
అజిత్ న్యూ లుక్ అదిరిపోయింది
కొద్ది రోజులుగా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్లో మాత్రమే కనిపిస్తున్న కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ రూట్ మార్చాడు. తలా 57గా తెరకెక్కుతున్న సినిమాలో న్యూ లుక్లో దర్శనమిచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అజిత్ లేటెస్ట్ లుక్కు సంబంధించిన ఫొటోను తన సోషల్ మీడియా పేజ్లో పోస్ట్ చేసిన దర్శకుడు శివ, తలా అభిమానులలో జోష్ పెంచాడు.
కొంత కాలంగా తన వయసుకు తగ్గ పాత్రల్లో మాత్రమే కనిపిస్తున్న అజిత్, కొత్త సినిమాలో స్కిన్ టైట్ టీషర్ట్లో కండలు తిరిగిన బాడీతో కనిపిస్తున్నాడు. అంతేకాదు ఈ మధ్య వచ్చిన సినిమాలన్నింటిలో తెల్ల గడ్డంతో కనిపించిన తలా.., కొత్త సినిమాలో నీట్ షేవ్లో కుర్రాడిలో దర్శనమివ్వనున్నాడు. అజిత్ సరసన కాజల్ అగర్వాల్, అక్షర హాసన్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబరాయ్ విలన్ గా కనిపించనున్నాడు.