JD Chakravarthy
-
యాక్షన్... థ్రిల్
జెడీ చక్రవర్తి, నరేష్ అగస్త్య, సీరత్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జాతస్య మరణం ధ్రువం’. శ్రవణ్ జొన్నాడ దర్శకత్వం వహించారు. ‘తమ్ముడు, నరసింహనాయుడు, అధిపతి’ చిత్రాల్లో నటించిన ప్రీతీ జంగియాని ‘జాతస్య మరణం ధ్రువం’తో రీ ఎంట్రీ ఇస్తున్నారు. త్రిష సమర్పణలో మల్కాపురం శివకుమార్ నిర్మించిన ఈ చిత్రానికి ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ ఖరారు చేసి, ఫస్ట్ లుక్‌ని లాంచ్ చేశారు.‘‘యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. ‘జాతస్య మరణం ధ్రువం’ అన్నది ఒక సంస్కృత పద బంధం. ‘పుట్టినవారికి మరణం తప్పదు’ అని అర్థం. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాని విడుదల చేస్తాం’’ అని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, రాజ్ ఆషూ, కెమెరా: అర్జున్ రాజా. -
‘బాలస్వామిని బంగారు అయ్యప్ప పాట’ బాగుంది: జేడీ చక్రవర్తి
‘బాలస్వామిని బంగారు అయ్యప్ప పాట’ పాట య్యూటూబ్‌లో దూసుకెళ్తోంది. ఆర్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ పాట నక్షత్ర స్టూడియో ద్వారా రిలీజ్ అయి సోషల్ మీడియా లో 25 మిలియన్స్ పైగా వ్యూస్ సంపాదించుకుంది. ఈ సందర్భంగా నక్షత్ర మీడియా ఛైర్మన్ రాజశేఖర్ పాటను రాసిన పరమేశ్, నటించిన చిన్నారి తన్వికితో పాటు సంగీత దర్శకుకు సత్యదీప్, కొరియోగ్రాఫర్ హరికాంత్ రెడ్డికి సన్మానం చేశారు. ఆస్ బెస్టాస్ కాలనీ లోని అయ్యప్ప స్వామి దేవస్థానంలో జరిగిన ఈ వేడుకకి మాన్లీ స్టార్ జె.డి.చక్రవర్తి అతిథిగా విచ్చేసి టీమ్‌ని సత్కరించారు. ‘మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి ఎంకరేజ్ చేస్తూ వారికంటూ ఓ ప్లాట్ పామ్ క్రియేట్ చేసినందుకు నక్షత్ర మీడియా అధినేత రాజశేఖర్, యాంకర్ గంగకు మనస్ఫుర్తిగా అభినందనలు తెలియజేస్తూ పాటను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు’అని చక్రవర్తి అన్నారు. -
'ఇద్దరు' సినిమా రివ్యూ
ఒకప్పుడు తెలుగులో నటించిన అర్జున్, జేడీ చక్రవర్తి చాలా ఏళ్ల క్రితం 'ఇద్దరు' అనే సినిమాలో హీరోలుగా నటించారు. ఇప్పుడు ఈ మూవీ తెలుగు వెర్షన్ థియేటర్లలోకి వచ్చేసింది. మరి ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?అర్జున్ ఓ మల్టీ మిలియనీర్. ఈయన కంపెనీలో జేడీ చక్రవర్తి ఉద్యోగిగా చేరతాడు. రాత్రి రాత్రే కోటీశ్వరుడు అయిపోవాలనేది ఇతడి ఆశ. ఈ క్రమంలో తన బాస్ అర్జున్‌పై ఒక అమ్మాయితో హనీట్రాప్ చేయాలని చూస్తాడు. ఇది గ్రహించిన అర్జున్.. దానికి పై ఎత్తు వేస్తాడు. ఆ తర్వాత ఏమేం జరిగిందనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: అరెస్ట్ న్యూస్.. వీడియో రిలీజ్ చేసిన బిగ్ బాస్ శేఖర్ భాషా)ఎలా ఉందంటే?ఇద్దరు తెలివైన వ్యక్తుల.. ఒకరిపై మరొకరు ఎత్తుకు పై ఎత్తుల వేస్తే ఏమవుతుంది అనే కాన్సెప్ట్‌తో తీసిన సినిమా 'ఇద్దరు'. వేల కోట్లకు అధిపతి అయిన అర్జున్‌ని హానీ ట్రాప్ చేసి కోటీశ్వరుడు కావాలనుకునే ఉద్యోగిగా జేడీ చక్రవర్తి కనిపించాడు. అతని ఎత్తులను పసికట్టి అతని ఎత్తులకు పై ఎత్తులు వేయడం.. ఇలా సినిమా మొత్తం ట్విస్టులో బాగానే తీశారు. దర్శకుడు పర్లేదనిపించాడు. అక్కడక్కడ బోర్ కొట్టించినా.. కమర్షియల్ అంశాలు బాగానే దట్టించారు.ఎవరెలా చేశారు?అర్జున్, జేడీ తమ పాత్రలకు న్యాయం చేసారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ కూడా ఓకే ఓకే. మిగిలిన విభాగాల వాళ్లు తమ తమ పని సక్రమంగా నిర్వర్తించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి కార్తీ 'సత్యం సుందరం' మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) -
పోటాపోటీ యాక్షన్
అర్జున్, జేడీ చక్రవర్తి లీడ్ రోల్స్‌లో నటించిన కన్నడ క్రైమ్ యాక్షన్ ఫిల్మ్ ‘ఒప్పంద: కాంట్రాక్ట్’. ఈ చిత్రంలో రాధికా కుమార స్వామి, సోనీ చరిష్ఠ హీరోయిన్లుగా నటించారు. ఎస్ఎస్ సమీర్ దర్శకత్వంలో డీఎస్ రెడ్డి సమర్పణలో మహమ్మద్ ఫర్హీన్ ఫాతిమా నిర్మించిన ఈ చిత్రం తెలుగులో ‘ఇద్దరు’ పేరుతో రేపు విడుదల కానుంది.ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో సమీర్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో అర్జున్, చక్రవర్తిగార్లు పోటాపోటీగా నటించారు. కళాతపస్వి కె. విశ్వనాథ్‌గారు, ఆమిర్ ఖాన్ తమ్ముడు ఫైజల్ ఖాన్ కూడా నటించారు. మా సినిమాని ప్రేక్షకులు సక్సెస్ చేయాలి’’ అని అన్నారు. -
'రుధిరాక్ష' కోసం ఏకమైన ఆది సాయికుమార్, జేడీ చక్రవర్తి
ఫలితాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు ఆది సాయికుమార్. తాజాగా ఈ యంగ్ హీరో మరో కొత్త సినిమా ‘రుధిరాక్ష’ను కూడా పట్టాలెక్కించాడు. ఇందులో వెర్సటైల్ యాక్టర్స్ జె.డి చక్రవర్తి, సత్యరాజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శివ శంకర్ దేవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 9 స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై శివ శంకర్ దేవ్ దర్శకత్వం వహిస్తున్నారు. డార్క్, థ్రిల్లర్ నేపధ్యంలో రూపొందనున్న ఈ చిత్రానికి సంబధించిన పూజా కార్యక్రమం రామానాయడు స్టూడియోలో ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి సముద్రఖని క్లాప్ కొట్టగా రామ్ తాళ్లూరి కెమరా స్విచాన్ చేశారు. ఫస్ట్ షాట్ కు డైరెక్టర్ దేవ్ దర్శకత్వం వహించారు. హై బడ్జెట్, టాప్ టెక్నికల్ వాల్యూస్ తెరకెక్కనున్న ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. 'యానిమల్' ఫేం హర్షవర్షన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కిశోర్ బోయిదాపు డీవోపీ గా పని చేస్తున్న ఈ చిత్రానికి విజయ్ కృష్ణ ఆర్ట్ డైరెక్టర్. పవన్ హిమాన్షు, బాలు మహేంద్ర మాటలు అందిస్తున్నారు. -
ఆ డైరెక్టర్ మూవీలో జేడీ చక్రవర్తి.. ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరోయిన్!
మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణించి ఆ తరువాత కథానాయకిగా అయిన నటి ఐశ్వర్యా రాజేశ్. హీరోయిన్ అయిన చాలా తక్కువ కాలంలోనే లేడీ హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాలే నటిగా ఎదిగిన ఈమె ఇటీవల టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. కాగా పాత్రల ఎంపికలో తగిన జాగ్రత్తలను తీసుకుంటున్నారు. అలా నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఐశ్వర్య రాజేశ్.. తాజాగా గోపీ నయినార్ దర్శకత్వంలో నటిస్తున్నారు. (ఇది చదవండి: మొన్న ఐటం సాంగ్.. ఇప్పుడు సూపర్ స్టార్ సినిమాలో ఛాన్స్) ఈ దర్శకుడు ఇంతకు ముందే నయనతార ప్రధాన పాత్రలో నటించిన అరమ్ అనే సక్సెస్‌పుల్ చిత్రాన్ని తెరకెక్కించారు. కాగా తయన తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటుడు జయ్ కథా నాయకుడిగా నటిస్తున్నారు. నటుడు జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో నటిస్తోన్న.. ఈ చిత్రంలో నటి ఈశ్వరీరావు, జాన్‌విజయ్, సుబ్బు పంజు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కేఎస్.ప్రసాద్ సంగీతమందిస్తుండగా.. ఈ చిత్రాన్ని ఏజీఎల్ పతాకంపై ఆర్.రమేశ్ నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి కరుప్పర్ నగరం అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ టైటిల్ పేరును దర్శకుడు వెంకట్‌ప్రభు ట్విటర్ ద్వారా విడుదల చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కాగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది. (ఇది చదవండి: Oppenheimer Movie Review: ఓపెన్‌హైమర్ సినిమా రివ్యూ) Happy to release #GopiNainar 's next flick title #KarupparNagaram starring my Thambi @Actor_Jai @aishu_dil #JDChakravarthy. Best wishes to the whole Team 🎉 Prod by R Ramesh's @RrFilmmakers & Hemant Raj 's #AGL @ThenandalFilms @venkate25571670 #EswariRao #JohnVijay… pic.twitter.com/MF2kqxPPfI — venkat prabhu (@vp_offl) November 7, 2023 -
జేడీ చక్రవర్తి మళ్లీ.. ఈసారి ఏకంగా!
జేడీ చక్రవర్తి నటించి, స్వీయ దర్శకత్వం వహించిన ద్విభాషా (కన్నడ, తెలుగు) చిత్రం ‘హూ’. ఇందులో శుభరక్ష, నిత్య హీరోయిన్లు. రెడ్డమ్మ కే బాలాజీ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఈ సినిమా ట్రైలర్‌ను నిర్మాత ప్రసన్న కుమార్, నటుడు నాగమహేశ్‌లు కలిసి విడుదల చేశారు. నిర్మాతలు ఆచంట గోపీనాథ్, శోభారాణి, చాంబర్ వైస్ ప్రెసిడెంట్ కొల్లి రామకృష్ణ ‘హూ’ సినిమా కొత్త ΄ోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘ఎమోషనల్ థ్రిల్లర్‌గా సాగే ఈ చిత్రంలో జేడీ చక్రవర్తి నటన వైవిధ్యంగా ఉంటుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అని రెడ్డమ్మ కే బాలాజీ అన్నారు. -
వైజాగ్..నా కెరీర్‌ని మార్చేసింది: జేడీ చక్రవర్తి
మద్దిలపాలెం (విశాఖతూర్పు): ‘నా సినీ జీవితాన్ని మలుపు తిప్పింది వైజాగ్. నా చిత్రాలకు బ్రహ్మరథం పట్టిన ప్రేక్షకులు విశాఖ వాళ్లే. అందుకే వైజాగ్ అంటే ప్రాణం. ఇది నా లక్కీ సిటీ అని ప్రముఖ హీరో జేడీ చక్రవర్తి అన్నారు. ‘దయ’తో ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్‌లో తొలిసారిగా నటించానన్నారు. విశాఖ వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. అవి ఆయన మాటల్లోనే.. ‘గులాబి’తో స్టార్ స్టేటస్ కృష్ణవంశీ తెరకెక్కించిన గులాబి చిత్రంతో స్టార్ స్టేటస్ లభించింది. ఈ చిత్రం విశాఖలో చిత్రీకరణ జరుపుకుంది. మేఘాలలో తేలిపోమన్నది పాట చిత్రీకరణ పాడేరు కాఫీతోటల సమీపంలో చిత్రీకరించామని, ఆ పాట ఎప్పుడు విన్నా ఈ ప్రాంతం గుర్తుకు వస్తుందన్నారు. దాదాపు ఈ చిత్రమంతా వైజాగ్ పరిసరాల్లో షూటింగ్ జరిపామన్నారు. గులాబి నా సినీ జీవితాన్ని మలుపు తిప్పిందన్నారు. వైజాగ్ అంటే ప్రాణం విశాఖ ప్రేక్షకులు సినిమాలను విశేషంగా ఆదరిస్తారని, ఇక్కడ టాక్ బాగుంటే ఆ సినిమా సూపర్ హిట్టే. తాను నటించిన గులాబి, సత్య సూపర్ హిట్ చేశారని, తొలిసారిగా నటించిన ‘దయ’ వెబ్ సిరీస్‌ను కూడా ఆదరించాలని కోరారు. దయ ప్రమోషన్ ఇక్కడ నుంచే.. దయ వెబ్ సిరీస్ ప్రమోషన్ నా లక్కీ సిటీ వైజాగ్ నుంచి ప్రారంభించడం ఆనందంగా ఉంది. డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ దర్శకుడు పవన్ సాధినేని రూపొందించిన ఈ వెబ్ సిరీస్‌ను 24 గంటల్లోనే ట్రెండింగ్‌లో నిలిచింది. ఇక్కడ వాళ్లు దయ చూశామని, చాలా బాగుందని చెబుతుండడం ఆనందంగా ఉంది. ఇది నా సెకెండ్ ఇన్నింగ్స్‌కు శుభసూచికంగా భావిస్తున్నా. మూడు భాషల్లో వెబ్ సిరీస్‌లో నటిస్తున్నా.. ప్రస్తుతానికి రెండు హిందీ, ఒక తెలుగు, తమిళ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాను. అలాగే మూడు చిత్రాల్లో నటిస్తున్నా. వాటిలో రెండు తెలుగు చిత్రాలు కాగా, ఒకటి తమిళ చిత్రం. రాజకీయాలకు దూరం రాజకీయాలంటే ఆసక్తే కాని, ప్రత్యక్షంగా ఆ రంగంలోకి వచ్చే ఆలోచనే లేదు. ప్రస్తుతం మంచి చిత్రాలతో అభిమానులను అలరించాలన్నదే నా లక్ష్యం. ఆర్జీవీ నా గురువు రాంగోపాల్ వర్మ నాకు గురువు. చాలా మంది రామూ మీ ఫ్రెండ్ కదా అంటుంటారు. ఆయన జీనియస్..ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. దయ వెబ్ సిరీస్ చూసి ఆదరించండి. చక్కని థ్రిల్ కలిగించే క్రైమ్ వెబ్ సిరీస్. మంచి స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతోంది. -
విశాఖపట్నంలో సందడి చేసిన జేడీ చక్రవర్తి (ఫొటోలు)
-
'ఇది నాకు చాలా ప్రత్యేకం'.. జేడీ చక్రవర్తి ఆసక్తికర కామెంట్స్!
సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, రమ్య , విష్ణుప్రియ, కమల్ కామరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ దయా. ఉత్కంఠ భరితమైన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఆగస్ట్ 4 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌తో ఓటీటీ అరంగేట్రం చేసిన జేడీ చక్రవర్తి వైజాగ్‌లో సందడి చేశారు. ఈ సందర్భంగా డిస్నీ+ హాట్‌స్టార్ నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ అభిమానులతో సరదాగా ముచ్చటించారు. (ఇది చదవండి: 'ఆరు నెలల పాటు సినిమాలు వదిలేశా '.. నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్!) జేడీ మాట్లాడుతూ.. 'డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కుటుంబంలో భాగమైనందుకు నేను చాలా ఆనందంగా ఉన్నా. ఈ క్రైమ్ థ్రిల్లర్ నాకు చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే నాకు సవాళ్లు అంటే చాలా ఇష్టం. ప్రతి పాత్రతో నన్ను సవాలు చేసుకోవడం, తిరిగి ఆవిష్కరించుకోవడం చేస్తుంటాను. ఈ సిరీస్‌లో నాకు అది దక్కింది.' అని అన్నారు. ఈ కార్యక్రమంలో, జేడీ చక్రవర్తి ప్రేక్షకులతో ఆప్యాయంగా పలకరించారు. తన పాత్రపై అభిమానుల్లో ఉన్నా సందేహాలను సమాధానాలిచ్చారు. ఆ తర్వాత అభిమానులతో సెల్ఫీలు దిగారు. (ఇది చదవండి: 'ఎవరితోనైనా కమిట్ అయితేనే అలా..' బుల్లితెర నటిపై దారుణ కామెంట్స్!) -
దయా వెబ్ సిరీస్ టీమ్ తో సాక్షి స్పెషల్ ఇంటర్వ్యూ
-
బాలీవుడ్ నాకు పొరుగు ఇల్లు లాంటిది: జేడీ చక్రవర్తి
బాలీవుడ్నాకు పొరుగు ఇల్లు లాంటిది. అందుకే కొంతకాలం అటువైపు వెళ్లి వచ్చా. నా బలం మాత్రం ఎప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమనే’ అని సీనియర్ హీరో జేడీ చక్రవర్తి అన్నారు. జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, నంబీషన్ రమ్య, కమల్ కామరాజ్ తదితరులు ముఖ్య పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘దయా’.పవన్ సాధినేని దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ ఆగస్ట్ 4నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్క్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో జేడీ చక్రవర్తి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► కంటెంట్ ఈజ్ ది ప్రిన్స్, డైరెక్టర్ ఈజ్ కింగ్ అని నమ్మే నటుడిని నేను. దయా అనే కథను దర్శకుడు పవన్ సాధినేని చెప్పిన విధానం ఆకట్టుకుంది. అందుకే ఈ వెబ్ సిరీస్ లో నటించేందుకు అంగీకరించాను. కథ మనకున్న స్థలం లాంటిదైతే..అందులో అందమైన ఇళ్లు కట్టడం డైరెక్షన్ లాంటిది. సినిమా అనే సౌధాన్ని అందంగా నిర్మించడం దర్శకుడి ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది. ► ఏ దర్శకుడైనా పది నిమిషాల్లో కథ చెప్పగలిగితే అతనికి ఆ స్క్రిప్ట్ మీద కమాండ్ ఉన్నట్లు అని ఆర్జీవీ అనేవారు. పవన్ ఫోన్ లో 10 మినిట్స్ స్టోరీ చెప్పినప్పుడే అతనికి కథ మీద ఉన్న పట్టు తెలిసింది. దాంతో ఫుల్ నెరేషన్ వినకుండానే ఓకే చెప్పాను. ► దయా వెబ్ సిరీస్ కు దర్శకుడు పవన్ పెద్ద బలం. ఇందులో క్యారెక్టర్స్ ఒక స్ట్రెంత్ అని చెప్పుకోవచ్చు. ప్రతి క్యారెక్టర్ యూనిక్ గా ఉంటుంది. నటీనటులకు గుర్తింపు తెచ్చే పాత్రలు ఇందులో ఉంటాయి. నా మొదటి సినిమా శివతోనే నేను జేడీ అయిపోయా. అలాగే బాహుబలిలో సత్యరాజ్ ను కట్టప్పగానే గుర్తుంచుకుంటాం. ఇలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్న వెబ్ సిరీస్ దయా. లొకేషన్స్, క్యారెక్టర్స్, స్క్రిప్ట్ అన్నీ బాగా కుదిరిన సిరీస్ ఇది. ► దయాలో నేను ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్ ను. చేపలను ఒక ఊరి నుంచి మరో ఊరికి తీసుకెళ్లడం నా పని. దయా వరల్డ్ ను ప్రారంభం నుంచీ 10, 12 నిమిషాల పాటు ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చాడు. ఆ ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్ కు ఒకరోజు అమ్మాయి శవం కనిపిస్తుంది. పోలీసులకు చెప్పేంత ధైర్యం అతనిలో ఉండదు. ఈ భయంలో ఉండగానే ఇంకో శవం దొరుకుతుంది. సాదాసీదా జీవితం గడిపే ఆ డ్రైవర్ జీవితాన్ని ఈ ఘటనలు మలుపుతిప్పుతాయి. ఆ ఎమోషన్స్ అన్నీ దయాలో చూస్తారు. ► ఓటీటీలో స్టార్ డమ్ ను కౌంట్ చేయలేము అనడం సరికాదు. సినిమా ఎంత సక్సెస్ అయ్యింది అనేందుకు థియేటర్ లో మనకు కలెక్షన్స్ లెక్కిస్తాం. కానీ ఓటీటీలో ఎంతమంది చూశారు అనేది కొలమానం. కథను సినిమాలో కంటే విస్తృతంగా చెప్పేందుకు వెబ్ సిరీస్ బాగా ఉపయోగపడుతుంది. వెబ్ సిరీస్ లో కొత్త వాళ్లకూ ఆదరణ దక్కుతుంది. వాళ్లనూ రిసీవ్ చేసుకుంటారు. కానీ థియేటర్ లో స్టార్స్ సినిమాలకు మాత్రమే బయ్యర్స్ ఉంటారు. ఇది ఓటీటీకున్న అడ్వాంటేజ్. నేను జేడీ చక్రవర్తి కాకుండా కొత్త నటుడిగా దయాలో చూస్తారు. -
మందు,సిగరెట్,నాన్ వెజ్ తీసుకోక పోవడానికి కారణం ఒక్కటే
-
JD Chakravarthy: షూటింగ్ లో నేను మేకప్ వేసుకోకుండా ఏం చేస్తా అంటే..!
-
జెడి చక్రవర్తితో సాక్షి స్పెషల్ ఇంటర్వ్యూ
-
ఎవరు?
నటుడు, దర్శక–నిర్మాత జేడీ చక్రవర్తి స్వీయ దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో తీసిన తాజా చిత్రం ‘హూ’. ఇందులో శుభరక్ష, నిత్య హీరోయిన్స్ గా నటించారు. రెడ్డెమ్మ బాలాజీ.కె నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, విడుదలకు రెడీ అయ్యింది. ఈ సందర్భంగా రెడ్డెమ్మ బాలాజీ.కె మాట్లాడుతూ–‘‘ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘హూ’. ఈ మూవీలో జేడీ చక్రవర్తి నటన చాలా వైవిధ్యంగా ఉంటుంది’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: ఈశ్వర్ చంద్. -
‘ఇద్దరు’ విజయం సాధించాలి
అర్జున్ సర్జా, రాధిక కుమారస్వామి, జె.డి చక్రవర్తి, ఫైజల్ ఖాన్ కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘ఇద్దరు’. ఎఫ్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డి.ఎస్.రెడ్డి సమర్పణలో ఫర్హీన్ ఫాతిమా నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్ సమీర్ దర్శకుడు. ఈ నెల 7న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర సక్సెస్ కావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ‘‘అర్జున్ మంచి నటుడు. విలక్షణమైన పాత్రలతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. జె.డి.చక్రవర్తికి సినిమా అంటే ప్యాషన్. వీరిద్దరూ కలిసి నటించిన ఈ చిత్రం హిట్ కావాలి. సమీర్ కష్టపడే తత్వం గలవాడు. ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. త్వరలోనే అతను బాలీవుడ్లో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. చిన్న సినిమాలు ఆడితేనే పరిశ్రమ బావుంటుంది’ అని అన్నారు. ‘ఈ సినిమా ట్రైలర్ చూశా. ఆసక్తికరంగా ఉంది. మున్ముందు కూడా ఇలాంటి సందేశాత్మక చిత్రాలు రావాలి’ అని తీన్మార్ మల్లన్న అన్నారు. ‘యాక్షన్‌తోపాటు చక్కని వినోదాన్ని పంచే సినిమా ఇది’అని దర్శకుడు ఎస్ ఎస్ సమీర్ అన్నారు. ‘చాలా కష్టం పడి సినిమా పూర్తి చేశాం. సినిమాలో హీరో ఎవరు, విలన్ ఎవరు అనేది చివరి వరకూ గెస్ చేయలేరు. ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది’ అని నిర్మాత ఫర్హీన్ ఫాతిమా అన్నారు. నటుడు సమీర్, క్కుమార్, కరాటే లక్ష్మీ తదితరులతోపాటు చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని సినిమా సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. -
ఆర్జీవీలోని విలక్షణతకు ఈ చిత్రం నిదర్శనం
ఆర్జీవీ.. రాం గోపాల్ వర్మ. సంచలనాలను, వివాదాలకు, అన్నింటికి మించి బోల్డ్‌కు కేరాఫ్. ఈ మధ్యకాలంలో వర్మ సినిమాల ఆడడం మాట ఏమోగానీ.. కెరీర్ తొలినాళ్లలో ఆయన ప్రదర్శించిన విలక్షణతను మరే దర్శకుడు కనబర్చలేదన్నది ఒప్పుకోవాల్సిన విషయం. అప్పటిదాకా మూస ధోరణితో సాగిపోతున్న కమర్షియల్ సినిమాకు సత్య అనే గ్యాంగ్‌స్టర్ అనే డ్రామాను అందించి బాలీవుడ్లో ఓ కొత్త ఒరవడిని సృష్టించడమే కాదు.. ఆ రియలిస్టిక్ సబ్జెక్టుతోనూ సంచలన విజయం అందుకున్నారాయన. 🎥 రియల్ ఇన్సిడెంట్స్ను బేస్ చేసుకుని వర్మ చేసిన తొలి గొప్ప ప్రయత్నంగా సత్యను అభివర్ణిస్తుంటారు చాలామంది సినీ క్రిటిక్స్. అప్పటికే పదిదాకా సినిమాలు తీసిన అనుభవం.. మంచి సక్సెస్ రేటు అందుకున్న ఘనత కూడా ఉంది. అయితే.. బాలీవుడ్‌కు పెద్దగా పరిచయం ఉండని కొత్త ముఖాలతోనే సినిమా తీయాలనుకున్న వర్మ.. జేడీ చక్రవర్తిని గా తీసుకున్నారు. ఉర్మిళ హీరోయిన్ కాగా.. మనోజ్ బాజ్‌పాయితో పాటు సౌరభ్ శుక్లా లాంటి మెథడ్ యాక్టర్లు ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. అలాగే సీఐడీ ఫేమ్ ఆదిత్యా శ్రీవాస్తవ, తెలుగు నటుడు బెనర్జీకి మంచి గుర్తింపు దక్కింది. 🎥 ఓ కంప్లీట్ యాక్షన్ సినిమా తీయాలనుకున్న వర్మ.. కొందరు రియల్ క్రిమినల్స్‌ను కలుసుకున్నాక తన ఆలోచన మార్చేసుకున్నారట. అలా వాస్తవ జీవితాల నుంచి పుట్టిందే సత్య కథ. అలాగని సత్య కథ అల్లింది వర్మ కాదు. అందులో కల్లుమామ పాత్రధారి సౌరభ్ శుక్లా, అనురాగ్ కశ్యప్‌లు రైటర్లు. అంతకు మించి.. పల్లెటూరి నుంచి ఉద్యోగం కోసం ముంబైకి వచ్చి.. అక్కడి నుంచి అండర్ వరల్డ్ ప్రపంచంలోకి అడుగుపెట్టి తన జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకునే సత్యది. 🎥 కోటి కలలతో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టే సత్యకు భీకూతో స్నేహం, విద్యతో ప్రేమ బంధం.. మాఫియా మేఘాలు అలుముకుని చివరకు విషాద ముగింపు తీసుకోవడం.. ఇలా చాలా రియల్స్టిక్గా వర్మ చూపించిన విధానాన్ని ఆడియొన్స్ ఆదరించారు. 🎥 వాస్తవానికి.. కొత్త వాళ్లతో సినిమా వర్మ అనౌన్స్ చేయగానే చాలామంది ఆశ్చర్యపోయారట. అందుకు తగ్గట్లే.. సినిమా షూటింగ్ మొదలైన మూడు రోజులకే కొన్ని కారణాల వలన ఆగిపోయిందట. నిజానికి ఈ సినిమాలో సాంగ్స్ లేకుండా ప్లాన్ చేశారు. కానీ డిస్ట్రిబ్యూటర్స్ ఒత్తిడి కారణంగా వర్మ, విశాల్ భరద్వాజ్, సందీప్ చౌతలతో(బ్యాక్‌గ్రౌండ్ స్కోర్) మ్యూజిక్ కంపోజ్ చేయించాడు. Video Credits: Mango Music 🎥 రెండున్నర కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం.. 1998 జులై 3వ తేదీన విడుదల అయ్యింది. ఐదు రెట్ల కలెక్షన్ల వసూలుతో భాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించడంతో పాటు.. 1998లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాల జాబితాలో నిలిచింది కూడా. 🎥 వర్మలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన సత్య.. ఆరు ఫిల్మ్ ఫేర్ అవార్డులతో పాటు ఓ జాతీయ అవార్డును సైతం దక్కించుకుంది. మనోజ్ బాజ్పాయికి నేషనల్ అవార్డు దక్కింది. 🎥 మొత్తంగా వర్మ కెరీర్లో ఓ ప్రత్యేకమైన సినిమాగా.. కల్ట్ హోదాను దక్కించుకుని భారతీయ చలన చిత్ర రంగంలో గొప్ప చిత్రాల జాబితాలో ఒకటిగా నిలిచింది. 🎥 2008 ఆస్కార్ అవార్డు అందుకున్న స్లమ్‌డాగ్ మిలీయనీర్ చిత్రానికి సత్య ఒక స్ఫూర్తి. ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు డానీ బోయల్ స్వయంగా చెప్పాడు. సత్య సినిమా షూటింగ్ మూడో రోజు విన్న ఒక వార్త బాధాకరంగా అనిపించింది. టీ సిరీస్ గుల్షన్ కుమార్‌ను కాల్చి చంపారనే వార్త. ఆ తర్వాత అండర్‌వరల్డ్‌పై సినిమా తీయొద్దంటూ మా మీద ఒత్తిడి పెరిగింది. ఆ పరిణామం ఒకవైపు ఇబ్బందికరంగా, మరోవైపు బాధగా అనిపించింది. కానీ, వర్మ అనుకున్నది ఓ పట్టాన వదిలే రకం కాదు. తనకు రైట్ అనిపిస్తే చేసేస్తాడంతే. అదే సమయంలో.. తాను అనుకున్నది అండర్‌వరల్డ్‌ను గొప్పగా చూపించడం కాదని వర్మ తేల్చేశాడు. ఇంకేం.. అలా మాఫియా ప్రపంచంలో ఉండే భావోద్వేగాల్ని ప్రధానంగా చేసుకుని కథ తెరకెక్కింది.. మంచి విజయం అందుకుంది: జేడీ చక్రవర్తి ఓ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో.. -
టాలీవుడ్ యాంకర్‌తో పెళ్లి.. మా బంధం అలాంటిది: జేడీ చక్రవర్తి
హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వ్యక్తి జేడీ చక్రవర్తి. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే జేడీ ప్రస్తుతం ఓటీటీలో అలరిస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అంతేకాకుండా ఇటీవల ఓషోలో యాంకర్ విష్ణుప్రియ జేడీ చక్రవర్తి అంటే తనకిష్టమని.. పెళ్లి చేసుకుంటానని చేసిన కామెంట్స్‌పై స్పందించారు. విష్ణుప్రియ అలా చెప్పడానికి గల కారణాన్ని వెల్లడించారు. ఇంతకీ పెళ్లి వార్తలపై జేడీ ఏమన్నారో చూద్దాం. (ఇది చదవండి: నా ఫస్ట్ క్రష్ అతనే.. యాంకర్ విష్ణుప్రియ షాకింగ్ కామెంట్స్!) జేడీ చక్రవర్తి మాట్లాడుతూ..'తమ మధ్య మంచి అనుబంధం ఉంది. కానీ అది ప్రేమ కాదు. విష్ణుప్రియ చాలా మంచి అమ్మాయి. మేమిద్దరం కలిసి ఇటీవలే ఓ సిరీస్‌లో నటించాం. ఆ సిరీస్ కోసం దాదాపు 40 రోజులు కలిసి పని చేశాం. ఆ సిరీస్ దర్శకుడు ప్రతిరోజూ నేను నటించిన ఒక సినిమా చూడమని విష్ణుప్రియకు సూచించాడు.' అని అన్నారు. ఆ తర్వాత జేడీ ఆమె నేను నటించిన చిత్రాల్లోని పాత్రలతో మాత్రమే ప్రేమలో పడ్డారని తెలిపారు. అంతే తప్ప నాతో కాదు.. మాది గురు శిష్యుల అనుబంధంమని అన్నారు. కాగా.. ఇటీవల ఓషోలో పాల్గొన్న విష్ణుప్రియ జేడీ చక్రవర్తి ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలైన సంగతి తెలిసిందే. ఇటీవలే 'గంగులు' అనే సాంగ్‌తో అభిమానులను పలకరించింది విష్ణుప్రియ. ఈ సాంగ్‌లో బిగ్ బాస్ ఫేమ్ మానస్‌తో కలిసి తన డ్యాన్స్‌తో అదరగొట్టింది. (ఇది చదవండి: తల్లిని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకున్న విష్ణుప్రియ) -
నాపై 8 నెలలు విషప్రయోగం చేశారు: జేడీ చక్రవర్తి ఎమోషనల్
హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వ్యక్తి జేడీ చక్రవర్తి. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే ఇతడు ప్రస్తుతం ఓటీటీలోనూ అలరిస్తున్నాడు. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. తనపై విషప్రయోగం జరిగిందన్న సంచలన విషయాన్ని సైతం వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ.. 'నాకు ఎటువంటి చెడు అలవాట్లు లేవు. కానీ కొంతకాలం క్రితం నాకు ఉన్నట్టుండి శ్వాసకోస సమస్యలు వచ్చాయి. ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఎంతో కష్టమయ్యేది. డాక్టర్లు చేతులెత్తేశారు.. ఎంతోమంది వైద్యులకు చూపించినా ఎవరికీ అంతు చిక్కలేదు. నేనేమో ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బందిపడుతూనే ఉన్నాను. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో చెక్ చేయించుకున్నా నా సమస్యకు పరిష్కారం దొరకలేదు. డాక్టర్లు నా పరిస్థితి చూసి కష్టమే అని చేతులెత్తేశారు. అప్పుడు నా స్నేహితుడు, నిర్మాత శేషు రెడ్డి నాకు అండగా నిలబడ్డాడు. డాక్టర్ నాగార్జున దగ్గరకు తీసుకెళ్లాడు. ఆయన నన్ను పరీక్షించి డ్రగ్స్ ఎందుకు తీసుకుంటున్నావని అడిగాడు. నాకసలు డ్రగ్స్ అలవాటే లేదని చెప్పాను. కషాయం తాగినందుకు అస్వస్థత ఇక్కడ మీకో విషయం చెప్పాలి. నేను ఎడిటింగ్ చేస్తున్న రోజుల్లో ప్రతిరోజు కషాయం తాగేవాడిని. ఓసారి నాతో ఉండే నిర్మాత ఖాసీం తాను నా కషాయం తాగుతానన్నాడు. సరేనని ఇచ్చాను. ఆ కషాయం తాగినందుకు ఖాసీంకు రెండురోజులు తీవ్రమైన జ్వరం వచ్చి లేవలేకపోయాడు. ఇదే మాట నాకు కషాయాన్ని ఇచ్చే వ్యక్తికి చెప్పాను. చూశావా? నువ్విచ్చే కషాయాన్ని నేను ఎంత కష్టపడి తాగుతున్నానో అని! అతడు షాకైపోయాడు. 8 నెలలు విషప్రయోగం.. నీకోసం చేసిన కషాయాన్ని వేరేవాళ్లకు ఎందుకిచ్చావు? అని తిట్టాడు. మా మధ్య మాటల యుద్ధమే జరిగింది. చివరకు ఆస్పత్రిలో తేలిందేంటంటే నాకు 8 నెలలుగా స్లో పాయిజన్ ఇచ్చారు. నేను ఔషధం అని తాగుతున్నదే విషం. దానివల్లే శ్వాసకోస సమస్యలు వచ్చాయని తెలిసింది. ఖాసీంకు మందు తాగే అలవాటు ఉంది. అందుకే ఆ కషాయాన్ని అతడి శరీరం స్వీకరించలేకపోయింది. అందుకే అతడు వాంతులు చేసుకున్నాడు' అని చెప్పుకొచ్చాడు జేడీ చక్రవర్తి. అయితే విషప్రయోగం చేసిందెవరన్న విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు. చదవండి: సినిమా రిలీజ్ తర్వాత ఆదిపురుష్ డైరెక్టర్ ట్వీట్.. వైరల్ -
రాము గారు చాలా గ్రేట్ ఎందుకంటే.. 10 లక్షలు అప్పు చేసి..
-
యాంకర్ తో జేడీ పులిహోర
-
ఆర్జీవీ నన్ను హీరోగా పెట్టి రమ్యకృష్ణతో సినిమా...
-
హీరోయిన్లందరినీ ట్రై చేశా.. జేడీ చక్రవర్తి బోల్డ్ కామెంట్స్
ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోగా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు జేడీ చక్రవర్తి. మనీ మనీ , గులాబీ , బొంబాయి ప్రియుడు వంటి ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించిన జేడీ చక్రవర్తి ప్రస్తుతం హాట్ స్టార్‌లో ఓ ఒరిజినల్లో నటిస్తున్నారు. ఇందులో ఈషా రెబ్బా హీరోయిన్గా నటిస్తుంది. త్వరలోనే ఈ మూవీ విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఓంకార్ హోస్ట్‌గా చేస్తున్న ఓ షోకు జేడీ, ఈషా రెబ్బా హాజరై సందడి చేశారు. చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరో ధనుష్.. షాకింగ్ లుక్ ఈ సందర్భంగా మీ కెరీర్లో ఏ హీరోయిన్ని అయినా ఇంప్రెస్ చేయడానికి ట్రై చేశారా అని ఓంకార్ ప్రశ్నించగా జేడీ చక్రవర్తి అంతే బోల్డ్‌గా సమాధానం ఇచ్చారు. మా నాన్న మీద ఒట్టు అందరు హీరోయిన్లని ట్రై చేశా అంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్‌గా మారింది. -
జేడీ చక్రవర్తి కి అంతర్జాతీయ అవార్డు
తెలుగు సినిమాలకు, నటీనటులకు ఇప్పుడు అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తోంది. ఇప్పటికే పలువురు టాలీవుడ్ నటీనటులకు అంతర్జాతీయ అవార్డులు లభించాయి. తాజాగా సీనియర్ హీరో జేడీ చక్రవర్తిని మరో ఇంటర్నేషనల్ అవార్డు వరించింది. నైజీరియాలో ప్రతిష్టాత్మకంగా భావించే ఎకో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో జేడీ చక్రవర్తికి అవార్డు లభించింది. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కేటగిరీలో అవార్డు వచ్చింది. దహిణి ది విచ్ అనే సినిమాలోని నటనకు గానూ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు లభించింది. (చదవండి: మహిళల శరీరాలు ఎంతో విలువైనవి.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు) ఈ చిత్రం ఇది వరకు ఆస్ట్రేలియాలోనూ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా అవార్డును అందుకుంది. ఈ సినిమాకు రాజేష్ టచ్‌రివర్ దర్శకత్వం వహించారు. సునీతా కృష్ణన్, ప్రదీప్ నారాయణన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. తనిష్ట ఛటర్జీ, జేడీ చక్రవర్తి, శ్రుతి జయన్ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు 18 అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి.