districts
-
AP: జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రుల నియామకం
సాక్షి, విజయవాడ: జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 26 జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను నియమించింది.జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు వీరే..శ్రీకాకుళం జిల్లా- కొండపల్లి శ్రీనివాస్పార్వతీపురం మన్యం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలు- కింజరాపు అచ్చెన్నాయుడువిజయనగరం జిల్లా- వంగలపూడి అనితవిశాఖ జిల్లా- డోలా బాలవీరాంజనేయస్వామిఅల్లూరి సీతారామరాజు జిల్లా- గుమ్మడి సంధ్యారాణిఅనకాపల్లి జిల్లా- కొల్లు రవీంద్రకాకినాడ జిల్లా- పొంగూరు నారాయణతూర్పుగోదావరి జిల్లా- నిమ్మల రామానాయుడుఏలూరు జిల్లా- నాదెండ్ల మనోహర్పశ్చిమ గోదావరి, పల్నాడు జిల్లాలు- గొట్టిపాటి రవికుమార్ఎన్టీఆర్ జిల్లా- సత్యకుమార్ యాదవ్కృష్ణా జిల్లా- వాసంశెట్టి సుభాష్గుంటూరు జిల్లా- కందుల దుర్గేష్బాపట్ల జిల్లా- కొలుసు పార్థసారథిప్రకాశం జిల్లా- ఆనం రామనారాయణరెడ్డినెల్లూరు జిల్లా- ఎన్ఎండీ ఫరూఖ్నంద్యాల జిల్లా- పయ్యావుల కేశవ్అనంతపురం జిల్లా- టీజీ భరత్శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాలు- అనగాని సత్యప్రసాద్వైఎస్సార్ జిల్లా- ఎస్.సవితఅన్నమయ్య జిల్లా- బీసీ జనార్దన్రెడ్డిచిత్తూరు జిల్లా- మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి -
‘తెలంగాణ’ జిల్లాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)
-
TG: పలు జిల్లాలకు భారీ వర్షసూచన
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం(జులై 19) నాలుగు జిల్లాలకు భారత వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక శనివారం(జులై 20) ఆదిలాబాద్, కుమ్రంభీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపెల్లి జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ జిల్లాల్లో ఒక్కసారిగా వరదలు వచ్చే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాయుగుండం ప్రభావంతో.. బంగాళాఖాతలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర వాయుగుండంగా మారనుండటంతో భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు పరిసర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని వెల్లడించింది. -
ఆ ఆరు జిల్లాల్లో జీరో ఓటింగ్.. కారణమిదే?
నాగాలాండ్‌లోని ఆరు తూర్పు జిల్లాల్లో పోలింగ్ స్టేషన్ల వద్ద సిబ్బంది తొమ్మిది గంటల పాటు వేచి ఉన్నప్పటికీ ఒక్క ఓటరు కూడా ఓటు వేయలేదు. ‘ఫ్రాంటియర్ నాగాలాండ్ టెరిటరీ’ (ఎఫ్ఎన్టీ) బంద్ పిలుపుతో ఈ ప్రాంతంలోని నాలుగు లక్షల మంది ఓటర్లలో ఎవరూ ఓటు వేసేందుకు ముందుకు రాలేదు. తూర్పు నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ (ఈఎన్‌పీఓ)ఎఫ్ఎన్టీ డిమాండ్‌తో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సమస్య లేదని ముఖ్యమంత్రి నీఫియు రియో వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఇప్పటికే ఈ ప్రాంతానికి స్వయంప్రతిపత్త అధికారాలను సిఫారసు చేశారన్నారు. కాగా 20 అసెంబ్లీ నియోజకవర్గాలతో కూడిన ప్రాంతంలోని 738 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ సిబ్బంది ఉన్నారని నాగాలాండ్ అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అవ లోరింగ్ తెలిపారు. అయినప్పటికీ ఓటు వేసేందుకు ఎవరూ రాలేదని సీఈవో కార్యాలయ వర్గాలు తెలిపాయి. నాగాలాండ్‌లోని 13.25 లక్షల మంది ఓటర్లలో తూర్పు నాగాలాండ్‌లోని ఆరు జిల్లాల్లో 4,00,632 మంది ఓటర్లు ఉన్నారు. కాగా తౌఫెమాలో ఓటు వేసిన అనంతరం ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడుతూ, ఎఫ్‌ఎన్‌టీకి సంబంధించిన ‘డ్రాఫ్ట్ వర్కింగ్ పేపర్’ను కేంద్ర హోంమంత్రికి అందజేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వాలు అభివృద్ధి విషయంలో ఈ ప్రాంతాన్ని విస్మరించాయని ఆరోపిస్తూ ఈఎన్‌పీవో ఆరు జిల్లాలతో కూడిన ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తోంది. నాగాలాండ్‌లో లోక్‌సభ ఎన్నికలు ప్రారంభానికి కొన్ని గంటల ముందు ఈఎన్‌పీవో గురువారం సాయంత్రం 6 గంటల నుండి రాష్ట్రంలోని తూర్పు ప్రాంతంలో నిరవధిక బంద్‌ను ప్రకటించింది. -
దేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధిక జిల్లాలున్నాయి?
‘ఈ దేశంలో ఉంటూ.. ఈ దేశానికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకోకపోతే ఎలా?’ అని చాలామంది అంటుంటారు. దేశంలోని వివిధ ప్రాంతాల వివరాలు తెలుసుకోవడం ఎవరికైనా తప్పనిసరి. అందుకే మన దేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధిక జిల్లాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో వైశాల్యం పరంగా రాజస్థాన్‌ను అతిపెద్ద రాష్ట్రంగా పరిగణిస్తారు. జనాభా కోణంలో చూస్తే ఈ టైటిల్ ఉత్తరప్రదేశ్‌కు దక్కుతుంది. అయితే మన దేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధిక జిల్లాలు ఉన్నాయి? అవి ఎన్ని? అనే విషయాన్ని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అందుకే ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో అత్యధిక జిల్లాలు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఈ రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 75. ఇవి 2,40,928 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. ఈ జిల్లాలను 18 డివిజన్లుగా విభజించారు. రాష్ట్రంలో 17 మున్సిపల్ కార్పొరేషన్లు, 822 కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాకులు, 350 తహసీల్లు కూడా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని అతిపెద్ద జిల్లా లఖింపూర్ ఖేరీ. ఇది దాదాపు 10.1 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. లఖింపూర్ ఖేరీ పొరుగు దేశం నేపాల్‌తో సరిహద్దును పంచుకుంటుంది. ఈ జిల్లాలో గోమతి, శారద, కథన తదితర నదులు ప్రవహిస్తున్నాయి. యూపీలోని అతి చిన్న జిల్లా హాపూర్. భారతదేశంలో అత్యధిక సంఖ్యలో జిల్లాలు కలిగిన రెండవ రాష్ట్రం మధ్యప్రదేశ్. ఈ రాష్ట్రంలో మొత్తం 52 జిల్లాలు ఉన్నాయి. రాష్ట్రంలో అతిపెద్ద జిల్లా చింద్వారా. ఈ జాబితాలో మూడవ స్థానంలో బీహార్ ఉంది. ఈ రాష్ట్రంలో మొత్తం 38 జిల్లాలున్నాయి. 101 సబ్ డివిజన్లు, 534 సిడి బ్లాక్‌లు ఉన్నాయి. బీహార్‌లోని అతిపెద్ద జిల్లా పట్నా. ఇది బీహార్ రాజధాని. పట్నా పలు ప్రత్యేకతలు కలిగిన ప్రాంతం. -
AP: ‘ఐబీ’ సిలబస్ శిక్షణ ఇదిగో
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) సిలబస్ అమలుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించి గత నెల 31వతేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఐబీ సంస్థతో ఏపీ ఎస్సీఈఆర్టీ ఒప్పదం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 15 రోజుల వ్యవధిలో ఐబీ ప్రతినిధులు ఏపీలో విద్యా విధానం, సంస్కరణల అమలు, ఉపాధ్యాయ శిక్షణ తదితర అంశాలను పరిశీలించారు. ఒప్పందం జరిగిన వెంటనే విజయవాడలోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో ఐబీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి సంస్థ ప్రతినిధులు కార్యకలాపాలు ప్రారంభించారు. ఈనెల 26వతేదీ నుంచి 9 రోజుల పాటు ఐబీ అధికారుల బృందం జిల్లాల్లో పర్యటించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లా, మండల, మున్సిపల్ స్కూళ్లతో పాటు ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇతర మేనేజ్మెంట్ పాఠశాలను బృందం పరిశీలిస్తుంది. క్షేత్రస్థాయి పరిస్థితులు, ప్రభుత్వం కల్పించిన సదుపాయాలు, ఉపాధ్యాయుల సామర్థ్యాలను అంచనా వేయనున్నారు. – సాక్షి, అమరావతి తొలుత విజయవాడలో టీచర్లకు శిక్షణ ఇంటర్నేషనల్ బాకలారియెట్ సిలబస్ బోధనపై మార్చి నుంచి విజయవాడలో మాస్టర్ ట్రైనర్స్‌గా తొలుత కొందరు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని యోచిస్తున్నారు. మెక్సికోకు చెందిన ఐబీ ప్రతినిధి ఆల్డో ఇటీవల ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రభుత్వ పాఠశాలలను స్వయంగా పరిశీలించారు. సదుపాయాలు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల వినియోగం, బోధనా విధానాన్ని పరిశీలించారు. విద్యార్థులకు ప్రభుత్వం అందించిన ట్యాబ్‌ల పనితీరును అడిగి తెలుసుకోవడంతో పాటు వారితో సంభాషించి పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న ‘జగనన్న గోరుముద్ద’ను సైతం రుచి చూశారు. పాఠశాలల్లో భౌతిక, జీవశాస్త్ర ప్రయోగశాలలు, ఇంగ్లిష్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్‌లను పరిశీలించి ఉపాధ్యాయులను ప్రశంసించారు. ఐబీకి చెందిన మరో ప్రతినిధి ఆశిష్ రెండు రోజులు విద్యాశాఖ అధికారులతో సమావేశమై పాఠశాలల్లో ఐటీ, ఆన్లైన్ సేవలను తెలుసుకున్నారు. ఏపీ విద్యా విధానాలు ఐబీకి దాదాపు దగ్గరగా ఉన్నాయని పేర్కొనడం గమనార్హం. వచ్చే ఏడాది ఒకటో తరగతి నుంచి.. ఐబీ అమలుపై 2024–25 విద్యా సంవత్సరంలో పాఠశాల విద్యాశాఖ సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వనున్నారు. ఉపాధ్యాయులతోపాటు మండల, జిల్లా విద్యాధికారులు, ఎస్సీఈఆర్టీ, డైట్ సిబ్బంది, ఎస్సెస్సీ, ఇంటర్ బోర్డు సిబ్బంది వీరిలో ఉంటారు. వీరికి దశలవారీగా ‘ఐబీ’పై అవగాహన, నైపుణ్యం, సామర్థ్యాల పెంపుపై శిక్షణ ఇచ్చి ఐబీ సర్టిఫికెట్లు అందచేస్తారు. దీంతో వీరంతా ప్రతిష్టాత్మక ఐబీ గ్లోబల్ టీచర్ నెట్‌వర్క్‌లో భాగమవుతారు. అనంతరం 2025 జూన్‌లో ప్రారంభమయ్యే 2025–26 విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతితో ఐబీ విద్యాబోధన ప్రారంభం అవుతుంది. ఏటా ఒక్కో తరగతి చొప్పున పెంచుకుంటూ వెళతారు. విద్యార్థులు 2035 నాటికి పదో తరగతి, 2037లో ప్లస్ 2లో ఐబీ సిలబస్‌లో పరీక్షలు రాస్తారు. విద్యార్థులకు ఐబీ, ఏపీ ఎస్సీఈఆర్టీ కలిసి అందించే జాయింట్ సర్టిఫికేషన్‌కు అంతర్జాతీయ గుర్తింపు ఉంటుంది. రూ.73 వేల కోట్లతో సంస్కరణలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పేద పిల్లలు అధికంగా చదువుకునే పాఠశాల విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. విద్యార్థులు ఉన్నతంగా ఎదిగి ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ప్రాథమిక స్థాయి నుంచి ప్రణాళికలు అమలు చేస్తోంది. జగనన్న అమ్మఒడి, విద్యాకానుక, గోరుముద్ద తదితర విప్లవాత్మక కార్యక్రమాలను ప్రవేశపెట్టి విద్యార్థుల ఉన్నతికి బాటలు వేసింది. 2019 జూన్ నుంచి 2024 జనవరి వరకు విద్యా రంగ సంస్కరణల కోసం ఏకంగా రూ.73,293.68 కోట్లు వెచ్చించింది. ఇప్పుడు ఐబీ బోధనను సైతం ప్రభుత్వ స్కూళ్లలో అందుబాటులోకి తెస్తోంది. అత్యధిక ఐబీ స్కూళ్లు ఏపీలోనే.. ప్రాథమిక విద్యా బోధనలో ప్రపంచంలోనే అత్యుత్తమ విధానాలను ఫిన్‌ల్యాండ్ అమలు చేస్తోంది. పాలనలో పారదర్శకత, మానవ వనరుల వినియోగం, ప్రణాళికలో ఎప్పుడూ ముందు వరుసలో నిలుస్తోంది. ప్రస్తుతం ఐబీ బోర్డు డైరెక్టర్ జనరల్‌గా ఉన్న ఓలి పెక్కా హీనోనెన్ ఫిన్‌ల్యాండ్ జాతీయ విద్యాశాఖకు డైరెక్టర్ జనరల్‌గా సేవలందించారు. ఆయనే స్వయంగా ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ విధానాలను పర్యవేక్షిస్తుండడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 వేల వరకు ఐబీ స్కూళ్లు ఉండగా 2025 జూన్‌లో ప్రపంచంలోనే అత్యధిక ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ అమలు చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలువనుంది. ఏపీలో దాదాపు 45 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్ (ప్రాథమిక, ప్రాథమికోన్నత) స్కూళ్లు 39 వేల వరకు ఉన్నాయి. ఈ స్కూళ్లలో 2025 జూన్‌లో ఒకటో తరగతితో ఐబీ బోధన ప్రారంభం కానుంది. అంతర్జాతీయంగా పేరున్న ఐబీ బోర్డుకు ప్రపంచంలోనే అతి పెద్ద నెట్వర్క్ మన రాష్ట్రంలోనే ఉండడం విశేషం. -
జిల్లాలకు ఇన్చార్జి మంత్రుల నియామకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను నియమించింది. కేబినెట్ లోని మంత్రులందరికీ ఉమ్మడి పది జిల్లాలవారీగా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మినహా మిగతా 10 మంది మంత్రులను తలా ఓ జిల్లాకు ఇన్చార్జిగా ప్రభుత్వం నియమించింది. కేబినెట్లో ప్రాతిని ధ్యం దక్కని హైదరాబాద్‌కు పొన్నం ప్రభాకర్, ఆదిలా బాద్‌కు సీతక్క, నిజామాబాద్‌కు జూపల్లి కృష్ణా రావు, రంగారెడ్డికి దుద్దిళ్ల శ్రీధర్‌బాబులను ఇన్చార్జి మంత్రులుగా బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో త్వరలోనే జిల్లా సమీక్షా మండలి (డీఆర్సీ) లను కూడా పునరుద్ధరించనున్నట్టు తెలుస్తోంది. ఈ మండళ్ల పునరుద్ధరణ ద్వారా ప్రతి మూడు నెలలకోసారి ఆయా జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఇన్చార్జి మంత్రుల నేతృత్వంలో సమీక్షలు నిర్వహించనున్నట్టు సమాచారం. అయితే, ఇన్చార్జి మంత్రులను ప్రజాపాలన కార్యక్రమాల అమలును సమన్వయం చేసేందుకు నియమిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. -
రిజర్వుడ్‌లో ఖమ్మం టాప్
సాక్షి, ఖమ్మం డెస్్క: తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో 31 రిజర్వుడ్ నియోజవర్గాలు. వీటిల్లో 19 ఎస్సీ, 12 ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాలు ఉన్నాయి. 2009లో చేపట్టిన డీ లిమిటేషన్ సందర్భంలో జనాభా ఆధారంగా వీటిని ఖరారు చేశారు. రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే ఎక్కువగా రిజర్వుడ్ నియోజకవర్గాలు ఖమ్మంలోనే ఉన్నాయి. ఇక్కడ పది స్థానాలకు గాను ఏడు రిజర్వుడ్ స్థానాలే. ఇందులో ఐదు ఎస్టీ, రెండు ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాల వారీగా పరిశీలిస్తే.... కరీంనగర్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఒక ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం కూడా లేదు. ఎస్టీ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉమ్మడి ఖమ్మం : పినపాక, ఇల్లెందు, అశ్వారావుపేట, భద్రాచలం, వైరా ఉమ్మడి ఆదిలాబాద్ : ఆసిఫాబాద్, బోథ్, ఖానాపూర్ ఉమ్మడి వరంగల్ : డోర్నకల్, మహబూబాబాద్, ములుగు ఉమ్మడి నల్లగొండ : దేవరకొండ ఎస్సీ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉమ్మడి కరీంనగర్ : ధర్మపురి, చొప్పదండి, మానకొండూరు ఉమ్మడి ఖమ్మం : మధిర, సత్తుపల్లి ఉమ్మడి మహబూబ్‌నగర్ : అచ్చంపేట, అలంపూర్ ఉమ్మడి ఆదిలాబాద్ : చెన్నూరు, బెల్లంపల్లి ఉమ్మడి నల్లగొండ : నకిరేకల్, తుంగతుర్తి ఉమ్మడి వరంగల్ : స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట ఉమ్మడి రంగారెడ్డి : చేవెళ్ల, వికారాబాద్ ఉమ్మడి మెదక్ : జహీరాబాద్, అందోల్ హైదరాబాద్ : కంటోన్మెంట్ ఉమ్మడి నిజామాబాద్ : జుక్కల్ -
70 శాతానికిపైగా భూభాగంలో కరువు పరిస్థితులు
న్యూఢిల్లీ: భారత్‌లోని 718 జిల్లాలకుగాను 500కుపైగా జిల్లాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని డౌన్ టు ఎర్త్ అనే సంస్థ అంచనావేసింది. భారత్‌లో పర్యావరణ సంబంధ రాజకీయాలు, అభివృద్ధిపై ఈ సంస్థ పరిశోధన చేస్తోంది. భారత్‌లో ప్రస్తుత వాతావరణ పరిస్థితులపై డౌన్ టు ఎర్త్ సంస్థ ఒక నివేదిక విడుదలచేసింది. నివేదిక ప్రకారం.. ► 718 జిల్లాలకుగాను 500 జిల్లాల్లో అంటే 70శాతానికిపైగా భూభాగంలో కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయి. ► ఈశాన్య భారతం, తూర్పుభారతంలో కొన్ని ప్రాంతాలు, జమ్మూ కశీ్మర్తోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కోస్తాతీరం సహా దక్షిణ భారతంలోని చాలా ప్రాంతాల్లో మధ్యస్థ/తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ► ‘ఈసారి రుతుపవనకాలంలో ఆగస్టులో ప్రతి రోజూ కురవాల్సిన వర్షాలు ఆగి ఆగి కొద్దిరోజులు విరామాలు ఇస్తూ పడ్డాయి. ఇలా ‘బ్రేక్’లు ఇస్తూ పడిన వర్షాలే భారత్‌లో కరువుకు 70 శాతం కారణం’ అని కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి మాధవన్ రాజీవన్ చెప్పారు. ► 53 శాతం జిల్లాల్లో మధ్యస్థ కరువు పరిస్థితులు ఉన్నాయి. ► ఈ ఏడాది ఆగస్టులో ఎక్కువ రోజులు వర్షాలు పడనేలేదు. ఏడో తేదీ నుంచి 18వ తేదీ వరకు పొడి వాతావరణం నెలకొంది. ఈనెలలో ఇన్ని రోజులపాటు వర్షాలు లేకపోవడం అనేది 21వ శతాబ్దిలో మూడో అతిపెద్ద విరామంగా రికార్డులకెక్కింది. గత 123 సంవత్సరాల చరిత్రలో ఆగస్టులో ఇంతటి పొడివాతావరణం నెలకొనడమూ ఇదే తొలిసారి. ► ‘2022 ఏడాదిలో పోలిస్తే 2023లో సాగు విస్తీర్ణం 33 శాతం పెరిగినా.. తగ్గిన వర్షాల కారణంగా దిగుబడి పెరుగుతుందో, తగ్గుతుందో చెప్పలేని పరిస్థితి’ అని క్రాప్ వెదర్ వాచ్ గ్రూప్ పేర్కొంది. ► ప్రతిఏటా ‘సాధారణ వర్షపాతం’ కేటగిరీ కింద ఉండే దాదాపు 20 రాష్ట్రాల్లో ఈసారి సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదవడం గమనార్హం. ► 1971–2020 సుదీర్ఘకాలం నుంచి చూస్తే ఈసారి వర్షపాతంలో లోటు ఐదు శాతం కనిపిస్తోంది. -
80 శాతం సైబర్ నేరాలు 10 జిల్లాల నుంచే..
నోయిడా: దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెచ్చరిల్లుతున్నాయి. దేశంలో ఇలాంటి నేరాల్లో 80 శాతం నేరాలు కేవలం 10 జిల్లాల నుంచే జరుగుతున్నట్లు ఐఐటీ–కాన్పూర్‌కు చెందిన ఫ్యూచర్ క్రైమ్ రీసెర్చ్ ఫౌండేషన్(ఎఫ్‌సీఆర్‌ఎఫ్) అనే స్టార్టప్ కంపెనీ అధ్యయనంలో వెల్లడయ్యింది. రాజస్తాన్‌లోని భరత్పూర్, ఉత్తరప్రదేశ్‌లోని మధుర, జార్ఖండ్‌లోని జామ్తారా, హరియాణాలోని నూహ్ జిల్లాల్లో సైబర్ నేరగాళ్లు అధికంగా తిష్ట వేశారని అధ్యయనం తెలియజేసింది. ప్రధానంగా భరత్పూర్, మధుర జిల్లాలు కేటుగాళ్లకు హాట్స్పాట్లుగా మారాయని పేర్కొంది. భరత్పూర్ నుంచి 18 శాతం, మధుర నుంచి 12 శాతం సైబర్ నేరాలు జరగుతున్నట్లు వెల్లడించింది. వీటితోపాటు దేవగఢ్, గురుగ్రామ్, అల్వార్, బొకారో, కర్మాటాండ్, గిరిదీ జిల్లాల నుంచి సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నట్లు అధ్యయనంలో తేలింది. ఇవన్నీ ప్రధాన నగరాలకు సమీపంలో ఉన్నాయని, ఆయా జిల్లాల్లో సైబర్ సెక్యూరిటీ మౌలిక సదుపాయాలు పెద్దగా లేవని ఎఫ్‌సీఆర్‌ఎఫ్ వ్యవస్థాపకుడు హర్షవర్దన్ సింగ్ చెప్పారు. -
వర్షం తక్కువున్న జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లోటు వర్షపాతం ఉన్న జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు కంటింజెన్సీ ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా. కేఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాలు, వ్యవసాయం, పశువుల గ్రాసం తదితర అంశాలపై ఆయన శనివారం వ్యవసాయ, పశు సంవర్థక, మత్స్య, ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖల అధికారులతో సమీక్షించారు. ఆరు జిల్లాల్లోని 130 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైందని, ఈ జిల్లాల్లో ఆగస్టులో కూడా వర్షాలు తక్కువ ఉంటే ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు సిద్ధం చేయాలని సీఎస్ ఆదేశించారు. అధిక వర్షాల కారణంగా వరి నారు దెబ్బతిన్న రైతులకు స్వల్పకాలంలో దిగుబడినిచ్చే విత్తనాలు సరఫరా చేయాలని చెప్పారు. రాష్ట్రంలో వర్షాలు, వ్యవసాయంపై వ్యవసాయ, పశు సంవర్థక, మత్స్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో ఖరీఫ్ లో మొత్తం 34.39 లక్షల హెక్టార్లు సాధారణ విస్తీర్ణం కాగా ఇప్పటివరకు 9.22 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు వేశారని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో సాధారణంకంటే 20 నుండి 50 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. కృష్ణా జిల్లాలో 60 శాతం పైగా అధిక వర్షపాతం నమోదైందని చెప్పారు. అంబేడ్కర్ కోనసీమ,పశ్చిమ గోదావరి, నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో 20 నుండి 59 మిల్లీ మీటర్ల తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. వర్షపాతం తక్కువున్న జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటల కోసం సుమారు 10 వేల క్వింటాళ్ల మినుము, పెసర, కంది, ఉలవ, జొన్న, పొద్దుతిరుగుడు, వేరుశనగ తదితర విత్తనాలను ఏపీ సీడ్స్ వద్ద సిద్ధంగా ఉంచామని చెప్పారు. అధిక వర్షాలతో వరి నారు మడులు దెబ్బతిన్న రైతులకు స్వల్ప కాలంలో పంట దిగుబడినిచ్చే ఎంటీయూ 1010, 1121,1153, బీపీటీ 5204, ఎన్‌ఎల్‌ఆర్ 34449 వరి విత్తనాలను సుమారు 30 వేల క్వింటాళ్లు సిద్ధం చేసినట్టు తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ సీహెచ్ హరికిరణ్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డా. బి.ఆర్.అంబేద్కర్, పశు సంవర్థక శాఖ సంచాలకులు అమరేంద్ర కుమార్, ఏపీ సీడ్స్ ఎండీ శేఖర్ బాబు, మత్స్య శాఖ అదనపు సంచాలకులు డా. అంజలి, ఉద్యాన శాఖ అదనపు సంచాలకులు బాలాజీ నాయక్, వెంకటేశ్వర్లు తదితర అధికారులుపాల్గొన్నారు. -
కోవిడ్ కూడబెట్టిన బంగారం! పసిడి పొదుపుపై ఆసక్తికర అధ్యయనం
బంగారంపై భారతీయులకు ఉన్న ప్రేమ అంతా ఇంతా కాదు. దాన్ని కేవలం ఆభరణాలుగానే కాకుండా పెట్టుబడి సాధనంగా కూడా చూస్తారు. ఇదంతా తెలిసిందే. అయితే కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని అల్లాడిస్తున్న సమయంలో భారతీయుల ఆర్థిక కార్యకలాపాలు, పొదుపు, బంగారు కొనుగోలు వంటి అంశాలపై ఓ ఆసక్తికర అధ్యయనం వెల్లడైంది. కోవిడ్ మహమ్మారి సమయంలో దేశంలోని ఇతర జిల్లాలతో పోల్చితే కోవిడ్ ప్రభావిత జిల్లాల్లోని కుటుంబాలే అత్యధికంగా బంగారం కొనుగోలు చేసినట్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ - అహమ్మదాబాద్ (ఐఐఎంఏ) చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. ‘గోల్డ్ ఇన్ హౌస్‌హోల్డ్ పోర్ట్‌ఫోలియోస్ డూరింగ్ ఎ ప్యాండమిక్: ఎవిడెన్స్ ఫ్రం ఎమర్జెన్సీ ఎకానమీ’ పేరుతో రూపొందించిన అధ్యయన పత్రాన్ని ఐఐఎంఏ ఇటీవల తమ వెబ్సైట్లో ప్రచురించింది. ప్రతి 1000 జనాభాకు నమోదైన కోవిడ్ కేసులతోపాటు మరో సూచిక ఆధారంగా ఈ అధ్యయనం సంక్షోభ తీవ్రతలోని వైవిధ్యాన్ని సంగ్రహించింది. ఆభరణాల రూపంలో బంగారాన్ని వినియోగించే దేశాల్లో భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశం. ఒక సగటు భారతీయ కుటుంబం తన మొత్తం హోల్డింగ్‌లలో 11 శాతాన్ని బంగారంపై పెట్టుబడి పెడుతున్నట్లు ఈ అధ్యయన పత్రం పేర్కొంది. దీని ప్రకారం.. ఇతర జిల్లాలతో పోల్చితే కోవిడ్ ప్రభావిత జిల్లాల్లోని కుటుంబాల పొదుపు పోర్ట్‌ఫోలియోలలో బంగారం వాటా గణనీయంగా 6.9 శాతం ఎక్కువగా ఉంది. ఆయా కుటుంబాల వద్ద ఉన్న బంగారం నిల్వలు కోవిడ్‌కి ముందు కంటే మహమ్మారి సమయంలో గణనీయంగా పెరిగాయి. ఇదీ చదవండి ➤ రూ.2,000 నోటు ఉపసంహరణ ఎఫెక్ట్: ఆరేళ్ల గరిష్టానికి బ్యాంక్ డిపాజిట్లు 2020-21 ఆర్థిక సంవత్సరం కోవిడ్ సమయంలో ఇండియా గోల్డ్ పాలసీ సెంటర్ (IGPC), పీపుల్ రీసెర్చ్ ఆన్ ఇండియాస్ కన్స్యూమర్ ఎకానమీ (PRICE) ద్వారా నిర్వహించిన గోల్డ్ వినియోగానికి సంబంధించిన గృహ సర్వే ఆధారంగా ఈ అధ్యయనం చేపట్టారు. దేశంలోని 23 రాష్ట్రాల్లో 160 జిల్లాల్లోని 40,427 కుటుంబాలతో ఈ సర్వే నిర్వహించారు. ఆ డేటా ఆధారంగా దేశంలో 21 రాష్ట్రాల్లోని 142 జిల్లాల్లోని 21,611 కుటుంబాలను శాంపిల్‌గా తీసుకుని అంచనాలను రూపొందించారు. ఆయా కుటుంబాల్లో బంగారంపై పొదుపులో వచ్చిన మార్పులను పోల్చడానికి 2015-16 ఆర్థిక సంవత్సరంలో నిర్వహించిన ‘ప్రైస్’ ముందస్తు ప్రతినిధి సర్వేను ఉపయోగించారు. ఇక జిల్లా స్థాయిలో కోవిడ్ కేసుల సంఖ్యను డెవలప్మెంట్ డేటా ల్యాబ్‌కు చెందిన సోషియో ఎకనామిక్ హై-రిజల్యూషన్ రూరల్-అర్బన్ జియోగ్రాఫిక్ ప్లాట్‌ఫాం ఫర్ ఇండియా (SHRUG) డేటాబేస్ నుంచి తీసుకున్నారు. -
నిండా ముంచిన అకాల వర్షాలు.. 16 జిల్లాలపై ప్రభావం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు రాష్ట్రంలోని 16 జిల్లాలపై ప్రభావాన్ని చూపాయి. నంద్యాల, కర్నూలు, అన్నమయ్య, విజయనగరం, వైఎస్సార్, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి, గుంటూరు, చిత్తూరు, పార్వతీపురం మన్యం, కృష్ణా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ఏలూరు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోని 119 మండలాల పరిధిలో 372 గ్రామాల్లో భారీ వర్షాల వల్ల ఇబ్బందులు ఏర్పడ్డాయి. కాగా వర్షాలు, పిడుగులకు 951 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం.. సుమారు 20 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అధికార యంత్రాంగం తేల్చింది. పలుచోట్ల విద్యుత్ లైన్లు, రోడ్లు దెబ్బతిన్నాయి. పిడుగులు పడే అవకాశం కాగా మరో మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అంతర్గత తమిళనాడు నుంచి మధ్య ఛత్తీస్‌గఢ్ వరకు కర్ణాటక, రాయలసీమ, తెలంగాణల మీదుగా సముద్రమట్టానికి 0.9 కి.మీ.ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఫలితంగా రానున్న మూడు రోజులు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాల్లో కొన్నిచోట్ల, రాయలసీమలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సోమవారం రాత్రి నివేదికలో తెలిపింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులకు ఆస్కారం ఉందని పేర్కొంది. కాగా సోమవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. -
AP: జీవవైవిధ్యం ఉట్టిపడేలా.. ప్రతి ఉమ్మడి జిల్లాలో బయోడైవర్సిటీ పార్కు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రతి ఉమ్మడి జిల్లాలో ఒక జీవవైవిధ్య (బయోడైవర్సిటీ) పార్కు ఏర్పాటు కానుంది. తద్వారా ప్రజల్లో పర్యావరణం పట్ల ఆసక్తిని పెంచడమే కాకుండా ప్రకృతి పరిరక్షణ ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, కడపలో నాలుగు పార్కుల్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర జీవవైవిధ్య మండలి ప్రణాళిక రూపొందించింది. చదవండి: AP: హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేక పర్యవేక్షణ వీటి ఏర్పాటుకు ఇప్పటికే ఆమోదం లభించింది. విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్‌లో 6 ఎకరాలు, కాకినాడలోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ క్యాంపస్‌లో 7.5 ఎకరాలు, తిరుపతిలోని తుడా పరిధిలో ఉన్న వెంకటాపురంలో 6 ఎకరాలు, కడప నగరంలో ఏపీఐఐసీకి చెందిన 6 ఎకరాలను ఇప్పటికే పార్కుల కోసం కేటాయించారు. ఆ భూములను త్వరలో జీవవైవిధ్య మండలికి అప్పగించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. భూమి అప్పగించిన వెంటనే పార్కుతోపాటు మ్యూజియం ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. పార్కుకు రూ.కోటి, మ్యూజియానికి రూ.50 లక్షల చొప్పున జీవవైవిధ్య మండలి మంజూరు చేయనుంది. ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ పర్యవేక్షణలో వీటిని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. మిగిలిన జిల్లాల్లోనూ పార్కులు, మ్యూజియంల ఏర్పాటుకు అవసరమైన భూమిని కేటాయించాలని జీవవైవిధ్య మండలి ఇప్పటికే కోరింది. కర్నూలు, అమరావతి, అనంతపురం జిల్లాల్లోనూ త్వరలో భూమిని కేటాయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
అస్సాంలో బీభత్సం సృష్టిస్తున్న వరదలు...ముగ్గురు మృతి
Assam Floods Nearly 25,000 people affected: దేశంలో అనేక రాష్ట్రలలోని ప్రజలు భయంకరమైన ఎండలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే అస్సాం మాత్రం అకాల వర్షాలతో వరదల్లో చిక్కుకుంది. అసోంలోని దిమా హసావో జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ఒక మహిళతో సహా ముగ్గురు వ్యక్తులు మరణించారని అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఏఎస్డీఎంఏ) తెలిపింది. కొండ జిల్లా ఆకస్మిక వరదలు కారణంగా కొండ చరియలు విరిగిపడటంతో అనేక ప్రాంతాల్లో రోడ్డు, రైలు మార్గాలు దెబ్బతిన్నాయని వెల్లడించింది. కొండచరియలు విరిగిపడటంతో జటింగా-హరంగాజావో, మహూర్-ఫైడింగ్ వద్ద రైల్వే లైన్ నిలిచిపోయింది. గెరెమ్లాంబ్రా గ్రామం వద్ద మైబాంగ్ సొరంగం వద్ద కొండచరియలు విరిగిపడటం వల్ల రహదారి బ్లాక్ అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. అస్సాంలో ఎడతెరిపి లేకుండా కురిసిన అకాల వర్షాల కారణంగా సుమారు ఐదు జిల్లాలోని దాదాపు 25000 మంది ప్రజలు వరదల బారిన పడ్డారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. వరదలు సృష్టించిని విధ్వంసం: న్యూ కుంజంగ్, ఫియాంగ్‌పుయ్, మౌల్‌హోయ్, నమ్‌జురాంగ్, సౌత్ బగేటార్, మహాదేవ్ తిల్లా, కలిబారి, నార్త్ బాగేటార్, జియోన్, లోడి పాంగ్‌మౌల్ గ్రామాలలో కొండచరియలు విరిగిపడడంతో దాదాపు 80 ఇళ్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయని ఏఎస్డీఎంఏ తెలిపింది. అస్సాంలోని ఇప్పటి వరకు కాచర్, దేమాజీ, హోజాయ్, కర్బీ అంగ్లాంగ్ వెస్ట్, నాగావ్, కమ్రూవ్ ఈ ఆరు జిల్లాలు వరదల వల్ల ప్రభావితమయ్యాయి. ఆరు జిల్లాలో 94 గ్రామాలకు చెందిన 24,681 మంది వరద బారిన పడ్డారు. ఒక్క కాచర్ జిల్లాలోనే 21,000 మంది వరద బారిన పడ్డారు. ఆ తర్వాతి స్థానంలో కర్బీ ఆంగ్లోంగ్ వెస్ట్ దాదాపు 2,000 మంది బాధితులు, ధేమాజీలో 600 మందికి పైగా ప్రజలు ప్రళయం బారిన పడ్డారు. ఆర్మీ, పారామిలిటరీ బలగాలు, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్, ఎస్డీఆర్ఎఫ్, సివిల్ అడ్మినిస్ట్రేషన్‌తో సహా క్యాచర్, హోజాయ్ జిల్లాలకు చెందిన శిక్షణ పొందిన వాలంటీర్లు దాదాపు 2,200 మందిని రక్షించారు. #WATCH Roads, bridges and agricultural land were inundated in Hojai, Assam yesterday due to floods following incessant rain in the region pic.twitter.com/DitKiMbb6O — ANI (@ANI) May 15, 2022 (చదవండి: పెదవుల పై ముద్దు పెట్టుకోవడం అసహజ నేరం కాదు) -
కొత్త జిల్లాలు..మిన్నంటిన సంబరాలు
సాక్షి నెట్వర్క్: జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్రంలోని 13 జిల్లాలు రెట్టింపు అవడంపై వాడవాడలా సంబరాలు మిన్నంటాయి. అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్లు ఉన్నతాధికారుల బాధ్యతల స్వీకారంతో సందడిగా మారాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలుచేస్తూ సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. వాడవాడలా భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ చూసినా పండుగ వాతావరణం నెలకొంది. దశాబ్దాల కల నెరవేరినందుకు ప్రజలు సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు. ► విశాఖపట్నం జిల్లాను మూడు జిల్లాలుగా విభజించడంతో కొత్త జిల్లాలైన అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొత్త పాలనా యంత్రాంగం కొలువుదీరింది. అనకాపల్లి జిల్లా ఏర్పాటుతో ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్లో తొలిరోజునే స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏజెన్సీలోని మండలాల్ని కలుపుతూ పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లాని ఏర్పాటుచేయడంతో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనకాపల్లి జిల్లా ఏర్పాటుతో హుషారుగా ప్రదర్శనలు నిర్వహించి కేక్ కట్ చేశారు. ► శ్రీకాకుళం జిల్లాలో కొత్తగా పలాస రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ఇచ్ఛాపురంలో జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, ఆ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త పిరియా సాయిరాజ్‌లు సోమవారం ర్యాలీ నిర్వహించి సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ► విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో సోమవారం ‘కొత్త’ సందడి కనిపించింది. మన్యం జిల్లాలో కలెక్టరేట్‌తో పాటు వివిధ విభాగాలను డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణితో పాటు ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, జోగారావు, కళావతి, కలెక్టర్, ఎస్పీలు ప్రారంభించారు. విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి ఆర్డీఓ కార్యాలయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ శ్రేణులు గరివిడి మండలం నుంచి చీపురుపల్లి వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించాయి. ► ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి రాజమహేంద్రవరం కేంద్రంగా తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ జిల్లాలు ఏర్పాటుతో ప్రజలు కేరింతలు కొట్టారు. పాతికేళ్లుగా ఎదురుచూస్తున్న కోనసీమ జిల్లా కల నెరవేరడంతో కోనసీమ వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. జిల్లా కలెక్టరేట్, జిల్లా ఎస్పీ కార్యాలయాల భవనాలు అందంగా అలంకరించారు. జాతీయ జెండాలు ఎగరవేశారు. మంత్రులు పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇక కాకినాడ జిల్లా కేంద్రం ఆవిష్కరణ సందర్భంగా ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పెండెం దొరబాబు, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా భారీ ర్యాలీ నిర్వహించారు. రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పాటైన తూర్పు గోదావరి జిల్లా ప్రారంభోత్సవం సందర్భంగా బొమ్మూరులో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. నిడదవోలు నుంచి గోదావరి వంతెన మీదుగా రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్ వరకు మోటర్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి తానేటి వనిత, ఎంపీ మార్గాని భరత్‌రామ్, ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, గెడ్డం శ్రీనివాసనాయుడు, జక్కంపూడి రాజా తదితరులు పాల్గొన్నారు. ► పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో నూతన జిల్లా వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భారీ ర్యాలీ, సాంస్కృతిక కార్యక్రమాలను ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నిర్వహించారు. తణుకులో ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఏలూరు జిల్లా కేంద్రం ఏలూరులో ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు నేతృత్వంలో సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, ఎలీజా, దూలం నాగేశ్వరరావు, మేకా ప్రతాప్ అప్పారావు, ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ పాల్గొన్నారు. చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించారు. ► ఉమ్మడి కృష్ణా జిల్లాను కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలుగా మార్చడంతో మచిలీపట్నం, విజయవాడ కలెక్టరేట్లలో సందడి వాతావరణం జరిగింది. మచిలీపట్నం కేంద్రంగా ఏర్పడిన కృష్ణాజిల్లాకు కలెక్టర్‌గా రంజిత్ బాషా, విజయవాడ కేంద్రంగా ఏర్పడిన ఎన్టీఆర్ జిల్లాకు కలెక్టర్‌గా ఢిల్లీరావు బాధ్యతలు స్వీకరించారు. పెడన, ఉయ్యూరు, అవనిగడ్డ నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తూ భారీ ర్యాలీలు జరిగాయి. విజయవాడ ఈస్ట్ నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ సీఎం జగన్ చిత్రపటానికి పూలతో అభిషేకం చేశారు. ► ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొత్తగా ఏర్పాటైన బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీగా సభలు నిర్వహించారు. గుంటూరు లాడ్జి సెంటర్ నుంచి శంకర్ విలాస్ వరకు అభినందన ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యేలు మద్దాళి గిరిధర్, మహమ్మద్ ముస్తఫా, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు, మిర్చి యార్డ్ చైర్మన్ ఏసురత్నం, ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పాల్గొన్నారు. ► ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణం సోమవారం జనసంద్రమైంది. కొత్తగా కనిగిరి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుచేయడంతో పెద్దఎత్తున సంబరాలు జరిపారు. ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ భారీ ర్యాలీ నిర్వహించారు. జై జగన్ నినాదాలతో పట్టణమంతా మార్మోగింది. ఒంగోలు పట్టణంలో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించి సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ► సర్వేపల్లి నియోజకవర్గాన్ని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనే కొనసాగించినందుకు సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి వెంకటాచలంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సంప్రదాయ నృత్యాలు, డప్పు వాయిద్యాలు, పార్టీ శ్రేణుల నినాదాలతో ర్యాలీ హోరెత్తింది. సీఎం చిత్రపటానికి కాకాణి క్షీరాభిషేకం చేశారు. ► ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లాలో అన్నమయ్య జిల్లా ఆవిర్భావం సందర్భంగా జిల్లా కేంద్రమైన రాయచోటిలో సోమవారం సంబరాలు మిన్నంటాయి. ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల వేషధారణలు, బాణాసంచా, డప్పు వాయిద్యాలు, కోలాటాలు, చెక్కభజనలు, కీలు గుర్రాలతో ర్యాలీ హోరెత్తింది. గడికోట, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియాఖానమ్, కలెక్టర్ గిరీషా, జేసీ తమీమ్ అన్సారియా, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజులు ఊరేగింపుగా పాల్గొన్నారు. పెద్దఎత్తున అన్నదానం చేశారు. ► గత పాలకులు సాధించలేనిది మూడేళ్లలో జగనన్న సాయంతో సాధించామని తిరుపతి జిల్లాలో ఏర్పాటైన శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి అన్నారు. పట్టణంలో ఆర్డీఓ కార్యాలయాన్ని ఎంపీ గురుమూర్తితో కలిసి ఆయన ప్రారంభించారు. శ్రీకాళహస్తి ప్రజల కల నెరవేరిందన్నారు. అంతకుముందు.. పార్టీ మహిళా నేత బియ్యపు పవిత్రారెడ్డి ఆధ్వర్యంలో మహిళలు ‘థ్యాంక్యూ సీఎం సర్’ అంటూ ప్లకార్డులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ► ఉమ్మడి అనంతపురం జిల్లాలో పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటు సందర్భంగా సంబరాలు మిన్నంటాయి. నూతన జిల్లా ప్రారంభోత్సవంలో మంత్రి శంకరనారాయణ, పుట్టపర్తి ఎమ్మెల్యేలు శ్రీధర్‌రెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, పీవీ సిద్ధారెడ్డి, ఎమ్మెల్సీ ఇక్బాల్, ఎంపీ గోరంట్ల మాధవ్, కలెక్టర్ బసంత్‌కుమార్, ఎస్పీ రాహుల్‌దేవ్ సింగ్ పాల్గొన్నారు. ప్రజలు, విద్యార్థులు, బాబా భక్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. ‘థ్యాంక్యూ సీఎం సార్’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పుట్టపర్తి వీధులన్నీ సందడిగా మారాయి. మడకశిర, కదిరిలోనూ సంబరాలు చేసుకున్నారు. ► నంద్యాల జిల్లా ప్రారంభోత్సవం సోమవారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్, ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఎంపీ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీలు ఇసాక్‌బాషా, భగీరథరెడ్డి, ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కాటసాని రామిరెడ్డి, తొగురు ఆర్థర్, గంగుల బిజేంద్రనాథరెడ్డి, ఎస్పీ రఘువీరారెడ్డి, జేసీ నారపురెడ్డి మౌర్య తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద సంబరాలు: సీఎం వైఎస్ జగన్ కొత్త జిల్లాలను ప్రారంభిస్తూ ప్రకటన చేయగానే గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు సంబరాలు చేసుకున్నారు. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు మరింత మెరుగ్గా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేరువ చేసేందుకు ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిందని చెప్పారు. రాష్ట్ర చరిత్రలో ఇది ఒక చరిత్రాత్మక ఘటన అని అభివర్ణించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మరో హామీని సీఎం జగన్ నెరవేర్చారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నవరత్నాల అమలు ప్రోగ్రామ్ వైస్ చైర్మన్ ఎ.నారాయణమూర్తి, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పద్మజ, విజయవాడ సిటీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) (చదవండి: లక్ష మందికి నైపుణ్య శిక్షణ) -
సరికొత్త చరిత్ర ... ‘సీమ’కు సముద్రం
సాక్షి, అమరావతి: పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను 13 నుంచి 26కు పెంచడంతో సరికొత్త చరిత్ర నమోదవుతోంది. నూతన జిల్లాల భౌగోళిక స్వరూపాన్ని పరిశీలిస్తే పలు అంశాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఆ వివరాలివీ.. కరువు సీమకు కడలి ఇప్పటివరకు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు తొమ్మిది కోస్తా జిల్లాలకే తీర ప్రాంతం పరిమితం కాగా కొత్త జిల్లాల ఏర్పాటుతో రాయలసీమకు కూడా ఆ అవకాశం దక్కింది. తాజాగా రాయలసీమలోని నాలుగు జిల్లాలు ఎనిమిది అవుతున్నాయి. ఇందులో తిరుపతి జిల్లాకు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో తీరప్రాంతం ఉన్న సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని కలిపారు. సూళ్లూరుపేటతో పాటు సముద్రతీరంలో ఉన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం కూడా తిరుపతి జిల్లాలో కలుస్తోంది. మరోవైపు ఇప్పటి వరకు సముద్ర తీర ప్రాంతాన్ని కలిగివున్న గుంటూరు జిల్లా ప్రస్తుతం తీర ప్రాంతం లేని జిల్లాగా నిలుస్తోంది. రెండు గిరిజన జిల్లాలు ఇప్పటిదాకా రాష్ట్రంలో గిరిజనుల కోసం ప్రత్యేకంగా జిల్లాలు లేవు. జిల్లాల పునర్ విభజన తర్వాత గిరిజనుల కోసం రెండు జిల్లాలు ఏర్పాటయ్యాయి. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలను గిరిజనుల కోసం ఏర్పాటు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా పేరును తొలి నోటిఫికేషన్లో మన్యం జిల్లాగా ప్రకటించగా స్థానికుల వినతిమేరకు పార్వతీపురం మన్యం జిల్లాగా మార్చారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు, కర్నూలు, ఉభయ గోదావరి జిల్లాల్లో గిరిజన ప్రాంతాలుండగా వీటికోసం సమీకృత గిరిజన అభివృద్ధి ఏజెన్సీలు (ఐటీడీఏ) ఏర్పాటయ్యాయి. ఆంధ్ర కేసరితో ఆరంభం.. ప్రస్తుతం ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు, వైఎస్సార్ కడప జిల్లాలు ప్రముఖుల పేర్లతో ఉండగా జిల్లాల విభజనతో ఇది ఏడుకు పెరిగింది. స్వాతంత్ర సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు సేవలను గుర్తిస్తూ 1972లో తొలిసారిగా ఒంగోలు జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మార్చారు. ఆమరణ నిరాహార దీక్షతో ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించిన పొట్టి శ్రీరాములు పేరును 2008లో నెల్లూరు జిల్లాకు పెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును 2010లో కడప జిల్లాకు పెట్టారు. బ్రిటీషు వారిని ఎదిరించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరుతో పాడేరు కేంద్రంగా గిరిజన జిల్లా ఏర్పాటైంది. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు పేరుతో విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటైంది. ప్రఖ్యాత వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమయ్య పేరుతో రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా, పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లాలు ఏర్పాటయ్యాయి. ఐదు అత్యధిక వర్షపాత జిల్లాలు.. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అత్యధికంగా 1,400 మి.మీ సగటు వర్షపాతంతో అల్లూరి సీతారామరాజు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. తర్వాత స్థానాల్లో తిరుపతి జిల్లా 1,300 మి.మీ, కోనసీమ జిల్లా 1,200 మి.మీ, పార్వతీపురం మన్యం 1150 మి.మీ, విశాఖపట్నం 1,100 మి.మీ వరకు ఉన్నట్లు అంచనా. (చదవండి: కోవిడ్ తర్వాత ఊపందుకున్న స్థిరాస్తి వ్యాపారం... రాష్ట్ర ప్రభుత్వం రికార్డు) -
తెలంగాణ: 33 జిల్లాల సమగ్ర మ్యాప్ ఆవిష్కరణ.. ఇదే ఏకైక మ్యాప్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 33 జిల్లాలతో కూడిన సమగ్ర మ్యాప్ అట్లాస్‌ను రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ మంత్రుల నివాసంలో ఆవిష్కరించారు. విష్ణు మ్యాప్ పబ్లికేషన్స్ సంస్థ ముంద్రించిన ఈ మ్యాప్‌ను కేంద్ర ప్రభుత్వ సర్వే ఆఫ్ ఇండియా శాఖ ఆమోదించిందని తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల తాజా సమాచారంతో ఉన్న ఏకైక మ్యాప్ ఇదేనని తెలిపారు. ప్రజలు. అధికార యంత్రాంగానికి ఈ మ్యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని వినోద్ తెలిపారు. చదవండి: Mahabubnagar: గుట్టలో గుట్టురట్టు -
ఆప్షన్లకు గడువిస్తాం.. స్థానికతపై చెప్పలేం
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపు ప్రక్రియ మరింత వివాదాస్ప దమవుతోంది. ఈ వ్యవహారంపై అన్ని జిల్లాల్లోనూ తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం జరిపిన సమాలోచనలు కూడా పెద్దగా ఫలితాన్నివ్వలేదు. క్షేత్రస్థాయిలో వస్తున్న వ్యతిరేకతను మంత్రి దృష్టికి తెచ్చేందుకు సంఘాల నేతలు ప్రయత్నించారు. విభజన పద్ధతులు లోపభూయిష్టంగా ఉన్నాయని అన్ని సంఘాలు అభిప్రాయపడ్డాయి. హడావుడిగా ఆప్షన్లు ఇవ్వమనడం సరికాదంటూ, స్థానికతకు ప్రాధాన్యత లేకుండా, సీనియారిటీకే పెద్దపీట వేయడాన్ని సంఘాలు తీవ్రంగా తప్పుబట్టాయి. యూటీఎఫ్, పీఆర్టీయూ, ఎస్టీయూ సహా 12 ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో మంత్రి సబిత విడివిడిగా సంప్రదింపులు జరిపారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. సంఘాలు ఇచ్చిన లిఖిత పూర్వక అభ్యంతరాలను మంత్రి పరిశీలించారు. జూనియర్లకు అన్యాయం స్కూల్ అసిస్టెంట్స్, ఎస్జీటీ పోస్టులు జిల్లా క్యాడర్‌గా ఉండటం వల్ల ఉపాధ్యాయులకు స్థాన చలనం తప్పడం లేదని, స్థానికతకు ప్రాధాన్యం లేకపోవడం వల్ల స్థిర నివాసం ఏర్పరచుకున్న జూనియర్లకు అన్యాయం జరుగుతుందని యూటీఎఫ్ ప్రతినిధులు కె.జంగయ్య, చావా రవి మంత్రికి తెలిపారు. కొత్త జిల్లాల్లో 80 శాతం పోస్టులు స్థానికులకే ఇవ్వాలన్నారు. మంజూరైన పోస్టులు, పనిచేస్తున్న ఉద్యోగులు, ఖాళీలను దామాషా పద్ధతిలో కేటాయించాలని సూచించారు. వితంతువులు, మహిళలను ప్రత్యేక కేటగిరీలో చేర్చాలన్నారు. ఒక్కరోజులో ఆప్షన్ల ముగింపా? కేవలం ఒక్క రోజులోనే అప్షన్లు ముగించడం అన్యా యమని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్, ప్రధాన కార్యదర్శి పర్వత రెడ్డి మంత్రి దృష్టికి తెచ్చారు. స్థానికతను వదిలేయడం రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధమన్నారు. క్యాడర్ విభజన ఉత్తర్వులే అమలు కాకపోతే కొత్త జిల్లాలకు ఉపా ధ్యాయుల కేటాయింపు ఎలా చేస్తారని ప్రశ్నిం చారు. విభజనకు ముందే వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్న భార్యాభర్తలకు న్యాయం చేయాలన్నారు. ఉత్తర్వులు సవరించండి టీచర్ల కేటాయింపు ఉత్తర్వులను సవరించాలని పీఆర్టీయూ అధ్యక్షుడు పింగిలి సిరిపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్ రావు కోరారు. సీనియర్ల ఐచ్ఛికాన్ని పరిశీలిస్తూనే, జూనియర్లకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు. ప్రధాన డిమాండ్‌కు లభించని పరిష్కారం విద్యాశాఖ హడావుడిగా ఆప్షన్ల తంతు ముగించిందన్న విమర్శలపై మంత్రి సానుకూలంగా స్పందించినట్టు భేటీ అనంతరం సంఘం నేతలు తెలిపారు. ఆప్షన్ల ఎంపికకు మరికొంత గడువు ఇస్తామని భరోసా ఇచ్చినట్టు చెప్పారు. అయితే స్థానికతపై మాత్రం నిర్ణయాన్ని వెల్లడించలేదన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలకు ఒకే విధమైన మార్గదర్శకాలు ఇవ్వడం వల్ల, దీనిపై నిర్ణయం తన చేతుల్లో ఉండదనే అభిప్రాయం మంత్రి వ్యక్తం చేసినట్లు చెప్పారు. స్థానికతను పరిగణలోనికి తీసుకోవాలన్న ప్రధాన డిమాండ్‌కు చర్చల్లో ఎలాంటి పరిష్కారం లభించలేదని ఉపాధ్యాయ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఆందోళన ఉధృతం ఉద్యోగుల విభజన అంశంపై ఉపాధ్యాయ వర్గాలో ఆందోళన పెరుగుతోంది. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద పలు సంఘాల నేతలు, జూనియర్ ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. పలుచోట్ల ఉపాధ్యాయ సంఘాల నేతలను టీచర్లు నిలదీస్తున్నారు. సంఘాల నేతలు రాజధాని పరిసర ప్రాంతాల్లో ఉండటం వల్లే సీనియారిటీ అంశాన్ని సమర్థిస్తున్నారని జూనియర్ ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. మరోవైపు విద్యాశాఖ ఉన్నతాధికారులకు అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలతో లేఖలు వస్తున్నాయి. ఆప్షన్ల ఎంపికలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని టీచర్లు ఆరోపిస్తున్నారు. కొందరు నకిలీ సర్టిఫికెట్లతో తప్పుదారి పట్టిస్తున్నారని వరంగల్ జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు కార్తికేయ తెలిపారు. -
తెలంగాణ: ఉద్యోగుల విభజనలో సీనియారిటీనే లెక్క
ఉద్యోగుల విభజనలో కీలక నిబంధనలివీ.. ► కొత్త జిల్లా/జోనల్/మల్టీ జోనల్ కేడర్లకు మంజూరు చేసిన పోస్టుల సంఖ్యకు అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపులు ఉంటాయి. ► రాష్ట్రంలో వేర్వేరు ఉమ్మడి జిల్లాల్లోని ప్రాంతాలతో 8 కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. ఈ జిల్లాల ఉద్యోగులకు ఉమ్మడి జిల్లా పరిధిలో ఏర్పాటైన కొత్త జిల్లాలతోపాటు ప్రాంతాలు కలిసిన పొరుగు జిల్లాల్లో ఆప్షన్లకు అవకాశం ఇస్తారు. ► అవసరమైన ఉద్యోగుల (వర్కింగ్ స్ట్రెంత్) దామాషా ప్రకారమే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులను కొత్త జిల్లాలకు కేటాయిస్తారు. ► దీర్ఘకాలిక వ్యాధులున్నవారు, వితంతువులకు ప్రాధాన్యత ►ప్రస్తుత ఉద్యోగుల కేటాయింపు పూర్తయ్యాకే భార్యాభర్తల (స్పౌజ్ కేటగిరీ) బదిలీలు చేపడతారు. ► ఏ ఉద్యోగిని ఎక్కడైనా నియమించే అధికారం ప్రభుత్వానికి ఉందని మార్గదర్శకాల్లో సర్కారు స్పష్టం చేసింది. సాక్షి, హైదరాబాద్: పాత జిల్లాలు, జోనల్ పోస్టుల్లోని ఉద్యోగులంతా.. కొత్త జిల్లా, జోనల్, మల్టీ జోనల్ కేడర్లలో కేటాయింపుల కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నిర్దేశిత నమూనాలో తమ ప్రాథమ్యాలను వరుస క్రమంలో పేర్కొంటూ.. సంబంధిశాఖ జిల్లాధిపతి (జిల్లా కేడర్), విభాగాధిపతి (జోనల్), శాఖ కార్యదర్శి (మల్టీ జోనల్)కు దరఖాస్తులు అందజేయాలని సూచించింది. ఉద్యోగులెవరైనా దరఖాస్తు చేసుకోకుంటే.. సంబంధిత అధికారులే నిబంధనల మేరకు కేటాయింపులు చేస్తారని స్పష్టం చేసింది. ఎక్కడైనా పోస్టుల లభ్యతకు మించి ప్రాథమ్యాలు ఉంటే.. ఉద్యోగుల సీనియా రిటీ ఆధారంగా ఎంపిక జరుగుతుందని తెలిపింది. ఈ మేరకు రాష్ట్రపతి కొత్త ఉత్తర్వులు–2018 ప్రకారం.. ఉద్యోగుల విభజన మార్గదర్శకాలను విడుదల చేస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఉద్యోగుల కేడర్లను 33 జిల్లాలు, 7 జోన్లు, 2 మల్టీజోన్లుగా పునర్విభజిస్తూ ‘తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్) ఆర్డర్–2018’ను రాష్ట్రపతి జారీ చేసిన విషయం తెలిసిందే. దానికి అనుగుణంగా కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీ జోనల్ కేడర్లకు పోస్టుల సంఖ్య (కేడర్ స్ట్రెంత్) విభజన ఇప్పటికే పూర్తయింది. వాటికి అనుగుణంగా ఉద్యోగులను కేటాయించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉద్యోగుల ప్రాథమ్యాలను పరిశీలించి కేటాయింపులు చేసేందుకు జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. ►పరిపాలనా అవసరాలకు అనుగుణంగా కొత్త జిల్లా/జోనల్/మల్లీ జోనల్ పోస్టుల సంఖ్యను విభజించారు. అదే నిష్పత్తిలో అన్ని ప్రభుత్వ శాఖలు ప్రతి లోకల్ కేడర్‌కు వర్కింగ్ స్ట్రెంత్‌ను కేటాయించాయి. ► పాత లోకల్ కేడర్లలోని సీనియారిటీ ప్రకారం ఉద్యోగుల జాబితాలను శాఖల అధిపతులు రూపొందిస్తారు. కేటాయింపుల్లో ఏ ఒక్కరూ మిగిలిపోకుండా సెలవులు, సస్పెన్షన్, శిక్షణ, డిప్యుటేషన్, ఫారిన్ సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులను సైతం పరిగణనలోకి తీసుకుంటారు. కేటాయింపుల అనంతరం వారు కొత్త లోకల్ కేడర్లలో సెలవులు, సస్పెన్షన్, డిప్యుటేషన్, శిక్షణ, ఫారిన్ సర్వీస్‌లో కొనసాగుతున్నట్టు పరిగణిస్తారు. జిల్లా కేడర్ ఉద్యోగుల విభజన ఇలా.. ► ఉమ్మడి జిల్లా పరిధిలోని కొత్త జిల్లాల్లో అన్నిపోస్టులకు.. సదరు ఉమ్మడి జిల్లాలోని ఉద్యోగులందరినీ పరిగణనలోకి తీసుకుంటారు. ► హన్మకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, సిద్దిపేట, మహబూబ్‌నగర్, వికారాబాద్, రంగారెడ్డి కొత్త జిల్లాలు ఒకటి కంటే ఎక్కువ ఉమ్మడి జిల్లాలకు చెందిన ప్రాంతాల కలయికతో ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి పాత జిల్లాల ఉద్యోగులకు.. ఉమ్మడి జిల్లా పరిధిలోని కొత్త జిల్లాలతోపాటు, ఆ ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రాంతం కలిసిన కొత్త జిల్లాల్లోనూ అవకాశం కల్పిస్తారు. జోనల్ కేడర్ కేటాయింపులు ఇలా.. ► కొత్త జోనల్/మల్టీజోనల్ కేడర్లకు ఖరారైన ఉద్యోగుల సంఖ్యకు లోబడి.. పాత జోనల్ కేడర్‌లోని ఉద్యోగులందరినీ కేటాయింపుల కోసం పరిగణనలోకి తీసుకుంటారు. ► పాత 5వ జోన్ ఉద్యోగులను.. రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల్లోని 1–4 జోన్లకు (నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాలు, ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని సిద్దిపేట ప్రాంతంలోని పోస్టులు మినహాయించి), జోన్–5లోని జనగామ జిల్లాలో ఉన్న పోస్టుల్లో కేటాయింపుల కోసం పరిగణనలోకి తీసుకుంటారు. ► పాత జోన్–6 కేడర్ ఉద్యోగులను.. రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల్లోని 5, 6, 7 జోన్లకు (జనగామ జిల్లాలోని పోస్టులు మినహాయించి), జోన్–2లోని నిజామాబాద్ జిల్లాకు, జోన్–3లోని కామారెడ్డి, మెదక్ జిల్లాతోపాటు ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేటకు కేటాయించేందుకు పరిగణనలోకి తీసుకుంటారు. మల్టీ జోన్ పోస్టులు ఇలా... ► పాత 5వ జోన్ ఉద్యోగులను.. మల్టీ జోన్–1 (నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాలతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్ధిపేట ప్రాంతం మినహాయించి)కు, మల్టీజోన్–2లోని జనగామ జిల్లాలోని పోస్టుల్లో కేటాయింపులకు పరిగణనలోకి తీసుకుంటారు. ► పాత 6వ జోన్ ఉద్యోగులను.. మల్టీ జోన్–2 (జనగామ జిల్లాలోని పోస్టులు మినహాయించి)కు, మల్టీ జోన్–1లోని నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేటలోని పోస్టుల్లో కేటాయింపులకు పరిగణనలోకి తీసుకుంటారు. ► రాష్ట్రపతి పాత ఉత్తర్వులు వర్తించని కొన్ని పోస్టులను కొత్త ఉత్తర్వుల్లో మల్టీజోనల్ పోస్టులుగా విభజించారు. అలాంటి పోస్టుల్లో ఉన్న ఉద్యోగులు, పాత మల్టీజోన్ కేడర్ ఉద్యోగులను ఏదైనా ఒక కొత్త మల్టీజోన్కు కేటాయిస్తారు. కొన్ని ప్రత్యేక కేటగిరీలుగా.. కొన్ని ప్రత్యేక అంశాల మేరకు సీనియారిటీతో సంబంధం లేకుండా కొత్త లోకల్ కేడర్లకు కేటాయింపులు చేస్తామని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఈ ప్రత్యేక కేటగిరీల కింద కేటాయింపు పొందడానికి ఉద్యోగులు తగిన రుజువులు సమర్పించాల్సి ఉంటుంది. ► 70శాతం, ఆపై వైకల్యంగల వారు, కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందిన వితంతువులు ప్రత్యేక కేటగిరీ కిందికి వస్తారు. ► మనోవైకల్యంగల పిల్లలున్న ఉద్యోగులకు వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నచోట పోస్టింగ్ ఇస్తారు. ► కేన్సర్, న్యూరోసర్జరీ, కిడ్నీ/కాలేయ మార్పిడి, ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిన వారిని.. ఇదే క్రమంలో పరిగణనలోకి తీసుకుంటారు. విభజన తర్వాతే ‘స్పౌస్’ బదిలీలు ►ప్రస్తుత కేటాయింపుల్లో జీవిత భాగస్వాములు వేర్వేరు కేడర్లకు పంపబడితే.. కేటా యింపులు పూర్తయ్యాక కేడర్ మార్పిడికి దర ఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. పోస్టుల లభ్యత, పాలన అవసరాలకు లోబడి ఒకే లోకల్ కేడర్‌లో వారికి స్థానం కల్పిస్తారు. ► కేటాయింపులపై ఉద్యోగులెవరికైనా అభ్యంతరాలుంటే సంబంధిత శాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వం పరిశీలించి పరిష్కరిస్తుంది. విభజన తర్వాతే ‘స్పౌస్’ బదిలీలు ► ప్రస్తుత కేటాయింపుల్లో జీవిత భాగస్వాములు వేర్వేరు కేడర్లకు పంపబడితే.. కేటా యింపులు పూర్తయ్యాక కేడర్ మార్పిడికి దర ఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. పోస్టుల లభ్యత, పాలన అవసరాలకు లోబడి ఒకే లోకల్ కేడర్‌లో వారికి స్థానం కల్పిస్తారు. ►కేటాయింపులపై ఉద్యోగులెవరికైనా అభ్యంతరాలుంటే సంబంధిత శాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వం పరిశీలించి పరిష్కరిస్తుంది. -
Covid Test: 14 జిల్లాల్లో ఆర్టీపీసీఆర్ కేంద్రాలు
యాంటీజెన్ పరీక్షలో నెగెటివ్ వచ్చి కరోనా లక్షణాలుంటే ఆ ఫలితాన్ని నమ్మలేం. కచ్చితంగా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. కానీ చాలా మంది చేయించుకోవట్లేదు. అందుకే మరిన్ని ఆర్టీపీసీఆర్ కేంద్రాలు. వనపర్తి, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, నిర్మల్, మంచిర్యాల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, జగిత్యాల, రామగుండం, భువనగిరి, జనగాం, వికారాబాద్ జిల్లా ఆసుపత్రుల్లో ఏర్పాటు. సాక్షి, హైదరాబాద్: కరోనా నిర్ధారణ పరీక్షల నిర్వహణకు కొత్తగా 14 జిల్లాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్ష కేంద్రాలను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో వాటిని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తు న్నారు. ప్రస్తుతం 17 చోట్ల ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా థర్డ్‌వేవ్ వస్తుందన్న హెచ్చరికలతో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. దీనికోసం ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. కరోనా నిర్ధారణకు 2 రకాల పరీక్షలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఒకటి ర్యాపిడ్ యాంటిజెన్, రెండోది ఆర్టీపీసీఆర్. ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్ష ద్వారా పావు గంటలోనే ఫలితం వస్తుంది. ఈ పరీక్షలో పాజిటివ్ వస్తే, అది పూర్తిగా కరెక్టే. కానీ నెగటివ్ వచ్చి లక్షణాలుంటే మాత్రం దాని ఫలితాన్ని పూర్తిగా నమ్మలేం. మళ్లీ ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలనేది నిబంధన. చాలామంది యాంటిజెన్ పరీక్ష చేయించుకొని అందులో నెగటివ్ వచ్చి.. లక్షణాలున్నా కూడా సాధారణంగా తిరిగేస్తున్నారు. ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవడం లేదు. ఆర్టీపీసీఆర్ పరీక్షలు అంతగా అందుబాటులో లేకపోవడం కూడా దీనికి కారణం. ఇలా అనేక కేసులు మిస్ కావడం, సీరియస్ అవుతుండటంతో పరిస్థితి తీవ్రంగా మారుతోంది. అంతేకాదు రాష్ట్రంలో 90 శాతంపైగా ర్యాపిడ్ పరీక్షలే జరుగుతున్నాయని కేంద్రం ఇటీవల వెల్లడించింది. 10 శాతంలోపే ఆర్టీపీసీఆర్ పరీక్షలు జరుగుతున్నాయంది. దీంతో ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్యను పెంచాలని వైద్య, ఆరోగ్యశాఖ తాజాగా నిర్ణయించింది. యాంటిజెన్ పరీక్ష ద్వారా పాజిటివ్ ఉన్న వ్యక్తులను వెంటనే గుర్తించడానికి వీలుంది. ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించాలంటే ఇప్పుడు రెండుమూడు రోజులకు కూడా ఫలితం రావడంలేదు. ఒక్కోసారి వారం సమయం కూడా పడుతోంది. అందుకే వైద్యాధికారులు, ప్రజలు యాంటిజెన్ పరీక్షలకే మొగ్గుచూపుతున్నారు. కొత్తగా ఆర్టీపీసీఆర్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో తక్కువ సమయంలో పరీక్షా ఫలితాలు ఇవ్వడానికి వీలుపడుతుందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. -
లాక్డౌన్ ఎత్తేయగానే దోస్తులను కలుస్తాం.. మాల్స్‌కు పోతాం..
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో అన్‌లాక్ ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. ఈనేపథ్యంలో ఇన్నాళ్లు లాక్డౌన్లో ఉన్న ప్రజలు తాళం తీస్తే స్వేచ్ఛగా తిరిగేందుకు మొగ్గుచూపుతున్నారు. రెస్టారెంట్లు, సినిమాహాళ్లు, మాల్స్‌కు వెళ్తామంటున్నారు. బంధుమిత్రులను కలుస్తామని చెబుతున్నారు. అయితే, కోవిడ్ మహమ్మారి విషయంలో ప్రజలు నిబంధనలు గాలికొదిలి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మళ్లీ మహమ్మారి పంజా విసురుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా 314 జిల్లాల్లో కమ్యూనిటీ లోకల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘లోకల్ సర్కిల్స్’ నిర్వహించిన సర్వేలో అనేక విషయాలు వెల్లడయ్యాయి. ఈ అధ్యయనంలో భాగంగా ఆయా జిల్లాల్లోని 48 శాతం మందిని ప్రథమ శ్రేణి నగరాల నుంచి, ద్వితీయశ్రేణి నగరాల నుంచి 25 శాతం, మూడు, నాలుగు శ్రేణి నగరాల నుంచి 27 శాతం మంది నుంచి వివిధ అంశాలపై అభిప్రాయాలు సేకరించారు. -
సర్కార్ దవాఖానాకు మహర్దశ..
సాక్షి, హైదరాబాద్: మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) ఆధ్వర్యంలోని బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. మెడికల్ పీజీలో ఎండీ, ఎంఎస్ చేసే విద్యార్థులు రెండో ఏడాది నుంచి జిల్లా ఆసుపత్రుల్లో శిక్షణ పొందాలని తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ‘పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ (సవరణ) నిబంధనలు–2020’ విడుదల చేసింది. తద్వారా వీరికి క్షేత్రస్థాయి వ్యాధులపై అవగాహన వస్తుందని, శిక్షణ కూడా పొందుతారని తెలిపింది. మరోవైపు జిల్లా ఆసుపత్రుల్లో స్పెషలిస్టుల వైద్య సేవలు పూర్తిగా అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేసింది. 100 పడకలకు తక్కువ కాకుండా ఉన్న జిల్లా ఆసుపత్రుల్లో వీరికి శిక్షణ ఇస్తారు. ఈ ఏడాది పీజీలో చేరిన వారికి వచ్చే సంవత్సరం నుంచి ఈ శిక్షణ అమలుకానుందని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి చెప్పారు. ఇప్పటివరకు పీజీ పూర్తయిన విద్యార్థులు బోధనాసుపత్రుల్లో శిక్షణ పొందుతున్నారు. జిల్లా రెసిడెన్సీ ప్రోగ్రామ్: ఎండీ లేదా ఎంఎస్ చేసే పీజీ మెడికల్ విద్యార్థులంతా 3 నెలలకోసారి రొటేషన్ పద్ధతిలో జిల్లా ఆసుపత్రుల్లో లేదా జిల్లా ఆరోగ్య వ్యవస్థల్లో పని చేయాలి. వారి కోర్సులో భాగంగా ఇది ఉం టుంది. 3, 4, 5 సెమిస్టర్లలో ఉన్న పీజీ విద్యార్థులు రొటేషన్ పద్ధతిలో పనిచేస్తారు. దాన్ని జిల్లా రెసిడెన్సీ ప్రోగ్రామ్(డీఆర్పీ) అంటా రు. సదరు విద్యార్థులను జిల్లా రెసిడెంట్లుగా పిలుస్తారు. క్షేత్రస్థాయిలో ప్రజల్లో వచ్చే వివిధ అనారోగ్య సమస్యలను తెలుసుకోవడం దీని ఉద్దేశాలు. విభిన్నమైన శిక్షణ పొందడం. అలాగే ప్రస్తుతమున్న స్పెషాలిటీ వైద్యులకు తోడుగా పీజీ వైద్య విద్యార్థులతో జిల్లా ఆరోగ్య వ్యవస్థ బలోపేతం కానుంది. ఇన్ పేషెంట్.. ఔట్‌పేషెంట్ సేవల్లోనూ.. ► జిల్లా రెసిడెంట్లుగా వెళ్లిన పీజీ విద్యార్థులు జిల్లా రెసిడెన్సీ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ (డీఆర్పీసీ) పర్యవేక్షణలో పని చేస్తారు. ► ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్, క్యాజువాలిటీ తదితర చోట్ల పనిచేస్తారు. నైట్ డ్యూటీలూ చేయాలి. ► అనాటమీ, బయోకెమిస్ట్రీ, కమ్యూనిటీ మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్, మైక్రోబయాలజీ, పాథాలజీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీకి చెందిన పీజీ మెడికల్ విద్యార్థులు జిల్లా ఆరోగ్య అధికారి లేదా చీఫ్ మెడికల్ ఆఫీసర్ పర్యవేక్షణలో శిక్షణ పొందుతారు. లేబొరేటరీ, ఫార్మసీ, ఫోరెన్సిక్ విద్యార్థులు సాధారణ క్లినికల్ విధుల్లో పనిచేస్తారు. ► జిల్లా రెసిడెంట్లకు స్టైఫెండ్ ఇస్తారు. వారానికో సెలవుతోపాటు ఇతర సెలవులు ఉంటాయి. ► రాష్ట్రస్థాయిలోనూ స్టీరింగ్ కమిటీ ఉంటుంది. వివిధ కేసులపై చర్చలు, సెమినార్లు వంటి వాటిల్లో పాల్గొనేలా చేయాలి. ► జిల్లా రెసిడెన్సీ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ జిల్లా రెసిడెంట్ల శిక్షణకు సంబంధించి ధ్రువీకరణ పత్రాన్ని ఇస్తారు. వారి పనితీరుపై మెడికల్ కాలేజీకి, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. ► జిల్లా రెసిడెన్సీ ప్రోగ్రాంను సమన్వయం లేదా పర్యవేక్షణ చేసేందుకు ప్రతి మెడికల్ కాలేజీ అకడమిక్ సెల్ కమిటీని ఏర్పాటు చేయాలి. ► జిల్లా రెసిడెన్సీ కార్యక్రమం అమలు మొదలైన ఏడాదికి సంబంధిత మెడికల్ కాలేజీ అదనపు పీజీ సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. వాటిని ఎంసీఐ పరిగణనలోకి తీసుకుంటుంది. ► జిల్లా రెసిడెన్సీ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు రాష్ట్రస్థాయిలో నోడల్ ఆఫీసర్‌ను నియమించాలి. -
హైదరాబాద్‌లో నిలకడగా.. జిల్లాల్లో దూకుడుగా..
సాక్షి, హైదరాబాద్: మొన్నటివరకు హైదరాబాద్‌లో ప్రతాపం చూపించిన వైరస్.. ఇప్పుడు జిల్లాల్లో విజృంభిస్తోంది. పట్టణాలు, పల్లెల్లో పంజా విసురుతోంది. వారం రోజుల్లోనే చాలా జిల్లాల్లో రెట్టింపు కేసులు నమోదు కావడమే ఇందుకు నిదర్శనం. కొన్ని జిల్లాల్లో మూడు, నాలుగింతలు కూడా రికార్డయ్యాయి. వైద్య, ఆరోగ్య శాఖ గురువారం విడుదల చేసిన బులెటిన్ మేరకు.. ఈ నెల 20న జీహెచ్ఎంసీ పరిధిలో 473 కేసులుండగా, 26న 449 కేసులు నమోదయ్యాయి. ఇక్కడ గత వారం రోజులుగా కేసుల సంఖ్య దాదాపు నిలకడగానే కొనసాగుతోంది. కానీ జిల్లాల్లో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 20న 21 కేసులు నమోదు కాగా, 26న ఏకంగా 72 కేసులు రికార్డయ్యాయి. అంటే మూడింతలకు మించిన కేసులన్న మాట. భూపాలపల్లి జిల్లాలో 20న 12 కేసులు నమోదు కాగా, 26న 26 కేసులు.. అంటే రెట్టింపునకు మించి నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో వారం క్రితం 79 కేసులు నమోదైతే, ఇప్పుడు 152 కేసులు నమోదయ్యాయి. ఇక మహబూబాబాద్ జిల్లాలోనైతే వారం క్రితం 26 కేసులు నమోదైతే, ఇప్పుడు ఏకంగా 102 కేసులు రికార్డయ్యాయి. మంచిర్యాల జిల్లాలో వారం క్రితం 40 కేసులుంటే, ఇప్పుడు 106 కేసులు రికార్డయ్యాయి. నల్లగొండ జిల్లాలో వారం క్రితం 60 కేసులుంటే, ఇప్పుడు 164 నమోదయ్యాయి. నిజామాబాద్‌లో ముందు 69 కేసులుంటే, ఇప్పుడు 112 నమోదయ్యాయి. పెద్దపల్లి జిల్లాలో వారం క్రితం 35 కేసులుంటే, ఇప్పుడు 77 నమోదయ్యాయి. సిద్దిపేట జిల్లాలో వారం క్రితం 49 కేసులుంటే, ఇప్పుడు 113 కేసులు వచ్చాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో 20న 18 కేసులుంటే, 26న 39 కేసులు రికార్డయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2 వేల వరకు కంటైన్మెంట్ జోన్లున్నాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి. పల్లెల్లోనూ వైరస్ వ్యాప్తి చెందడంతో గ్రామాల్లో అలజడి నెలకొంది. వచ్చే నెలాఖరుకు దాదాపు 3 వేల గ్రామాల్లోకి వైరస్ ప్రవేశించే అవకాశముందని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. మరో 2,795 కేసులు.. రాష్ట్రంలో బుధవారం (26వ తేదీన) 60,386 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 2,795 పాజిటివ్ కేసులు వచ్చాయని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు బులిటెన్‌లో వెల్లడించారు. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 1,14,483కి చేరింది. తాజాగా కరోనాతో 8 మంది మృతి చెందారు. దీంతో మృతి చెందిన వారి సంఖ్య 788కి చేరింది. కరోనా బారి నుంచి తాజాగా 872 మంది కోలుకోగా, ఇప్పటివరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 86,095కి చేరిందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 27,600 యాక్టివ్ కేసులున్నాయి. అందులో ఇళ్లు, ఇతరత్రా ఐసోలేషన్లలో చికిత్స పొందుతున్నవారు 20,866 మంది ఉన్నారు. ఇక తెలంగాణలో ఇప్పటివరకు 11,42,480 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. -
మండల, జిల్లా, పరిషత్‌లకు ఊరట
సాక్షి, హైదరాబాద్: మండల, జిల్లా పరిషత్‌ల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈ ఏడాది నుంచి అమల్లోకి వచ్చే 15వ ఆర్థిక సంఘం తలసరి నిధుల్లో గ్రామ పంచాయతీలతో పాటు మండల, జిల్లా పరిషత్‌లకు కూడా నిధులను కేటాయించింది. ఈ మేరకు ఇప్పటికే ఖరారు చేసిన నిష్పత్తి ఆధారంగా తొలి త్రైమాసికానికి సంబంధించిన నిధులను రాష్ట్రానికి విడుదల చేయగా.. వాటిని జనాభా ప్రాతిపదికన జిల్లాలకు పంపిణీ చేస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ ఎం.రఘునందన్‌రావు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఈ ఏడాది రూ.1,847 కోట్లు ఖరారు చేయగా.. ఇందులో మొదటి విడత (తొలి త్రైమాసికం)గా రూ.308 కోట్లు విడుదల చేసింది. జెడ్పీ 5%, ఎంపీపీలకు 10% నిధులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం.. 2014–15లో అమలు చేసిన 14వ ఆర్థిక సంఘం నిధులను నేరుగా గ్రామ పంచాయతీలకు విడుదల చేసింది. దీంతో మండల, జిల్లా పరిషత్‌లకు నిధుల కొరత ఏర్పడింది. కేవలం సీనరేజీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ నిధులపైనే ఆధారపడాల్సి వచ్చింది. నిధుల కటకటతో నీరసించిన జెడ్పీ, ఎంపీపీలకు కూడా కొంతమేర కేటాయించాలని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేయడంతో వీటికి ఊరట లభించింది. గ్రామ పంచాయతీలకు 75 శాతం, మండల పరిషత్‌లకు 10 శాతం, జిల్లా పరిషత్‌లకు 5 శాతం నిష్పత్తిలో నిధులు పంచాలని నిర్ణయించింది. దీంతో తొలి త్రైమాసికానికి సంబంధించి రూ.461.75 కోట్లు విడుదలకు పరిపాలనా అనుమతి మంజూరు చేసిన కేంద్రం.. టైడ్ గ్రాంట్ కింద రూ.308 కోట్లు విడుదల చేసింది. వీటిలో జిల్లా పరిషత్‌లకు రూ.1,026.11 లక్షలు, మండల పరిషత్‌లకు రూ.2,052.20 లక్షలు, గ్రామ పంచాయతీలకు రూ.27,721.67 లక్షలను నిర్దేశించింది. వీటిని సాధారణ, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ల కింద వినియోగించుకోవాలని సూచించింది. ఈ నిధులతో తాగునీటి సౌకర్యాల కల్పన, వాననీటి సంరక్షణ, ఇంకుడు గుంతల నిర్మాణం, పారిశుధ్య నిర్వహణ, డోర్‌టుడోర్ చెత్త సేకరణ, కంపోస్టు ఎరువుల తయారీ కేంద్రం, ప్లాస్టిక్ సేకరణ, సామాజిక మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని పంచాయతీ రాజ్ కమిషనర్ రఘునందన్‌రావు ఆదేశించారు.