జిల్లాల విభజన శాస్త్రీయంగా ఉండాలి
జిల్లాల విభజన శాస్త్రీయంగా ఉండాలి
Published Fri, Sep 2 2016 11:36 PM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM
చిలుకూరు: జిల్లాల విభజన శాస్త్రీయంగా, ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని బేతవోలు లో జరిగిన సీపీఐ సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. విధివిధానాలు ఏమీ ప్రకటించకుండా అఖిలపక్ష నాయకులను పిలవడం సమంజసం కాదన్నారు. మండలంలోని అన్ని గ్రామాలను ఒకే నియోజకవర్గంలో ఉంచాలన్నారు. ఇష్టానుసారంగా విభజన చేశారని విమర్శించారు. తెలంగాణ విమోచన దినోత్సవంను ప్రభుత్వం అధికారంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాయుధ పోరాట చర్రితను ప్రజలకు తెలియజేసేందుకు సీపీఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో బస్సు యాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లాలో ఈ నెల 11వ తేదీన యాద్రాది నుంచి ప్రారంభమై ఆలేరు, తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ, చిలుకూరు మీదుగా వెళ్లి హుజూర్‌నగర్‌లో రాత్రి ముగుస్తుందన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్, జెడ్పీటీసీ భట్టు శివాజీ నాయక్, నాయకులు మండవ వెంకటేశ్వర్లు, నంద్యాల రామిరెడ్డి, బెజవాడ వెంకటేశ్వర్లు, తాళ్లూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Advertisement