![Nagarjuna Purchases Thala Ticket On BookMyShow](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/14/nagarjuna.jpg.webp?itok=a_dFICso)
∙రాగిన్ రాజు, నాగార్జున, ‘అమ్మ’ రాజశేఖర్, శ్రీనివాస గౌడ్
‘‘తల’(Thala) చిత్రం ట్రైలర్ చాలా బాగుంది. ‘అమ్మ’ రాజశేఖర్(Amma Rajasekhar) డైరెక్షన్ చాలా ఆసక్తిగా ఉంది. ఈ సినిమాలో హీరోగా నటించిన తన కుమారుడు రాగిన్ రాజ్ పెద్ద హీరో అవుతాడనిపిస్తోంది. ఈ చిత్రం తప్పకుండా మంచి విజయం సాధించాలి. నిర్మాత శ్రీనివాస్ గౌడ్‌కు ఆల్ ది వెరీ బెస్ట్’’ అని హీరో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) అన్నారు.
‘రణం’ మూవీ ఫేమ్ ‘అమ్మ’ రాజశేఖర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘తల’. ఈ మూవీలో ఆయన తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా, అంకిత నాన్సర్ హీరోయిన్‌గా నటించారు. రోహిత్, ఎస్తేర్ నోరోన్హా, ‘సత్యం’ రాజేశ్, రాజీవ్ కనకాల, ఇంద్రజ, విజ్జీ చంద్రశేఖర్ కీలక పాత్రల్లో నటించారు. పి. శ్రీనివాస్ గౌడ్ నిర్మించారు.
‘అమ్మ’ రాజశేఖర్ వైఫ్ రాధ ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ సినిమా నేడు తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. ఈ సినిమా తొలి టికెట్‌ని అక్కినేని నాగార్జున కొనుగోలు చేసి, యూనిట్‌ని అభినందించారు. ‘‘నాగార్జునగారు ‘తల’ మొదటి టికెట్‌ను కొనడం మా సినిమా సాధించబోతోన్న పెద్ద విజయానికి చిహ్నం. మా సినిమాని థియేటర్లో చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అని ‘అమ్మ’ రాజశేఖర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment