అందరికీ నచ్చుతుంది!
‘‘మా రోహిత్‌కిది ఏడో సినిమా. టైటిల్ నెగటివ్‌గా ఉన్నా, సినిమా చాలా పాజిటివ్‌గా ఉంటుంది. సినిమాల్లో కేవలం వినోదమే కాదు, సందేశం కూడా ఉండాలి. ఆ తరహా సినిమాలను ఎన్టీఆర్ ఎక్కువ చేసేవారు’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నారా రోహిత్, విశాఖ సింగ్ జంటగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో ప్రకాశ్‌రెడ్డి నిర్మించిన ‘రౌడీ ఫెలో’ చిత్రం పాటల సీడీని హైదరాబాద్‌లో చంద్రబాబు ఆవిష్కరించారు.
టీజర్‌ను పరిటాల శ్రీరామ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నారా రోహిత్ మాట్లాడుతూ -‘‘పెదనాన్న వస్తే నా సినిమాలు తప్పకుండా హిట్ అవుతున్నాయి. ఈ సినిమా కూడా కచ్చితంగా హిట్టవుతుంది’’ అని చెప్పారు. కృష్ణచైతన్య మాట్లాడుతూ -‘‘పాటల రచయితగా పేరు తెచ్చుకున్నా, మొదట్నుంచీ నా గురి దర్శకత్వంపైనే. నారా రోహిత్ సినిమాతో దర్శకుడవుతున్నందుకు ఆనందంగా ఉంది. సన్నీ స్వరాలు ఈ సినిమాకు మెయిన్ ఎస్సెట్. అందరికీ నచ్చే కథాంశమిది’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ సింగ్, పరుచూరి వెంకటేశ్వరరావు, రావు రమేష్, మంత్రి పల్లె రఘునాథరెడ్డి, అంబికా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.