IIT Kahargpur
-
ఐఐటీ ఖరగ్‌పూర్‌లో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య
కోల్‌కతా: ఇటీవల కాలంలో పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. చదవు ఒత్తిడి, మానసిక సమస్యలు, ఇతరాత్ర కారణాలతో భవిష్యత్తును చేజేతులారా తుంచేసుకుంటున్నారు. తాజాగా తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఆత్మహత్యకు చేసుకున్నాడు. మెదక్ జిల్లా తూప్రాన్‌కు చెందిన కే కిరణ్ చంద్ర అనే విద్యార్థి ఐఐటీ ఖగర్‌పూర్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. బహదూర్ శాస్త్రీ హాస్టల్లో ఉంటున్న చంద్ర మంగళవారం రాత్రి గదిలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఇనిస్టిట్యూట్ యాజమాన్యం ఓప్రకటనలో వెల్లడించింది. కిరణ్ మృతితో సహచర విద్యార్థులు, ఐఐటీ అధ్యాపకులు, సిబ్బంది తీవ్ర దిగ్బ్రాంతికి గరైనట్లు తెలిపింది. అతడి ఆకస్మిక మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది. ‘మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో చంద్ర తన రూమ్మెట్స్తో కలిసి హాస్ట్‌లో గదిలో ఉన్నాడు. తర్వాత ఇద్దరు విద్యార్దులు పని మీద బయటకు వెళ్లారు. 8.30 గంటలకు ఇద్దరు తిరిగి వచ్చే సరికి గది లోపల నుంచి గడియ పెట్టినట్లు గుర్తించారు. బలవంతంగా తలుపు తీయడంతో గదిలో చంద్ర ఊరేసుకొని కనిపించాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా రాత్రి 11.30 అతడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు’ అని పేర్కొంది. చదవండి: Video: గాజా ఆసుపత్రిపై దాడికి ముందు, ఆ తర్వాత దృశ్యాలు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు గల కారణాలపై విచారిస్తున్నారు. ప్రాజెక్టు వర్క్ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానం వ్యక్తమవుతోంది. బాధిత విద్యార్థి తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కొడుకు మరణ వార్త తెలియగానే క్యాంపస్‌కు చేరుకున్నారు. కాగా గత కొంతకాలంగా ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థుల ఆత్మహత్యలతో తరుచూ వార్తల్లో నిలుస్తుంది. ఇదే విద్యాసంస్థలో ఏడాదిన్నరలో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. కేంద్ర విద్యాశాఖ నివేదిక ప్రకారం 2014 నుంచి ఐఐటీల్లో 34 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వారిలో 18 మంది ఓబీసీలు, షెడ్యూల్ కులాలకు చెందిన వారు ఉన్నారు. దేశంలో అకడమిక్ ఫెయిల్యూర్ కారణంగా ప్రతిరోజూ ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. 2014 నుంచి అక్టోబర్ 2022 మధ్య ఐఐటీలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన 15 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
80 శాతం సైబర్ నేరాలు 10 జిల్లాల నుంచే..
నోయిడా: దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెచ్చరిల్లుతున్నాయి. దేశంలో ఇలాంటి నేరాల్లో 80 శాతం నేరాలు కేవలం 10 జిల్లాల నుంచే జరుగుతున్నట్లు ఐఐటీ–కాన్పూర్‌కు చెందిన ఫ్యూచర్ క్రైమ్ రీసెర్చ్ ఫౌండేషన్(ఎఫ్‌సీఆర్‌ఎఫ్) అనే స్టార్టప్ కంపెనీ అధ్యయనంలో వెల్లడయ్యింది. రాజస్తాన్‌లోని భరత్పూర్, ఉత్తరప్రదేశ్‌లోని మధుర, జార్ఖండ్‌లోని జామ్తారా, హరియాణాలోని నూహ్ జిల్లాల్లో సైబర్ నేరగాళ్లు అధికంగా తిష్ట వేశారని అధ్యయనం తెలియజేసింది. ప్రధానంగా భరత్పూర్, మధుర జిల్లాలు కేటుగాళ్లకు హాట్స్పాట్లుగా మారాయని పేర్కొంది. భరత్పూర్ నుంచి 18 శాతం, మధుర నుంచి 12 శాతం సైబర్ నేరాలు జరగుతున్నట్లు వెల్లడించింది. వీటితోపాటు దేవగఢ్, గురుగ్రామ్, అల్వార్, బొకారో, కర్మాటాండ్, గిరిదీ జిల్లాల నుంచి సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నట్లు అధ్యయనంలో తేలింది. ఇవన్నీ ప్రధాన నగరాలకు సమీపంలో ఉన్నాయని, ఆయా జిల్లాల్లో సైబర్ సెక్యూరిటీ మౌలిక సదుపాయాలు పెద్దగా లేవని ఎఫ్‌సీఆర్‌ఎఫ్ వ్యవస్థాపకుడు హర్షవర్దన్ సింగ్ చెప్పారు. -
‘కూతురు పుట్టిందని కోట్ల జీతం కాదన్నాడు’..మనసును హత్తుకునే ఓ తండ్రి కూతురు కథ
ఆడ పిల్లకి అమ్మ..అన్న.. అక్క.. ఇలా ఎంతమంది ఉన్నా..తన కోసం తపించేది..బాధ్యతగా కడవరకు నిలిచేది తన మనుసు అర్ధం చేసుకునే నేస్తం.. నాన్న ఒక్కరే. అలాంటి ఓ నాన్న పుట్టిన కుమార్తె కోసం ఎవరూ తీసుకోని నిర్ణయం తీసుకున్నారు. మనసును హత్తుకునే ఓ తండ్రి కూతురు కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఖరగ్‌పూర్ ఐఐటీ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన అంకిత్ జోషి తన కుమార్తె పుట్టడానికి కొన్ని రోజుల ముందు అత్యధిక జీతం పొందే ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇలాంటి నిర్ణయం కెరియర్ను ప్రశ్నార్ధకంగా మార్చేస్తుంది. కానీ తనకి మాత్రం తండ్రిగా ప్రమోషన్ వచ్చిందని పొంగిపోతున్నాడు. అంకిత్ జోషి ఓ సంస్థలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.విధుల నిమిత్తం దేశ, విదేశాల్లో ప్రయాణాలు చేయాల్సి వచ్చేది. కానీ తన కుమార్తె స్పితి పుట్టిన తర్వాత ఆ జాబ్ చేసేందుకు ఇష్టపడడం లేదు. ‘నా కూతురు ప్రపంచంలోకి రాకముందే, నా వారం రోజుల పెటర్నిటీ లీవ్ (పితృత్వ సెలవు)ల కంటే ఎక్కువ సమయం ఆమెతో గడపాలని నాకు తెలుసు’. కానీ అది కష్టం. ఎందుకంటే? నేను కొన్ని నెలల క్రితం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హోదాలో కొత్త ఉద్యోగంలో చేరా. విధుల నిమిత్తం ఎన్నో ప్రాంతాల్లో తిరిగాను. ఆ సమయాన్ని ఎంతగానో ఆస్వాధించా. స్పితి పుట్టిన తర్వాత ఆమెతో గడిపేందుకు నాకు ఎక్కువ సమయం కావాలి. కంపెనీ వారం రోజుల పితృత్వ సెలవుల్ని పొడిగించడం సాధ్యం కాదని తెలుసుకున్నా. అందుకే నాజాబ్కు రిజైన్ చేయాలని నిర్ణయించుకున్నానంటూ తన ఆనంద క్షణాల్ని నెటిజన్లతో పంచుకున్నాడు. స్పితి పుట్టినప్పటి నుండి ఒక నెల గడిచింది. ఈ సమయంలో నా భార్య భార్య (ఆకాంక్ష) ప్రసూతి సెలవులో ఉన్నప్పుడు కూడా ఆమె సంస్థలో మేనేజర్‌గా పదోన్నతి పొందింది. ఆమె కెరీర్ & మాతృత్వం సంతృప్తికరంగా ఉంది’ అని చెప్పారు. ‘చాలా కంపెనీలు ఉద్యోగులకు ఇచ్చే పితృత్వ సెలవులపై అసంతృప్తిగా ఉన్నా. పిల్లలతో తండ్రి ఎంత తక్కువ సమయం గడుపుతున్నాడనే కాదు. పెంపకం పాత్రలో తండ్రి బాధ్యత తగ్గుతుందని అన్నారు. ‘నేను వేసిన అడుగు అంత సులభం కాదు. చాలా మంది తండ్రులు ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేరు. కానీ రాబోయే సంవత్సరాల్లో పితృత్వ సెలవుల వంటి పరిస్థితులు మారతాయని నేను ఆశిస్తున్నాను. స్పతి పుట్టక ముందు గడిపిన సంవత్సరాల కంటే..ఆమెతో గడిపిన ఈ ఒక్కనెలే ఎంతో సంతృప్తినిచ్చింది. కొన్ని నెలల తర్వాత కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తా. ఈలోగా నా కూతురితో మరింత సమాయాన్ని గడింపేందుకు ప్లాన్ చేసుకుంటున్నానంటూ అంకిత్ జోషి షేర్ చేసిన పోస్ట్‌లో పేర్కొన్నాడు. పెటర్నిటీ లీవ్‌లు ఎన్నిరోజులు శిశువు జన్మించిన సమయంలో లేదా జన్మించిన ఆరు నెలలలోపు తండ్రి రెండు వారాల సెలవులు (పెటర్నిటీ లీవ్) తీసుకునేందుకు మనదేశంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. కానీ వాస్తవానికి అలా జరడగం లేదు. ప్రభుత్వ లేదా ప్రైవేటు కంపెనీల్లో పనిచేసే భారతీయ మహిళలు, వేతనంతో కూడిన 26 వారాల సెలవులకు అర్హులు. కానీ పురుషులకు మాత్రం పితృత్వ సెలవుల విషయంలో ఓ స్పష్టత లేదనే ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
ఐఐటి ఖరగ్ పూర్ విద్యార్థికి బంపర్ ఆఫర్
మరో ఐఐటీ విద్యార్థి బంపర్ ఆఫర్ చేజిక్కించుకున్నాడు. బీహార్ ఖగరియాకి చెందిన వాత్సల్య సింగ్ చౌహాన్ (21) ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలో కొలువు దక్కించుకున్నాడు. ఐఐటీ ఖరగ్‌పూర్ లో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న అతనికి మైక్రోసాఫ్ట్ సంస్థ సంవత్సరానికి కోటీ రెండు లక్షల ప్యాకేజీతో జాబ్ ఆఫర్ చేసింది. మధ్యతరగతి కుటుంబానికి వాత్సల్స సింగ్ చౌహాన్ తండ్రి వెల్డింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండడం విశేషం. కాగా వాత్సల్య సింగ్ ఐఐటీ-జేఈఈలో ఆలిండియా స్థాయిలో 382వ ర్యాంకు సాధించి.. ప్రస్తుతం ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలో అత్యుత్తమ ప్రతిభతో రాణించాడు. దాంతో మైక్రోసాఫ్ట్ కంపెనీ వాత్సల్య సింగ్‌కు ఏడాదికి కోటి రెండు లక్షల రూపాయలు చెల్లించేందుకు సిద్ధమైంది. విద్యా సంవత్సరం అనంతరం అతను ఉద్యోగంలో చేరనున్నాడు. ఐదు రౌండ్ల ఇంటర్వ్యూ అనంతరం తాను ఉద్యోగానికి ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందని వాత్సల్య తెలిపాడు. ఈ విషయాన్ని మొదట తాను, తన కుటుంబం నమ్మలేకపోయామని చెప్పాడు. కాగా చిన్నప్పటి నుంచి చదువులో రాణిస్తున్న వాత్యల్యను పెద్ద చదువులు చదివించేందుకు కుటుంబ సభ్యులు చాలా కష్టపడ్డారు. పదో తరగతి వరకు హిందీ మీడియం ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాత్సల్య ఇంటర్లో 75శాతం మార్కులు సాధించాడు. ఐఐటీలో చోటు సంపాదించుకొనేందుకు రాష్ట్రంలోని కోట పట్టణంలోని ప్రముఖ కోచింగ్ సంస్థలో కోచింగ్ తీసుకున్నాడు. వాత్సల్యకు మైక్రో సాఫ్ట్ జాబ్ రావడంపై తండ్రి చంద్రకాంత్ సింగ్ ఆనందం వ్యక్తం చేశారు. కొడుకు చదువు నిమిత్తం మూడున్నర లక్షలు బ్యాంకు నుంచి అప్పు తీసుకున్నానని.. తన కష్టానికి ప్రతిఫలం దక్కిందన్నారు. అయితే ఎక్కువగా స్కాలర్ షిప్ లమీద ఆధారపడే చదువుకున్నాడని , అతని ఉపాధ్యాయులు కూడా చాలా సహాయం చేశారంటూ వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.