సాక్షి, నల్గొండ: తనకు కరోనా సోకలేదని, తప్పుడు ప్రచారాలు మానుకోవాలని ట్విటర్‌లో వీడియో షేర్ చేసిన రామ్‌గోపాల్ వర్మ కోర్టు వ్యవహారంతో అడ్డంగా దొరికిపోయారు. ఆయన రూపొందిస్తున్న‘మర్డర్ సినిమా’పై అమృతా ప్రణయ్ కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. మర్డర్ సినిమాకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయాలని నల్గొండలోని ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు ఇదివరకు ఆదేశాలు జారీ చేసింది. అయితే, రామ్‌గోపాల్ వర్మకు కరోనా సోకినందున...అఫిడవిట్‌పై సంతకం చేయలేకపోయారని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. విచారణ మరో రోజుకు వాయిదా వేయాలని విన్నవించారు. దీంతో ఆగస్టు 14కి కోర్టు విచారణ వాయిదా వేసింది. అయితే, కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని అమృత ఆరోపించారు. కరోనా సోకలేదని రామ్‌గోపాల్ వర్మ ట్విటర్‌లో ప్రకటించారని కోర్టుకు తెలిపారు. కోర్టు దృష్టికి వాస్తవాలు తీసుకెళ్తామని అమృత తరఫు న్యాయవాది పేర్కొన్నారు.
(‘మర్డర్’ దర్శక నిర్మాతలు నల్గొండ కోర్టుకు..)
In the wake of malicious rumours from some media outlets like one below, just wanted to clarify to whoever concerned that I am SUPER FIT https://t.co/xajKM11Z1w pic.twitter.com/FB2Q1gaTtN
— Ram Gopal Varma (@RGVzoomin) August 9, 2020
Comments
Please login to add a commentAdd a comment