Amma Rajasekhar
-
'తల' సినిమా రివ్యూ
టైటిల్: తలనటీనటులు: అమ్మ రాగిన్ రాజ్, అంకిత నస్కర్, రోహిత్, ఎస్తేర్ నోరోన్హ, ముక్కు అవినాశ్, సత్యం రాజేశ్, అజయ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ, శ్రవణ్దర్శకుడు: అమ్మ రాజశేఖర్బ్యానర్: దీపా ఆర్ట్స్నిర్మాత : శ్రీనివాస గౌడ్డీఓపీ: శ్యామ్ కె నాయుడుమ్యూజిక్ డైరెక్టర్: ధర్మ తేజ, అస్లాం కేఈఆర్ట్ డైరెక్టర్: రామకృష్ణడ్యాన్స్ కొరియోగ్రాఫర్స్: అమ్మ రాజశేఖర్ఎడిటర్ : శివ సామిప్రముఖ దర్శక కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ (Amma Rajasekhar) డైరెక్షన్లో ఆయన కుమారుడు అమ్మ రాగిన్ రాజ్ (Raagin Raj) హీరోగా నటించిన చిత్రం తల. అంకిత నస్కర్ హీరోయిన్గా యాక్ట్ చేసింది. రోహిత్, ఎస్తర్ నోరోన్హా, సత్యం రాజేష్, అజయ్, ముక్కు అవినాష్, రాజీవ్ కనకాల, ఇంద్రజ తదితరులు కీలకపాత్రలో నటించారు. వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన తల సినిమా (Thala Movie Review) ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం..కథహీరో రాగిన్ రాజ్ తల్లి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది. ఆమె కోరిక మేరకు హీరో తండ్రి కోసం వెతుక్కుంటూ వెళ్తాడు. ఈ క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిని దాటుకుని తండ్రిని కలుస్తాడు. తండ్రిని కలిసిన తర్వాత ఏం జరుగుతుంది? తండ్రి కుటుంబంలోని సమస్య ఏంటి? ఆ సమస్యను వారు ఎలా పరిష్కరిస్తారు? తనకు పరిచయమైన అమ్మాయి చివరిగా హీరోకు ఏమవుతుంది? అసలు హీరో తల్లిదండ్రులు కలుస్తారా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే!ఎవరెలా నటించారంటే?అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్‌కు ఇదే ఫస్ట్ సినిమా అయినప్పటికీ ఎలాంటి బెరుకు లేకుండా నటించాడు. ప్రతి సీన్, ప్రతి ఎమోషన్ ఎంతో స్పష్టంగా చూపించాడు. అయితే తన వయసుకు మించిన యాక్షన్ సీన్స్ చేసినట్లు అనిపిస్తుంది. హీరోయిన్ అంకిత బాగా నటించింది. చాలాకాలం తర్వాత తెరపైకి వచ్చిన రోహిత్.. హీరో తండ్రి పాత్రకు ప్రాణం పోశారు. ఎప్పుడూ గ్లామర్‌గా కనిపించే ఎస్తర్ నోరోన్హా ఈ చిత్రంలో తల్లి సెంటిమెంట్‌తో ఎమోషన్ పండించింది. మిగతావారందరూ తమ పాత్రల పరిధి మేర నటించారు.సాంకేతిక విశ్లేషణఈ చిత్రానికి కథ ప్రాణమని చెప్పుకోవాలి. ట్రైలర్లో చెప్పినట్లుగా అమ్మాయి కోసం ప్రాణాలు ఇస్తున్న ఈ జనరేషన్లో అమ్మకోసం కష్టపడే కొడుకు కథగా దీన్ని చెప్పుకోవచ్చు. ఈ కథను తెరపైకి తీసుకువెళ్లడంలో దర్శకుడిగా అమ్మ రాజశేఖర్ సక్సెస్ అయ్యాడు. కాకపోతే అక్కడక్కడా కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. కొన్నిచోట్ల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అంతగా ఆకట్టుకోదు. ఉత్తర ప్రదేశ్ లోని రియల్ లొకేషన్స్‌లో ఈ సినిమా తీశారు. ఎడిటింగ్, నిర్మాణ విలువలు బాగున్నాయి. హింస ఎక్కువగా ఉంది.చదవండి: క్షమాపణ చెబితే సరిపోతుందా?.. హీరోయిన్ అనన్య నాగళ్ల ఫైర్ -
తల ట్రైలర్ బాగుంది: అక్కినేని నాగార్జున
‘‘తల’(Thala) చిత్రం ట్రైలర్ చాలా బాగుంది. ‘అమ్మ’ రాజశేఖర్(Amma Rajasekhar) డైరెక్షన్ చాలా ఆసక్తిగా ఉంది. ఈ సినిమాలో హీరోగా నటించిన తన కుమారుడు రాగిన్ రాజ్ పెద్ద హీరో అవుతాడనిపిస్తోంది. ఈ చిత్రం తప్పకుండా మంచి విజయం సాధించాలి. నిర్మాత శ్రీనివాస్ గౌడ్‌కు ఆల్ ది వెరీ బెస్ట్’’ అని హీరో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) అన్నారు.‘రణం’ మూవీ ఫేమ్ ‘అమ్మ’ రాజశేఖర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘తల’. ఈ మూవీలో ఆయన తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా, అంకిత నాన్సర్ హీరోయిన్గా నటించారు. రోహిత్, ఎస్తేర్ నోరోన్హా, ‘సత్యం’ రాజేశ్, రాజీవ్ కనకాల, ఇంద్రజ, విజ్జీ చంద్రశేఖర్ కీలక పాత్రల్లో నటించారు. పి. శ్రీనివాస్ గౌడ్ నిర్మించారు.‘అమ్మ’ రాజశేఖర్ వైఫ్ రాధ ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ సినిమా నేడు తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. ఈ సినిమా తొలి టికెట్‌ని అక్కినేని నాగార్జున కొనుగోలు చేసి, యూనిట్‌ని అభినందించారు. ‘‘నాగార్జునగారు ‘తల’ మొదటి టికెట్‌ను కొనడం మా సినిమా సాధించబోతోన్న పెద్ద విజయానికి చిహ్నం. మా సినిమాని థియేటర్లో చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అని ‘అమ్మ’ రాజశేఖర్ అన్నారు. -
ప్రీరిలీజ్ ఈవెంట్లో కుప్పకూలిన డైరెక్టర్..ఏమైంది?
ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు అమ్మ రాజశేఖర్(Amma Rajasekhar ) దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘తల’. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగింది. అయితే ఈవెంట్‌కి వచ్చిన అమ్మ రాజశేఖర్ సడెన్‌గా కిందపడిపోవడంతో కాసేపటి వరకు అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. సడెన్ గా కింద పడిపోవడంతో డెరెక్టర్ అమ్మ రాజశేఖర్ ఏమయ్యిందని స్టేజిపై ఉన్నవారిలో ఆందోళన మొదలయ్యింది. కాసేపటికి ఆయన తిరిగి స్పృహలోకి వచ్చి, కాసేపు క్రింద అలాగే కూర్చుండిపోయారు. మంచి నీళ్లు తాగి కొద్ది సేపు రెస్ట్ తీసుకుని రిలీఫ్ అయ్యారు. హైబీపీ కారణంగానే అమ్మ రాజశేఖర్ కింద పడిపోయినట్లు తెలుస్తోంది. కాసేపటికే కోలుకొని స్టేజ్ మీదకు రావడంతో టీమ్ అంతా ఊపిరి పీల్చుకుంది.అనంతరం తల సినిమా గురించి మాట్లాడుతూ.. మూడు నాలుగు నెలలుగా స్ట్రెస్ గా ఉన్నాను. అయినా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది నాకు ఛాలెంజింగ్ మూవీ. లైఫ్ లో చాలా స్ట్రగుల్ చూశాను. ఆ టైమ్ లో అమ్మ రాజశేఖర్ కు ఏమైంది అన్ని ప్రశ్నించిన అందరికీ ఈ మూవీతో సమాధానం చెబుతాను. నాలాగే నా కొడుకు రాగిన్ రాజ్ ను కూడా ఆశీర్వదించాలి. హిట్ తరవాత అందరి గురించి మాట్లాడతాను. శ్రీనివాస్ గౌడ్ గారి చేసిన సపోర్ట్ లైఫ్ లాంగ్ మర్చిపోను. మీ లాంటి మంచి వారి కోసమైనా ఈ సినిమా హిట్ కావాలి. 14న విడుదలవుతోన్న తల చిత్రాన్ని మీరంతా చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.." అన్నారు.హీరో రాగిన్ రాజ్ మాట్లాడుతూ.. "తల కథ మా నాన్న(అమ్మ రాజశేఖర్) నాకు రెండేళ్ల క్రితం చెప్పారు. ఆ కథ నుంచి మీ ముందు కొత్త యాక్టర్ గా పరిచయం అవుతున్నాను. నాకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలి.ఈ సినిమా కోసం మేమంతా చాలా కష్టపడ్డాం. 14న ఈ చిత్రాన్ని అందరూ చూడండి. ఈ మూవీకి మా నాన్న స్ట్రాంగ్ పిల్లర్ గా ఉన్నారు. నేను కొత్తవాడిని అని అందరూ నాకు చాలా నేర్పించారు. యాక్షన్ సీక్వెన్స్ లలో చాలా దెబ్బలు తగిలాయి.ఈ కథ చూస్తే నా వయసు 18యేళ్లు. ఆ వయసు అబ్బాయి అమ్మ సెంటిమెంట్ తో ఏ లెవల్ కు వెళతాడు అనేది మెయిన్ ప్లాట్. దీంతో పాటు యాక్షన్, రొమాన్స్ అన్ని అంశాలూ ఉన్నాయి. అందరూ ఈ చిత్రాన్ని చూస్తే అమ్మ రాజశేఖర్ ఈజ్ బ్యాక్ అంటారు.." అన్నాడు. -
అమ్మ రాజశేఖర్ ‘తల’ మూవీ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
‘తల’ కోసం రెండేళ్లు ఆలోచించా: అమ్మ రాజశేఖర్
అమ్మ ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల కొన్నాళ్లు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నాను. దీంతో అంతా అమ్మ రాజశేఖర్(Amma Rajasekhar ) పని అయిపోయిందని అన్నారు. కానీ నేను మళ్లీ వచ్చాను. ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను. వరుసగా సినిమాలు తీస్తూనే ఉంటాను. ప్రస్తుతం ‘తల’ అనే సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. త్వరలోనే చెయ్యితో, కాలితో అన్నింటితోనూ వస్తా(నవ్వుతూ). మిమ్మల్ని అలరిస్తూనే ఉంటాను’ అన్నాడు ప్రముఖ దర్శకుడు అమ్మ రాజశేఖర్. ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ‘తల’(thala Movie). ఈ చిత్రంలో ఆయన తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా నటించాడు. అంకిత నాన్సర్ హీరోన్. రోహిత్, ఎస్తేర్ నోరోన్హా, సత్యం రాజేష్, ముక్కు అవినాశ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ..నా కొడుకుతో సినిమా చేయాలనేది చిన్నప్పటి నుంచి నా కోరిక. ఓ సందర్భంలో స్టేజ్‌పై మా అబ్బాయిని హీరోగా పెట్టి సినిమా చేస్తానని చెప్పాను. అప్పటి నుంచి నిద్ర లేదు. అబ్బాయికి సంబంధించిన కథ కావాలి. మంచి కథ కావాలి. నాకంత ఓపిక లేదు. రియల్ లైఫ్ లో లవ్ ప్రపోజ్ చేసి నెక్స్ట్ డే పెళ్లి చేసుకున్న కథ కాకుండా ఏం చేయాలని ఆలోచించి మాస్ తీయాలనుకున్నా, అబ్బాయితో ఎలా చేయాలని రెండేళ్లు ఆలోచించి ఒక పాయింట్, దానికి ఒక కొత్త పాయింట్ తీసుకున్నా, కొత్తదనం కావాలనుకునే వాడు సినిమా ఆనందంగా చూడవచ్చు’ అన్నారు.నటుడు సోహైల్ మాట్లాదుతూ.. తల ఎవరిదో తెలియదు కానీ ముందు మోషన్ టీజర్ పంపారు. అమ్మ రాజశేఖర్ నాకు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ నుంచి తెలుసు. తరువాత బిగ్‌బాస్ తో కలిశాం నిజంగానే అమ్మ రాజశేఖర్ పేరుకు తగ్గట్టే అందరికీ వండి పెట్టేవాడు. తినకున్నా అడిగి మరీ పుడ్ వండి పెట్టేవారు. తను కింద కూర్చొని భోజనం చేస్తాడు. ఇప్పటికీ అదే మెయిన్టైన్ చేస్తారు. రణం సినిమా తర్వాత ఈ మూవీ కంబ్యాక్ గా అనిపిస్తోంది. తల టీజర్ చూడగానే అమ్మ రాజశేఖర్ బ్యాక్ అనిపించింది. రాగిన్ నెక్ట్స్ ధనుష్ అవుతాడు ఇండస్ట్రీకి" అన్నారు.హీరో అశ్విన్ మాట్లాడుతూ. "తల ట్రైలర్ చూశాను. ఎక్స్ట్రార్డినరీగా ఉంది. రాగిన్ అదృష్టవంతుడు. నాన్న దర్శకుడు, అమ్మ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, అక్క ఏడీ. ముగ్గురి చేతుల మీదుగా సినిమా లాంచ్ అవడం లక్కీ. విజువల్స్, కంటెంట్ తక్కువ బడ్జెట్లో అద్భుతంగా చేశారు. ఆర్ఆర్ చాల బాగుంది. అస్లాం సౌండ్ వినిపిస్తోంది. దీపా ఆర్ట్స్ హ్యాండ్ పడితే ఆటోమేటిక్‌గా సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కరికీ బిగ్ కంగ్రాట్స్, తల మూవీని ఆదరించండి" అన్నాడు.నటుడు సత్యం రాజేష్ మాట్లాడుతూ.. రాగిన్ రాజ్ నాకు చిన్నప్పటి నుంచి తెలును. అమ్మ రాజశేఖర్ ఫస్ట్ సినిమా రణం చేస్తున్నప్పుడు నుంచి వేషం ఉందని చెప్పారు. ఆ సినిమాలో వేషం ఇవ్వలేదు. అదే అడిగితే నెక్స్ట్ సినిమా అన్నారు. రెండు సినిమాల తర్వాత అవకాశం ఇచ్చారు. ఒకసారి అనుకోకుండా మేం కలిశాం. ఉదయం నుంచి సాయంత్రం వరకూ చెన్నై మొత్తం తిప్పి చూపించారు. రాగిన్ పుట్టినరోజుకి వెళ్లాను. ఆ తరువాత నాకు ఫోన్ చేసి మా అబ్బాయి హీరో అంటే నేను ముసలి అవుతున్నట్టు అనిపించింది. హీరోకి ఉండాల్సిన లక్షణాన్నీ ఉన్నాయి. తల వైలెంట్ వాలెంటైన్స్ డే నాడు విడుదలవుతుంది. అందరూ చూడండి' అన్నాడు.హీరో అమ్మ రాగిణ్ రాజ్ మాట్లాడుతూ... మూవీలో అంతా చాలా కష్టపడ్డారు. వారందరికి ధన్యవాదాలు చెబుతున్నాను. క్లైమేట్ చేంజెస్ కారణంగా బాగా ఇబ్బంది పడ్డాం. మా అమ్మ, నాన్న ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. సహాయం చేశారు. శ్రీనివాస్ గౌడ్ గారు ఈ సినిమాను నిర్మించినంచుకు ధన్యవాదాలు. మీ డబ్బులకు ఈ మూవీ న్యాయం చేస్తుంది. ఫిబ్రవరి 14న తప్పక చూడండి వైలెంట్ వాలెంటైన్స్ థాంక్యూ" అన్నారు. -
నాకు తల చాలా ముఖ్యం
‘‘మన శరీరానికి తల ఎంత ముఖ్యమో... నాకు ఈ ‘తల’ సినిమా కూడా అంతే ముఖ్యం. డ్యాన్స్ మాస్టర్‌గా నాకు తొలి అవకాశం ఇచ్చిన ఆర్బీ చౌదరిగారిని నేను దేవుడిలా భావిస్తాను. ఆయన నిర్మాణంలో మా అబ్బాయి అమ్మ రాగిన్ రాజ్‌ని హీరోగా పరిచయం చేస్తుండటం హ్యాపీగా ఉంది’’ అని డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ తెలిపారు. అమ్మ రాగిన్ రాజ్ హీరోగా నటించిన చిత్రం ‘తల’. అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించారు. ఆర్బీ చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, వాకాడ అంజన్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా టీజర్ విడుదల వేడుకలో అమ్మ రాగిన్ రాజ్ మాట్లాడుతూ– ‘‘నేను హీరోగా ఎలా ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటారో అలానే ఉంటాను. ఆడియన్స్ తప్పకుండా ఆశ్చర్యపోయేలా ఈ సినిమా ఉంటుంది’’ అని తెలిపారు. ఎస్తేర్ మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకు నేను చేసిన పాత్రలకు భిన్నంగా ‘తల’లో నా పాత్ర ఉంటుంది’’ అని చె΄్పారు. -
జేడీ చక్రవర్తి నమ్మకద్రోహం చేశాడు: అమ్మ రాజశేఖర్
కొరియోగ్రాఫర్‌గా, దర్శకుడిగా తనకంటూ గుర్తింపు సంపాదించుకున్నాడు అమ్మ రాజశేఖర్. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జేడీ చక్రవర్తితో ఉన్న గొడవను బయటపెట్టాడు. 'నాకు అర్జున్ సర్ గురువు. తర్వాత నాకు సపోర్ట్ చేసిన వ్యక్తి జేడీ చక్రవర్తి. జేడీ, నేను కలిసి సినిమా తీద్దామనుకున్నాం. ఉగ్రం కథ ఫైనల్ కాగానే జేడీకి రూ.4 లక్షలు ముట్టజెప్పా. జేడీ సినిమా మధ్యలో ఇన్వాల్వ్ అవుతారని కొందరంటుంటే వెళ్లి అడిగేశా. మీరున్నారుగా మాస్టర్, నేను మధ్యలో జోక్యం చేసుకోను అని హామీ ఇచ్చాడు. సినిమా అంతా అనుకున్నట్లుగా పూర్తయింది. నిర్మాత నక్షత్ర మంచి వ్యక్తి. అతడికో ఫ్రెండ్ ఖాసిం ఉండేవాడు. అతడు జేడీకి వీరాభిమానిని అంటూ చేతిపై జేడీ అని పచ్చబొట్టు వేయించుకున్నాడు. వాడేదో కామెడీ చేస్తున్నాడనుకున్నాను. వాడు చేసేది ఓవరాక్షన్ అని జేడీ చూసుకోలేదు. తీరా 'ఉగ్రం' సినిమాకు రూ.60 లక్షల బిజినెస్ జరిగింది. నిర్మాత నక్షత్ర దిల్‌రాజులా ఫీలయ్యాడు. నాకు మాత్రం షేర్ ఇవ్వలేదు. మోసం చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అసలు డబ్బులు వచ్చిన సంగతి కూడా నాకు చెప్పలేదు. నిజానికి వచ్చినదాంట్లో సగం ఇవ్వాలనేది అగ్రిమెంట్. సరే సగం ఇవ్వకపోయినా కనీసం వచ్చినదాంట్లో నుంచి ఎంతో కొంతైనా ఇవ్వమని అడిగాను. చివరాఖరికి రూ.50 వేలు పడేశారు. చాలా బాధపడ్డాను. సినిమా ఫస్ట్ కాపీ వచ్చాక జేడీ దాంట్లో తలదూర్చాడు. అది మార్చి, ఇది మార్చి నాశనం చేశాడు. నా సినిమాను నా అనుమతి లేకుండా ఎలా మారుస్తారు. జేడీని గురువులా భావిస్తాను కాబట్టి సైలెంట్‌గా ఉండిపోయాను. ఓసారి అమ్మను హాస్పిటల్లో జాయిన్ చేశాం. చాలా సీరియస్‌గా ఉంది. నా డబ్బు నాకు ఇచ్చేయమని అడిగాను. అమ్మ హాస్పిటల్లో ఉంది, నాకు రూ.5 లక్షలు ఇవ్వమన్నా. అన్ని హక్కులు ఇచ్చేస్తాను కనీసం లక్ష రూపాయలు ఇవ్వురా అని అడిగినా ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఆయన నాకు నమ్మకద్రోహం చేశాడు. వాళ్లు నన్నేదో చేశామని అనుకుంటున్నారు. కానీ వాళ్ల జీవితాలను వాళ్లే నాశనం చేసుకుంటున్నారు. నన్ను నమ్మి ఉంటే వాళ్లకు పెద్ద హిట్ వచ్చేది' అని చెప్పుకొచ్చాడు అమ్మ రాజశేఖర్. చదవండి: స్టార్ హీరోల సినిమాలకు పెద్ద షాకే ఇది.. హోంటూర్ వీడియోను షేర్ చేసిన యాంకర్ శ్యామల -
నితిన్‌కు అసలు డ్యాన్సే రాదు: అమ్మ రాజశేఖర్
Amma Rajasekhar Fires On Nithin And Get Emotional: హిట్ ప్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో నితిన్. ప్రస్తుతం నితిన్ నటించిన తాజా చిత్రం 'మాచర్ల నియోజకవర్గం' విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన రారా రెడ్డి అనే పాట యూట్యూబ్‌లో వైరల్ అయింది. ఈ పాటలో నితిన్ అద్భుతంగా డ్యాన్స్ చేశాడని ప్రశంసలు కూడా దక్కుతున్నాయి. అయితే ఇలాంటి తరుణంలో నితిన్‌కు డ్యాన్సే రాదని ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ ఫైర్ అయ్యారు. నితిన్ మాటిచ్చి హ్యాండిచ్చాడని, అది తనకు అవమానకరంగా ఉందని స్టేజ్‌పైనే ఎమోషనల్‌కు గురయ్యాడు. విషయంలోకి వెళితే.. అమ్మ రాజశేఖర్ డైరెక్షన్లో తెరకెక్కిన తాజా చిత్రం 'హై ఫైవ్'. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం (జులై 10) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నితిన్ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సినట్లు తెలుస్తోంది. అయితే పలు వ్యక్తిగత కారణాలతో నితిన్ హాజరు కానట్లు సమాచారం. దీంతో ఆగ్రహానికి లోనైన అమ్మ రాజశేఖర్.. పది రోజుల క్రితమే నితిన్‌ను ఈ ప్రోగ్రామ్‌కు రావాల్సిందిగా ఆహ్వానించా. ఆయన వస్తానని మాట కూడా ఇచ్చారు. ఆ మాట నమ్మి.. అన్నం కూడా తినకుండా కష్టపడి నితిన్ కోసం ప్రత్యేకంగా ఏవీ క్రియేట్ చేయించా. నితిన్‌కు అసలు డ్యాన్సే రాదు. ఆయనకు డ్యాన్స్ నేర్పించి, ఓ గుర్తింపు వచ్చేలా చేసిన గురువులాంటి నాపై గౌరవంతో వస్తారని భావించా. చదవండి: 36 ఏళ్ల క్రితం సినిమాలకు సీక్వెల్.. హీరోలకు కమ్‌బ్యాక్ హిట్.. యాదృచ్ఛికమా! కానీ, ఆయన ఇంట్లో ఉండి కూడా ఇక్కడికి రాలేదు. ఫోన్ చేస్తే జ్వరమని చెప్పాడు. దానికి నేను వీడియో బైట్ అయినా పంపమని కోరాను. అది కూడా ఇవ్వలేదు. నితిన్‌కే కాదు హీరోలందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, జీవితంలో మనం ఏ స్థాయికి వెళ్లినా.. అందుకు సహాయపడినవారిని ఎప్పటికీ మర్చిపోకూడదు. నితిన్.. నువ్ రాలేను అనుకుంటే రానని నేరుగా చెప్పేయాల్సింది. వస్తానని చెప్పి రాకుండా నన్ను ఎంతో అవమానించారు. నాకెంతో బాధగా ఉంది. అని అమ్మరాజేశేఖర్ ఎమోషనల్ అయ్యారు. కాగా నితిన్ నటించిన 'టక్కరి' మూవీకి అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. చదవండి: నా భర్త నేను ఎప్పుడో ఓసారి కలుసుకుంటాం: స్టార్ హీరోయిన్ -
హీరోగా బిగ్‌బాస్ ఫేం అమ్మ రాజశేఖర్
ఇమ్మార్టెల్, అమ్మ రాజశేఖర్, అలీషా, షాలిని హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఎస్.ఎస్.డి’ (స్టోరీ, స్క్రీన్‌ప్లే, డెరైక్టర్). కట్ల రాజేంద్రప్రసాద్ దర్శకత్వంలో ఈడీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తొలి సీన్‌కి నటి–దర్శకురాలు జీవిత, నటుడు రాజశేఖర్‌లు కెమెరా స్విచాన్ చేయగా, ‘పసుర’ గ్రూప్ ఆఫ్ కంపెనీల యం.డి. ప్రశాంత్ కుమార్ క్లాప్ కొట్టారు. నిర్మాతలు రామసత్యనారాయణ, సాయి వెంకట్ గౌరవ దర్శకత్వం వహించారు. కట్ల రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘సినిమా ఇండస్ట్రీలోని వారి మనస్తత్వాలు, వారి జీవన విధానం, వారి జీవితంలో ఉండే కష్టాలు వంటి వాస్తవ ఘటనల నేపథ్యంలో చిత్రకథ సాగుతుంది’’ అన్నారు. ‘‘ఫుల్‌గా నవ్వుకునే ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమిది’’ అన్నారు ఈడీ ప్రసాద్. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి, కెమెరామేన్ గోవర్ధన్ మాట్లాడారు. -
దివి నన్ను కాపాడిన దేవత, హౌస్‌లో అభి దండగ
బిగ్‌బాస్ నాల్గో సీజన్లో ఎప్పుడో వెళ్లిపోవాల్సిన కంటెస్టెంటు అమ్మ రాజశేఖర్. అదృష్టం బాగుండి, బిగ్‌బాస్ టీమ్ కాపాడటం వల్ల కొన్నివారాలు ఎలిమినేషన్ నుంచి తప్పించుకోగలిగాడు. కానీ ఆయనను బయటకు పంపించేందుకు ప్రేక్షకులు కాచుకుని కూర్చున్నారు. తీరా నామినేషన్లోకి వచ్చాడు. వేటు వేశారు. వెళ్లిపోయారు. అయితే అఖిల్ చెప్పినట్లు అమ్మ రాజశేఖర్ తనకు నచ్చినవాళ్లతో బాగా మాట్లాడతారు. నచ్చకపోతే ఎదుటివాళ్లను మాట్లాడనిచ్చేవారే కాదు. తాజాగా ఆయన బిగ్‌బాస్ బజ్‌లో రాహుల్ సిప్లిగంజ్ దగ్గర ఇంటిసభ్యుల గురించి తన అభిప్రాయాలను వెల్లడించాడు.తన ఎంటర్టైన్మెంట్కు నవ్వుతూనే, అందులో తప్పులు వెతుకుతూ నామినేట్ చేస్తారని చెప్పుకొచ్చారు. (చదవండి: ప్యాంటులో మాస్క్ పెట్టుకుంటావా?: సల్మాన్ ఫైర్) లాస్య సింపథీ గేమ్ ఆడుతోంది "అభిజిత్‌ను చూసి చాలామంది పని చేయకుండా బద్ధకస్తులవుతున్నారు. అతడు పొద్దున డ్యాన్స్ చేయడు, గేమ్ ఆడడు, టాస్క్‌ను మధ్యలో ఆపేస్తాడు. అసలు బిగ్‌బాస్‌కు అభిజిత్ సూట్ కాడు. ఇక అఖిల్‌కు యాటిట్యూడ్ ఎక్కువ. అరియానా ముక్కుసూటిగా మాట్లాడుతుంది. కానీ, టాస్కులో మాత్రం రఫ్ఫాడిస్తుంది. దేవి నాగవల్లి ప్రతీది నెగెటివ్‌గా ఆలోచిస్తుంది. దివి.. నేను జనాల్లో బ్యాడ్ అవకుండా కాపాడింది. ఆమెకు నేను దిండు పెట్టిన గొడవలో ఆమె నావైపు నిల్చుని దేవతలా కాపాడింది. అప్పటి నుంచి ఆమె నా బెస్ట్ ఫ్రెండ్. గంగవ్వ.. నేను ఏడుస్తుంటే చీర కొంగుతో కన్నీళ్లు తుడిచింది. నేను వెళ్లిపోతే బిగ్‌బాస్ షోనే ఉండదు అంటూ ఓదార్చింది. హారిక.. ఇంగ్లీషులో మాట్లాడేవాళ్లతో ఉంటుంది. లాస్యకు ఆమె ముఖంలో ఉన్న క్లారిటీ లోపల ఉండదు. ఆమె నవ్వుకు ఏదో ఒక అర్థం ఉంటుంది. సింపథీ గేమ్ ఆడుతోంది. మెహబూబ్‌ను చూస్తే చిన్నప్పుడు నన్ను నేను చూసుకున్నట్లు ఉంటుంది. ఫైర్ ఉంది కానీ తెలివి లేదు. మోనాల్.. ఏం చేస్తుందో ఆమెకే అర్థం కాదు. చిన్నవాటికి ఎమోషనల్ అయిపోతుంది" (చదవండి: బిగ్‌బాస్: కెప్టెన్‌గా మాస్టర్, మరి ఎలిమినేషన్?) నోయల్ ఫేక్, ఎనిమది వారాలు నటించాడు "నోయల్.. ఫేక్ కంటెస్టెంటు. నిజానికి నోయల్ కోసమే బిగ్‌బాస్‌కు వచ్చాను. మొదట జాలీగా ఉన్నాం. తర్వాత అతడికి కాళ్లనొప్పి రావడంతో గేమ్ ఆడలేకపోయాడు. తర్వాత ఫాదర్, ఆ తర్వాత గురూజీ అయిపోయాడు. అతడికి హగ్గింగ్ డాక్టర్ అని పేరు కూడా పెట్టాను. కానీ అతడి క్యారెక్టర్ చివర్లో బ్లాస్ట్ అయింది. అంటే హౌస్‌లో ఎనిమిది వారాలు నటించాడంటే ఆస్కారు అవార్డు ఇవ్వాల్సిందే. సోహైల్‌కు కోపమెక్కువ. అందరితో బాగుండాలని తాపత్రయపడతాడు. అవినాష్.. నాలాగే ఎంటర్టైన్ చేస్తాడు. నోయల్ అతడిని చిల్లర కామెడీ అనడం చాలా తప్పు" అని విమర్శించాడు. దీంతో రాహుల్ మధ్యలో కలగజేసుకుని నోయల్ ఆ మాట మిమ్మల్ని అన్నాడు కానీ అవినాష్‌ను కాదని వెనకేసుకొచ్చాడు. అయితే మాస్టర్ మాత్రం అతడు ఎవరి పేరూ చెప్పలేదని, ఇద్దరికీ వేలు చూపించాడని చెప్పుకొచ్చాడు. ఇక తనకు స్విచ్ అయ్యే అవకాశం వస్తే.. అభిని బయటకు పంపించి తాను లోపలికి వెళ్తానని పేర్కొన్నాడు. తన వల్ల కనీసం టీఆర్పీ అయినా పెరుగుతుందని, వాడి వల్ల ఏదీ అవదని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పాడు. -
మాస్టర్ అవుట్: మెహబూబ్‌కు కెప్టెన్సీ, కానీ!
ఈసారి ప్రేక్షకుల అంచనా మిస్సవలేదు. తన చేష్టలతో ఇంటి సభ్యులను బెంబేలెత్తించిన అమ్మ రాజశేఖర్ బిగ్‌బాస్ హౌస్ నుంచి తొమ్మిదో వారం ఎలిమినేట్ అయ్యాడు. మరోవైపు సుమ స్పెషల్ గెస్ట్‌గా రావడంతో శనివారం రావాల్సిన దీపావళి వారం రోజుల ముందే వచ్చినట్లైంది. స్టేజీ పైకి వస్తూనే నవ్వుల బాణాలను వదిలింది. అందరినీ ఇరిటేట్ చేసే అరియానాను ఇమిటేట్ చేస్తూ, ప్రతి ఒక్కరి మీదా జోకులు పేల్చే అవినాష్ మీద కామెడీ చేస్తూ కంటెస్టెంట్లను మారు మాట్లాడనీయకుండా చేసింది. మరి నేటి ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో తెలుసుకోవాలనుందా? అయితే వెంటనే ఈ స్టోరీ చదివేసేయండి.. అఖిల్‌కు మోనాల్ చాక్లెట్లు, మరి ఆమెకు? దీపావళి సందర్భంగా ఇంటిసభ్యులకు బహుమతులు వచ్చాయని, వాటిని అందుకోవాలంటే కొన్ని చాలెంజ్‌లు పూర్తి చేయాలని నాగార్జున తెలిపారు. మొదట సోహైల్ కోసం మెహబూబ్ నేల మీద బౌల్లో ఉన్న బిస్కెట్లను చేయితో పట్టుకోకుండా తినేశాడు. దీంతో సోహైల్‌కు తను పంపిన బ్రేస్లెట్ గిఫ్ట్‌ను మెహబూబ్ తొడిగాడు. తర్వాత అఖిల్ కోసం అభిజిత్.. తల మీద బుట్టలో బంతులు వేసే ఆట ఆడాడు. దీంతో అఖిల్ గిఫ్ట్ ఓపెన్ చేయగా మోనాల్ పంపించిన చాక్లెట్లు కనిపించాయి. అనంతరం అభిజిత్ కోసం అఖిల్ సోడాబుడ్డి కళ్ళద్దాలు పెట్టుకుని బంతులు వేరు చేసే గేమ్ ఆడాడు. కానీ విఫలమయ్యాడు. దీంతో అభికి వచ్చిన గిఫ్ట్ వెనక్కు వెళ్లిపోయింది. (చదవండి: మోనాల్ మాత్రం కోడలిగా రాదు: అఖిల్ తల్లి) మాస్టర్‌కు, మోనాల్‌కు గిఫ్టులు పంపిన నాగ్ లాస్య కోసం హారిక నడుముకు టిష్యూ బాక్స్ కట్టుకుని గెంతుతూ, అందులో నుంచి 20 బంతులు బయట పడేలా చేయాల్సి ఉంటుంది. కానీ ఓడిపోవడంతో లాస్య బహుమతి పోగొట్టుకుంది.. మెహబూబ్ కోసం అవినాష్, అమ్మ రాజశేఖర్ జడ వేయించుకున్నారు. దీంతో మెహబూబ్‌కు సోహైల్ కాఫీ కప్పును అందించాడు. తర్వాత అవినాష్ కోసం మాస్టర్, అరియానా కోసం మెహబూబ్ గేమ్ ఆడారు. కానీ ఓడిపోవడంతో వాళ్ల గిఫ్ట్ కూడా చేజారిపోయింది. హారిక కోసం.. అభిజిత్, లాస్య బంతుల టాస్కు ఆడి గెలిచారు. దీంతో హారికకు అభి నువ్వుండలు, లాస్య డ్రెస్ పంపించింది. మిగిలిన మోనాల్, అమ్మ రాజశేఖర్‌కు ఎవరూ గిఫ్టులు పంపకపోవడంతో తానిస్తానని నాగ్ స్వయంగా ముందుకొచ్చారు. మాస్టర్‌కు చేపల కూర, మోనాల్‌కు అహ్మదాబాద్ నుంచి స్వీట్లు తెప్పించారు. (చదవండి: నా గురించి మాట్లాడకు అరియానా: అవినాష్ ఫైర్) వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ ప్రాంక్ తర్వాత సుమను సూపర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని లోపలకు ఆహ్వానించారు. కానీ అదంతా ప్రాంక్ అని కొన్ని క్షణాల్లోనే తేలిపోయింది. అయితే సుమ కంటెస్టెంట్లతో సహా నాగార్జున మీద కూడా పంచులు విసరడం గమనార్హం. ఆ తర్వాత ఇంటిసభ్యుల కోసం తెచ్చిన వస్తువుల చిట్టాను ఏకరువు పెట్టింది. మోనాల్‌కు టిష్యూలు, అరియానాకు లాలీపాప్, లాస్యకు తెలుగు జోక్స్ పుస్తకం తెచ్చింది. దీంతో లాస్య జలుబు ముక్కుకే ఎందుకు చేస్తుందని ప్రశ్నించింది. ఈ జోకును పట్టేసిన సుమ.. ఐస్ మధ్యలో ఉంటుందని జవాబిచ్చింది. ఎక్సర్సైజ్ చేయడం లేదని అభితో గెంతులు వేయించింది. హారికతో తెలుగు టంగ్ ట్విస్టర్, అవినాష్‌తో ఇంగ్లీష్ టంగ్ ట్విస్టర్ చెప్పించేందుకు ప్రయత్నించింది కానీ వారి వల్ల కాలేదు. (చదవండి: రాజీవ్‌పై సుమ ఎమోషనల్ ట్వీట్.. వైరల్) అవినాష్ నీ కాళ్లు పట్టుకుంటా.. తర్వాత అవినాష్‌కు బిస్కెట్లు, మాస్టర్‌కు ఫస్ట్ ఎయిడ్ కిట్ తెచ్చానని చెప్తూ, అఖిల్‌కు లవ్ లెటర్ రాసేందుకు పెన్నూ పేపర్ తేవడం మర్చిపోయినట్లు తెలిపింది. అయితే ఆమె కోరిక మేరకు అఖిల్.. ఏమైపోయావే... అని పాట పాడి అందరినీ బుట్టలో వేసుకున్నాడు. నీకోసం ఎవరైనా పాడారా? అని నాగ్ లాస్యను అడగ్గా.. పాడారు కనుకే రెండు జోల పాటలు పాడానని పంచ్ విసిరింది. ఇక హౌస్‌లోకి వెళ్లమనగానే గంగవ్వ వయసొచ్చాక వెళ్తానంటూ షో నుంచి జారుకుంది. అనంతరం మోనాల్ సేఫ్ అయినట్లు నాగ్ ప్రకటించారు. దీంతో మాస్టర్, అవినాష్ డేంజర్ జోన్లో పడ్డారు. పొరపాటున అవినాష్ వెళ్లిపోతాడేమోనని అరియానా వెక్కి వెక్కి ఏడ్చేసింది. ఏం జరిగినా నువ్వు ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడవద్దని మదర్ ప్రామిస్ వేయించుకుంది. 'నీ కాళ్లు పట్టుకుంటా, నాకోసం ఎదురు చూడు, నువ్వు బతికుంటే చాలు' అంటూ ఎమోషనల్ అయింది. అభిజిత్ విలన్: అమ్మ రాజశేఖర్ ఇంతలో డబుల్ ఎలిమినేషన్‌కు ఛాన్స్ ఉందని చెప్పడంతో అరియానా షాక్ తింది. కానీ అలాంటిదేమీ లేదని కొన్ని క్షణాల్లోనే తేలిపోయింది. ఇక అవినాష్ సేఫ్ అయ్యాడు కానీ గుండాగినంత పనైంది అని భోరున ఏడ్చాడు. "మళ్లీ జీరోకు వచ్చాను, బిగ్‌బాస్ వల్లే నాకు మళ్లీ లైఫ్ వచ్చింది" అని చెప్పుకొచ్చాడు. అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అవగా అతనితో గేమ్ ఆడించాడు. అందులో భాగంగా సోహైల్, లాస్య, అరియానా, మోనాల్, మెహబూబ్, అవినాష్.. అసలు అని, అఖిల్‌ను హీరో అంటూ, అభిజిత్‌ను విలన్ అంటూ ఈ ఇద్దరూ నకిలీ మనుషులు అని తేల్చి చెప్పాడు. హారికను కూడా ఈ నకిలీ జాబితాలోనే చేర్చాడు. తన కెప్టెన్సీని మెహబూబ్‌కు ఇచ్చేశాడు. అయితే ఇమ్యూనిటీ మాత్రం లభించిందని నాగ్ స్పష్టం చేశారు. బిగ్‌బాంబ్ లేకపోవడం ఇంటిసభ్యులకు ఊరట కలిగించింది. (చదవండి: బిగ్‌బాస్: నాగ్ వెనుక స్టైలిష్ ఫ్యాషన్ డిజైనర్) -
బిగ్‌బాస్: ఇదేం ట్విస్టు, డబుల్ ఎలిమినేషనా?
బిగ్‌బాస్ నాల్గో సీజన్లోకి బుల్లితెర క్వీన్, యాంకర్ సుమ వైల్డ్‌కార్డ్ ఎంట్రీ అని జనాలను ఊదరగొట్టారు. కానీ ఎపిసోడ్ వచ్చేంతవరకు కూడా జనాలను నమ్మించే ప్రయత్నం చేయలేదు. తాజాగా రిలీజైన ప్రోమోలో భూతద్దం వేసి వెతికినా ఏ మూలనా సుమ కనిపించనేలేదు. దీంతో సుమ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అబద్ధమేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు బిగ్‌బాస్.. డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందా? అని ప్రేక్షకుల మెదళ్లలో అనుమానాన్ని నాటే సాహసం చేశారు. కానీ ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌కు ఆస్కారం లేదని, ఇప్పుడు అంత అవసరం కూడా లేదని వీక్షకులు అభిప్రాయపడుతున్నారు. అయితే లేటెస్ట్ ప్రోమోలో అమ్మ రాజశేఖర్, అవినాష్ ఇద్దరినీ రెండు గదుల్లోకి పంపించారు. కాసేపటి తర్వాత రెండు గదులను తెరిచి చూస్తే అందులో ఒక్కరే ఉంటారని నాగ్ వెల్లడించారు. (చదవండి: మోనాల్ నీకు ఫ్రెండా? అంతకు మించా?: నాగ్) ఈ సందర్భంగా అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ.. అవినాష్, నువ్వు ఉంటావంటూ భరోసా ఇచ్చాడు. కానీ అనూహ్యంగా రెండు గదుల్లోనూ ఇద్దరూ మాయమవగా.. డబుల్ ఎలిమినేషన్‌కు అవకాశం ఉందని బాంబు పేల్చాడు. దీంతో అందరికన్నా ఎక్కువగా అరియానా షాకైంది. కన్నీళ్లను ఆపుకుంటూ మీరు నిజమే చెప్తున్నారా అని నాగ్‌ను ప్రశ్నించింది. అయితే దీనికి ఆయన మాత్రం ఎలాంటి సమాధానమివ్వలేదు. ఇక అయితే సోషల్ మీడియా మాత్రం షో నుంచి మాస్టర్ మాత్రమే వెళ్లిపోయాడహో.. అని కోడై కూస్తోంది. ఇక నెటిజన్లు కూడా ఎప్పుడూ ఈ డబుల్ ఎలిమినేషన్ డ్రామాలు ఏమిటో? అని విసుగు చెందుతున్నారు. ఒకవేళ ఇది నిజమే అయితే అవినాష్‌ను సీక్రెట్ రూమ్‌లోకి పంపుతారేమో అని కామెంట్లు పెడుతున్నారు. మరి నేడు డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా? ఏదైనా ట్విస్టు ఉంటుందా? అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! (చదవండి: మా ఆయన లేకపోతే బిగ్‌బాస్ షో లేదు) -
అవినాష్ కన్నీళ్లు: మాస్టర్ వెళ్లిపోతున్నందుకా!?
విపత్తు ఎన్నో మార్పులు తీసుకొచ్చిందంటూ పంచ్ క్వీన్, యాంకర్ సుమ బిగ్‌బాస్ హౌస్‌లోకి వస్తోంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ ప్రోమో కూడా వేసేశారు. కానీ ఆమె దీపావళి కానుకలను కంటెస్టెంట్లకు ఇవ్వడానికో, టీఆర్పీలు పెంచడానికో సూట్‌కేసుతో సహా హౌస్‌లోకి అడుగు పెట్టినట్లు కనిపిస్తోంది. ఒకవేళ నిజంగానే ఆమె వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇస్తే మాత్రం ప్రేక్షకులకు కన్నులపండగే. ఈ విషయాన్ని పక్కన పెడితే.. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో నాగార్జున ఇంటిసభ్యులందరికీ గిఫ్టులు పంపించారు. కానీ వాటిని పొందాలంటే మాత్రం చెప్పిన టాస్కులు చేయాల్సిందేనని ట్విస్ట్ ఇచ్చాడు. అందులో భాగంగా అభికి అన్నింటికన్నా కష్టమైన డ్యాన్స్ చేయమన్నాడు. దాన్ని పనిష్మెంట్లా భావించిన అభి.. దీని తర్వాత తనకు కెరీర్ ఉండదని వాపోయాడు. (చదవండి: బిగ్‌బాస్: ఒకరు సేఫ్, మరొకరికి ఇమ్యూనిటీ) మెహబూబ్‌ను చేతులతో ముట్టుకోకుండా బిస్కెట్లు తినాలన్నాడు. అందరికన్నా అఖిల్ పరిస్థితి మరీ నవ్వు తెప్పిస్తోంది. అందానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే అఖిల్‌కు ఒంటికళ్లజోడును అందించారు. దీంతో అతడు ఓ కన్నుపోయిన గజదొంగలా కనిపిస్తున్నాడు. చివర్లో అవినాష్ నేలపై మోకరిల్లుతూ ఏడుస్తున్నాడు. స్నేహితుడు కన్నీళ్లు పెట్టుకోవడం చూసి తట్టుకోలేకపోయిన అరియానా కూడా కంతడి పెడుతోంది. అయితే అవినాష్ వెనకాల సోఫాపై మొబైల్ ఫోన్ కూడా ఉంది. ఇది ఎన్నో అనుమానాలను తావిస్తోంది. ఫోన్ ద్వారా అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అయ్యాడని తెలిసిందా? లేదా తన కుటుంబం నుంచి ఏమైనా ఫోన్ వచ్చిందా? అదీ కాకుండా ఏడవాలని నాగ్ టాస్క్ ఇచ్చాడా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే.. (చదవండి: పునర్నవి నిశ్చితార్థం అంతా ఉత్తిదే) -
బిగ్‌బాస్: మాస్టర్‌ను ఇంటికి పంపించాల్సిందే..
బిగ్‌బాస్ నాలుగో సీజన్లో కంటెస్టెంట్ల ప్రయాణం సగం ముగిసింది. మిగిలిన రోజుల్లో వారి ఆట మరింత కఠినంగా ఉండనుందని బిగ్‌బాస్ ముందే హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో ఎన్నడూలేని విధంగా బిగ్‌బాస్ హౌజ్‌లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇంటి కొత్త కెప్టెన్‌గా ఎన్నికైన అమ్మ రాజశేఖర్ మాస్టర్ నియంతలా మారి హౌజ్మెట్స్కు చుక్కలు చూపిస్తున్నాడు. ఇప్పటి వరకు పిల్లిలా ఉన్న మాస్టర్ ఇప్పుడు పులిలా పంజా విసురుతున్నారు. తన మాట శాసనం అనేలా ప్రవర్తిస్తున్నాడు. పనుల విభజనలో భాగంగా తనకు నచ్చని వారికి ఎక్కువ పనులు అప్పజెప్పుతూ, తన స్నేహితులైన అరియానా, మెహబూబ్, అవినాష్‌కు చిన్న పనులు చెప్పాడు. ఈ క్రమంలో హౌస్‌లో పెద్ద రభస చోటు చేసుకుంది. మాస్టర్ ఇచ్చిన పనులపై ఇంటి సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. తాము ఆ పనులు చేయలేమని ముఖం మీద కొట్టినట్లు చెప్పారు. అయినప్పటికీ మాస్టర్ తన పంతా మార్చుకోకుండా అలాగే ప్రవర్తించాడు. దీంతో ఇంట్లోని వాతావరణం మరింత వేడిగా మారింది. చదవండి: 'మాస్టర్' ప్లాన్: ఇక హారిక, అభిలకు చుక్కలే.. అయితే మాస్టర్ కెప్టెన్సీ విధానంపై ఇంటిలోని సభ్యులతోపాటు నెటిజన్లు కూడా పెదవి విరుస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో మాస్టర్‌పై తీవ్ర ట్రోలింగ్ చేస్తున్నారు. కెప్టెన్సీ టాస్కులు అన్ని పరమ చెత్తగా ఉంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకేందుకు ఈ టాస్క్‌లు డైరెక్ట్ అమ్మ రాజశేఖర్‌కు కెప్టెన్ ఇవ్వండి అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేస్తున్నారు. అసలు కెప్టెన్సీ టాస్క్ విషయంలోనే మాస్టర్‌ను తప్పుపడుతున్నారు. ఇద్దరు అమ్మాయిలతో ఒక అబ్బాయికి ఫిజికల్ టాస్క్ ఇవ్వడం ఏంటని మండిపడుతున్నారు. ఇద్దరు అమ్మాయిలతో ఒక మగవారికి టాస్క్ ఇవ్వడం వల్ల అమ్మాయిలు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: మా ఆయన లేకపోతే బిగ్‌బాస్ షో లేదు కాగా పల్లెకు పోదాం ఛలో టాస్క్ అనంతరం రింగులో రంగు అనే కెప్టెన్సీ టాస్క్ ఇవ్వగా ఇందులో హారిక, అరియానా, అమ్మ రాజశేఖర్ మాస్టర్ పోటీదారులుగా ఉన్నారు. చేతికి గంతలు కట్టుకొని చేతిని రంగులో ముంచి ఒకరికి మరొకరు రంగును అంటించుకోవాలి. ఈ టాస్క్‌లో అత్యధిక రంగు హారిక టీషర్ట్‌పై, తరువాత అరియానా మీద కూడా కొద్దిగా రంగు పడింది. అసలు రంగు పడకుండా తప్పించుకున్న మాస్టర్ ఇంటి కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు. కెప్టెన్ అనంతరం మాస్టర్ ప్రవర్తనలో మరింత మార్పు వచ్చింది. ఈ క్రమంలో హౌజ్‌లో అందరి కంటే మాస్టర్‌పై నెగిటివిటీ పెరిగిపోతుందని, అతన్ని ఎలిమినేట్ చేయకుండా ఎందుకు సేవ్ చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఇలా చేయడం వల్ల షోపై జనాలు ఆసక్తి తగ్గిపోతుందని అంటున్నారు. కొంతమంది కంటెస్టెంట్లపై ఫేవరిజం చూపిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈవారం ఎలాగైనా తనను ఇంటికి పంపిచేయాల్సిందేనని వాదిస్తున్నారు. చదవండి: బిగ్‌బాస్: కెప్టెన్‌గా మాస్టర్, మరి ఎలిమినేషన్? Ringu lo rangu bongu lo tasku Ani pettandra...captaincy tasks anni parama chettane ee season. Direct ga amma gadiki icheyandi — Vıη†aɠε ཞơω∂ყ (@vintagerowdy) November 6, 2020 trp ratings are dropping down. People losing interest in the show. Why don’t u eliminate people whom people don’t like? Enduku saving AR master? Shown genuinity is lost . No point in watching this useless scripted show showing favouritism towards particular contestants — phoenix (@phoenix69403196) November 6, 2020 Blindfold chesi #AmmaRajasekhar and two girls ni ringloki pampadam bongula undhi. Ekkada touch avutadho ane tension undadhaa girlski.#Abijeet task design ni question chesthe close friend journey videolo kuda cut chesav. Idhem task design now audience asking#BiggBossTelugu4 — sri2tweet (@sri2tweet1) November 6, 2020 -
'మాస్టర్' ప్లాన్: ఇక హారిక, అభిలకు చుక్కలే..
'పల్లెకు పోదాం ఛలో ఛలో' టాస్కులో నవ్వుతూ ఉన్న అమ్మ రాజశేఖర్ కెప్టెన్ అవగానే ఊసరవెల్లిలా రంగులు మార్చాడు. పాత గొడవలను మనుసులో పెట్టుకుని తనకు గిట్టనివాళ్ల మీద ప్రతీకారం తీర్చుకున్నాడు. సోహైల్ నా ఫ్రెండు నా ఫ్రెండూ అని జబ్బలు చరిచే మెహబూబ్ మాస్టర్‌తో జత కట్టాడు. ఇంకేముందీ ఆయన వేసిన ప్లానులో చిక్కుకున్న మెహబూబ్ నీ ఫ్రెండ్షిప్ వద్దంటూ సోహైల్‌కు సినిమా చూపించాడు. అఖిల్.. మోనాల్ అనే కంటెస్టెంటు ఇంట్లో ఉందన్న విషయమే మర్చిపోయినట్టున్నాడు. మరి నేటి బిగ్‌బాస్ ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో చదివేసేయండి.. మోనాల్ ఎలా చేస్తుందో నాకు తెలుసు: అభిజిత్ "రింగులో రంగు" అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు. ఇందులో హారిక, అరియానా, అమ్మ రాజశేఖర్ రింగులో కళ్లకు గంతలు కట్టుకుని ఉంటారు. చేతిని రంగులో ముంచి ఒకరికి మరొకరు అంటించుకోవాలి. ఈ టాస్కులో మాస్టర్ హారిక మీద పడి ఆమె టీషర్ట్‌ను ఎరుపురంగు మయం చేశాడు. అరియానా మీద కూడా రంగు పడింది. అసలు రంగు పడకుండా తప్పించుకున్న అమ్మ రాజశేఖర్ కెప్టెన్ అయ్యాడు. ఒక్కొక్కరికి తన తడాఖా చూపిద్దామని ఫిక్సయ్యాడు. ఇంగ్లీషులో మాట్లాడితే జైలులో వేస్తానన్నాడు. అలా అన్నాడో లేదో బిగ్‌బాస్ జైలు తాళాలు పంపించడం గమనార్హం. అవినాష్‌ను రేషన్ మేనేజర్‌గా నియమించాడు. తర్వాత క్యారెట్ హల్వా చేయమని బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో మోనాల్, లాస్య చెఫ్‌లుగా అవతారమెత్తి హల్వా చేశారు. నాకు మోనాల్ చేతి వంట ఎలా ఉంటుందో తెలుసు, లాస్యక్కనే బాగా చేస్తుందని అభిజిత్ రుచి చూడకముందే ఓ నిర్ణయానికి వచ్చేశాడు. కానీ కెప్టెన్ మాత్రం ఇద్దరినీ విజేతలుగా ప్రకటించాడు. కెప్టెన్ కొత్త రూల్స్: దిమ్మతిరిగిపోయింది ఇక కెప్టెన్ అమ్మ రాజశేఖర్ ఇంట్లో కొత్త నిబంధనలు ప్రవేశపెట్టాడు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు పని చేసేవాళ్లకు మరిన్ని పనులు అప్పగించాడు. అరియానాను ఏ పనీ చేయనీయకుండా తన అసిస్టెంటుగా నియమించుకున్నాడు. మైకు మర్చిపోతే జైలుకు పంపిస్తానన్నాడు. నిద్ర పోతే బెడ్రూమ్ మొత్తం శుభ్రం చేయాలని ఆదేశించాడు. ఇంగ్లీషులో మాట్లాడితే తనకు నచ్చినంత సేపు నిలబెడతానన్నాడు. మైకుల బ్యాటరీ కోసం బజర్ మోగినప్పుడు స్టోర్ రూమ్‌లోకి చిట్ట చివర వచ్చినవారి వారి గుడ్డు మొదట అడుగు పెట్టిన వాళ్ల ఖాతాలోకి వెళుతుందని చెప్పుకొచ్చాడు. ఈ రూల్స్ చూసి ఇంటిసభ్యులు గుడ్లు తేలేశారు. (చదవండి: బిగ్‌బాస్‌కు తలనొప్పిగా మారుతోన్న మెహబూబ్!) హౌస్‌లో మహానాటకానికి తెర దీసిన మాస్టర్ మెహబూబ్, అవినాష్ బాత్రూమ్ క్లీన్ చేస్తారని మిగిలిన పనులన్నీ మిగతావాళ్లపై భారం వేశాడు. దీంతో షాకైన ఇంటిసభ్యులు తాము చేయమని తేల్చి చెప్పారు. ఎవడిని బెదిరిస్తున్నాడు? కెప్టెన్ అంటే హిట్లర్ డ్యూటీ కాదు అని హారిక మండిపడింది. ఈ క్రమంలో హౌస్‌లో పెద్ద రభస చోటు చేసుకోవడంతో మెహబూబ్, అవినాష్ మరికొన్ని పనులు చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఇది మాస్టర్‌కు అస్సలు మింగుడు పడలేదు. పైగా ఈ గొడవ పురాణాన్ని ప్లాన్ చేసిన మాస్టర్ తనకు అందరూ సమానమే అంటూ నాటకమాడటం కొసమెరుపు. ఎవరూ గొడవపడొద్దు అని నీతిసూక్తులు వల్లించాడు. కానీ పక్కకు వెళ్లి మెహబూబ్, అవినాష్‌లకు క్లాసు పీకాడు. వేరే పనులు చేస్తామని ఎందుకు ఒప్పుకుంటున్నారని తిట్టిపోశాడు. (చదవండి: కాపురాలు కూలిపోతాయ్ అట!: హిమజ) అభిజిత్‌ను శిక్షించిన మాస్టర్ ఓవైపు గొడవలద్దని చెప్తూనే మాస్టర్ కావాలని అభిజిత్‌ను టార్గెట్ చేసి తగాదా పెట్టుకున్నాడు. దీని గురించి అభి తన టీమ్‌తో మాట్లాడుతూ ఎన్నిసార్లు ఊరుకోవాలి అని అసహనం వ్యక్తం చేశాడు. ఫ్రస్టేషన్లో పొరపాటున రెండు ఇంగ్లీషు ముక్కలు మాట్లాడాడో లేదో తెలుగులో మాట్లాడాలని బిగ్‌బాస్ వార్నింగ్ ఇచ్చాడు. అది వినిపించడంతోనే బుసలు కొడుతున్న పాములా మాస్టర్ వెంటనే లేచి చప్పట్లు కొడుతూ విలనిజం ప్రదర్శించాడు. తను చెప్పేంతవరకు నిలబడమని పనిష్మెంట్ ఇచ్చాడు. (చదవండి: రెచ్చిపోయిన నోయల్; ఆ ఇద్దరికీ వాచిపోయిందంతే!) మాస్టర్ ఉచ్చులో పడిపోయిన మెహబూబ్ మరోవైపు మాస్టర్ రూల్స్ వల్ల సోహైల్, మెహబూబ్ మధ్య మనస్పర్థలు వచ్చాయి. అయితే వాటిని తేలికగా తీసుకున్న సోహైల్ స్నేహితుడికి చాక్లెట్ చేయికందించాడు. కానీ మెహబూబ్ మాత్రం నీ ఫ్రెండ్షిప్ వద్దు, ఏం వద్దు, నా ఆట ఆడుకుంటా అనేశాడు. అంతే.. సోహైల్‌కు తిక్క లేచింది. ఫ్రెండ్షిప్ వద్దు అన్న మాటతో అతనికి నరాలు కట్టయిపోయాయి. చేతికి అందిన వస్తువునల్లా విసిరిపారేశాడు. దీంతో అఖిల్.. సోహైల్ దగ్గరకు వెళ్లి బుజ్జగించి ఇద్దరి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశాడు. తర్వాత మైక్ బ్యాటరీలు మార్చుకోమని బజర్ మోగింది. ఎక్కడ గుడ్డు పోతుందోనని ఇంటిసభ్యులు పరుగెత్తుకుంటూ వెళ్లారు. మొదట అవినాష్ వెళ్లగా, చివరగా అమ్మ రాజశేఖర్ తాపీగా నడుచుకుంటూ వెళ్లాడు. -
మా ఆయన లేకపోతే బిగ్‌బాస్ షో లేదు
బిగ్‌బాస్ నాల్గో సీజన్లో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారంటే అందరూ అమ్మ రాజశేఖర్ అని టక్కున చెప్పేస్తారు. అన్ని ఆన్లైన్ పోల్స్ కూడా అదే నిజమంటున్నాయి. అదృష్టం బాగుండి ఇన్నాళ్లు తప్పించుకుని తిరుగుతున్న మాస్టర్ ఈసారి బిగ్‌బాస్ హౌస్‌ను వీడాల్సిందే అని సోషల్ మీడియాలో నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ వార్తలను అమ్మ రాజశేఖర్ భార్య రాధ పుకార్లుగా కొట్టిపారేశారు. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. "మా ఆయన బిగ్‌బాస్ షోకు ఎందుకు వెళ్లాడు? ఎంటర్టైన్ చేయడానికా? మూగవాడిలా కూర్చోడానికా? హౌస్‌లోని ఇంటిసభ్యుల మీద జోకులు వేస్తున్నారు, కానీ ప్రేక్షకుల మీద కాదు. మంచి జోకులో, కుళ్లు జోకులో ఏదో ఒకటి చేస్తున్నాడు కానీ కొందరు కంటెస్టెంట్లలా ఏమీ చేయకుండా ఊరికే కూర్చోవడం లేదు కదా! ఆయన ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు" (చదవండి: బిగ్‌బాస్: నామినేట్ చేసినవాళ్లపై మాస్టర్ ప్రతీకారం!) "ఆయన ఎమోషన్స్‌ను దాచలేడు. లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఇంకోటి మాట్లాడలేడు. మా ఆయన కచ్చితంగా ఎలిమినేట్ కావడం లేదు. ఎందుకంటే ఆయన లేకపోతే బిగ్‌బాస్ షో లేదు. ఆయన వెళ్లిపోతే షో చప్పగా అయిపోతుంది. అందుకనే షో నిర్వాహకులు ఆయన్ను హౌస్‌లోనే ఉంచుతున్నారు. తప్పకుండా ఆయన విన్నర్‌గా నిలుస్తారు. ఒకవేళ ఆయన ఎలిమినేట్ అయితే మాత్రం షో చూడటమే మానేస్తా. మా ఆయన విన్నర్ కాకపోతే అవినాష్ లేదా అరియానా విజేతగా నిలిచే అవకాశముంది. వారికి నేను ఎప్పుడూ సపోర్ట్ చేస్తాను. ఇక మిగతా వాళ్లతో పోలిస్తే మా ఆయన చాలా బెటర్. వయసు మీద పడ్డా ప్రతి టాస్కూ బాగా ఆడుతున్నాడు. అందుకే తొమ్మిది వారాలు హౌస్‌లో ఉండగలిగాడు. గేమ్ ఆడుతున్నాడు కాబట్టి కోపం రావడం సహజం. దాన్ని ఎవరూ ఆపలేదు. బాగా ఆడుతున్న మా ఆయనకే సపోర్ట్ చేయండి" అని రాధ ప్రేక్షకులను కోరారు. (చదవండి: మోనాల్‌కు 30, అఖిల్‌కు 25, పెళ్లి చేయలేం) -
బిగ్‌బాస్: సోహైల్‌కు గట్టి షాక్ ఇచ్చిన మెహబూబ్
బిగ్‌బాస్ హౌస్‌లో ఈ వారం అమ్మ రాజశేఖర్ కెప్టెన్ అయ్యాడు. తనను నామినేట్ చేసిన ఒక్కొక్కరికీ బొమ్మ చూపిస్తున్నాడు. నా మాటే శాసనం అన్నట్లుగా తాను చెప్పిన పనులే చేయాలంటున్నాడు. కాదూ కుదరదు అన్నవాళ్లకు మరో అవకాశం కూడా ఇవ్వట్లేదు. హౌస్‌లో ఇప్పుడు తనే బిగ్‌బాస్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. అతని వైఖరిని అభిజిత్ టీమ్ జీర్ణించుకోలేకపోతోంది. అలాగే మాస్టర్ తనకు కావాల్సిన అవినాష్, మెహబూబ్‌కు చిన్నాచితకా పనులను అప్పజెప్పి, మిగతా వాళ్లకు రెట్టింపు పనులను కేటాయించినట్లు తెలుస్తోంది. ఇది కరెక్ట్ కాదని సోహైల్ ఖండించాడు. కానీ అతడి మాటలను మాస్టర్ పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. 'నా నిర్ణయం మార్చుకోను. మీరు చేయకపోతే వదిలేయండి' అని దురుసుగా జవాబిచ్చాడు. హౌస్‌లో కుంపటి రాజేస్తున్న మాస్టర్ దీంతో హారిక తాను చేయనని అక్కడి నుంచి విసురుగా వెళ్లిపోయింది. ఎవరికి ఏ పనులు చేయాలని ఉందో తెలుసుకోకుండా నా కెప్టెన్సీ అంటూ ఎవడి దగ్గర జులుం ప్రదర్శిస్తున్నాడని హారిక మండిపడింది. ఇక అభిజిత్ ఇంగ్లీషులో మాట్లాడగా బిగ్‌బాస్ తెలుగులో మాట్లాడమని వార్నింగ్ ఇచ్చాడు. ఈ సమయం కోసే ఎదురు చూస్తున్నట్లు మాస్టర్ వెంటనే లేచి చప్పట్లు కొడుతూ అభిని శిక్షించేందుకు రెడీ అవుతున్నాడు. దీంతో అయిపోయావ్ అభి అని లాస్య ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు మెహబూబ్ కూడా ప్లేటు ఫిరాయించినట్లు కనిపిస్తోంది. (చదవండి: మాస్టర్ సంచలన నిర్ణయం.. భోరుమన్న మెహబూబ్) బయటపడ్డ మెహబూబ్ నిజ స్వరూపం "మీ ఫ్రెండ్షిప్ వద్దు, ఏం వద్దు" అంటూ తనను గుడ్డిగా నమ్మిన సోహైల్‌కు మెహబూబ్ గట్టి షాకిచ్చాడు. ఏదైతేనేం తొలిసారి కెప్టెన్ అయిన అమ్మ రాజశేఖర్ హౌస్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. ఈ ప్రోమో చూసిన నెటిజన్లు అమ్మ రాజశేఖర్ ఏకంగా ట్రోఫీ గెలిచినట్లు ఫీల్ అవుతున్నాడని విమర్శిస్తున్నారు. ఈరోజు అందరి మీద ప్రతీకారం తీర్చుకునేలా ఉన్నాడని, పనిలో పనిగా ఫుటేజీ దక్కించుకునేందుకు ఈ ఆరాటమని అభిప్రాయపడుతున్నారు. ఎంత ఎగిరెగిరి పడ్డా ఇంకా రెండురోజులే అతని ఆటలు సాగుతాయని చెప్తున్నారు. కానీ అతడి వల్ల సోహైల్‌కు ఓ రకంగా మంచే జరిగిందంటున్నారు. స్నేహం ముసుగు ధరించిన మెహబూబ్ నుంచి విముక్తి లభించిందని చెప్పుకొస్తున్నారు. (చదవండి: బిగ్‌బాస్: మోనాల్ కోసం మెహబూబ్ బలవుతాడా?) -
బిగ్‌బాస్: కెప్టెన్‌గా మాస్టర్, మరి ఎలిమినేషన్?
బిగ్‌బాస్ నాల్గో సీజన్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఊహించడం రానురానూ కష్టంగా మారుతోంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్లు దేవి నాగవల్లి, కుమార్ సాయిని పంపించేయడం, అనారోగ్య కారణాలతో గంగవ్వ, నోయల్ స్వచ్ఛందంగా బయటకు రావడంతో అసలు ఎప్పుడేం జరుగుతుందనేది అర్థం కాక ప్రేక్షకులు అయోమయంలో పడిపోయారు. నిజానికి గతవారం తక్కువ ఓట్లు పడ్డ అమ్మ రాజశేఖర్ బిగ్‌బాస్ హౌస్‌ను వీడాల్సి ఉంది. కానీ కాలు నొప్పితో బాధపడుతున్న నోయల్ అకస్మాత్తుగా షో నుంచి నిష్క్రమిస్తూ ఎవరినీ ఎలిమినేట్ చేయవద్దని కోరాడు. అలా ఆ వారం తప్పించుకున్న మాస్టర్ ఈసారి మళ్లీ నామినేషన్లో ఉన్నారు. ఆయనతో పాటు హారిక, అభిజిత్, మోనాల్, అవినాష్ కూడా నామినేషన్ లిస్టులో ఉన్నారు. (చదవండి: టీఆర్పీలో నాగ్‌ను మించిపోయిన సమంత) మరో రెండు వారాలు హౌస్‌లోనే.. కానీ వీరిలో మాస్టర్ ఒక్కడే పెద్ద ఎత్తున వ్యతిరేకత మూటగట్టుకున్నాడు. దీంతో ఈసారి ఆయనను ఎలిమినేషన్ నుంచి ఎవరూ కాపాడలేరు అని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఇంతలోనే మరో వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. మాస్టర్ కెప్టెన్‌గా అవతరించాడని, దీంతో మరో రెండు వారాలు ఇంట్లో పాగా వేసేందుకు రెడీ అయ్యాడని భోగట్టా. అయితే కెప్టెన్ అయిన వ్యక్తికి తర్వాత వారం మాత్రమే నామినేషన్ నుంచి మినహాయింపు ఉంటుంది. కానీ అప్పటికే ఎలిమినేషన్ జోన్లో ఉంటే వేటు పడే అవకాశాలు చాలా అరుదనే చెప్పాలి. (చదవండి: బిగ్‌బాస్: ఎలిమినేషన్‌కు బదులు కొత్త ప్రయోగం) సీక్రెట్ రూమ్‌కు పంపించే అవకాశం? జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్వవహరించిన రెండో సీజన్లో ముమైత్ ఖాన్‌ను రెండు రోజుల పాటు సీక్రెట్ రూమ్లోఉంచి తిరిగి హౌస్‌లోకి పంపించారు. కానీ ఆ అవకాశాన్ని ఆమె దుర్వినియోగం చేసుకుంది. ఆమె ప్రవర్తించిన తీరు ప్రేక్షకులకు విసుగు తెప్పించింది. ఫలితంగా ముమైత్ మళ్లీ ఎలిమినేట్ అయింది. ఆ సమయంలో ఆమె కెప్టెన్ కావడం గమనార్హం. మరి ఈసారి కూడా బిగ్‌బాస్.. అమ్మ రాజశేఖర్ కెప్టెన్సీని పట్టించుకోకుండా ఎలిమినేట్ చేస్తాడా? లేదా అతడిని సీక్రెట్ రూమ్‌లోకి పంపిస్తాడా? అన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది. ఉత్కంఠ రేపుతున్న తొమ్మిదోవారం ఎలిమినేషన్ మీద నాగార్జున ఎలాంటి ట్విస్టులు ఇస్తారో వేచి చూద్దాం.. (చదవండి: బిగ్‌బాస్: ఇవే తగ్గించుకుంటే మంచిది) -
జబర్దస్త్‌లోకి మళ్లీ రానిచ్చేది లేదన్నారు: అవినాష్
సోమవారం గరంగరంగా ప్రారంభమైన నామినేషన్ ప్రక్రియ నేడు పీక్స్‌కు వెళ్లింది. మిస్టర్ కూల్ అభిజిత్ ఎదుటివాళ్ల మాట వినిపించుకోని మాస్టర్‌పై తన ప్రతాపాన్ని చూపించాడు. అఖిల్ తను ఎంతో ఇష్టపడే మోనాల్‌ను నామినేట్ చేశాడన్న మాటే కానీ ఆమె బాధపడుతుంటే చూడలేకపోయాడు. సోహైల్, మెహబూబ్‌తో గొడవ పెట్టుకున్నాడు. దగ్గరకు వెళ్లి ముఖానికి పట్టిన దుమ్మును తొలగించాడు. కానీ ఆమె మనుసులో రగులుతున్న ఘోషను అర్థం చేసుకోలేకపోయాడు. మరి నేటి ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో చదివేయండి.. నా లైఫ్‌ను అవమానపరుస్తున్నారు: మాస్టర్ నిన్న అవినాష్‌ను నామినేట్ చేసిన అభిజిత్ నేడు అమ్మ రాజశేఖర్‌పై కోడిగుడ్డు పగలగొట్టాడు. దీంతో అసహనంతో ఊగిపోయిన మాస్టర్ అభికి మాట్లాడే చాన్సివ్వకుండా అర్థం పర్థం లేని మాటలన్నీ అనేశాడు. నన్ను మాట్లాడనివ్వకపోతే ఊరుకోను అని అభి హెచ్చరించడంతో నన్ను కొడతావా? అని మాస్టర్ మరింత రెచ్చగొట్టాడు. అందరూ నా జీవితాన్ని అవమానపరుస్తున్నారని ఆవేశంతో ఊగిపోయాడు. ఈ ఇద్దరి మధ్యలో దూరేందుకు అవినాష్ ప్రయత్నించగా హారిక మధ్యలో జోక్యం చేసుకోవద్దని హితవు పలికింది. అప్పటికే నిప్పు కణంలా ఎగిరెగిరి పడుతున్న మాస్టర్ ఆవేశంలో హారికను నోరు మూర్మోయ్ అంటూ నోరు జారాడు. అటు అభిని కూడా కుర్చీలో కూర్చోవడం కాదు, దమ్ముంటే టాస్కు ఆడు అని సవాలు విసిరాడు. అందరి మీద అరిచి చివరలో మాత్రం నేను ఎవరినీ నామినేట్ చేయనంటూ విసురుగా వెళ్లిపోయి ఏడ్చేయడం గమనార్హం. మోనాల్‌ను తనవైపు తిప్పుకుంటున్న మాస్టర్! తర్వాత హారిక అవినాష్, అమ్మ రాజశేఖర్‌ను, లాస్య అవినాష్, మోనాల్‌ను, మోనాల్.. సోహైల్, లాస్యను, అమ్మ రాజశేఖర్.. అభిజిత్, అఖిల్‌ను, మెహబూబ్.. హారిక, అవినాష్‌ను నామినేట్ చేశారు. మీరు పోతా పోతా అన్నప్పుడు పంపించడానికి రెడీ అని అఖిల్ మాస్టర్ మీద గుడ్డు పగలగొట్టాడు. లాస్ట్ టాస్క్‌లో పర్ఫామ్ చేయలేదు, నీకు క్లారిటీ లేదు అనిపించింది అని మోనాల్‌ను నామినేట్ చేశాడు. ఊహించని పరిణామానికి షాక్ అయిన మోనాల్ శిలా విగ్రహంలా నిల్చుండిపోయింది. దొరికిందే ఛాన్స్ అనుకున్న మాస్టర్ ఈ గొడవను తగ్గించడానికి బదులు పెంచే ప్రయత్నం చేసినట్లు కనిపించింది. నీ గేమ్ నువ్వు ఆడు అని మొదటి నుంచే చెప్తున్నా, ఇక నుంచి నీకు నేను సపోర్ట్‌గా ఉంటా అని మోనాల్‌కు హామీ ఇచ్చాడు. (చదవండి: బిగ్‌బాస్ : నోయల్‌కు వచ్చిన వ్యాధి ఇదే) నామినేషన్లో ఉన్నవారికి బిగ్‌బాస్ ఆఫర్ అయితే అఖిల్ ఇచ్చిన ట్విస్టు నుంచి తేరుకోని మోనాల్ ఆవేదనలో ఏదేదో మాట్లాడేసింది. అబ్బాయి- అమ్మాయి ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్స్ కారు. కొంచెం మోర్ కావాలి. అదే ప్రాబ్లమ్ అని పేర్కొంది. మనుషులను తప్పుగా అంచనా వేశానని బాధపడింది. తాను ఒంటరినంటూ కన్నీళ్లు పెట్టుకుంది. కానీ ఇంత జరిగినా ఆమెకు అఖిల్ మీద ఇసుమంత ప్రేమ తగ్గలేదు. రాత్రి ఒళ్లు మరిచి నిద్రపోతున్న అఖిల్‌కు చలి పెట్టకుండా దుప్పటి కప్పింది. కాగా మొత్తంగా మోనాల్, అభిజిత్, హారిక, అవినాష్, అమ్మ రాజశేఖర్ నామినేషన్లో నిలిచారు. వీరిలో ఒకరు ఇమ్యూనిటీ పొంది సేవ్ అయ్యేందుకు బిగ్‌బాస్ "ముఖం జాగ్రత్త" అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా నామినేట్ అయిన వాళ్లు టీ స్టాండ్ మీద ముఖం పెట్టాలి. ఎండ్ బజర్‌కు ఎవరి తల స్టాండ్ మీద ఉంటే వారు నామినేషన్ నుంచి సేఫ్. కొట్టుకున్నంత పని చేసిన అఖిల్, సోహైల్ ఇక టాస్క్‌లో భాగంగా మిగతా ఇంటిసభ్యులు నామినేట్ అయినవాళ్లను ఐస్ గడ్డలు, నీళ్లు, గడ్డి, మట్టి ఉపయోగిస్తూ నానారకాలుగా హింసించారు. అందరి కన్నా కాస్తంత ఎక్కువగా మోనాల్‌ను హింసించినట్లు కనిపించింది. అది చూసి తట్టుకోలేకపోయిన అఖిల్.. మోనాల్ దగ్గరకు వచ్చి ఆమె ముఖం శుభ్రం చేశాడు. దీంతో మెహబూబ్ మాస్టర్‌కు సాయం చేస్తే ఎందుకు వ్యతిరేకించావని సోహైల్ అఖిల్ మీద అరిచాడు. అలా వీళ్లిద్దరూ కొట్టుకునే స్థాయికి వెళ్లారు. అరియానా మరోసారి రాక్షసిగా మారి అందరినీ రాచిరంపాన పెట్టింది. కానీ ఎండ్ బజర్ మోగేసరికి టీ స్టాండ్ మీద మోనాల్, అవినాష్, అమ్మ రాజశేఖర్ స్టడీగా ఉన్నారు. దీంతో ఒక్కరి కన్నా ఎక్కువ మంది ఉన్న కారణంగా ఎవరికీ ఇమ్యూనిటీ లభించలేదు. (చదవండి: సోనూ సూద్, ప్లీజ్ మోనాల్‌ను కాపాడండి) ఎన్నో అవమానాలు పడి వచ్చాను: అవినాష్ ఇంతవరకు పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అయ్యిందని అవినాష్ బాధపడ్డాడు. ఎన్నో అవమానాలు పడి వచ్చాను. మళ్లీ ఆ షో(జబర్దస్త్)లోకి తీసుకోమని చెప్పారు. అవన్నీ గుర్తొచ్చాయని కన్నీళ్లు పెట్టుకున్నాడు. కానీ తనలాగే ఇక్కడ అందరూ స్ట్రాంగ్‌గా ఆడుతున్నందుకు సంతోషంగా ఉందన్నాడు. మరోవైపు అఖిల్ చేసిన మోసానికి మోనాల్ కుంగిపోయింది. నేను హర్ట్ అయ్యాను అఖిల్, నువ్వు నన్ను నమ్మనందుకు బాధపడుతున్నానని ఒంటరిగా తన కన్నీళ్లను జారవిడిచింది. (చదవండి: కాబోయే భార్య ఎలా ఉండాలంటే..: అఖిల్) -
బిగ్‌బాస్ : ‘అమ్మ’బాబోయ్.. ఊహించని ట్విస్ట్ ఇది
బిగ్‌బాస్ హౌస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ప్రేక్షకుల అంచనాలను తలకిందులు చేస్తూ ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లను ఇస్తుంటాడు బిగ్‌బాస్. ఇది ప్రతి సీజన్లో జరుగుతుంది. అయితే నాల్గో సీజన్లో మాత్రం ఇప్పటి వరకూ సాదా సీదా ట్విస్ట్లే ఇస్తూ వచ్చిన బిగ్‌బాస్.. ఎనిమిదో వారం ఎండింగ్ మాత్రం దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. అమ్మ రాజశేఖర్‌కు డబుల్ బొనాంజా, అవినాష్కోసం ప్రత్యేక టాస్క్, మోనాల్ ముద్దులు, సోహైల్, హారిక చిందులతో ఈ వీకెండ్ ఎపిసోడ్ రచ్చ రచ్చగా మారింది. ఇంకా బిగ్‌బాస్ హౌస్‌లో నేడు చోటు చేసుచేసుకున్న ట్విస్ట్‌లేంటో చదివేయండి మరి. ఊగిపోయిన అమ్మ, అవినాష్.. చిందులేసిన హౌస్మేట్స్ నిన్నటి నోయల్ వ్యాఖ్యలు హౌస్‌లో హీట్‌ను పెంచాయి. టెంపరరీ ఫ్రెండ్ అన్నందుకే నన్ను బ్యాడ్ చేశాడు అంటూ అనినాష్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నోయల్ అసలు క్యారెక్టర్ బయటపడిందంటూ అమ్మ రాజశేఖర్ చెప్పుకొచ్చాడు. ఇక సండే ఫన్డే కావడంతో అందరిని కూల్ చేసే పనిలో పడ్డారు హోస్ట్ నాగార్జున. ఇంటి సభ్యులందరిని గార్డెన్ ఏరియాలోకి పిలిపించి సాంగ్స్ అండ్ డాన్స్ టాస్క్ ఇచ్చారు. ఇందులో భాగంగా హౌస్‌మేట్స్‌ని రెండు టీమ్‌లుగా విడగొట్టాడు. టీమ్ ఏ లో అభిజిత్(లీడర్), హారిక, అమ్మ రాజశేఖర్, అరియానా, మెహబూబ్, టీమ్ బీలో అఖిల్(లీడర్), అవినాష్, సోహైల్, లాస్యలు ఉన్నారు. పాటకు సంబందించిన మ్యూజిక్ ప్లే అయితే.. వెంటనే పాటని గెస్ చేసి బజర్ ప్రెస్ చేయాలని సూచించారు. ఇరు జట్ల లీడర్లు బజర్ దగ్గరకు వచ్చి నిలబడ్డారు. మొదటగా హలోబ్రదర్ సినిమాలోని ప్రియ రాగాలే పాట మ్యూజిక్ ప్లే కాగా (టీం ఏ) లీడర్ అభిజిత్ బజర్ నొక్కాడు. దీంతో అమ్మ రాజశేఖర్, హారిక వచ్చి డాన్స్ చేశారు. రెండోసారి ‘దారి చూడు.. దుమ్ము చూడు మామ’ పాటను టీమ్ బీ లీడర్ అఖిల్ గెస్ చేశాడు. దీంతో సోహైల్, మోనాల్ తమదైన శైలీలో స్టెప్పులేస్తూ అందరిని అలరించారు. ఇలా మొత్తం తొమ్మిది రౌండ్లలో పలు పాటలకు హౌస్ మేట్స్ అంతా చిందులేశారు. మొత్తానికి ఈ టాస్క్‌లో అఖిల్ టీమ్ గెలిచినట్లు నాగార్జున ప్రకటించారు. ఇకపై మోనాల్‌ని నామినేట్ చేయను : అభిజిత్ అనంతరం నామినేషన్లో ఉన్న మోనాల్, అరియానా, అమ్మరాజశేఖర్, మోహబూబ్‌ని స్టేజ్ మీద నిల్చోపెట్టి.. ఒకరిని సేవ్ చేస్తున్నట్లు ప్రకటించారు. బుట్టలో కొన్ని ఆపిల్స్ తెచ్చి అభిజిత్‌తో కట్ చేయించాడు. ఆపిల్స్‌ని కట్ చేస్తే.. అందులో ఎవరి ఫోటో వస్తుందో వారి సేవ్ అవుతారని నాగార్జున ప్రకటించారు. దీంతో అభిజిత్ ఆపిల్స్‌ని కోయడం మొదలు పెట్టాడు. రెండో ఆపిల్ కట్ చేయగానే మోనాల్ ఫోటో వచ్చింది.దీంతో మోనాల్ సేవ్ అని నాగార్జున ప్రకటించారు. ఇకపై మోనాల్‌ని నామినేట్ చేయనని అభిజిత్ ప్రకటించారు. అవినాష్ కోసం ప్రత్యేక టాస్క్ నిన్నటి ఎపిసోడ్లో మిమిక్రీ చేసేవాళ్లను నోయల్ కించపరిచాడు అంటూ అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే మిమిక్రీ ఆర్టిస్టులను కించపర్చలేదని, వాళ్ల కోసమే ముఖ్యంగా అవినాష్ కోసమే ఓ ప్రత్యేక టాస్క్‌ను బిగ్‌బాస్ టీం క్రియేట్ చేసిందని చెప్పారు కింగ్ నాగార్జున. హౌస్‌మేట్స్‌లో ఒక్కొక్కరిని ఇమిటేట్ చేసి చూపించాలని సూచించాడు నాగార్జున. మొదటగా మోనాల్ అవినాష్‌ని ముద్దు పెట్టాక ఎలా బిహేవ్ చేస్తాడో చేసి చూపించాలని అరియానాను కోరాడు. దీంతో అరియానా చక్కగా ఇమిటేట్ చేసి చూపించింది. అయితే నేను అంటే ఇంకా బాగా చేస్తానంటూ అవినాష్ చెప్పడంతో ఆయనతోనే మరోసారి ఇమిటేట్ చేయించాడు. ఈ సమయంలో మోనాల్ వచ్చి అవినాష్‌కు ముద్దు పెట్టింది. దీంతో అవినాష్ సంతోషంతో చిందుచేశాడు. వెంటనే నాగార్జున కలుగజేసుకొని అవినాష్‌కి పిల్లను ఇవ్వాలనుకుంటున్న వాళ్లంతా ఈ షో చూడండి అంటూ ఆట పట్టించాడు. మోనాల్‌ని కిస్ అడిగిన అఖిల్ తర్వాత మోనాల్, అరియానాలను అవినాష్ ప్లర్ట్ చేసేటప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో అఖిల్ చేసి చూపించాడు. మోనాల్ దగ్గరికి వెళ్లి కిస్ ఇవ్వగా అని అడిగాడు. పక్క ఉన్న అరియానా..అవినాష్ అంటూ దగ్గరకు రాగా .. మోనాల్ నాకు కిస్ ఇస్తా అంటే వద్దు అంటున్న అంటూ అఖిల్(అవినాష్) మాట మారుస్తాడు. అచ్చం అవినాష్ చేసినట్లే అఖిల్ చేయడంతో హౌస్‌మేట్స్‌తో పాటు నాగార్జున కూడా పగలపడి నవ్వాడు. అలాగే హారిక లాగా అవినాష్ ఇమిటేట్ చేస్తూ చిన్న పిల్లలా పరిగెడుతూ.. అభిజిత్‌ను హగ్ చేసుకున్నాడు. ఇక రాజశేఖర్ మాస్టర్‌లాగా సోహైల్, అవినాష్‌లు ఇమిటేట్ చేస్తూ కోపంలో మాస్టర్ ఎలా మాట్లాడుతారో చూపించారు. ఇక అరియానా, లాస్యలను ఇమిటేట్ చేసిన అవినాష్.. ఓ రేంజ్లో నవ్వులు పూయించారు. నవ్వులు పూయించిన లాస్క ‘పప్పు’ ఇష్యూ ఇక లాస్య వంటపై కంప్లైట్ వచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో చూపించాలని నాగార్జున కోరగా.. అవినాష్ ఓ రేంజ్లో రెచ్చిపోయి ఇమిటేట్ చేశాడు. లాస్య కోపంలో కూడా ఎలా నవ్వుతూ ఉంటుందో చేసి చూపించాడు. ముఖ్యంగా ‘పప్పు’ ఇష్యూని అయితే లాస్య ఎలా ప్రవర్తించిందో అచ్చుగుద్దినట్లే చేసి చూపించాడు. దీంతో అందరితో పాటు లాస్య కూడా పగడబడి నవ్వింది. అవినాష్ ఇమిటేట్కు పదికి పది మార్కులు పడ్డాయి. ఇక ఏదైనా గాసిప్స్ వస్తే లాస్య ఎలా బిహేవ్ చేస్తుందో హారిక చేసి చూపించింది. ఆ తర్వాత ఓ ఫజిల్ టాస్క్ ఇచ్చి సోహైల్ ద్వారా అరియానాను సేవ్ చేయించాడు. కాలర్ ఆఫ్ ది వీక్‌తో సర్ప్రైజ్ ఇక ఈ వారం కొత్తగా కాలర్ ఆఫ్ ది వీక్‌ను పరిచయం చేశాడు నాగార్జున. దీంతో భాగంగా బయట ఆడియన్స్ నుంచి తమకు నచ్చిన కంటెస్టెంట్స్ నుంచి కాల్ వస్తుందని చెప్పాడు. ఈ వారం అభిజిత్‌కు కాల్ వచ్చింది. ఓ మహిళా అభిమాని అభిజిత్‌కు ఫోన్ చేసి ప్రతివారం నామినేట్ అవుతుంటే ఎలా ఫీలవుతున్నారని ప్రశ్నించారు. దీనికి అభిజిత్ సమాధానం ఇస్తే.. ప్రేక్షకుల దయతో ఇప్పటి వరకూ సేవ్ అవుతూ వస్తున్నానని, ఓట్లు వేసిన అందరికి రుణపడి ఉంటానని చెప్పాడు. మాస్టర్‌కు ఆరు.. మోహబూబ్కు రెండు నామినేషన్లో ఉన్న అమ్మ రాజశేఖర్, మెహబూబ్‌లను కన్ఫెషన్ రూమ్‌లోకి రమ్మని నాగార్జున సూచించడంతో ఇద్దరు అక్కడి వెళ్లారు. అనంతరం షో రూమ్‌లో నుంచి బోర్డుని తెప్పించి దానిపై ఇద్దరి ఫోటోలు పెట్టి ఎవరు అవసరం.. ఎవరు అవసరం లేదో చెప్పాలని హౌస్మేట్స్ ఒపీనియన్ అడిగాడు. దీంతో అఖిల్, అభిజిత్, సోహైల్, మోనాల్, లాస్య, హారిక మెహబూబ్ ఉండాలని కోరగా, అవినాష్, అరియానాలు మాత్రం మాస్టర్‌కు సపోర్ట్ చేశాడు. దీంతో అమ్మ రాజశేఖర్ వెళ్లిపోవాలని ఆరుగురు, మెహబూబ్ వెళ్లిపోవాలని ఇద్దరు కోరారని, అందుకే మాస్టర్ ఎలిమినేట్ అని చెప్పేశాడు. దీంతో మెహబూబ్ చిన్నపిల్లాడిలా ఏడుస్తూ ఇంట్లోకి వచ్చాడు. మాస్టర్ మాత్రం కన్ఫెనెషన్ రూమ్‌లోనే ఉండిపోయాడు. మాస్టర్‌కు డబుల్ బోనాంజా.. అమ్మరాజశేఖర్ ఎలిమినేట్ అయ్యారని చెబుతూ మోహబూబ్ భోరున విలపించాడు. ఇంటి సభ్యులంతా అతన్ని ఓదార్చారు. ఇక మాస్టర్ కూడా కంటతడి పెడుతూ కన్ఫెషన్ రూమ్ నుంచి బయటకు ఇంట్లోకి వచ్చాడు. ఇంటి సభ్యులంతా అతని దగ్గరకు వెళ్లగా..అందరిని చీదరించుకున్నాడు. బట్టలు సర్దుకొని బయటకు వెళ్తుండగా.. నాగార్జున చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. మాస్టర్ కూడా సేవ్ అయినట్లు ప్రకటించాడు. అనారోగ్యం కారణంగా నోయల్ ఈ వారం బయటకు వచ్చాడని, అతని విజ్ఞప్తి మేరకే మాస్టర్ని సేవ్ చేస్తున్నట్లు నాగ్ ప్రకటించాడు. దీంతో హౌస్మేట్స్ అంతా సంతోషంతో చిందులేయగా, మాస్టర్ మాత్రం నేను వెళ్తా అంటూ ఏదో చెప్పబోయాడు. వెంటనే నాగార్జున కలుగజేసుకొని మీకు ఎక్కువ ఓట్లు వచ్చిన కారణంగా వచ్చేవారం కెప్టెన్సీ పోటీకి నేరుగా ఎంపికయ్యారంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో మాస్టర్ చెప్పాల్సిన విషయం మర్చిపోయి.. సంతోషంతో ఆనందభాష్పాలు చిందించాడు. మొత్తానికి అమ్మ రాజశేఖర్‌కి డబుల్ బొనాంజా తాకడంతో ఈ ఎపిసోడ్ ముగిసింది. -
మాస్టర్ సంచలన నిర్ణయం.. భోరుమన్న మెహబూబ్
బిగ్‌బాస్ నాల్గొ సీజన్లో ఊహించనవి చాలానే జరుగుతున్నాయి. చాలా వారాల పాటు ఉంటుందనుకున్నదేవి నాగవల్లి మూడో వారంలోనే బయటకు వచ్చేసింది. స్ట్రాంగ్ అవుతున్నాడనుకుంటున్న కుమార్‌సాయిని అనూహ్యంగా బయటకు వచ్చేశాడు. ఇక చివరి వరకు ఉంటుదనుకుంటున్న గంగవ్వ, టాప్ 5లో ఉంటాడనుకున్న నోయల్ అనారోగ్యంతో అర్థాంతరంగా బయటకు వెళ్లిపోయారు. నోయల్ వెళ్లడంతో ఇక ఈ వారం ఎలిమినేషన్ ఉండదనుకుంటున్న తరుణంలో తాజా ప్రోమో పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ వారం మరో ఎలిమినేషన్ ఉటుందన్నట్లుగా హింట్ ఇస్తూ ప్రోమో విడుదల చేశారు. (చదవండి : బిగ్‌బాస్ : నోయల్‌కు వచ్చిన వ్యాధి ఇదే) తాజా ప్రోమో ప్రకారం అమ్మ రాజశేఖర్, మెమబూబ్ డేంజర్ జోన్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మోనాల్, అరియానాను సేవ్ చేసి ఈ ఇద్దర్నీ మాత్రం కన్ఫెషన్ రూమ్‌కు పిలిచాడు నాగార్జున. ‘ఒకరు డాన్సర్.. మరొకరు డాన్స్ మాస్టర్. ఒకరు గురువు.. మరొకరు శిష్యుడు.. ఈ ఇద్దరిలో ఎవరు హౌజ్‌కు అవసరం.. ఎవరు అవసరం లేదో మీరే నిర్ణయించుకోండి’ అని ఎలిమినేషన్ కత్తిని వారి చేతికే ఇచ్చేశాడు.ఆ తర్వాత కన్ఫెషన్ రూమ్ నుంచి మెహబూబ్ మాత్రమే బయటికి వచ్చాడు. రాజశేఖర్ మాస్టర్ కనిపించడం లేదు.. మరోవైపు అమ్మ రాజశేఖర్‌ను చూస్తూ మెహబూబ్ భోరున ఏడ్చేస్తున్నాడు. దీన్నిబట్టి చూస్తుంటే మాస్టర్ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడేమో అనిపిస్తుంది. మరి ఇది నిజమా కాదా అని తెలియాలంటే మరికొన్ని గంటలు వేడి చూడాల్సిందే. -
రెచ్చిపోయిన నోయల్; ఆ ఇద్దరికీ వాచిపోయిందంతే!
నేటి బిగ్‌బాస్ ఎపిసోడ్లో పెద్ద ట్విస్టులే చోటు చేసుకున్నట్లు కనిపిస్తోంది. అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న నోయల్ స్టేజీ మీదకు వచ్చాడు. నాగార్జున పక్కనే ఉండి కంటెస్టెంట్లతో మాట్లాడుతున్నాడు. ఈ మేరకు స్టార్ మా తాజాగా ప్రోమోను రిలీజ్ చేసింది. అయితే నోయల్స్టేజీ మీద ఉండటంతో అతడు శాశ్వతంగా హౌస్ నుంచి వెళ్లిపోతున్నాడా? అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఈ విషయాన్ని కాస్త పక్కన పెడితే ఇంట్లో కొంత కాలంగా నోయల్ కాలి నొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రోమోలో నోయల్ మాట్లాడుతున్నదాన్ని బట్టి చూస్తే అతడు మానసికంగానూ నరకం అనుభవించినట్లు తెలుస్తోంది. అతడి దీనావస్థను చూసి తోటి కంటెస్టెంట్లు జాలి పడాల్సింది పోయి పుండు మీద కారం చల్లినట్లుగా వెటకారాలు చేశారట. నోయల్ కుంటిగా ఎలా నడుస్తాడో చూపిస్తూ అవినాష్, నోయల్ పరిస్థితి మీద జోకులు చేస్తూ మాస్టర్ అతడిని హేళన చేస్తూ మానసికంగా వేధించారట. వారి వైఖరిని నోయల్ ఆ సమయంలోనే ఖండించాడో తెలీదు కానీ నేడు మాత్రం ఆ ఇద్దరినీ దుమ్ము దులిపాడు. (చదవండి: బిగ్‌బాస్: సగం కాలం గడిచిపోయాక మంగ్లీ ఎంట్రీ?) ఈ మేరకు నోయల్.. అమ్మ రాజశేఖర్, అవినాష్‌లను కాసేపు ఒంటికాలిపై నిలబడమన్నాడు. కానీ కాసేపటికే వాళ్లు నొప్పి తాళలేకపోయారు. మీరు పడ్డ కంటే వెయ్యి రెట్లు ఎక్కువ నొప్పి తనకు రోజూ ఉంటుందని, దాన్ని మీరు జోక్ చేస్తారేంటని నిలదీశాడు. అసలు మీ ప్రవర్తనతో ఏం చెప్పాలనుకుంటారని ప్రశ్నించాడు. తర్వాత అవినాష్ అసలు రంగును కూడా బట్టబయలు చేశాడు. నేనెలా నడుస్తానో అవినాష్ నడిచి చూపిస్తున్నాడు, మీరు రెండు నిమిషాలు నిలబడలేకపోయారు. మరి నాకు ఎంత పెయిన్ ఉంటుందో తెలుసా? అంటూనే ఈ చిల్లర కామెడీలు ఏంటని విమర్శించాడు. దీంతో ఆగ్రహించిన అవినాష్.. మీరు వెళ్తూ వెళ్తూ ఇద్దరిని బ్యాడ్ చేయాలని ఫిక్సయ్యారు అని నోయల్‌పై మండిపడగా అతడు మాత్రం పిచ్చ లైట్ అంటూ ఎందుకు నటిస్తున్నావ్ అవినాష్? అని కౌంటరిచ్చాడు. దీంతో అవినాష్ ఆవేశం మీద నీళ్లు గుమ్మరించినట్లైంది. ఈ ప్రోమోపై నెటిజన్లు స్పందిస్తూ నోయల్ బాధలో అర్థం ఉందంటూ అతడికి మద్దతిస్తున్నారు. అయితే అవినాష్.. వెళ్లిపోయే ముందు బ్యాడ్ చేస్తున్నావ్ అనడాన్ని బట్టి చూస్తే నోయల్ ఎలిమినేట్ అవుతున్నాడేమో అని ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: నీకోసం ఎదురు చూస్తూ ఉంటా: హారిక) -
సంకేతాలిచ్చిన బిగ్‌బాస్: మాస్టర్ ఎలిమినేట్?!
బిగ్‌బాస్ హౌస్‌లో అప్పుడే 55 రోజులు దాటిపోయాయంటే నమ్మశక్యంగా అనిపించడం లేదు. వారి జర్నీని కళ్లకు కట్టినట్లు చూపించిన బిగ్‌బాస్ అఖిల్, మోనాల్, అభిజిత్‌లను హైలెట్ చేసి చూపించాడు. ఎన్నో వారాలు నామినేషన్లోకి వచ్చినప్పటికీ అభిమాన గణం మెండుగా ఉండటంతో ఈ ముగ్గురూ సేవ్ అవుతూ వస్తున్నారు. ఇక ఈ వారం అమ్మ రాజశేఖర్, అరియానా, మెహబూబ్, లాస్య, అఖిల్, మోనాల్ నామినేషన్లో ఉన్నారు. ఆన్లైన్ పోల్స్ ప్రకారం అఖిల్, లాస్య, అరియానా, మోనాల్ సేఫ్ జోన్లో ఉన్నారు. ఆ తర్వాత మెహబూబ్, మరీ తక్కువ ఓట్లతో అమ్మ రాజశేఖర్ ఆఖరి స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయనపై ఎలిమినేషన్ కత్తి వేలాడుతోంది. అమ్మాయి జేబులో చేయి పెడితే తప్పేంటి? కామెడీ చేసి నవ్వించే టాలెంట్ ఉన్నా మాస్టర్ దాన్ని పూర్తిగా పక్కన పెట్టేశాడు. టాస్క్‌ల్లో ఆయన్ను ఎవరేమన్నా సహించలేకపోయేవాడు. స్పోర్టివ్‌గా తీసుకోవడానికి బదులు ప్రత్యర్థులకు శాపనార్థాలు పెట్టేవాడు. దీంతో ఇప్పటికీ ఇంటిసభ్యులు మాస్టర్‌ను ఒక మాట అనాలంటే భయంతో వెనకడుగు వేస్తున్నారు. మరోవైపు ఈ వారంలో ఆయన చేసిన తప్పులనే బిగ్‌బాస్ ఎత్తి చూపుతూ టార్గెట్ చేశారు. ముందుగా హారిక చాక్లెట్ తీసుకుందన్న కోపంతో ఆమె మీద పడి మరీ చాక్లెటు తీసుకునేందుకు ప్రయత్నించాడు. పైగా తను అమ్మాయి జేబులో చేయి పెడితే తప్పేంటని ఎదురు ప్రశ్నించడం ప్రేక్షకుల ఆగ్రహానికి కారణమైంది. (చదవండి:'అమ్మో' రాజశేఖర్: దేని కోసం ఇంత డ్రామా?) మాస్టర్ అసలు రంగు బయటపడింది ఇక కెప్టెన్సీ టాస్కులో మాస్టర్ అరియానాకు సపోర్ట్ చేశాడు. మోనాల్‌కు నెక్స్ట్ టైమ్ తప్పకుండా సాయం చేస్తానని మాటిచ్చాడు. చివరికి కెప్టెన్ అయిన అరియానా.. మాస్టర్ సంతోషిస్తారనే భావనతో మోనాల్‌ను రేషన్ మేనేజర్‌ను చేసింది. దీంతో ఆయనకు కడుపు మండిపోయింది. తనను కాదని మోనాల్‌ను రేషన్ మేనేజర్ చేసినందుకు అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. నీకు విశ్వాసం లేదు అంటూ నోటికొచ్చిన మాటలు అంటూ అనవసర రాద్ధాంతం సృష్టించడంతో ఆయన ప్రవర్తన ప్రేక్షకులకు మరింత విసుగు తెప్పించింది. పైగా ఆయన నామినేషన్ కోసం చాలామంది జనాలు కాచుకుని కూర్చున్నారు. దీనికితోడు బిగ్‌బాస్ టీమ్ అయ్యే కంటెస్టెంట్లను టార్గెట్ చేసి, వారిని నెగెటివ్‌గా చూపిస్తారు. అలా ఈ వారం అమ్మ రాజశేఖర్ చేసిన తప్పులనే బిగ్‌బాస్ ఫోకస్ చేసి చూపించడంతో ఆయనే హౌస్‌ను వీడనున్నాడని సంకేతాలు ఇచ్చాడు. ఇప్పటికే నోయల్ వెళ్లిపోయాడు కాబట్టి డబుల్ ఎలిమినేషన్‌కు ఆస్కారం లేనట్లు తెలుస్తోంది. (చదవండి: అఖిల్ ప్యాంటులో ఐస్‌గడ్డలు వేసి అరాచకం) -
బిగ్‌బాస్: ఇవే తగ్గించుకుంటే మంచిది
'ఎన్నాళ్లో వేచిన హృదయం.. ఈ వారం ఎదురవుతుంటే..' అని బిగ్‌బాస్ ప్రేమికులు సోమవారం నుంచి తెగ పాటలు పాడేసుకుంటున్నారు. అందుకు కారణం లేకపోలేదు.. కొంతకాలంగా నామినేషన్లోకి రాకుండా తప్పించుకు తిరుగుతున్న అమ్మ రాజశేఖర్, మెహబూబ్ ఈ వారం ఎలిమినేషన్ జోన్లోకి వచ్చేశారు. వీళ్లిద్దరిలో బయటకు వచ్చే ఛాన్సులు మాస్టర్‌కే ఎక్కువగా ఉన్నాయి. అవసరం ఉన్నా లేకపోయినా గొడవ పెట్టుకుంటూ, క్యారెక్టర్‌ను నిందిస్తూ అప్రతిష్ట మూటగట్టుకుంటున్నాడు. మొదట్లో అతి చేసినట్లు అనిపించిన మెహబూబ్ ఈ మధ్య తగ్గి ఉంటున్నాడు. అలానే టాస్కుల్లోనూ ఇరగదీస్తుండటంతో ఎలిమినేషన్ నుంచి బయటపడే చాన్సులు కనిపిస్తున్నాయి. మొత్తానికి మాస్టర్ మాత్రం తన గొయ్యి తానే తవ్వుకుంటూ ఇంటి నుంచి బయటకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. (చదవండి: బిగ్‌బాస్: మాస్టర్ కాళ్లు పట్టుకున్న సోహైల్) రేషన్ మేనేజర్ అయితే ఎలిమినేషన్ నుంచి సేఫా?! ఇలాంటి క్లిష్ట సమయంలో అమ్మ రాజశేఖర్ టాస్క్‌లు బాగా ఆడుతూ, కామెడీ చేస్తూ అందరినీ నవ్విస్తూ ఓట్లను ఆకర్షించాల్సి ఉంటుంది. కానీ ఆయన దానికి బదులు వేరే రూటు ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. బిగ్‌బాస్ ప్రారంభంలో సేఫ్ గేమ్ ఆడి అడ్డంగా దొరికిపోవడంతో అప్పటి నుంచి గేమ్‌కు స్వస్తి పలుకుతున్నట్లు వెల్లడించాడు. అయితే ఇప్పుడు మరో ఎమోషనల్ డ్రామా ఆడుతున్నట్లు తెలుస్తోంది. నిన్నటి టాస్క్‌లో మెహబూబ్‌తో పాటు మాస్టర్.. అరియానాకు సపోర్ట్ చేశాడు. చివరికి కెప్టెన్ అయిన అరియానా.. మోనాల్‌ను రేషన్ మేనేజర్(RM)గా నియమించింది. ఇది ఆయనకు అస్సలు మింగుడుపడలేదు. సపోర్ట్ చేసిన తనకు ఆ బాధ్యతను అప్పజెప్పాల్సిందని అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. అసలే నామినేషన్లో ఉన్న తనకు RM ఇస్తే సపోర్ట్ అయ్యేదని అర్థం పర్థం లేని మాటలు మాట్లాడాడు. దీంతో ఆయన అసలు బాధ అర్థమైన అరియానా RM అయితే సేవ్ అవుతారని ఎక్కడా లేదని స్పష్టం చేసింది. (చదవండి: విశ్వాసం లేదు, చెప్పుతో కొట్టినట్లు ఉంది: మాస్టర్) కెమెరాల ముందు మాస్టర్ యాక్టింగ్! ఈ వ్యవహారంపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. రేషన్ మేనేజర్ అయితే సేఫ్ అవుతారా? ఇది చూసి నాగార్జున కూడా షాక్ అవుతారేమోనని సెటైర్లు విసురుతున్నారు. అరియానాపై నోటికొచ్చినట్లు అరిచి చివర్లో కెమెరాల ముందు బలవంతంగా కన్నీళ్లు పెట్టుకోవడం దేనికని మాస్టర్‌ను విమర్శిస్తున్నారు. ఇలాంటి చీప్ ట్రిక్స్ వల్ల ఎవరూ ఓట్లు వేయరని చెప్తున్నారు. నిజంగా ఆయన రేషన్ మేనేజర్ అవ్వాలనుకుంటే.. ఆ విషయాన్ని ముందే అరియానాకు చెప్తే సరిపోయేది. అలా చెప్పినప్పటికీ నియమించకపోతే ఇంత సీను చేసినదానికి ఓ అర్థంపర్థం ఉండేదని అభిప్రాయపడుతున్నారు. టాస్కుల్లో ఎలాగో స్పోర్టివ్‌నెస్ లేదు, మళ్లీ దీనికి పనికిరాని గొడవలు పెట్టుకోవడమెందుకని ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఇలాంటివి తగ్గించుకుంటే కాస్తైనా ఓట్లు రాలుతాయని సూచిస్తున్నారు. (చదవండి: కాస్త క్లోజ్‌గా ఉంటే లవ్వా?: మాస్టర్ భార్య) -
బిగ్‌బాస్: ఈ కొరుక్కోవడమేంట్రా నాయనా!
పిల్లలు దైవసమానం అంటారు. కానీ పిల్లల్లా అవతారమెత్తిన బిగ్‌బాస్ కంటెస్టెంట్లు మాత్రం రాక్షసుల్లా మారిపోయి హౌస్‌లో అరాచకం సృష్టిస్తున్నారు. కేర్ టేకర్లను బెంబేలెత్తిస్తున్నారు. తనను నామినేట్ చేశాడన్న కోపంతోనో ఏమోకానీ అరియానా.. సోహైల్‌కు నరకం అంటే ఏంటో చూపిస్తోంది. అతడు కూడా నామినేట్ చేసిన పాపానికి ఎంత టార్చర్ పెట్టినా నవ్వుతూనే భరిస్తున్నాడు. అటు అమ్మ రాజశేఖర్‌కు అభిజిత్ డైపర్ తొడగాల్సిన దుస్థితి వచ్చింది. కండల వీరుడు మెహబూబ్‌ను అఖిల్ చచ్చినట్లు ఎత్తుకుని తిప్పక తప్పలేదు. (బిగ్‌బాస్: అవినాష్‌కు ముద్దు పెట్టిన మోనాల్) సోహైల్‌కు డబుల్ టార్చర్ ఈ టాస్క్‌లో అవినాష్ అరియానాతోనే ఎక్కువ సేపు ఉంటున్నాడు. దీంతో వాళ్లిద్దరినీ వీపు మీద ఎక్కించుకుని తిప్పుతూ సోహైల్ తెగ అవస్థ పడుతున్నాడు. అలాగే లాస్యతో కలిసి అరియానాకు చుక్‌చుక్ బుండి వస్తుంది అంటూ పద్యం నేర్పిస్తుంటే వెనక నుంచి మాస్టర్ అతడి చొక్కా మీద పిచ్చి గీతలు గీశాడు. మరోవైపు హారిక కొంటె పిల్లగా మారి తోటి పిల్లల పెన్సుళ్లు కొట్టేస్తోంది. మాస్టర్‌ను గిచ్చుతూ, గిల్లుతూ ఏడిపిస్తోంది. దీంతో హారికను మాస్టర్ వచ్చి చెంప మీద కొట్టాడు. దీంతో దెబ్బకు దెబ్బ తీయాలని పరుగెత్తుకుంటూ వెళ్లిన హారిక అతడికి రెండు తగిలించింది. దీంతో మాస్టర్ హారికను కొరకగా ప్రతీకారంగా ఆమె అతడిని కొరికింది. ఇలా కాసేపటివరకు ఇద్దరూ దెబ్బలాడుకున్నారు. దీంతో అభి వచ్చి హారికను మెంటల్ అనేశాడు. (పట్టపగలే చుక్కలు చూపించిన అరియానా) అభికి దగ్గరయ్యేది ఎవరు? ఈ అన్‌సీన్ వీడియోను చూసిన నెటిజన్లు ఈ కొరుక్కోవడమేంట్రా నాయనా అని తలలు పట్టుకుంటున్నారు. టాస్క్ ముగిసే సమయానికి కేర్ టేకర్లను బతకనిచ్చేలా లేరని కామెంట్లు చేస్తున్నారు. కాగా నేటి ఎపిసోడ్లో వింతలు చోటు చేసుకోనున్నాయి. ఎప్పుడూ హారికను నిందించని అభిజిత్ ఆమెపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాడు. దీంతో వీరిద్దరి మధ్య వైరం పెరగనున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే పెరిగిన దూరాన్ని తగ్గించుకుని అభితో క్లోజ్ అయ్యేందుకు మోనాల్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆమెతో కూర్చుని ఇప్పటివరకు తలెత్తిన బేధాభిప్రాయాలను సెటిల్ చేసుకునేందుకు అభి ఓకే చెప్పడం విశేషం. మరి నేటి ఎపిసోడ్లో అభికి ఎవరు దగ్గర కానున్నారు? ఎవరు దూరమవనున్నారు? అనేది తెలియాలంటే ఇంకొద్ది గంటలు వేచి ఆగాల్సిందే! (బిగ్‌బాస్ టాప్ 5లో ఉండేది వాళ్లే: కౌశల్) -
మోనాల్‌కు మంచి చెప్పినా చెడే చేసింది
బిగ్‌బాస్ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఎలాగుంటుంది అనేది కళ్లకు కట్టినట్లు చూపించారు హౌస్మేట్స్. టాస్క్‌లో భాగంగా చిన్నపిల్లల్లా మారిపోయిన కంటెస్టెంట్లు వీళ్లు పిల్లలు కాదు, పిడుగులు కూడా కాదు. రాక్షసులు అనిపించారు. కేర్ టేకర్లకు అంతలా నరకం చూపించారు. మరోసారి సోహైల్, అరియానాకే జోడీ పడింది. దీంతో తనను నామినేట్ చేసిన సోహైల్‌కు అరియానా పట్టపగలే చుక్కలు చూపించింది. మరి నేటి బిగ్‌బాస్ ఎపిసోడ్లో వాళ్లు ఎంత హంగామా చేశారు? హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో చదివేసేయండి.. నామినేట్ చేసినందుకు మాస్టర్ కంటతడి అభిజిత్‌తో మాట్లాడి అన్నింటినీ క్లియర్ చేస్కో అని అఖిల్ మోనాల్‌కు సూచించాడు. ఆమె బాధలో కూరుకుపోవడంతో ఇతడే ముందుకు వచ్చి పోనీ నేను మాట్లాడనా అని అనుమతి తీసుకుని అభిజిత్ దగ్గరకు వెళ్లాడు. ఒకసారి కూర్చుని మాట్లాడుకుంటే క్లారిటీ వస్తుందని అఖిల్ సూచించడంతో అందుకు ఓకే చెప్పిన అభి రేపు మాట్లాడదామన్నాడు. ఇక సోహైల్ నామినేట్ చేసినందుకు మాస్టర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే మాస్టర్ చేయెత్తి సైగలు చేయడం వల్లే తనను నామినేట్ చేశానని సోహైల్ స్పష్టం చేశాడు. అయినా సరే అతడు అర్థం చేసుకోకపోవడంతో ఫ్రస్టేట్ అయ్యాడు. తర్వాతి వారం నామినేషన్ కోసం ఇప్పటినుంచే తనతో గొడవలు పెట్టుకోండని సోహైల్ ఇంటిసభ్యులకు సూచించాడు. (చదవండి: మా ఆయనేంటో నాకు తెలుసు: మాస్టర్ భార్య ఫైర్) మోనాల్ ముద్దుతో గాల్లో తేలిన అవినాష్ గార్డెన్ ఏరియాలో అఖిల్, మోనాల్ ఒకచోట అరియానా, అవినాష్ మరోచోట కూర్చుని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. మోనాల్‌ను చూసి అవినాష్ ఐ హేట్ యూ చెప్పగా, అతడిని కూల్ చేసేందుకు ఆమె పరుగెత్తుకుంటూ వెళ్లి నుదుటిపై ముద్దు పెట్టింది. ఊహించని పరిణామానికి షాకైన అవినాష్.. నా పొలంలో మొలకలొచ్చాయ్ అంటూ సంతోషంతో ఎగిరి గంతేశాడు. మై హీరోయిన్ మోనాల్ అని గొంతు చించుకుని కేకలు పెట్టాడు. అసలైన A అవినాష్ అని అర్థమైందంటూ సంబరపడిపోయాడు. (చదవండి: చెండాలమైన కారణాలతో నామినేట్ చేయకు) మోనాల్ వల్ల అఖిల్, సోహైల్‌కు మనస్పర్ధలు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అంటూ అఖిల్, మెహబూబ్‌ను నోయల్ నామినేట్ చేశాడని సోహైల్ అతనితోనే చర్చించాడు. ఇది విన్న మోనాల్.. అఖిల్ దగ్గరకు వెళ్లి నీ గురించి సోహైల్ మాట్లాడుతున్నాడని చెప్పడంతో మనస్పర్ధలు మొదలయ్యాయి. తన గురించి ఏదో వెనకాల మాట్లాడుతున్నాడని అఖిల్ అనవసరంగా ఏదేదో ఊహించుకుని ఫీలయ్యాడు. దీంతో తానేమీ మాట్లాడలేదని సోహైల్ అఖిల్‌కు క్లారిటీ ఇచ్చాడు. ఇక ఇక్కడి విషయాలు అక్కడ చెప్పొద్దని చెప్పినా ఎందుకు ఇలానే చేస్తున్నావ్ అని సోహైల్ మోనాల్‌ను నిలదీశాడు. (చదవండి: సమంత హోస్టింగ్‌పై నెటిజన్ల రియాక్షన్!) అరియానాను రెడీ చేసిన అవినాష్ బిగ్‌బాస్ 'బీబీ డేకేర్' అనే లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా అరియానా, అవినాష్, హారిక, మెహబూబ్ చంటిపిల్లలుగా మారిపోయారు. అవినాష్‌కు నోయల్, అరియానాకు సోహైల్, మెహబూబ్‌కు అఖిల్, హారికకు మోనాల్, అమ్మ రాజశేఖర్‌కు అభిజిత్ కేర్ టేకర్లుగా వ్యవహరించారు. లాస్య సంచాలకురాలిగా వ్యవహరించింది. కేర్ టేకర్లు పిల్లలకు అన్నం తినిపిస్తూ, బట్టలు మారుస్తూ, డైపర్లు వేయాల్సి ఉంటుంది. చదువు చెప్పడంతో పాటు ఎంటర్టైన్ చేయాలి. వారికి కావాల్సినవన్నీ సమకూరుస్తూ ఏడుపు సౌండ్ వినిపించగానే డైపర్లు మార్చాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌లో ఒకరు విజేతగా నిలవగా వారికి ప్రత్యేక ప్రయోజనం ఉంటుందని బిగ్‌బాస్ చెప్పాడు. సోహైల్‌కు టార్చర్ చూపిస్తున్న అరియానా టాస్క్ మొదలు కాగానే పిల్లలు పిడుగుల్లా మారిపోయి, ఆ తర్వాత రాక్షసుల్లా అవతరించారు. మెహబూబ్ కోరిక మేరకు అఖిల్ అతడిని పదేపదే ఎత్తుకుని తిప్పాడు. అరియానా సోహైల్ మీద ఎక్కి చల్‌చల్ గుర్రం ఆడుకుంది. ఇక తోటి చంటోడైన మాస్టర్‌ను హారిక రాచిరంపాన పెట్టింది. సోహైల్ తనను నాన్న అని పిలవద్దని ఎంత మొత్తుకున్నా సరే అరియానా అతడిని పదేపదే నాన్న అని పిలుస్తూ అమ్మ ఎక్కడ? అని ప్రశ్నలు కురిపించింది. తర్వాత ఆమెను సోహైల్ భుజాలపై ఎత్తుకుని ఊరేగించాడు. ఆమె మాత్రం ముఖానికి రంగు పూస్తూ తలపై నారింజ పొట్టు వేసి, పౌడర్ కొట్టి, పిలక వేసి నానా రకాలుగా టార్చర్ పెట్టింది. తర్వాత పిల్లలందరికీ డైపర్లు వేశారు. కొంటె హారిక అభిజిత్ మీద నీళ్లు పోస్తూ తెగ అల్లరి చేసింది. పెన్సిల్ కోసం హారిక, అరియానా ఫైట్ క్లాసులో ఏబీసీడీలు నేర్పుతున్న సోహైల్‌ను పిల్లలు తిక్క ప్రశ్నలతో విసిగించారు. ఎంత విసిగించినా సరే అతడు మాత్రం ఓపికతో సమాధానాలు చెప్తూ ముఖం మీద నవ్వును చెరగనీయలేదు. మాస్టర్ హారిక చాక్లెట్లు కొట్టేశాడు. తర్వాత ఆమె కోపంతో అరియానా పెన్సిల్ కొట్టేయడంతో ఇద్దరూ తలబడ్డారు. చివరకు అరియానా తన పెన్సిల్‌ను తాను దక్కించుకుంది. ఈ క్రమంలో ఇద్దరూ దెబ్బలు తగిలించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ టాస్క్ అయిపోయే సమయానికి ఈ చిచ్చరపిడుగులు.. కేర్ టేకర్లను ఎన్ని చెరువుల నీళ్లు తాగిస్తారో చూడాలి. (చదవండి: అభిజిత్‌కు అన్యాయం చేసిన అరియానా) -
కాస్త క్లోజ్‌గా ఉంటే లవ్వా?: మాస్టర్ భార్య
బిగ్‌బాస్ నాల్గో సీజన్ ప్రారంభంలో హైదరాబాదీ మోడల్, నటి దివి వైద్య రేసుగుర్రంలో స్పందనలా ఉండేది. తర్వాత మార్నింగ్ మస్తీలో ఇంటిసభ్యులందరి గురించి కుండబద్ధలు కొట్టి చెప్పి ఒక్క ఎపిసోడ్‌కే ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. అటు ఇంట్లో కూడా అమ్మ రాజశేఖర్ దివిని హీరోయిన్గా ప్రకటించేశాడు. కానీ హీరో తానేనన్నాడు. అలా వారిద్దరి మధ్య స్నేహబంధం మొదలైంది. అయితే అప్పుడప్పుడు సరదాగా దివిని తన గర్ల్‌ఫ్రెండ్ అంటూ కహానీలు అల్లేవాడు. ఇంతలోనే దివి ఎలిమినేట్ కావడంతో ఆయన ఏడుస్తూనే ఆమెను దగ్గరుండి సాగనంపాడు. బయట ఎవరేమనుకున్నా నువ్ నా అమ్మవే అమ్మా.. అని ఎమోషనల్ అయింది. దివి ఆయన్ను అమ్మా అని పిలిచినా సరే వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ కొందరు నెటిజన్లు లేనిపోనివి సృష్టిస్తున్నారు. దీనిపై అమ్మ రాజశేఖర్ భార్య రాధ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. (బిగ్‌బాస్: ఎలిమినేషన్‌కు బదులు కొత్త ప్రయోగం) ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. "బిగ్‌బాస్ హౌస్‌లో వారిమధ్య ఏం లేదు. మా ఆయన, దివి కేవలం ఫ్రెండ్స్. ఏదో ఉన్నట్టు సృష్టిస్తూ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. కావాలని నిందలు వేస్తున్నారు. మా ఆయనేంటో నాకు తెలుసు. అయినా మేల్, ఫిమేల్ కాస్త క్లోజ్‌గా ఉంటే లవ్ వచ్చేస్తుందా? మొదట కరాటే కల్యాణితో రొమాంటిక్‌గా డ్యాన్స్ చేశారు. అది నాకు కామెడీగా అనిపించింది. వారి మధ్య ఏదో ఉందని మిగతావాళ్లకు ఏ యాంగిల్లో అనిపించిందో తెలీదు. వాళ్లిద్దరేమీ సీక్రెట్‌గా మాట్లాడుకోలేదు. ఎక్కడవరకు సెన్సిటివ్‌గా ఉండాలో అక్కడివరకే ఉంటారు. ఒకవేళ సెన్సిటివ్‌గా ఉండే అమ్మాయిలకు ఆయన పడిపోతారంటే ఊరంతా బోలెడు మంది ఉండాలి అని చెప్పుకొచ్చారు. (మోనాల్ మళ్లీ సేఫ్, దివి ఎలిమినేట్) -
బిగ్‌బాస్: నామినేషన్లో మాస్టర్, మెహబూబ్!
సమంత వచ్చిన వేళావిశేషం.. ఎలిమినేషన్ ఉండదేమో అని కంటెస్టెంట్లు తెగ సంబరపడిపోయారు. కానీ వారి ఆశలను నీరుగారుస్తూ దివి ఎలిమినేట్ అని హీరోయిన్ సమంత బాంబు పేల్చింది. అయితే అమ్మ రాజశేఖర్‌తో సాన్నిహిత్యం కూడా దివి వెళ్లిపోవడానికి ఓ కారణమే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా వుంటే ఎనిమిదోవారానికిగానూ నేడు బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్ ప్రక్రియ మొదలు కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో మెహబూబ్ అరియానాను నామినేట్ చేశాడు. మనిద్దరి మధ్య అన్ని సమస్యలు తొలిగిపోవాలని నామినేట్ చేస్తున్నట్లు తెలిపాడు. ఈ కారణం విన్న అరియానాకు కోపం నషాళానికి తాకింది. క్లియర్ అవ్వాలని చెప్పి నామినేట్ చేసి బయటకు పంపించేస్తున్నావేంటని మండిపడింది. (చదవండి: బిగ్‌బాస్: మోనాల్‌పై అభి, అఖిల్ సెటైర్లు) ఎవరికి లేరు అమ్మానాన్న?: అమ్మ రాజశేఖర్ ఇక అమ్మ రాజశేఖర్ అఖిల్, అభిజిత్, మోనాల్ గొడవను ఎత్తి చూపాడు. దీంతో సీరియస్ అయిన అఖిల్.. అభిజిత్‌తో మోనాల్ మాట్లాడకపోవడం తనిష్టం. నేనేమీ తనను ఆపలేదు అని క్లారిటీ ఇచ్చాడు. నేను అన్న మాటకు బయట మా అమ్మానాన్న కూడా హర్ట్ అయి ఉండవచ్చని అఖిల్ చెప్తూ ఉండగా మాస్టర్ మధ్యలో కలగజేసుకుని ఎవరికి అమ్మానాన్న లేరు? అంటూ ఆవేశంతో విరుచుకుపడ్డారు. నువ్వు పెద్ద నేరం చేశావంటూ అభిజిత్ తొలిసారి మోనాల్‌ను నామినేట్ చేశాడు. మొత్తంగా మోనాల్, మెహబూబ్, అఖిల్, లాస్య, అమ్మ రాజశేఖర్, అరియానా గ్లోరీ ఈ నామినేషన్ ప్రక్రియలో ఉన్నట్లు లీకువీరులు చెప్తున్నారు. (చదవండి: కెప్టెన్ అయ్యాడో లేదో కొత్త రూల్స్ పెట్టేశాడు) మోనాల్‌ను మెంటల్ టార్చర్ చేస్తున్నారు ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు మోనాల్‌పై సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్ ప్రక్రియ వచ్చిన ప్రతిసారి టాస్కుల్లో పర్ఫామెన్స్‌కు బదులు ఆమె క్యారెక్టర్‌ను నిందిస్తూ మానసికంగా టార్చర్ చేస్తున్నారని ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతవారం మెహబూబ్ కోసం నామినేషన్లోకి వెళ్లిన అరియానాను మెహబూబ్ నామినేట్ చేయడాన్ని తప్పు పడుతున్నారు. ఇక అమ్మ రాజశేఖర్ వేరొకరి విషయాన్ని ప్రస్తావించడాన్ని కూడా విమర్శిస్తున్నారు. ఏదైతేనేం.. మాస్టర్ నామినేషన్లోకి వస్తే పంపించేయడం కోసం ఎంతోమంది నెటిజన్లు కాచుకుని కూచున్నారు. ఈ లెక్కన ఈ వారం మాస్టర్ బ్యాగు సర్దుకుని ఇంటి బాట పట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. (చదవండి: దివి ఎలిమినేట్, లాస్యపై బిగ్‌బాంబ్) -
నోయల్.. నీకు క్యారెక్టర్ లేదు: మాస్టర్ ఫైర్
బిగ్‌బాస్ నాల్గో సీజన్లో తొలి వారాల్లోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అన్నింటినీ దింపేశారు. మొదటగా వచ్చిన కుమార్ సాయిని ఇంటిసభ్యులు కలుపుకోలేక, చివరికి ఏకాకిగానే వీడ్కోలు తీసుకున్నాడు. తర్వాత వచ్చిన అవినాష్ బిగ్‌బాస్ హౌస్‌లో ఓ కొత్త ఎనర్జీని నింపుతూ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాడు. మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీ స్వాతి దీక్షిత్ మెరుపుతీగలా పట్టుమని పది రోజులు కూడా ఉండకుండా వచ్చినదారినే వెళ్లిపోయింది. ఆమె వెళ్లినప్పుడు అందరికన్నా ఎక్కువ బాధపడ్డ ఏకైక వ్యక్తి నోయల్. అమ్మ రాజశేఖర్ ఆమెను నామినేట్ చేయడం వల్లే ఎలిమినేట్ అయిందని నోయల్ మనసులో ఓ అభిప్రాయం బలంగా నాటుకుపోయింది. స్వాతి ఎలిమినేషన్‌తో మొదలైన గొడవ దీంతో ఇదే కారణాన్ని ప్రస్తావిస్తూ అతడు మాస్టర్‌ను నామినేట్ చేశాడు. ఇది ఆయనకు నచ్చలేదు. అమ్మాయి కోసం తనను నామినేట్ చేస్తావా? అని ఆగ్రహంతో ఊగిపోయాడు. నీ వల్ల నేను వెళ్లిపోతే నువ్వు జీవితాంతం బాధపడాలంటూ శాపనార్థాలు పెట్టాడు. అప్పటినుంచి వీరి మధ్య దూరం పెరిగిపోయింది. అయితే ఈ దూరాన్ని తగ్గించుకునేందుకు మొన్న నోయల్ ముందుకు వచ్చి మాస్టర్‌కు అరగుండు గీశాడు. అయినా సరే వాళ్లు తిరిగి మామూలైనట్లు కనిపించడం లేదు. నేటి ఎపిసోడ్లో మరోసారి గొడవ పడుతున్నట్లు తెలుస్తోంది. (చదవండి: నోయల్‌కు శాపం పెట్టిన అమ్మ రాజశేఖర్) నోయల్‌పై విరుచుకుపడ్డ మాస్టర్ తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో ప్రకారం.. "నా దృష్టిలో ప్రామిస్ పెద్ద విషయం.. అది ఇప్పుడు కాకపోతే నేను చనిపోయాకైనా మీకు అర్థమవుతుంది" అని నోయల్ చెప్తుంటే మరి నా ప్రామిస్ మిస్ చేశావ్ కదా! అని మాస్టర్ ఎదురు తిరిగాడు. నేను మాటిస్తే మనిలబడతానని రాసిస్తానని నోయల్ అంటుంటే మాస్టర్ మళ్లీ వ్యక్తిగత దూషణకు దిగాడు. 'కెమెరా కోసం డ్రామాలు.. ప్రామిస్ మీద నిలబడే క్యారెక్టర్ నీకు లేదు. బయటకు వెళ్లినా కూడా ఎన్ని అనాలో అన్ని అంటాను' అని విరుచుకుపడ్డాడు. ఈ గొడవతో అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఇక గొడవ జరిగినందుకు అభికి హ్యాపీ అని నోయల్ అన్నాడు. అంటే అభిజిత్ నోయల్ దగ్గర మాస్టర్ ప్రస్తావన తీసుకుచ్చాడా? ఈ క్రమంలోనే వారికి వాగ్వాదం జరిగిందా? అనేది నేటి ఎపిసోడ్లో తేలనుంది. (చదవండి: మాస్టర్‌పై ప్రతీకారం తీర్చుకున్న స్వాతి దీక్షిత్) -
దివి గర్ల్‌ఫ్రెండ్ అట, తెగ ఫీలవుతున్న మాస్టర్
బిగ్‌బాస్ హౌస్ నుంచి ఇప్పటివరకు ఏడుగురు కంటెస్టెంట్లు బయటకు వచ్చేశారు. ఇంకో పన్నెండు మంది ఉన్నారు. షో అర్ధశతకం పూర్తి చేసుకునేందుకు దగ్గరకు వచ్చింది. అయినా సరే షోలో మెరుపులు కనిపించడం లేదు. ప్రారంభంలో వచ్చిన రేటింగ్స్‌ను బిగ్‌బాస్ కాపాడుకోలేకపోతోంది. వారం వారం రేటింగ్స్ దారుణంగా పడిపోతున్నాయి.ప్రారంభంలో వచ్చిన రేటింగ్స్‌ను బిగ్‌బాస్ కాపాడుకోలేకపోతోంది. వారం వారం రేటింగ్స్ దారుణంగా పడిపోతున్నాయి. ఇన్నిరోజులు కావస్తున్నా షోలో ఎలాంటి మ్యాజిక్ కానీ ఆసక్తికర అంశాలు కానీ పెద్దగా చోటు చేసుకోవడం లేవు. గొడవలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఉన్నదల్లా అవినాష్, అఖిల్‌తో మోనాల్ సరసాలే ఎక్కువయ్యాయి. ఇదిలా వుంటే బిగ్‌బాస్ తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో అమ్మ రాజశేఖర్ తనను తాను ఓ ప్రేమికుడులా ఫీల్ అవుతున్నారు. (నువ్వు పెద్ద తోపు, తురుమేం కాదు: అఖిల్) మొదట్లో దివి మార్నింగ్ మస్తీలో ఇంటి సభ్యులందరి గురించి తన అభిప్రాయాన్ని ఫటాఫట్ చెప్పింది. అప్పటినుంచి దివికి బయటే కాదు, లోపల కూడా ఫాలోయింగ్ పెరిగింది. అలా మాస్టర్ ఆమెతో జట్టు కట్టాడు. కాగా నేటి ఎపిసోడ్లో ఉదయం వచ్చే పాటకు మాస్టర్ రెచ్చిపోయి స్టెప్పులేసినట్టున్నాడు. ఆ విషయాన్ని దివి ప్రస్తావిస్తూ.. పొద్దునే అంత డ్యాన్స్ చేశావేంటి అని అడిగింది. నన్ను ఫాలో అయ్యావా మరి అని మాస్టర్ అడగ్గా 'అక్కడ ఫాలో అయ్యేలా ఉందా అసలు..' అని దివి చెప్పుకొచ్చింది. అటు సోహైల్ మాత్రం ఈ వయసులో కూడా బాగా డ్యాన్స్ చేస్తున్నాడంటూ పరువు తీశాడు. ఆ తర్వాత దివి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అప్పటికే తెగ ఫీలవుతున్న మాస్టర్.. పక్కన గర్ల్‌ఫ్రెండ్ ఉంటే అలా ఎందుకురా మాట్లాడుతావ్? అని సోహైల్‌ను వేడుకున్నాడు. దీంతో 'ఇప్పటి నుంచి నిన్ను ఎంతో హైట్ లేపుతాను' అంటూ సోహైల్ మాస్టర్‌కు మాటిచ్చాడు. (మోనాల్‌కు గోరుముద్దలు తినిపించిన అఖిల్) -
'కావాలనే మాస్టర్‌ను సేవ్ చేస్తున్నారు'
ఈ వారం ప్రారంభంలో కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ జరిగింది. అందులో బిగ్‌బాస్ ఇంటిసభ్యులతో రకరకాల డీల్స్ కుదుర్చుకున్నాడు. అయితే సగం గుండు, సగం మీసం తీసుకోవాలన్న డీల్‌కు మాత్రం అందరూ ముఖం తిప్పుకున్నారు. కానీ అమ్మ రాజశేఖర్ మాత్రం తాను చేస్తానంటూ ముందుకు వచ్చాడు. కానీ అమ్మ చనిపోయినప్పుడు కూడా గుండు కొట్టించుకోలేదని ఎమోషనల్ అయ్యాడు. దీంతో సగం గుండు వల్ల ఒరిగేదేమీ లేదని ఇంటిసభ్యులు నచ్చజెప్పడంతో ఆయన వెనకడుగు వేశాడు. కానీ అదే డీల్‌ను నాగార్జున మళ్లీ తెరపైకి తీసుకువచ్చారు. అరగుండు, సగం మీసం తీసుకుంటే వచ్చే వారం నామినేషన్స్ నుంచి సేఫ్ అవుతారని ఆఫర్ ప్రకటించారు. (చదవండి: బిగ్‌బాస్: ఆమెపై వేలాడుతున్న ఎలిమినేషన్ కత్తి) దీంతో మళ్లీ మాస్టర్ ముందుకు వచ్చి తాను చేస్తానని చెప్పుకొచ్చాడు. ఒకసారి ఆలోచించుకోండని సమయమిచ్చినా కూడా అదే మాట మీద నిలబడ్డాడు. దీంతో నోయల్ అతడికి సగం గుండు గీకాడు. మాస్టర్ చేసిన పనికి దివి తెగ ఎమోషనల్ అయి బోరుబోరున ఏడ్చేసింది. మాస్టర్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. అమ్మ గురించి చేయని త్యాగం ఇప్పుడు చేశారని నాగ్ చప్పట్లు కొట్టి అతడిని ప్రశంసించారు. అయితే తర్వాతి వారం ఎలిమినేషన్ నుంచి తప్పించడానికే మాస్టర్ కోసం ఈ డీల్ పెట్టినట్లు కనిపిస్తోందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. (చదవండి: సంచాలకుడిగా నువ్వు కరెక్ట్ కాదు: అవినాష్) -
నాగార్జునతో బిగ్ డీల్ కుదుర్చుకున్న మాస్టర్
గత కొద్దిరోజులుగా బిగ్‌బాస్ నాల్గో సీజన్ వ్యాఖ్యాత మారనున్నాడంటూ బోలెడన్ని వార్తలు వినిపించాయి. మొదట అనుష్క, తర్వాత రమ్యకృష్ణ, ఈ మధ్య రోజా పేర్లు వినిపించాయి. కానీ బిగ్‌బాస్ యాజమాన్యం వీటిని ఖండిస్తూ ఎలాంటి ప్రకటనా వెలువడించలేదు. వీకెండ్లో నేరుగా నాగార్జునే కనిపించడంతో అవన్నీ గాలివార్తలేనని తేలిపోయాయి. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో ప్రకారం నేడు, రేపు కూడా కూడా నాగార్జునే హోస్ట్‌గా అలరించనున్నారు. వీక్ డేస్‌లో ఇంటిసభ్యులు చేసిన తప్పొప్పులను ఎత్తిచూపుతూ వారితోనే సవరించనున్నాడు. కాగా ఈ వారం ప్రారంభంలో బిగ్‌బాస్ కంటెస్టెంట్లతో డీల్స్ కుదుర్చుకుని టాస్క్ చేయించిన సంగతి తెలిసిందే. (చదవండి: బిగ్‌బాస్: అరగుండుకు మాస్టర్ ఒప్పుకుంటాడా?) అందులో ఒకటైన అరగుండు, అరగడ్డం గీసుకోవడానికి మాత్రం ఏ ఒక్కరూ ధైర్యం చేయలేకపోయారు. అఖిల్ టీమ్‌లో ఉన్న అమ్మ రాజశేఖర్ చేస్తానని ముందుకు వచ్చినప్పటికీ ఆఖరు నిమిషంలో తన వల్ల కాదని వెనుకడుగు వేశాడు. కానీ నాగ్ మరోసారి ఇదే టాస్కు ఇస్తూ బంపర్ ఆఫర్ ప్రకటించారు. అరగుండు గీసుకుంటే తర్వాతి వారం నామినేషన్స్ నుంచి మినహాయింపు ఉంటుందని వెల్లడించారు. దీంతో మాస్టర్ డీల్‌కు అంగీకరించాడు. అతడికి నోయల్ దగ్గరుండి అరగుండు గీసాడు. దీనికి మాస్టర్ కన్నా దివి ఎక్కువగా బాధపడుతోంది. ఏదేమైనా మాస్టర్ చేసిన త్యాగం వల్ల వచ్చే వారం నామినేషన్స్ నుంచి మినహాయింపు పొందినట్లు కనిపిస్తోంది. (చదవండి: వెన్నుపోటు పొడిచిన మాస్టర్‌పై స్వాతి బిగ్‌బాంబ్) -
బిగ్‌బాస్: అరగుండుకు మాస్టర్ ఒప్పుకుంటాడా?
బిగ్‌బాస్ నాల్గో సీజన్లో ఆరో వారం ఇంటి సభ్యులు తొలిసారి టీమ్ వర్క్‌లో ఐకమత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అంతకు ముందు ఇచ్చిన టాస్క్‌లలో టీమ్స్‌గా విడగొట్టినా వ్యక్తిగతంగా ఎవరి ఆట వారు ఆడటానికే ఇష్టపడేవారు. కానీ ఈసారి మాత్రం టీమ్ కోసం ఎంత కష్టమైనా సరే త్యాగాలు చేసేందుకు సిద్ధపడుతుండటం విశేషం. కాగా బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా వారిని బ్లూ, రెడ్ టీమ్‌లుగా విడగొట్టాడు. బ్లూ టీమ్‌లో హారిక జుట్టు కత్తిరించుకోగా, కుమార్ బట్టలు చింపుకోవడంతో పాటు ఎక్కువ సేపు ఇసుక బస్తాను గాలిలో నిలిపాడు. (చదవండి: అరియానా కళ్లకు కాటుక రుద్దిన అవినాష్) రెడ్ టీమ్‌లో అభిజిత్ తనకు సంబంధించిన అన్ని వస్తువులను పంపించేయగా, లాస్య ఓ డ్రింక్‌ను తాగింది.మోనాల్ జనపనార బట్టలను ధరించింది. దీంతో ఇప్పటివరకు రెండు టీమ్‌లు చెరో మూడు డీల్స్ పూర్తి చేశాయి. నేడు బిగ్‌బాస్ వారికి మరిన్ని డీల్స్ ఇవ్వనున్నాడు. అందులో భాగంగా.. ఒకరు తల, గడ్డం సగం షేవింగ్ చేసుకోవాలని చెప్పాడు. ఇందుకు అమ్మ రాజశేఖర్ తాను సిద్ధమంటూ ముందుకు వచ్చాడు. కానీ అతనికి జుట్టు అంటే చాలా ఇష్టమని రెడ్ టీమ్ గుసగుసలు పెడుతోంది. ఇక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం బ్లూ టీమ్ విజయం సాధించగా నోయల్ రెండోసారి కెప్టెన్ అయ్యాడట. మరి ఇదెంత వరకు నిజమనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు ఎదురు చూడాల్సిందే. (చదవండి: ట్రయాంగిల్ స్టోరీకి ఎండ్ కార్డ్ వేస్తున్న అభి!) -
బిగ్‌బాస్‌లో ఆ నవ్వు దూరం కానుందా?
బిగ్‌బాస్ హౌస్‌లో రోజులు గడిచేకొద్దీ ఆట మీద ఫోకస్ పెరుగుతోంది. కానీ ఇదే క్రమంలో కొందరి ఫోకస్ మాత్రం వేరేవాళ్లపై పెట్టడంతో వారి గేమ్ పట్టాలు తప్పుతున్నట్లు కనిపిస్తోంది. ఏదేమైనా ఇప్పటికే బిగ్‌బాస్ ఇంట్లో చాలా మార్పులు వచ్చాయి. సూర్య కిరణ్, కరాటే కల్యాణి, దేవి నాగవల్లి, స్వాతి దీక్షిత్ వెళ్లిపోయారు. ఇక చూస్తుండగానే ఐదోవారం ఎలిమినేషన్‌కు సమయం దగ్గర పడింది. ఈ సారి నామినేషన్లో అభిజిత్, అఖిల్, మోనాల్, సోహైల్, లాస్య, అరియానా, అమ్మ రాజశేఖర్, నోయల్, సుజాత ఉన్నారు. వీరిలో ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు? ఎవరు డేంజర్ జోన్లోకి వచ్చారో చదివేయండి. ఓటింగ్లే ఆ ఇద్దరే టాప్ నామినేషన్లోకి తరచూ వస్తున్న కంటెస్టెంట్ల లిస్టులో అభిజిత్ మొదటి స్థానంలో ఉన్నాడు. కానీ నామినేషన్లోకి వచ్చిన ప్రతిసారి అతడికే ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. ఓటింగ్ దాదాపు సగం వరకు ఓట్లు అభిజిత్‌కే గుద్దేస్తున్నారు. దీంతో ఎలిమినేషన్ గండం నుంచి సునాయాసంగా తప్పించుకోగలుగుతున్నాడు. ఈసారి కూడా అందరి కన్నా ఎక్కువ ఓట్లు అతడికే రావడంతో సేఫ్ జోన్లో అడుగుపెట్టాడు. తర్వాత అఖిల్‌కు ఎక్కువ ఓట్లు రావడంతో అతడు కూడా ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నాడు. లాస్యకు ప్రేక్షకుల ఫుల్ సపోర్ట్ లాస్య నామినేషన్లోకి వచ్చినా అందుకు గల కారణాన్ని ప్రేక్షకులు అంగీకరించలేదు. ఆమె చేసిన పప్పు కూర వల్ల ఇంటిసభ్యులకు మోషన్స్ అవుతున్నాయని చెప్పడం ప్రేక్షకులకు సిల్లీగా అనిపించింది. అంతేకాక దివి పాయింట్‌ను గంగవ్వ తోపాటు కిచెన్‌లో ఉండే రాజశేఖర్ కూడా వ్యతిరేకించారు. అలాగే జనాలు కూడా లాస్య ఏ తప్పూ చేయనందున ఆమెకు సపోర్ట్ చేస్తూ ఓట్లు గుద్దేస్తున్నారు. (చదవండి: బిగ్‌బాస్: మళ్లీ ఇంటికి పోతా అంటున్న గంగవ్వ) బాబాలా మరిపోతున్న నోయల్ సేఫ్ నోయల్.. అందరిమీద అభిప్రాయాన్ని రుద్దడాన్ని తగ్గించుకోమని నాగ్ సూచించినప్పటి నుంచి నోయల్ పూర్తిగా మారిపోయాడు. ఎదుటివారు కోపంగా మాట్లాడినా, చిరాకుతో చూసినా నవ్వుతూనే సమాధనమిస్తున్నాడు. నోయల్ బాబాలా మారడంపై ఆయన అభిమానులు కలవరపాటుకు లోనవుతున్నారు. అయితే ఎవరి మీద నోరు జారకుండా, అనవసర విషయాల్లో తలదూర్చనందుకు అతనికి కూడా బాగానే ఓట్లు వచ్చి పడ్డాయి. దీంతో నోయల్ మళ్లీ సేఫ్ అయినట్లు తెలుస్తోంది. అరియానాకు అవకావమిస్తున్నారు ముక్కుసూటిగా మాట్లాడే అరియానాకు షో ప్రారంభంలో పెద్దగా అభిమానులు లేరు. కానీ ఆమె ఆటతీరు, ఉన్నదున్నట్లు ముఖం మీద చెప్పే విధానం, ఎలాంటి సేఫ్ గేమ్ ఆడకపోవడం, టాస్క్‌లో శక్తి మేర ప్రయత్నించడం వల్ల అందరి దృష్టి ఆమె మీద పడింది. పులిహోర కలిపేవాళ్లకు కాకుండా ఇలా నిజమైన గేమ్ ఆడేవాళ్లకు అవకాశమిద్దామని ఆమెను ఎలిమినేట్ అవకుండా కాపాడుతున్నారు. (చదవండి: బిగ్‌బాస్: రీ ఎంట్రీ కోసం స్వాతి ఫ్యాన్స్ ఆందోళన) ఆ సాంప్రదాయం ప్రకారం సోహైల్ కూడా సేఫ్ బిగ్‌బాస్ హౌస్‌లో ఓ సాంప్రదాయం ఉంది. కెప్టెన్‌గా గెలిచిన కంటెస్టెంట్ ఎలిమినేట్ కారు. ఈ సాంప్రదాయం కొనసాగితే సోహైల్ ఈ వారం ఎలిమినేషన్ నుంచి గట్టెక్కుతారు. గత వారం కూడా కుమార్‌సాయి నామినేషన్లో ఉన్నప్పటికీ కెప్టెన్‌గా గెలిచినందున ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నారు. కాబట్టి ఈసారి కూడా సోహైల్ విషయంలో దాదాపు అదే జరగనుంది. (చదవండి: బిగ్‌బాస్: సుజాతపై పగ పట్టిన నెటిజన్లు) డేంజర్ జోన్లో మాస్టర్, సుజాత మిగిలిన ఇద్దరు అమ్మ రాజశేఖర్, సుజాత. ముందుగా మాస్టర్ గురించి చెప్పాలంటే ప్రతిదానికి తను పెద్దవాడినని అందరిపై జులుం ప్రదర్శిస్తాడు. అతనికి వ్యతిరేకంగా మాట్లాడినా, నామినేట్ చేసినా సహించలేడు. ఆటలో భాగమేనని సర్దుకుపోలేడు. వ్యక్తిగతంగా తీసుకుని శాపనార్థాలు పెడతాడు. ఇలా ఎంతోమంది మాస్టర్‌ను గురువు, డాడీ అంటూ అతడి చేతిలో బలయ్యారు. తన కోపమె తన శత్రువు అన్న వాక్యం ఇప్పుడు ఆయన విషయంలో పని చేస్తోంది. అతని ప్రవర్తనకు చిర్రెత్తుకొచ్చిన బిగ్‌బాస్ ప్రేమికులు ఆయన్ను హౌస్ నుంచి పంపించేయాలని ఎదురు చూస్తున్నారు. దీంతో అతడికి ఈ సారి తక్కువ ఓట్లే వచ్చాయి. సుజాతపై వేలాడుతున్న ఎలిమినేషన్ కత్తి సుజాతకు నవ్వు ప్లస్సా? మైనస్సా? అన్నది ప్రశ్నార్థకంగా మారనుంది. ఎందుకంటే ఆమె నవ్వితే బాగుంటుందని స్వయంగా నాగార్జునే చెప్పారు. దీంతో అందలమెక్కి కూర్చున్న ఆమె నవ్వడమే పనిగా పెట్టుకుంది. ఇది చూసిన ప్రేక్షకులు ఆమెకెవరైనా నవ్వడం ఆపమని చెప్పండ్రా బాబూ అని తలలు పట్టుకుంటున్నారు. అంతా ఫేక్ నవ్వు అని విమర్శిస్తున్నారు. ఇది కాసేపు పక్కన పెడితే అందరిదీ ఒక రూటైతే ఆమెది సెపరేటు రూటు. నాగ్‌ను అందరూ సర్ అని పిలిస్తే సుజాత మాత్రం బిట్టూ అని హొయలు పోతుంది. అలా పిలిపించుకోవడం నాగ్‌కు ఎలా ఉన్నా ఆయన అభిమానులకు మాత్రం ఒళ్లు మండిపోతోంది. పైగా గాసిప్స్ రాణి కూడా అయిన ఈ సుజాతను ఈ వారం ముల్లెమూట సర్దుకుని నేరుగా ఇంటికి పంపించాలని వీక్షకులు నిర్ణయించుకున్నారు. ఇప్పటివరకు వచ్చిన ఓట్ల ప్రకారం సుజాతకే అత్యంత తక్కువ ఓట్లు వచ్చాయి. స్వల్ప ఓట్ల తేడాతో అమ్మ రాజశేఖర్ తర్వాతి స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఓటింగ్‌కు ఈ రోజు అర్ధరాత్రి వరకు సమయం ఉండటంతో ఈ స్థానాలు తలకిందులవుతాయో, అలాగే ఉండిపోతాయో చూడాలి! -
'అమ్మో' రాజశేఖర్, మళ్లీ శాపం పెట్టాడు!
బిగ్‌బాస్ అనేది రియాలిటీ షో. ఇక్కడ నామినేషన్ ప్రక్రియ అయినా, గేమ్ అయినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటన్నింటినీ ఎదురీదుకుంటూ స్పోర్టివ్‌గా ముందుకెళ్లాలి. కానీ ఇప్పుడున్న 15 మందిలో ఒక్కరికి మాత్రం ఈ స్పోర్టివ్‌నెస్ అనేది ఇసుమంతైనా లేదు. అందరూ గురువు, డాడీ అని పిలుచుకుంటూ యసుకు పెద్దరికం ఇస్తుంటే అమ్మ రాజశేఖర్ మాత్రం ఏదో బాబాలా ఫీల్ అయిపోతున్నాడు. అతనేం చేసినా కరెక్టే కానీ ఇతరులు చేస్తే మాత్రం తప్పని వాదిస్తున్నాడు. పోనీ తప్పని చెప్తే సరిపోతుంది, కానీ అక్కడితో ఆగకుండా శాపనార్థాలు పెడుతున్నాడు. మొదట సోహైల్ మీద విరుచుకుపడ్డాడు. (చదవండి: మాస్టర్‌పై ప్రతీకారం తీర్చుకున్న స్వాతి దీక్షిత్) నిన్న నామినేట్ చేసినందుకు అరియానా మీద ప్రతాపాన్ని చూపించాడు. ఇప్పుడు స్వాతి విషయంలో నామినేట్ చేసినందుకు నోయల్‌పై నోరు పారేసుకున్నాడు. నోయల్ స్వాతి గురించి చెప్పడం మొదలు పెట్టగానే విసుగు ప్రదర్శించాడు. వేరే ఎవరికైనా చెప్పుకో పో అన్నాడు. అమ్మాయి అయినా, అబ్బాయైనా నేనలానే ఉంటానని నోయల్ అనడంతో చిన్నపిల్లలకు చెప్పుకో, ఎందుకు నన్ను మళ్లీ మళ్లీ చంపేస్తున్నావ్ అని కోపగించుకున్నాడు. (చదవండి: బిగ్‌బాస్ షో నుంచి వైదొలుగుతా: నోయల్) "నేను ఇంట్లో ఉండకూడదు అని ప్లాన్ చేశావు, నీ కోసం ఈ వారం నేను బయటకు వెళ్లాలి, అది నువ్వు జీవితాంతం బాధపడాలి" అని శాపనార్థాలు పెట్టాడు. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు మాస్టర్ ఓవర్ యాక్టింగ్ నానాటికీ భరించలేనంతగా పెరిగిపోతుందని, అతడిని వెంటనే పంపించేయాలని నెటిజన్లు అంటున్నారు. ఎవరైనా తనను నామినేట్ చేస్తే చాలు, జన్మ అంతా ఫీల్ అవుతావ్ అని శాపాలు పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ సారి డబుల్ ఎలిమినేషన్ పెడితే ఆ సుజాతను, ఈ అమ్మో రాజశేఖర్‌ను హౌస్ నుంచి బయటకు పంపించేస్తామని చెబుతున్నారు. (చదవండి: నేడే ఎలిమినేషన్: స్వాతి దీక్షిత్ అవుట్) -
వెన్నుపోటు పొడిచిన మాస్టర్‌పై స్వాతి బిగ్‌బాంబ్
పోయిన వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన స్వాతి దీక్షిత్‌ను సాదరంగా ఆహ్వానించి దేవత అని కీర్తించిన మాస్టర్ ఆమె ఫేక్‌గా అనిపిస్తోందని నామినేట్ చేశాడు. కానీ అందుకు విరుద్ధంగా ఆమెతో మాత్రం అందరితో కలిసిపోవాలని, నువ్వెలాగో సేవ్ అయిపోతావని నామినేట్ చేసినట్లు కప్పి పుచ్చాడు. కానీ మాస్టర్ ఏమన్నాడనేది నేటి ఎపిసోడ్లో చూపించడంతో ఆయన అసలు రంగు బయటపడింది. వెన్నుపోటు పొడిచిన అమ్మ రాజశేఖర్‌పై స్వాతి బిగ్‌బాంబ్ ద్వారా ప్రతీకారం తీర్చుకుంది. ఇక నేడు కూడా ఎలిమినేషన్ ఉందని కంటెస్టెంట్లను భయపెట్టించిన నాగ్ చివరి నిమిషంలో అందరూ సేఫ్ అని ప్రకటించారు. జంబలకిడి పంబలో అమ్మాయిల కన్నా కూడా ఆడ వేషం కట్టిన అబ్బాయిలే బాగా పర్ఫార్మ్ చేశారు. మరి నేటి బిగ్‌బాస్ ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో చదివేయండి.. లాస్య అవకాశవాది, మోనాల్ ఏమార్చే వ్యక్తి నిన్న ఎలిమినేట్ అయిన స్వాతి దీక్షిత్ నేడు స్టేజీ పైకి రాగా, ఆమెతో నాగ్ గేమ్ ఆడించారు. అందులో భాగంగా కుమార్‌ను నక్క తోక తొక్కిన వ్యక్తిగా పేర్కొంది. అన్నం పెట్టిన అమ్మ రాజశేఖర్ మోసం చేశారని స్వాతి వాపోయింది. నమ్మకద్రోహం చేశాడని బాదపడింది. దీంతో సేఫ్ గేమ్ ఆడకూడదన్న విషయం తనకు బోధపడిందని మాస్టర్ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత స్వాతి.. సుజాతను పుకార్ల పుట్టగా అభివర్ణించింది. సోహైల్‌ను దొంగగా, లాస్యను అవకాశవాదిగా, నోయల్‌ను గుడ్డిగా నమ్ముతాడని, మోనాల్‌ను గుడ్డిగా నమ్మకూడదని, ఆమె ఏమార్చే వ్యక్తి అని, మెహబూబ్ మిగతావాళ్లను అనుసరిస్తున్నాడని చెప్పుకొచ్చింది. అరియానా ఓవర్ కాన్ఫిడెన్స్, హారిక ట్యూబ్‌లైట్, అభిజిత్ అహంకారి, గంగవ్వ చాడీల చిట్టా, అఖిల్ గమ్యం లేని వ్యక్తిగా అభిప్రాయపడింది. అవినాష్ తనకు హౌస్‌లో ఫేవర్రెట్ అని పేర్కొంది. కెప్టెన్సీ రేసులో మాస్టర్ పాల్గొనడానికి వీలు లేదని అతడిపై బిగ్‌బాంబ్ వేసింది. (చదవండి: బిగ్ బాస్: సెలబ్రెటీలకు ఒరిగిందేంటి?) సోహైల్‌ను చూసి విజిలేసిన నాగ్ బిగ్‌బాస్ హౌస్‌లో అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ సమానమే అని నాగ్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని రుజువు చేసేందుకు ఇంటిసభ్యులందరితో జంబలకిడి పంబ స్కిట్ చేయించారు. అంటే ఆడవాళ్లు మగవాళ్లుగా, మగవాళ్లు ఆడవాళ్లుగా తయారయ్యారు. వాళ్ల పేర్లను కూడా మార్చేశారు. అనంతరం ఒక్కొక్కరిని గార్డెన్ ఏరియాలోకి రమ్మన్నారు. సోనాల్(సోహైల్) నడుస్తూ ఉంటే మాత్రం నాగ్ విజిల్ వేస్తూ అమ్మాయిని పిలవలేదు కదా అని భ్రమపడ్డారు. (చదవండి: మీరు సిగ్గుపడితే చచ్చిపోవాలనుంది: నాగ్) ఖుషీ సీన్‌ను ఖూనీ చేసిన హారిక, అవినాష్ అమ్మాయిల్లో ఎవరు మీకు బాగా నచ్చారన్న ప్రశ్నకు అరియానా సోహైల్‌ను, దివి మెహబూబ్‌ను, గంగవ్వ కుమార్‌ను, మోనాల్ సోహైల్‌ను, లాస్య మెహబూబ్‌తో పాటు సోహైల్‌ను, సుజాత అమ్మ రాజశేఖర్ ఇష్టమని చెప్పింది. తర్వాత లాస్య, మెహబూబ్‌లు జంటగా డ్యాన్సు చేశారు. హారిక, అవినాష్ "ఖుషీ" సినిమాలోని నడుము సీన్ స్కిట్‌ను సర్వ నాశనం చేశారు. ఈ అవకాశం పోతే మళ్లీ రాదన్నట్లుగా మోనాల్, అఖిల్ కలిసి రొమాంటిక్ డ్యాన్స్ చేశారు. సుజాత, అమ్మ రాజశేఖర్ "చూడాలని ఉంది" చిత్రంలో చిరంజీవి, సౌందర్యల సీనును కళ్ల ముందు ఉంచారు. (చదవండి: బిగ్‌బాస్: అందుకే గంగవ్వను గెలిపించారా?) కబడ్డీ ఆటలో మెహబూబ్ టీమ్‌దే గెలుపు గంగవ్వ, కుమార్ సాయి 'ముత్యాలు వస్తావా..' డ్యాన్స్ చేస్తుంటే కుమార్‌ది విగ్గు, చీర ఊడిపోవడంతో అందరూ ఘొల్లుమని నవ్వారు. దివి, నోయల్ అతడులో మహేశ్‌బాబు, త్రిష సీనును రక్తి కట్టించారు. అరియానా, సోహైల్ 'రత్తాలు రత్తాలు' పాటకు ఇరగదీశారు. అభిజిత్, హారిక 'సామజవరగమన' పాటకు సాల్సా డ్యాన్స్ చేశారు. మిమ్మల్ని ఇలా చూసి తనకేం కలలు వస్తాయోనని నాగ్ భయపడ్డారు. అనంతరం డ్యాన్స్‌లో అరియానా, సీనులో అమ్మ రాజశేఖర్, సుజాతలను బెస్ట్ పర్ఫార్మర్లుగా ప్రకటించారు. తర్వాత ఎప్పటిలా సాధారణ వేషానికి వచ్చిన ఇంటిసభ్యులతో 'బెలూన్ కబడ్డీ' ఆట ఆడించారు. మెహబూబ్, సోహైల్, దివి, మోనాల్, హారిక, అరియానా, నోయల్ ఏ టీమ్ కాగా మిగతా వాళ్లంతా బీ టీమ్‌గా ఏర్పడ్డారు. అవినాష్ కామెంటేటర్‌గా వ్యవహరించాడు. తర్వాత టీమ్ ఏ గెలిచినట్లు నాగ్ ప్రకటించారు. (చదవండి: బిగ్‌బాస్: మాస్టర్ కాళ్లు పట్టుకున్న సోహైల్) మొదటి స్థానంలో అభిజిత్ ఏకగ్రీవం నామినేషన్లో ఉన్న హారిక, కుమార్ సాయి, అభిజిత్, సోహైల్, మెహబూబ్, లాస్యలకు ఎలిమినేషన్ ఉందంటూ నాగ్ చెమటలు పట్టించారు. ఈ ఆరుగురిని హౌస్‌లో వారి ప్రాధాన్యతను బట్టి నిలబడమన్నారు. దీంతో తొలుత అభిజిత్, రెండో స్థానంలో మెహబూబ్, మూడో స్థానంలో లాస్య నిలబడ్డారు. మిగిలిన స్థానాల్లో నిలబడే విషయంలో మాత్రం బేధాభిప్రాయాలు వచ్చాయి. దీంతో అరియానా వారి పనితీరు ఆధారంగా కుమార్, సోహైల్, హారికలను వరుసగా 4,5,6 స్థానాల్లో నిలబెట్టింది. అవినాష్, అఖిల్ మాత్రం సోహైల్ నాలుగో స్థానంలో ఉండాలని అభిప్రాయపడ్డారు. అయితే ప్రేక్షకులు మాత్రం ఇక్కడున్న స్థానాలకు వ్యతిరేకంగా ఉన్నారని నాగ్ బాంబు పేల్చారు. కానీ వాళ్లే మీ అందరినీ సేఫ్ చేశారని చెప్పడంతో ఈ వారం గండం గట్టెక్కామని నామినేటెడ్ కంటెస్టెంట్లు ఊపిరి పీల్చుకున్నారు. -
బిగ్‌బాస్: మాస్టర్ కాళ్లు పట్టుకున్న సోహైల్
గత మూడు సీజన్లుగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్‌బాస్ నాలుగో సీజన్లో మరో మెట్టు ఎక్కువ వినోదాన్ని పంచేందుకు ప్రయత్నిస్తోంది. విభిన్న టాస్క్‌లతో కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇస్తోంది. ఇప్పటికే 24 ఎపిసోడ్లను పూర్తి చేసుకొని 25వ రోజులోకి అడుగుపెట్టింది. గురువారం కూడా కాయిన్ల టాస్క్ కొనసాగింది. మాస్టర్‌పై అరిచినందుకు సోహైల్ తన దగ్గరకు వచ్చి మాస్టర్ కాళ్లు పట్టుకున్నారు. స్విచ్ కాయిన్ ద్వారా సుజాతకు ఊహించని వరం లభించింది. సోహైల్‌పై మాస్టర్ విరుచుకుపడగా ఎవరూ ఊహించని వ్యక్తి ఇంటి కెప్టెన్ అయ్యాడు. ఇంకా ఈ రోజు ఏం జరిగిందంటే.. అరియానాపై సుజాత ఫైర్ లాస్య, అమ్మ రాజశేఖర్ మాస్టర్ మాట్లాడుతుండగా.. సోహైల్ వచ్చి మాస్టర్ కాళ్లు పట్టుకొని క్షమాపణలు కోరాడు. మాస్టర్ నుంచి కాయిన్లు దొంగిలించిన కారణంగా తను ఇలా క్షమాపణలు కోరాడు. .. తన పక్కన కూర్చొబెట్టి బుజ్జగించాడు. తన మీద కోపం లేదని, ఏదో కోపంలో అలా చేశానని సంజాయిషీ చెప్పుకున్నాడు. నువ్వే నన్ను అర్థం చేసుకోకుండా నా దగ్గర కాయిన్లు తీసుకున్నావ్ అని మాస్టర్ సోహైల్‌కు హితబోధన చేశాడు. అందరూ రిలాక్స్ అయిపోవడంతో బిగ్‌బాస్ ఇంటి సభ్యులను హెచ్చరించాడు.. ఆటను కొనసాగించాలని ఆదేశించాడు. తిరిగి ఆటను కొనసాగించారు. కిల్లర్ కాయిన్స్ రెండో భాగంలో దివి, అరియానా, సోహైల్, నోయల్, మాస్టర్ అవుట్ అవ్వడంతో తప్పుకున్నాడు. ఎక్కువ పాయింట్లు ఉన్న వారిని టార్గెట్ చేయాలని అరియానా చెప్పడంతో ఆమెపై సుజాత ఫైర్ అయ్యింది. నువ్వు రన్నింగ్ కామెంట్ ఇవ్వొద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండో లెవల్ పూర్తయింది. ఓవైపు అరియానా, సుజాత గొడవ పడుతుండగా.. మరోవైపు అఖిల్, మాస్టర్ మధ్య వాదన మొదలైంది. అమ్మాయిల మాదరి ఇంట్లోకి వెళ్లి దాక్కున్నాడని మాస్టర్ మండిపడ్డారు. చదవండి : బిగ్‌బాస్: అందరి కన్ను సోహైల్ పైనే అనంతరం మూడో లెవల్ ప్రారంభమైంది. ఇదే అఖరిది కూడా. ఆ లెవల్లో ఆఖరు బజర్ మోగేలోపు ఇంటి సభ్యులు అందరూ సామా, భేద,దాన, దండోపాయాలు ఉపయోగించి తమ దగ్గర ఉన్న కాయిన్ల విలువను పెంచుకునేందుకు ప్రయత్నించాలి. అవినాష్‌కు కాయిన్లు పట్టకునేందుకు అరియానా సాయం చేసింది. లాస్చ, మాస్టర్‌కు కాయిన్లు ఇచ్చేసింది. అవినాష్వి కూడా మాస్టర్‌కు ఇచ్చేసింది. సోహైల్, మెహబూబ్‌కు ఇచ్చేశాడు. తన దగ్గర తీసుకున్న కాయిన్లనను తనకు ఇచ్చేయమని మాస్టర్, సోహైల్‌ను అడిగాడు. లేకుండే తన మనసు కుదుటపడదని వాపోయాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మాస్టర్‌కు కాయిన్లు ఇవ్వకంటూ మెహబూబ్ సోహైల్‌కు నూరిపోశాడు. (బిగ్‌బాస్: కాసుల వేటలో గెలుపెవరిది!) తర్వాత ఇంటి సభ్యులంతా తమ దగ్గర ఉన్న కాయిన్లను లెక్కించి బిగ్‌బాస్‌కు చెప్పారు. అఖిల్, మోనాల్, సోహైల్ తమ పాయింట్లను మెహబూబ్‌కు ఇచ్చేశారు. ఇప్పడు సుజాత దగ్గర ఉన్న స్విచ్ కాయిన్‌ను ఉపయోగించి.. వేరే వాళ్ల కాయిన్లతో స్విచ్ చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని వాడుకొని సుజాత, మెహబూబ్ పాయింట్లను లాగేసుకుంది. చివరకు ఎక్కు పాయింట్లు ఉన్న కారణంగా సుజాత, అమ్మ రాజశేఖర్ మాస్టర్, కుమార్ సాయి, అలేఖ్య హారిక నలుగరు కెప్టెన్ పోటీదారులుగా ఎన్నికయ్యారు. తన పాయింట్లు పోవడంతో మెహబూబ్ కన్నిటీ పర్యంతమయ్యాడు. కష్టపడి ఆడిన తనకు అన్యాయ జరిగిందని ఆవేదన చెందాడు. అక్కడితో ఆ టాస్క్ ముగియడంతో హారిక, అభి, దివి జరిగిన దాని గురించి చర్చించుకున్నారు. (బిగ్‌బాస్: టాస్క్‌లో పడిపోయిన అవినాష్) మాస్టర్‌తో మాట్లాడాలని సోహైల్ కోరితే అందుకే మాస్టర్ ససేమిరా అన్నాడు. తన కాయిన్లు ఇచ్చేందుకు అవకాశం ఇచ్చిన సోహైల్ ఉపయోగించుకోలేదని రాజశేఖర్ మాస్టర్ అనగా.. గేమ్‌ను గేమ్ లానే ఆడానని, అస్సలు క్షమాపణలు చెప్పనని సోహైల్ తెగేసి చెప్పాడు. దీంతో తనతో జీవితంలో మాట్లాడనని మాస్టర్ శపథం చేశాడు. అనంతరం నలుగురు కెప్టెన్సీ పోటీదారులకు కాసుల వేట టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో భాగంగా గార్డెనింగ్ ఏరియాలో మట్టితో బురద గొయ్యి ఏర్పాటు చేసి అందులో కొన్ని కాయిన్లు పెట్టి ఉంచారు. బురదలోని కాయిన్లనుంచి టాస్క్ ముగిసే సమయానికి ఎవరి బాస్కెట్లో ఎక్కవ కాయిన్లు ఉంటే వారు ఇంటి కెప్టెన్ అవ్వనున్నారు. ఈ టాస్క్ సంచాలకులుగా సోహైల్ ఉన్నాడు. ఈ టాస్క్‌లో నలుగురు పోటీపడి మరి పోరాడారు. ఈ టాస్స్‌లో ఎవరూ ఊహించని విధంగా 100 పాయింట్ల అధిక్యతతో కుమార్ నాలుగో కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు. అనంతరం కెప్టెన్ బ్యాండ్‌ను ధరించాడు. గార్డెన్లో కూర్చొని ఉల్లాసంగా గడిపారు. అరియానుకు పిచ్చి పట్టింది. కానీ తనకు ఇప్పడే తెలిసిందని మాస్టర్ చెప్పాడు. ఇక స్వాతి, అఖిల్ మాట్లాడుకుంటుండగా.. అవినాష్ వారి సంభాషణలకు దూరం నుంచి ఫన్నీగా వాయిస్ ఇచ్చాడు. అలాగే గంగవ్వ అమ్మ వారు సోకితే ఎలా మాట్లాడతారో నటించి చూపిస్తూ ఇంటి సభ్యులకు వినోదాన్ని అందించింది. దీనంగా చూస్తున్న హారికను అభి ఆకస్మాత్తుగా వచ్చి భయపెట్టాడు. తర్వాత తనను వెనకనుంచి వచ్చి పట్టుకొని కూల్ చేశాడు. (కథ వేరే ఉంటది: మాస్టర్‌కు సోహైల్ వార్నింగ్) -
బిగ్‌బాస్: సోహైల్‌ను టార్గెట్ చేసిన కంటెస్టెంట్లు
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4లో కాయిన్ల టాస్క్ మరింత ముదురుతోంది. నిన్నటి వరకు తాము కూడగట్టుకున్న కాయిన్లను పదిలంగా దాచుకోడానికి ప్రయత్నించిన ఇంటి సభ్యులు ఇకపై ఇతరులు సంపాదించిన కాయిన్లను దొంగింలించేందుకు కాచుకు కూర్చున్నారు. తాజాగా విడుదలైన ప్రోమోలో బిగ్‌బాస్ కూడా మిగతా వారి నుంచి కాయిన్లు రాబట్టుకునేందుకు ఒకే చెప్పడంతో కంటెస్టెంట్లు రెచ్చిపోయారు. సామ, దాన, భేద, దండోపాయాలతో తమ వద్ద ఉన్న కాయిన్ల విలువలను పెంచుకునేందుకు నడుం బిగించారు. చివరి బజర్ మోగే వరకు ఎవరి వద్ద ఎక్కవ కాయిన్లు ఉంటే వారే ఈ టాస్క్ విజేతలుగా మారనున్నారు. దీంతో ఇప్పుడు కదా గేమ్‌లో అసలైన మజా రాబోతుందని జనాలు అభిప్రాయపడుతున్నారు, (బిగ్‌బాస్: కాసుల వేటలో గెలుపెవరిది!) ఇక ఎవరి నుంచి కాయిన్లు దొంగిలించాలో ఓ ప్లాన్ వేసుకున్న కంటెస్టెంట్లు పథకం ప్రకారం లాక్కోనున్నారు. ఇప్పటి వరకు ఎక్కువ సంఖ్యలో కాయిన్స్ సాధించిన సోహైల్, మెహబూబ్‌నే మిగతా వారందరూ టార్గెట్ చేసేలా కన్పిస్తున్నారు. అలాగే ఈ గేమ్‌లో అవినాష్‌ను పాయింట్స్ పట్టుకోమని తనకు సాయం చేస్తానని అరియానా పేర్కొంది. మాస్టర్ పాయింట్లు మాస్టర్‌కు ఇచ్చేద్ధాం అని సోహైల్ చెప్పగా ఇందుకు అఖిల్ వద్దు అని తెగేసి చెప్పేశాడు. కానీ మాస్టర్ మాత్రం తన వద్ద లాక్కున్న కాయిన్లకు తనకు ఇచ్చేమని కోరాడు. మరి ఇన్ని ఆలోచనలు చేస్తన్న ఇంటి సభ్యుల్లో చివరికి ఎవరి వద్ద అత్యధికంగా కాయిన్లు ఉంటాయో చెప్పడం ఊహించలేం. అది తెలుసుకోవాలంటే ఆ రోజు రాత్రి బిగ్‌బాస్ వచ్చేంత వరకు ఆగాల్సిందే. (కథ వేరే ఉంటది: మాస్టర్‌కు సోహైల్ వార్నింగ్) Task lo asala fun ipudu untundi...Evari Coins teskuntaru..Evaru return istaru??#BiggBossTelugu4 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/2XGvUPj8Ei — starmaa (@StarMaa) October 1, 2020 -
బిగ్‌బాస్: కాసుల వేటలో గెలుపెవరిది!
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4లో టాస్క్‌ల డోస్ పెరుగుతోంది. ముందు తేలికపాటి ఆటలను ఇంటి సభ్యులకు పరిచయం చేసిన బిగ్ బాస్.. పోనుపోనూ మరింత కఠినతరం చేస్తున్నాడు. ఇక హౌజ్‌లో గురువారం సైతం కిల్లర్ కాయిన్స్ టాస్క్ కొనసాగుతోంది. బుధవారం జరిగిన ఎపిసోడ్లో మోహబూబ్, సొహైల్ అందరికంటే ఎక్కవ కాయిన్స్ సంపాధించి మొదటి రెండు స్థానంలో ఉండగా.. కిల్లర్ కాయిన్స్ గేమ్ మొదటి లెవల్ ముగిసి రెండో లెవల్ జరుగుతోంది. ఈ గేమ్‌లో ఇంటిసభ్యులందరికి వెల్ ప్రో జాకెట్లను బిగ్‌బాస్ అందించగా కిల్లర్ కాయిన్‌ను ఇంట్లోని ఎవరైనా ఒకరి షర్ట్‌కు అతికించాలి. బజర్ మోగే సమయానికి ఎవరి వద్ద ఆ కాయిన్ ఉంటే వారి దగ్గర ఉన్న కాయిన్స్‌లో సగం కాయిన్స్ వేరే వారికి ఇచ్చేయాలి. కాగా తాజాగా విడుదలైన ప్రోమోలో కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా నలుగురు సభ్యుల మధ్య కాసుల వేట సాగుతోంది. (స్వాతి విషయంలో అభిజిత్‌ను నిలదీసిన హారిక) ఈ టాస్క్‌లో అమ్మ రాజశేఖర్ మాస్టర్, కుమార్‌సాయి, సుజాత, అలేఖ్య హారిక తమ సత్తాను నిరూపించుకునేందుకు పోటీపడనున్నారు. వీరంతా మట్టితో ఉన్న దాంట్లోకి దిగి ఆ బురద నుంచి కాసులను వెతికి తమ బాస్కెట్స్లో వేయాలి. సమయం ముగిసే సరికి ఎవరి దగ్గర ఎక్కు కావయిన్స్ ఉంటే వారు ఈ వారం కెప్టెన్సీ అయినట్లు. ఈ క్రమంలో నలుగురు సభ్యులు తమ ఒంట్లోని శక్తినంతా కూడగట్టుకొని పోటీ బరిలో దిగారు. ఎక్కువ సంఖ్యలో కాసలను సొంతం చేసుకోవడానికి ఇంటి సభ్యులు ఎత్తుకుపై ఎత్తు వేస్తున్నారు. ఈసారి ఎలాగైనా ఇంటి కెప్టెన్ అయ్యిందేకు రెడీ అయ్యారు. మరి ఈ ఆటలో గెలిచి నాలుగో ఇంటి కెప్టెన్ స్థానాన్ని ఎవరూ అధిష్టించారో తెలియాలంటే ఈరోజు ప్రసారమయ్యే బిగ్‌బాస్ షో చూడాల్సిందే. (కథ వేరే ఉంటది: మాస్టర్‌కు సోహైల్ వార్నింగ్) Captaincy aatalo coins veta!!!#BiggBossTelugu4 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/IOJYYkQsVB — starmaa (@StarMaa) October 1, 2020 -
బిగ్‌బాస్: టాస్క్‌లో పడిపోయిన అవినాష్
కాయిన్లు సంపాదించాలనేది బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్. దొంగతనం చేయడం కూడా టాస్క్‌లో ఓ భాగమే. కానీ రాత్రిపూట కూడా నిద్రపోకుండా జాగారం చేసి మరీ అందరి కాయిన్లు నొక్కేసినందుకు సోహైల్‌పై మిగతా హౌస్మేట్స్ అరిచారు. పైగా ఎవరి కాయిన్లు తీయను అంటూ అందరినీ నమ్మిస్తూనే నొక్కేసిన మాస్టర్.. తన కాయిన్లు పోయినందుకు సోహైల్‌పై కక్ష కట్టాడు. అసలే అతిగా ఆవేశపడే అతడు.. అందరూ తననే టార్గెట్ చేయడంతో కథ వేరే ఉంటది అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇక ఈ ఆటలో గంగవ్వ పాల్గొనకపోవడం గమనార్హం. నేటి ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో చదివేయండి.. గుట్టు రట్టవుతుందని మాస్టర్ కంగారు బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో భాగంగా కొందరు కష్టపడి కాయిన్లు సేకరిస్తుంటే మరికొందరు వాటిని నొక్కేయడంపైనే దృష్టి సారించారు. అలా హారిక కాయిన్లను సోహైల్ లేపేయగా, అక్కడ దాచానని ఎవరు చెప్పారని అడిగింది. తర్వాత చెప్తానులే అని మెహబూబ్ బదులిచ్చాడు. దీంతో ఎవరెవరు కాయిన్లను ఎక్కడెక్కడ పెట్టుకున్నారనేది అందరికీ జారవేస్తున్న మాస్టర్ తన గుట్టు ఎక్కడ బయటపడిపోతుందోనని భయపడ్డాడు. నాతో మాట్లాడకు అంటూ మెహబూబ్‌కు వార్నింగ్ ఇచ్చాడు. అభితో కాస్త దూరంగా ఉంటున్న హారిక ఈ రోజు అసలు సమస్యను అతడి ముందు ఏకరువు పెట్టింది. నువ్వు స్వాతికెందుకు సపోర్ట్ చేస్తున్నావు అని నిలదీసింది. ఆమె వచ్చి రెండు, మూడు రోజులే అవుతుంది, తనకిచ్చిన పని కూడా చేయలేకపోతోంది, డేంజర్ జోన్‌లోనూ ఏమీ లేదు. అలాంటిది ఆమె కోసం కిందపడీ, కొట్లాడీ నాణాలు సేకరించాల్సిన పనేంటని ప్రశ్నించింది. ఇది నేను జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పుకొచ్చింది. నా స్నేహితుడు అయి ఉండి నాకిస్తావనుకున్నా అని చెప్పడంతో అభిజిత్ చేయి పట్టుకుని సారీ చెప్పాడు. రాత్రంతా జాగారం చేసి మరీ దొంగతనం తర్వాత స్విచ్ కాయిన్‌ను మెహబూబ్ చేతులారా కిందపడేశాడు. అదే ముఖ్యమైన కాయిన్ అని బిగ్‌బాస్ ప్రకటించడంతో తెల్లముఖం వేసిన మెహబూబ్‌కు సోహైల్ క్లాస్ పీకాడు. ఆ తర్వాత అందరూ పడుకున్నాక సోహైల్, లాస్య, అరియానా డీల్ మాట్లాడుకుని మాస్టర్ దగ్గర ఉన్న మొత్తాన్ని లేపేశారు. ఆనందంతో సోహైల్ తీన్మార్ డ్యాన్స్ చేశాడు. కానీ తిట్లు, అపనిందలు మాత్రం అతడి మీదనే వచ్చి పడ్డాయి. సుజాత, నోయల్ దగ్గర కూడా మెహబూబ్ కాయిన్లు తీసుకుని ఉడాయించాడు. అందరూ గుర్రు పెట్టి నిద్రపోతున్నా రాత్రంతా జాగారం చేసి మరీ కష్టపడి దోచుకుని సోహైల్, మెహబూబ్ కిలాడీ దొంగల్లా నిలిచారు. (చదవండి: ఎలిమినేషన్: అతడు కాదు ఆమె!) గంగవ్వ మాత్రం సోహైల్కే సపోర్ట్ పొద్దునే తన కాయిన్లు కనిపించకపోయేసరికి షాకైన మాస్టర్ సోహైల్‌పై ఆగ్రహంతో ఊగిపోయాడు. మీరు ఎలా గెలుస్తారో చూస్తానని సవాలు విసిరాడు. చూస్తేనే దొంగల్లా ఉన్నారంటూ, వాళ్లను కొట్టేయాలన్నంత కసితో రగిలిపోయాడు. ఈ కోపం నుంచి బయటపడని మాస్టర్.. కుమార్‌పై తన చిరాకు ప్రదర్శించాడు. అతడిని నోరు మెదపనీయకుండా చులకనగా మాట్లాడాడు. అనంతరం బ్రాండ్లు కనిపించకుండా బట్టలు ఆరేస్తున్నారని, వాటిని తీసేయాలని బిగ్‌బాస్ లేఖ పంపించాడు. దీంతో అందరూ సోహైల్, మెహబూబ్ కాయిన్లపై పరిచిన వస్త్రాన్ని తీసేయాలని గొడవ చేశారు. కానీ గంగవ్వ, అఖిల్ మాత్రం సపోర్ట్ చేశారు. అక్కడ బ్రాండ్ వస్తువులే లేవని తేల్చి చెప్పారు. అనంతరం కిల్లర్ కాయిన్స్ టాస్క్ మొదటి లెవల్ పూర్తైనట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. (చదవండి: నేను పెళ్లి చేసుకోడానికి రాలేదు: అఖిల్) మెహబూబ్‌కే ఎక్కువ పాయింట్లు ఈ టాస్క్‌లో అవినాష్ 3160, మాస్టర్ 320, స్వాతి 1930, లాస్య 1560, అభిజిత్ 1770, నోయల్ 900, హారిక 1450, సోహైల్ 3620, మెహబూబ్ 4360, మోనాల్ 610, అఖిల్ 2570, అరియానా 1850, దివి 110, కుమార్ 1570, సుజాత 340 + స్విచ్ కాయిన్ సంపాదించుకున్నారు. కానీ ఇక్కడితో ఆట పూర్తవలేదు. ఇప్పుడు వీటిని కాపాడుకోవడంతో అసలు కథ మొదలవుతుంది రెండో దశలో కిల్లర్ కాయిన్‌ను ఎవరిపై అతికిస్తే వారి సగం పాయింట్లు ఆవిరైపోతాయి. అందరూ సోహైల్ మీదే పగ పట్టడంతో ఒకరినే టార్గెట్ చేస్తే కథ వేరే ఉంటదని హెచ్చరించాడు. దీంతో మాస్టర్, సోహైల్ ఒకరి మీద ఒకరు అరుచుకున్నారు. తర్వాత మోనాల్ అవుట్ అయింది. ఇంతలో అవినాష్ సొమ్మసిల్లి కిందపడిపోయాడు. ఏమయ్యిందోనని కంగారు పడిపోగా కాలు బెణికిందని చెప్పాడు. దీంతో అతడిని ఎత్తుకుని మెడికల్ రూమ్‌కు తీసుకెళ్లారు. ఇక మాస్టర్ కాయిన్లు అందరూ దొంగిలించినా తనను మాత్రమే ప్రశ్నించారని మోనాల్ వెక్కివెక్కి ఏడ్చింది. (చదవండి: బిగ్‌బాస్: రెండో వారం పడిపోయిన టీఆర్పీ) -
కథ వేరే ఉంటది: మాస్టర్‌కు సోహైల్ వార్నింగ్
బిగ్‌బాస్ హౌస్‌లో ఈ వారం ఇంటి సభ్యులు అంతా సోహైల్ మీద పడినట్లు అనిపిస్తోంది. నిన్న మార్నింగ్ మస్తీలో దొంగతనం ఎలా చేయాలో అతడు ఇంటిసభ్యులకు నేర్పించగా అందరూ బాగానే ఎంజాయ్ చేశారు. కానీ తర్వాత బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో అందరి కాయిన్లు మాయమవుతుంటే దివి సోహైల్‌పై అనుమానం వ్యక్తం చేసింది. అతడే దొంగ అనేసింది. దీంతో చేయని తప్పుకు దొంగ అని ముద్ర వేయకంటూ అతడు వీరావేశానికి లోనయ్యాడు. అరియానా, సుజాతతో కూడా గొడవ పడ్డాడు. ఈ టాస్కుకు ముందు అభిజిత్‌తోనూ ఘర్షణకు దిగాడు. ఇంతమందితో పెట్టుకుంది చాలదన్నట్లు నేడు అమ్మ రాజశేఖర్‌తో గొడవకు దిగాడు. ఈ మేరకు స్టార్ మా తాజాగా ప్రోమో రిలీజ్ చేసింది. (చదవండి: బిగ్‌బాస్‌కు మళ్లీ రావడం కష్టమే: దేవి) అది సోహైల్ ఊతపదమా? "ఒక్కరినే టార్గెట్ చేసి ఆడితే కథ వేరే ఉంటది" అని సోహైల్ అమ్మ రాజశేఖర్‌పై ఫైర్ అయ్యాడు. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో ఏంటి కొడతావా? అని మాస్టర్ మండిపడ్డాడు. అయితే దివికి సపోర్ట్ చేసే క్రమంలోనే వీరి మధ్య అగ్గి రాజుకున్నట్లు తెలుస్తోంది. కాగా కథ వేరే ఉంటది అన్న ఒక్క పదమే మాస్టర్‌కు మహా కోపం తెప్పించినట్లు తెలుస్తోంది. కానీ సోహైల్ గత ఫిజికల్ టాస్కులోనూ ఇదే డైలాగ్ వాడి రెచ్చిపోయాడుఏ. దీన్ని నాగార్జున సైతం వేలెత్తి చూపకుండా తేలికగా తీసుకుంటూ నవ్వేశాడు. దీంతో సోహైల్‌కు అది ఊతపదమని ఆయన అభిమానులు వెనకేసుకొస్తున్నారు. మాస్టర్ తన గేమ్ తను ఆడకుండా దివిది ఎందుకు ఆడుతున్నాడని ప్రశ్నిస్తున్నారు. మరికొందరేమో ఇలాంటి ప్రోమోలు నెవర్ బిఫోర్.. షో చూశాక వచ్చే డిసప్పాయింట్మెంట్ ఎవర్ ఆఫ్టర్ అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. (చదవండి: నువ్వేం తక్కువ కాదు: దివిపై సోహైల్ ఫైర్) -
నాతో జీవితంలో మాట్లాడకు: అమ్మ రాజశేఖర్
ఇంటి సభ్యుల కసి చూస్తుంటే బిగ్‌బాస్ ఇచ్చిన ఫిజికల్ టాస్క్ ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు. ఓవైపు నిద్రాహారాలు మాని గెలుపు కోసం పరితపిస్తున్న మనుషుల టీమ్ దెబ్బ తిన్న పులిలా ఉంటే, మరోవైపు అన్ని సౌకర్యాలు, సౌలభ్యాలను వాడుకుంటున్న రోబో టీమ్ గెలుపుకు ఆమడ దూరంలో ఉంది. ఇక్కడ మనుషుల టీమ్‌కు కండబలం ఉంటే ప్రత్యర్థి టీమ్‌కు బుద్ధి బలం ఉంది. దీంతో ఎత్తుకు పై ఎత్తులతో ఆట నడుస్తూనే ఉంది. అయితే మాస్టారు అంటూ అమ్మ రాజశేఖర్ దగ్గరకు వచ్చి కబుర్లు చెప్తూ నెమ్మదిగా చార్జింగ్ పెట్టేసుకుని వెన్నుపోటు పొడిచాడు అవినాష్. (చదవండి: బిగ్‌బాస్: శత్రువులుగా మారబోతున్న స్నేహితులు?) దీంతో ఆలస్యంగా విషయం అర్థమైన మాస్టర్‌కు లోపల ఎలా ఉన్నా బయటకు మాత్రం నవ్వేశాడు. కానీ తాజాగా రిలీజైన ప్రోమోను చూస్తుంటే ఆ విషయాన్ని అక్కడితో మర్చిపోకుండా మనుసులో పెట్టుకున్నట్లు అనిపిస్తోంది. "ఈ జీవితంలోనే కాదు, జన్మజన్మలలోనూ అవినాష్ తనతో మాట్లాడకూడదు" అని తేల్చి చెప్పాడు. నిన్నటి వరకు ఐకమత్యంగా ఉన్న మనుషుల టీమ్‌లోనూ బేధాభిప్రాయాలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తన టీమ్ సభ్యులు చెప్తున్నా వినకుండా రోబోలతో ఇచ్చిపుచ్చుకునేందుకు ఓ డీల్ కుదుర్చుకునేందుకు సిద్ధమైంది. ఇది రోబోల టీమ్‌కు ప్లస్ పాయింట్‌గా మారనుండగా మనుషుల టీమ్‌లో మరిన్ని గొడవలకు దారి తీసేలా కనిపిస్తోంది. మరి ఆమె నిర్ణయం హౌస్‌లో ఎంత రచ్చకు దారి తీస్తుందో నేటి ఎపిసోడ్లో చూడాలి. (చదవండి: చాలాసార్లు బతకాలనిపించలేదు: వితికా ) -
బిగ్‌బాస్: గెలవడం కోసం ఆమె ఏమైనా చేస్తుంది!
కరోనా లాక్ డౌన్ అనంతరం మొదలైన బిగ్‌బాస్ సీజన్ 4కు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దీన్ని ప్రసారం చేస్తున్న స్టార్ మాకు మంచి రేటింగ్ ను సంపాదించి పెట్టింది. బ్రాడ్ కాస్టింగ్ ఆడియన్స్ రిసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బార్క్) ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం, తొలివారం బిగ్ బాస్ లాంచ్‌ని 4.5 కోట్ల మంది ప్రేక్షకులు వీక్షించినట్లు పేర్కొంది. ఈ సీజన్ బిగ్‌బాస్ లాంచ్ ఇంతకుముందెన్నడూ లేని రేటింగ్స్ సాధించింది. దీంతో బిగ్ బాస్ తెలుగు 4 రసవత్తరంగా మారింది. బుల్లితెరపై ఈ షో విజయవంతంగా కొనసాగుతోంది. అయితే ఇప్పటి వరకు కంటెస్టెంట్లకు పెద్దగా శిక్షలు వేయని బిగ్‌బాస్ కూడా ఇప్పుడు పనిష్మెంట్లను ప్రారంభించారు. ఈ క్రమంలో హౌస్మెట్స్ అంతా కాస్తా గాడిలో పడినట్లు కన్పిస్తోంది. (బిగ్‌బాస్: ఒకరు సేఫ్, మరొకరు నామినేట్) తాజాగా విడుదల చేసిన ప్రోమోను చూస్తుంటే ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే అమ్మ రాజశేఖర్ మాస్టర్ కోపంగా కనిపిస్తున్నారు. అరియానా వద్ద కూర్చొని దేవి మీద చిటపటలాడాడు. దేవి తనతో ప్రతిదీ పోల్చుకుంటుందని, నేను డైరెక్టర్ అయితే తాను రిపోర్టర్ అని అరించిందన్నారు. దేవి మామూలిది కాదు, విజేత అవ్వడం కోసం ఎవ్వరిని ఏమైనా చేస్తుందని తెలిపారు. అయితే శనివారం నాగ్ ఇచ్చిన టాస్క్‌లో భాగంగా దేవి మాస్టర్‌పై ఫైర్ అవుతూ అతన్ని జీరోగా ప్రకటించిన విషయం తెలిసిందే. లాస్య కూడా మాస్టర్ జీరో అని తెలపడంతో ఆయన కొంచెం భావోద్వేగానికి లోనయ్యాడు. అందుకే ఈ రోజు ఎపిసోడ్లో తన మనసులోని కోపానంతా అరియానా ముందు వెల్లబోసుకున్నాడు. రాజశేఖర్ మాస్టర్ ఇలా కొత్త అవతారం ఎత్తడంతో గేమ్ మరో మలుపు తిరగబోతుందని అర్థమవుతోంది. ఇది చూసిన నెటిజన్లు మాస్టర్‌లో ఈ కోణం కూడా ఉందా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. (బిగ్‌బాస్: కాళ్లు మొక్కినా కనికరించలేదు!) #AmmaRajasekhar furious on #Devi...Game etu tirugutundi?#BiggBossTelugu4 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/XtWVTHxJWq — starmaa (@StarMaa) September 21, 2020 ఇదిలా ఉండగా మాస్టర్ ఎక్కువ తమిళ పదాలతోనే మాట్లాడుతుండంపై జనాలు గగ్గోలు పెడుతున్నారు. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో సగం జనాలకు అర్థం కావడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా అరవ భాష వదిలేసి తెలుగులో మాట్లాడితే బాగుంటాందని వ్యంగ్యంగా చెబుతున్నారు. అంతేగాక మాస్టర్ పోయిపోయి దేవికి పెద్ద విరాభిమాని అయిన అరియానా దగ్గర దేవి గురించి మాట్లాడటంతో ఈ రోజు రాత్రికి ఆమె అన్ని విషయాలు పూస గుచ్చినట్లు దేవితో చెప్పేస్తుందని అభిప్రాయపడుతున్నారు. మరి మాస్టర్ కోపానికి రావడానికి అసలైన కారణం ఏంటో తెలియాలంటే ఈ రోజు ప్రసారమయ్యే బిగ్‌బాస్ సీజన్ 4 చూసే వరకు ఆగాల్సిందే. -
బిగ్‌బాస్: కాళ్లు మొక్కినా కనికరించలేదు!
బిగ్‌బాస్ షోలో నిన్నటి ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది. అసలే నిన్న ఐపీఎల్ ప్రారంభం కావడంతో చాలామంది ప్రేక్షకులు బిగ్‌బాస్‌కు గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. కానీ అనూహ్యంగా బిగ్‌బాస్ గేమ్ మార్చాడు. డబుల్ ఎలిమినేషన్ అంటూ అందరిలో ఆసక్తి రేపాడు. మరోవైపు హీరో-జీరో గేమ్‌లో శ్రుతి మించిన కామెడీ అని లాస్య.. అమ్మ రాజశేఖర్‌ను జీరోగా పేర్కొంది. అక్కడితో ఆగకుండా ఓ ఫొటో షూట్ కోసం దివి ప్రెగ్నెంట్‌గా కనిపించేందుకు రాజశేఖర్ స్వయంగా ఆమెకు పిల్లో సర్దడం తనకు కరెక్ట్ అనిపించలేదని చెప్పుకొచ్చింది దివి పట్ల ఆయన అలా ప్రవర్తించాల్సింది కాదని చెప్పడంతో మాస్టర్ తట్టుకోలేకపోయాడు. తనకు ఎలాంటి ఉద్దేశం లేదని, అది టాస్క్ కోసం హడావుడిలో చేశానని చెప్పుకుంటూ ఏడ్చేశాడు. (బిగ్‌బాస్ నాకు సారీ చెప్పాలి: నోయల్) తన వల్ల ఏడ్చినందుకు బాధపడ్డ లాస్య అతడి కాళ్లు మొక్కి మరీ క్షమించమని కోరింది. అయినప్పటికీ హౌస్‌లో వాతావరణం మరింత వేడెక్కిందే కానీ చల్లబడలేదు. పైగా లాస్య తన పేరును ప్రస్తావిస్తూ చేసిన కామెంట్స్‌ను దివి జీర్ణించుకోలేకపోయింది. 'ఆ విషయంలో నాకెలాంటి అభ్యంతరం లేదు, మధ్యలో నీకెందుకు, షటప్' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. దివి యాటిట్యూడ్ చూసి షాకైన లాస్య నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడంటూ వార్నింగ్ ఇచ్చింది. అయితే మాస్టర్ ఏడ్వటంతో ఇంటి సభ్యులందరూ అతడిని ఓదార్చటమే కాక, చాలామంది మాస్టర్నే హీరోగా ప్రకటించారు. ఈ ఒక్క సన్నివేశంతో లాస్య విలన్‌గా మారిపోయింది. (బిగ్‌బాస్ పిచ్చి కామెడీ దారిలో వెళుతుంది: దేవి ఫైర్) కాగా దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. లాస్య తనకు అనిపించింది చెప్పారని, అయినా ఎవరి అభిప్రాయాలు వారికుంటాయంటూ ఆమెను వెనకేసుకొస్తున్నారు. దీన్ని మాస్టర్ పాజిటివ్‌గా తీసుకుంటే అసలు ఏ సమస్యా ఉండేది కాదని అభిప్రాయపడుతున్నారు. దివి నోరు జారడాన్ని సైతం విమర్శిస్తున్నారు. మరికొందరు మాత్రం మాస్టర్ ఇమేజ్ను దెబ్బతీసేందుకే లాస్య అలాంటి కామెంట్స్ చేసిందని మండిపడుతున్నారు. దివికే అభ్యంతరం లేనప్పుడు మధ్యలో ఆవిడకేంటని ప్రశ్నిస్తున్నారు. ఏదైతేనేం, నిన్న ఒక్క ఎపిసోడ్ హౌస్‌లో కార్చిచ్చును రాజేసింది. (ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ పనిష్మెంట్) -
దివి, నోరు అదుపులో పెట్టుకో: లాస్య వార్నింగ్
వైల్డ్ కార్డ్ కంటెస్టెంటుగా అడుగు పెట్టిన కుమార్ సాయి ఏకాకిగా మారాడన్న విషయం నేడు మరోసారి స్పష్టమైంది. ముందుగా ఊహించినట్టుగానే కళ్యాణి బిగ్‌బాస్ హౌస్‌కు గుడ్‌బై చెప్పింది. హీరో-జీరో గేమ్‌లో అమ్మ రాజశేఖర్ ఏడ్వడం, అందుకు కారణమైన లాస్యను దివి టార్గెట్ చేయడం, దీంతో ఖంగు తిన్న లాస్య దివిని నోరు అదుపులో పెట్టుకోమని వార్నింగ్ ఇవ్వడం జరిగాయి. మరి నేటి ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో చదివేయండి. గంగవ్వను చెల్లెలని పిలిచిన నాగ్ ఇప్పుడు ఆరోగ్యం మంచిగైంది కాబట్టి ఇంట్లో నుంచి వెళ్లిపోనని గంగవ్వ స్పష్టం చేసింది. తిరిగి ఎప్పటిలాగే జోష్‌గా ఉంటూ అవినాష్‌ను బర్రె ముక్కు అని వెక్కిరించింది. కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లిన గంగవ్వను నాగ్ చెల్లెలు అని పిలవడం గమనార్హం. అవ్వ అనడం మానేసి గంగమ్మ అని పిలిచారు. తర్వాత ఫొటో పోటీ జరిగింది. దీనికోసం మోనాల్.. అభికి ముద్దులిస్తూ ఫొటోకు పోజిచ్చింది. మెహబూబ్, దివి కూడా రకరకాల యాంగిల్స్‌లో ఫొటోలు క్లిక్‌మనిపించారు. అనంతరం అసలు సీన్ ప్రారంభమైంది. ఇంటి సభ్యులు ఎవరూ గేమ్‌ను సీరియస్‌గా తీసుకోవడం లేదని నాగ్ మండిపడ్డారు. (బిగ్‌బాస్: గంగవ్వకు కరోనా టెస్ట్) రియల్ గేమ్ ఆడేవాళ్లకే ఓట్లు: నాగ్ బిగ్‌బాస్ హౌస్‌కు వచ్చేదే గెలవడానికని నామినేట్ అయిన కంటెస్టెంట్లకు నాగ్ గడ్డి పెట్టారు. నామినేషన్ ప్రక్రియను సీరియస్‌గా తీసుకోమంటే దానిపై కూడా జోకులు పేల్చుతూ పాట పాడుకున్నారని గరమయ్యారు. గంగవ్వను నామినేట్ అయేలా చేసినందుకు నోయల్‌ను తిట్టిపోశారు. మంచివాళ్లు అని మార్కులు కొట్టేసేందుకు త్యాగాలు చేస్తున్నారు, కానీ ప్రేక్షకులు నిజంగా గేమ్ ఆడేవాళ్లకు మాత్రమే ఓట్లు వేస్తారని స్పష్టం చేశారు. తర్వాత గంగవ్వ సేఫ్ అయినట్లు వెల్లడించారు. అనంతరం హీరో-జీరో గేమ్ ఆడించారు. హీరో అనుకున్నవాళ్లను కుర్చీ మీద కూర్చోబెట్టాలి. జీరో అనుకున్నవాళ్లను మెడబట్టి అక్కడ ఏర్పాటు చేసిన ద్వారం గుండా బయటకు గెంటేయాలని తెలిపారు. బిగ్‌బాస్ పిచ్చి కామెడీ దారిలో వెళుతుంది: దేవి ఫైర్ నోయల్.. హీరోగా మాస్టర్‌ను, జీరోగా కుమార్ సాయిగా తెలిపారు. సుజాత.. హీరోగా అమ్మ రాజశేఖర్‌ను, జీరోగా కళ్యాణిని, సోహైల్.. హీరోగా నోయల్‌ను, జీరోగా కళ్యాణిని, దేవి.. హీరోయిన్గా అరియానాను, జీరోగా అమ్మ రాజశేఖర్ పేరు చెప్పింది. ఈ సందర్భంగా దేవి మాట్లాడుతూ.. బిగ్‌బాస్ పిచ్చి కామెడీ దారిలో వెళుతుందని ఏడుస్తూ చెప్పుకొచ్చింది. కామెడీ చేస్తే ఇక్కడ హీరోలా అని అమ్మ రాజశేఖర్‌ను దుమ్ము దులిపింది. నామినేషన్ ప్రక్రియ తర్వాత నుంచి తనను వేరు చేసి చూస్తున్నారని ఆవేదన చెందింది. తర్వాత మెహబూబ్.. హీరోయిన్గా లాస్యను, జీరోగా కుమార్‌ను, కుమార్.. హీరోగా అభిజిత్‌ను, జీరోగా నోయల్‌ను, హారిక.. హీరోగా అభిజిత్‌ను, జీరోగా కుమార్ సాయిని, లాస్య.. హీరోయిన్గా గంగవ్వను, జీరోగా అమ్మ రాజశేఖర్ పేరును వెల్లడించింది. (రొమాంటిక్ డ్యాన్స్; కళ్లు మూసుకున్న అరియానా) పంపించేయండంటూ కన్నీళ్లు పెట్టుకున్న మాస్టర్ శ్రుతి మించిన కామెడీ నచ్చలేదని లాస్య చెప్పింది. దివి గర్భవతిగా నటించాల్సి వచ్చినప్పుడు మాస్టర్ వెళ్లి ఆమెకు పిల్లో సర్దడం నచ్చలేదని చెప్పింది. దీంతో హర్ట్ అయిన మాస్టర్ 'నేను వెళ్లిపోతాను, అసలు కామెడీనే చేయను, నన్ను పంపించేయండి' అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. షూటింగ్లో అవన్నీ సాధారణమేనని, తప్పేమీ కాదని, మాస్టర్ ఉండవల్సిందేనని గంగవ్వ బల్లగుద్ది చెప్పింది. అందరికీ నచ్చాల్సిన అవసరం లేదంటూ నాగ్ మాస్టర్‌ను ఊరడించారు. తర్వాత కళ్యాణి.. హీరోయిన్గా గంగవ్వను, జీరోగా సుజాతను, అరియానా.. హీరోయిన్గా గంగవ్వను, జీరోగా కళ్యాణిని, అఖిల్, మోనాల్.. హీరోగా గంగవ్వను, జీరోగా కుమార్ సాయిని, అవినాష్, గంగవ్వ.. హీరోగా అమ్మ రాజశేఖర్‌ను, జీరోగా కుమార్ సాయి పేర్లు చెప్పారు. దివి, లాస్య మధ్య రాజుకున్న గొడవ అభిజిత్.. హీరోగా గంగవ్వను, జీరోగా అరియానా, అమ్మ రాజశేఖర్.. హీరోగా నోయల్‌ను, జీరోగా దేవి నాగవల్లి, దివి.. హీరోగా అమ్మ రాజశేఖర్, జీరోగా సాయి కుమార్ పేర్లను చెప్పారు. దివి మాట్లాడుతూ.. మాస్టర్ హౌస్‌లో లేకపోతే అందరికీ మెంటలెక్కిపోతుందని చెప్పుకొచ్చింది. అతని ప్రవర్తన ఎవరికీ తప్పు అనిపించలేదని పేర్కొంది. తన ఫొటో కోసం అతను పిల్లో పెట్టడం తప్పు కాదని తేల్చి చెప్పింది. తన విషయం గురించి అందరి ముందు మాట్లాడినందుకు లాస్యపై ఆగ్రహం వ్యక్తం చేసింది. షటప్, నీతో మాట్లాడనవసరం లేదు అని ముఖం మీద చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయింది. దీంతో షాకైన లాస్య నోరు అదుపులో పెట్టుకో అని వార్నింగ్ ఇచ్చింది. అనంతరం కళ్యాణి ఎలిమినేట్ అవుతున్నట్లు నాగ్ ప్రకటించగా ఇంటి సభ్యులు ఆమెను సాగనంపారు. (బిగ్‌బాస్: ఎక్కువ పారితోషికం అవినాష్‌కే) -
డబుల్ ఎలిమినేషన్; కళ్యాణి అవుట్!
బిగ్‌బాస్ రెండో వారంలోనే డబుల్ ఎలిమినేషన్ అంటూ పెద్ద బాంబ్ పేల్చాడు. దీంతో నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్లకు ముచ్చెమలు పట్టాయి. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో ప్రకారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లలో ఒకరిని నేటి ఎపిసోడ్‌లోనే పంపించేసినట్లు తెలుస్తోంది. ఆమె ముందుగా ఊహించిన కంటెస్టెంట్.. కరాటే కళ్యాణిగా కనిపిస్తోంది. నిజానికి ఈ మధ్య ఆమె అందరితో బాగానే ఉంటూ నవ్విస్తోంది. కానీ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్లు హౌస్‌లో అడుగు పెట్టిన మొదట్లోనే కాస్త ఎక్కువ నటించేస్తూ, గొడవలు పెట్టుకుంటూ నెగెటివిటీ సంపాదించుకుంది. అదే ఆమెకు వెన్నుపోటు పొడిచింది. ఇక అమ్మ రాజశేఖర్ వేసే జోకులకు ఇంటి సభ్యులు అందరూ హాయిగా నవ్వుకుంటారు. కానీ ఈ సారి మాత్రం వీకెండ్లో నాగార్జున ముందు మాత్రం ఆ జోకులపై సీరియస్ అవుతున్నారు. దీంతో బాధపడ్డ మాస్టర్ తాను వెళ్లిపోతానంటూ చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు. ప్లీజ్ పబ్లిక్, పంపించేయండి అని మోకాళ్లపై మోకరిల్లి దండం పెట్టి మరీ అభ్యర్థించాడు. మరి డబుల్ ఎలిమినేషన్‌కు బలయ్యేది మాస్టరా? లేక వేరేవారా? అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. కాగా కళ్యాణికి ఓట్లు వేయని నెటిజన్లు కొందరు ఇప్పుడు బాధపడుతున్నారు. ఆమె వెళ్లిపోతే ఎంటర్టైన్మెంట్ తగ్గిపోతుందని భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో డబుల్ ఎలిమినేషన్ అంటూ రాజశేఖర్‌ను పంపిస్తే మాత్రం బిగ్‌బాస్‌లో వినోదమే ఉండదని అభిప్రాయపడుతున్నారు. (అమ్మాయి పేరు కనిపించినా వదలడు) -
ప్లీజ్, వెళ్లిపోతా: గుక్కపెట్టి ఏడ్చిన మాస్టర్
గత కొద్ది రోజులుగా బిగ్‌బాస్ షో చూస్తున్న ప్రేక్షకులకు ఓ సందేహం తలెత్తుతోంది. 'ముక్కూ మొహం తెలీని కంటెస్టెంట్లను తీసుకొచ్చారు. సరే, కానీ వాళ్లేంటి ఏదో పిక్నిక్కు వచ్చినట్లు ఆడుకుంటున్నారు. ఫిజికల్ టాస్క్ వంటివి ఇంకా ఎప్పుడు మొదలెడతారు?" అని ప్రశ్నిస్తున్నారు. నిజంగానే ఇంట్లో ఉన్న వాళ్లు అందరిదగ్గరా మంచి మార్కులు కొట్టేయడానికే ప్రయత్నిస్తున్నారే తప్ప ఏ ఒక్కరూ గేమ్‌ను సీరియస్‌గా తీసుకోవడం లేదు. దీంతో అందరికీ ఓ రౌండ్ కౌటింగ్ వేయడానికి కింగ్ నాగార్జున సిద్ధమైనట్లు కనిపిస్తోంది. (బాంచెన్.. నా వల్ల అయితలే: ఏడ్చేసిన గంగవ్వ) పడవ ప్రయాణంలో కూడా నేను దిగిపోతానంటే నేను దిగిపోతానంటూ నామినేషన్ ప్రక్రియను లైట్ తీసుకున్నారు. ఆడుతూ పాడుతూ ఒక్కొక్కరు తమంతట తాముగా నామినేషన్లోకి వచ్చారు. ఇలా నామినేషన్ ప్రక్రియను తేలికగా తీసుకోవడంపై మండిపడ్డారు. ఈమేరకు తాజాగా రిలీజైన ప్రోమోలో ఎందుకు నామినేషన్లోకి రావాలనుకున్నారు అని నాగ్ హౌస్‌మేట్స్‌ను సూటిగా ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్పలేక ఇంటి సభ్యులు తెల్లమొహాలు వేసుకుని నేలచూపులు చూశారు. బిగ్‌బాస్ నామినేషన్స్‌ను సీరియస్‌గా తీసుకోమని చెప్పిన తర్వాత కూడా పడవలో ఆడుతూ పాడుతూ ఉండటాన్ని తప్పుపట్టారు. నీ ఆట నువ్వాడుకో అంటూ నోయల్ పైన ఫైర్ అయ్యారు. (నిద్రలేచిన బిగ్‌బాస్: కంటెస్టెంట్ల కళ్లు తెరిపిస్తాడా?) ఏంటి? సేఫ్ ఆడదామనుకుంటున్నారా? అని ప్రశ్నిస్తూనే అది జరగనివ్వనని నాగ్ తేల్చి చెప్పారు. మరో ప్రోమోలో జీరో అనుకున్నవాళ్లను పంపిచేయండని నాగ్ సూచించగానే అమ్మ రాజశేఖర్.. దేవి చేయి పట్టుకుని నడిచాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన దేవి కామెడీ చేసినవాళ్లే హీరోనా అని నాగ్‌ను తిరిగి ప్రశ్నించింది. అటు లాస్య కూడా శ్రుతి మించిన కామెడీ అని మాస్టర్‌పై మండిపడింది. దీంతో మాస్టర్ తాను వెళ్లిపోతానని కోరాడు. ప్లీజ్ అంటూ చేతులెత్తి మొక్కుతూ మోకాలిపై మోకరిల్లి కన్నీళ్లు పెట్టుకున్నాడు. మాస్టర్ కన్నీరు మున్నీరు కావడంతో ఇంటి సభ్యులు అతడిని ఓదార్చారు. గంగవ్వ మాస్టర్ ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. దగ్గరకు తీసుకుని అతడి కన్నీళ్లు తుడిచింది. -
బిగ్‌బాస్: ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
బిగ్‌బాస్ నాల్గవ సీజన్ రెండో వారం ముగింపుకు వచ్చింది. ఇప్పుడు మరో కంటెస్టెంటును ఇంటికి సాగనంపే సమయం ఆసన్నమైంది. ఇప్పటికే సూర్యకిరణ్ హౌస్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే అతడి ఎలిమినేషన్‌ను అందరూ ముందుగానే ఊహిస్తూ వచ్చారు. కానీ రెండో వారానికి వచ్చేసరికి మాత్రం ఎవరు వెళ్లిపోతారనేది ఉత్కంఠగా మారింది. పైగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని పక్కనపెడితే ఈ వారానికి గానూ అభిజిత్, గంగవ్వ, నోయల్, హారిక, అమ్మ రాజశేఖర్, సోహైల్, కళ్యాణి, కుమార్ సాయి, మోనాల్ ఇలా తొమ్మిది మంది ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు. మంచిగనే ఉన్న: గంగవ్వ వీరిలో గంగవ్వకు అందరికన్నా ఎక్కువ అభిమానులు ఉండటంతో ఆమె బయటకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. కానీ ఈ మధ్య ఆమె ఆరోగ్యం బాగోలేకపోవడంతో బిగ్‌బాస్ బయటకు పంపిస్తాడని వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడప్పుడే అలాంటి నిర్ణయం తీసుకునేటట్లు కనిపించడం లేదు. మరోవైపు ఆమె ఆరోగ్యంపై స్పందించిన గంగవ్వ టీం ఆమె మంచిగనే ఉందని, టెన్షన్ పడకుర్రి అని చెప్పుకొచ్చింది. దీంతో ఈ వారం గంగవ్వ బయటకు రాదని తేలిపోయింది. (చదవండి: బిగ్‌బాస్: అనారోగ్యంతో ఏడ్చేసిన గంగవ్వ) నోయల్ సేఫ్ అనవసరమైన వాటి కోసం అతిగా స్పందించడం, ఇతరుల అభిప్రాయాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తూ నోయల్ కొంత చెడ్డ పేరు మూటగట్టుకున్నాడు. కానీ ఈ మధ్య అలాంటి విషయాల్లో తలదూర్చడం తగ్గించేసుకున్నాడు. తన పనేదో తాను చేసుకుంటూ ఉన్న అభిమానులను కాపాడుకుంటున్నాడు. దీంతో నోయల్ కూడా సేఫ్ జోన్లో ఉన్నాడు. అభిజిత్, సోహైల్, మోనాల్, హారిక కూడా ఈ వారం గండం గట్టెక్కినట్లు తెలుస్తోంది. వీరి తర్వాత స్థానంలో తక్కువ ఓట్లు సంపాదించుకున్న అమ్మ రాజశేఖర్ ఉన్నాడు. (చదవండి: బిగ్‌బాస్ నాకు సారీ చెప్పాలి: నోయల్) డేంజర్ జోన్లో కళ్యాణి ఇక మొదట్లో పెద్ద గొంతేసుకుని, కయ్యానికి కాలు దువ్విన కళ్యాణి తర్వాత సైలెంట్ అయిపోయింది. అయినప్పటికీ ఆమె డేంజర్ జోన్లో ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కుమార్ సాయి హౌస్‌లో ఉన్నాడా? లేడా? అన్నట్టుగా ఉంది. అతడికి కూడా తక్కువ ఓట్లే పడ్డట్టు తెలుస్తోంది. మొత్తానికి కళ్యాణి, అమ్మ రాజశేఖర్, కుమార్ సాయి డేంజర్ జోన్లో ఉన్నారు. అయితే కళ్యాణి, అమ్మ రాజశేఖర్లో ఎవరు వెళ్లిపోయినా ఎంటర్టైన్మెంట్కు గండి పడుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో మాస్టర్‌కు హౌస్‌లో కొనసాగేందుకు ఛాన్సిచ్చే అవకాశం కనిపిస్తోంది. కళ్యాణిని బయటక పంపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. (చదవండి: గత సీజన్లను వెనక్కునెట్టిన బిగ్‌బాస్) -
గొంతు పెంచి మాట్లాడితే ఒప్పుకోను: దేవి
ఇన్నాళ్లకు బిగ్‌బాస్ తానున్నానంటూ ఉనికి చాటుకున్నాడు. ఇంటి నియమ నిబంధనలు పాటించనందుకు ఇంటి సభ్యులందరినీ శిక్షించాడు. మరోవైపు బీబీ టీవీ సాగదీతగా మారింది. మొదట సీరియల్ ఎపిసోడ్, తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్, నేడు కామెడీ షో నిర్వహించారు. జబర్దస్త్‌ను గుర్తు చేసిన ఈ కార్యక్రమంలో అవినాష్, సాయి కుమార్ రెండు టీమ్‌లుగా విడిపోయి నువ్వానేనా అన్న రీతిలో కామెడీ పండించారు. నేటి ఎపిసోడ్లో ఇంకేమేం జరిగాయో చదివేయండి.. టాస్క్ ఓడిపోవడంతో హర్టైన మాస్టర్, కూల్ చేసిన బిగ్‌బాస్ సాయి కుమార్ డ్రామా స్కిట్, అవినాష్ సినిమా స్కిట్ వేశారు. ఈ రెండు టీమ్‌లకు సమాన ఓట్లు పడగా చివరగా గంగవ్వ వేసిన ఒక్క ఓటుతో అవినాష్ టీమ్ గెలిచింది. దీంతో సాయి కుమార్ టీమ్‌లోని మాస్టర్ కాస్త హర్టయ్యాడు. కానీ రెండు గ్రూపులు గెలిచాయన్నదానికి సంకేతంగా బిగ్‌బాస్ రెండు రీల్ జ్యూస్ బాటిల్స్ పంపించడంతో ఇంటి సభ్యులు టైటిల్ గెలిచినంత ఆనందంగా ఫీలయ్యారు. తర్వాత దేవి తనను కాస్త దూరం పెడుతున్నారని హర్ట్ అయింది. మీరందరూ ఏదో మాట్లాడుకుని కావాలని తనను ఇలా చేస్తున్నారని అందరిపై అనుమానం వ్యక్తం చేసింది. అలాంటిదేం లేదని లాస్య ఎంత చెప్పినా ఆమె చెవికెక్కించుకోలేదు. (బిగ్‌బాస్: టీఆర్పీలో సరికొత్త రికార్డు) బిగ్‌బాస్‌తో సహా అందరూ సారీ చెప్పాలి మోనాల్, అభిజిత్, అఖిల్, నోయల్, హారిక తెలుగులో కాకుండా అన్యభాషల్లో మాట్లాడుతున్నారని బిగ్‌బాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు శిక్షగా వారందరూ బోర్డు మీద బిగ్‌బాస్ మమ్మల్ని క్షమించండి అని రాసుకొచ్చారు. ఏదైనా టాస్క్ కోసం పిలిచినప్పుడు ఇంటి సభ్యులు ఆలస్యంగా వస్తున్నారని బిగ్‌బాస్ తెలిపాడు. దీనికి శిక్షగా బెల్ కొట్టిన ప్రతీసారి ఇంటి సభ్యులు పరుగున ఒకచోటికి చేరి 20 గుంజీలు తీశారు. అయితే నిబంధనలు ఉల్లంఘించిన ప్రతిసారి లాస్య తన వస్తువును వదిలేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. (బిగ్‌బాస్‌లో నా వాయిస్, సంతోషంగా ఉంది: నందు) కెప్టెన్‌గా నోయల్ ఏకగ్రీవం తర్వాత సుజాత చిట్టి చిలకమ్మ పద్యం చెప్పే కొద్దీ మోనాల్ ముద్దుముద్దుగా పలుకుతూ నేర్చుకుంది. మరోవైపు చిన్న చిన్న విషయాలకు తెగ ఫ్రస్టేట్ అవుతున్న నోయల్ తనకు బిగ్‌బాస్‌తో సహా చాలా మంది సారీ చెప్పాలన్నాడు. ఈ శనివారం నాగ్‌ను అడిగి వెళ్లిపోతానన్నాడు. తర్వాత కొద్ది గంటలకే శిక్షాకాలం ముగిసినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. ఈ వారం లగ్జరీ బడ్జెట్ టాస్క్ బీబీ టీవీ విజయవంతంగా పూర్తి చేశారని అభినందించాడు. అనంతరం కెప్టెన్సీ కోసం నోయల్, మెహబూబ్, కళ్యాణి, అభిజిత్ పోటీ పడ్డారు. అందరూ ఏకాభిప్రాయంతో నోయల్‌ను రెండో కెప్టెన్‌గా ఎన్నుకున్నారు. అమ్మ రాజశేఖర్ వర్సెస్ దేవి నాగవల్లి ఎవరు ఏ పని చేయాలన్న విషయంలో దేవి, అమ్మ రాజశేఖర్ మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. గొంతు పెంచి మాట్లాడితే ఒప్పుకోనని దేవి కరాఖండిగా చెప్పేసింది. దీంతో ఖంగు తిన్న మాస్టర్ నీ వాయిస్ పెరిగితే ఏం లేదు, కానీ నా వాయిస్ పెరిగితే మాత్రం తప్పొచ్చిందా? అని అసహనానికి లోనయ్యాడు. అలా ఇద్దరి మధ్య కాస్త రభస జరగడంతో నోయల్ సర్ది చెప్పాడు. ఆ తర్వాత అవినాష్.. మోనాల్ ఎలా ప్రవర్తిస్తుందో చేసి చూపించడంతో ఆమె హర్ట్ అయింది. దీంతో అవినాష్ ఆమె దగ్గరికి వెళ్లి క్షమించమని కోరాడు. (నోయల్‌ను ఆడేసుకుంటున్న నెటిజన్లు) -
అమ్మాయి పేరు కనిపించినా వదలడు
అట్టహాసంగా ప్రారంభమైన బిగ్‌బాస్ నాల్గవ సీజన్.. మొదటి వారం నీరసంగానే సాగింది. హౌస్‌లో కోపానికి చిరునామాగా మారిపోయిన సూర్యకిరణ్ ఎలిమినేట్ కావడంతో హౌస్‌లో కాస్త ప్రశాంతత చోటు చేసుకున్నట్లు కనిపిస్తోంది. కానీ వైల్డ్‌కార్డ్ ఎంట్రీగా వచ్చిన సాయి కుమార్ కాస్త తత్తరపాటుకు లోనవుతున్నట్లుగా ఉంది. దీంతో హౌస్‌లో అడుగు పెట్టిన తర్వాత రోజే నామినేట్ అయ్యాడు. ఇదిలా వుంటే బిగ్‌బాస్ హౌస్‌లో ఇన్నాళ్లకు గొడవలు పక్కనపెట్టి కాస్త వినోదాన్ని పంచుతున్నట్లు కనిపిస్తోంది. (చదవండి: నేను చనిపోయాననుకున్నారు: సూర్యకిరణ్.) #AmmaRajasekhar and #KarateKalyani dance lo anukunnadi okkati ayindi okkati 😂 ??#BiggBossTelugu4 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/FEwhFICoV2 — starmaa (@StarMaa) September 15, 2020 ఈ మేరకు స్టార్ మా తాజాగా ఓ ప్రోమోను రిలీజ్ చేసింది. ఇందులో నోయల్.. కుళ్లు జోకులతో కామెడీ పండించే అమ్మ రాజశేఖర్‌ను రొమాంటిక్ డ్యాన్స్ చేయమన్నాడు. అది కూడా అతిగా ఆవేశపడే కరాటే కల్యాణితో. ఇంకేముంది.. ఇద్దరూ ఒకరికొకరు సరిపోయారు. వామ్మో, ఈ ఘోరాన్ని చూడలేను అన్నట్లుగా అరియానా కళ్లు మూసేసుకుంది. మరోవైపు మాస్టర్ కళ్యాణి చేయి పట్టుకుని లేపబోయి అతడే బొక్క బోర్లా పడ్డాడు. దీంతో కంటెస్టెంట్లు అందరూ పగలబడి నవ్వలేక చచ్చారు. (చదవండి: బిగ్‌బాస్: ఊరమాస్ స్టెప్పులేసిన దేవి) మరోవైపు ఉదయం రిలీజ్ చేసిన ప్రోమోలో కంటెస్టెంట్లు సరికొత్త అవతారాలతో దర్శనమిచ్చారు. దేత్తడి హారిక ఐటమ్ సాంగ్‌తో రెచ్చిపోనున్నట్లు కనిపిస్తోంది. రోజుకో టాలెంట్‌ను బయటపెడ్తూ ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్న దేవి నాగవల్లి.. "అబ్బాయి చూడటానికి అలా ఉన్నాడు. కానీ, పేపరు మీద అమ్మాయి అని పేరున్నా వదలడు" అంటూ నేటి ఎపిసోడ్లో కామెడీ పంచ్‌లు విసురుతోంది. వీరి స్కిట్లు నేడు ఏ మేరకు పేలుతాయో చూడాలి. (చదవండి: జిగిరీ దోస్త్ నోయల్‌కే సపోర్ట్: రాహుల్) BB TV show shoot lo special entertainment 📹 #BiggBossTelugu4 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/3tBKM2PQmr — starmaa (@StarMaa) September 15, 2020 -
బిగ్‌బాస్: ఈ వారం ఎలిమినేషన్లో ఉన్నది వీళ్లే
కరోనా కారణంగా కాస్తా ఆలస్యంగా ప్రారంభమైనా బిగ్‌బాస్ జనాల్లో మెల్లమెల్లగా పుంజుకుంటుంది. వారం రోజులుగా చప్పగా సాగిన కంటెస్టెంట్ల ప్రదర్శనలో మెరుగు కన్పిస్తోంది. తొటి సభ్యులతో పరిచయాలు పెంచుకుంటూ ప్రస్తుతం హుషారుగా ఉన్నట్లు కొట్టొచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా రెండో వారం రానే వచ్చింది. అర్థరాత్రి బిగ్‌బాస్‌లోకి ప్రవేశించిన కుమార్ సాయి దొంగలా దాక్కొని.. అక్కడ ఉన్న దేవితో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. ఇంట్లోకి ఎవరో వచ్చారని గమనించిన దేవి అతని ముఖం చూసేందుకు సాహసించింది. అయితే తనను చూడొద్దని దేవిని భయపెడుతూ సభ్యులను పిలుచుకు రావాలని కుమార్ కోరాడు. అనంతరం ఒక్కొక్కరిగా వచ్చి సాయి కుమార్‌తో మాట్లాడి ఇంట్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారని పసిగట్టారు. (బిగ్‌బాస్: నువ్వు హీరోయిన్, నేను హీరో) అంతేగాక అభిజిత్, మోనాల్ అర్థరాత్రి ఏకాంతంగా గుసగుసలు పెట్టుకున్నారు. ఇక ఉదయం కూడా మళ్లీ మోనాల్, అభిజిత్ రహస్యంగా మాట్లాడుకోవడంతో వీరి మధ్య ఎదో ఉందని ప్రజలకు సందేహిస్తున్నారు. అదే విధంగా అఖిల్ మోనాల్ గురించి లాస్యతో చాడీలు చెప్పేందుకు ప్రయత్నించి వెంటనే మళ్లీ మోనాల్‌ను పిలిచి తనతో కాస్తా కొంటెగా ముచ్చటించాడు. అఖిల్ వద్దకు వచ్చిన మోనాల్ ఎదో చెప్పే ప్రయత్నం చేయబోతుంటే యదవ యాక్టింగ్‌లు చేయకు అంటూ అఖిల్ నోరు పారేసుకున్నాడు. నీకేం చేయాలో తెలియదా అని అఖిల్ అనగానే. మంచిగా మాట్లాడు అంటూ మోనాల్ కూడా కొంచెం సీరియస్ అయ్యింది. ఇక ఈ వాదన అయిపోగానే ఇద్దరి మధ్య ఏర్పడిన చిరు గొడవను డైవర్ట్ చేస్తూ మోనాల్‌ను కూల్ అయ్యేలా మస్కా కొట్టాడు. మరోలా ఆలోచిస్తే ఈ రోజు చర్చంతా మోనాల్‌పై జరిగినట్లు కన్నిస్తోంది. (బిగ్‌బాస్: సూర్యకిరణ్ అవుట్, ఆమెపై బిగ్‌బాంబ్!) ఇదిలా ఉండగా ఈ రోజు నుంచి రేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఇంటి సభ్యులకు కావాల్సిన రేషన్‌ను దక్కించుకునేందుకు ఒకిరిని రేషన్ మేనేజర్‌గా ఎన్నుకోవాలి. వారికి రూమ్ తాళం ఇచ్చి అందులోని సమన్లు తెచ్చుకోవాలి. అ క్రమంలో ఈ పోస్టును అమ్మ రాజశేఖర్‌కు కెప్టెన్ లాస్య అప్పగించడంతో మాస్టర్, కెప్టెన్ లాస్య స్టోర్ రూమ్‌కు వెళ్లి కావాల్సిన వస్తువులను తీసుకొచ్చారు. (బిగ్‌బాస్: ముందు తనే వెళ్లిపోతానన్న గంగవ్వ) ఇక రెండో వారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ నేపథ్యంలో ఇంట్లోని 16 మంది గార్డెన్ ఏరియాలో ఉన్న పడవలోకి ఎక్కాలి. పడవ ప్రతి తీరం మధ్య ఆగినప్పుడు ఒక్కో సభ్యుడు దాని నుంచి ఖచ్చితంతగా దిగిపోవాల్సి ఉంటుంది. ఇలా తొమ్మిది తీరాల మధ్య పడవ ఆగుతుంది. అంటే 9 మంది నామినేషన్ అవుతారు. ఇక పడవలోకి కూర్చొని సభ్యులంతా సరదాగా పాటలతో హోరెత్తించారు. ఇక మొదటి తీరం రాకముందే పడవ నుంచి నేను పోత అంటే నేను దిగపోతా అంటూ ముందుకు వచ్చారు. ఇంతలోనే దిగేందుకు సరైన కారణం చెబితే తాను దిగిపోతానని కుమార్ సాయి తెలిపాడు. దీంతో ఎవరిని పడవ నుంచి దింపేయాలన్న చర్చ సభ్యుల్లో సాగింది. ఇంతోనే అభిజిత్ కలగజేసుకొని అవ్వ ఎక్కవ సేపు కూర్చోలేదని చెబుతూ మొదట పడవ దిగమని చెబుతామా అని సలహా ఇచ్చాడు. దానికి అవ్వ సరే చెప్పి తొలి రౌండ్లోనే దిగిపోయింది. అయితే ఊహించని విధంగా నోయల్ రెండో హారన్‌కు దిగిపోయాడు. మోనాల్ మూడో హారన్‌కు పడవ నుంచి దిగేసింది. (మైండ్ బ్లాక్ చేసిన దివి, దేవి) ఇంట్లోకి వచ్చిన కుమార్ మొదటి రోజే ఇంటి సభ్యులతో మైండ్ గేమ్ ఆడుతున్నట్లు తెలుస్తోంది. మనసులో దిగాలని లేకపోయిన మీరు చేస్తే దిగుతా అంటూ ప్రతి రౌండ్లో తెలివి ప్రదర్శిస్తూ వచ్చాడు. నాలుగో రౌండ్ మోగగానే పోహైల్, అయిదో బజర్‌కు కరాటే కళ్యాణి దిగిపోయింది. ఆరో హారన్‌కు అమ్మ రాజశేఖర్ పడవ నుంచి దిగేసి ఇంట్లోకి వచ్చేశారు. ఏడవ రౌండ్లో కుమార్, ఎనిమిది హారిక, తొమ్మిది అభిజిత్ దిగిపోయాడు. అయితే నామినేషన్లోకి వెళ్లినా తిరిగి సేఫ్ అవ్వగలం అన్న నమ్మకం ఉన్న వారు పడవ నుంచి దిగేసినట్లు తెలస్తోంది. నామినేట్ అయితే ఎలిమినేట్ అవుతామన్న భయంతో సుజాత, మెహబూబ్, దివి, అఖిల్ గుట్టు చప్పుడు కాకుండా చివరి దాకా పడవలోనే ఉన్నారు. చివరికి ఈ వారం నామినేషన్ ప్రక్రియ ముగిసింది. గంగవ్వ, నోయల్, మోనాల్, సోహైల్, కరాటే కళ్యాణి, అమ్మ రాజశేఖర్, కుమార్ సాయి, హారిక, అభిజిత్ నామినేట్ అయ్యారు. మరి ఈ వారం సేఫ్ అయ్యేది ఎవరో, ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలియాలంటే ఈ వారమంతా బిగ్బాస్సై ఓ కన్ను వేయాల్సిందే. -
అలాంటి అమ్మాయి దొరకలేదు: అఖిల్
బిగ్‌బాస్ నాల్గవ సీజన్లో మొదటి వారం పూర్తి కావస్తోంది. ఈ వారం ప్రారంభంలో అరియానా ఓవరాక్షన్, మోనాల్ ఏడుపు, కల్యాణి, సూర్య కిరణ్ అరుపులు, గొడవలే ప్రధానంగా ఉన్నాయి. తర్వాత మీలోనే కట్టప్ప ఉన్నాడంటూ బిగ్‌బాస్ ఇంటి సభ్యులను భయభ్రాంతులకు గురి చేశాడు. ఈ క్రమంలో కట్టప్ప ఎవరా అనేదానిపైనే మూడు రోజులుగా టాస్క్ నడుస్తూ వస్తోంది. అయితే ఈ ఎపిసోడ్‌కు నేడు శుభం కార్డు వేస్తానంటున్నాడు కింగ్ నాగార్జున. అది ఎంతవరకు నిజమో నేటి ఎపిసోడ్ చూస్తే కానీ నమ్మలేం. ఇక కంటెస్టెంట్ల అందరినీ నవ్వుతూ పలకరించిన నాగ్ వారు చేసిన చిలిపి పనులను, తప్పొప్పులను గుర్తు చేస్తూ సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. (కంటెస్టెంట్ల ఎంపిక బాగోలేదు: కౌశల్) "కింగ్‌తో ఇంటిసభ్యులకు ఎన్కౌంటర్ టైమ్ స్టార్ట్ అయిందం"టూ స్టార్ మా తాజాగా ఓ ప్రోమోను విడుదల చేసింది. ఇందులో నాగ్.. సోహైల్‌కు బంపరాఫర్ ఇచ్చాడు. అరియానాను వీపు మీద కూర్చోబెట్టుకుని మరోసారి పుషప్స్ చేయించారు. అఖిల్.. నువ్వెప్పుడైనా ఇలా తీశావా? అని ప్రశ్నించగా తనకు అలాంటి అమ్మాయి దొరకలేదని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఒక్కో కంటెస్టెంటు గురించి నాగ్ ఆరా తీయడం మొదలుపెట్టారు. మోనాల్ ఏడుపు మీద కూడా సెటైర్ వేశారు, దయచేసి ఇప్పుడు మళ్లీ ఏడవద్దని వేడుకున్నారు. ఇక దివితో అమ్మ రాజశేఖర్ పులిహోర కలపడంపైనా కౌంటర్లు వేశారు. మిగతా ఇంటి సభ్యులను ఎలా ఎలా ఆట పట్టించారో? ఎవరి తప్పులను వేలెత్తి చూపించారో తెలుసుకోవాలంటే ఇంకొద్ది గంటలు ఆగాల్సిందే. (స్వయంవరానికి అర్హులు.. కానీ ) King tho Housemates ki encounter time start aindi#BiggBossTelugu4 Today at 9 PM on @StarMaa pic.twitter.com/cr8xzviqqD — starmaa (@StarMaa) September 12, 2020 It's going to be interesting...Weekend fun ki ready avvandi#BiggBossTelugu4 Today at 9 PM on @StarMaa pic.twitter.com/fhzBapoZJJ — starmaa (@StarMaa) September 12, 2020 -
నోయల్‌కు నో చెప్పిన బిగ్‌బాస్
బిగ్‌బాస్ ఇచ్చిన ఫిజికల్ టాస్క్ ఇంటిసభ్యులు పూర్తి చేయలేకపోయారు. దీనికి కూడా కట్టప్పే కారణమని పరోక్షంగా చెప్పాడు. దీంతో ప్రతిదానికి అడ్డుపడుతున్న ఈ కట్టప్ప ఎవర్రా బాబూ అని హౌస్మేట్స్ తలలు పట్టుకున్నారు. ఇదిలా వుంటే వయసు అనేది కేవలం నెంబర్ మాత్రమేనని నిరూపించిది గంగవ్వ. 60 ఏళ్లున్న అవ్వ ఈ రోజు కూడా ఉదయం లేవగానే అబ్బాయిలతో పోటీ పడుతూ ఎక్సర్సైజ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత కిచెన్ క్లీన్‌గా ఉంచాలని మోనాల్ చెప్తే అమ్మ రాజశేఖర్ కాస్త అసహనం ప్రదర్శించాడు. వంట చేయడం, క్లీన్ చేయడం ఒకేసారి ఎలా అవుతుందని ప్రశ్నించాడు. అతని సమాధానం నచ్చని కల్యాణి ఈరోజు భోజనం చేయనని ఉపవాసం ఉంటున్నానని చెప్పింది. అసలే ఎలాంటి పండ్లు కూడా లేవని మోనాల్ నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె వినకుండా వెళ్లిపోయింది. (బిగ్‌బాస్‌పై ఐపీఎల్ ఎఫెక్ట్!) అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటా: మోనాల్ ఇవాళేంటో అందరూ హుషారుగా కనిపించారు. కిచెన్‌లో అమ్మ రాజశేఖర్, దివి ఒకరిపై ఒకరు తెగ ప్రేమ కురిపించుకున్నారు. బిగ్‌బాస్‌లో ఉన్నంతసేపు నువ్వు హీరోయిన్, నేను హీరో.. అని చెప్పుకొచ్చాడు దివితో కబుర్లు చెప్పుకుంటూ నూనెలో టీ పొడి వేశాడు. దీంతో నోయల్ ఆ ఇద్దరినీ నూనె, టీ పొడితో పోలుస్తూ అవి రెండూ కలవవు అని పంచ్ వేశాడు. అటు మోనాల్, అభిజిత్ ఒకరి గురించి మరొకరు మరింత లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మోనాల్ తనకు పెద్దలు కుదిర్చిన పెళ్లే చేసుకుంటానని అఖిల్‌తో చెప్పుకొచ్చింది. ప్రస్తుతానికైతే ఎలాంటి రిలేషన్షిప్లో లేనని స్పష్టం చేసింది. ఇక నోయల్ ఇంటి సభ్యుల మీద ర్యాప్ సాంగ్ పాడితే మెహబూబ్, దేవి, దివి కలిసి నోయల్ మీదే ర్యాప్ పాడి ఔరా అనిపించారు. (సూర్య కిరణ్ తగ్గించుకుంటే మంచిది: దివి) మరోసారి కట్టప్ప టాస్క్ సోహైల్.. అఖిల్, లాస్య, హారిక, కల్యాణి.. సూర్యకిరణ్, మోనాల్, గంగవ్వ.. అమ్మ రాజశేఖర్, అరియానా, దేవి, దివి, అమ్మ రాజశేఖర్, సూర్యకిరణ్,.. నోయల్, అఖిల్, మెహబూబ్, సుజాత, అభిజిత్.. లాస్యపై స్టాంపు గుద్దారు. నోయల్ వంతు వచ్చేసరికి మాత్రం కాస్త సీన్ క్రియేట్ చేశాడు. తనకు ఎవరినీ బాధపెట్టడం ఇష్టం లేదని అందుకే తన ముఖంపైనే ముద్ర వేసుకుంటున్నట్లు వెల్లడించాడు. అయితే ఈ నిర్ణయాన్ని ఇంటి సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. అలా చేస్తే నిజమైన కట్టప్ప నువ్వే అవుతావని వారించారు. నోయల్ చర్యను ఖండించిన బిగ్‌బాస్ అయినప్పటికీ నోయల్ తన మనసు మార్చుకోకపోవడంతో బిగ్‌బాస్ రంగంలోకి దిగాడు. నీకు నువ్వు స్టాంప్ వేసుకోడానికి వీల్లేదని చెప్పాడు. దీంతో నోయల్.. లాస్య మీదే అనుమానం ఉన్నప్పటికీ ఆమె ఎక్కడ బాధపడుతుందోనని అమ్మ రాజశేఖర్‌కు స్టాంప్ గుద్దాడు. ఈ తంతు ముగిసిన తర్వాత బిగ్‌బాస్.. ఈ కట్టప్ప ఎవరనేది ఇప్పట్లో తెలియజేయనని, కానీ త్వరలో మీకే తెలుస్తుందంటూ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. అనంతరం రాత్రి మాస్టర్.. ఇంటి సభ్యులు గ్యాంగ్‌గా విడిపోవడంపై జోకులు వేశాడు. ఇప్పుడు హాయిగా సరదాగా నవ్వుకుంటున్న ఇంటి సభ్యుల్లో ఎలిమినేషన్ నుంచి ఎవరు గట్టెక్కుతారు? ఎవరు అవుట్ అవుతారనేది రానున్న ఎపిసోడ్లలో తేలనుంది. (ఇద్దరిని ఏడిపించిన అరియానా) -
బిగ్‌బాస్: నువ్వు హీరోయిన్, నేను హీరో
మొన్నటివరకు దివి హౌస్‌లో ఉందా? లేదా అని భూతద్దం వేసి మరీ వెతికారు. ఒక్కసారి నోరు విప్పి మాట్లాడంటూ సోషల్ మీడియాలో శతకోటి దండాలు పెట్టారు. మరికొందరు మీమ్స్‌తో దివిపై లెక్కలేనన్ని సెటైర్లు వేశారు. దివి మాట్లాడకపోతే నెట్టింట ప్రళయం వచ్చేలా ఉందని భావించిన బిగ్‌బాస్ ప్రేక్షకుల వినతికి అంగీకారం తెలిపాడు. దివిని మాట్లాడించేందుకు స్పెషల్ టాస్క్ ఇచ్చాడు. అది కూడా ఇంటి సభ్యుల్లో ఎలాంటి మార్పు ఉండాలని కోరుకుంటున్నావో చెప్పాలన్నాడు. దివి ఏమాత్రం తొణక్కుండా ప్రతి ఒక్కరి గురించి స్పష్టంగా వివరణ ఇచ్చింది. దివిలో ఉన్న ఈ టాలెంట్‌కు అటు ఇంటిసభ్యులతోపాటు ప్రేక్షకులు కూడా ఖంగు తిన్నారు. (చదవండి: గంగవ్వ 10 వారాల పైనే ఉంటుంది) ఆమె చెప్పిన పాయింట్లు విన్న తర్వాత ప్రేక్షకుల్లో దివికి ఫాలోయింగ్ పెరిగిపోయింది. అటు ఇంటి సభ్యులు కూడా ఆమెతో కలిసిపోవడం మొదలుపెట్టారు. ముఖ్యంగా సూర్య కిరణ్, మరీ ముఖ్యంగా అమ్మ రాజశేఖర్ ఆమెతో క్లోజ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో అమ్మ రాజశేఖర్ దివిపై పొగడ్తల వర్షం కురిపించాడు. "మంచి క్యారెక్టర్, అందం ఉంది, మనందరితో బిగ్‌బాస్‌లో ఉంది. నువ్వు హీరోయిన్, నేను హీరో.. సరేనా" అని కబుర్లు చెప్పాడు. తనకు నిజంగా వంట చేసే అబ్బాయిలంటే ఇష్టమని దివి కూడా చెప్పుకొచ్చింది దీంతో ముసి ముసి నవ్వులు నవ్వుతూ మురిసిపోయిన మాస్టర్ పొరపాటున కూరలో టీ పొడి వేసి వంటను నాశనం చేశాడు. ఏదేమైనా ఒక్క ఎపిసోడ్‌తో ప్రేక్షకుల్లో దివిపై ఉన్న అభిప్రాయమే మారిపోయింది. (చదవండి: బిగ్‌బాస్: ఎట్టకేలకు దివి మాట్లాడింది!) Ammai influence tho #AmmaRajasekhar cooking fasak!!!#BiggBossTelugu4 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/0ohk7xopEg — starmaa (@StarMaa) September 11, 2020 -
హారిక కొందరికైనా రెస్పెక్ట్ ఇస్తే మంచిది
హౌస్‌లో జరుగుతున్న అల్లర చివ్వర యవ్వారాలకు బిగ్‌బాస్ ఫుల్స్టాప్ పెట్టాడు. కంటెస్టెంట్లతో ఫిజికల్ టాస్క్ ఆడించాడు. తొలిసారి టాస్క్ ఇచ్చాడు కాబట్టి, అందరూ తమ శక్తి మేర కష్టపడ్డారు. ఆ తర్వాత బిగ్‌బాస్ దివికి ప్రత్యేక టాస్క్ ఇచ్చాడు. టాస్క్‌లో భాగంగా దివి వైద్య తానేం అనుకుంటుందో ఉన్నదున్నట్టుగా అందరి మొహం మీదే చెప్పింది. అయితే ఆమె చెప్పినదాన్ని కొందరు అంగీకరించకపోయినప్పటికీ ఎలాంటి వాదులాట జరగకపోవడం విశేషం. నేటి ఎపిసోడ్లో జరిగిన హైలెట్స్‌ను పరిశీలిస్తే.. బిగ్‌బాస్ మార్నింగ్ మస్తీలో దివికి టాస్క్ ఇచ్చాడు. తను ఇంటిసభ్యులను ఏ విషయంలో మార్చాలని అనుకుంటుందో చెప్పాలన్నాడు. దీంతో టాస్క్ ప్రారంభించిన దివి అఖిల్ మోడల్ అని.. అతని వాకింగ్ స్టైల్ కూడా అలానే ఉంటుంది. కాబట్టి అది మార్చుకుంటే మంచిది అని చెప్పింది. పక్కవాళ్లు ఏడిస్తే కన్నీళ్లు పెట్టుకోవద్దని గంగవ్వకు సూచించింది. ఏడవద్దంటే తన వల్లకాదని గంగవ్వ కాస్త కటువుగా సమాధానమివ్వగా, ఏడిస్తే తామెవరం చూడలేం అంటూ అవ్వను కూల్ చేశారు. ఆ తర్వాత అభిజిత్.. కోపం తగ్గించుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చింది. లాస్య సెన్సిటివ్ అని చెప్పగా తాను అలాంటిదాన్ని కానని కొట్టిపారేసింది. హారిక అందరినీ నువ్వు అని సంబోధిస్తుంది, కాకపోతే కొందరికైనా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే మంచిదని చెప్పింది. (చదవండి: బిగ్‌బాస్: ఫస్ట్ వీక్ నామినేషన్స్..) మోనాల్ చిన్నదానికి కూడా ఏడుస్తుందని, కాబట్టి ప్రతిదానికి ఏడవద్దని సూచించింది. దేవి నాగవల్లి అప్పుడే హైపర్‌గా ఉంటారు, మళ్లీ అప్పుడే డల్ అయిపోతారు. కాబట్టి ఎనర్జీ ఎప్పుడూ ఒకేలా ఉంచుకోవాలని తెలిపింది. నోయల్ పాయింట్ మాట్లాడుతున్నాడు. కాకపోతే అది ముందే ప్లాన్ చేసుకున్నట్టు ఉంది. కల్యాణి కొన్నిట్లో ఓవర్ చేస్తున్నారు. అది తగ్గించి, తొందరపడకుండా ఉంటే మంచిది. సూర్య కిరణ్.. ప్రతీది పర్ఫెక్ట్గా చెప్తున్నారు. కానీ నా మాటనే వినడం అనేది తగ్గించాలి అనగానే నేను తగ్గించను అంటూ ఒక్కసారిగా కోప్పడినట్లు బిల్డప్ ఇచ్చి నవ్వేశాడు. అమ్మ రాజశేఖర్.. అందరికీ నచ్చిన పర్సన్. కానీ కుళ్లు జోకులు ఆపేస్తే మంచిదని చెప్పుకొచ్చింది. (చదవండి: బిగ్‌బాస్: 'అతను ఓవరాక్షన్ తగ్గించుకుంటే మంచిది') లగ్జరీ బడ్జెట్ చెడగొట్టిన కట్టప్ప ఎవరు? ఆ తర్వాత బిగ్‌బాస్.. అరియానా, సోహైల్‌ను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచాడు. కట్టప్ప వెన్నుపోటు పొడిచి నిన్న లగ్జరీ బడ్జెట్ టాస్క్‌ను చెగడొట్టాడని చెప్పాడు. ఇంటి సభ్యులు ఎవరిని కట్టప్ప అనుకుంటున్నారో, అందుకు కారణాలేంటో తెలుసుకోవాలన్నాడు. అయితే ఇదే విషయాన్ని సోహైల్ ఇంటి సభ్యులకు చెప్పగా వారు ఈ మాటలను నమ్మలేదు. ఇదేదో కొత్త టాస్క్ అని అనుమానపడ్డారు. నిన్ననే కట్టప్ప ఎవరనేది చీటీ రాసామని, ఇప్పుడు మళ్లీ కొత్తగా చెప్పమని తేల్చి చెప్పారు. అయితే ఇంటి సభ్యుల ఆలోచనను కట్టప్ప ప్రభావితం చేస్తున్నాడని సూర్యకిరణ్ గ్రహించాడు. దీంతో అరియానా, సోహైల్ దగ్గరకు వెళ్లి అఖిల్ కట్టప్ప అనుకుంటున్నానని చెప్పాడు. ఆ తర్వాత గంగవ్వ కూడా అఖిల్ పేరే చెప్పింది. అమ్మ రాజశేఖర్.. నోయల్ పేరును, దివి, మెహబూబ్.. లాస్య పేరు చెప్పారు. అసలు ఇంట్లో కట్టప్ప ఎవరూ లేరని దేవి అభిప్రాయపడింది. కానీ మిగతా ఇంటిసభ్యులు ఎవరూ తమ అబిప్రాయాలు చెప్పేందుకు ముందుకు రాలేదు. ఆ తర్వాత నోయల్ బిగ్‌బాస్ ర్యాప్ సాంగ్ పాడుతుంటే మిగతా ఇంటి సభ్యులు చప్పట్లు కొట్టారు. హౌస్‌లో ఫస్ట్ ఫిజికల్ టాస్క్ బిగ్‌బాస్ ఫిజికల్ టాస్క్ ఇచ్చాడు. అరియానా, సోహైల్ క్వాలిటీ చెక్ మేనేజర్లుగా ఉండగా, వారికి గంగవ్వ అసిస్టెంటుగా వ్యవహరించింది. సూర్య కిరణ్ సంచాలకుడుగా పని చేశాడు. మెహబూబ్, దివి, దేవి ఎల్లో టీమ్, మోనాల్, లాస్య, అఖిల్ గ్రీన్ టీమ్, నోయల్, హారిక, అమ్మ రాజశేఖర్ ఆరెంజ్ టీమ్, అభిజిత్, సుజాత, కల్యాణి బ్లూ టీమ్‌లుగా ఏర్పడ్డారు. సైరన్ మోగగానే గార్డెన్ ఏరియాలో కన్వేయర్ బెల్ట్ ద్వారా వచ్చే వస్తువుల కోసం టీమ్ సభ్యులు ఎగబడ్డారు. అమ్మ రాజశేఖర్, అఖిల్ తెలివిగా ఆడగా, అభిజిత్ ఆటలో కాస్త తడబడ్డాడు. నోయల్, లాస్య కూడా టమాటాల కోసం కొట్టుకున్నంత పని చేశారు. మరి ఈ ఆటలో ఎవరు గెలిచారో రేపు తెలుస్తుంది. మరోవైపు కట్టప్ప ఎపిసోడ్ రేపు కూడా కొనసాగనుంది. కాకపోతే కట్టప్ప తానే అని నోయల్ ముందుకు రావడం కొసమెరుపు. అది నిజమేనా? ట్విస్టులు ఉన్నాయా? అనేది తెలియాలంటే రేపటివరకు ఆగాల్సిందే. (చదవండి: బిగ్‌బాస్: నోరు విప్పిన దివి వైద్య) -
నెంబర్ వన్ అవుతా.. అమ్మ రాజశేఖర్
కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించిన రాజశేఖర్ ఆ తర్వాత దర్శకుడిగా మారారు. గోపిచంద్ 'రణం', రవితేజ 'ఖతర్నాక్', నితిన్' టక్కరి' చిత్రాలకు దర్శకత్వం వహించారు ఆన్‌స్క్రీన్ మీదే కాదు. ఒకటి, రెండు వివాదాలతో ఆఫ్ స్క్రీన్ మీద కూడా పాపులర్ అయ్యారు. ఇక 16 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నానని రాజశేఖర్ చెప్పారు. డైరెక్టర్‌గా వచ్చి నెంబర్ వన్‌గా నిలవానుకుంటున్నానని మనసులోని కోరికను బయటపెట్టారు. కొద్దిరోజులుగా హిట్లు లేవని కొంత గ్యాప్ వచ్చిందన్నారు. ఈ లోటును పూడ్చేందుకు బిగ్‌బాస్‌కు వచ్చానని, ఈ షో ద్వారా మళ్లీ నెంబర్ వన్‌గా నిలవాలనుకుంటున్నానని చెప్పారు. గత సీజన్లో తన శిష్యుడు బాబా భాస్కర్ వచ్చారని, ఇప్పుడు తాను రావడం సంతోషంగా ఉందన్నారు. వస్తూనే ఈ సాంగ్ నాగార్జునకు డెడికేట్ చేస్తున్నా అంటూ కింగ్ సినిమాలోని ఓ పాటకు స్టెప్పులేశాడు. మరి ఇతని ప్రయాణం బిగ్‌బాస్ హౌస్‌లో ఎలా సాగుతుందో చూడాలి. -
బిగ్‌బాస్-4 : హౌస్‌లోకి ఇద్దరు డైరెక్టర్స్!
బుల్లితెరపై సందడి చేయడానికి బిగ్‌బాస్ 4 రెడీ అయింది. ఇక మిగిలింది కొన్ని గంటలు మాత్రమే. అల్రెడీ ఓపెనింగ్ డే షూటింగ్ కూడా పూర్తయిందట. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్లకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈసారి హౌస్‌లోకి ఇద్దరు డైరెక్టర్స్ ఎంట్రీ ఇచ్చేశారనేదే ఆ వార్త సారాంశం. వారిలో ఒకరు అమ్మ రాజశేఖర్, కొరియోగ్రాఫర్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దర్శకుడుగా మారిన టెక్నీషి యన్. గోపిచంద్ రణం, రవితేజ ఖతర్నాక్, నితిన్ టక్కరి చిత్రాలకు దర్శకత్వం వహించారు అమ్మ రాజశేఖర్. ఆన్‌స్క్రీన్ మీదే కాదు. ఒకటి, రెండు వివాదాలతో ఆఫ్ స్క్రీన్ మీద కూడా పాపులర్ అయ్యారు. మరి బిగ్‌బాస్ హౌజ్‌లో ఎలాంటి వివాదాలు సృష్టించి పాపులర్ అవుతారో చూడాలి. (చదవండి : బిగ్‌బాస్-4: 15 మంది కంటెస్టెంట్స్ వీళ్లే!) ఇక బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్‌లో ఉన్న మరో దర్శకుడు సూర్యకిరణ్. తెలుగులో తొలి చిత్రం సత్యంతోనే మంచి హిట్ అందుకున్నారు. హీరోయిన్ కళ్యాణిని వివాహం చేసుకున్నారు. ఇటీవల కాలంలో ఆయన ఖాళీగా ఉంటున్నారు. మరి బిగ్‌బాస్‌తో సూర్యకిరణ్ లైఫ్ టర్న్ అవుతుందో చూడాలి. ఇక పోతే బిగ్‌బాస్ హోస్‌లోకి వెళ్లాక ఎవరి వ్యూహాలు వారికుంటాయి. ఎవరి లెక్కలు వారికుంటాయి. ఎవరినీ ఎవరూ డైరెక్ట్ చేయనక్కర్లేదు. మరి ఈ ఇద్దరి దర్శకత్వ ప్రతిభకి మిగిలిన కంటెస్టెంట్స్ దొరికి పోతారా ? లేదా అంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. మరోవైపు ఈ బిగ్‌బాస్‌లో వీరితో పాటు దేత్తడి హారిక (యూట్యూబ్ స్టార్), దేవి నాగవల్లి (యాంకర్), గంగవ్వ (యూట్యూబ్ స్టార్), ముక్కు అవినాష్ (జబర్దస్త్ ఫేం), మోనాల్ గుజ్జార్ (హీరోయిన్) కరాటే కళ్యాణి (నటి), నోయల్(సింగర్), లాస్య (యాంకర్), జోర్దార్ సుజాత (యాంకర్), తనూజ పుట్టస్వామి (బుల్లి తెర నటి, ముద్దమందారం ఫేమ్), సయ్యద్ సోహైల్ (టీవీ నటుడు),అరియానా గ్లోరీ (యాంకర్, జెమిని కెవ్వు కామెడీ యాంకర్), మెహబూబా దిల్ సే(టిక్ టాక్ షార్ట్ ఫిల్మ్ స్టార్) కూడా ఉన్నారు. -
డబ్బే ప్రధానం కాదు
‘జీవితంలో డబ్బే ప్రధానం కాదు.. కుటుంబం, సుఖసంతోషాలే ముఖ్యం’ అని తెలియజెప్పే కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘హై 5’. మన్నారా చోప్రా లీడ్ రోల్ చేస్తున్నారు. ‘రణం’ ఫేమ్ అమ్మరాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. రాధ క్యూబ్ బ్యానర్‌పై రాధారాజశేఖర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చివరి షెడ్యూల్లో భాగంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మన్నారా చోప్రాపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ‘అమ్మ’ రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘మ్యూజికల్ డ్రామాగా తెరకెక్కుతోన్న చిత్రమిది. గోపీచంద్‌తో ‘రణం’ తర్వాత మళ్లీ అంతటి వైవిధ్యమైన కథాంశంతో నా భార్య నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నాం. ఇందులో 12 పాటలుంటాయి. ఐదుగురు సంగీత దర్శకులు పని చేస్తున్నారు. మాటల్ని పాటల్లా మార్చి నేటి తరానికి తగ్గట్టు పూర్తి వినోదభరితంగా రూపొందిస్తున్నాం. గోవాలోని చిన్న దీవిలో ఓ సెట్ వేసి కొన్ని సన్నివేశాలు చిత్రీకరణ జరిపాం. ఈ సినిమాలో చిన్న సందేశంతో పాటు వినోదం కూడా ఉంటుంది’’ అన్నారు. ‘‘మంచి మసాలా పాటలతో ఈ సినిమా ఉంటుంది. నాకు డ్యాన్స్ అంటే ఇష్టం. ఈ సినిమాతో నా కోరిక నెరవేరింది’’ అన్నారు మన్నారా చోప్రా. ‘‘గురువారం షూటింగ్‌తో చిత్రీకరణ ముగిసింది. జనవరిలో ఈ సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు రాధారాజశేఖర్. ‘‘అమ్మ రాజశేఖర్ వద్ద సహాయకుడిగా పనిచేశా. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఈ సినిమాకు నృత్యాలు సమకూర్చా’’ అన్నారు నత్య దర్శకుడు ప్రశాంత్. అమ్మ రాజశేఖర్, జాస్మిన్, జబర్దస్త్ బ్యాచ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ముజీర్ మాలిక్, సంగీతం: తమన్. -
నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత
సర్వం శ్రీనివాస్, రవళి, సరిత, మధుశ్రీ, లావణ్య రెడ్డి, పూజ ముఖ్య తారలుగా అతిమల్ల రాబిన్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సర్వం సిద్ధం–నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత’. సినెటేరియా మీడియా వర్క్స్ పతాకంపై శ్రీలత బి. వెంకట్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ని దర్శకులు వీఎన్ ఆదిత్య, ‘అమ్మ’ రాజశేఖర్ విడుదల చేశారు. వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా టీజర్‌ను చూశాక సినిమా రంగంలోని అలనాటి రోజులు గుర్తుకు వచ్చాయి. టీజర్లో చూపించినట్లుగా ఒక్కరోజైనా సినీ దర్శకునిగా సెట్లో మెలగాలనే ఆకాంక్ష చాలా మందికి ఉంటుంది’’ అన్నారు. ‘‘టీజర్ చూస్తుంటే సినిమా 100 శాతం కామెడీ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది’’ అన్నారు ‘అమ్మ’ రాజశేఖర్. ‘‘సినిమా చూసే ప్రేక్షకులకు పొట్ట చెక్కలవ్వడం ఖాయం’’ అని అతిమల రాబిన్ నాయుడు అన్నారు. శ్రీలత బి.వెంకట్, సినెటేరియా గ్రూప్ సీఈవో వెంకట్ బులెమోని, ఎన్.సి.సి మార్కెటింగ్ హెడ్ శ్రీవికాస్, సింబయోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ సంచాలకులు డా. రవి కుమార్ జైన్, టెక్స్టైల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అమ్మనబోలు ప్రకాశ్, ‘సమరం’ చిత్రం హీరో సాగర్ జి, లావణ్య, పూజ, ఫరీనా, నటులు సర్వం శ్రీనివాస్, కెమెరామేన్ సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: డేవిడ్ జి. -
కామెడీ థ్రిల్లర్
నక్షత్ర మీడియా పతాకంపై ఖాసిం సమర్పణలో జేడీ చక్రవర్తి హీరోగా ‘అమ్మ’ రాజశేఖర్ దర్శకత్వంలో ‘నక్షత్ర’ రాజశేఖర్ నిర్మించిన యాక్షన్ కామెడీ థ్రిల్లర్ ‘ఉగ్రం’. అక్షత కథానాయిక. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా నిర్మాత నక్షత్ర రాజశేఖర్ మాట్లాడుతూ – ‘‘గులాబీ, సత్య వంటి హిట్ చిత్రాల తర్వాత ‘అమ్మ’ రాజశేఖర్ చెప్పిన కథకు జేడీ చక్రవర్తి ఎగై్జట్ అయ్యి నటించారు. యాక్షన్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు మంచి స్కోప్ ఉన్న చిత్రం ఇది. ఉగాదికి ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ సినిమాకి కెమెరా: అంజి, సంగీతం: జాన్ పోట్ల, సహనిర్మాత: బండి శివ. -
అమ్మ దర్శకత్వంలో జేడీ
కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ దర్శకునిగా మారి ‘రణం’ వంటి హిట్ చిత్రం తీసిన విషయం తెలిసిందే. తాజాగా జేడీ చక్రవర్తి హీరోగా నక్షత్ర మీడియా పతాకంపై నక్షత్ర రాజశేఖర్ నిర్మాణ సారధ్యంలో ‘అమ్మ’ రాజశేఖర్ ఓ చిత్రం తెరకెక్కించనున్నారు. ‘‘నేను గురువుగా భావించే వ్యక్తి జేడీగారు. ఆయన్ను డైరెక్ట్ చేయడం సంతోషంగా ఉంది. తమన్ సంగీతం, అంజి కెమేరా, గౌతంరాజు ఎడిటింగ్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ అవుతాయి. ఈ నెల 15న రెగ్యులర్ షూటింగ్‌ను హైదరాబాద్‌లో ప్రారంభిస్తాం’’ అన్నారు దర్శకుడు. -
మరో యుద్ధం
గోపీచంద్ హీరోగా అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘రణం’ చిత్రానికి సీక్వెల్‌గా ‘రణం-2’ రానుంది. ‘అమ్మ’ రాజశేఖర్ దర్శకత్వం వహించి, హీరోగా నటించిన ఈ చిత్రాన్ని గోపనబోయిన శ్రీనివాసయాదవ్ నిర్మించారు. ఈ సినిమా మే 15 న విడుదల కానుంది. ‘అమ్మ’ రాజశేఖర్ మాట్లాడుతూ-‘‘ ఈ సినిమా కోసం మూడే ళ్లగా శ్రమిస్తున్నాను. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది’’ అని చెప్పారు. ‘‘ఈ చిత్రంలో దివంగత శ్రీహరిగారి పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది’’ అని నిర్మాత చెప్పారు. -
మరోసారి యుద్ధం
తొమ్మిదేళ్ల క్రితం గోపీచంద్ హీరోగా అమ్మ రాజశేఖర్ దర్శకత్వలో వచ్చిన ‘రణం’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘రణం-2’ రాబోతోంది. అమ్మ రాజశేఖర్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆర్తీ అగర్వాల్, నిధి కథానాయికలు. శ్రీ వెంకటేశ్వర మూవీస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మాత గోపనబోయిన శ్రీనివాస యాదవ్ నిర్మించారు. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని వాణిజ్య హంగులను జోడించి ఈ చిత్రాన్ని రూపొందించామని, తప్పక విజయం సాధిస్తుందని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరామ్యాన్: శ్రీధర్. -
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ సినీ దర్శకుడు
-
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ సినీ దర్శకుడు
హైదరాబాద్ : మరో సినీ ప్రముఖుడు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డాడు. నృత్య,సినీ దర్శకుడు అమ్మ రాజశేఖర్ తాగి డ్రైవ్ చేస్తూ హైదరాబాద్ పోలీసులకు దొరికిపోయారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద శనివారం అర్థరాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. ఈ తనిఖీల్లో డైరెక్టర్ అమ్మరాజశేఖర్ మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు. మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు మీదుగా బంజారాహిల్స్ వెళ్తున్న ఆయనను బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షించగా మద్యం తాగినట్లు తేలింది. రాజశేఖర్ వాహనం నడుపుతున్న సమయంలో ఆయన కుటుంబ సభ్యులు కూడా వాహనంలోనే ఉండడం గమనార్హం. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు వాహనాన్ని సీజ్ చేశారు. -
మాస్ టచ్‌తో...
‘అమ్మ’ రాజశేఖర్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటించిన ‘రణం’ ఎంతటి విజయం సాధించిందో ప్రేక్షకులకు తెలిసిందే. ప్రస్తుతం ‘రణం-2’ పేరుతో ‘అమ్మ’ రాజశేఖర్ హీరోగా, ఆయన దర్శకత్వంలోనే ఓ చిత్రం రూపొందుతోంది. శ్రీనివాస్ యాదవ్ నిర్మాత. నిధి కథానాయిక. ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘అన్ని వాణిజ్య హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. నా పాత్ర మాస్ టచ్‌తో ఉంటుంది. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: శ్రీధర్. -
రెండో రణం
గోపీచంద్ హీరోగా ‘అమ్మ’రాజశేఖర్ తెరకెక్కించిన ‘రణం’ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ప్రస్తుతం అమ్మ రాజశేఖర్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ ‘రణం-2’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శ్రీనివాస యాదవ్ నిర్మాత. మణిశర్మ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో వి.వి.వినాయక్, గోపీచంద్, సి.కల్యాణ్‌ల చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సినిమా విజయం సాధించాలని అతిథులంతా ఆకాంక్షించారు. అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ -‘‘రెండేళ్లు పక్కా ప్లానింగ్‌తో ఈ సినిమా చేశాం. నాలోని పూర్తి స్థాయి దర్శకుణ్ణి ఆవిష్కరించే సినిమా అవుతుందని నా నమ్మకం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి పాటలు: సుద్దాల అశోక్‌తేజ, కెమెరా: శ్రీనాథ్ నార్ల.