chilukuru
-
గూగుల్‌పై చిల్కూరు పూజారి రంగరాజన్ ఆగ్రహం
హైదరాబాద్, సాక్షి: చిల్కూరు బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్ ఇంటర్నెట్ సెర్చింజన్ గూగుల్‌పై మండిపడుతున్నారు. ఆలయానికి సంబంధించి గూగుల్‌లో చూపిస్తున్న తప్పుడు సమాచారంపై ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. మీడియాతో స్పందించారు.గూగుల్‌లో చిల్కూరు టెంపుల్ అని టైప్ చేస్తే.. కింద శనివారం, ఆదివారం రోజుల్లో గుడి క్లోజ్ అంటూ గూగుల్ సమాచారం చూపిస్తోంది. తిరిగి సోమవారం ఉదయం 8గం.కు తెరుచుకుంటుందని ఉంది. అయితే.. గూగుల్ చూపించే ఆ సమాచరం తప్పుడుదని రంగరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.అన్ని వేళలా ఆలయం యధావిధిగా తెరిచే ఉంటుంది. గూగుల్ మాత్రమే కాదు.. అలాంటి తప్పుడు ప్రచారం ఎక్కడ జరిగినా మేం ఖండిస్తాం అని అన్నారాయన.రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిల్కూరు బాలాజీ టెంపుల్ ఉంది. వీసా బాలాజీ టెంపుల్‌గా దీనికంటూ ఓ గుర్తింపు ఉంది. విదేశాలకు వెళ్లదల్చుకున్న వాళ్లు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. శనివారం, సెలవు రోజుల్లో, పండుగల ప్రత్యేక సందర్భాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. వారం రోజుల్లో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు భక్తులు 108 ప్రదక్షిణలు చేస్తూ కనిపిస్తుంటారు. -
బేతవోలు గ్రామాన్ని మండల కేంద్రం చెయ్యాలి
బేతవోలు గ్రామం నేటి సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలో గల మేజర్ గ్రామ పంచాయతీ. 2014లో సమగ్ర కుటుంబ సర్వేనాటికి 10,500 మంది జనాభా ఈ ఊళ్లో ఉందని తేలింది. ఏడాదికి రెండు సార్లు వరి సాగుచేస్తూ వివిధ ప్రాంతాలకు ధాన్యాన్ని ఎగుమతి చేయడంలో ప్రసిద్ధి చెందిన గ్రామం ఇది. ఈ గ్రామంలో వేల సంవత్సరాల క్రితం ఆదిమానవులు నివసించినట్లు ఆధారాలు ఉన్నాయి. మొదటి ప్రతాపరుద్రుడి (12వ శతాబ్దం) సామంత రాజు బేతిరెడ్డి పేరుమీదుగా అప్పట్లో బేతిప్రోలు అనే గ్రామం ఏర్పడింది. అదే నేటి బేతవోలుగా మారిందని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. తెలంగాణ వచ్చాక ఈ గ్రామంలో ఉన్న ‘వీర్లదేవి చెర్వు’ (పెద్ద చెర్వు) ఏడవ తరగతి సాంఘిక శాస్త్రంలో పాఠ్యాంశంగా నిలిచింది. బొమ్మగాని ధర్మభిక్షం, మల్లు స్వరాజ్యం, పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణ రెడ్డి వంటివారు ఈ గ్రామం సందర్శించి కల్లు వ్యతిరేక ఉద్యమం, నిజాం వ్యతిరేక సాయుధ పోరాటం చేశారు. అదేవిధంగా మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ బేతవోలు చురుకుగా పాల్గొంది. ఇంతటి ఘన చరిత్ర, భౌగోళిక అనుకూలతలు ఉన్న బేతవోలు గ్రామం నేటికీ మండల కేంద్రం కాలేకపోయింది. బేతవోలు కంటే భౌగోళికంగా, జనాభా పరంగా అతి చిన్న గ్రామాలు మండలాలుగా మారినప్పటికీ... ఈ గ్రామం మాత్రం ఇప్పటికీ మేజర్ గ్రామ పంచాయతీగానే మిగిలివుంది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడూ బేతవోలు మండల కేంద్రం అవుతుందనే ప్రచారం జరిగింది కానీ కార్యరూపం దాల్చలేదు. ఇందుకు కారణం గ్రామానికి అనుసంధానంగా పట్టణ రహదారులు లేవని చెబుతున్నారు. కానీ బేతవోలు... మిర్యాలగూడెం నుండి కోదాడ నియోజకవర్గానికి మారిన తర్వాత బరాఖత్ గూడెం జాతీయ రహదారి నుండి రాయినగూడెం వరకు... మిర్యాలగూడ రహదారిని కలుపుతూ బీడీ రోడ్డు వేశారు. (క్లిక్: ఇది రైతుల పాలిట వరమా... శాపమా?) బేతవోలు గ్రామానికి చుట్టుపక్కల కేవలం ఐదుకిలోమీటర్ల దూరంలోనే పది నుండి పదిహేను గ్రామాలు ఉన్నాయి. ఈ అనుకూలతలను చూపిస్తూ 2016–17లో గ్రామ ప్రజలు మండల కేంద్రంగా చేయాలని ధర్నాలు చేశారు. అధికార్లు, ఎమ్మేల్యేలకు మెమొరాండాలిచ్చారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ప్రభుత్వం ఇప్పటికైనా బేతవోలును మండల కేంద్రం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. – వరకుమార్ గుండెపంగు (‘మావూరు బేతవోలు’ నవలా రచయిత) -
చిలుకూరు ఫాంహౌస్‌లో విజయ నిర్మల అంత్యక్రియలు
-
ఘనంగా రెడ్‌ఎఫ్‌ఎం వినాయకుని నిమజ్జనం
సాక్షి,సిటీబ్యూరో: చిలుకూరు దేవస్థానం సమీపంలో 93.5 రెడ్‌ఎఫ్‌ఎం ప్రతిష్టించిన విలేజ్ వినాయకుని నిమజ్జనం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, మొయినాబాద్ ఎస్ఐ శ్రీరాములు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చదువుల దేవుడైన వినాయకుని అండతో ఈ వినాయక చవితికి చిలుకూరు సమీపంలో జీర్ణావస్థలో ఉన్న ఓ ప్రభుత్వ బడిని ఈ కార్యక్రమం ద్వారా పునరుద్ధరించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ‘సాక్షి’ మీడియా పార్ట్నర్గా వ్యవహరించిందన్నారు. సినీ ప్రముఖులు ఎన్టీఆర్, కొరటాల శివ, అవసరాల శ్రీనివాస్, విజయ్ దేవరకొండ, రెజీనా, నాని తదితరులు, ఇతర దాతలు స్వచ్ఛందంగా విరాళాలిచ్చి సహకరించారని తెలిపారు. -
రెడ్ ఎఫ్ఎంలో కింగ్ నాగ్
సాక్షి, సిటీబ్యూరో: 93.5 రెడ్ ఎఫ్ఎం ఆధ్వర్యంలో ‘విలేజ్‌లో వినాయకుడు’ అనే వినూత్న కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా దాతల నుంచి విరాళాలు స్వీకరించి... స్వచ్ఛంద సంస్థలకు అందించి... చిలుకూరు సమీపంలో ఓ బడిని పునరుద్ధరించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎన్టీఆర్, కొరటాల శివ, అవసరాల శ్రీనివాస్, విజయ్ దేవరకొండ, రెజీనా, నాని తదితర నటీనటులు ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపారన్నారు. అక్కినేని నాగార్జున ఈ కార్యక్రమానికి శుక్రవారం మద్దతు తెలిపారు. 93.5 రెడ్ ఎఫ్ఎంలో ‘విలేజ్‌లో వినాయకుడు’ గురించి విని ప్రత్యేకంగా అభినందించినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. -
రాష్ట్రస్థాయి ప్రో కబడ్డీపోటీలు ప్రారంభం
చిలుకూరు: చిలుకూరు ప్రో కబడ్డీ యూత్ ఆధ్వర్యంలో మండలకేంద్రంలో మూడు రోజుల పాటు జరిగే తెలంగాణ రాష్ట్రస్థాయి గ్రామీణ ప్రో కబడ్డీ్డ పోటీలను స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఎంపీపీ దొడ్డా నారాయణరావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించాలన్నారు. మొత్తం 80 జట్టు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాత గడ్డం శ్రీను, సర్పంచ్ సుల్తాన్ వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ నెల్లూరి నాగేశ్వరరావు, సోసైటీ వైస్ చైర్మన్ ఆవుల శ్రీను, డైరక్టర్ బెల్లంకొండ నాగయ్య, క్రీడల నిర్వాహకులు షేక్ పాషా, అమరగాని లింగరాజు, యూసఫ్, షేక్ నాగులమీరా, అమరగాని నవీన్‌లు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాల విభజన శాస్త్రీయంగా ఉండాలి
చిలుకూరు: జిల్లాల విభజన శాస్త్రీయంగా, ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని బేతవోలు లో జరిగిన సీపీఐ సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. విధివిధానాలు ఏమీ ప్రకటించకుండా అఖిలపక్ష నాయకులను పిలవడం సమంజసం కాదన్నారు. మండలంలోని అన్ని గ్రామాలను ఒకే నియోజకవర్గంలో ఉంచాలన్నారు. ఇష్టానుసారంగా విభజన చేశారని విమర్శించారు. తెలంగాణ విమోచన దినోత్సవంను ప్రభుత్వం అధికారంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాయుధ పోరాట చర్రితను ప్రజలకు తెలియజేసేందుకు సీపీఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో బస్సు యాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లాలో ఈ నెల 11వ తేదీన యాద్రాది నుంచి ప్రారంభమై ఆలేరు, తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ, చిలుకూరు మీదుగా వెళ్లి హుజూర్‌నగర్‌లో రాత్రి ముగుస్తుందన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్, జెడ్పీటీసీ భట్టు శివాజీ నాయక్, నాయకులు మండవ వెంకటేశ్వర్లు, నంద్యాల రామిరెడ్డి, బెజవాడ వెంకటేశ్వర్లు, తాళ్లూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
చిలుకూరులో భక్తుల సందడి
మెయినాబాద్: రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ దేవాలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. బాలాజీ దర్శనం కోసం పెద్దసంఖ్యలో భక్తులు ఉదయం 6 గంటల నుంచే క్యూలు కట్టారు. రద్దీ అధికంగా ఉండటంతో భక్తులను గర్భగుడిలోకి అనుమతించకుండా మహాద్వార దర్శనం ఏర్పాటు చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులు ప్రదక్షణలు చేసి స్వామిని దర్శించుకున్నారు. -
చిలుకూరులో బతుకమ్మ సంబురాలు
సోమవారం నుంచి 20వ తేదీ వరకు.. * జిల్లాస్థాయిలో కార్యక్రమాలన్నీ ఇక్కడే * చిలుకూరు మహిళా ప్రాంగణంలో పండుగ వాతావరణం సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ సంస్కృతిలో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న బతుకమ్మ పండుగకు జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఉత్సవాలకు మొయినాబాద్ మండలం చిలుకూరు వేదికగా నిర్ణయించింది. సోమవారం నుంచి పది రోజులపాటు జరిగే బతుకమ్మ సంబరాల్లో రోజుకోవిధంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టనున్నారు. 14వ తేదీన జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో చిలుకూరులోని మహిళా ప్రాంగణం (టీటీడీసీ)లో 16న వికారాబాద్‌లో జాగృతి సంస్థ ఆధ్వర్యంలో, 17న కలెక్టరేట్ ఆవరణలో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. మండల కేంద్రాల్లోనూ గతేడాది మాదిరిగా సంబరాలు నిర్వహించాల్సిందిగా కలెక్టర్ రఘునందన్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. సంబరాలు ఇలా.. 12న స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో బతుకమ్మలు, పాఠశాల, కళాశాల విద్యార్థినులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 13న బాలికా సంరక్షణ అంశంపై విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు, 14న విద్యార్థినులకు వివిధ అంశాల్లో పోటీలు, 15న మహిళా ప్రజాప్రతినిధులతో మహిళా సాధికారత ప్రదర్శన, 16న బాలికలకు రంగోలీ పోటీలు, 17న మాతాశిశు సంరక్షణ పథకాలపై ప్రదర్శనలు, 18న మహిళల ఆర్థిక స్వాలంబనపై ప్రదర్శనలు, 19న మహిళా ఉద్యోగిణులతో ఆటాపాట, 20న సాంస్కృతిక ప్రదర్శనలు, సంబరాల ముగింపు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా యంత్రాంగం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థినులకు బహుమతులు కూడా అందిస్తారు. అనంతరం 21న హైదరాబాద్‌లో జరిగి రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో జిల్లా తరఫున 100 మంది బృందం పాల్గొననుంది. -
చిలుకూరు ఆలయంలో చోరీ
నల్గొండ : నల్గొండ జిల్లా చిలుకూరు అభయాంజనేయ స్వామి ఆలయంలో దుంగడులు చోరీకి పాల్పడ్డారు. స్వామివారి వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ విషయాన్ని బుధవారం ఉదయం గమనించిన ఆలయ నిర్వహకులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా చోరీకి గురైన వెండి ఆభరణాల విలువ సుమారు రూ.లక్ష ఉంటుందని అంచనా. -
19న పల్స్‌పోలియో
చిలుకూరు, న్యూస్‌లైన్: దేశ వ్యాప్తంగా ప్రతి ఏడాది నిర్వహించే పల్స్‌పోలియో కార్యక్రమం ఆదివారం నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. ఈ పల్స్‌పోలియోను 19 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. 5ఏళ్ల లోపు పిల్లలకు పోలియో వ్యాధి సోకకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది రెండు విడతలుగా పోలియో చుక్కలు వేస్తున్నారు. అందులో భాగంగానే ఆదివారం నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో సిబ్బందికి శిక్షణ పూర్తి చేశారు. ఆదివారం ఉదయం ఏడు గంటలకు పల్స్‌పోలియో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ రోజు జిల్లాలో ఏర్పాటు చేసిన బూత్ స్థాయిలో 5ఏళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేస్తారు. అలాగే కేంద్రంలో పోలియో చుక్కలు వేయించుకోని పిల్లలకు 20,21 తేదీలలో ఇంటింటికీ తిరుగుతూ పోలియో చుక్కలు వేస్తారు. జిల్లా వ్యాప్తంగా జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది 5ఏళ్ల లోపు 3,69,905 మంది పిల్లలను గుర్తించారు. 100 శాతం పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పల్స్‌పోలియో చుక్కలు వేసేందుకు జిల్లాకు 5లక్షల వ్యాక్సిన్ డోస్‌లు వచ్చాయి. వీటిని రెండు రోజుల్లో మండలాల్లోని ఆరోగ్య కేంద్రాలకు సరఫరా చేయనున్నారు. అదనంగా 33 కేంద్రాల ఏర్పాటు ఆదివారం నిర్వహించే పల్స్‌పోలియో కార్యక్రమంలో పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు జిల్లా వ్యాప్తంగా 3004 కేంద్రాలు ఏర్పాటు చేశారు. గత ఏడాది 2971 కేంద్రాలు ఏర్పాటు చేయగా ఈ ఏడాది మరో 33 కేంద్రాలను అదనంగా పెంచారు. కార్యక్రమంలో ఆరోగ్య కేంద్రం సిబ్బంది, అంగన్ వాడీ టీచర్లు ,స్వచ్చంద్ర సేవా సంస్థలు వారు, ఉపాధ్యాయులు మొత్తం 11,884మంది సిబ్బంది పాల్గొంటున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా వైద్యాధికారి, జిల్లా అధికారులతో 6 జిల్లా కోర్ టీమ్‌లు ఏర్పాటు చేశారు. వీరు ఆ రోజు కేంద్రాలను పరిశీలిస్తారు. వీరితో పాటు జిల్లాలోని 15 క్లస్టర్ల పరిధిలో ఆయా ఎస్పీహెచ్ఓ(ప్రత్యేక వైధ్యాదికారులు)లు పరిశీలిస్తారు. అలాగే జిల్లాలోని ఆయా మండలాల్లో వైద్యాధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేసి పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయంవంతం చేసేందుకు ఏర్పాటు చేశారు. పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి : అమోస్, జిల్లా వైద్యాదికారి పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని విజయవంతం చేయాలి. ఇప్పటికే పల్స్‌పోలియోకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశాం. జిల్లాలో 5 ఏళ్ల లోపు పిల్లలు 3,69,905 మంది ఉన్నట్లుగా గుర్తించాం. వారికి పోలియో చుక్కలు వేసేందుకు సుమారుగా 12 వేల మంది సిబ్బందిని ఏర్పాటు చేశాం. పిల్లల తల్లిదండ్రులు బాద్యతగా పల్స్‌పోలియో చుక్కలు వేయించాలి. -
విద్యార్థినిని గర్భవతిని చేసిన కీచక గురువు
మందులు ఇచ్చి అబార్షన్ చేయించిన వైనం పరిస్థితి విషమించి ఆస్పత్రిలో చేరిన విద్యార్థిని చిలుకూరు, న్యూస్‌లైన్: ఆటల పేరుతో ఆ అమ్మాయిపై కన్నేశాడు. వివిధ పోటీలకు ఎంపికైందంటూ తోటి ఉపాధ్యాయులు, విద్యార్థిని తల్లిదండ్రులను నమ్మించాడు. తరచు ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లేవాడు. చివరకు గర్భవతిని చేసి, అబార్షన్ మాత్రలు మింగించాడు. దీంతో ఆమె పరిస్థితి విషమించింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా చిలుకూరు మండలం రామాపురం జిల్లా పరిషత్ పాఠశాలలో వెలుగుచూసింది. రామాపురం జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఆ విద్యార్థినికి క్రీడల్లో మంచి ప్రావీణ్యం ఉంది. పాఠశాలలో ఆటలాడించే ఓ ఉపాధ్యాయుడు ఆటల పేరుతో ఆమెకు దగ్గరయ్యాడు. మండల, డివిజన్ జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైందంటూ ఆమెను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లాడు. అదే అదనుగా ఆమెను గర్భవతిని చేశాడు. పాఠశాలకు వస్తున్న ఆ విద్యార్థిని శరీరంలో మార్పులు రావడంతో తోటి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. ఇదే క్రమంలో ఆమె 10 రోజుల నుంచి బడికి రావడం మానేసింది. శుక్రవారం పాఠశాలకు వచ్చిన ఆ ఉపాధ్యాయుడు ఆమెకు ఆరు నెలల గర్భం అని తెలుసుకని, అబార్షన్ అయ్యేందుకు మందులు వేయించాడు. కొద్దిసేపటికే అబార్షన్ కాగా ఆమె తీవ్ర అనారోగ్యం పాలైంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం కోదాడలోని ఓ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన విద్యార్థిని బంధువులు సోమవారం పాఠశాలకు చేరుకుని ప్రధానోపాధ్యాయుడిని నిలదీశారు.