హైదరాబాద్: రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ఐస్‌క్రీమ్-2 సినిమా శుక్రవారం(నవంబర్ 21) ప్రేక్షకుల ముందుకురానుంది. ఐస్‌క్రీమ్ సినిమాను ఒకే ఇంట్లో రూపొందించిన వర్మ సీక్వెల్ లో ఎక్కువ శాతం అవుట్ డోర్ లో తెరకెక్కించారు. మొదటి 'ఐస్‌క్రీమ్' కంటే, ఈ రెండో 'ఐస్‌క్రీమ్' ఇంకా బాగుంటుందని వర్మ ఊరించారు.
ఐస్‌క్రీమ్-2తో పాటు రౌడీ ఫెలో, నా బంగారు తల్లి, రాజ్యాధికారం, 33 ప్రేమకథలు ఈ వారం విడుదలవుతున్నాయి. హ్యాపీ ఎండింగ్ హిందీ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఐస్‌క్రీమ్- 2(హార్రర్)
తారాగణం: జేడీ చక్రవర్తి, నందు, నవీన, భూపాల్, సిద్దు, ధన్‌రాజ్
దర్శకత్వం: రాంగోపాల్ వర్మ
నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ
ప్రొడక్షన్: భీమవరం టాకీస్
రౌడీ ఫెలో(యాక్షన్-రొమాంటిక్)
తారాగణం: నారా రోహిత్, విశాఖసింగ్, రావు రమేష్, పోసాని, పరుచూరి వెంకటేశ్వరరావు, తాళ్లూరి రామేశ్వరి
దర్శకత్వం: కృష్ణచైతన్య
నిర్మాత: ప్రకాశ్‌రెడ్డి
సంగీతం: సన్నీ
ప్రొడక్షన్: మూవీ మిల్స్ అండ్ సినిమా 5
రాజ్యాధికారం
తారాగణం: ఆర్. నారాయణమూర్తి, తనికెళ్ల భరణి, ఎల్బీ శ్రీరామ్
కథ, కథనం, మాటలు, ఫొటోగ్రఫీ, సంగీతం, దర్శకత్వం, నిర్మాత: ఆర్. నారాయణమూర్తి
ప్రొడక్షన్: స్నేహచిత్ర పతాకం
నా బంగారు తల్లి
తారాగణం: సిద్ధిఖీ, అంజలీ పాటిల్, లక్ష్మీ మీనన్
దర్శకత్వం: రాజేశ్ టచ్‌రివర్
నిర్మాతలు: ఎంఎస్ రాజేశ్, సునీతా కృష్ణన్
సంగీతం: శాంతనూ మొయిత్రా
33 ప్రేమకథలు(రొమాన్స్)
తారాగణం: వివేక్, సునీత మరసీయర్, శ్రావణి, నూకారపు సూర్యప్రకాశరావు, పూర్ణిమ, కృష్ణుడు
దర్శకత్వం: శివగణేష్
నిర్మాత: ఫణిచంద్ర
సంగీతం: అజయ్ పట్నాయక్
ప్రొడక్షన్: యువన్ టూరింగ్ టాకీస్
హ్యేపీ ఎండింగ్(హిందీ)
తారాగణం: గోవిందా, సైఫ్ అలీఖాన్, ఇలియానా, రణ్వీర్ శోరే, కల్కీ కోయ్చ్లిన్
దర్శకత్వం: డీకే కృష్ణ, రాజ్ నిడిమోరు
నిర్మాతలు: సైఫ్ అలీఖా, దినేష్ విజాన్, సునీల్ లుల్లా
ప్రొడక్షన్: ఎల్లుమినాటి ఫిల్మ్స్