ఘనంగా రెడ్‌ఎఫ్‌ఎం వినాయకుని నిమజ్జనం
ఘనంగా రెడ్‌ఎఫ్‌ఎం వినాయకుని నిమజ్జనం
Published Thu, Sep 15 2016 10:51 PM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM
సాక్షి,సిటీబ్యూరో: చిలుకూరు దేవస్థానం సమీపంలో 93.5 రెడ్‌ఎఫ్‌ఎం ప్రతిష్టించిన విలేజ్ వినాయకుని నిమజ్జనం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, మొయినాబాద్ ఎస్‌ఐ శ్రీరాములు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చదువుల దేవుడైన వినాయకుని అండతో ఈ వినాయక చవితికి చిలుకూరు సమీపంలో జీర్ణావస్థలో ఉన్న ఓ ప్రభుత్వ బడిని ఈ కార్యక్రమం ద్వారా పునరుద్ధరించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ‘సాక్షి’ మీడియా పార్ట్‌నర్‌గా వ్యవహరించిందన్నారు. సినీ ప్రముఖులు ఎన్టీఆర్, కొరటాల శివ, అవసరాల శ్రీనివాస్, విజయ్ దేవరకొండ, రెజీనా, నాని తదితరులు, ఇతర దాతలు స్వచ్ఛందంగా విరాళాలిచ్చి సహకరించారని తెలిపారు.
Advertisement
Advertisement