IIT Kharagpur Graduate Ankit Joshi Quits High Paying Job to Spend Time With His Daughter Spiti - Sakshi
Sakshi News home page

‘కూతురు పుట్టిందని కోట్ల జీతం కాద‌న్నాడు’..మనసును హత్తుకునే ఓ తండ్రి కూతురు కథ

Published Fri, Nov 18 2022 5:33 PM | Last Updated on Fri, Nov 18 2022 6:57 PM

IIT Kharagpur graduate Ankit Joshi quits high paying job to spend time with his daughter Spiti - Sakshi

ఆడ పిల్లకి అమ్మ..అన్న.. అక్క.. ఇలా ఎంతమంది ఉన్నా..తన కోసం తపించేది..బాధ్యతగా కడవరకు నిలిచేది తన మనుసు అర్ధం చేసుకునే నేస్తం.. నాన్న ఒక్కరే. అలాంటి ఓ నాన్న పుట్టిన కుమార్తె కోసం ఎవరూ తీసుకోని నిర్ణయం తీసుకున్నారు. మనసును హత్తుకునే ఓ తండ్రి కూతురు కథ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  

ఖరగ్‌పూర్ ఐఐటీ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన అంకిత్ జోషి తన కుమార్తె పుట్టడానికి కొన్ని రోజుల ముందు అత్యధిక జీతం పొందే ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇలాంటి నిర్ణయం కెరియర్‌ను ప్రశ్నార్ధకంగా మార్చేస్తుంది. కానీ తనకి మాత్రం తండ్రిగా ప్రమోషన్‌ వచ్చిందని పొంగిపోతున్నాడు. 

అంకిత్ జోషి ఓ సంస్థలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.విధుల నిమిత్తం దేశ, విదేశాల్లో ప్రయాణాలు చేయాల్సి వచ్చేది. కానీ తన కుమార్తె స్పితి పుట్టిన తర్వాత  ఆ జాబ్‌ చేసేందుకు ఇష్టపడడం లేదు. 

‘నా కూతురు ప్రపంచంలోకి రాకముందే, నా వారం రోజుల పెటర్నిటీ లీవ్ (పితృత్వ సెలవు)ల కంటే ఎక్కువ సమయం ఆమెతో గడపాలని నాకు తెలుసు’. కానీ అది కష్టం. ఎందుకంటే? నేను కొన్ని నెలల క్రితం సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌ హోదాలో కొత్త ఉద్యోగంలో చేరా. విధుల నిమిత్తం ఎన్నో ప్రాంతాల్లో తిరిగాను. ఆ సమయాన్ని ఎంతగానో ఆస్వాధించా. స్పితి పుట్టిన తర్వాత ఆమెతో గడిపేందుకు నాకు ఎక్కువ సమయం కావాలి. కంపెనీ వారం రోజుల పితృత్వ సెలవుల్ని పొడిగించడం సాధ్యం కాదని తెలుసుకున్నా. అందుకే నాజాబ్‌కు రిజైన్‌ చేయాలని నిర్ణయించుకున్నానంటూ తన ఆనంద క్షణాల్ని నెటిజన్లతో పంచుకున్నాడు. 

స్పితి పుట్టినప్పటి నుండి ఒక నెల గడిచింది. ఈ సమయంలో నా భార్య భార్య  (ఆకాంక్ష) ప్రసూతి సెలవులో ఉన్నప్పుడు కూడా ఆమె సంస్థలో మేనేజర్‌గా పదోన్నతి పొందింది. ఆమె కెరీర్ & మాతృత్వం సంతృప్తికరంగా ఉంది’ అని చెప్పారు.

‘చాలా కంపెనీలు ఉద్యోగులకు ఇచ్చే పితృత్వ సెలవులపై అసంతృప్తిగా ఉన్నా. పిల్లలతో తండ్రి ఎంత తక్కువ సమయం గడుపుతున్నాడనే కాదు. పెంపకం పాత్రలో తండ్రి బాధ్యత తగ్గుతుందని అన్నారు.  

‘నేను వేసిన అడుగు అంత సులభం కాదు. చాలా మంది తండ్రులు ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేరు. కానీ రాబోయే సంవత్సరాల్లో పితృత్వ సెలవుల వంటి పరిస్థితులు మారతాయని నేను ఆశిస్తున్నాను. స్పతి పుట్టక ముందు గడిపిన సంవత్సరాల కంటే..ఆమెతో గడిపిన ఈ ఒక్కనెలే ఎంతో సంతృప్తినిచ్చింది. కొన్ని నెలల తర్వాత కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తా. ఈలోగా నా కూతురితో మరింత సమాయాన్ని గడింపేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నానంటూ అంకిత్‌ జోషి షేర్‌ చేసిన పోస్ట్‌లో పేర్కొన్నాడు.  

పెటర్నిటీ లీవ్‌లు ఎన్నిరోజులు 
శిశువు జన్మించిన సమయంలో లేదా జన్మించిన ఆరు నెలలలోపు తండ్రి రెండు వారాల సెలవులు (పెటర్నిటీ లీవ్) తీసుకునేందుకు మనదేశంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. కానీ వాస్తవానికి అలా జరడగం లేదు. ప్రభుత్వ లేదా ప్రైవేటు కంపెనీల్లో పనిచేసే భారతీయ మహిళలు, వేతనంతో కూడిన 26 వారాల సెలవులకు అర్హులు. కానీ పురుషులకు మాత్రం పితృత్వ సెలవుల విషయంలో ఓ స్పష్టత లేదనే ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement