కొద్ది రోజులుగా నెక్ట్స్ సినిమా విషయంలో కన్ఫ్యూజన్లో ఉన్న నితిన్ స్పీడు పెంచాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో సినిమా అనౌన్స్ కావటంతో తరువాతి ప్రాజెక్ట్స్ను కూడా లైన్ లో పెట్టేస్తున్నాడు. అక్కినేని వారసున్ని హీరోగా పరిచయం చేస్తున్న 'అఖిల్' సినిమా షూటింగ్ జరుగుతుండగానే త్రివిక్రమ్ డైరెక్షన్ లో తను చేయబోయే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాడానికి ప్లాన్ చేస్తున్నాడు.
త్రివిక్రమ్ ఈ సినిమాను జెట్ స్పీడ్తో కంప్లీట్ చేయాలని భావిస్తున్నాడు కాబట్టి, ఈ లోగా నెక్ట్స్ ప్రాజెక్ట్స్ను కూడా పైనల్ చేసేస్తున్నాడు. ఇప్పటికే వేణు అనే కొత్త దర్శకుడితో సినిమా ఫైనల్ చేసిన నితిన్ తాజాగా రౌఢీఫెలో దర్శకుడు కృష్ణచైతన్యతో కూడా ఓ మూవీకి ఓకె చెప్పాడు. అయితే ఈ రెండు సినిమాల్లో ఏది ముందు సెట్స్ మీదకు వస్తుందన్న విషయం మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు.
స్పీడు పెంచిన నితిన్
Published Sat, Sep 5 2015 1:00 PM | Last Updated on Sun, Sep 3 2017 8:48 AM
Advertisement
Advertisement