సాక్షి, మిర్యాలగూడ: ఓ యదార్థ సంఘటన ఆధారంగా తీసిన కల్పిత చిత్రం "మర్డర్" రిలీజ్‌పై ఇంకా సందిగ్ధత నెలకొంది. సందచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఈ సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను నిలిపివేయాలంటూ అమృతా ప్రణయ్ కోర్టుకెక్కారు. ఈ సినిమాలో తన పేరు, ఫొటోలు వాడుకున్నారంటూ గత నెల 29న ఆ సినిమా దర్శక, నిర్మాతలపై సూట్ ఫైల్ చేశారు. ఇప్పటికే భర్త ప్రణయ్ హత్యతో రెండేళ్లుగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నానని, కల్పిత స్టోరీలతో సినిమా చిత్రీకరించి తమ జీవితాలతో ఆటలాడుకోవడం సరికాదన్నారు. దీంతో ఈ సినిమాను తక్షణమే నిలిపివేసేలా మధ్యంతర ఉత్వర్వులు జారీ చేయాలని న్యాయస్థానానికి విన్నవించారు. (వర్మపై న్యాయ పోరాటానికి సిద్ధమైన అమృత)
తన భర్త హత్య ఘటన ఆధారంగానే ఈ సినిమా తీస్తున్నారని శుక్రవారం జరిగిన నల్లగొండ జిల్లా కోర్టు విచారణలో అమృత మరోసారి తెలిపారు. అయితే ఈ కేసులో కౌంటర్ దాఖలు చేసిన ఆర్జీవీ తాను ఎవరినీ కించపరిచేలా సినిమా తీయలేదని స్పష్టం చేశారు. 30 ఏళ్లుగా సినిమాలు తీస్తున్నానని పేర్కొన్నారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. (వర్మకు కరోనా పాజిటివ్, ఆగిన ‘మర్డర్’!)
Comments
Please login to add a commentAdd a comment