ఈ ఐస్‌క్రీమ్ ఓ అద్భుతం... | ice cream-2 Promotional images are released | Sakshi
Sakshi News home page

ఈ ఐస్‌క్రీమ్ ఓ అద్భుతం...

Published Sat, Aug 23 2014 12:31 AM | Last Updated on Sat, Sep 2 2017 12:17 PM

ఈ ఐస్‌క్రీమ్ ఓ అద్భుతం...

ఈ ఐస్‌క్రీమ్ ఓ అద్భుతం...

‘‘ఫస్ట్‌లుక్ అంటే.. ఇప్పటివరకూ ఒక్క స్టిల్‌ని విడుదల చేసేవారు. నేను మాత్రం దీనికి భిన్నంగా ఒకేసారి ఇరవై ఫస్ట్‌లుక్స్‌ని విడుదల చేశా’’ అని రామ్‌గోపాల్‌వర్మ అన్నారు. ‘ఐస్‌క్రీమ్’ సిరీస్‌లో భాగంగా ఆయన ‘ఐస్‌క్రీమ్-2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జేడీ చక్రవర్తి, నందు, భూపాల్, సిద్ధు, ధన్‌రాజ్, నవీనా, శాలిని, గాయత్రి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాత. ఈ సినిమా ప్రచార చిత్రాలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ - ‘‘సెప్టెంబర్ 19న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం.
 
దానికి ఓ నాలుగు రోజుల ముందు ‘ఐస్‌క్రీమ్-3’ ప్రారంభిస్తాం. ‘ఐస్‌క్రీమ్’ సిరీస్ నుంచి నెలకు ఓ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని తెలిపారు. ‘‘నిర్మాతగా నేలపై ఉన్న నన్ను ఆకాశమంత ఎత్తులో నిలబెట్టారు వర్మ. జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటాను’’ అని తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలిపారు. అందరూ కర్మ సిద్ధాంతాన్ని అనుసరిస్తారని, తాను మాత్రం వర్మ సిద్ధాంతాన్ని పాటిస్తానని, టేకింగ్ పరంగా ‘ఐస్‌క్రీమ్-2’ ఓ అద్భుతమని జేడీ చక్రవర్తి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement