thala 57
-
తల ట్రైలర్ బాగుంది: అక్కినేని నాగార్జున
‘‘తల’(Thala) చిత్రం ట్రైలర్ చాలా బాగుంది. ‘అమ్మ’ రాజశేఖర్(Amma Rajasekhar) డైరెక్షన్ చాలా ఆసక్తిగా ఉంది. ఈ సినిమాలో హీరోగా నటించిన తన కుమారుడు రాగిన్ రాజ్ పెద్ద హీరో అవుతాడనిపిస్తోంది. ఈ చిత్రం తప్పకుండా మంచి విజయం సాధించాలి. నిర్మాత శ్రీనివాస్ గౌడ్‌కు ఆల్ ది వెరీ బెస్ట్’’ అని హీరో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) అన్నారు.‘రణం’ మూవీ ఫేమ్ ‘అమ్మ’ రాజశేఖర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘తల’. ఈ మూవీలో ఆయన తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా, అంకిత నాన్సర్ హీరోయిన్గా నటించారు. రోహిత్, ఎస్తేర్ నోరోన్హా, ‘సత్యం’ రాజేశ్, రాజీవ్ కనకాల, ఇంద్రజ, విజ్జీ చంద్రశేఖర్ కీలక పాత్రల్లో నటించారు. పి. శ్రీనివాస్ గౌడ్ నిర్మించారు.‘అమ్మ’ రాజశేఖర్ వైఫ్ రాధ ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ సినిమా నేడు తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. ఈ సినిమా తొలి టికెట్‌ని అక్కినేని నాగార్జున కొనుగోలు చేసి, యూనిట్‌ని అభినందించారు. ‘‘నాగార్జునగారు ‘తల’ మొదటి టికెట్‌ను కొనడం మా సినిమా సాధించబోతోన్న పెద్ద విజయానికి చిహ్నం. మా సినిమాని థియేటర్లో చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అని ‘అమ్మ’ రాజశేఖర్ అన్నారు. -
అజిత్ న్యూ లుక్ అదిరిపోయింది
కొద్ది రోజులుగా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో మాత్రమే కనిపిస్తున్న కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ రూట్ మార్చాడు. తలా 57గా తెరకెక్కుతున్న సినిమాలో న్యూ లుక్‌లో దర్శనమిచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అజిత్ లేటెస్ట్ లుక్కు సంబంధించిన ఫొటోను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసిన దర్శకుడు శివ, తలా అభిమానులలో జోష్ పెంచాడు. కొంత కాలంగా తన వయసుకు తగ్గ పాత్రల్లో మాత్రమే కనిపిస్తున్న అజిత్, కొత్త సినిమాలో స్కిన్ టైట్ టీషర్ట్‌లో కండలు తిరిగిన బాడీతో కనిపిస్తున్నాడు. అంతేకాదు ఈ మధ్య వచ్చిన సినిమాలన్నింటిలో తెల్ల గడ్డంతో కనిపించిన తలా.., కొత్త సినిమాలో నీట్ షేవ్‌లో కుర్రాడిలో దర్శనమివ్వనున్నాడు. అజిత్ సరసన కాజల్ అగర్వాల్, అక్షర హాసన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబరాయ్ విలన్ గా కనిపించనున్నాడు. -
మెగాస్టార్ సినిమా కాదని.. తమిళ్లో చేస్తున్నాడు
బాలీవుడ్ యాక్టర్స్‌కు హీరో, విలన్ అన్న తేడా ఉండదు. కథలో తమ పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటే చాలు ఏ పాత్రకైనా రెడీ అయిపోతారు. అందుకే అమితాబ్, షారూఖ్, ఆమిర్ లాంటి టాప్ స్టార్లు కూడా నెగెటివ్ రోల్స్‌లో అలరించారు. తాజాగా బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కూడా రోబో సినిమా సీక్వల్ కోసం విలన్‌గా మారిపోయారు. అదే బాటలో మరో బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్, హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన క్రిష్ 3 సినిమాలో విలన్‌గా ఆకట్టుకున్నాడు. దీంతో తెలుగులో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150లో విలన్‌గా వివేక్‌ను నటించాల్సిందిగా కోరారు. కానీ అప్పట్లో చిరుకు విలన్‌గా చేసేందుకు నో చెప్పిన వివేక్ ఇప్పుడు అజిత్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమాలో విలన్‌గా నటించేందుకు అంగకీరించాడట. ఇప్పటికే అజిత్ హీరోగా వరుస సూపర్ హిట్స్ అందించిన శివ మరోసారి తలాతో కలిసి మ్యాజిక్ రిపీట్చేయాలని భావిస్తున్నాడు. ఈ కాంబినేషన్‌పై ఉన్న నమ్మకంతో పాటు జేమ్స్‌బాండ్ తరహా సినిమా కావటంతో విలన్ పాత్ర స్టైలిష్‌గా ఉండబోతోందని వివేక్ ఈ ఆఫర్‌ను ఓకె చేశాడన్న టాక్ వినిపిస్తోంది.