ఐదు భాషల్లో రామ్‌గోపాల్ వర్మ ‘మర్డర్‌’ | Ram Gopal Varma's Murder Movie Releasing in 5 Languages, Trailer Will Release on July 28 - Sakshi
Sakshi News home page

ఐదు భాషల్లో ‘మర్డర్‌’ : ట్రైలర్‌ డేట్‌ ఫిక్స్‌

Published Thu, Jul 23 2020 4:53 PM | Last Updated on Thu, Jul 23 2020 5:36 PM

Ram Gopal Varma Announced Murder Movie Trailer Release - Sakshi

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ‌ ఫుల్‌ బిజీ అయిపోయాడు. ఇప్పటికే పవర్‌ స్టార్‌ చిత్రం విడుదలకు రెడీగా ఉండగా.. మరో సినిమా విడుదలకు సిద్దమయ్యాడు. ఆర్జీవీ కొద్ది రోజుల కిందట మిర్యాలగూడకు చెందిన అమృత, ఆమె తండ్రి మారుతిరావుల కథ  ఆధారంగా వర్మ ‘మర్డర్‌’(కుటుంబ కథా చిత్రం అనేది ట్యాగ్‌ లైన్‌) అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే పలు పోస్టర్‌లు కూడా విడుదల చేశారు.(ఆర్జీవీ ‘మర్డర్’: మరో పోస్టర్‌ రిలీజ్‌)

తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల తేదిని ఆర్జీవీ ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. జూలై 28వ తేదీ ఉదయం 9.08 గంటలకు ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఐదు భాషల్లో ఈ చిత్రం రూపొందిస్తున్నట్టు చెప్పారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకే సారి ట్రైలర్‌ను రిలీజ్‌ చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ చిత్రంలో అమృత పాత్రలో ఆవంచ సాహితి, మారుతిరావు పాత్రలో శ్రీకాంత్‌ అయ్యంగార్‌ నటిస్తున్నారు. ఆర్జీవీ సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.(ఆర్జీవీపై ప్రణయ్‌ తండ్రి ఫిర్యాదు..)

కాగా, ప్రేమ వివాహం చేసుకున్న పెరుమాళ్ల ప్రణయ్ హత్యకు గురికావడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ప్రణయ్‌ భార్య అమృత తండ్రి మారుతిరావు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అయితే ఇటీవల హైదరాబాద్‌లోని ఓ హోటల్‌ గదిలో మారుతి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. మరోవైపు ‘మర్డర్‌’ సినిమాపై ఇప్పటికే  ప్రణయ్‌ తండ్రి బాలస్వామి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తన కొడుకు హత్య కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ కోర్టును ఆశ్రయించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement