
బిగ్‌బాస్ నాల్గో సీజన్‌లో ఆరో వారం ఇంటి సభ్యులు తొలిసారి టీమ్ వర్క్‌లో ఐకమత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అంతకు ముందు ఇచ్చిన టాస్క్‌లలో టీమ్స్‌గా విడగొట్టినా వ్యక్తిగతంగా ఎవరి ఆట వారు ఆడటానికే ఇష్టపడేవారు. కానీ ఈసారి మాత్రం టీమ్ కోసం ఎంత కష్టమైనా సరే త్యాగాలు చేసేందుకు సిద్ధపడుతుండటం విశేషం. కాగా బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా వారిని బ్లూ, రెడ్ టీమ్‌లుగా విడగొట్టాడు. బ్లూ టీమ్‌లో హారిక జుట్టు కత్తిరించుకోగా, కుమార్ బట్టలు చింపుకోవడంతో పాటు ఎక్కువ సేపు ఇసుక బస్తాను గాలిలో నిలిపాడు. (చదవండి: అరియానా కళ్లకు కాటుక రుద్దిన అవినాష్)
రెడ్ టీమ్‌లో అభిజిత్ తనకు సంబంధించిన అన్ని వస్తువులను పంపించేయగా, లాస్య ఓ డ్రింక్‌ను తాగింది.మోనాల్ జనపనార బట్టలను ధరించింది. దీంతో ఇప్పటివరకు రెండు టీమ్‌లు చెరో మూడు డీల్స్ పూర్తి చేశాయి. నేడు బిగ్‌బాస్ వారికి మరిన్ని డీల్స్ ఇవ్వనున్నాడు. అందులో భాగంగా.. ఒకరు తల, గడ్డం సగం షేవింగ్ చేసుకోవాలని చెప్పాడు. ఇందుకు అమ్మ రాజశేఖర్ తాను సిద్ధమంటూ ముందుకు వచ్చాడు. కానీ అతనికి జుట్టు అంటే చాలా ఇష్టమని రెడ్ టీమ్ గుసగుసలు పెడుతోంది. ఇక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం బ్లూ టీమ్ విజయం సాధించగా నోయల్ రెండోసారి కెప్టెన్ అయ్యాడట. మరి ఇదెంత వరకు నిజమనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు ఎదురు చూడాల్సిందే. (చదవండి: ట్రయాంగిల్ స్టోరీకి ఎండ్ కార్డ్ వేస్తున్న అభి!)
Comments
Please login to add a commentAdd a comment