ice cream-2
-
రూ. 38 వేలకే మ్యూజిక్ ఇచ్చా
సిక్కోలు సిన్నోడిగా సిటీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌లో సంగీతం లేకున్నా.. హైదరాబాద్‌లోనే సరిగమలు సాధన చేశాడు. తాళంపై పట్టు దొరికాక.. సినిమాల్లో పట్టు కోసం ప్రయత్నించాడు. మ్యూజిక్ అసిస్టెంట్‌గా పనిచేసి తనను తాను మెరుగుపర్చుకున్న సత్య కాశ్యప్.. మరోవైపు సంగీతంలో పరిశోధనలు చేస్తూ రాగాల్లో రాటుదేలాడు. తాజాగా ‘ఐస్‌క్రీమ్-2’తో మ్యూజిక్ డెరైక్టర్‌గా తానేంటో ప్రూవ్ చేసుకున్న సత్య కాశ్యప్‌తో ‘సిటీప్లస్’ మాటామంతీ.. నేను పుట్టింది, పెరిగింది శ్రీకాకుళంలోనే. ఇంటర్ వరకు అక్కడే చదువుకున్నాను. తర్వాత మ్యూజిక్‌లో డిప్లొమా కోసం రామ్‌కోఠిలోని త్యాగరాజ మ్యూజిక్ అకాడమీలో చేరాను. డిప్లొమా పూర్తయిన తర్వాత చాలా మంది మ్యూజిక్ డెరైక్టర్ల దగ్గర అసిస్టెంట్‌గా చేశాను. పుత్రుడు మూవీకి మొదటిసారిగా మ్యూజిక్ డెరైక్టర్‌గా పనిచేశాను. పవన్ కళ్యాణ్ జనసేన వందేమాతరం థీమ్ సాంగ్ నేనే చేశాను. ఇండియా తరఫున నెల్సన్ మండేలా ట్రిబ్యూట్ కూడా చేశాను. రక్త చరిత్ర మూవీకి మ్యూజిక్ డెరైక్టర్‌గా చేశాను కానీ నేను చేసిన సాంగ్స్ రాకపోవడం బాధనిపించినా.. ఇంకో అవకాశం తప్పకుండా వస్తుందన్న నమ్మకంతో స్పోర్టివ్‌గా తీసుకున్నాను. తలచినదే.. నేను అనుకున్నట్టుగానే ఐస్‌క్రీమ్ 2 మూవీ కోసం ఒకరోజు రామ్ గోపాల్ వర్మ నుంచి నాకు కాల్ వచ్చింది. ఆయన ‘ఈ సినిమాకు నువ్వే మ్యూజిక్ డెరైక్టర్‌వి’ అని చెప్పారు. ఫోన్లోనే కథ వినిపించి ట్యూన్స్ రెడీ చేయమన్నారు. ఆయన అనుకున్న స్టోరీకి నేను ఇచ్చిన మ్యూజిక్‌ని జత చేసి చూసుకున్నారు. ఇందులో ఐదు పాటలున్నాయి. ఈ మూవీకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా నాదే. నేను ఇలాంటి ఒక ప్రాజెక్ట్ కోసం రెండేళ్లుగా వెయిట్ చేస్తున్నాను. అలాంటి టైమ్‌లో నాకు కాల్ రావడం అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ చాన్స్ ఇచ్చిన ఆర్జీవీకి థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేను. ప్రయోగమే చేశాను.. ఈ రోజుల్లో లో బడ్జెట్ సినిమాకైనా మ్యూజిక్ డెరైక్షన్ చేయాలంటే కనీసం 20 వాయిద్యాలు, 25 మంది టెక్నీషియన్లు కావాల్సి ఉంటుంది. ఇక బడ్జెట్ విషయానికి వస్తే రూ.15 లక్షల వరకూ అవుతుంది. కానీ ఐస్‌క్రీమ్ 2 సినిమాకు మ్యూజిక్ కంపోజిషన్ కోసం ఓ ప్రయోగమే చేశాను. నేనొక్కడినే హోల్ అండ్ సోల్‌గా మ్యూజిక్ అందించాను. మరో టెకీ్నిషియన్ సాయం తీసుకోలేదు. అంతెందుకు ఒక్క ఇన్స్ట్రుమెంట్ కూడా వాడలేదు. కేవలం ఒక సాఫ్ట్‌వేర్‌ను బేస్ చేసుకుని ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేశాను. దీనికైన ఖర్చు అక్షరాలా రూ.38 వేలే. చిన్న సినిమాలు బడ్జెట్‌ను తగ్గించుకోవడానికి ఈ టెక్నాలజీని వాడుకుంటే బెటర్ అని నా అభిప్రాయం. ఇక నాకు సరిగమలు నేర్పి.. నన్ను మ్యూజిక్ డెరైక్టర్ని చేసిన హైదరాబాద్‌ను ఎప్పటికీ మరచిపోలేను. ..:: సిరి -
ఊరిస్తున్న ఐస్‌క్రీమ్-2
హైదరాబాద్: రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ఐస్‌క్రీమ్-2 సినిమా శుక్రవారం(నవంబర్ 21) ప్రేక్షకుల ముందుకురానుంది. ఐస్‌క్రీమ్ సినిమాను ఒకే ఇంట్లో రూపొందించిన వర్మ సీక్వెల్ లో ఎక్కువ శాతం అవుట్ డోర్ లో తెరకెక్కించారు. మొదటి 'ఐస్‌క్రీమ్' కంటే, ఈ రెండో 'ఐస్‌క్రీమ్' ఇంకా బాగుంటుందని వర్మ ఊరించారు. ఐస్‌క్రీమ్-2తో పాటు రౌడీ ఫెలో, నా బంగారు తల్లి, రాజ్యాధికారం, 33 ప్రేమకథలు ఈ వారం విడుదలవుతున్నాయి. హ్యాపీ ఎండింగ్ హిందీ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఐస్‌క్రీమ్- 2(హార్రర్) తారాగణం: జేడీ చక్రవర్తి, నందు, నవీన, భూపాల్, సిద్దు, ధన్‌రాజ్ దర్శకత్వం: రాంగోపాల్ వర్మ నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ ప్రొడక్షన్: భీమవరం టాకీస్ రౌడీ ఫెలో(యాక్షన్-రొమాంటిక్) తారాగణం: నారా రోహిత్, విశాఖసింగ్, రావు రమేష్, పోసాని, పరుచూరి వెంకటేశ్వరరావు, తాళ్లూరి రామేశ్వరి దర్శకత్వం: కృష్ణచైతన్య నిర్మాత: ప్రకాశ్‌రెడ్డి సంగీతం: సన్నీ ప్రొడక్షన్: మూవీ మిల్స్ అండ్ సినిమా 5 రాజ్యాధికారం తారాగణం: ఆర్. నారాయణమూర్తి, తనికెళ్ల భరణి, ఎల్బీ శ్రీరామ్ కథ, కథనం, మాటలు, ఫొటోగ్రఫీ, సంగీతం, దర్శకత్వం, నిర్మాత: ఆర్. నారాయణమూర్తి ప్రొడక్షన్: స్నేహచిత్ర పతాకం నా బంగారు తల్లి తారాగణం: సిద్ధిఖీ, అంజలీ పాటిల్, లక్ష్మీ మీనన్ దర్శకత్వం: రాజేశ్ టచ్‌రివర్ నిర్మాతలు: ఎంఎస్ రాజేశ్, సునీతా కృష్ణన్ సంగీతం: శాంతనూ మొయిత్రా 33 ప్రేమకథలు(రొమాన్స్) తారాగణం: వివేక్, సునీత మరసీయర్, శ్రావణి, నూకారపు సూర్యప్రకాశరావు, పూర్ణిమ, కృష్ణుడు దర్శకత్వం: శివగణేష్ నిర్మాత: ఫణిచంద్ర సంగీతం: అజయ్ పట్నాయక్ ప్రొడక్షన్: యువన్ టూరింగ్ టాకీస్ హ్యేపీ ఎండింగ్(హిందీ) తారాగణం: గోవిందా, సైఫ్ అలీఖాన్, ఇలియానా, రణ్వీర్ శోరే, కల్కీ కోయ్చ్లిన్ దర్శకత్వం: డీకే కృష్ణ, రాజ్ నిడిమోరు నిర్మాతలు: సైఫ్ అలీఖా, దినేష్ విజాన్, సునీల్ లుల్లా ప్రొడక్షన్: ఎల్లుమినాటి ఫిల్మ్స్ -
ఐస్‌క్రీమ్-2 మూవీ ఫస్ట్‌లుక్
-
ఈ ఐస్‌క్రీమ్ ఓ అద్భుతం...
‘‘ఫస్ట్‌లుక్ అంటే.. ఇప్పటివరకూ ఒక్క స్టిల్‌ని విడుదల చేసేవారు. నేను మాత్రం దీనికి భిన్నంగా ఒకేసారి ఇరవై ఫస్ట్‌లుక్స్‌ని విడుదల చేశా’’ అని రామ్‌గోపాల్‌వర్మ అన్నారు. ‘ఐస్‌క్రీమ్’ సిరీస్‌లో భాగంగా ఆయన ‘ఐస్‌క్రీమ్-2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జేడీ చక్రవర్తి, నందు, భూపాల్, సిద్ధు, ధన్‌రాజ్, నవీనా, శాలిని, గాయత్రి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాత. ఈ సినిమా ప్రచార చిత్రాలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ - ‘‘సెప్టెంబర్ 19న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం. దానికి ఓ నాలుగు రోజుల ముందు ‘ఐస్‌క్రీమ్-3’ ప్రారంభిస్తాం. ‘ఐస్‌క్రీమ్’ సిరీస్ నుంచి నెలకు ఓ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని తెలిపారు. ‘‘నిర్మాతగా నేలపై ఉన్న నన్ను ఆకాశమంత ఎత్తులో నిలబెట్టారు వర్మ. జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటాను’’ అని తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలిపారు. అందరూ కర్మ సిద్ధాంతాన్ని అనుసరిస్తారని, తాను మాత్రం వర్మ సిద్ధాంతాన్ని పాటిస్తానని, టేకింగ్ పరంగా ‘ఐస్‌క్రీమ్-2’ ఓ అద్భుతమని జేడీ చక్రవర్తి చెప్పారు.