రెడ్‌ ఎఫ్‌ఎంలో కింగ్ నాగ్ | nagarjuna participated in radio fm programe | Sakshi
Sakshi News home page

రెడ్‌ ఎఫ్‌ఎంలో కింగ్ నాగ్

Published Fri, Sep 9 2016 9:48 PM | Last Updated on Sun, Jul 21 2019 4:48 PM

రెడ్‌ ఎఫ్‌ఎంలో కింగ్ నాగ్ - Sakshi

రెడ్‌ ఎఫ్‌ఎంలో కింగ్ నాగ్

సాక్షి, సిటీబ్యూరో: 93.5 రెడ్‌ ఎఫ్‌ఎం ఆధ్వర్యంలో ‘విలేజ్‌లో వినాయకుడు’ అనే వినూత్న కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా దాతల నుంచి విరాళాలు స్వీకరించి... స్వచ్ఛంద సంస్థలకు అందించి... చిలుకూరు సమీపంలో ఓ బడిని పునరుద్ధరించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఎన్టీఆర్, కొరటాల శివ, అవసరాల శ్రీనివాస్, విజయ్‌ దేవరకొండ, రెజీనా, నాని తదితర నటీనటులు ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపారన్నారు. అక్కినేని నాగార్జున ఈ కార్యక్రమానికి శుక్రవారం మద్దతు తెలిపారు. 93.5 రెడ్‌ ఎఫ్‌ఎంలో ‘విలేజ్‌లో వినాయకుడు’ గురించి విని ప్రత్యేకంగా అభినందించినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement