ఈ సినిమాలన్నీ ఎప్పటికి కంప్లీట్ చేస్తాడో..? | nara rohith busy with handfulll of films | Sakshi
Sakshi News home page

ఈ సినిమాలన్నీ ఎప్పటికి కంప్లీట్ చేస్తాడో..?

Published Wed, Sep 16 2015 10:00 AM | Last Updated on Sun, Sep 3 2017 9:31 AM

ఈ సినిమాలన్నీ ఎప్పటికి కంప్లీట్ చేస్తాడో..?

ఈ సినిమాలన్నీ ఎప్పటికి కంప్లీట్ చేస్తాడో..?

ఈ తరం యువ కథానాయకులకు ఒక సినిమా చేయడానికి కథ దొరకటమే కష్టంగా ఉంటే నారా రోహిత్ మాత్రం వరుస సినిమాలను సెట్స్ మీదకు తీసుకువస్తున్నాడు. హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ప్రయోగాత్మక చిత్రాలకు కమిట్ అవుతూ వస్తున్న రోహిత్, ఇప్పుడు మరింత దూకుడుగా సినిమాలు అంగీకరిస్తున్నాడు. ఇప్పటికే ఐదు సినిమాలు చేతులో ఉన్నా,  తాజాగా మరో రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు.

కెరీర్ స్టార్టింగ్లో కాస్త తడబడినా తరువాత మాత్రం వరుస సక్సెస్లతో మంచి ఫాం చూపిస్తున్నాడు రోహిత్. 'ప్రతినిథి', 'రౌడీఫెలో', 'అసుర' లాంటి సినిమాల సక్సెస్లు రోహిత్కి మంచి ఇమేజ్ తీసుకురావటంతో పాటు, మార్కెట్ ను కూడా పెంచాయి. దీంతో మినిమమ్ బడ్జెట్తో సందేశాత్మక కథలను తెరకెక్కించాలనుకునే నిర్మాతలు నారా రోహిత్ బెస్ట్ చాయిస్ గా ఫీల్ అవుతున్నారు.

ఇప్పటికే 'శంకర' సినిమా రిలీజ్కు రెడీగా ఉండగా 'పండుగలా వచ్చాడు', 'సావిత్రి', 'అప్పట్లో ఒకడుండేవాడు' లాంటి సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. వీటికి తోడు సాయి కొర్రపాటి నిర్మాతగా అవసరాల శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ తో పాటు, శ్రీను వైట్ల శిష్యుడు ప్రదీప్ను దర్శకుడిగా పరిచేస్తూ తెరకెక్కిస్తున్న మరో సినిమాకు కూడా గ్రీన్సిగ్నల్ ఇచ్చేశాడు. అరడజనుకు పైగా సినిమాలతో బిజీగా ఉన్న నారా రోహిత్ ఈ సినిమాలన్ని ఎప్పటికి పూర్తి చేస్తాడో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement