‘మర్డర్‌’ దర్శక నిర్మాతలు నల్గొండ కోర్టుకు.. | Murder Movie Director And Producer Will Be Attend Nalgonda Court On 6th August | Sakshi
Sakshi News home page

‘మర్డర్‌’ దర్శక నిర్మాతలు నల్గొండ కోర్టుకు..

Published Wed, Aug 5 2020 8:24 AM | Last Updated on Wed, Aug 5 2020 8:27 AM

Murder Movie Director And Producer Will Be Attend Nalgonda Court On 6th August - Sakshi

సాక్షి, మిర్యాలగూడ: మర్డర్‌ సినిమా దర్శక, నిర్మాతలు ఈ నెల 6న నల్లగొండ జిల్లా కోర్టుకు హాజరుకానున్నట్లు ప్రణయ్‌ భార్య అమృత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. కల్పిత సినిమా మర్డర్‌లో తన పేరు, ఫొటోలు వాడుకున్నారంటూ గత నెల 29న ఆ సినిమా దర్శక, నిర్మతలపై సూట్‌ ఫైల్‌ చేసింది. వాట్సాప్, ఈ మెయిల్‌ ద్వారా నోటీసులు అందగా వారు కోర్టుకు హాజరుకానున్నారని పేర్కొంది. తన భర్త ప్రణయ్‌ హత్యతో రెండేళ్లుగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నానని, కల్పిత స్టోరీలతో సినిమా చిత్రీకరించి తమ జీవితాలతో ఆటలాడుకోవడం సరికాదన్నారు. సినిమాలో తమ పేర్లు, ఫొటోలను వాడుకోవడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement