సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన మర్డర్ సినిమా ఈ నెల 24న విడుదలకు సిద్ధంగా ఉంది. శ్రీకాంత్ అయ్యంగార్, సాహితి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా రెండో ట్రైలర్ గురువారం విడుదలయ్యింది. ఇక మర్డర్ సినిమా చేస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి రాంగోపాల్ వర్మకు అన్ని అడ్డంకులే ఎదురయ్యాయి. చివరికి అన్ని సమస్యలను దాటుకొని విడుదలకు లీగల్‌గా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో ఈ సినిమా లీజ్ ధియేటర్స్‌లో మాత్రమే కాకుండా అన్ని థియేటర్స్‌లో సినిమా విడుదల కానుంది. కాగా రెండేళ్ల క్రితం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పెరుమాల్ల ప్రణయ్ అనే యువకుని హత్య ఆధారంగా వర్మ ‘మర్డర్’ అనే పేరుతో సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దీనికి 'కుటుంబ కథా చిత్రమ్' అనే ట్యాగ్‌లైన్ పెట్టాడు. చదవండి: థియేటర్లలో చంపడానికి రాబోతుంది: ఆర్జీవీ
ఈ మేరకు రాంగోపాల్ వర్మ శుక్రవారం వీడియో విడుదల చేశాడు. ‘ఈ మర్డర్ సినిమా ఎన్నో నిజ జీవితాలపై తీసిన యదార్థ కథ. ఈ సినిమా అన్ని అడ్డంకులు పూర్తి చేసుకొని ఈ నెల 24న విడుదల చేస్తున్నాం. కాబట్టి మేము 22వ తేదీన మిర్యాలగూడలో ప్రెస్ మీట్ పెట్టాలని నిర్ణయించుకున్నాం. మిర్యాలగూడలోనే ఎందుకు అంటే దానికి మాకు కొన్ని కారణాలు ఉన్నాయి. కానీ చెప్పడానికి వీలు పడదు. ఇక్కడ పెడితేనే కరెక్ట్ ఉంటుందని భావిస్తున్నాము. ఈ సినిమా పిల్లలకు తల్లిదండ్రులకు జరిగే కంటిన్యూ యుద్ధం. వారి ఇష్టాలను కాదన్నపుడు చాలామందికి ఎం నష్టం జరుగుతుందనేది ఈ చిత్రం చూస్తే తెలుస్తుంది’ అని అన్నారు. చదవండి: 'మర్డర్' సెకండ్ ట్రైలర్ విడుదల
ఒక తండ్రి అతి ప్రేమ వల్ల ఏమి జరిగింది అన్నదే సినిమా అని నిర్మాత నట్టి కుమార్ అన్నారు. ‘మిర్యాలగూడలో మర్డర్ సినిమా వస్తే థియేటర్స్‌ను ద్వంసమ్ చేస్తాం అన్నారు. ఎవరి బెదిరింపులకు భయపడం. కోపం మా మీద అయితే నన్ను, రాంగోపాల్ వర్మను చంపండి. 24న మిర్యాలగూడలో సినిమా విడుదల చేస్తాం. ఎవరి బెదిరింపు కాల్స్‌కు భయపడం. మిర్యాలగూడ ఏ రెండు కుటుంబాలది కాదు. చట్టాన్ని గౌరవిస్తాం. ఎవరూ భయపడకుండ సినిమాను విడుదల చేయమని థియేటర్స్ ఓనర్స్‌ను అడుగుతున్నాం’ అని పేర్కొన్నారు.
.
Comments
Please login to add a commentAdd a comment