ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో యన్‌ఎస్‌సీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఎంఎంఓఎఫ్. ఆర్‌ఆర్‌ఆర్ ప్రొడక్షన్స్, జేకే క్రియేషన్స్ బ్యానర్‌పై రాజశేఖర్, జేడీ ఖాసీంలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో బెనర్జీ, అక్షత, అక్షిత ముద్గల్, మనోజ్ నందన్, చమ్మక్ చంద్ర ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ చేతుల మీదుగా విడుదల చేశారు.
ట్రైలర్‌లో మధ్యలో ఇంటర్మిషన్ అని పేర్కొని.. ఒకే కథను రెండు రకాలు చెప్పారు. ‘ఒక రోజు నేను అడవిలో వెళ్తూ ఉంటే సడెన్‌గా పులి ఎదురైంది. భయంతో పరిగెట్టాను. పులి నా వెంట పడింది. పులి నా వెంట పడుతుంది నేను పరిగెడుతున్నాను. పులి నా వెంట పడుతూనే ఉంది.. నేను పరిగెడుతూనే ఉన్నాను. అలా పరిగెత్తి ఓ కొండపైకి ఎక్కి చూస్తే...’అని కథను రెండు వెర్షన్‌లలో చూపించారు. ఓ థియేటర్‌లో జరిగే ఘటనలను ప్రధానంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది. ‘సినిమాలో లిప్ టూ లిప్ సీన్ చూశావా.. అది మనం ట్రై చేద్దామా’ అంటూ హీరోయిన్ పలికే డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా ట్రైలర్‌లో ఇంటర్మిషన్ తర్వాత చూపించిన సీన్స్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. 2 నిమిషాలకు పైగా నిడివి గల ఈ ట్రైలర్‌ను ఆద్యంతం ఉత్కంఠ కలిగించేలా తీర్చిదిద్దారు. కాగా, ఈ చిత్రానికి సాయి కార్తీక్ అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment