నేటితో ప్రచారం ముగింపు
Published Tue, Mar 7 2017 12:32 AM | Last Updated on Tue, Sep 5 2017 5:21 AM
– పట్టభుద్రుల నియోజకవర్గానికి 25 మంది..
–ఉపాధ్యాయ నియోజకవర్గానికి 10 మంది పోటీ
కర్నూలు(అగ్రికల్చర్): శాసనమండలి కర్నూలు, అనంతపురం, వైఎస్‌ఆర్ జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎన్నికల ప్రచారం మంగళవారం నాటితో పరిసమాప్తం కానుంది. గతంలో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఈ సారి ఎన్నికల్లో ప్రచారం చప్పగా సాగుతోంది. పట్టభద్రుల నియోజకవర్గానికి 25 మంది, ఉపాధ్యాయ నియోజకవర్గానికి 10 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పట్టభద్రుల నియోజకవర్గానికి వైఎస్‌ర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెన్నపూస గోపాల్‌రెడ్డి ప్రచారంలో ముందు ఉన్నారు. ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 6గంటలకు ముగియనుంది. పట్టభద్రుల నియోజకవర్గానికి సంబందించి జిల్లా ఓటర్లు 82,591 మంది, ఉపాధ్యాయ ఓటర్లు 6670 మంది ఉన్నారు. వీరికి ఇప్పటికే బూత్ లెవల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటరు స్లిప్‌లను పంపిణీ చేశారు. కర్నూలు, నంద్యాల, ఆదోని ఆర్‌డీఓ కార్యాలయాల్లో ఎన్నికల సామాగ్రిని ఈ నెల 8న పంపిణీ చేయనున్నారు. తొమ్మిదో తేదీ ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది.
Advertisement
Advertisement