మంత్రుల నోట.. జిల్లా మాట..
మంత్రుల నోట.. జిల్లా మాట..
Published Wed, Jul 20 2016 11:08 PM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM
నిర్మల్ టౌన్ : నిర్మల్ జిల్లా త్వరలోనే ఏర్పాటు కానుందని రాష్ట్ర మంత్రులు మహేందర్‌రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ పట్టణంతోపాటు సారంగాపూర్ మండలంలోని చించోలి(బి) గ్రామంలో బుధవారం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. త్వరలోనే నిర్మల్ జిల్లా ఏర్పాటు కానుందని పేర్కొన్నారు. సిరిసిల్లలో ప్రయోగాత్మకంగా ఏర్పాటుచేసిన డ్రై వింగ్ శిక్షణ మాదిరిగా ప్రతీ జిల్లా కేంద్రంలోనూ డ్రై వింగ్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్న కారణంగా రూ.1,200 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి కేటాయించిందన్నారు. ప్రతీ గ్రామంలోనూ రోడ్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ, ఎమ్మెల్యేలకు లేఖలు రాసినట్లు ఆయన పేర్కొన్నారు. పల్లె వెలుగు బస్సులను నడపడం వల్ల నష్టాలు వస్తున్నప్పటికీ.. వాటిని విస్మరించబోమని ఆయన తెలిపారు. రోడ్డున్న ప్రతీ గ్రామానికి బస్సు నడుపుతామని హామీ ఇచ్చారు. దూర ప్రాంతాలకు ఏసీ బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మరో 1200 బస్సుల కొనుగోలుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషిచేస్తుందన్నారు.
Advertisement