matter
-
గ్రాము ఖరీదు కోట్ల డాలర్లట!... ఏందబ్బా అది?
ఈ భూమండలంపై అత్యంత ఖరీదైన పదార్థమేమిటనే ప్రశ్న ఎవరినైనా అడిగితే ప్లాటినం, వజ్రం లేదా బంగారం అని చెబుతుంటారు. అయితే వీటికి మించిన ఖరీదైన పదార్థం ఒకటుందనే సంగతి మీకు తెలుసా? దాని విలువ ఎంతో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఆ పదార్ధం ఒక గ్రాము ధర 7,553 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుంది. (ఒక బిలియన్ అంటే వంద కోట్లు) ఆ ఖరీదైన పదార్ధం పేరు యాంటీమాటర్. దీని గురించి ఎవరూ అంతగా వినివుండకపోవచ్చు. అయితే సైన్స్ ప్రపంచంలో ఇది ఒక రహస్యమైన, శక్తిమంతమైన పదార్ధం. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం యాంటీమాటర్ అనేది పదార్థంతో సమానంగానే ఉంటుంది. కానీ ఇది సాధారణ పదార్ధానికి పూర్తిగా వ్యతిరేకం. యాంటీమాటర్లోని ఉప పరమాణు కణాలు సాధారణ పదార్థానికి వ్యతిరేక లక్షణాలను కలిగి ఉంటాయి. దీనిని 20 వ శతాబ్దపు ప్రథమార్థంలో కనుగొన్నారు. యాంటీమాటర్ను మొట్టమొదట ప్రపంచానికి 1928 లో శాస్త్రవేత్త పాల్ డిరాక్ పరిచయం చేశారు. న్యూ సైంటిస్ట్ పత్రిక ఈ మహనీయుడిని ‘సర్ ఐజాక్ న్యూటన్ తరువాత గొప్ప బ్రిటిష్ సిద్ధాంతకర్త’ అని అభివర్ణించింది. నాటి నుంచి యాంటీమాటర్ శాస్త్రవేత్తలకు సైతం ఉత్సుకత కలిగించే అంశంగా మారింది. యాంటీమాటర్ అత్యధిక శక్తిని ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఒక గ్రాము యాంటీమాటర్ 43 మెగాటన్నుల ట్రినిట్రోటోల్యూన్ (టీఎన్టీ) శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అంటే జపాన్.. హిరోషిమాపై వేసిన అణు బాంబు కంటే మూడు వేల రెట్లు అధిక శక్తిని ఉత్పత్తి చేస్తుంది. యాంటీమాటర్ అంతరిక్ష ప్రయాణానికి సమర్థవంతమైన ఇంధనంగా లేదా మన గ్రహానికి అత్యధిక శక్తి వనరుగా కూడా ఉపయోగపడుతుంది. విశ్వం యొక్క మూలం, పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి యాంటీమాటర్ సహాయపడుతుంది. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారం విశ్వం అనేది అధిక సాంద్రత, ఉష్ణోగ్రత స్థితి నుండి ఉద్భవించింది. ఇక్కడ పదార్థం, యాంటీమాటర్ సమానంగా, సమృద్ధిగా ఉన్నాయి. అయితే ప్రారంభ విశ్వంలో పదార్థం, యాంటీమాటర్ మధ్య కొంత అసమానత లేదా అసమతుల్యత ఉండేదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది యాంటీమాటర్ కంటే పదార్థం అధికంగా ఉండటానికి దారితీసింది. ఇది భౌతిక శాస్త్రంలో అతిపెద్ద పజిల్‌గా నిలిచింది. యాంటీమాటర్ను శాస్త్రీయ పరిశోధనలు, వైద్య అనువర్తనాలకు సాధనంగా ఉపయోగించవచ్చు. ఇది సాంప్రదాయిక పద్ధతులకు మించి మరింత ఖచ్చితంగా క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకునే రేడియేషన్ థెరపీకి ఉపయుక్తమవుతుంది. యాంటీహైడ్రోజన్ (యాంటీమాటర్తో తయారు చేసిన సరళమైన పరమాణువు) సమానత్వ సూత్రం, ఛార్జ్-పారిటీ-టైమ్ (సీపీటీ) సమరూపత వంటి భౌతిక శాస్త్ర సిద్ధాంతాలను పరీక్షించడానికి యాంటీమాటర్ ఉపయోగపడుతుంది. శాస్త్రవేత్తలు చెబుతున్నదాని ప్రకారం యాంటీమాటర్ను సృష్టించడం, నిల్వ చేయడం అంత సులభం కాదు. దీనికి పార్టికల్ యాక్సిలరేటర్లు, వాక్యూమ్ ఛాంబర్లు వంటి అధునాతన సౌకర్యాలు, సాంకేతికతలు అవసరమవుతాయి. ప్రస్తుతం మనం స్వల్ప పరిమాణంలోని యాంటీమాటర్ను మాత్రమే ఉత్పత్తి చేయగలం. దీనికి కూడా అధికంగా ఖర్చు అవుతుంది. నాసా తెలిపిన వివరాల ప్రకారం యాంటీమాటర్ అనేది భూమిపై అత్యంత ఖరీదైన పదార్థం. శాస్త్రవేత్తలు భూమిపైనే లార్జ్ హాడ్రాన్ కొలైడర్ లాంటి అధిక శక్తి కణాల యాక్సిలరేటర్ల ద్వారా యాంటీ పార్టికల్‌ను ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ పరిశోధనలు విజయవంతం కావాలని కోరుకుందాం. ఇది కూడా చదవండి: సొరంగంలో చిక్కుకున్నవారంతా క్షేమం.. ఫొటో విడుదల! -
70 శాతం మార్కులు వస్తేనే.! జేపీఎస్ రెగ్యులరైజేషన్‌లో సర్కార్ మెలిక
సాక్షి, హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్) రెగ్యులరైజేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మెలిక పెట్టింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియామకమై, నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరు మదింపులో 70 శాతం మార్కులు వచ్చిన వారినే క్రమబద్దికరించాలని నిర్ణయించింది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా మంగళవారం మెమో జారీ చేశారు. ఈ అధికారిక మెమోను అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపారు. జేపీఎస్‌ల పనితీరును మదింపు చేసేందుకు జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశామని, ఈ కమిటీలు ఆయా జిల్లాల్లోని జేపీఎస్‌ల పనితీరును సమీక్షించి మార్కులు ఇస్తున్నాయని, కమిటీలు ఇచ్చే రిపోర్టుల్లో 70శాతం, అంతకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వారిని క్రమబద్దికరిస్తూ నియామక ఉత్తర్వులు అందజేయాలని ఈ మెమో లో స్పష్టం చేశారు. ఒకవేళ 70శాతం మార్కులు రాకపోతే ఆయా జేపీఎస్‌లకు మరో ఆరునెలల గడువు ఇవ్వాలని, అప్పుడు మరోమారు పనితీరు మదింపు చేసి అప్పటి నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఆ మొబైల్ యాప్‌లో అప్లోడ్ చేయాలి జిల్లా స్థాయిలో ఆయా కమిటీల మదింపు నివేదికలను గ్రామీణాభివృద్ధి శాఖ రూపొందించిన మొబైల్ యాప్‌లో అప్లోడ్ చేయాలని, పనితీరు సంతృప్తిగా ఉన్న జేపీఎస్‌లకు ఇచ్చే నియామక ఉత్తర్వులను కూడా ఇదే యాప్‌లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ బాధ్యతలను జిల్లా అదనపు కలెక్టర్ల (స్థానిక సంస్థలు)కు అప్పగించారు. అర్హత పొందిన జేపీఎస్‌లకు ఇవ్వాల్సిన నియామక ఉత్తర్వులకు సంబంధించిన ముసాయిదాను కూడా ఈ మెమోతో జతచేసి జిల్లాలకు పంపారు. ప్రభుత్వ నిర్ణయం విడ్డూరం: టీపీఎస్ఏ పనితీరు మదింపులో 70శాతం మార్కులు వచ్చిన వారిని మాత్రమే క్రమబద్దికరిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు విడ్డూరంగా ఉన్నా యని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ (టీపీఎస్ఏ) వ్యాఖ్యానించింది. డైరెక్ట్‌గా రిక్రూట్ అయి మూడేళ్ల సర్విసు పూర్తి చేసుకున్న జేపీఎస్‌లను అందరినీ బేషరతుగా రెగ్యులరైజ్ చేయాలని టీపీఎస్ఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.మధుసూదన్‌రెడ్డి, ఇ. శ్రీనివాస్‌లు మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గ్రామీ ణాభివృద్ధి శాఖ జారీ చేసిన మెమో అనేక గందరగోళాలకు తావిస్తోందని, తమ డిమాండ్ ప్రకారం అందరినీ బేషరతుగా రెగ్యులరైజ్ చేయకుంటే పోరాటా నికి దిగాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. -
ఎలక్ట్రిక్ బైక్ కావాలా? ఇదిగో ఫ్లిప్‌కార్ట్‌లో బుక్ చేసుకోండి!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ అందుబాటులోకి వచ్చిన తరువాత మనకు ఏం కావాలన్నా వెంటనే ఆర్డర్ పెట్టస్తాం.. అది మనకు డోర్ డెలివరీ అయిపోతుంది. అయితే ఇప్పుడు ఇందులో కేవలం నిత్యావసర వస్తువులు మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ బైకులు కూడా ఈ సైట్లో అందుబాటులో ఉన్నాయి. దేశీయ మార్కెట్లో ఇప్పటికే విక్రయానికి ఉన్న మ్యాటర్ (Matter) ఎలక్ట్రిక్ బైకుని ఫ్లిప్‌కార్ట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. మ్యాటర్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌తో ఏర్పరచుకున్న భాగస్వామ్యం ద్వారా ఈ విధంగా విక్రయించడానికి నిర్ణయించింది. కాబట్టి మ్యాటర్ ఎరా ఎలక్ట్రిక్ బైక్ కావాలనుకునే వారు ఫ్లిప్‌కార్ట్‌లో బుక్ చేసుకోవచ్చు. భారతదేశంలో మ్యాటర్ ఎరా ఎలక్ట్రిక్ బైక్ ధర రూ. 1.44 లక్షలు. ఇది మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. డిజైన్ పరంగా ఈ బైకులు ఒకే విధంగా ఉన్నప్పటికీ రేంజ్ విషయంలో కొంత వ్యత్యాసం ఉంటుంది. టాప్ మోడల్ 150 కిమీ రేంజ్ అందిస్తుంది. మిగిలిన అన్ని మోడల్స్ 125కిమీ రేంజ్ మాత్రమే అందిస్తాయి. (ఇదీ చదవండి: భారీగా పెరిగిన అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ధరలు - కొత్త ధరలు ఇలా!) మ్యాటర్ ఎరా ఎలక్ట్రిక్ బైక్ మంచి డిజైన్ కలిగి ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో ఎల్ఈడీ టర్న్ సిగ్నెల్స్ ఇతర మోడల్స్ మాదిరిగా కాకుండా ఫ్యూయెల్ ట్యాంక్ మీద ఏర్పాటు చేశారు. స్ప్లిట్ సీటు, క్లిన్ ఆన్ హ్యాండిల్ బార్లు, పిలియన్ సీటు కోసం స్ల్పిట్ గ్రబ్ రైల్ వంటి వాటితో పాటు బై ఫంక్షనల్ ఎల్ఈడీ హెడ్ లైట్ కొత్తగా ఉంటుంది. ఇవన్నీ చూసేవారికి ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ కొత్త బైక్ 7.0 ఇంచెస్ LCD టచ్ స్క్రీన్ ఇన్స్ట్రుమెంట్ పొందుతుంది. ఇది బైక్ గురించి రైడర్‌కి కావలసిన సమాచారం అందిస్తుంది. ఇందులో రిమోట్ లాక్/అన్‌లాక్, జియో ఫెన్సింగ్, లైవ్ లొకేషన్ ట్రాకింగ్, వెహికల్ హెల్త్ మానిటరింగ్, ఛార్జింగ్ స్టేటస్, పుష్ నావిగేషన్ వంటివి ఉన్నాయి. (ఇదీ చదవండి: కొత్త యాడ్‌లో రచ్చ చేసిన సమంతా.. వీడియో వైరల్) దేశీయ విఫణిలో ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకి డిమాండ్ పెరుగుతున్న తరుణంలో కొనుగోలుదారులకు మరింత చేరువలో ఉంచాలనే ఉద్దేశ్యంతో ఫ్లిప్‌కార్ట్ ద్వారా మ్యాటర్ ఎరా ఎలక్ట్రిక్ బైక్ విక్రయిస్తున్నట్లు కంపెనీ సీఈఓ మోహన్ లాల్ భాయ్ అన్నారు. గతంలో కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయించిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సలహాలు తప్పకుండా మాతో పంచుకోండి. -
మ్యాటర్ ఎనర్జీ ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్.. ధర తక్కువ, సూపర్ డిజైన్
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న తరుణంలో 'మ్యాటర్ ఎనర్జీ' (Matter Energy) తన మొదటి ఎలక్ట్రిక్ బైక్ 'ఏరా' లాంచ్ చేసింది. ఇది 4000, 5000, 5000+, 6000+ అనే నాలుగు వేరియంట్స్‌లో విడుదలైంది. ప్రారంభ ధర రూ. 1.44 లక్షలు ఎక్స్-షోరూమ్). కంపెనీ ఈ కొత్త ఎలక్ట్రిక్ బైకుని నాలుగు వేరియంట్స్‌లో విడుదల చేసినప్పటికీ కేవలం మొదటి రెండు వేరియంట్స్‌ని మాత్రమే విక్రయిస్తుంది. మిగిలిన రెండు భవిష్యత్తులో విక్రయించబడతాయి. టాప్ వేరియంట్ 150 కిమీ రేంజ్ అందించగా, మిగిలిన మూడు వేరియంట్లు 125 కిమీ రేంజ్ అందిస్తాయి. మ్యాటర్ ఏరా ఎలక్ట్రిక్ బైక్ 5kWh బ్యాటరీ, 10.5kW లిక్విడ్-కూల్డ్ మోటార్ పొందుతుంది. ఈ బైక్ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఏరా 5000 వేరియంట్ ఆప్సనల్ 7 ఇంచెస్ LCD టచ్‌స్క్రీన్ ఇన్స్ట్రుమెంటేషన్ కలిగి ఆప్సనల్ బ్లూటూత్ కనెక్టివిటీ, పార్క్ అసిస్ట్, కీలెస్ ఆపరేషన్, OTA అప్డేట్లు, ప్రోగ్రెసివ్ బ్లింకర్స్ వంటి ఫీచర్స్ పొందుతుంది. 5000+ వేరియంట్లో లైఫ్‌స్టైల్, కేర్ ప్యాకేజీతో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ స్టాండర్డ్‌గా లభిస్తుంది. కంపెనీ తమ ఎలక్ట్రిక్ బైక్, బ్యాటరీ ప్యాక్ మీద 3 సంవత్సరాల వారంటీ అందిస్తుంది. ఇది స్టాండర్డ్, ఫాస్ట్ ఛార్జింగ్ రెండింటినీ సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్ కావడానికి పట్టే సమయం 5 గంటలు. ఈ బైక్ 'ట్యాంక్'పై చిన్న 5 లీటర్ గ్లోవ్‌బాక్స్ అందుబాటులో ఉంది. ఇలాంటి ఫీచర్ మరే ఇతర బైకులలో లేకపోవడం గమనార్హం. (ఇదీ చదవండి: కుర్రకారుని ఉర్రూతలూగించే అల్ట్రావయోలెట్ ఎఫ్77.. డెలివరీస్ షురూ) ప్రస్తుతం, కంపెనీ ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, అహ్మదాబాద్, కోల్‌కతా, పూణే, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో మాత్రమే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీల గురించి అధికారిక సమాచారం అందకపోయినప్పటికీ, త్వరలో డెలివరీలు ప్రారంభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
దూసుకొచ్చిన మ్యాటర్ ఎనర్జీ: అత్యాధునిక ఫీచర్స్‌తో ఎలక్ట్రిక్ బైక్
సాక్షి, ముంబై: ఎలక్ట్రిక్ బైక్స్‌కు పెరుగుతున్న ఆదరణ, డిమాండ్ నేపథ్యంలో దేశీయ మార్కెట్లోకి మరో కంపెనీ దూసుకొచ్చింది. తాజాగా మ్యాటర్ ఎనర్జీ (Matter Energy) తన తొలి ఎలక్ట్రిక్ బైక్‌ను దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. అద్భుతమైన డిజైన్, అత్యాధునిక ఫీచర్స్‌తో మ్యాటర్ ఎనర్జీ తన తొలి ఎలక్ట్రిక్ బైక్‌ను ఆవిష్కరించింది. ఫీచర్లు ఈ బైక్‌లో అమర్చిన 10.5 kW ఎలక్ట్రిక్ మోటారు 520 Nm టార్క్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. 4-స్పీడ్ గేర్‌బాక్స్, 5 kWh లిక్విడ్-కూల్డ్ బ్యాటరీని జతచేసింది. ఇది ఒక్కసారి ఛార్జ్‌పై 125-150 కిమీల పరిధిని అందజేస్తుందని కంపెనీ చెప్పింది. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే, ఇది స్టాండర్డ్, ఫాస్ట్ ఛార్జింగ్ రెండింటినీ సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్ కావడానికి పట్టే సమయం 5 గంటలు అని కంపెనీ పేర్కొంది. ఎల్ఈడీ లైట్లు, స్ప్లిట్ సీట్లు, క్లిప్-ఆన్ హ్యాండిల్బార్లు , స్ప్లిట్ రియర్ గ్రాబ్ రైల్‌తో స్పోర్టీ స్ట్రీట్ బైక్ డిజైన్‌న్‌తో ఆకట్టుకుంటోంది.. ట్యాంక్ ఏరియాలో 5లీటర్ గ్లోవ్‌బాక్స్ ఉంది, ఇందులోనే ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంటుంది. ఇంకా 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌తో వస్తుంది, ఇది టర్న్-బై-టర్న్ నావిగేషన్, నోటిఫికేషన్ అలర్ట్‌లు , మ్యూజిక్ ప్లేబ్యాక్ వంటి ఫీచర్లను అందిస్తుంది. ఇది ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్డేట్లకు కూడా మద్దతు ఇస్తుంది. స్పోర్ట్, ఎకో, సిటీ మోడ్స్‌లో గ్రే అండ్ నియాన్, బ్లూ అండ్ గోల్డ్, బ్లాక్ అండ్ గోల్డ్, రెడ్/బ్లాక్/వైట్ కలర్స్‌లో అందుబాటులోకి రానుంది. 2023 మొదటి త్రైమాసికంలో బుకింగ్స్, డెలివరీలు 2023 ఏప్రిల్ నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ధర: ధరను కంపెనీ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ సుమారు రూ. 1.75 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుందని అంచనా. -
మంత్రుల నోట.. జిల్లా మాట..
నిర్మల్ టౌన్ : నిర్మల్ జిల్లా త్వరలోనే ఏర్పాటు కానుందని రాష్ట్ర మంత్రులు మహేందర్‌రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ పట్టణంతోపాటు సారంగాపూర్ మండలంలోని చించోలి(బి) గ్రామంలో బుధవారం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. త్వరలోనే నిర్మల్ జిల్లా ఏర్పాటు కానుందని పేర్కొన్నారు. సిరిసిల్లలో ప్రయోగాత్మకంగా ఏర్పాటుచేసిన డ్రై వింగ్ శిక్షణ మాదిరిగా ప్రతీ జిల్లా కేంద్రంలోనూ డ్రై వింగ్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్న కారణంగా రూ.1,200 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి కేటాయించిందన్నారు. ప్రతీ గ్రామంలోనూ రోడ్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ, ఎమ్మెల్యేలకు లేఖలు రాసినట్లు ఆయన పేర్కొన్నారు. పల్లె వెలుగు బస్సులను నడపడం వల్ల నష్టాలు వస్తున్నప్పటికీ.. వాటిని విస్మరించబోమని ఆయన తెలిపారు. రోడ్డున్న ప్రతీ గ్రామానికి బస్సు నడుపుతామని హామీ ఇచ్చారు. దూర ప్రాంతాలకు ఏసీ బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మరో 1200 బస్సుల కొనుగోలుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషిచేస్తుందన్నారు.