
తమిళసినిమా: పట్టరై చిత్రం సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ప్రశంసలను అందుకుంది. తనదైన పంథాలో చిత్రాలను చేసే రామ్‌గోపాల్‌వర్మ టాలీవుడ్ నటుడు జేడీ.చక్రవర్తి వంటి పలువురు ప్రతిభావంతులను సినిమాకు పరిచయం చేశారు. ఈయన జేడీ.చక్రవర్తి కథానాయకుడిగా 1996లో తెరకెక్కించిన సత్య చిత్రం పలువురి ప్రశంసలను అందుకుంది. ఇక జేడీ.చక్రవర్తి కోలీవుడ్‌లోనూ పలు చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్న నటుడు. ఆయన తాజాగా తమిళంలో నటించిన చిత్రం పట్టరై. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదలైంది. ఈ టీజర్, సన్నివేశాల కలర్ టోన్ వంటి అంశాలు చాలా కొత్తగా ఉన్నాయని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మెచ్చుకున్నారట.
ఈ విషయాన్ని పట్టరై చిత్ర దర్శకుడు పీటర్ ఆల్విన్ పేర్కొంటూ ఇది నమ్మశక్యం కానీ తరుణం అన్నారు. దర్శకుడు కేవీ.ఆనంద్ శిష్యుడైన ఈయన తాను రామ్‌గోపాల్ వర్మ చిత్రాలను చూసి పెరిగిన వాడినని అన్నారు. ముఖ్యంగా సత్య చిత్రం దర్శకుడిగా తనను ఎంతగానో ఆకట్టుకుందని అన్నారు. దాని గురించి ఎలా చెప్పాలో తనకు అర్థం కావడం లేదన్నారు. అలాంటి దర్శకుడు పట్టరై చిత్రం గురించి మంచి మాటలు చెప్పడం సంతోషంగా ఉందన్నారు. అందుకు రామ్‌గోపాల్‌వర్మకు ధన్యవాదాలు ఎలా చెప్పుకోవాలో తెలియడం సమాజంలో జరుగుతున్న దారుణమైన సంఘటనల్లో ఒకటైన అమ్మాయిల కిడ్నాప్‌ల గురించి ఆవిష్కరించే చిత్రంగా ఉంటుందని తెలిపారు. ఈ చిత్రంపై రామ్‌గోపాల్‌వర్మ చెప్పిన అభిప్రాయం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుందని, చిత్ర యూనిట్‌కు ప్రోత్సాహంగా ఉందని దర్శకుడు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment