రూ.40 లక్షల జాబ్‌.. రెజ్యూమ్ కూడా అవసరం లేదు! | College doesnt matter resume not needed Bengaluru job offering Rs 40 LPA viral | Sakshi
Sakshi News home page

రూ.40 లక్షల జాబ్‌.. రెజ్యూమ్ కూడా అవసరం లేదు!

Published Wed, Feb 26 2025 5:33 PM | Last Updated on Wed, Feb 26 2025 5:39 PM

College doesnt matter resume not needed Bengaluru job offering Rs 40 LPA viral

ఈరోజుల్లో జాబ్‌ తెచ్చుకోవడం ఎంత కష్టమో చూస్తూనే ఉన్నాం. మంచి అకడమిక్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ ఉండాలి. అంటే మంచి పేరున్న కాలేజీలో చదివుండాలి. ఎన్ని నైపుణ్యాలు ఉన్నా వాటిని రెజ్యూమ్‌లో ఆకట్టుకునేలా పేర్కొనకపోతే ఉద్యోగం కష్టమే. అయితే ఇవేవీ లేకుండా హై పేయింగ్‌ జాబ్‌ ఇస్తానంటున్నారు బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ ఫౌండర్‌.

బెంగళూరులో జాబ్‌.. ఏడాదికి రూ. 40 లక్షల వేతనం.. వారానికి ఐదు రోజులు ఆఫీసు నుంచి పని.. మంచి కాలేజీ నుంచి రావాల్సిన అవసరం లేదు.. అనుభవం అక్కర్లేదు.. కనీసం రెజ్యూమ్‌తో కూడా పని లేదు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదంటూ కంపెనీ ఫౌండర్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘ఎక్స్‌’లో పెట్టిన పోస్ట్‌ ఆసక్తిని రేకెత్తించింది.

బెంగళూరులోని ఇందిరానగర్‌లో తమ కార్యాలయానికి సున్నా నుంచి రెండేళ్ల వరకూ అనుభవం ఉన్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను నియమించుకోవాలని చూస్తున్నట్లు ‘స్మాలెస్ట్‌ ఏఐ’ కంపెనీ అధినేత సుదర్శన్ కామత్ తెలిపారు. "‘స్మాలెస్ట్‌ ఏఐ’ కంపెనీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో క్రాక్డ్‌ ఫుల్ స్టాక్ ఇంజనీర్ ను నియమించాలని చూస్తున్నాం. మిమ్మల్ని పరిచయం చేసుకుంటూ ఒక చిన్న 100 పదాల టెక్స్ట్ పంపండి చాలు" అంటూ ‘ఎక్స్’లో పోస్ట్‌ చేశారు.  "మీది ఏ కాలేజీ అనేది ముఖ్యం కాదు".. "రెజ్యూమ్ అవసరం లేదు" అంటూ పేర్కొన్నారు.

ఇక్కడ "క్రాక్డ్ ఇంజనీర్స్" అనేది నూతన మార్పులకు, కొత్త ఆలోచనలకు భయపడని అత్యంత సమర్థనీయులైన, ప్రతిభావంతులైన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లని వర్ణించడానికి ఉపయోగించే పదం. ఈ పోస్ట్ షేర్ చేసిన కొన్ని గంటల్లోనే వైరల్ గా మారింది. ఆకట్టుకునే రెజ్యూమె కంటే నైపుణ్యాలకు కామత్ ప్రాధాన్యత ఇచ్చారని పలువురు ఎక్స్ యూజర్లు ప్రశంసించారు. అయితే క్రాక్డ్‌ ఇంజనీర్ కు ఈ జీతం చాలా తక్కువ అని మరికొందరు వ్యాఖ్యానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement