Asura
-
అదే డ్రస్‌లో మరోసారి..!
బాణం సినిమాతో వెండితెరకు పరిచయం అయిన యంగ్ హీరో నారా రోహిత్ తొలి సినిమాలోనే పోలీస్ క్యారెక్టర్‌తో ఆకట్టుకున్నాడు. ఆ తరువాత రౌడీఫెలో, అసుర, అప్పట్లో ఒకడుండేవారు సినిమాల్లో పోలీస్ పాత్రల్లో కనిపించాడు రోహిత్. ఈ శుక్రవారం రిలీజ్‌కు రెడీ అవుతున్న శమంతకమణి సినిమా కోసం ఐదో సారి అదే పాత్ర చేశాడు. ఈ సినిమాలో ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ క్యారెక్టర్లో నటిస్తున్నాడు రోహిత్. ఇప్పటికే ఐదు సార్లు పోలీస్ పాత్రల్లో కనిపించిన యంగ్ హీరో నారా రోహిత్ మరోసారి అదే పాత్రకు ఓకే చెప్పాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న మల్టీ స్టారర్ సినిమా వీరభోగవసంత రాయలు సినిమాలో మరోసారి పోలీస్ గెటప్ లో కనిపించనున్నాడట. సుధీర్ బాబు, శ్రీవిష్ణులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాతో ఇంద్రసేన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. వీరభోగవసంత రాయలు తో పాటు పంగలా వచ్చాడు, నీది నాది ప్రేమ సినిమాలు పూర్తి కావచ్చాయి. పవన్ మల్లెల దర్శకత్వంలో మరో సినిమా సెట్స్ మీద ఉంది. సావిత్ర ఫేం పవన్ సాధినేనితో ఒక సినిమా, బాణం ఫేం చైతన్య దంతులూరితో మరో సినిమా చేసేందుకు అంగీకరించాడు. -
అదే గెటప్‌లో.. నాలుగోసారి..!
రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్‌కు భిన్నంగా ఆసక్తికర కథలతో ఆకట్టుకుంటున్న హీరో నారా రోహిత్. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇదే బాటలో నడుస్తున్న రోహిత్.. ఎక్కువగా సీరియస్ పాత్రల్లోనే కనిపించాడు. అది కూడా ఎక్కువగా పోలీస్ గెటప్‌లోనే. ఇప్పటికే మూడు సినిమాల్లో పోలీస్ డ్రస్ వేసుకున్న రోహిత్ ఇప్పుడు మరోసారి అదే గెటప్‌లో కనిపించేందుకు రెడీ అవుతున్నాడు. తొలి సినిమా బాణంలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించిన నారా రోహిత్ తరువాత రౌడీఫెలో, అసుర సినిమాల్లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న అప్పట్లో ఒకడుండేవాడు సినిమాలో మరోసారి పోలీస్ గెటప్‌లో కనిపించనున్నాడు. గతంలో రోహిత్ పోలీస్‌గా నటించిన సినిమాలన్నీ మంచి విజయాలు సాధించగా మరోసారి అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు యూనిట్. -
ఇవన్నీ ఎప్పటికి రిలీజ్ కావాలి
రిలీజ్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీ అయిపోతున్నాడు యంగ్ హీరో నారా రోహిత్. కమర్షియల్ సినిమాలకు దూరంగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకుంటున్న రోహిత్, ప్రస్తుతం చేతినిండా సినిమాలతో యమా బిజీగా ఉన్నాడు. ఒకటి రెండు కాదు.. ఏకంగా 8 సినిమాలు రోహిత్ హీరోగా సెట్స్ మీద ఉన్నాయి. వీటిలో ఇప్పటికే కొన్ని సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకోగా మరికొన్ని ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి. 'ప్రతినిథి', 'రౌడీఫెలో', 'అసుర' సినిమాల సక్సెస్‌తో వరుస ఆఫర్లు నారా రోహిత్ తలుపు తట్టాయి. రెగ్యులర్ ఫార్మాట్‌కు భిన్నంగా కొత్త తరహా సినిమాలు చేయాలనుకుంటున్న దర్శక నిర్మాతలు రోహిత్‌తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే 'శంకర', 'పండగలా వచ్చాడు', 'సావిత్రి', 'అప్పట్లో ఒకడుండేవాడు', 'తుంటరి', 'వీరుడు', 'కోటలో రాజకుమారి', 'జో అచ్యుతానంద' లాంటి సినిమాలు రోహిత్ ఖాతాలో చేరాయి. ఇన్ని సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతుండగా ఇప్పుడు మరో సినిమాను అంగీకరించాడు నారా రోహిత్. ప్రస్తుతం రోహిత్ హీరోగా 'జో అచ్యుతానంద' సినిమాను నిర్మిస్తున్న వారాహి చలనచిత్ర సంస్థలోనే మరో సినిమాకు కమిట్ అయ్యాడు. ప్రదీప్ దర్శకత్వంలో 'రాజా చెయ్యివేస్తే' అనే సినిమాను అంగీకరించాడు. మరి ఇన్ని సినిమాలను లైన్లో పెట్టిన రోహిత్, ఆ సినిమాల రిలీజ్లు ఎలా ప్లాన్ చేస్తాడో చూడాలి. -
ఈ సినిమాలన్నీ ఎప్పటికి కంప్లీట్ చేస్తాడో..?
ఈ తరం యువ కథానాయకులకు ఒక సినిమా చేయడానికి కథ దొరకటమే కష్టంగా ఉంటే నారా రోహిత్ మాత్రం వరుస సినిమాలను సెట్స్ మీదకు తీసుకువస్తున్నాడు. హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ప్రయోగాత్మక చిత్రాలకు కమిట్ అవుతూ వస్తున్న రోహిత్, ఇప్పుడు మరింత దూకుడుగా సినిమాలు అంగీకరిస్తున్నాడు. ఇప్పటికే ఐదు సినిమాలు చేతులో ఉన్నా, తాజాగా మరో రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు. కెరీర్ స్టార్టింగ్‌లో కాస్త తడబడినా తరువాత మాత్రం వరుస సక్సెస్‌లతో మంచి ఫాం చూపిస్తున్నాడు రోహిత్. 'ప్రతినిథి', 'రౌడీఫెలో', 'అసుర' లాంటి సినిమాల సక్సెస్‌లు రోహిత్‌కి మంచి ఇమేజ్ తీసుకురావటంతో పాటు, మార్కెట్ ను కూడా పెంచాయి. దీంతో మినిమమ్ బడ్జెట్‌తో సందేశాత్మక కథలను తెరకెక్కించాలనుకునే నిర్మాతలు నారా రోహిత్ బెస్ట్ చాయిస్ గా ఫీల్ అవుతున్నారు. ఇప్పటికే 'శంకర' సినిమా రిలీజ్‌కు రెడీగా ఉండగా 'పండుగలా వచ్చాడు', 'సావిత్రి', 'అప్పట్లో ఒకడుండేవాడు' లాంటి సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. వీటికి తోడు సాయి కొర్రపాటి నిర్మాతగా అవసరాల శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ తో పాటు, శ్రీను వైట్ల శిష్యుడు ప్రదీప్‌ను దర్శకుడిగా పరిచేస్తూ తెరకెక్కిస్తున్న మరో సినిమాకు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడు. అరడజనుకు పైగా సినిమాలతో బిజీగా ఉన్న నారా రోహిత్ ఈ సినిమాలన్ని ఎప్పటికి పూర్తి చేస్తాడో చూడాలి. -
నటుణ్ణి కాకపోతే నిర్మాత అయ్యేవాణ్ణి!
‘‘ఈ సినిమాలో పనిరాక్షసుడైన ధర్మ అనే జైలర్ పాత్రలో నటించాను. వృత్తికి న్యాయం చేయడం కోసం ఎంతకైనా తెగించే పాత్ర ఇది. నా నుండి ప్రేక్షకులు ఎలాంటి సినిమా ఆశిస్తారో ఇది అలానే ఉంటుంది’’ అని నారా రోహిత్ అన్నారు. కృష్ణ విజయ్ దర్శకత్వంలో నారా రోహిత్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘అసుర’. నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నారా రోహిత్ మాట్లాడుతూ -‘‘ ‘అసుర’ స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది. అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది. యాక్షన్, థ్రిల్లర్ నేపథ్యంలో ఓ కమర్షియల్ చిత్రానికి కావాల్సిన హంగులన్నీ ఈ సినిమాలో ఉంటాయి. ఇంటర్వెల్‌కు ముందు 20 నిమిషాలు, క్లైమాక్స్ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. నాకు మొదటి నుంచి సినిమాలంటే ఇష్టం. ఒకవేళ యాక్టర్ కాకపోతే కచ్చితంగా నిర్మాత అయ్యేవాణ్ణి. ఎప్పటినుంచో సినిమాలు నిర్మించాలనుకుంటున్నా. అది ఈ సినిమాతో మొదలైంది’’ అన్నారు. పాత్ర డిమాండ్ చేస్తే, సిక్స్ ప్యాక్ చేయడానికి రెడీ అని రోహిత్ పేర్కొన్నారు. -
పోలీస్ పవర్
ఈ పోలీస్ ఆఫీసర్ అంటే అందరికీ హడల్. చాలా మెంటల్. కోపం వచ్చిందంటే ఎవరినీ లెక్కచేయడు. ఇతనికి ఓ సవాల్ ఎదురవుతుంది, మరి.. ఆ పరిస్థితుల్లో అతను ఏం చేశాడో తెలియాలంటే ‘అసుర’ చూడాల్సిందే. నారా రోహిత్, ప్రియా బెన ర్జీ జంటగా, శ్యామ్ దేవా భక్తుని, కృష్ణ విజయ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘అసుర’. కృష్ణవిజయ్ దర్శకుడు. ఈ చిత్రాన్ని త్వరంలో విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. హీరో మాట్లాడుతూ - ‘‘‘అసుర’లాంటి వైవిధ్యమైన సినిమా ఇచ్చినందుకు దర్శకుడు విజయ్‌కు చాలా థ్యాంక్స్. అందరం చాలా కష్ట పడి ఈ సినిమా చేశాం. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా నటించా. ఈ చిత్రాన్ని ఈ నెల 29న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, కెమెరా: ఎస్.వి. విశ్వేశ్వర్. -
నారా రోహిత్ ‘ అసుర ' స్టిల్స్