయ్’’ అని పేర్కొన్నారు. -
పుత్రోత్సాహం
పుత్రోత్సాహం కొడుకు పుట్టినప్పుడు కాదు ఏదైనా సాధించినప్పుడు కలుగుతుంది అని సుమతీ శతకం చెబుతుంది. అరవింద్ సామి కూడా ఇప్పుడు ‘పుత్రోత్సాహాన్ని’ ఆస్వాదిస్తున్నారు. ఆయన కుమారుడు రుద్ర ఐబీ ప్రోగ్రామ్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారు. ఆ ఆనందాన్ని షేర్ చేసుకుంటూ – ‘‘ఐబీ ప్రోగ్రామ్ నుంచి మా అబ్బాయి గ్రాడ్యుయేట్ అయినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ మైల్స్టోన్ రీచ్ అయిన అందరికీ కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్. ‘నీ లైఫ్‌ను హ్యాపీగా, ప్రేమతో, ప్రశాంతంగా, నిజాయితీగా, సమగ్రతతో లీడ్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రపంచానికి ఉపయోగపడేలా ఉండు. పెద్ద పెద్ద కలల్ని కను. గుర్తుపెట్టుకో.. పతీదీ పాజిబులే’’ అని రుద్రకు నాలుగు మంచి మాటలు చెప్పారు అరవింద్ సామి. ఐబీ (ఇంటర్నేషనల్ బ్యాకులోరియట్) డిగ్రీ చాలా ప్రెస్టీజియస్ గ్లోబల్ డిగ్రీ. ఐబీ ఫాలో అయ్యే స్కూల్స్ అందరూ గ్లోబల్ సిలబస్ ఫాలో అవుతుంటారు. కేవలం ఎడ్యుకేషన్ మాత్రమే కాకుండా టైమ్ మేనేజ్మెంట్, రియల్ వరల్డ్ స్కిల్స్ ఇలా ప్రతీదాంట్లో స్టూడెంట్స్‌ను ట్రైన్ చేస్తారు. ప్రపంచంలో ఎక్కడైనా బతకగలిగే పర్ఫెక్ట్ సిటిజన్‌గా తీర్చిదిద్దుతారు. ఇలాంటి ప్రెస్టీజియస్ డిగ్రీను కొడుకు సంపాదించాడు అంటే పుత్రోత్సాహమే కదా.6 -
అజ్ఞాతవాసిగా ఐఐటీ గ్రాడ్యుయేట్..
సాక్షి, ముంబయి : ఐఐటీ బాంబే నుంచి కెమికల్ ఇంజనీరింగ్ డిగ్రీ..అత్యధిక వేతనంతో కూడిన ఉద్యోగం..సంప్రదాయ కుటుంబం.. అన్నిటినీ వదిలేసిన సంకేత్ పరేఖ్ భిన్న ప్రయాణాన్ని ఎంచుకున్నాడు. నిన్నమొన్నటి వరకూ అమెరికాలో పీజీ కోర్సు చేయాలని కలలుగన్న సంకేత్ తన సీనియర్‌తో చేసిన ఆన్లైన్ చాట్‌తో అన్నీ తలకిందులయ్యాయి. సర్వం త్యజించి ఈనెల 22న ముంబయిలో సంకేత్ జైనిజం స్వీకరించేందుకు ముహుర్తం ఖరారైంది. వైష్ణవ కుటుంబానికి చెందిన సంకేత్ ఐఐటీలో తన సీనియర్, 2013లో దీక్ష తీసుకున్న భవిక్ షా బాటలో జైనిజంలో అడుగుపెడుతున్నాడు. ఉద్యోగంలో కొనసాగదలుచుకుంటే తాను కోరుకున్నవన్నీ పొందేవాడిననీ..అయితే తనలో చెలరేగిన మానసిక సంఘర్షణ ఇప్పటికి శాంతించిందని సంకేత్ చెప్పుకొచ్చాడు. తాను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పటి నుంచీ సీనియర్ భవిక్‌తో చాట్ చేస్తుండేవాడినని, తమ సంభాషణలు క్రమంగా ఆత్మ, మనసు, శరీరం చుట్టూ తిరిగేవని, ఆ ఆలోచనలు తనను ఆత్మాన్వేషణ వైపు పురిగొల్పి..జైనిజం వైపు నడిపాయని అన్నాడు. ప్రస్తుతం సంకేత్ పరేఖ్ తన వస్తువులను చివరికి స్నేహితుడితో చాట్ చేసేందుకు ఉపయోగించిన కంప్యూటర్ను సైతం విడిచిపెట్టాడు. -
కలియుగ దైవం ఫేం డైరెక్టర్ రోశిరాజు
కేకే.నగర్: ఎవరి జీవితం ఎలా ఉంటుందో లలాట లిఖితం అంటారు. ‘మ్యాన్ ప్రపోజల్– గాడ్ డిస్పోజల్’ అనే ప్రసిద్ధ ఇంగ్లి్లషు నానుడిలా మన ఊహలు ప్రయత్నాలు వేరు ఫలితాలు వేరు అనే విషయం చిత్తూరు జిల్లాకు చెందిన రోశిరాజు జీవితంలో నిజమైంది. మనవూరులో డాక్టర్‌గా సేవలు చేయాలని కలలు కన్న ఆయన జీవితం చిత్రమైన మలుపు తిరిగి చిత్రసీమలో వెలుగొందారు. మావూరు విద్యార్థి నేడు చెన్నపట్నం సెలబ్రిటీగా మారాడని గ్రామస్తులు సంతోషపడుతుంటారని ఆయన తన గత జ్ఞాపకాలను ‘మావూరు– మనవూరు’ శీర్షిక కోసం గుర్తుచేసుకున్నారు. ఆయన మాటల్లోనే.. నా పేరు మేడిద రోశిరాజు. నేను పుట్టి, పెరిగింది శ్రీకాళహస్తి సమీపం మడిబాక. మాది వ్యవసాయ కుటుంబం. తాత మేడిద వెంకట సుబ్బురాజు కార్వేటి నగరం రాజుల వద్ద కమాండర్‌గా పని చేసేవారు. నాన్న మేడిద వెంకటరాజు, అమ్మ చెంగమ్మల ఐదుగురు మగ సంతానంలో నేను చివరివాడిని. మా మడిబాక గ్రామానికి సంబంధించి అప్పట్లో మొట్ట మొదటి గ్రాడ్యుయేట్‌ను నేనే. పచ్చని పొలాలతో మా గ్రామం ప్రశాంతంగా ఉంటుంది. అక్కడి ప్రజలకు కులమతాల ద్వేషాలు, జాతి, మత వైషమ్యాలు కానీ తెలియవు. ప్రతి ఒక్కరూ వరుసలు కలుపుకుని పిలుచుకుంటూ అందరితో ప్రేమగా ఉండేవారు. అప్పట్లో మా గ్రామం నుంచి ఆరు కిలో మీటర్ల దూరం పంట కాలువలు, స్వర్ణముఖి నది కాలినడకన దాటుకుని వెళ్లి పాపానాయుడు పేటలోని హైస్కూలులో ఎస్ఎస్ఎల్సీ వరకు చదివాను. అదే స్కూల్లో ప్రముఖ నటుడు మోహన్‌బాబు కూడా చదివారు. ఆయన నాకంటే రెండేళ్లు సీనియర్. అందరం కలిసి ఆడుకునేవాళ్లం. తర్వాత శ్రీవేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీలో చేరాను. డాక్టర్ కావాలన్న ఆశతో బీఎస్సీ సీటు కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే బీకాంలో సీటు దొరకడంతో ఇష్టం లేకుండానే చేరాను. తరగతిలో లెక్చరర్ పాఠాలు చెప్తుంటే నేను కథలు రాసుకుంటూ సినిమాలపై మోజు పెంచుకున్నాను. మా ఊరి పెద్ద రోశయ్య, మా ఉపాధ్యాయుడు జీసీ గురప్ప ఈ ఇద్దరూ అప్పటి ప్రముఖ డైరెక్టర్లు విఠలాచార్య, ఆదుర్తి సుబ్బారావులను పొగుడుతూ మాట్లాడేవారు. ఘంటసాల మాస్టారు పాటలతో ప్రభావితుడినైన నేను ఆయన పాడే పాటలకు ఎన్టీఆర్, నాగేశ్వరరావు తెరపై పాడుతున్నట్లు నటించడం ఇవన్నీ నన్నెంతో ఆకర్షించాయి. తెరపైన హీరోలు అద్భుతంగా నటించడానికి తెర వెనుక ఉన్న డైరెక్టర్లే కారణం అని తెలుసుకుని ఎలాగైనా డైరెక్టర్ కావాలనే కోరిక పుట్టింది. ముఖ్యంగా ఆదుర్తి సుబ్బారావు, విఠలాచార్య లాగా నేను కూడా మంచి పేరు తెచ్చుకోవాలన్న జిజ్ఞాస నాలో పెరిగింది. చిత్రసీమ కోసం చెన్నై రాక.. వెంకటేశ్వర కళాశాలలో డిగ్రీ పూర్తిచేశాక తిరుపతి జ్యోతి టాకిస్ సుబ్బారావు గారితో పరిచయం ఏర్పడింది. ఆయన నా ఆసక్తిని ప్రోత్సహించి చెన్నైకు తీసుకొచ్చారు. విజయా పిక్చర్ పూర్ణచంద్రరావుకి పరిచయం చేశారు. 1970లో విఠలాచార్య దర్శకత్వం వహించిన ‘గండికోట రహస్యం’ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చారు. అప్పట్లో డిగ్రీ చదివి సినిమాల్లో పనిచేసేవారు చాలా తక్కువ. అందుకే విఠలాచార్య నాపై ప్రత్యేక అభిమానంతో మూడో సినిమా నుంచే కో– డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చారు. తర్వాత అగ్గివీరుడు, ఆలీ బాబా 40 దొంగలు, రైతేరాజు, రాజకోట రహస్యం, పల్లెటూరి చిన్నోడు సహా 20 సినిమాలకు కో డైరెక్టర్‌గా పని చేశాను. గ్రాఫిక్స్ లేని రోజుల్లో సెట్లోనే మిక్చర్ కెమెరాలతో ఎన్నో రకాల చిత్ర విచిత్రాలు, మాయమంత్రాలతో జానపద బ్రహ్మ విఠలాచార్య సినిమాలు తీసి ప్రేక్షకులను ఆకర్షించారు. పల్లెటూరి చిన్నోడు సినిమా విడుదల సమయంలో మేనమామ కుమార్తె ఆదిలక్ష్మితో వివాహం జరిగింది. వివాహితునిగా చెన్నైలో అడుగుపెట్టిన వెంటనే ‘రాముని మించిన రాముడు’ సినిమాకు కో–డైరెక్టర్‌గా పిలుపు వచ్చింది. అప్పట్లో ఎన్టీఆర్‌తో పది సినిమాలు చేశాను. ఆయన నాపై చూపిన అభిమానం, ఆదరణ జన్మలో మర్చిపోలేను. ఆయనకు దగ్గరగా డైలాగ్స్ చెప్పే అవకాశం రావడం నాపూర్వ జన్మ సుకృతం. అలాగే అక్కినేని నాగేశ్వరరావు నా సిన్సియారిటీని సెట్లో అందరి ముందు పొగడడం, అన్నపూర్ణమ్మ గారి అల్లుడు సినిమా క్లైమాక్స్ చూసిన బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ భానుమతి రామకృష్ణ నాకు హేట్సాఫ్ చెప్పడం, నటి ఊర్వశి శారద ప్రధానపాత్రగా స్వీయదర్శకత్వంలో నేను తీసిన కలియుగ దైవం, ఉగ్రవాదం చిత్రాల సమయంలో ఆమె నాకు అందించిన సహకారం ప్రోత్సాహం, నన్ను సోదరుడిగా భావించి నాపై చూపించిన అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను. కలియుగ దైవం, ఉగ్రవాదం సహా ఐదు సినిమాలకు దర్శకత్వం వహించాను. సినిమా రంగం హైదరాబాద్‌కు తరలినప్పుడు.. నా ఆశ, అభిలాష తీర్చుకునే అవకాశాలు కల్పించిన చెన్నై అంటే నాకు ప్రాణం. నా మాతృభూమి కంటే చెన్నైనే ఎక్కువ ఇష్టపడతాను. అప్పట్లో సినీరంగం హైదరాబాద్‌కు తరలిపోయింది. రమ్మని పిలిచినా నేను అక్కడికి వెళ్లలేదు. తెలుగు చిత్రరంగం తరలిపోయిన తర్వాత కూడా చాలా బిజీ అయ్యాను. దూరదర్శన్ సీరియల్స్, ప్రముఖ జెమిని, ఈటీవీ చానల్స్లలో మెగా సీరియల్స్ చేశాను. షార్ట్‌ఫిల్మ్ వృక్షగా«థను బాంబే దూరదర్శన్‌లో ప్రసారం చేసి విమాన టికెట్ ఇచ్చి పిలిపించారు. అక్కడ జరిగిన ఫిలిం ఫెస్టివల్లో 56 దేశాలు పాల్గొన్నాయి. అందరూ వృక్ష గాథకు మెరిట్ సర్టిఫికెట్ అందజేశారు. మద్రాసులో నాకు సన్మానాలు చేశారు. చెన్నైలో స్థిర నివాసం.. యుక్త వయసులో చెన్నైకు వచ్చిన నాకు సినీ ప్రపంచం ఓ రంగుల కలగా అనిపించింది. అగ్గి వీరుడు సెట్లో మొదట అడుగు పెట్టగానే విఠలాచార్య దర్శకత్వంలో నట సార్వభౌమ ఎన్టీఆర్‌ను, విజయలలిత కవ్విస్తూ నటించడం నన్నొక కొత్త లోకానికి తీసుకెళ్లింది. వడపళని విజయ స్ట్రీట్‌లో బాడుగ ఇంట్లో ఉండేవాడిని అక్కడే పెళ్లి జరిగింది. నాకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. కుమారులిద్దరిని నా అభిలాషకు తగ్గట్టు ఎడిటింగ్ రంగంలో చేర్పించాను. కుమార్తెకు, ఓ కుమారుడికి పెళ్లి చేశాను. -
‘వెన్నపూస’ విజయకేతనం
మండలి ఎన్నికల్లో తిరుగులేని విజయం - వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టిన ఓటర్లు – ‘మ్యాజిక్ ఫిగర్’ను మించి 223 ఓట్ల ఆధిక్యత సాక్షి ప్రతినిధి, అనంతపురం: పట్టభద్రులు ‘ఓటెత్తిన’ చైతన్యంతో వైఎస్సార్సీపీ అభ్యర్థికి పట్టం కట్టారు. ప్రభుత్వంపై వ్యతిరేకతను చాటిచెప్పారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్ర నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల కౌంటింగ్‌లో తొలిరౌండ్ నుంచి ఆధిక్యత ప్రదర్శించిన వైఎస్సార్సీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి తిరుగులేని విజయం సాధించారు. కౌంటింగ్ ఈ నెల 20న మొదలైంది. ‘మ్యాజిక్ ఫిగర్’ 67,887 కాగా.. గోపాల్‌రెడ్డి 68,110 ఓట్లను దక్కించుకున్నారు. 223 ఓట్లు ఎక్కువ లభించడంతో ఎన్నికల అధికారులు గోపాల్‌రెడ్డి విజయాన్ని ఖరారు చేశారు. తెలుగుదేశం పార్టీ తమకు బలమైన జిల్లాగా భావిస్తున్న అనంతపురం నుంచి, అందులోనూ రాప్తాడు నియోజకవర్గానికి చెందిన గోపాల్‌రెడ్డి ఘన విజయం సాధించడం చూస్తే ‘అనంత’తో పాటు కర్నూలు, వైఎస్సార్ జిల్లావాసుల్లో టీడీపీపై ఏస్థాయిలో వ్యతిరేకత ఉందో స్పష్టమవుతోంది. ఇదే తరుణంలో వైఎస్సార్సీపీపై గట్టి నమ్మకం ఉంచారనే విషయాన్ని ఈ ఎన్నికలు సుస్పష్టం చేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా సంబరాలు గోపాల్‌రెడ్డి గెలిచినట్లు బుధవారం ఉదయం ఆరు గంటలకు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి కోన శశిధర్ డిక్లరేషన్ పత్రాన్ని అందజేశారు. ఆ తర్వాత పార్టీ నేతలంతా ఆనందోత్సాహాల మధ్య గోపాల్‌రెడ్డిని భుజాలపై ఎత్తుకుని ర్యాలీగా బయటకు వచ్చారు. ‘జై జగన్’.. ‘జోహార్ వైఎస్సార్’ నినాదాలతో పార్టీ శ్రేణులు హోరెత్తించారు. అక్కడి నుంచి ర్యాలీగా వైఎస్సార్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ కార్యాలయానికి వెళ్లి సంబరాలు చేసుకున్నారు. -
దూసుకెళ్తున్న వెన్నపూస
గెలుపు దిశగా వైఎస్సార్సీపీ అభ్యర్థి గోపాల్‌రెడ్డి - ప్రతి రౌండ్లోనూ స్పష్టమైన ఆధిక్యత - ‘మొదటి ప్రాధాన్యత’లో 12,677 ఓట్ల మెజార్టీ - ‘మ్యాజిక్ ఫిగర్’ దాటాలంటే మరో 14,173 ఓట్లు అవసరం – కొనసాగుతోన్న ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు – నేడు ఫలితం వెలువడే అవకాశం - రెండు, మూడు స్థానాల్లో కేజేరెడ్డి, గేయానంద్ సాక్షి ప్రతినిధి, అనంతపురం: పశ్చిమ రాయలసీమ పట్టభద్ర నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ప్రతి రౌండ్లో స్పష్టమైన ఆధిక్యతను చాటుతున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేజే రెడ్డి కంటే 12,677 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. పీడీఎఫ్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ మూడో స్థానంలో నిలిచారు. అయితే.. విజయానికి అవసరమైన ‘మ్యాజిక్ ఫిగర్’ గోపాల్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓట్లలో రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. మొదటి ప్రాధాన్యతలో కేజేరెడ్డి, గేయానంద్‌కు పోలైన ఓట్లు, ‘మ్యాజిక్ ఫిగర్’కు అవసరమయ్యే ఓట్లను పరిగణనలోకి తీసుకుంటే గోపాల్‌రెడ్డికే విజయావకాశాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. తుది ఫలితం నేడు వెలువడే అవకాశముంది. మ్యాజిక్ ఫిగర్‌కు 14,173 ఓట్ల దూరంలో.. పోలైన ఓట్లలో చెల్లని ఓట్లు మినహాయిస్తే తక్కిన 1,35,772 ఓట్లలో 50శాతం కంటే ఒక్క ఓటు ఎక్కువ అంటే 67,887 ఓట్లను ‘మ్యాజిక్ ఫిగర్’గా ఎన్నికల అధికారులు నిర్ధారించారు. ఈ సంఖ్యకు గోపాల్‌రెడ్డి 14,173 ఓట్ల దూరంలో ఉన్నారు. అలాగే ద్వితీయ స్థానంలోని కేజే రెడ్డి 26,850 , గేయానంద్ 35,077 ఓట్ల దూరంలో ఉన్నారు. దీంతో విజయానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకునేందుకు ముగ్గురిలో గోపాల్‌రెడ్డికే అవకాశాలు ఉన్నాయి. బరిలోని 25 మంది అభ్యర్థులలో తక్కువ ఓట్లు పోలైన అభ్యర్థుల నుంచి మొదలు పెట్టి.. ప్రాధాన్యత క్రమంలో అభ్యర్థులను ‘ఎలిమినేట్’ చేస్తూ వస్తారు. వారికి పోలైన ఓట్లను ఇతర అభ్యర్థులకు జత చేస్తారు. ఈ క్రమంలో 22 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయినా ఫలితం తేలే అవకాశం లేదు. దీంతో ఎలిమినేట్ రౌండ్లో 23వ అభ్యర్థి అయిన గేయానంద్‌కు పోలైన ఓట్లలో కూడా రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. ఈ ఓట్ల లెక్కింపుతో అభ్యర్థి విజయం ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. గేయానంద్‌కు 32,810 ఓట్లు పోలయ్యాయి. వీటిలో కనీసం 40–50 శాతం ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు తమకు వచ్చి ఉంటాయని వైఎస్సార్సీపీ శ్రేణులు భావిస్తున్నాయి. వీటి లెక్కింపు పూర్తవ్వాలంటే మరో పది గంటలకు పైగా పట్టే అవకాశం ఉంది. బుధవారం తెల్లవారుజామున లేదా ఉదయం ఫలితం వెలువడనుంది. -
కర్నూలులో పేపరు మిల్లును పునరుద్ధరించాలి
– ఎమ్మెల్సీ అభ్యర్థి గోపాల్‌రెడ్డి డిమాండ్ కర్నూలు (ఓల్డ్‌సిటీ): కర్నూలులో రాయలసీమ పేపర్‌మిల్లు ప్రారంభించాలని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే, సీఈసీ మెంబర్ కొత్తకోట ప్రకాశ్‌రెడ్డిలతో కలిసి మంగళవారం స్థానిక కృష్ణకాంత్ ప్లాజాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయలసీమ యువకులు నిరుద్యోగ సమస్యతో ఆందోళనకు గురవుతున్నారన్నారు. నిరుద్యోగుల జీవితాల్లో వెలుగు నింపాలంటే కర్నూలులో ఎస్ఆర్పీఎం, హిందూపురంలో నిజాం షుగర్స్, గుంతకల్లులో స్పిన్నింగ్ మిల్లు, కడపలో బ్రాహ్మణి స్టీల్స్ ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. ఇచ్చిన హామీ మేరకు ఇంటికో ఉద్యోగం లేక నిరుద్యోగ భృతి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తనకు అవకాశం లభిస్తే ప్రభుత్వాన్ని నిలదీసి సాధించుకొస్తానని తెలిపారు. ఎన్నోరకాల అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. రాయలసీమకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. ఆయన 100 అబద్ధాలు చెబితే, ప్రస్తుతం రంగంలో ఉన్న టీడీపీ అభ్యర్థి కె.జె.రెడ్డి పరిశ్రమలు స్థాపిస్తానంటూ 150 అబద్ధాలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వం ఉద్యమాలు చేస్తే పీడీ యాక్టు, నిరుద్యోగులపై నాసా యాక్టు పెడతామనడం అప్రజాస్వామికమన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ఉద్యమాలను అణచివేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా క్రూరత్వం తగ్గించుకోకపోతే ముఖ్యమంత్రి పాలనకు కాలంచెల్లే రోజులొస్తాయని హెచ్చరించారు. సీమ సమస్యలపై పోరాడతారు.. రాయలసీమ జిల్లాల అభివృద్ధి పాలకులకు పట్టడం లేదని వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కర్నూలు, అనంతపురం, కడప జిల్లా ప్రజలకు ఈ ప్రభుత్వ పాలనలో అన్యాయం జరుగుతుందన్నారు. వెన్నపూస గోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీగా అన్ని ప్రాంతాల సమస్యలను తెలుసుకుంటూ ఎంతో చొరవ తీసుకుంటున్నారని తెలిపారు. ఆయన గెలిస్తే చట్టసభల్లో సీమవాసుల వాణి వినిపించి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని, తద్వారా రాయలసీమ వాసులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. అవగాహన కలిగిన అభ్యర్థి అవసరం.. రాష్ట్ర ఎన్జీవోల సంఘం చైర్మన్‌గా పనిచేసిన వెన్నపూస గోపాల్‌రెడ్డికి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సమస్యలపై మంచి అవగాహన ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి అభ్యర్థి ఎంతో అవసరమని వైఎస్ఆర్సీపీ సీఈసీ మెంబర్, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. అభ్యర్థికి మూడు జిల్లాల పరిధి ఉండటం వల్ల అందర్ని కలుసుకోకపోయినా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు గ్రామగ్రామాల్లో, ఇల్లిల్లూ తిరిగి ప్రచారం చేయడం అభినందనీయమన్నారు. ప్రజాసేవా అనుభవం కలిగిన వ్యక్తిని గెలిపించుకోవడం వల్ల సమస్యలు సునాయాసంగా పరిష్కారమవుతాయని తెలిపారు. నమోదు చేసుకున్న గ్రాడ్యుయేట్లందరు ఓటుహక్కును వినియోగించుకోవాలని సూచించారు. విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు శ్రీకర్, వైద్యనాథ్రెడ్డి, కుమారస్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేటితో ప్రచారం ముగింపు
– పట్టభుద్రుల నియోజకవర్గానికి 25 మంది.. –ఉపాధ్యాయ నియోజకవర్గానికి 10 మంది పోటీ కర్నూలు(అగ్రికల్చర్): శాసనమండలి కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎన్నికల ప్రచారం మంగళవారం నాటితో పరిసమాప్తం కానుంది. గతంలో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఈ సారి ఎన్నికల్లో ప్రచారం చప్పగా సాగుతోంది. పట్టభద్రుల నియోజకవర్గానికి 25 మంది, ఉపాధ్యాయ నియోజకవర్గానికి 10 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పట్టభద్రుల నియోజకవర్గానికి వైఎస్ర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెన్నపూస గోపాల్‌రెడ్డి ప్రచారంలో ముందు ఉన్నారు. ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 6గంటలకు ముగియనుంది. పట్టభద్రుల నియోజకవర్గానికి సంబందించి జిల్లా ఓటర్లు 82,591 మంది, ఉపాధ్యాయ ఓటర్లు 6670 మంది ఉన్నారు. వీరికి ఇప్పటికే బూత్ లెవల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటరు స్లిప్‌లను పంపిణీ చేశారు. కర్నూలు, నంద్యాల, ఆదోని ఆర్డీఓ కార్యాలయాల్లో ఎన్నికల సామాగ్రిని ఈ నెల 8న పంపిణీ చేయనున్నారు. తొమ్మిదో తేదీ ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. -
బాబు మోసాలకు ఓటుతో బుద్ధి చెప్పండి
– వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి నంద్యాలవిద్య/నంద్యాలవ్యవసాయం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన మోసాలను ఓటుతో బుద్ధి చెప్పాలని వైఎస్సార్సీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం కోర్టులు, తహసీల్దార్, రిజిస్ట్రార్, ట్రెజరీ, బీఎస్ఎన్ఎల్, ఏపీట్రాన్స్కో కార్యాలయాల్లో ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఉద్యోగులను, నిరుద్యోగులను దగా చేశారన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తానని రెండున్నరేళ్లు మభ్యపెట్టారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో మళ్లీ ఈ హామీని వెలుగులోకి తెచ్చారన్నారు. అయితే పట్టభద్రులు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. తాను విజయం సాధిస్తే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి, యువకుల ఉపాధి కోసం పోరాడుతానని చెప్పారు. కోర్టు ఆవరణంలో ప్రచారం... కోర్టు ఆవరణంలోని బార్ అసోసియేషన్‌లో వెన్నపూస గోపాల్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ హైకోర్టు బెంచి కర్నూలులో ఏర్పాటు చేస్తామని, లాయర్లకు డెప్త్ బెనిఫిట్స్ కోసం రూ.5లక్షలు ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తానన్నారు. ఈనెల 9వ తేదీ జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు తమ మొదటి ఓటు ప్రాధాన్యత తనకే వేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మలికిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, న్యాయవాదులు మాధవరెడ్డి, ఎస్ఎం ఖాద్రి, వివేకానందరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. హోలీక్రాస్ చర్చిలో ప్రార్థనలు.. స్థానిక ఆర్ఎస్ రోడ్డులోని హోలీక్రాస్ కెథడ్రల్ చర్చిలో గోపాల్‌రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయన ఆర్‌ఎస్‌రోడ్డు, విశ్వాసపురం, మిషన్ కాంపౌండ్, ఎల్ఐసీ ప్రాంతాల్లో పర్యటించి, పట్టభద్రులను కలిసి ఓట్లను అభ్యర్థించారు. ఆయన వెంట పెన్షనర్ల అసోసియేషన్ కార్యదర్శి ఎల్ఈఈ అమృతం, బ్రహ్మానందరెడ్డి, పుల్లారెడ్డి, సాయిరాంరెడ్డి పాల్గొన్నారు. -
కర్నూలుకు 193 బ్యాలెట్ బాక్సులు
కర్నూలు సీక్యాంప్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 9వతేదీన జరిగే పోలింగ్‌కు అవసరమైన 193 బ్యాలెట్ బాక్సులు గురువారం ఆదోని నుంచి కర్నూలు చేరాయి. కర్నూలు తహసీల్దార్ కార్యాలయం వద్ద వీటిని కార్యాలయ సిబ్బంది పరిశీలించారు. పోలింగ్ నిర్వహణకు సంబంధించి రెండు రోజుల్లో పూర్తి ఏర్పాట్లు చేస్తామని కర్నూలు తహసీల్దార్ టీవీ రమేష్‌బాబు తెలిపారు. బ్యాలెట్ బాక్స్‌లు పూర్తిగా పాతవి కావడంతో వాటిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. పాడైపోయిన వాటిని మళ్లీ రిటర్నింగ్ అధికారులకు అప్పజెబుతామన్నారు. -
121 పోలింగ్ కేంద్రాలు
- గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై ఆర్డీఓ - రాజకీయ పార్టీల నేతలు, పీఓలు, పోలీసులతో సమావేశం కర్నూలు సీక్యాంప్: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కర్నూలు ఆర్డీఓ హుసేన్‌సాహెబ్ సూచించారు. ఇందుకు సంబంధించి ఆయన గురువారం తన కార్యాలయంలో పోలింగ్ ఆఫీసర్లతోపాటు కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, తాలుకా సీఐ మహేశ్వరరెడ్డితో సమావేశమయ్యారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ నెల9న జిల్లా వ్యాప్తంగా 121 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుందన్నారు. ఇందులో కర్నూలు డివిజన్లో దాదాపు 40 కేంద్రాలున్నాయన్నారు. డివిజన్ నుంచి దాదాపు 40మంది పోలింగ్ అధికారులు సమావేశానికి హాజరయ్యారు. అంతకుముందు వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు సహకరించాలని ఆయా పార్టీల నాయకులను కోరారు. -
సులభంగా ఓటరు వివరాలు
– ‘ఎమ్మెల్సీ ఓట్ ఫైండర్’ పేరుతో వైఎస్సార్సీపీ ఐటీ విభాగం సరికొత్త మొబైల్ యాప్ ఆవిష్కరణ అనంతపురం : త్వరలో జరిగే పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా నమోదు చేసుకున్న వారు జాబితాలో తమ పేర్లు ఉన్నాయా? లేదా అని తెలుసుకోవడం చాలా ఇబ్బందిగా మారింది. అధికారులు ఈ వివరాలు ఆన్లైన్లో ఉంచినా వాటిని వెతుక్కోవడం సమస్యతో కూడుకుంది. ఈ పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ ఐటీ విభాగం ‘ఎమ్మెల్సీ ఓట్ ఫైండర్’ పేరుతో సరికొత్త మొబైల్ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్ ద్వారా ఓటరు పూర్తి వివరాలు చాలా సులభంగా తెలుసుకోవచ్చు. ఐటీ విభాగం సభ్యుడు వి. చిరంజీవిరెడ్డి ఈ యాప్‌ను తయారు చేశారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గానికి వైఎస్సార్సీపీ మద్దతుతో పోటీ చేస్తున్న వెన్నపూస గోపాల్‌రెడ్డి ఈ మొబైల్ యాప్‌ను ఆదివారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఐటీ విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి భూమిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, బెంగళూరు ఐటీ విభాగం సభ్యులు ముకుందాపురం ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు. యాప్‌ను ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆన్‌డ్రాయిడ్ మొబైల్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ (యాపిల్)లోకి వెళ్లాలి. Mlcvotefinder’ (పదాల మధ్య స్పేస్ ఉండకూడదు) అని టైప్ చేసి సర్చ్ చేయాలి. యాప్ డిస్ప్లే అవుతుంది. దాన్ని మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓటరు వివరాలు తెలుసుకోవాలంటే... మొబైల్ యాప్ ఓపెన్ చేశాక కింది భాగంలో ‘చెక్ యువర్ ఓట్’ అని ఉంటుంది. అక్కడ నొక్కితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ వారి వెబ్సైట్ ఇంటర్ఫేస్ కనెక్ట్ అవుతుంది. అక్కడ...జిల్లా అనే చోట ఏ జిల్లా ఓటరు అయితే అ జిల్లాను సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఎమ్మెల్సీ నియోజకవర్గం టైప్ అని ఉంటుంది అక్కడ టీచర్స్ అయితే టీచరు, గ్రాడ్యుయేట్ ఓటరు అయితే గ్రాడ్యుయేట్‌ను సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత ఇంటినంబరు ఎంటర్ చేయాలి. (ఉదాహరణ 15–37,15/37 రెండు విధాలా చూడండి) లేదా పేరు నమోదు చేసి సర్చ్ అనే బటన్ నొక్కాలి. అంతే మనకు కావాల్సిన ఓటరు వివరాలు డిస్ప్లే అవుతాయి. ఓటరు పేరు, చిరునామా, సీరియల్ నంబరు, పోలింగ్‌స్టేషన్ నంబర్, పోలింగ్ బూతు ఎక్కడుందనే వివరాలు ఇట్టే కనిపిస్తాయి. -
పట్టభద్రులూ..ఆలోచించి ఓటు వేయండి
– మూడేళ్లలో ఒక్క హామీని అమలు చేయని టీడీపీ – సీమ వాణి వినిపించేందుకు వైఎస్ఆర్సీపీని బలపరచండి – వైఎస్ఆర్సీపీ మైనార్టీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు నదీప్ అహ్మద్ కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): మూడేళ్ల పాలనలో ఒక్క హామీని నెరవేర్చని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి పట్టభద్రులు తగిన గుణపాఠం చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు నదీప్‌అహ్మద్ పిలుపునిచ్చారు. మార్చి 18న జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలన్నారు. శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2014 ఎన్నికల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, నిరుద్యోగ భృతి, ఇంటికి ఒక ఉద్యోగం, రుణమాఫీ తదితర హామీలను టీడీపీ నాయకులు ఇచ్చారని..అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను మరిచారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంతర పోరాటాలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో మూడేళ్లలో ఒక్క పరిశ్రమ రాలేదని, పది మందికి ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లను అడిగే నైతిక హక్కును టీడీపీ కోల్పోయిందన్నారు. రాయలసీమకు తీవ్ర అన్యాయం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెన్నపూస గోపాల్‌రెడ్డిని మొదటి ప్రాధాన్యం ఓటుతో గెలిపించాలని కోరారు. రాయలసీమ వాణిని శాసనమండలిలో వినిపించే సత్తా గోపాల్‌రెడ్డికి మాత్రమే ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ.. రియల్ ఎస్టేట్ వ్యాపారిని శాసనమండలికి పంపేందుకు సిద్ధపడడం దారుణమన్నారు. రైతుల భూములను మింగి వ్యాపారం చేసిన వ్యక్తిని పెద్దల సభకు అభ్యర్థిగా నిలబెట్టడం ఆలోచించాల్సిన విషయమన్నారు. ఉపాధి కల్పనలో విఫలం.. కర్నూలు నియోజకవర్గ సమన్వకర్త హాఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ..మూడేళ్ల టీడీపీ పాలనలో జిల్లాలో ఒక్క పరిశ్రమను స్థాపించలేదన్నారు. ఇప్పుడు మళ్లీ కల్లిబొల్లి హామీలతో నిరుద్యోగులను మోసం చేసేందుకు పరిశ్రమలు స్థాపిస్తామని, ఉపాధిని కల్పిస్తామని టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కేజేరెడ్డి ముందుకు రావడం దారుణమన్నారు. ఉపాధి కల్పించడంలో సీఎం చంద్రబాబునాయుడు విఫలమయ్యారని ఆరోపించారు. ఎక్కడెక్కడ పరిశ్రమలు స్థాపిస్తారో..ఎంతమందికి ఉపాధినికి కల్పిస్తారో చెప్పి.. టీడీపీ నాయకులు ఓట్లు అడగాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో నాయకులు ఎస్ఏ రహ్మెన్, సీహెచ్ మద్దయ్య మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు విజయకుమారి, డీకే రాజశేఖర్, సఫియా ఖాతూన్, ఫైరోజ్, రాఘవేంద్ర, సోయాబ్ఖాద్రి, వాహిదా పాల్గొన్నారు. -
21 మంది తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులు
– అనర్హులను ఓటర్లుటగా గుర్తించడంపై హైకోర్టు సీరియస్ కర్నూలు(అగ్రికల్చర్): పట్టభద్రుల ఎన్నికల్లో అనర్హులను ఓటర్లుగా నమోదు చేసినందుకుగాను హైకోర్టు ఆదేశాల మేరకు 21 మంది తహసీల్దార్లకు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నారు. సోమవారం వీరికి ఇవి అందనున్నాయి. వీటికి తహసీల్దార్లు వివరణ ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గంలో బోగస్ ఓటర్లు ఉన్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. జిల్లాలోని 21 మండలాల్లో బోగస్ పట్టభద్రులు ఉన్నట్లు స్పష్టమవుతోంది. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ సర్టిఫికెట్లు, టీసీలు, ఆధార్ కార్డుల ఆధారంగా.. పట్టభద్రుల ఓటర్లుగా నమోదు చేశారు. అన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారిలో అనర్హులు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. జిల్లా అధికారులందరూ నోడల్ అధికారులుగా ఉన్నారు. వీరందుకే ఓటర్ల జాబితాలో అనర్హులను గుర్తించే కార్యక్రమంలో నిమగ్నం అయ్యారు. సోమవారం సాయంత్రానికి బోగస్ ఓటర్ల గుర్తింపు ప్రక్రియ కొలిక్కి రానుంది. నామినేషన్ల గడువు సోమవారం నాటితో పూర్తి కానున్న విషయం విదితమే. -
బోగస్ ఓటర్ల తొలగింపునకు చర్యలు
- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ కర్నూలు(అగ్రికల్చర్): పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలో బోగస్ ఓటర్లను తొలగించేందుకు చర్యలు తీసుకుంటన్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ తెలిపారు. బుధవారం కలెక్టర్ తన సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలన్నారు. ఎన్నికలకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదులయిన కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంప్లైంట్ మానిటరింగ్ సెల్(08518–277305, 277309)కు ఫోన్ చేసి చెప్పవచ్చన్నారు. నామినేషన్ల ఘట్టం సోమవారం నుంచి ప్రారంభమైందని ఈ నెల 20వ వరకు నామినేషన్లకు అవకాశం ఉంటుందన్నారు. ఉపాధ్యాయ నియోజకవర్గం ఓటర్లు 6945 ఉండగా ఇది వరకు 54 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, తాజాగా 55 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. పట్టభద్రుల ఓటర్లు 84750 ఉండగా ఇది వరకు 112 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా తాజాగా 121 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు గరిష్టంగా 1400 ఓటర్లు ఉండవచ్చని అయితే జిల్లాలో 1300 మాత్రమే ఉన్నారని అయితే సమయం సరిపోదని చెబుతున్నందున 1000 మందికి పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసే విధంగా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కాగా నగరంలో వైఎస్ఆర్ సీపీ ఫ్లెక్సీలను కార్యక్రమం ముగిసిన వెంటనే మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారని, అదే తెలుగుదేశం ఫ్లెక్సీలను నెలల తరబడి ఉంచుతున్నారని ఇదెక్కడి న్యామంటూ వైఎస్ఆర్సీపీ ప్రతినిధి తోట వెంకటకృష్ణారెడ్డి సమావేశం దృష్టికి తెచ్చారు. 2000భోగస్ఓటర్లను గుర్తించి ఆధారాలతో సహా అధికారులకు ఇచ్చామని వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని సీపీఎం ప్రతినిధి గౌస్ దేశాయ్ కోరారు. సమావేశంలో అసిస్టెంటు రిటర్నింగ్ అధికారి, డీఆర్ఓ గంగాధర్‌గౌడు, టీడీపీ ప్రతినిధి సత్రం రామకృష్ణుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుదర్శన్‌రెడ్డి, సీపీఐ నగర కార్యదర్శి రసూల్, సమాజ్‌వాదీ పార్టీ నేత దండు శేషుయాదవ్ పాల్గొన్నారు. -
బోగస్ పట్టభద్రులు
– ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా తయారీలో ‘పచ్చ’పాతం బేతంచెర్లకు చెందిన శ్రీలక్ష్మి పదో తరగతి సర్టిఫికెట్ ఆధారంగా పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటరుగా నమోదు అయ్యేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే రెవెన్యూ అధికారులు ఏ మాత్రం విచారణ చేయకుండానే ఆమె దరఖాస్తును ఆమోదించి ఓటు హక్కు కల్పించారు. ఇలాంటి బోగస్ పట్టభద్రులు జిల్లాలో కోకొల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. కర్నూలు(అగ్రికల్చర్): శాసనమండలి పట్టభద్రల నియోజకవర్గంలో బోగస్ ఓటర్లు కుప్పలు, తెప్పలుగా ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఓటర్లుగా నమోదు కావడానికి విధిగా డిగ్రీ, తత్సమాన పరీక్షలో 2013 అక్టోబర్‌లోపు ఉత్తీర్ణులయిన వారే అర్హులు. అయితే అధికారులు టీడీపీ నేతల మాయలో పడి పదవ తరగతి సర్టిఫికెట్లపైనే ఓటర్లుగా నమోదు చేశారంటే ఎంత గుడ్డిగా వ్యవహరించారో తెలుస్తోంది. బోగస్ ఓటర్లు తవ్వేకొద్ది వెలుగులోకి వస్తున్నారు. ఎలాంటి సర్టిíఫికెట్ లేకపోయినా కేవలం ఆధార్‌కార్డు ఆధారంగా కూడా ఓటర్లను నమోదు చేయడం గమనార్హం. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను రెవెన్యూ అధికారులు తుంగలో తొక్కి దేశం నేతల ఆధ్వర్యంలో బోగస్ ఓటర్లను అడ్డుగోలుగా నమోదు చేసి అభాసుపాలయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓటర్ల నమోదులో విధిగా డిగ్రీ సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంది. వీటిపై గెజిటెడ్ అధికారి అటెస్టేషన్ కూడా చేయించాలి. కానీ రెవెన్యూ అధికారులు మాత్రం ఎలాంటి పరిశీలన చేయకుండా ఇష్టానుసారంగా బోగస్ పట్టభద్రులను ఓటర్లుగా గుర్తించి నవ్వులపాలు అయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీన్నిబట్టి చూస్తే రెవెన్యూ అధికారుల పచ్చపాతం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఓటర్ల జాబితాలో బోగస్ పట్టభద్రుల నమోదుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు సిద్ధమవుతోంది. -
టీడీపీ పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా కేజే రెడ్డి?
– నేడు సీఎంతో భేటీ అయ్యే అవకాశం – ఏకగ్రీవంగా సిఫారసు చేసిన పార్టీ నేతలు సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార తెలుగుదేశం పార్టీ నుంచి కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానానికి రాగమయూరి బిల్డర్స్ అధినేత కె. జనార్దన్ రెడ్డి(కేజే రెడ్డి) రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. పార్టీకి చెందిన నేతలంతా ఏకగ్రీవంగా ఆయన పేరును సిఫారసు చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌తో కేజే రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గెలిచేందుకు మీరు వేసుకున్న ప్రణాళిక ఏమిటో వివరించాలని కోరినట్టు తెలిసింది. ఇందుకోసం తన యాక్షన్ ప్లాన్‌ను ఆయన వివరించినట్టు సమాచారం. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో బుధవారం కేజే రెడ్డి సమావేశం కానున్నట్టు తెలిసింది. వాస్తవానికి ఈయన అభ్యర్థిత్వం మంగళవారమే ఖరారు కావాల్సి ఉన్నప్పటికీ.. కేబినెట్ సమావేశం ఉండటంతో సీఎంతో సమావేశం కాలేదని సమాచారం. తెరపైకి తెచ్చిన శిల్పా వాస్తవానికి అధికార పార్టీ నుంచి పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా మొదట్లో ఎంపీ టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ పేరు ప్రచారం జరిగింది. అయితే, అకస్మాత్తుగా కేజే రెడ్డి పేరును శిల్పా చక్రపాణి రెడ్డి తెరమీదకు తీసుకొచ్చారు. కొంతకాలం పాణ్యం నియోజకవర్గ ఇన్చార్జిగా కేజే రెడ్డి పనిచేశారు. ఎన్నికల అనంతరం అధికార పార్టీ కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా లేరు. అయితే, పార్టీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణి రెడ్డితో కేజే రెడ్డిఽకి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తన మిత్రుడు కేజే రెడ్డి పేరును శిల్పా తెరమీదకు తీసుకొచ్చి.. నేరుగా లోకేష్‌తో భేటీ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. నేడు సీఎంతో సమావేశం అనంతరం అధికారికంగా కేజే రెడ్డి పేరును ప్రకటించినున్నట్టు అధికార పార్టీ వర్గాల సమాచారం. ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఏపీఎన్జీవో నేత గోపాల్ రెడ్డి, పీడీఎఫ్ తరపున ఎమ్మెల్సీగా ఉన్న గేయానంద్ బరిలో ఉన్నారు. -
డిగ్రీ విద్యార్థిని అదృశ్యం
ఎచ్చెర్ల : ఎచ్చెర్ల సమీపంలోని వెంకటేశ్వరా డిగ్రీ కళాశాలలో తృతీయ సంవత్సరం డిగ్రీ చదువుతున్న విద్యార్థిని సాకేటి సంధ్యారాణి కనిపించటం లేదని తండ్రి రామారావు ఎచ్చెర్ల పోలీస్‌స్టేçÙన్లో శనివారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 19వ తేదీ నుంచి కనిపించటం లేదని తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈమెది బామిని మండలం లఖిరి గ్రామం. -
మారిన ఎమ్మెల్సీ పోలింగ్ తేదీ
హైదరాబాద్ : తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ తేదీని మారుస్తున్నట్లు ఈసీ ప్రకటించారు. ఇంటర్ పరీక్షల నేపథ్యంలో పోలింగ్ తేదీని మార్చి 22కు మార్చారు. అలాగే మార్చి 25న ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉంటుందని ఈసీ తెలిపారు. అయితే అభ్యర్థుల ధాఖలు చేసే నామినేషన్ గడువు ఈ నెల 26తో ముగియనుందని పేర్కొంది. అసలు అయితే తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 16న పోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. అయితే ఇంటర్మీడియట్ పరీక్షలు 16 నుంచి ప్రారంభమవుతున్నాయని తెలంగాణ ప్రభుత్వం ఈసీ దృష్టికి తీసుకువెళ్లాయి. దాంతో ఎన్నికల నిర్వహణ తేదీ 15గా నిర్ణయించింది. పరీక్షల నేపథ్యంలో ఉపాధ్యాయులు బిజీగా ఉంటారని దాంతో ఎన్నికల తేదీని 22కు ఖరారు చేసింది. -
మార్చి15నే ఎమ్మెల్సీల ఎన్నికలు
ఏపీ, తెలంగాణలో నేడు నోటిఫికేషన్ జారీ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్‌లో రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ మార్చి 15న జరగనుంది. తొలుత ఈ స్థానాలకు మార్చి 16న పోలింగ్ నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) షెడ్యూలు విడుదల చేసింది. అయితే.. ఇరు రాష్ట్రాల్లోనూ మార్చి 16న ఇంటర్మీడియెట్ పరీక్షలు ఉండడంతో మార్చి 15న (ఆదివారం) పోలింగ్ నిర్వహించనున్నారు. పరీక్షల విషయమై ఇరు రాష్ట్రాల నుంచి నివేదిక అందిన నేపథ్యంలో సీఈసీ ఈ మేరకు నిర్ణయించింది. తెలంగాణలో మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి, వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మె ల్సీ స్థానానికి గురువారం నోటిఫికేషన్ జారీ కానుంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో తూర్పుగోదావరి-పశ్చిమగోదావరి ఉపాధ్యాయ ఎమ్మె ల్సీ నియోజకవర్గానికి, కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి కూడా గురువారమే నోటిఫికేషన్ జారీ కానుంది. తాజాగా జారీ చేయనున్న నోటిఫికేషన్లో పోలింగ్ తేదీని మార్చి 15గా ప్రకటించాలని కమిషన్ నిర్ణయించింది. ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. -
నగర ఎమ్మెల్యేల్లో ఒక్కరే గ్రాడ్యుయేట్
మిగతావారి విద్యార్హత 12వ తరగతి లోపే సాక్షి, ముంబై: విద్యాభ్యాసం గురించి గొప్పలు చెప్పే నాయకులు నిజంగానే విద్యాధికులా అంటే జవాబు చెప్పడం కొంత కష్టమే మరి. ఎందుకో తెలుసా. ఆర్థిక రాజధాని పరిధిలోని పలు నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగినవారి విద్యార్హత గరిష్టంగా 12వ తరగతి మాత్రమే. అయితే పశ్చిమ అంధేరీ నుంచి బరిలోకి దిగిన అమిత్ సాటం మాత్రమే డిగ్రీ చదివారు. పలు పార్టీల తరఫున బరిలోకి దిగిన వీరు నామినేషన్ పత్రాల దాఖలు సమయంలో జతచేసిన అఫిడవిట్లలో పేర్కొన్న వివరాలతో ఈ ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. చాందివలి నియోజక వర్గం నుంచి గెలిచిన నసీంఖాన్ ప్రాథమిక విద్యను పూర్తిచేసి పాఠశాలకు స్వస్తి చెప్పారు. గోరేగావ్ నుంచి గెలుపొంది బీజేపీ అభ్యర్థి విద్యాఠాకూర్ ఎనిమిదో తరగతి వరకే చదివారు. అణుశక్తినగర్ నుంచి శివసేన అభ్యర్థి తుకారాం తొమ్మిదో తరగతి చదివారు. ములుండ్ లో విజయకేతనం ఎగురవేసిన సర్దార్ తారాసింగ్ పదో తరగతి తప్పినట్టు తన అఫిడవిట్లో పేర్కొన్నారు. తూర్పు అంధేరీ నుంచి శివసేన అభ్యర్థి రమేశ్ లట్కే, తూర్పు ఘాట్కోపర్ నుంచి బీజేపీ తరఫున పోటీచేసిన ప్రకాశ్ మెహతా, చెంబూర్ నుంచి శివసేన తరఫున పోటీచేసిన ప్రకాశ్ ఫాతర్పేకర్, కలీనా నుంచి శివసేన టికెట్‌పై పోటీచేసిన సంజయ్ పోత్నిస్, కుర్లా నుంచి శివసేన అభ్యర్థి మంగేశ్ కుడాల్కర్ కేవలం పదో తరగతికే పరిమితమయ్యారు. విఖ్రోలీ నియోజకవర్గం నుంచి శివసేన తరఫున పోటీచేసిన సునీల్ రావుత్ 12వ తరగతి, దిండోషి నుంచి శివసేన తరఫున బరిలో దిగిన మాజీ మేయర్ సునీల్ ప్రభు 12వ తరగతి, చార్కోప్ నుంచి బీజేపీ అభ్యర్థి యోగేష్ సాగర్ 11వ తరగతి చదివారు. నగరంలోని 36 శాసనసభ నియోజకవర్గాలకు 17 నియోజక వర్గాల నుంచి గెలుపొందిన అభ్యర్థులు పదో తరగతి లోపే చ దువుకున్నారని సమాచారం.