‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఫేమ్ అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కరోనా వైరస్’. రామ్‌గోపాల్ వర్మ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదల కానుంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించిన దక్షి గుత్తికొండ మాట్లాడుతూ – ‘‘సామాజిక మాధ్యమాల్లో ఉన్న నా గ్లామర్ ఇమేజ్‌కి, ఈ సినిమాలోని నా పాత్రకి అస్సలు సంబంధం ఉండదు. ఒక తెలుగు కుటుంబంలో తమిళ కోడలి పాత్రలో కనిపిస్తాను. సినిమాలో వంశీ చాగంటి భార్య పాత్ర నాది. నా మొదటి సినిమాలోనే డీ గ్లామర్ పాత్ర చెయ్యటం చాలెంజింగ్‌గా అనిపించింది. తెలుగమ్మాయి అయిన నాకు మొదటి సినిమా అవకాశం ఇచ్చిన రామ్‌గోపాల్ వర్మగారికి ధన్యవాదాలు. ఇలాంటి పాత్రలే చెయ్యాలని నాకంటూ పరిమితులు పెట్టుకోలేదు. కథ నచ్చితే ఏ తరహా పాత్ర చేయడానికైనా రెడీ, గ్లామర్, రొమాంటిక్ సీన్స్‌లో నటించడానికి కూడా సిద్ధమే’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment