
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జిల్లాల సంఖ్య 33కు పెరగడంతో ఇండియన్ ఆర్మీ వెబ్‌సైట్‌లోనూ కొత్త జిల్లాల పేర్లు చేర్చారు. ఈ మేరకు ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ మార్పులను గమనించాలని డిఫెన్స్ పీఆర్‌ఓ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
గతంలో 31 జిల్లాలు మాత్రమే ఉండగా, ఇటీవలే మరో రెండు జిల్లాలు పెరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో జయశంకర్, ములుగు, మహబూబ్‌నగర్, నారాయణపేట్ జిల్లాల పరిధిలోని అభ్యర్థులు తమ ప్రస్తుత జిల్లాల పరిధికి అనుగుణంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment