Rowdy Fellow
-
మరో సినిమాకు కమిట్ అయ్యాడు
ఇప్పటికే పదికి పైగా సినిమాలతో యమా బిజీగా ఉన్న యంగ్ హీరో నారా రోహిత్ మరో సినిమాకు ఓకే చెప్పాడు. ప్రస్తుతం తుంటరి, రాజా చెయ్యివేస్తే, సావిత్రి సినిమాల షూటింగ్లలో పాల్గొంటున్న ఈ యంగ్ హీరో, త్వరలో గౌతమ్ మీనన్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన రమేష్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడట. ప్రస్తుతం వెండితెర మీద కాసులు కురిపిస్తున్న క్రైమ్ కామెడీ జానర్లో ఈ సినిమా తెరకెక్కనుంది. 'ప్రతినిధి', 'రౌడీఫెలో', 'అసుర' సినిమాల సక్సెస్‌తో వరుస ఆఫర్లు నారా రోహిత్ తలుపు తట్టాయి. రెగ్యులర్ ఫార్మాట్‌కు భిన్నంగా కొత్త తరహా సినిమాలు చేయాలనుకుంటున్న దర్శక నిర్మాతలు రోహిత్‌తో సినిమాలు చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అందుకే 'శంకర', 'పండగలా వచ్చాడు', 'అప్పట్లో ఒకడుండేవాడు', 'వీరుడు', 'కోటలో రాజకుమారి', 'జో అచ్యుతానంద' లాంటి సినిమాలు రోహిత్ ఖాతాలో చేరాయి. రోహిత్ జోరు చూస్తుంటే వచ్చే ఏడాది అర డజనుకు పైగా సినిమాలు రిలీజ్ చేసేలా ఉన్నాడు. -
ఇవన్నీ ఎప్పటికి రిలీజ్ కావాలి
రిలీజ్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీ అయిపోతున్నాడు యంగ్ హీరో నారా రోహిత్. కమర్షియల్ సినిమాలకు దూరంగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకుంటున్న రోహిత్, ప్రస్తుతం చేతినిండా సినిమాలతో యమా బిజీగా ఉన్నాడు. ఒకటి రెండు కాదు.. ఏకంగా 8 సినిమాలు రోహిత్ హీరోగా సెట్స్ మీద ఉన్నాయి. వీటిలో ఇప్పటికే కొన్ని సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకోగా మరికొన్ని ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి. 'ప్రతినిథి', 'రౌడీఫెలో', 'అసుర' సినిమాల సక్సెస్‌తో వరుస ఆఫర్లు నారా రోహిత్ తలుపు తట్టాయి. రెగ్యులర్ ఫార్మాట్‌కు భిన్నంగా కొత్త తరహా సినిమాలు చేయాలనుకుంటున్న దర్శక నిర్మాతలు రోహిత్‌తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే 'శంకర', 'పండగలా వచ్చాడు', 'సావిత్రి', 'అప్పట్లో ఒకడుండేవాడు', 'తుంటరి', 'వీరుడు', 'కోటలో రాజకుమారి', 'జో అచ్యుతానంద' లాంటి సినిమాలు రోహిత్ ఖాతాలో చేరాయి. ఇన్ని సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతుండగా ఇప్పుడు మరో సినిమాను అంగీకరించాడు నారా రోహిత్. ప్రస్తుతం రోహిత్ హీరోగా 'జో అచ్యుతానంద' సినిమాను నిర్మిస్తున్న వారాహి చలనచిత్ర సంస్థలోనే మరో సినిమాకు కమిట్ అయ్యాడు. ప్రదీప్ దర్శకత్వంలో 'రాజా చెయ్యివేస్తే' అనే సినిమాను అంగీకరించాడు. మరి ఇన్ని సినిమాలను లైన్లో పెట్టిన రోహిత్, ఆ సినిమాల రిలీజ్లు ఎలా ప్లాన్ చేస్తాడో చూడాలి. -
'తుంటరి'గా రౌడీఫెలో
ప్రతినిథి, రౌడీఫెలో, అసుర లాంటి వరుస హిట్స్ తో మంచి ఫాంలో ఉన్న నారా రోహిత్ మరో ఇంట్రస్టింగ్ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రస్తుతం రోహిత్ గుండెల్లో గోదారి ఫేం కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. తమిళ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈసినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కథ అందిస్తున్నాడు. షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు తుంటరి అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు చిత్రయూనిట్. శ్రీ కీర్తి ఫిలిమ్స్ బ్యానర్‌పై రెండో ప్రయత్నంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో న్యూ లుక్‌లో దర్శనమివ్వనున్నాడు నారా రోహిత్. త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దసరా సందర్బంగా రిలీజ్ చేశారు. డెస్టినీ వర్సెస్ హార్డ్ వర్క్ అనే స్టేట్మెంట్తో నారారోహిత్ ట్రెండీ లుక్‌తో డిజైన్ చేసిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటుంది. -
ఈ సినిమాలన్నీ ఎప్పటికి కంప్లీట్ చేస్తాడో..?
ఈ తరం యువ కథానాయకులకు ఒక సినిమా చేయడానికి కథ దొరకటమే కష్టంగా ఉంటే నారా రోహిత్ మాత్రం వరుస సినిమాలను సెట్స్ మీదకు తీసుకువస్తున్నాడు. హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ప్రయోగాత్మక చిత్రాలకు కమిట్ అవుతూ వస్తున్న రోహిత్, ఇప్పుడు మరింత దూకుడుగా సినిమాలు అంగీకరిస్తున్నాడు. ఇప్పటికే ఐదు సినిమాలు చేతులో ఉన్నా, తాజాగా మరో రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు. కెరీర్ స్టార్టింగ్‌లో కాస్త తడబడినా తరువాత మాత్రం వరుస సక్సెస్‌లతో మంచి ఫాం చూపిస్తున్నాడు రోహిత్. 'ప్రతినిథి', 'రౌడీఫెలో', 'అసుర' లాంటి సినిమాల సక్సెస్‌లు రోహిత్‌కి మంచి ఇమేజ్ తీసుకురావటంతో పాటు, మార్కెట్ ను కూడా పెంచాయి. దీంతో మినిమమ్ బడ్జెట్‌తో సందేశాత్మక కథలను తెరకెక్కించాలనుకునే నిర్మాతలు నారా రోహిత్ బెస్ట్ చాయిస్ గా ఫీల్ అవుతున్నారు. ఇప్పటికే 'శంకర' సినిమా రిలీజ్‌కు రెడీగా ఉండగా 'పండుగలా వచ్చాడు', 'సావిత్రి', 'అప్పట్లో ఒకడుండేవాడు' లాంటి సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. వీటికి తోడు సాయి కొర్రపాటి నిర్మాతగా అవసరాల శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ తో పాటు, శ్రీను వైట్ల శిష్యుడు ప్రదీప్‌ను దర్శకుడిగా పరిచేస్తూ తెరకెక్కిస్తున్న మరో సినిమాకు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడు. అరడజనుకు పైగా సినిమాలతో బిజీగా ఉన్న నారా రోహిత్ ఈ సినిమాలన్ని ఎప్పటికి పూర్తి చేస్తాడో చూడాలి. -
స్పీడు పెంచిన నితిన్
కొద్ది రోజులుగా నెక్ట్స్ సినిమా విషయంలో కన్ఫ్యూజన్లో ఉన్న నితిన్ స్పీడు పెంచాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో సినిమా అనౌన్స్ కావటంతో తరువాతి ప్రాజెక్ట్స్‌ను కూడా లైన్ లో పెట్టేస్తున్నాడు. అక్కినేని వారసున్ని హీరోగా పరిచయం చేస్తున్న 'అఖిల్' సినిమా షూటింగ్ జరుగుతుండగానే త్రివిక్రమ్ డైరెక్షన్ లో తను చేయబోయే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాడానికి ప్లాన్ చేస్తున్నాడు. త్రివిక్రమ్ ఈ సినిమాను జెట్ స్పీడ్‌తో కంప్లీట్ చేయాలని భావిస్తున్నాడు కాబట్టి, ఈ లోగా నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌ను కూడా పైనల్ చేసేస్తున్నాడు. ఇప్పటికే వేణు అనే కొత్త దర్శకుడితో సినిమా ఫైనల్ చేసిన నితిన్ తాజాగా రౌఢీఫెలో దర్శకుడు కృష్ణచైతన్యతో కూడా ఓ మూవీకి ఓకె చెప్పాడు. అయితే ఈ రెండు సినిమాల్లో ఏది ముందు సెట్స్ మీదకు వస్తుందన్న విషయం మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు. -
ఈ వారం.. చిన్న సినిమాలదే..!
-
ఊరిస్తున్న ఐస్‌క్రీమ్-2
హైదరాబాద్: రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ఐస్‌క్రీమ్-2 సినిమా శుక్రవారం(నవంబర్ 21) ప్రేక్షకుల ముందుకురానుంది. ఐస్‌క్రీమ్ సినిమాను ఒకే ఇంట్లో రూపొందించిన వర్మ సీక్వెల్ లో ఎక్కువ శాతం అవుట్ డోర్ లో తెరకెక్కించారు. మొదటి 'ఐస్‌క్రీమ్' కంటే, ఈ రెండో 'ఐస్‌క్రీమ్' ఇంకా బాగుంటుందని వర్మ ఊరించారు. ఐస్‌క్రీమ్-2తో పాటు రౌడీ ఫెలో, నా బంగారు తల్లి, రాజ్యాధికారం, 33 ప్రేమకథలు ఈ వారం విడుదలవుతున్నాయి. హ్యాపీ ఎండింగ్ హిందీ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఐస్‌క్రీమ్- 2(హార్రర్) తారాగణం: జేడీ చక్రవర్తి, నందు, నవీన, భూపాల్, సిద్దు, ధన్‌రాజ్ దర్శకత్వం: రాంగోపాల్ వర్మ నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ ప్రొడక్షన్: భీమవరం టాకీస్ రౌడీ ఫెలో(యాక్షన్-రొమాంటిక్) తారాగణం: నారా రోహిత్, విశాఖసింగ్, రావు రమేష్, పోసాని, పరుచూరి వెంకటేశ్వరరావు, తాళ్లూరి రామేశ్వరి దర్శకత్వం: కృష్ణచైతన్య నిర్మాత: ప్రకాశ్‌రెడ్డి సంగీతం: సన్నీ ప్రొడక్షన్: మూవీ మిల్స్ అండ్ సినిమా 5 రాజ్యాధికారం తారాగణం: ఆర్. నారాయణమూర్తి, తనికెళ్ల భరణి, ఎల్బీ శ్రీరామ్ కథ, కథనం, మాటలు, ఫొటోగ్రఫీ, సంగీతం, దర్శకత్వం, నిర్మాత: ఆర్. నారాయణమూర్తి ప్రొడక్షన్: స్నేహచిత్ర పతాకం నా బంగారు తల్లి తారాగణం: సిద్ధిఖీ, అంజలీ పాటిల్, లక్ష్మీ మీనన్ దర్శకత్వం: రాజేశ్ టచ్‌రివర్ నిర్మాతలు: ఎంఎస్ రాజేశ్, సునీతా కృష్ణన్ సంగీతం: శాంతనూ మొయిత్రా 33 ప్రేమకథలు(రొమాన్స్) తారాగణం: వివేక్, సునీత మరసీయర్, శ్రావణి, నూకారపు సూర్యప్రకాశరావు, పూర్ణిమ, కృష్ణుడు దర్శకత్వం: శివగణేష్ నిర్మాత: ఫణిచంద్ర సంగీతం: అజయ్ పట్నాయక్ ప్రొడక్షన్: యువన్ టూరింగ్ టాకీస్ హ్యేపీ ఎండింగ్(హిందీ) తారాగణం: గోవిందా, సైఫ్ అలీఖాన్, ఇలియానా, రణ్వీర్ శోరే, కల్కీ కోయ్చ్లిన్ దర్శకత్వం: డీకే కృష్ణ, రాజ్ నిడిమోరు నిర్మాతలు: సైఫ్ అలీఖా, దినేష్ విజాన్, సునీల్ లుల్లా ప్రొడక్షన్: ఎల్లుమినాటి ఫిల్మ్స్ -
అద్భుతాలు సృష్టించగలుగుతారు!
‘‘ ‘పేరుకే ఇందరు జనం.. పేరుకు పోయిన ఒంటరితనం.. నరనరాన పిరికితనం.. అందుకు జవాబే మనం’... ఈ సినిమా కోసం సిరివెన్నెల రాసిన ఈ అక్షరాలే మా సినిమా కథ. ఇందులో నేను డబ్బున్న ఇగోయిస్ట్ ఎస్సైగా నటించాను. ‘నేను’ అనే తత్వం నుంచి ‘మనం’ అనే తత్వం వైపు ఓ మనిషి ఎలా నడిచాడు? అనే ప్రశ్నకు సమాధానమే ‘రౌడీ ఫెలో’లో నా పాత్ర. తప్పకుండా విజయం సాధిస్తుందని నా నమ్మకం’’ అని నారా రోహిత్ చెప్పారు. ఆయన కథానాయకునిగా రూపొందిన చిత్రం ‘రౌడీ ఫెలో’. రచయిత కృష్ణచైతన్య ఈ చిత్రం ద్వారా దర్శకునిగా మారారు. ప్రకాశ్‌రెడ్డి నిర్మాత. ఈ నెల 21న సినిమా విడుదల కానుంది. కృష్ణచైతన్య మాట్లాడుతూ -‘‘జిడ్డు కృష్ణమూర్తి చెప్పిన ‘మనుషులే కనిపిస్తున్నారు... మానవత్వం కాదు’ అన్న పాయింట్ ఆధారంగా తీసుకొని ఈ కథ తయారు చేశాను. ప్రతి మనిషికీ అహం అవసరం. అయితే... అది ఆరోగ్యంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే అద్భుతాలు సృష్టించగలుగుతారు. రామరావణ సంగ్రామం, కురుక్షేత్ర యుద్ధం స్త్రీల కారణంగా జరిగాయని చెబుతుంటారు. కానీ నా దృష్టిలో అవి జరగడానికి కారణం ఇగో ప్రాబ్లమ్సే. ఇందులో హీరో పాత్ర ఈ విషయాన్నే చెబుతుంది. రోహిత్ కెరీర్లో మైలురాయిలా నిలిచిపోయే సినిమా అవుతుంది. కథానాయిక విశాఖ సింగ్ రంగస్థల నటి కావడం వల్ల అద్భుతంగా నటించింది’’ అని తెలిపారు. ఇంత మంచి సినిమాలో తానూ భాగం అయినందుకు ఆనందంగా ఉందని విశాఖ సింగ్ అన్నారు. -
మైలురాయి లాంటి సినిమా
నారా రోహిత్ పోలీసాఫీసర్‌గా నటిస్తున్న చిత్రం ‘రౌడీఫెలో’. విశాఖసింగ్ కథానాయిక. గీత రచయిత కృష్ణచైతన్యను దర్శకునిగా పరిచయం చేస్తూ నిర్మాత ప్రకాశ్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ 21న విడుదల కానున్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ- ‘‘పాటలకు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తోంది. కొత్తదనాన్ని ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇది. గోవాలో హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ‘ఆ సీతాదేవి నవ్వులా...’ పాటతో పాటు ‘ఎంతవారు గానీ..’ అనే పాట చిత్రీకరణతో సినిమా షూటింగ్ పూర్తయింది’’ అని తెలిపారు. ‘‘రచయిత దర్శకుడైతే సినిమాను ఎంత అందంగా, నిజాయతీగా తెరకెక్కిస్తాడో ‘రౌడీఫెలో’ చిత్రం నిరూపిస్తుంది. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రానికి వాణిజ్య విలువలు మేళవించి అద్భుతంగా సినిమాను తీర్చిదిద్దుతున్నారు దర్శకుడు కృష్ణచైతన్య. ఈ సినిమాతో అతను అగ్ర దర్శకుల జాబితాలో చేరతాడు. అతను రాసిన సంభాషణలు అందరినీ ఆకట్టుకుంటాయి. రోహిత్ కెరీర్‌కి ఈ చిత్రం ఓ మైలురాయిలా నిలుస్తుంది’’ అని సహ నిర్మాత సందీప్ కొరిటాల నమ్మకం వెలిబుచ్చారు. -
ఆకట్టుకునే కథాంశంతో...
‘‘ఈ సినిమా కాన్సెప్ట్ బావుంటుంది. కంటెంట్ అంతకన్నా ఆకట్టుకుంటుంది. ‘రౌడీ ఫెలో’ అనేది మాస్ టైటిల్ అయినా కూడా, ఈ చిత్రం క్లాస్‌కీ మాస్కీ నచ్చుతుంది’’ అని దర్శకునిగా మారిన పాటల రచయిత కృష్ణ చైతన్య చెప్పారు. నారా రోహిత్, విశాఖ సింగ్ జంటగా ప్రకాశ్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘రౌడీ ఫెలో’. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. నిర్మాత మాట్లాడుతూ -‘‘నారా రోహిత్ కెరీర్లోనే భిన్నమైన సినిమా ఇది. సన్నీ.ఎం. ఆర్ సంగీతానికి ఇప్పటికే విశేషాదరణ లభిస్తోంది. అన్ని వర్గాలకూ నచ్చే చిత్రమిది. ఈ సినిమాతో కృష్ణచైతన్య దర్శకునిగా మంచి స్థానం సంపాదించుకుంటారు’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సహనిర్మాత: సందీప్ కొరిటాల. -
'రౌడీ ఫెలో' న్యూ మూవీ స్టిల్స్
-
అందరికీ నచ్చుతుంది!
‘‘మా రోహిత్‌కిది ఏడో సినిమా. టైటిల్ నెగటివ్‌గా ఉన్నా, సినిమా చాలా పాజిటివ్‌గా ఉంటుంది. సినిమాల్లో కేవలం వినోదమే కాదు, సందేశం కూడా ఉండాలి. ఆ తరహా సినిమాలను ఎన్టీఆర్ ఎక్కువ చేసేవారు’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నారా రోహిత్, విశాఖ సింగ్ జంటగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో ప్రకాశ్‌రెడ్డి నిర్మించిన ‘రౌడీ ఫెలో’ చిత్రం పాటల సీడీని హైదరాబాద్‌లో చంద్రబాబు ఆవిష్కరించారు. టీజర్‌ను పరిటాల శ్రీరామ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నారా రోహిత్ మాట్లాడుతూ -‘‘పెదనాన్న వస్తే నా సినిమాలు తప్పకుండా హిట్ అవుతున్నాయి. ఈ సినిమా కూడా కచ్చితంగా హిట్టవుతుంది’’ అని చెప్పారు. కృష్ణచైతన్య మాట్లాడుతూ -‘‘పాటల రచయితగా పేరు తెచ్చుకున్నా, మొదట్నుంచీ నా గురి దర్శకత్వంపైనే. నారా రోహిత్ సినిమాతో దర్శకుడవుతున్నందుకు ఆనందంగా ఉంది. సన్నీ స్వరాలు ఈ సినిమాకు మెయిన్ ఎస్సెట్. అందరికీ నచ్చే కథాంశమిది’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ సింగ్, పరుచూరి వెంకటేశ్వరరావు, రావు రమేష్, మంత్రి పల్లె రఘునాథరెడ్డి, అంబికా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
రౌడీ ఫెలోగా నారా రోహిత్
చేసింది తక్కువ సినిమాలైనా నారా రోహిత్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమా సినిమాకీ నటుడిగా నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ఆయన ప్రస్తుతం మూవీ మిల్స్ అండ్ సినిమా 5 సమర్పణలో రూపొందుతున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. పాటల రచయిత కృష్ణచైతన్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘రౌడీ ఫెలో’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ - ‘‘ఇందులో నారా రోహిత్ పాత్ర చాలా బాగుంటుంది. ఈ సినిమాలో పలు విశేషాలున్నాయి. పీసీ శ్రీరామ్ శిష్యుడు అరవింద్ గాంధీ ఛాయాగ్రహణం ఓ ఎస్సెట్. అలాగే ధూమ్ 3, బర్ఫీ లాంటి చిత్రాలకు పాటలు స్వరపరచిన ప్రీతమ్ దగ్గర పని చేసిన సన్నీ ఇచ్చిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ‘ఆషికీ 2’ సినిమా పాటల ద్వారా గాయకునిగా ఎనలేని క్రేజ్ సంపాదించుకున్న ఆర్జిత్ సింగ్ పాడిన పాటలు మరో ఎస్సెట్. ఓ వినూత్న కథాంశంతో ఏ విషయంలోనూ రాజీపడకుండా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో వేసవి కానుకగా సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. రోహిత్ సరసన విశాఖాసింగ్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రావు రమేష్, పోసాని, పరుచూరి వెంకటేశ్వరరావు, తాళ్లూరి రామేశ్వరి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.