
అమ్మ దర్శకత్వంలో జేడీ
కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ దర్శకునిగా మారి ‘రణం’ వంటి హిట్ చిత్రం తీసిన విషయం తెలిసిందే. తాజాగా జేడీ చక్రవర్తి హీరోగా నక్షత్ర మీడియా పతాకంపై నక్షత్ర రాజశేఖర్ నిర్మాణ సారధ్యంలో ‘అమ్మ’ రాజశేఖర్ ఓ చిత్రం తెరకెక్కించనున్నారు. ‘‘నేను గురువుగా భావించే వ్యక్తి జేడీగారు. ఆయన్ను డైరెక్ట్ చేయడం సంతోషంగా ఉంది. తమన్ సంగీతం, అంజి కెమేరా, గౌతంరాజు ఎడిటింగ్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ అవుతాయి. ఈ నెల 15న రెగ్యులర్ షూటింగ్‌ను హైదరాబాద్‌లో ప్రారంభిస్తాం’’ అన్నారు దర్శకుడు.