Red FM
-
రెడ్ ఎఫ్ఎం ‘పక్కా లోకల్’ కార్యక్రమంలో ‘తీస్మార్ఖాన్’ టీమ్ సందడి
-
RJ Malishka: ముంబై కీ రాణీ.. ఆమె స్పెషాలిటీ ఏంటంటే!
రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చెత్త కుండీలో చెత్త పేరుకుపోయి, దుర్గంధం వెలువడుతుంటే ముక్కు మూసుకుని గబగబా అక్కడి నుంచి వెళ్లిపోతాం. కానీ రేడియో జాకీ మలిష్క అలా చేయదు. ఆ చెత్తనంతటిని క్లియర్ చేసే అధికారులు వచ్చేంత వరకు దాని గురించి మాట్లాడుతూనే ఉంటుందామె. రేడియో జాకీ మలిష్క మెండన్సా ఆర్జే అయ్యిండి చెత్త గురించి మాట్లాడటం ఏంటీ? అని అంతా అనుకునేవారు. కానీ ముంబైలో పరిష్కారం కాని అనేక సమస్యలు.. సరిగా లేని రోడ్లు, వర్షంనీటితో నిండిపోయిన కాలనీలు... ఏవైనా సరే వాటి గురించి వెంటనే మలిష్క తన షోలో చెప్పేస్తుంది. అది మున్సిపల్ అధికారులకు చేరగానే వాటిని సరిచేస్తారు. కొన్నిసార్లు మలిష్క పద్ధతి అధికారులకు కోపం తెప్పించినప్పటికీ తను ఏమాత్రం వెనక్కు తగ్గదు. ఒకపక్క దేశంలోనే నంబర్ వన్ ఆర్జేగా శ్రోతల్ని అలరిస్తూ, మరోపక్క సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. దీంతో మలిష్కను సోషల్ మీడియాలో లక్షలమంది ఫాలో అవుతున్నారు. వినేకొద్ది వినాలనిపించే స్వరం, తన మాటల గారడీతో శ్రోతల్ని కట్టిపడేసే మలిష్క ముంబైలో పుట్టిపెరిగిన అమ్మాయి. పదమూడేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయింది. దీంతో ఆమె తల్లి లిల్లీ మెండన్సా అన్నీ తానై మలిష్కను పెంచారు. ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ, ముంబై యూనివర్సిటీలో మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్లో మాస్టర్స్ చేసింది మలిష్క. ముంబైకీ రాణీ చిన్నప్పటి నుంచి ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉండే మలిష్క చాలా యాక్టివ్‌గా స్టేజ్ మీద మంచి ప్రతిభ కనబరిచేది. స్కూల్లో జరిగే అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేది, భరత నాట్యం, సంగీతంలో శిక్షణ తీసుకోవడంతో.. టీచర్స్‌డే, చిల్డ్రన్స్ డేకు తప్పకుండా తన ఫెర్ఫార్మెన్స్ ఉండి తీరేది. కాలేజీ రోజుల్లో కాలేజ్ బ్యాండ్‌లో గాయనిగా రాణించింది. చదువు పూర్తయిన వెంటనే, అడ్వరై్టజింగ్ ఇండస్ట్రీలో ఉద్యోగంలో చేరింది. బాలీవుడ్ దర్శకుడు ప్రహ్లాద్ కక్కర్ దగ్గర ఇంటర్న్‌గా పనిచేసింది. ఇక్కడ కొన్నాళ్లు పనిచేశాక, మానేసి హిందీ డిస్కవరి ఛానెల్లో వాయిస్ వోవర్ ఆర్టిస్ట్ గా పనిచేసింది. ఇలా రెండేళ్లు్ల పనిచేసాక...‘‘విన్ 94.6 ఎఫ్ఎమ్’’ లో ఆర్జేగా అవకాశం వచ్చింది. దీంతో మలిష్క ఆర్జే ప్రయాణం మొదలైంది. దీనిలో రెండేళ్లు చేసిన తరువాత రెడిఫ్ రేడియోకు మారింది. ఇక్కడ కొన్ని నెలలు మాత్రమే ఉంది. తరువాత రెడ్ ఎఫ్ఎమ్లో చేరింది. ఇక్కడ తను పాల్గొనే షోలలో మాటలతో గారడీ చేస్తూ, ముంబైలోని సామాజిక అంశాలపై మాట్లాడుతూ మంచి పేరు తెచ్చుకుంది. తన షోకు వచ్చే కాలర్స్‌ను అలరిస్తూ ‘ముంబై కీ రాణి’గా బాగా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం రెడ్ ఎఫ్ఎమ్ 93.5లో ఆర్జేగా పనిచేస్తో్తంది. మలిష్క చేసిన.. మార్నింగ్ నంబర్ వన్ విత్ మలిష్క, ఎమ్ బోలే షోలు బాగా పాపులర్ అయ్యాయి. హిందీలో బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ షో గా ‘మార్నింగ్ వన్’ నిలిచి వరుసగా నాలుగేళ్లపాటు ఇండియన్ ఎక్స్‌లెన్స్ రేడియో అవార్డులను అందుకుంది. అంతేగాక ఓటీటీ అండ్ డిజిటల్ మార్కెటింగ్ అవార్డుల కార్యక్రమంలో ‘డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు మలిష్కకు దక్కింది. 2019లో తొలిసారిగా దాదాసాహేబ్ ఫాల్కే ఆర్జే అవార్డులను ప్రవేశపెట్టగా.. తొలి అవార్డుని మలిష్క అందుకుంది. ఆర్జేగానేగాక.. రేడియో జాకీగా పనిచేస్తూనే మున్నాభాయ్ ఎమ్‌బీబీఎస్, తుమారి సులులో విద్యాబాలన్ ఆర్జేగా నటించేందుకు మలిష్క శిక్షణ ఇచ్చింది. హాలీవుడ్ సినిమాలు ద ఇన్క్రెడి బుల్స్, మిరాగే, థోర్: రంగ్రూక్, స్క్రేపర్ –14 వంటి వాటికి హిందీలో డబ్బింగ్చెప్పింది. సామాజిక కార్యకర్తగా.. రాజకీయ నాయకులు, ముంబై మున్సిపల్ అథారటీ, బీఎమ్సీ కేంద్రంగా సమస్యలపై రేడియో కేంద్రంగా తన గళమెత్తడమేగాక, ప్రేమ పెళ్లిళ్ల గురించి యువతీ యువకులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించేది. ఈక్రమంలోనే సెక్స్ వర్కర్ల పిల్లలను కలవడానికి షారుఖ్ ఖాన్‌ను, చార్ బాటిల్ రాజ్ కా క్యాంపెయిన్‌కు సల్మాన్‌ఖాన్‌ను, అమితాబ్ బచన్ గార్డెన్ లో ధారావి మురికివాడల పిల్లలను ఆహ్వానించేలా కృషిచేసింది. గత పదిహేనేళ్లుగా ముంబై రెడ్ ఎఫ్ఎమ్లో సక్సెస్‌పుల్ రేడీయో జాకీగా... నంబర్‌వన్ ఆర్జేగా నిలుస్తూ ఎంతోమంది యువతీ యువకులకు ప్రేరణనిస్తోంది. -
రెడ్ ఎఫ్ఎం మాజీ ఆర్జే హత్య
త్రివేండ్రం : గత రెండు రోజులుగా జర్నలిస్టుల వరుస హత్యలతో కలకలం రేగుతున్న నేపథ్యంలో... కేరళకు చెందిన ఆర్జే, మిమిక్రీ కళాకారుడు రాజేశ్(36)ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. మదావూర్లోని తన స్టూడియో నుంచి స్నేహితునితో కలిసి బయల్దేరిన రాజేశ్ వాహనాన్ని రెడ్ కలర్ స్విప్ట్ కారులో కొందరు వ్యక్తులు వెంబండించారు. తమ వద్దనున్న పదునైన ఆయుధాలతో రాజేశ్, అతని స్నేహితునిపై దాడి చేశారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రాజేశ్, అతన్ని స్నేహితున్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా తీవ్రంగా గాయపడిన రాజేశ్ మరణించాడు. అతని స్నేహితుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. హంతకులను పట్టుకునేందుకు విచారణ ప్రారంభించామని పోలీసులు తెలిపారు. కాగా రాజేశ్ గతంలో చాలా ఏళ్ల పాటు ప్రముఖ రేడియో చానెల్ రెడ్ ఎఫ్ఎంలో ఆర్జేగా పని చేశాడు. తర్వాత దోహాలోని వాయిస్ ఆఫ్ కేరళ ఎఫ్ఎం స్టేషన్లో పని చేశాడు. ప్రస్తుతం మిమిక్రి ట్రూప్‌ను ఏర్పాటు చేసుకుని ప్రదర్శనలు ఇస్తున్న నేపథ్యంలో హత్యకు గురయ్యాడు. -
ఘనంగా రెడ్‌ఎఫ్‌ఎం వినాయకుని నిమజ్జనం
సాక్షి,సిటీబ్యూరో: చిలుకూరు దేవస్థానం సమీపంలో 93.5 రెడ్‌ఎఫ్‌ఎం ప్రతిష్టించిన విలేజ్ వినాయకుని నిమజ్జనం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, మొయినాబాద్ ఎస్ఐ శ్రీరాములు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చదువుల దేవుడైన వినాయకుని అండతో ఈ వినాయక చవితికి చిలుకూరు సమీపంలో జీర్ణావస్థలో ఉన్న ఓ ప్రభుత్వ బడిని ఈ కార్యక్రమం ద్వారా పునరుద్ధరించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ‘సాక్షి’ మీడియా పార్ట్నర్గా వ్యవహరించిందన్నారు. సినీ ప్రముఖులు ఎన్టీఆర్, కొరటాల శివ, అవసరాల శ్రీనివాస్, విజయ్ దేవరకొండ, రెజీనా, నాని తదితరులు, ఇతర దాతలు స్వచ్ఛందంగా విరాళాలిచ్చి సహకరించారని తెలిపారు. -
రెడ్ ఎఫ్ఎంలో కింగ్ నాగ్
సాక్షి, సిటీబ్యూరో: 93.5 రెడ్ ఎఫ్ఎం ఆధ్వర్యంలో ‘విలేజ్‌లో వినాయకుడు’ అనే వినూత్న కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా దాతల నుంచి విరాళాలు స్వీకరించి... స్వచ్ఛంద సంస్థలకు అందించి... చిలుకూరు సమీపంలో ఓ బడిని పునరుద్ధరించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎన్టీఆర్, కొరటాల శివ, అవసరాల శ్రీనివాస్, విజయ్ దేవరకొండ, రెజీనా, నాని తదితర నటీనటులు ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపారన్నారు. అక్కినేని నాగార్జున ఈ కార్యక్రమానికి శుక్రవారం మద్దతు తెలిపారు. 93.5 రెడ్ ఎఫ్ఎంలో ‘విలేజ్‌లో వినాయకుడు’ గురించి విని ప్రత్యేకంగా అభినందించినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. -
విలేజ్‌లో వినాయకుడు
సాక్షి, సిటీబ్యూరో: 93.5 రెడ్ ఎఫ్ఎం ‘విలేజ్‌లో వినాయకుడు’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. చిలుకూరు దేవస్థానం సమీపంలో రెడ్ ఎఫ్ఎం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి దర్శకులు అవసరాల శ్రీనివాస్, గాయనీ పర్ణికా మాన్యా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా రెడ్ ఎఫ్ఎం దాతల నుంచి విరాళాలు సేకరించి స్వచ్ఛంద సంస్థలకు అందజేసి, ఒక బడిని దత్తత తీసుకొని పునరుద్ధరిస్తుంది. ఈ వినూత్న కార్యక్రమానికి ‘సాక్షి’ మీడియా పార్టనర్‌గా వ్యవహరిస్తోంది. -
రెడ్ ఎఫ్ఎంకు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: ప్రముఖ రేడియో ఛానెల్ రెడ్ ఎఫ్ఎంకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. నాలుగో విడత రేడియో తరంగాల వేలంలో ఆ సంస్థ పాల్గొనరాదంటూ కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు తోసిపుచ్చింది. సన్నెట్ వర్క్ ఆధ్వర్యంలోని రెడ్ ఎఫ్ఎం కంపెనీలో ప్రధాన షేర్ హోల్డర్ అయిన కళానిధి మారన్‌పై పలు ఆర్థిక నేరాల అభియోగాలు ఉన్నందున తరంగాల వేలంలో రెడ్ ఎఫ్ఎంను అనుమతించబోమంటూ ఐ అండ్ బీ శాఖ గతంలో తీర్మానించింది. అయితే ఆ తీర్మానం చెల్లదన్న కోర్టు.. వేలంలో పాల్గొనేందుకు ఆ సంస్థకు గ్రీన్ సిన్నల్ ఇవ్వడంతోపాటు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో సమగ్రంగా వివరించాలని కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ జూలై 24 కు వాయిదా వేసింది. కాగా, రేడియో తరంగాల వేలం వచ్చే సోమవారం (27న) ఢిల్లీలో జరగనుంది. 2002లో ప్రారంభమై, దాదాపు పది రాష్ట్రాల్లో ఏడుకుపైగా భాషల్లో రెడ్ ఎఫ్ఎం తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. -
ఆర్జె రానా
హీరో రానా రెడ్ ఎఫ్ఎమ్ కోసం ఆర్జేగా మారారు. బంజారాహిల్స్‌లోని రేడియోస్టేషన్కు వచ్చిన ఆయన.. దృశ్యం సినిమాపై ఆర్జే కాజల్, శ్రోతలు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. బాబాయ్ వెంకటేష్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని... ఆయన తనకు బ్రదర్ లాంటివాడు కూడానన్నారు. దృశ్యం మళయాళ మాతృక బాబాయ్‌తో పాటు తాను కూడా చూశానని, చూసిన వెంటనే తప్పకుండా చేద్దామని బాబాయ్‌తో అన్నానన్నారు. ఈ సందర్భంగా శ్రోతల కోరిక మేరకు ‘కృష్ణం వందే...’లోని ఒక పద్యం ఆలపించి అలరించారు. సాక్షి, సిటీప్లస్