High Paying Job
-
‘కూతురు పుట్టిందని కోట్ల జీతం కాదన్నాడు’..మనసును హత్తుకునే ఓ తండ్రి కూతురు కథ
ఆడ పిల్లకి అమ్మ..అన్న.. అక్క.. ఇలా ఎంతమంది ఉన్నా..తన కోసం తపించేది..బాధ్యతగా కడవరకు నిలిచేది తన మనుసు అర్ధం చేసుకునే నేస్తం.. నాన్న ఒక్కరే. అలాంటి ఓ నాన్న పుట్టిన కుమార్తె కోసం ఎవరూ తీసుకోని నిర్ణయం తీసుకున్నారు. మనసును హత్తుకునే ఓ తండ్రి కూతురు కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఖరగ్‌పూర్ ఐఐటీ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన అంకిత్ జోషి తన కుమార్తె పుట్టడానికి కొన్ని రోజుల ముందు అత్యధిక జీతం పొందే ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇలాంటి నిర్ణయం కెరియర్ను ప్రశ్నార్ధకంగా మార్చేస్తుంది. కానీ తనకి మాత్రం తండ్రిగా ప్రమోషన్ వచ్చిందని పొంగిపోతున్నాడు. అంకిత్ జోషి ఓ సంస్థలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.విధుల నిమిత్తం దేశ, విదేశాల్లో ప్రయాణాలు చేయాల్సి వచ్చేది. కానీ తన కుమార్తె స్పితి పుట్టిన తర్వాత ఆ జాబ్ చేసేందుకు ఇష్టపడడం లేదు. ‘నా కూతురు ప్రపంచంలోకి రాకముందే, నా వారం రోజుల పెటర్నిటీ లీవ్ (పితృత్వ సెలవు)ల కంటే ఎక్కువ సమయం ఆమెతో గడపాలని నాకు తెలుసు’. కానీ అది కష్టం. ఎందుకంటే? నేను కొన్ని నెలల క్రితం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హోదాలో కొత్త ఉద్యోగంలో చేరా. విధుల నిమిత్తం ఎన్నో ప్రాంతాల్లో తిరిగాను. ఆ సమయాన్ని ఎంతగానో ఆస్వాధించా. స్పితి పుట్టిన తర్వాత ఆమెతో గడిపేందుకు నాకు ఎక్కువ సమయం కావాలి. కంపెనీ వారం రోజుల పితృత్వ సెలవుల్ని పొడిగించడం సాధ్యం కాదని తెలుసుకున్నా. అందుకే నాజాబ్కు రిజైన్ చేయాలని నిర్ణయించుకున్నానంటూ తన ఆనంద క్షణాల్ని నెటిజన్లతో పంచుకున్నాడు. స్పితి పుట్టినప్పటి నుండి ఒక నెల గడిచింది. ఈ సమయంలో నా భార్య భార్య (ఆకాంక్ష) ప్రసూతి సెలవులో ఉన్నప్పుడు కూడా ఆమె సంస్థలో మేనేజర్‌గా పదోన్నతి పొందింది. ఆమె కెరీర్ & మాతృత్వం సంతృప్తికరంగా ఉంది’ అని చెప్పారు. ‘చాలా కంపెనీలు ఉద్యోగులకు ఇచ్చే పితృత్వ సెలవులపై అసంతృప్తిగా ఉన్నా. పిల్లలతో తండ్రి ఎంత తక్కువ సమయం గడుపుతున్నాడనే కాదు. పెంపకం పాత్రలో తండ్రి బాధ్యత తగ్గుతుందని అన్నారు. ‘నేను వేసిన అడుగు అంత సులభం కాదు. చాలా మంది తండ్రులు ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేరు. కానీ రాబోయే సంవత్సరాల్లో పితృత్వ సెలవుల వంటి పరిస్థితులు మారతాయని నేను ఆశిస్తున్నాను. స్పతి పుట్టక ముందు గడిపిన సంవత్సరాల కంటే..ఆమెతో గడిపిన ఈ ఒక్కనెలే ఎంతో సంతృప్తినిచ్చింది. కొన్ని నెలల తర్వాత కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తా. ఈలోగా నా కూతురితో మరింత సమాయాన్ని గడింపేందుకు ప్లాన్ చేసుకుంటున్నానంటూ అంకిత్ జోషి షేర్ చేసిన పోస్ట్‌లో పేర్కొన్నాడు. పెటర్నిటీ లీవ్‌లు ఎన్నిరోజులు శిశువు జన్మించిన సమయంలో లేదా జన్మించిన ఆరు నెలలలోపు తండ్రి రెండు వారాల సెలవులు (పెటర్నిటీ లీవ్) తీసుకునేందుకు మనదేశంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. కానీ వాస్తవానికి అలా జరడగం లేదు. ప్రభుత్వ లేదా ప్రైవేటు కంపెనీల్లో పనిచేసే భారతీయ మహిళలు, వేతనంతో కూడిన 26 వారాల సెలవులకు అర్హులు. కానీ పురుషులకు మాత్రం పితృత్వ సెలవుల విషయంలో ఓ స్పష్టత లేదనే ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
బెంగళూరులో ఎక్కువ వేతనాలు
న్యూఢిల్లీ: దేశంలో అత్యంత వేతన చెల్లింపులకు రాజధానిగా బెంగళూరు తన స్థానాన్ని కాపాడుకుంది. అలాగే, అత్యధిక పారితోషికాలు ఐటీ రంగంలో ఉన్నట్టు రాండ్‌స్టాడ్ ‘ఇన్సైట్స్ శాలరీ ట్రెండ్స్ 2019’ నివేదిక వెల్లడించింది. బెంగళూరులో జూనియర్ స్థాయి ఉద్యోగిపై కంపెనీ వార్షికంగా చేస్తున్న సగటు వ్యయం (సీటూసీ) రూ.5.27 లక్షలుగా ఉంటే, మధ్య స్థాయి ఉద్యోగిపై ఇది రూ.16.45 లక్షలు, సీనియర్ లెవల్ ఉద్యోగిపై రూ.35.45 లక్షలుగా ఉంది. ఈ సంస్థ రూపొందించిన 2018, 2017 నివేదికల్లోనూ అత్యధిక వేతనాలున్న నగరంగా బెంగళూరు మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. జూనియర్ లెవల్ ఉద్యోగులకు అధికంగా చెల్లింపులున్న రెండో నగరంగా హైదరాబాద్ చోటు సంపాదించింది. ఇక్కడ సగటు సీటూసీ రూ.5లక్షలు. రూ.4.59 లక్షలతో మూడో స్థానంలో ముంబై నగరం ఉంది. మధ్య స్థాయి ఉద్యోగులకు అధికంగా చెల్లిస్తున్న నగరాల్లో ముంబై రూ.15.07 లక్షలతో రెండో స్థానంలో, దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) రూ.14.5 లక్షలతో మూడో స్థానంలో ఉన్నాయి. -
ఓ ప్రకటన... జీవితాలను మార్చేసింది...
ఒకప్పుడు ఆ గ్రామం గురించి ఎవరికీ తెలియదు. ఇప్పుడు అదో పర్యటక కేంద్రంగా మారిపోయింది. అక్కడి ప్రజల కుల వృత్తులు, కళలు ప్రపంచానికి పరిచయమయ్యాయి. లగ్జరీ లైఫ్ ను... లక్షల జీతాన్ని వదులుకున్న యువ ఇంజనీర్ సౌరభ్ పాట్ దార్ ఆశయం గ్రామంలో అనూహ్య మార్పును తెచ్చింది. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే ముంబై కి దగ్గరలోని తానే జిల్లా జవహర్ గ్రామం గురించి ఇప్పుడు ఆ చుట్టుపక్కల తెలియనివారుండరు. సౌరభ్ లక్ష్యం సాధించేందుకు ఎంతో కష్టపడ్డాడు. గ్రామాల్లో ప్రజలకు ముందుగా తాను అవగాహన కల్పించాడు. రూరల్ టూరిజం ను ప్రవేశపెట్టి తన ప్రాజెక్టును ప్రారంభించాడు. పల్లె ప్రజల కళ్ళల్లో కాంతులు చూడాలనుకున్న సౌరభ్... BAIF సహాయంతో జవహర్ గ్రామాన్ని పర్యటక కేంద్రంగా మార్చేందుకు తీవ్ర కృషి చేశాడు. దోరాబ్జీ టాటా ట్రస్ట్ సహాయంతో గ్రామాల్లోని వస్తువులు అక్కడికి వచ్చే సందర్శకులను ఆకట్టుకునేలా చేశాడు. జవహర్ గ్రామం గురించి దగ్గర్లోని అన్ని స్కూళ్ళకు, కాలేజీలకు వెళ్ళి ప్రచారం చేశాడు. గ్రామంలోని ప్రాధాన్యతలను వివరించాడు. అయితే సౌరభ్ గ్రామంలో కొనుగోలుదారులను ఆకట్టుకునే సరైన వస్తువులు లేవని, అమ్మకాలు చేపట్టేందుకు అక్కడి ప్రాధమిక సదుపాయాలు సరిపోవని తెలుసుకున్నాడు. గ్రామాభివృద్ధికి టూరిజం వారు ఇచ్చిన డబ్బును క్రమ పద్ధతిలో ఖర్చుపెట్టి, విలేజ్ టూరిజం ను అభివృద్ధి చేసేందుకు స్థానికులను ఒప్పించాడు. పలు సంస్థల్లో భాగస్వామ్యం పొంది, పర్యటకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నించాడు. పర్యటనకు వచ్చినవవారికి కావలసిన వసతులను, బస చేసేందుకు వీలైన సౌకర్యాలను గ్రామంలో ఏర్పాటు చేశాడు. ట్రైబల్ డాన్స్, ఆటలు, పాటలు వంటి వివిధ కార్యక్రమాలతో అధిక సంఖ్యలో పర్యటకులు గ్రామాన్ని సందర్శించేలా చేశాడు. తాను అనుకున్నది సాధించేందుకు సౌరభ్ మరో ప్రయత్నం కూడ చేశాడు. తన స్నేహితునితో కలసి దగ్గరలోని గ్రామాల్లో వివిధ రకాల వృత్తుల్లో ఉన్నవారిని, కళాకారులను కలిశాడు. ఎంతో కష్టపడి వారు తయారు చేసే అందులో భాగంగా వర్లి పెయింటింగ్స్ వేసే సదానంద్ నాకర్ ను కలిశాడు. మూగ, చెవిటి వాడైన సాకర్ కుటుంబమంతా తొమ్మిది నుంచి పద్ధెనిమిది గంటల పాటు కష్టపడితే ఓ పెయింటింగ్ తయారవుతుంది. అది అమ్మితే వారికి 75 రూపాయలు వస్తుంది. దాంతో వారి కుటుంబ పోషణ కష్టంగా ఉండేది. అది చూసిన సౌరభ్... నాకర్ కు సహాయపడేందుకు నిశ్చయించుకున్నాడు. తన ప్రాజెక్ట్ లో భాగంగా ఆ కళాకారుడిని ప్రోత్సహించి అతని జీవితాన్ని మెరుగు పరచాలనే ఉద్దేశ్యంతో అతడి పెయింటింగ్స్ ను మార్కెట్ చేసేందుకు స్థిద్ధపడ్డాడు. ముంబైకి తీసుకెళ్ళి అమ్మకాలు ప్రారంభించాడు. వర్లి పెయింటింగ్స్ కు అత్యంత ఆదరణ లభించడంతో సౌరభ్ సదానంద్ కు తన క్లైంట్లను పరిచయం చేశాడు. ప్రస్తుతం సదానంద్ పెయింటింగ్స్ కు మార్కెట్లో అత్యంత ఆదరణ లభించడంతో ఒక్కో పెయింటింగ్ సుమారు లక్ష రూపాయల వరకూ పలుకుతోంది. అంతేకాదు తన మార్కెట్ జర్మనీకి కూడ విస్తరించాడు. ప్రస్తుతం వర్లి పెయింటింగ్ బిజినెస్ కు దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ ఆదరణ లభిస్తోంది. సౌరభ్ ఆశయం నెరవేరింది. తన ప్రాజెక్టు పూర్తవ్వడంతో పాటు... సదానంద్ జీవితంలో పెను మార్పు రావడం ఆనందం కలిగించింది. అయితే లక్షల జీతంతో ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్నసౌరభ్ తన ఆశయాన్ని నెరవేర్చుకునేందుకు పేపర్లో వచ్చిన 'ఎస్ బీ ఐ యూత్ ఫర్ ఇండియా' ప్రకటన ఎంతగానో సహాయ పడింది. ఎస్ బీ ఐ ఫెలోషిప్ ను వినియోగించుకొన్న సౌరభ్.. వర్లి పెయింటింగ్ ప్రాజెక్టుకు ఎస్ బీ ఐ నుంచి అధికారికంగా అనుమతి కూడ లభించింది. గ్రామాభివృద్ధికి పాటుపడ్డ సౌరభ్ ఎన్నో జీవిత పాఠాలను నేర్చుకోవడంతో పాటు మరెందరో యువకులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.