కరోనా వైరస్‌కు రుణపడ్డాను | Ram Gopal Varma Corona Virus Movie Press meet | Sakshi
Sakshi News home page

కరోనా వైరస్‌కు రుణపడ్డాను

Published Sun, Dec 6 2020 12:09 AM | Last Updated on Sun, Dec 6 2020 4:28 AM

Ram Gopal Varma Corona Virus Movie Press meet - Sakshi

వంశీ, సోనియా, రామ్‌గోపాల్‌ వర్మ, శ్రీకాంత్‌

కరెంట్‌ ఎఫైర్స్‌ను కంటెంట్‌గా వాడుకుని సినిమాలు తీస్తుంటారు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ పై ‘కరోనా వైరస్‌’ చిత్రాన్ని తీశారాయన. ఈ నెల 11న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో రామ్‌గోపాల్‌ వర్మ మాట్లాడుతూ –‘‘నన్ను నమ్మి ఈ చిత్రంలో నటించిన నటీనటులందరికీ ధన్యవాదాలు.

లాక్‌డౌన్‌ టైమ్‌లో హీరోలు, దర్శకులు అంట్లు తోముకుంటూ, వంటలు వండుకుంటూ, ఇళ్లు ఊడ్చుకుంటూ టైమ్‌పాస్‌ చేస్తే నేను మాత్రం సినిమాలు తీశాను. కరోనా వైరస్‌ దీవెనలు ఉండడంవల్లే ఎవరూ కరోనా బారిన పడకుండా ఈ సినిమా చేయగలిగాం. అందుకే కరోనా వైరస్‌కు రుణపడి ఉన్నాను’’ అన్నారు. ‘‘కరోనా వల్ల ఎలా బ్రతకాలి అని ఆలోచిస్తున్న సమయంలో వర్మ నుండి పిలుపు వచ్చింది. ఓ కుటుంబంలా ఒకేచోట ఉంటూ నటీనటులందరం ఈ కుటుంబకథా చిత్రంలో నటించాం’’ అని శ్రీకాంత్‌ అయ్యంగార్, వంశీ చాగంటి, సోనియా ఆకుల అన్నారు. నిర్మాత నట్టికుమార్, దర్శకుడు అగస్త్య మంజు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement