కరోనా కాలంలో సినిమా షూటింగ్‌లు ఆగిపోయినప్పటికీ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ పలు సినిమాలను తెరకెక్కించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ పలు సినిమాల షూటింగ్‌లను పూర్తి చేసి విడుదల కూడా చేశారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌పై కూడా ఆర్జీవీ ఓ సినిమా తెరకెక్కించారు. ఆ చిత్రానికి ఆసక్తికరంగా ‘కరోనా వైరస్’ అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన నేతృత్వంలో తెరకెక్కెతున్న ‘కరోనా వైరస్’ మూవీ రెండో ట్రైలర్‌ను ఆర్జీవి బుధవారం విడుదల చేశారు. ఈ సినిమకు ఆగస్త్య మంజు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన మొదటి ట్రైలర్ అభిమానులు, నెటిజన్లను ఆకట్టుకుంటోంది. చదవండి: ట్రైలర్‌తోనే బయపెడుతున్న వర్మ
‘ఈ కరోనా ఎఫెక్ట్ ఉంది కాదా ఎప్పుడు, ఎక్కడ ఎవరి నుంచి ఎవరికి.. ఎలా వస్తుందో తెలియటం లేదు. కాబట్టి నాకు చెప్పకుండా ఎవరు బయటకు వెళ్లేది లేదు’ అనే డైలాగ్‌లో ఈ ట్రైలర్ మొదలవుతుంది. ‘60 నుంచి 70 ఏళ్ల మధ్య ఉన్న వాళ్లకు మాత్రమే కరోనా వస్తుందనడం కరెక్ట్ కాదు. 25 ఏళ్ల అబ్బాయి కూడా చచ్చిపోయాడంటా.. ఇంకా ఆయన మాటలు వింటే గోవిందా.. గోవిందా..’ అనే మరో డైలాగ్‌తో ఈ ట్రైలర్ ముగుస్తుంది. తీవ్రమైన దగ్గు శబ్దంతో కూడిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. ఇక కరోనా వైరస్ మూవీ డిసెంబర్ 11న విడుదల కానుంది. లాక్‌డౌన్ తర్వాత థియేటర్‌లో విడుదల అవుతున్న తొలి చిత్రం తమ ‘కరోనా వైరస్’ అని రామ్‌గోపాల వర్మ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment