![80percent of cyber crimes from 10 districts - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/25/Untitled-4.jpg.webp?itok=Py7a4ie0)
నోయిడా: దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెచ్చరిల్లుతున్నాయి. దేశంలో ఇలాంటి నేరాల్లో 80 శాతం నేరాలు కేవలం 10 జిల్లాల నుంచే జరుగుతున్నట్లు ఐఐటీ–కాన్పూర్‌కు చెందిన ఫ్యూచర్ క్రైమ్ రీసెర్చ్ ఫౌండేషన్(ఎఫ్‌సీఆర్‌ఎఫ్) అనే స్టార్టప్ కంపెనీ అధ్యయనంలో వెల్లడయ్యింది. రాజస్తాన్‌లోని భరత్‌పూర్, ఉత్తరప్రదేశ్‌లోని మధుర, జార్ఖండ్‌లోని జామ్‌తారా, హరియాణాలోని నూహ్ జిల్లాల్లో సైబర్ నేరగాళ్లు అధికంగా తిష్ట వేశారని అధ్యయనం తెలియజేసింది.
ప్రధానంగా భరత్‌పూర్, మధుర జిల్లాలు కేటుగాళ్లకు హాట్‌స్పాట్లుగా మారాయని పేర్కొంది. భరత్‌పూర్ నుంచి 18 శాతం, మధుర నుంచి 12 శాతం సైబర్ నేరాలు జరగుతున్నట్లు వెల్లడించింది. వీటితోపాటు దేవగఢ్, గురుగ్రామ్, అల్వార్, బొకారో, కర్మాటాండ్, గిరిదీ జిల్లాల నుంచి సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నట్లు అధ్యయనంలో తేలింది. ఇవన్నీ ప్రధాన నగరాలకు సమీపంలో ఉన్నాయని, ఆయా జిల్లాల్లో సైబర్ సెక్యూరిటీ మౌలిక సదుపాయాలు పెద్దగా లేవని ఎఫ్‌సీఆర్‌ఎఫ్ వ్యవస్థాపకుడు హర్షవర్దన్ సింగ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment