బిగ్‌బాస్ హౌస్‌లో అప్పుడే 55 రోజులు దాటిపోయాయంటే నమ్మశక్యంగా అనిపించడం లేదు. వారి జర్నీని కళ్లకు కట్టినట్లు చూపించిన బిగ్‌బాస్ అఖిల్, మోనాల్, అభిజిత్‌లను హైలెట్ చేసి చూపించాడు. ఎన్నో వారాలు నామినేషన్‌లోకి వచ్చినప్పటికీ అభిమాన గణం మెండుగా ఉండటంతో ఈ ముగ్గురూ సేవ్ అవుతూ వస్తున్నారు. ఇక ఈ వారం అమ్మ రాజశేఖర్, అరియానా, మెహబూబ్, లాస్య, అఖిల్, మోనాల్ నామినేషన్‌లో ఉన్నారు. ఆన్‌లైన్ పోల్స్ ప్రకారం అఖిల్, లాస్య, అరియానా, మోనాల్ సేఫ్ జోన్‌లో ఉన్నారు. ఆ తర్వాత మెహబూబ్, మరీ తక్కువ ఓట్లతో అమ్మ రాజశేఖర్ ఆఖరి స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయనపై ఎలిమినేషన్ కత్తి వేలాడుతోంది.
అమ్మాయి జేబులో చేయి పెడితే తప్పేంటి?
కామెడీ చేసి నవ్వించే టాలెంట్ ఉన్నా మాస్టర్ దాన్ని పూర్తిగా పక్కన పెట్టేశాడు. టాస్క్‌ల్లో ఆయన్ను ఎవరేమన్నా సహించలేకపోయేవాడు. స్పోర్టివ్‌గా తీసుకోవడానికి బదులు ప్రత్యర్థులకు శాపనార్థాలు పెట్టేవాడు. దీంతో ఇప్పటికీ ఇంటిసభ్యులు మాస్టర్‌ను ఒక మాట అనాలంటే భయంతో వెనకడుగు వేస్తున్నారు. మరోవైపు ఈ వారంలో ఆయన చేసిన తప్పులనే బిగ్‌బాస్ ఎత్తి చూపుతూ టార్గెట్ చేశారు. ముందుగా హారిక చాక్లెట్ తీసుకుందన్న కోపంతో ఆమె మీద పడి మరీ చాక్లెటు తీసుకునేందుకు ప్రయత్నించాడు. పైగా తను అమ్మాయి జేబులో చేయి పెడితే తప్పేంటని ఎదురు ప్రశ్నించడం ప్రేక్షకుల ఆగ్రహానికి కారణమైంది. (చదవండి:'అమ్మో' రాజశేఖర్: దేని కోసం ఇంత డ్రామా?)
మాస్టర్ అసలు రంగు బయటపడింది
ఇక కెప్టెన్సీ టాస్కులో మాస్టర్ అరియానాకు సపోర్ట్ చేశాడు. మోనాల్‌కు నెక్స్ట్ టైమ్ తప్పకుండా సాయం చేస్తానని మాటిచ్చాడు. చివరికి కెప్టెన్ అయిన అరియానా.. మాస్టర్ సంతోషిస్తారనే భావనతో మోనాల్‌ను రేషన్ మేనేజర్‌ను చేసింది. దీంతో ఆయనకు కడుపు మండిపోయింది. తనను కాదని మోనాల్‌ను రేషన్ మేనేజర్ చేసినందుకు అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. నీకు విశ్వాసం లేదు అంటూ నోటికొచ్చిన మాటలు అంటూ అనవసర రాద్ధాంతం సృష్టించడంతో ఆయన ప్రవర్తన ప్రేక్షకులకు మరింత విసుగు తెప్పించింది. పైగా ఆయన నామినేషన్ కోసం చాలామంది జనాలు కాచుకుని కూర్చున్నారు. దీనికితోడు బిగ్‌బాస్ టీమ్ అయ్యే కంటెస్టెంట్లను టార్గెట్ చేసి, వారిని నెగెటివ్‌గా చూపిస్తారు. అలా ఈ వారం అమ్మ రాజశేఖర్ చేసిన తప్పులనే బిగ్‌బాస్ ఫోకస్ చేసి చూపించడంతో ఆయనే హౌస్‌ను వీడనున్నాడని సంకేతాలు ఇచ్చాడు. ఇప్పటికే నోయల్ వెళ్లిపోయాడు కాబట్టి డబుల్ ఎలిమినేషన్‌కు ఆస్కారం లేనట్లు తెలుస్తోంది. (చదవండి: అఖిల్ ప్యాంటులో ఐస్‌గడ్డలు వేసి అరాచకం)
Comments
Please login to add a commentAdd a comment