మరో సినిమాకు కమిట్ అయ్యాడు
ఇప్పటికే పదికి పైగా సినిమాలతో యమా బిజీగా ఉన్న యంగ్ హీరో నారా రోహిత్ మరో సినిమాకు ఓకే చెప్పాడు. ప్రస్తుతం తుంటరి, రాజా చెయ్యివేస్తే, సావిత్రి సినిమాల షూటింగ్లలో పాల్గొంటున్న ఈ యంగ్ హీరో, త్వరలో గౌతమ్ మీనన్ దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన రమేష్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడట. ప్రస్తుతం వెండితెర మీద కాసులు కురిపిస్తున్న క్రైమ్ కామెడీ జానర్లో ఈ సినిమా తెరకెక్కనుంది.
'ప్రతినిధి', 'రౌడీఫెలో', 'అసుర' సినిమాల సక్సెస్తో వరుస ఆఫర్లు నారా రోహిత్ తలుపు తట్టాయి. రెగ్యులర్ ఫార్మాట్కు భిన్నంగా కొత్త తరహా సినిమాలు చేయాలనుకుంటున్న దర్శక నిర్మాతలు రోహిత్తో సినిమాలు చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అందుకే 'శంకర', 'పండగలా వచ్చాడు', 'అప్పట్లో ఒకడుండేవాడు', 'వీరుడు', 'కోటలో రాజకుమారి', 'జో అచ్యుతానంద' లాంటి సినిమాలు రోహిత్ ఖాతాలో చేరాయి. రోహిత్ జోరు చూస్తుంటే వచ్చే ఏడాది అర డజనుకు పైగా సినిమాలు రిలీజ్ చేసేలా ఉన్నాడు.