RGV's Tweet on Naveen's murder case goes viral - Sakshi
Sakshi News home page

RGV Tweet: మరీ ఇంత గుడ్డిదని తెల్వదు: రామ్ గోపాల్ వర్మ

Published Mon, Mar 13 2023 7:36 PM | Last Updated on Mon, Mar 13 2023 7:46 PM

RGV Tweet Goes Viral On Social Media about Naveen Murder - Sakshi

ఆర్జీవీ అనగానే ఠక్కున గుర్తొచ్చే రాంగోపాల్ వర్మ. అటు బాలీవుడ్.. ఇటూ టాలీవుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకంటే ఆయన చేసే కామెంట్స్‌తో తరచుగా వార్తల్లో హాట్‌ టాపిక్‌గా నిలుస్తుంటారు. ఇండస్ట్రీలో వివాదస్పద దర్శకుడిగా ముద్ర వేసుకున్నారు ఆర్జీవీ. తాజాగా మరోసారి ఆయన చేసిన ట్వీట్ వైరలవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇంజనీరింగ్‌ విద్యార్థి నేనావత్‌ నవీన్‌ హత్యపై ఆయన ట్వీట్ చేశారు. నవీన్‌, హరిహరకృష్ణ, నిహారిక ఫోటోలను తన ఖాతాలో షేర్ చేశారు.

 ట్విటర్‌లో ఆర్జీవీ రాస్తూ..' ఈ పోటోలో ఉన్న వ్యక్తి ఆ అమ్మాయి కోసం మరో వ్యక్తిని చంపేశాడు. ప్రేమ అనేది గుడ్డిదని నాకు తెలుసు. కానీ మరీ ఇంత గుడ్డిదని నాకు తెల్వదు.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. గత నెల 17న అబ్దుల్లాపూర్‌మెట్‌ శివారు ప్రాంతంలో నవీన్‌ను హరిహరకృష్ణ కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement